ప్రియాంక చోప్రా సినిమాలో నటించాడు.. ఇప్పటికీ పండ్లు అమ్ముతూ! | Bollywood actor worked with Priyanka Chopra now sells fruits for a living | Sakshi
Sakshi News home page

Bollywood: బాలీవుడ్‌ స్టార్స్‌తో సినిమాలు.. కానీ పండ్లు అమ్మాల్సిందే!

Nov 17 2023 1:42 PM | Updated on Nov 17 2023 2:43 PM

Bollywood actor worked with Priyanka Chopra now sells fruits for a living - Sakshi

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కలల ప్రపంచం.  సినిమాల్లో ఛాన్సుల కోసం ఎంతో మంది వేచి చూస్తుంటారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు ఇండస్ట‍్రీలో తన టాలెంట్‌లో ముందుకు దూసుకుపోతుంటారు. అలా స్టార్స్ పక్కన నటించడమంటే ఇక వాళ్ల కెరీర్ వేరే లెవల్‌లో ఉంటుంది. కానీ కొందరు మాత్రం స్టార్స్ సినిమాల్లో అవకాశాలొచ్చినా.. తమ వృత్తిని అలాగే కొనసాగిస్తుంటారు. అలాంటి వ్యక్తే ఈ సోలంకి దివాకర్. బాలీవుడ్‌ స్టార్స్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సోలంకి తన వృత్తిలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. 

బాలీవుడ్‌లో డ్రీమ్ గర్ల్, ది వైట్ టైగర్, సోంచిరియా లాంటి చిత్రాలలో సోలంకి దివాకర్ నటించారు. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పనిచేశారు.  అలాంటి వ్యక్తి ఇప్పుడు తన పండ్ల వ్యాపారంలోనే కొనసాగుతున్నారు. అతను సినిమాల్లోకి రాకముందు వృత్తి రీత్యా పండ్ల వ్యాపారి. ఢిల్లీలో 10 సంవత్సరాలుగా పండ్లు విక్రయిస్తున్నారు. నటనపై ఇష్టం ఉన్న సోలంకి సినిమాల్లోకి వచ్చాడు. అయితే లాక్‌డౌన్‌లో చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో కుటుంబ పోషణ కోసం పండ్ల వ్యాపారం చేసినట్లు వెల్లడించారు. 
 

గతంలో ఓ ఇంటర్వ్యూలో సోలంకి మాట్లాడుతూ..'నటన అంటే నాకు మొదటి నుంచే ప్రేమ. నా స్వస్థలమైన అచ్నేరా (ఉత్తరప్రదేశ్‌లోని) థియేటర్లో విరామ సమయంలో పాపడ్ అమ్ముతు ఉండేవాన్ని. అప్పుడే నటన పట్ల మక్కువ పెంచుకున్నా. ఈరోజు నేను సినిమాల్లో నటించి సరిపడా డబ్బు సంపాదించలేకపోయాను.  నా కుటుంబాన్ని పోషించడానికి పండ్లు అమ్ముతున్నాను. సినిమాల్లో నాకు  తగినంత జీతం వస్తే పండ్లు అమ్మను. అవకాశం దొరికితే 1000 సినిమాల్లో నటించాలనుకుంటున్నా. కానీ నాకు తరచుగా పాత్రలు రావడం లేదు. దీంతో వేరే మార్గం లేనందున నేను పండ్లు అమ్మవలసి వస్తోంది'  అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement