ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్ల కంటే ఓటీటీల్లో మూవీస్-వెబ్ సిరీసులు చూసేవాళ్లే ఎక్కువయ్యారు. అందుకు తగ్గట్లే ఆయా సంస్థలు సరికొత్త సిరీసులు తీసుకొస్తున్నాయి. అలానే కొన్ని హిట్ సిరీస్‌లకు తర్వాత భాగాల్ని కూడా మొదలుపెడుతున్నాయి. అలా ఓటీటీలో సెన్షేషన్ సృష్టించిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది.
దేశభక్తి అనేది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. ఇప్పటికే వందలాది సినిమాలు వచ్చాయి. పదుల సంఖ్యలో సిరీసులు వస్తున్నాయి. అయితే దేశభక్తి ప్లస్ ఓ మధ్య తరగతి వ్యక్తి నేపథ్యంగా తీసిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్.. ఈ జానర్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్‌లో మనోజ్ భాజ్‌పాయ్-ప్రియమణి జంటగా నటించారు.
(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)
2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రిపీట్స్‌లో చూశారు. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. తొలి భాగమంతా కానప్పటికీ మంచి స్పందన దక్కించుకుంది. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు.
అయితే రెండో సీజన్ వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ అప్డేట్ లేకపోయేసరికి చాలామంది దీని గురించి మర్చిపోయారు. సరిగ్గా ఇలాంటి టైంలో మూడో సీజన్ షూటింగ్ మొదలైందని డైరెక్టర్స్ ప్రకటించారు. లొకేషన్ నుంచి ఓ పిక్ కూడా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది దీని రిలీజ్ ఉంటుంది.
(ఇదీ చదవండి: ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా)
Comments
Please login to add a commentAdd a comment