
'మా నాన్న చాలా స్ట్రిక్ట్. తన వల్లే నేను, నా సోదరుడు (ఆయుష్మాన్ ఖురానా) ఇంతవరకు సిగరెట్, మందు జోలికి వెళ్లలేదు. ఆయన ఏం అనేవారంటే.. మీరు బయటకు వెళ్లాలనుకుంటే వెళ్లండి, పార్టీలు చేసుకోండి. కానీ ఇంటికి మాత్రం తిరిగి రావద్దు. ఎవరో ఒకరి ఇంట్లో తలదాచుకోండి.. కనీసం నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవ
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నా సరే జనాలు వాటిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణ జనాల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమందికి ఈ రెండింటిలో ఏదో ఒక అలవాటు ఉండే ఉంటుంది. సరదాకనో, ఒత్తిడిగా ఉందనో సిగరెట్, మందుకు బానిసగా మారుతుంటారు. అయితే నటుడు అపరశక్తి ఖురానా మాత్రం తనకీ అలవాటే లేదంటున్నాడు.
పార్టీలు చేసుకోండి
వీజే సైరస్ బ్రోచా నిర్వహించే 'సైరస్ సేస్' అనే పాడ్‌కాస్ట్‌లో అపరశక్తి ఖురానా మాట్లాడుతూ.. 'మా నాన్న చాలా స్ట్రిక్ట్. తన వల్లే నేను, నా సోదరుడు (ఆయుష్మాన్ ఖురానా) ఇంతవరకు సిగరెట్, మందు జోలికి వెళ్లలేదు. ఆయన ఏం అనేవారంటే.. మీరు బయటకు వెళ్లాలనుకుంటే వెళ్లండి, పార్టీలు చేసుకోండి. కానీ ఇంటికి మాత్రం తిరిగి రావద్దు. ఎవరో ఒకరి ఇంట్లో తలదాచుకోండి.. కనీసం నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరింట్లో ఉన్నారనేది నేను లెక్క చేయను. నాకే సమస్యా లేదు.
నా చేతిలో ఉంటది..
కానీ.. మీరు సిగరెట్, మందు తాగారని తెలిస్తే మాత్రం నా చేతిలో మీకు మూడినట్లే! అని బెదిరించాడు. అందుకే మేమింతవరకు దాని జోలికే వెళ్లలేదు. పైగా తను జ్యోతిష్యుడు. మేము తాగితే తనకు ఇట్టే తెలిసిపోతుందన్న భయముండేది. ఆ కారణం వల్ల అటువైపు వెళ్లలేదు. అయితే ఓ వయసొచ్చాక వాటి మీద ఆసక్తి కూడా ఉండదు' అని చెప్పుకొచ్చాడు. కాగా అపరశక్తి ఖురానా తండ్రి పి.ఖురానా 2023 మే 19న మరణించాడు.