
ఓటీటీలు వచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కొదవే లేదు. థియేటర్లలో రిలీజైన నెలలోపే కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇకపోతే వెబ్ సిరీస్‌లు సైతం ఓటీటీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. మిస్టరీ, క్రైమ్ సిరీస్‌లతో పాటు కామెడీ వెబ్ సిరీస్‌లు సైతం వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే వరుస సీజన్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతేడాది మెప్పించిన సిరీస్‌లు.. కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న వాటిపై మనం ఓ లుక్కేద్దాం పదండి.
రానా నాయుడు సీజన్-2..
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. రానా నాయుడు సీజన్-2 త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
పంచాయత్ సీజన్-4..
పంచాయత్ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. జితేంద్ర కుమార్, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే మూడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ ఏడాది పంచాయత్ సీజన్ 4 కూడా స్ట్రీమింగ్‌కు వస్తోంది. జూలై 2వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3
బాలీవుడ్‌లో అభిమానుల క్రేజ్ దక్కించుకున్న మరో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ భాజ్‌పేయి కీలక పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే మూడో సీజన్ కూడా అలరించేందుకు వస్తోంది. ఈ సంవత్సరం నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
అసుర్ సీజన్-3..
మరో బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ అసుర్ మూడవ సీజన్ కూడా వస్తోంది. అర్షద్ వార్సీ, బరున్ సోబ్తి, అనుప్రియ గోయెంకా నటించిన ఈ సిరీస్ ఈ ఏడాది చివర్లో ప్రముఖ ఓటీటీ జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.
మిర్జాపూర్ సీజన్- 4..
మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే మూడు సీజన్స్ హిట్‌కాగా.. మీర్జాపూర్ సీజన్-4 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త సీజన్ రిలీజ్ ఎప్పడనేది ఇప్పటివరకు ప్రకటించలేదు.
ఫర్జీ సీజన్-2..
విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ సిరీస్ ఫర్జీ. సీజన్ -1 హిట్ కావడంతో అభిమానులు రెండవ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది.