Sikander
-
సూర్య సినిమాకు తప్పు చేశా!
ఆయన సిల్వర్‌స్పూన్‌తో పుట్టారు. సిల్వర్‌స్క్రీన్ గురించి కలగన్నారు. పదేళ్ళ క్రితం నిర్మాతయ్యారు. లగడపాటి శ్రీధర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఏం సంపాదించినా అన్నీ సినిమాల వల్లే కాబట్టి, చుట్టూ ఉన్నవాళ్ళను ‘సినిమాల’తోనే సంతోషపెట్టాలనుకొన్నారు. శుక్రవారం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’తో రానున్నారు. ఈ సందర్భంగా ఇవాళ్టి బర్త్‌డే బాయ్ శ్రీధర్‌తో కాసేపు... * వరుసగా కన్నడం నుంచి రీమేక్ చేస్తున్నారేం? బడ్జెట్ పరిమితులున్న చోట, తప్పనిసరై క్రియేటివిటీ వెల్లివిరుస్తుంది. కన్నడంలో అదే జరుగుతోంది. నన్నడిగితే, మన చిన్న సినిమాలకు కన్నడ చిత్రాలే నమూనా లాంటివి. వాటిని గనక తెలుగుకు తగ్గట్లు రీ-ప్యాకేజ్ చేసుకొని, ఇంప్రూవ్ చేసుకుంటే, మంచి చిన్న సినిమాలు వస్తాయి. అందుకే, ‘పోటు గాడు’, తాజాగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’ లాంటివి చేయగలిగా. * కానీ, చిన్న సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారంటారా? ప్రొడక్షన్ వ్యాల్యూస్, పబ్లిసిటీతో సహా 5 కోట్లలో సినిమా తీస్తే కానీ, ప్రేక్షకుల్ని ఆకర్షించే చిన్న సినిమా రాదు. అలాంటి ప్రయత్నమే ప్రేమ ఇతివృత్తంగా తీసుకొని తీస్తున్న ‘కృష్ణమ్మ...’ ప్రేమకు ఒక గైడ్‌లా ఉంటుంది. స్కూలు మొదలు కెరీర్ దాకా పన్నెండేళ్ళ ప్రేమ ప్రయాణాన్ని చూపెట్టాం. * డిజిటల్ ఏజ్‌లో స్వచ్ఛమైన ప్రేమను కోరేవారు, చూసేవారు ఉంటారా? ఇందులో టైమ్‌పాస్ లవ్, టైమ్‌లెస్ లవ్ - రెండూ చూపించాం. జీవితంలో చాంపియన్ కావాలంటే, సిన్సియర్ ప్రేమే అవసరమని చెప్పాం. * బయట ఎమోషనల్‌గా ఉండే మీరు, ప్రేమ కథలు తీయడం...? (మధ్యలోనే అందుకుంటూ...) కుటుంబ విలువల మీద నాకు ఆసక్తి ఎక్కువ. సిన్సియర్ ప్రేమను చూపిస్తూ, కన్నడంలో చంద్రు తీసిన ‘ప్రేమ్ కహానీ’, ‘తాజ్‌మహల్’, ‘చార్మినార్’ మూడూ వసూళ్ళ వర్షం కురిపించాయి. ‘తాజ్‌మహల్’ను ‘పోటుగాడు’గా తీశా. ఇప్పుడు ఇది చేశా. * డెరైక్షన్, కెమేరా, సంగీతం- వీటికి కన్నడ టీమ్‌నే వాడారేం? చాలా రీమేక్స్‌లో ఒరిజినల్లో ఉన్న ఫ్లేవర్ మిస్సయిందని అనుకుంటూ ఉంటాం. అందుకే, ‘చార్మినార్’ దర్శకుడు (చంద్రు), కెమేరామన్ (కె.ఎస్. చంద్రశేఖర్), సంగీత దర్శకుడు (హరి) ముగ్గురినీ తీసుకున్నా. * మీ జోక్యం ఎక్కువనేనా స్టార్స్‌తో సినిమా తీయలేదు? స్టార్స్ కోసం సినిమాలు తీయలేను. సినిమాను ప్రేమిస్తా. చేస్తున్న పని ప్రతి సెకనూ ఆస్వాదిస్తా. టీమ్ సక్సెసే నా సక్సెస్ అనీ, ప్రేక్షకుల వినోదానికి బాధ్యుడిగా నిలవాలనీ భావిస్తా. అవన్నీ తెలిసినవాళ్ళే నాతో చేయడానికి ముందుకొస్తారు. కాంబినేషన్స్‌తో డబ్బులు పెట్టి కూర్చోవడం ఇష్టం లేదు. అందుకే, నాకెప్పుడూ నిద్ర లేని రాత్రుల్లేవు. * మరి, సూర్య ‘సికిందర్’ను డబ్ చేసిన విషయం...? (మధ్యలోనే...) వేరేవాళ్ళ మాట నమ్మి, చూడకుండానే రిలీజ్ చేసేశా. అది నేను చేసిన తప్పు. అలా మళ్ళీ చేయను. * నిర్మాతగా ఈ పదేళ్ళలో ఆర్థికంగా పోగొట్టుకున్నదే ఎక్కువేమో? నో రిగ్రెట్స్! కాకపోతే, ఛాన్సిచ్చి చూద్దామని ‘అండర్ డాగ్స్’ మీద తరచూ పందెం కాశాను. పాఠాలు నేర్చుకున్నా. ఇప్పుడిక దీన్ని బిజినెస్‌గానే చేయాలనుకుంటున్నా. ఇకపై మంచి రేసుగుర్రాలపైనే పందెం కాస్తా. * మీ అబ్బాయి కూడా సినిమాల్లోకి వచ్చి, నటిస్తున్నట్లున్నాడు! మా అబ్బాయి విక్రమ్ (9వ తరగతి)కి నటుడు కావాలని ఆశ. దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘రేసుగుర్రం’లో పరిచయం చేశారు. ‘కృష్ణమ్మ...’లో చిన్నప్పటి ఎపిసోడ్లో వాడు నటించాడు. అందరూ రకరకాల స్టార్స్ అని పేరు పెట్టుకుంటుంటే, వాడు ‘గ్లోబల్ స్టార్’ అని పెట్టుకున్నాడు (నవ్వు). * మీ రాబోయే సినిమాలు? తమిళ సూపర్‌హిట్ ‘గోలీసోడా’ హక్కులు కొన్నా. అన్నీ కుదిరితే, ఆ రీమేక్ చేయాల్సిందిగా ‘అతనొక్కడే’ కథా చర్చల రోజుల నుంచి మాకు సన్నిహితుడైన దర్శకుడు సురేందర్‌రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నా. చూద్దాం. * ఏమిటీ అన్నీ రీమేక్‌లేనా? అవి సేఫ్ అనా? సొంత కథలు చేయరా? మూడు నాలుగు మించి కొత్త కథలెవరూ చెప్పలేరు. మొదట నేనూ కొత్త ఐడియాలతో వచ్చా. ఇప్పుడు రీమేక్‌లు చేస్తున్నా. అది సొంత కథా, రీమేకా అని కాదు - జనానికి కావాల్సినవి, నచ్చేవి ఇవ్వాలనుకుంటున్నా. * మీ డ్రీమ్ ‘స్టైల్ -2’ ఏమైంది? స్క్రిప్ట్ సిద్ధం. అద్భుతంగా నాట్యం చేసే అమ్మాయి చుట్టూ తిరిగే కథ. అలాంటి నటి కోసం చూస్తున్నా. వేటూరి గారు చివరి రోజుల్లో బెడ్ మీద ఉంటూనే, ‘స్టైల్ -2’ కోసం రెండు అద్భుతమైన పాటలు రాశారు. ఎప్పటికైనా ఈ సినిమా తీసి, ఆయనకు అంకితమిస్తా. - రెంటాల -
ఆయన మీద నమ్మకంతోనే అంత ధైర్యం చేశా : సమంత
మొదట తమిళంలో నటించినా, ఇప్పుడు తెలుగు చిత్రాలతో యమ బిజీగా ఉంటున్న హీరోయిన్ సమంత తాజా తమిళ చిత్రం ‘అంజాన్’ (తెలుగులో ‘సికిందర్’) పుణ్యమా అని ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఈ సినిమాలోని ఓ పాటలో సమంత టూ పీస్ బికినీలో కనిపించడం, డెనిమ్ షార్ట్‌లు - ఒళ్ళు కనిపించే తెల్ల చొక్కా - నుదుటన ఎర్ర స్కార్ఫ్‌తో సినిమాలో నర్తించడం ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో చర్చ రేపింది. నిన్న మొన్నటి వరకు పాత్రలతో పాటు దుస్తులూ హుందాగా ఉండేలా జాగ్రత్తపడుతూ వస్తున్న ఈ యువ హీరోయిన్ ఒక్కసారిగా ఇలా సెక్స్ అప్పీల్ ఉండేలా డ్రెస్సింగ్ స్టయిల్ మార్చడం కెరీర్లో కొత్త దశకు సన్నాహం చేసుకోవడానికేనని విమర్శకుల వాదన. ఈ విషయంపై సమంత తాజాగా వివరణనిస్తూ... ‘‘నేను వేసుకున్న దుస్తుల గురించి ఇంత చర్చ జరుగుతుందని అనుకోలేదు’’ అంటూ అసలు సంగతి వివరించారు. జరిగింది ఏమిటంటే, పాట చిత్రీకరణకు కావాల్సిన దుస్తుల ఎంపికకు కేవలం రెండు రోజులే టైమ్ ఉందట. పాట కొద్దిగా జానపద ఫక్కీలో ఉంది కాబట్టి, దానికి ఆధునిక రంగు తేవడం కోసం షార్ట్‌లు వేసుకుందట సమంత. ఈ సినిమాలో తాను ఆ మాత్రం సెక్సీగా కనిపించడానికి సిద్ధపడ్డానంటే, అందుకు ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ కారణమంటున్నారామె. ‘‘ఆయన ఉన్నారు కాబట్టి, తెరపై నేను చెత్తగా కనిపించనని నాకు నమ్మకం ఉంది. అందుకే, కాస్తంత గ్లామరస్‌గా కనిపించడానికి ఇదే మంచి అవకాశమనుకున్నా. ఇవాళ తెరపై అందంగా కనిపిస్తున్నానంటే, అది ఆయన చలవే’’ అని సమంత అన్నారు. ఈ సినిమా పుణ్యమా అని సినిమా రంగానికి వచ్చి అయిదేళ్ళయిన తరువాత ఇప్పుడు అందరూ సమంత కూడా సెక్సీగా కనిపించగలదంటూ ఒప్పుకోవడం ఈ అమ్మడికి ఆనందం కలిగిస్తోంది. ‘‘ఇన్నేళ్ళుగా దాదాపు ఒకే రకంగా చూసి చూసి ప్రేక్షకులకే కాదు, నా లుక్ మీద నాకే విసుగెత్తింది. అలాంటప్పుడు ‘అంజాన్’తో ఈ కొత్త గుర్తింపు రావడం ఆనందంగా ఉందంటోంది సమంత. మొత్తానికి, గతంలో మహేశ్‌బాబు ‘1 - నేనొక్కడినే’ సినిమా ప్రచార సమయంలో బీచ్‌లో హీరో నడుస్తుంటే, అతని వెనక హీరోయిన్ పాకుతున్న ఫోటో మీద కామెంట్‌తో వివాదాస్పదమైన సమంత ఈసారి మాత్రం కురచ దుస్తుల్లో, బికినీలో కనిపించడం విశేషమే. ఆ పేరు చెప్పి, చర్చ పెట్టదలుచుకోలేదు! అన్నట్లు హీరో సిద్ధార్థ్‌తో తనకున్న అనుబంధం గురించి రకరకాల వార్తలు వస్తున్నా, ఆ విషయం గురించి సమంత ఇప్పటికీ నోరు విప్పడం లేదు. ‘‘వ్యక్తి పేరెందుకు కానీ, ఒకరితో నా అనుబంధం ఎంతో సంతోషంగా సాగుతోంది. నలుగురితోనూ చెప్పి, దాన్ని పాడుచేసుకోదలుచుకోలేదు’’ అని తాజాగా వ్యాఖ్యానించారామె. ‘‘ఎవరేం రాసినా సరే, నటీమణులకు ఇబ్బం దికరంగా ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, నేను అలా అనుకోవడం లేదు. నా వ్యక్తిగత ప్రేమ జీవితం గురించి బహిరంగ చర్చలు జరగడం నాకిష్టం లేదు’’ అని సమంత కుండబద్దలు కొట్టారు. ఆమె అభిప్రాయం గౌరవించదగినదే కదూ! -
'సమంత బికినీ వేసిందట'
ఇప్పుడు ఏ నోట విన్నా ఒకటే మాట.. 'సమంత బికినీ వేసిందట'! మొదటి సినిమా 'ఏ మాయ చేశావె' నుంచి నిన్న మొన్న వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వరకు దాదాపు అన్ని సినిమాల్లోనూ చాలా పద్ధతిగా కనిపించిన సమంత.. తాజాగా విడుదలైన 'సికిందర్' సినిమాలో మాత్రం టూపీస్ బికినీ వేసుకుని అందాలు ఆరబోసింది. సూర్య సరసన నటించిన ఈ చిత్రంలో ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచేయడం వెనక సీక్రెట్ ఏంటని అంతా ఆలోచిస్తున్నారు. సికిందర్ సినిమా గురించి విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా కొంచెం పెదవి విరిచినా, సమంత విషయానికి వచ్చేసరికి మాత్రం అంతా ఆమె గ్లామర్‌కు ఏకగ్రీవంగా నూటికి రెండొందల మార్కులు వేసేశారు. ఓ పాటలో కేవలం కొద్ది సెకన్ల పాటు మాత్రమే సమంత బికినీలో కనిపించినా, అది మాత్రం అందరినీ ఆకట్టుకుంది. తమలాంటి అభిమానులకు అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయమని, ఆమె గ్లామర్ చూసి చాలా సంతోషించామని సమంత వీరాభిమాని రాజేష్‌కుమార్ అన్నాడు. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలలో అయితే ఆమె బికినీ ఫొటో ఎన్నిసార్లు షేర్ అయ్యిందో లెక్కలేదు. సికిందర్ సినిమాలో సమంత బికినీ సీన్ లేకపోతే ఆ సినిమా అంత ఆడేది కాదని కూడా కొంతమంది వ్యాఖ్యానించారు. -
సికిందర్ మూవీ న్యూ పోస్టర్స్
-
రజనీకాంత్‌కి బాషా, కమల్‌హాసన్‌కి నాయకుడు...
సూర్యకు సికిందర్ ‘‘పవర్‌స్టార్, సూపర్‌స్టార్ కలిస్తే ఎంత పవరుంటుందో సూర్యలో అంత పవర్ ఉంటుంది’’ అంటున్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. సూర్య కథానాయకునిగా లింగుస్వామి దర్శకత్వంలో ‘సికిందర్’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘తమిళంలో ఎంత స్టార్డమ్ ఉందో, తెలుగులో కూడా అంతే స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు సూర్య. ‘సికిందర్’ ఆయన్న మరో మెట్టుపై నిలబెట్టే సినిమా అవుతుంది. ఇందులో ఆయన స్టయిలిష్ డాన్‌గా నటించారు. రజనీకాంత్‌కి ‘బాషా’, కమల్‌హాసన్‌కి ‘నాయకుడు’లా సూర్యకు ‘సికిందర్’ నిలిచిపోతుంది. సూర్య ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. ఇందులో ఆయన రెండు రకాలుగా కనిపిస్తారంతే’’ అని చెప్పారు లగడపాటి శ్రీధర్. రీమేక్‌లు ఎక్కువగా చేస్తున్నారేంటని తనను చాలామంది అడుగుతున్నారనీ, తన దగ్గర చాలా కథలు ఉన్నా... ఆ కథలకు తగ్గ స్టార్ హీరోలు దొరకడం లేదనీ, అందుకే రీమేక్‌లు చేస్తున్నాననీ శ్రీధర్ చెప్పారు. రీమేక్‌లు, డబ్బింగులు పక్కనపెట్టి త్వరలోనే ఓ భారీ తెలుగు సినిమా చేస్తానని ఆయన తెలిపారు. తాను నిర్మిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమా గురించి చెబుతూ -‘‘ప్రేమలోని అసలైన కోణాన్ని ఆవిష్కృతం చేసే కథాంశమిది. కన్నడ ‘చార్మినార్’ చిత్రం దీనికి మాతృక. మన నేటివిటీకి తగ్గట్టుగా క్లైమాక్స్ మార్చాం. సినిమా బాగా వస్తోంది’’ అన్నారు. తమ రామలక్ష్మీ క్రియేషన్స్ సంస్థ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నామని లగడపాటి శ్రీధర్ తెలిపారు. -
సికిందర్ మూవీ న్యూ స్టిల్స్
-
సికిందర్ మూవీ పోస్టర్స్
-
స్టయిలిష్ సికిందర్
తండ్రులకు తగ్గ తనయులు భారతీయ సినీరంగంలో చాలామంది ఉన్నారు. కానీ... తండ్రులను మించిన తనయులు మాత్రం సినీరంగంలో అరుదు. దక్షిణాదిన అయితే... అలాంటి కొడుకు సూర్య ఒక్కడే. తమిళ హీరో శివకుమార్ తనయుడిగా తెరకు పరిచయమయ్యారాయన. సుమారు యాభై ఏళ్లుగా హీరోగా, కేరక్టర్ నటునిగా శివకుమార్ సాధించలేని పేరుప్రఖ్యాతుల్ని అయిదారేళ్లలోనే సాధించేసి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు సూర్య. అంతేకాదు, నటునిగా అనతికాలంలోనే ఎన్నో ప్రయోగాలు చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. కమల్‌హాసన్ తర్వాత దక్షిణాదిన ప్రయోగాత్మక పాత్రలు పోషించిన అతి కొద్ది మంది హీరోల్లో సూర్య ఒకరంటే అది అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న చిత్రం ‘ఆంజాన్’. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ‘సికిందర్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఇందులో కూడా సూర్యది వైవిధ్యమైన పాత్రే. కెరీర్లో తొలిసారి స్టయిలిష్ డాన్‌గా నటిస్తున్నారాయన. నటనపరంగా, వాణిజ్యపరంగా సూర్య కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలా ‘ఆంజాన్’ నిలుస్తుందని చిత్ర నిర్మాతలు సిద్దార్థ్‌రాయ్ కపూర్, ఎన్.సుభాష్‌చంద్రబోస్ నమ్మకం వెలిబుచ్చుతున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘సికిందర్’ని తిరుపతి బ్రదర్స్‌తో కలిసి లగడపాటి శిరీష, శ్రీధర్ నిర్మిస్తున్నారు. సమంత కథానాయిక. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ‘సికిందర్’ పాటలను ఈ నెల 31న తెలుగు చిత్ర ప్రముఖుల సమక్షంలో విడు దల చేయనున్నట్లు లగడపాటి శిరీష, శ్రీధర్‌లు చెప్పారు. ఆగస్ట్ 15న ‘సికిందర్’ విడుదల కానుంది. ఈరోజు సూర్య 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.