Kangana Ranaut Says Those Bollywood Stars Are Failed at Hosting - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: వారంతా ఫెయిల్యూర్‌.. బాలీవుడ్‌ స్టార్స్‌పై కంగనా కామెంట్స్‌

Published Tue, Apr 5 2022 3:15 PM | Last Updated on Fri, Apr 8 2022 3:24 PM

Kangana Ranaut Says They Are Failures Of Bollywood Stars - Sakshi

Kangana Ranaut Says They Are Failures Of Bollywood Stars: బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశంపైనైనా తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా, ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె కూడా పలు విమర్శలపాలైంది. ఎలాంటి సంకోచం లేకుండా తనకు అనిపించింది చెప్పడంతో అభిమానులను కూడా సంపాదించుకుంది ఈ బ్యూటీ. కంగనా ప్రస్తుతం కాంట్రవర్సీ రియాలిటీ షో లాకప్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాఖ్యాతగా వ్యవహరించడంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌ స్టార్స్‌ ఫెయిల్యూర్‌ అంటూ షాకింగ్‌కు గురిచేసింది.

క్రమక్రమంగా 'లాకప్‌' షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవలే ఈ షో 200 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. దీంతో కంగనా రనౌత్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంతోషంతోనే దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ను ఉద్దేశిస్తూ 'నువ్‌ ఏడిచే రోజు వచ్చేసింది' అంటూ షాకింగ్ కామెంట్‌ చేసిన కంగనా తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. 'బాలీవుడ్‌లో షారుఖ్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, ప్రియాంక చోప్రా, రణ్‌వీర్ సింగ్‌ వంటి చాలామంది తారలు నటనలో విజయవంతమయ్యారు. కానీ హోస్ట్‌గా వ్యవహరించడంలో మాత్రం పూర్తిగా ఫెయిలయ్యారు. వారంతా ఫెయిల్యూర్‌ హోస్ట్స్‌. ఒక అమితాబ్‌ బచ్చన్ జీ, సల్మాన్‌ ఖాన్‌ జీ, కంగనా రనౌత్‌ మాత్రమే హోస్ట్‌గా కూడా సక్సెస్‌ అయ్యారు. ఇలా సక్సెస్‌ కావడం ఎంతో సంతోషంగా ఉంది.' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది కంగనా. 

అంతేకాకుండా 'అసూయ పడే ఈ సినిమా మాఫియా నన్ను, నా షోను అప్రతిష్ట పాలు చేయడానికి చూస్తున్నారు. కానీ అదివారివల్ల కాదు. ఎందుకంటే నన్ను, నా షోను నేను రక్షించుకుంటాను. అలాగే నేను ఇతరులకోసం నిలబడితేనే నాకోసం నేను నిలబడగలను. ఈతరం జనరేషన్‌లో హోస్ట్‌గా నేను మాత్రమే విజయవంతం కావడం అద్భుతంగా ( చాలా సంతోషంగా) ఉంది.' అని చెప్పుకొచ్చింది ఈ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్. ఈ పోస్ట్‌ కాస్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి ఈ పోస్ట్‌పైనా ఎవరైనా స్పందిస్తారో చూడాలి. 

చదవండి: నువ్ ఏడిచే రోజు వచ్చేసింది.. కరణ్‌ జోహార్‌పై కంగనా కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement