
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్. ఈ చిత్రంలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రంజాన్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు.
సికందర్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. జోహ్ర జబీన్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రష్మిక మందన్నా, సల్మాన్ ఖాన్ కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని సాజిద్‌నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ చివరిసారిగా టైగర్- 3లో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment