
సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’(Sikandar). రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది.

కాగా మంగళవారం (ఫిబ్రవరి 18) సాజిద్ బర్త్ డే సందర్భంగా ‘సికందర్’ సినిమా నుంచి సల్మాన్ ఖాన్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నెల 27న ఈ చిత్రానికి సంబందించి, ఓ సర్‌ప్రైజ్ కూడా ఉందని పేర్కొన్నారు. ఆ రోజు ఈ సినిమా టీజర్ లేదా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఉండొచ్చని టాక్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సౌదీ అరేబియాలో ఉన్నారని సమాచారం.
ఓ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారని, ఈ మూవీ కోసమే ఆయన సౌదీ వెళ్లారని, అలాగే సల్మాన్ ఖాన్‌తో పాటు సంజయ్ దత్ కూడా ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment