Ayushmann khurana
-
సిగరెట్, మందు.. అమ్మో.. మా నాన్న చాలా స్ట్రిక్టు!
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నా సరే జనాలు వాటిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణ జనాల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమందికి ఈ రెండింటిలో ఏదో ఒక అలవాటు ఉండే ఉంటుంది. సరదాకనో, ఒత్తిడిగా ఉందనో సిగరెట్, మందుకు బానిసగా మారుతుంటారు. అయితే నటుడు అపరశక్తి ఖురానా మాత్రం తనకీ అలవాటే లేదంటున్నాడు.పార్టీలు చేసుకోండివీజే సైరస్ బ్రోచా నిర్వహించే 'సైరస్ సేస్' అనే పాడ్‌కాస్ట్‌లో అపరశక్తి ఖురానా మాట్లాడుతూ.. 'మా నాన్న చాలా స్ట్రిక్ట్. తన వల్లే నేను, నా సోదరుడు (ఆయుష్మాన్ ఖురానా) ఇంతవరకు సిగరెట్, మందు జోలికి వెళ్లలేదు. ఆయన ఏం అనేవారంటే.. మీరు బయటకు వెళ్లాలనుకుంటే వెళ్లండి, పార్టీలు చేసుకోండి. కానీ ఇంటికి మాత్రం తిరిగి రావద్దు. ఎవరో ఒకరి ఇంట్లో తలదాచుకోండి.. కనీసం నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరింట్లో ఉన్నారనేది నేను లెక్క చేయను. నాకే సమస్యా లేదు. నా చేతిలో ఉంటది..కానీ.. మీరు సిగరెట్, మందు తాగారని తెలిస్తే మాత్రం నా చేతిలో మీకు మూడినట్లే! అని బెదిరించాడు. అందుకే మేమింతవరకు దాని జోలికే వెళ్లలేదు. పైగా తను జ్యోతిష్యుడు. మేము తాగితే తనకు ఇట్టే తెలిసిపోతుందన్న భయముండేది. ఆ కారణం వల్ల అటువైపు వెళ్లలేదు. అయితే ఓ వయసొచ్చాక వాటి మీద ఆసక్తి కూడా ఉండదు' అని చెప్పుకొచ్చాడు. కాగా అపరశక్తి ఖురానా తండ్రి పి.ఖురానా 2023 మే 19న మరణించాడు.చదవండి: స్టార్ హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి -
ప్రియాంక చోప్రా సినిమాలో నటించాడు.. ఇప్పటికీ పండ్లు అమ్ముతూ!
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కలల ప్రపంచం. సినిమాల్లో ఛాన్సుల కోసం ఎంతో మంది వేచి చూస్తుంటారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు ఇండస్ట్రీలో తన టాలెంట్‌లో ముందుకు దూసుకుపోతుంటారు. అలా స్టార్స్ పక్కన నటించడమంటే ఇక వాళ్ల కెరీర్ వేరే లెవల్లో ఉంటుంది. కానీ కొందరు మాత్రం స్టార్స్ సినిమాల్లో అవకాశాలొచ్చినా.. తమ వృత్తిని అలాగే కొనసాగిస్తుంటారు. అలాంటి వ్యక్తే ఈ సోలంకి దివాకర్. బాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సోలంకి తన వృత్తిలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్, ది వైట్ టైగర్, సోంచిరియా లాంటి చిత్రాలలో సోలంకి దివాకర్ నటించారు. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన పండ్ల వ్యాపారంలోనే కొనసాగుతున్నారు. అతను సినిమాల్లోకి రాకముందు వృత్తి రీత్యా పండ్ల వ్యాపారి. ఢిల్లీలో 10 సంవత్సరాలుగా పండ్లు విక్రయిస్తున్నారు. నటనపై ఇష్టం ఉన్న సోలంకి సినిమాల్లోకి వచ్చాడు. అయితే లాక్డౌన్లో చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో కుటుంబ పోషణ కోసం పండ్ల వ్యాపారం చేసినట్లు వెల్లడించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సోలంకి మాట్లాడుతూ..'నటన అంటే నాకు మొదటి నుంచే ప్రేమ. నా స్వస్థలమైన అచ్నేరా (ఉత్తరప్రదేశ్‌లోని) థియేటర్లో విరామ సమయంలో పాపడ్ అమ్ముతు ఉండేవాన్ని. అప్పుడే నటన పట్ల మక్కువ పెంచుకున్నా. ఈరోజు నేను సినిమాల్లో నటించి సరిపడా డబ్బు సంపాదించలేకపోయాను. నా కుటుంబాన్ని పోషించడానికి పండ్లు అమ్ముతున్నాను. సినిమాల్లో నాకు తగినంత జీతం వస్తే పండ్లు అమ్మను. అవకాశం దొరికితే 1000 సినిమాల్లో నటించాలనుకుంటున్నా. కానీ నాకు తరచుగా పాత్రలు రావడం లేదు. దీంతో వేరే మార్గం లేనందున నేను పండ్లు అమ్మవలసి వస్తోంది' అని అన్నారు. -
అరుదైన గౌరవం
బాలీవుడ్ యువ హీరో ఆయుష్మాన్ ఖురానా అరుదైన గౌరవాన్ని పొందారు. ప్రఖ్యాత యూఎస్ మ్యాగజీన్ ‘టైమ్స్’ విడుదల చేసిన ప్రపంచ అత్యంత ప్రభావశీల వ్యక్తుల టాప్–100 జాబితాలో ఆయుష్మాన్ చోటు సంపాదించుకున్నాడు. ఢిల్లీలో బిగ్ ఎఫ్ఎమ్లో ఆర్జేగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయుష్మాన్ ఆ తర్వాత టీవీ యాంకర్‌గా పనిచేశారు. 2012లో వచ్చిన సూజిత్ సర్కార్ ‘విక్కీ డోనర్’తో బాలీవుడ్ బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించారు. అలాగే ఆయుష్మాన్ నటించిన ‘అంధాదూన్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘ఆర్టికల్ –15, డ్రీమ్ గర్ల్, బాలా’ వంటి వినూత్న చిత్రాలతో వరుస హిట్లు అందుకుని బాలీవుడ్లో సత్తా చాటుతున్నారు ఆయుష్మాన్ ఖురానా. ఇదిలా ఉంటే.. ‘టాప్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ది వరల్డ్’ జాబితాలో భారతదేశం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, సుందర్ పిచాయ్, రవీంద్రగుప్తా, బిల్కిస్ దాది తదితరులు కూడా ఉన్నారు. ‘‘ప్రతిభావంతులు ఉన్న ఈ జాబితాలో స్థానం సంపాదించుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు ఆయుష్మాన్ ఖురానా. -
కరోనా: సెలబ్రిటీల ప్రతిజ్ఞ
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, నటుడు ఆయుష్మాన్ కురానా, హీరోయిన్ తాప్సీ పన్నులతో పాటు మరికొందరూ హీరో హీరోయిన్లు, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు రోజువారి కూలీలను ఆదుకునేందుకు నడుం బిగించారు. కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రదాని నరేంద్ర మోదీ దేశమంతట 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈలాక్‌డౌన్‌తో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో వారిని ఆదుకునేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలంతా ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్’, ‘ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీ’ ద్వారా కూలీలకు 10 రోజులకు సరిపడ ఆహార సామాగ్రిని అందించేందుకు ‘ఐ స్టాండ్ విత్ హ్యుమానిటీ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తామంత మద్దతుగా నిలబడతామంటూ సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో ప్రతిజ్ఞ చేయడమే కాకుండా మిగతా సెలబ్రిటీలు సైతం మద్దతుగా నిలవాలని పిలుపునిస్తున్నారు. (కరోనా బారిన బ్రిటన్ ప్రధాని..) I pledge to contribute and support this initiative! This is a situation that needs all our help ,love , care and support! 🙏🙏🙏🙏❤️❤️❤️ https://t.co/VNY3Ud5fWk — Karan Johar (@karanjohar) March 25, 2020 ఈ క్రమంలో కరణ్ ‘ఈ కార్యక్రమానికి నావంతు సహయం చేస్తూ మద్దతుగా నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారికి సాయం చేయడమే కాకుండా ప్రేమ, ఆదరణ చూపించాల్సిన సమయం ఇదే’ అంటూ ట్వీట్ చేశాడు. అదే విధంగా తాప్సీ పన్ను స్పందిస్తూ.. రోజువారి కూలీలకు, కార్మికులకు సహాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ‘రోజువారి కూలీల కోసం మనం చేసేది ఇది ఒక్కటే. ఎందుకంటే మనందరి కోసం పనిచేసే వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసం ఎంతైన ఉంది. ఒకవేళ కరోనా లాక్డౌన్ లేకపోతే ఈ అవసరమే వచ్చేదు కాదు అవునా..? కావునా కరోనాను ఎదుర్కోవడానికి వారికి సాయం చేద్దాం రండి’ అంటూ ట్వీట్లో విజ్క్షప్తి చేశారు. ఇక హీరోయిన్ దియా మీర్జా సైతం స్పందించారు. "మేమంతా కలిసి ఉన్నాము. అవును మేము డైలీ వేజ్ ఎర్నర్స్‌కు గౌరవంగా సహాయం చేస్తాం. నేను ఈ ప్రయత్నానికి సహకరిస్తున్నాను. అలాగే సోదరభావంలో మిగితా వారు కూడా ముందుకొస్తారని ఆశిస్తున్నాను’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. (ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్ కేసులు: కేసీఆర్) This one for the daily wage workers. Because we need to do our bit for the ones who work with/for us. If not corona , lack of basic food might take them down. Let’s help them to get through this. pic.twitter.com/kNexQyuJ1w — taapsee pannu (@taapsee) March 26, 2020 కాస్తా శ్రద్ధ వహిద్దాం: ఆయుష్మాన్, రకుల్, కియారా ట్వీట్ అలాగే నటుడు ఆయుష్మాన్ ఖురానా కూడా ‘ఇది నిజంగా గొప్పది’ అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. ‘నేను దీనికి మద్దతుగా నిలబడతానని, సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. యావత్ భారతదేశాం, భారతీయులు ఈ కరోనా మహామ్మారి ముప్పులో ఉన్నారు. మనలో ప్రతి ఒక్కరికి ఒక వైవిధ్యం కలిగించే శక్తి ఉంది. ఈ సంక్షోభ సమయంలో మనకు సాధ్యమైనంత వరకు ఒకరికోకరు మద్దతునివ్వడానికి.. కాస్తా శ్రద్ధ వహిద్దాం రండి’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చాడు. అంతేగాక రకుల్ ప్రీత్ సింగ్, కియారా అద్వానీ కూడా స్పందించారు. ‘మహమ్మారి వల్ల ఇంట్లో మనమంతా సురక్షితంగా ఉన్నాం. అలాగే రోజు కష్టపడే వారూ కూడా సురక్షితంగా ఉండటానికి దానం చేద్దాం రండి’ అంటూ కియారా ట్వీట్ చేశారు. అలాగే రకుల్ కూడా ‘నేను ఈ గొప్ప ప్రయత్నానికి మద్దుతునిస్తున్న. మానవతా ప్రయోజనం కోసం సహకరించడం సంతోషంగా ఉంది. ఇంట్లో సురక్షితంగా ఉంటూనే.. ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. (‘బాలిక వధూ’ నటుడికి పుత్రోత్సాహం) This is a truly noble initiative. I vow to support this & contribute. India & Indians are under threat & each one of us have the power to make a difference. Lets support and care for each other as much as we can in this time of crisis. https://t.co/sMEIVi1LjM #Istandwithhumanity pic.twitter.com/D8y5Ww2YXq — Ayushmann Khurrana (@ayushmannk) March 25, 2020 I support this noble initiative. Happy to contribute for this humanitarian cause. While staying safe at home i urge every one else also to contribute online - https://t.co/4ZMxvRadBJ#iStandWithHumanity #ArtOfLiving #BMC pic.twitter.com/zD69gAL1qT — Rakul Singh (@Rakulpreet) March 26, 2020 అంతేగాక హీరో సిద్దార్థ్ మల్హోత్రా ‘‘ఇలాంటి సమయాల్లోనే మనం అవసరమైన వారి కోసం ముందడుగు వేయాలి. ఈ మానవతా ప్రయోజనానికి నేను సహకరించడం సంతోషంగా ఉంది. మీరందరూ ఆన్లైన్ ద్వారా కూడా సహకరించవచ్చు’’ అని #iStandWithHumanity అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు. చిత్ర నిర్మాత నితేష్ తివారీ ‘‘ఈ కఠినమైన సమయంలో మన సహాయం అవసరమయ్యే రోజువారీ కూలీలు చాలా మంది ఉన్నారు. దయచేసి మీకు వీలైనంతగా సహాయం చేయండి. ఆన్లైన్లో సహకారం అందించే లింక్ ఇక్కడ ఉంది’’ అన్నాడు. అలాగే భూమి ఫెడ్నేకర్ సైతం "ప్రస్తుత గడ్డు కాలాన్ని కూలీలు ఎదుర్కొడానికి సహాయపడటం చాలా ముఖ్యం’’ అంటూ స్పందించాడు. (లాక్డౌన్: సల్మాన్ ఏం చేస్తున్నాడో తెలుసా!) -
బాలీవుడ్ కమల్‌హాసన్
విజయం అనేది ఒకరు వేసిన భిక్షగా పొందినవారి తీరు వేరుగా ఉంటుంది. విజయాన్ని ఊహించి, నిర్మించి, సొంతం చేసుకున్నవారి తీరు వేరుగా ఉంటుంది. ఆయుష్మాన్ ఖురానా విజయం అతడు కష్టపడి సంపాదించుకున్నది. పరాజయం విసిరిన ప్రతి రాయిని వరుసగా పేర్చి ఇవాళ బాలీవుడ్ కాలనీలో తన సౌధాన్ని నిర్మించుకున్నాడు.చిన్న కుటుంబం నుంచి వచ్చిన చిన్న కుర్రాడు అనేక ప్రతికూలతలను దాటి హీరో కావచ్చనడానికి ఇటీవలి ఉదాహరణ ఆయుష్మాన్. ప్రయోగాలు చేసే నటుడిగా కమల్‌హాసన్‌ను చెప్పుకుంటే ఇతణ్ణి బాలీవుడ్ కమలహాసన్ అనవచ్చు. ఆయుష్మాన్ ఖురానాను తెలుసుకోవాలంటే మీరు నెట్‌ఫ్లిక్స్‌లోనో, అమేజాన్‌లోనో అతడి సినిమాలు చూడాలి. ‘విక్కీడోనర్’, ‘నౌటంకి సాలా’, ‘హవాయిజాదా’, ‘దమ్ లగాకే హైసా’, ‘బరేలీకి బర్ఫీ’, ‘శుభ్ మంగల్ సావధాన్’, ‘అంధా ధున్’, ‘బధాయి హో’... ఇవన్నీ ఒకదానికి ఒకటి పోలిక లేని కథలు. ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు ఏ హీరో చేయని కథలు. ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలు చేసి నిరూపించుకున్నాడు. నిలబడ్డాడు. కాని ఆ జర్నీ ఏమీ సులువు కాదు. చండీగఢ్ కుర్రాడు ఆయుష్మాన్ ఖురానా చండీగఢ్ విశాలమైన వీధుల్లో నటుడు కావాలనే కలలతో తిరిగాడు. తండ్రి జ్యోతిష్యుడు. తల్లి గృహిణి. ఇంట్లో నానమ్మ ఆయుష్మాన్ ఖురానాను నవ్వించడానికి దేవ్ ఆనంద్, రాజ్ కపూర్లను ఇమిటేట్ చేసి నవ్వించేది. నాలుగేళ్ల వయసులో మొదటిసారి సినిమా హాలులో చూసిన ‘తేజాబ్’ సినిమా గుర్తుండిపోయి అలా స్క్రీన్ మీద కనిపించాలనే బాల్య కుతూహలం రేపింది. కాని అందుకు తగ్గ రూపం లేదు. ఆకారం లేదు. ఎత్తు తక్కువ. ఎత్తు పళ్లు. కాని బాగా పాడేవాడు. డాన్స్ చేసేవాడు. కాని న్యూనత వల్ల ఎవరిముందూ చేసేవాడు కాదు. ‘వీడికి ఇవి చేతనవును. స్టేజీ మీద చేయడం వస్తే చాలు’ అని తండ్రి అవకాశం దొరికితే చాలు స్టేజీ మీదకు తోసేవాడు. అలా ఆయుష్మాన్ స్టేజ్ మీద నటించడం నేర్చుకున్నాడు. కాలేజీ రోజుల్లో నాటకాల ట్రూపులు తయారు చేసి దేశమంతా స్ట్రీట్ ప్లే, స్టేజ్ ప్లే చేస్తుండేవాడు. ట్రయిన్లలో ప్రయాణం చేసేటప్పుడు కంపార్ట్మెంట్లలో తిరిగి పాడుతూ డబ్బులు కలెక్ట్ చేసి నాటకాలకు ఉపయోగించేవాడు. అనుభవం ఉంది. ఇక అవకాశం రావడమే మిగిలింది. మొదట రేడియోలో... ఆయుష్మాన్ డిగ్రీ అయ్యే సమయానికి దేశంలో ఎఫ్.ఎం చానెల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆయుష్మాన్ ఢిల్లీలోని బిగ్ ఎఫ్.ఎంలో రేడియోజాకీగా పని చేశాడు. ఆ అనుభవంతో ఎం టీవీలో ‘రోడీస్’ షోలో పాల్గొని గెలిచాడు. ఎం టీవీ వీడియో జాకీగా కూడా పని చేశాడు. కాని షారూక్ ఖాన్ ఫ్యాన్ కావడం వల్ల షారుక్ మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడని తెలిసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి తిరిగి చండీగఢ్ వెళ్లిపోయాడు. రెండేళ్ల పాటు చదివి తిరిగి ముంబై వచ్చాక అక్కడ రేడియో జాకీగా టీవీ వ్యాఖ్యాతగా పని చేశాడు. అలా ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగితే నీ రూపు కెమెరాకు పనికి రాదు అని చెప్పిన వారే అంతా. చివరకు దర్శకుడు సూజిత్ సర్కార్ అతడికి బ్రేక్ ఇచ్చాడు. వికీ డోనర్ వీర్య కణాల లోపం వల్ల తండ్రి కాలేని వారు కృత్రిమ పద్ధతిలో తండ్రి కావాలంటే పరాయి వీర్యకణాలు అవసరం. అందుకుగాను దేశంలో ‘స్పెర్మ్ డోనర్లు’ ఉన్నారు. అలాంటి స్పెర్మ్ డోనర్ కథను ‘వికీ డోనర్’గా తీశారు. సాధారణంగా ఇలాంటి కథను చేయడానికి కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చినవారు భయపడతారు. కాని ఆయుష్మాన్ ఆ పాత్రను అశ్లీలతకు తావు లేకుండా గొప్పగా చేసి హిట్ కొట్టాడు. అందులో తనే రాసిన పాడిన ‘పాని దా’ పాటకు అవార్డు పొందాడు. జోర్ లగాకే హైస్సా మన దేశంలో తొలిసారి విమానం ఎగరేయడానికి ప్రయత్నించిన బాపూజీ తల్పడే బయోపిక్ ‘హవాయిజాదే’లో నటించినా అది హిట్ కాలేదు. అయితే వారణాసి నేపథ్యంలో వచ్చిన ‘దమ్ లగాకే హైస్సా’ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. టేప్ రికార్డర్లో పాటలు ఎక్కించే కుర్రాడి పాత్రలో ఆయుష్మాన్ నటించాడు. అందులో ఇష్టం లేని భార్యను క్రమంగా ప్రేమించే భర్తగా అందరికీ నచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘అంధా ధున్’ చాలా పెద్ద హిట్థ్రిల్లర్గా నిలిచింది. అందులో కళ్లుండీ గుడ్డివాడిగా నటించే సంగీతకారుడి పాత్రలో ఆయుష్మాన్ ఖురానా టాప్‌క్లాస్ నటన ప్రదర్శించాడని విమర్శకులు మెచ్చుకున్నారు. ఇక వయసుకాని వయసులో గర్భం దాల్చిన తల్లితో ఎలా వ్యవహరించాలో తెలియని ఎదిగొచ్చిన కొడుకుగా ‘బధాయీ హో’లో నటించి ఆ సినిమానూ సూపర్ హిట్ చేశాడు. తాజా చిత్రం ‘ఆర్టికల్ 15’ ఒక సాంఘిక ప్రయోజనం ఉన్న సినిమా. కొత్త తరం ఆశ ఆయుష్మాన్లాంటి వాళ్ల వల్ల బాలీవుడ్ కొత్త కథల రచన, నటన సాధ్యమవుతోంది. లైంగికస్తంభన సమస్య ఉన్న యువకునిగా ‘శుభ మంగళ్ సావధాన్’లో నటించిన ఆయుష్మాన్ ఇప్పుడు హోమోసెక్సువాలిటీ వస్తువును తీసుకొని ‘శుభ మంగళ్ జ్యాదా సావధాన్’లో నటిస్తున్నాడు. అలాగే అమితాబ్‌తో ‘గులాబో సితాబో’లో నటిస్తున్నాడు. ఈ ప్రయాణం కొనసాగాలని కోరుకుందాం. -
ఇల్లు ఖాళీ చేశారు
కొంతకాలంగా అమితాబ్ బచ్చన్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. తాజాగా ఆ ఇల్లు ఖాళీ చేశారట. ఇంతకీ అమితాబ్ ఇంట్లో ఆయుష్మాన్ అద్దెకు ఉండటం ఏంటీ అనుకుంటున్నారా? ‘గులాబో సితాబో’ సినిమా కోసమే. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ముఖ్యపాత్రల్లో సుజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గులాబో సితాబో’. అమితాబ్ బచ్చన్ ఇంటి ఓనర్ పాత్రలో, ఆయుష్మాన్ ఆ ఇంట్లో అద్దెకు ఉండే పాత్రలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం రిలీజ్. ‘అమితాబ్‌గారితో యాక్ట్ చేయడం ఆనందంగాను, కొంచెం కంగారుగానూ అనిపించింది’ అని పేర్కొన్నారు ఆయుష్మాన్. -
ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్య బీమా ధీమా
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జాతీయ ఆరోగ్య సంరక్షణ స్కీమ్ కారణంగా ఆరోగ్య బీమా 50 శాతానికి పైగా విస్తరిస్తుందని క్రిసిల్ తాజా నివేదిక పేర్కొంది. 11 కోట్ల పేద కుటుంబాలకు నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ కింద ఆరోగ్య బీమానందించే ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ బుధవారం లాంఛనంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ స్కీమ్‌కు కేంద్రం వాటాగా రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల కోసం రూ.85,200 కోట్ల నిధుల కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 11 కోట్ల కుటుంబాలకు ఏడాది పాటు రూ.5 లక్షల ఆరోగ్య బీమాను ఈ స్కీమ్ కింద అందించనున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన ఈ స్కీమ్‌లో ఇప్పటివరకూ ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లు విలీనమవుతాయి. ప్రస్తుతం ఆరోగ్య బీమా విస్తరణ 33 శాతంగా ఉందని, ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కారణంగా ఈ బీమా విస్తరణ 50 శాతానికి పైగా పెరుగుతుందని క్రిసిల్ నివేదిక వివరించింది. ప్రస్తుతం ఆరోగ్య బీమా కవరేజ్ 43.8 కోట్లమందికి ఉందని, ఈ స్కీమ్‌తో అది 65 కోట్ల మందికి పెరుగుతుందని పేర్కొంది. -
చాలా మందితో డేటింగ్ చేశా : హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్లు వార్తల్లో ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు, ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అలరిస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో బాలీవుడ్ బ్యూటీ చేరింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన దమ్ లగాకే హైస్సా సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన బ్యూటీ భూమీ పెడ్నేకర్. తొలి సినిమాలో భారీకాయంతో కనిపించిన ఈ భామ తరువాత స్లిమ్ లుక్ లోకి మారిపోయిన హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకునే పనిలో ఉంది. అయితే బాలీవుడ్ కాంపిటీషన్ లో ఉండేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది భూమి. తాను మోడ్రన్ యువతినన్న భూమి, బాలీవుడ్ కి పరిచయం కాకముందు చాలా మందితో డేటింగ్ చేశానని తెలిపింది. అంతేకాదు తాను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నాని, ఇంత వరకు ఏ హీరోతోనూ వరుస సినిమాలు చేయలేదు హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ వస్తున్న వార్తలని అబద్ధమని కొట్టిపడేసింది. ప్రస్తుతానికి తనూ తన వృత్తినే పెళ్లి చేసుకున్నానన్న భూమి పెడ్నేకర్, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తేల్చి చెప్పింది. -
నేను ఆడగలను, పాడగలను..ఇక నాకేంటి!
ముంబై:విక్కీ డోనర్ సినిమాతో విజయం సాధించి బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆయూష్మాన్ ఖురానా తాను ఒక్క నటనకే పరిమితం కాదని, అవసరమైతే పాటలతో కూడా అలరిస్తానని తెలిపాడు. తనకు నటించడంతో పాటు పాటలు పాటడం ఒక ప్లస్ పాయింట్ గా పేర్కొన్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ యువకుల హవా కొనసాగుతుందన్నాడు. ఆ ప్రవాహంలో తాను నిలదొక్కుకోగలననే ఆశాభవం వ్యక్తం చేశాడు. తనకు నటనతో పాటు పాటల పాడటం అదనపు బలంగా పేర్కొన్నాడు. ఈ రెండు అంశాలతో తాను బాలీవుడ్ దూసుకుపోగలనని ఆయూష్మాన్ తెలిపాడు. తనకి సీనియర్ నటుడైన రణ్‌బీర్ కపూర్ పని విధానం ఆకట్టుకుందన్నాడు. వీర్య దానం మెయిన్ కాన్స్ ప్ట్ గా ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన విక్కీ డోనర్ మూవీ జనానికి బాగా నచ్చింది. ఓ డాక్టర్ ప్రోద్బలంతో డబ్బు కోసం ఎక్కువ మందికి వీర్యదానం చేసిన హీరో ఆ తర్వాత పడే కష్టాల చుట్టూ తిరిగిన విక్కీ డోనర్ మూవీ హిట్ కొట్టేయడంతో ఆయూష్మాన్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న బేవకూ ఫియాం చిత్రంపై దృష్టి సారించాడు. ఈ చిత్రంతో మరోహిట్ సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.