
ఇప్పుడంటే ఓటీటీల్లో సరైన వెబ్ సిరీసులు రావట్లేదు. కానీ ఒకప్పుడు పలు సిరీస్ లు ఓ రేంజు ఫాలోయింగ్ సంపాదించుకున్నాయి. అందులో ఒకటి ఫ్యామిలీ మ్యాన్. లాక్ డౌన్ రావడానికి కొన్నాళ్ల ముందు వచ్చిన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)
2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2021లో రెండో సీజన్ వచ్చింది. ఈ రెండు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అప్పటినుంచి మూడో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. గతేడాది షూటింగ్ మొదలుపెట్టగా.. ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇందులో కీలక పాత్రధారి అయిన మనోజ్ బాజ్ పాయ్.. తాజాగా ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నాడు. అలా మాట్లాడుతూ మూడో సీజన్ గురించి అప్డేట్ ఇచ్చాడు.
ఈ ఏడాది నవంబరులో ఫ్యామిలీ మ్యాన్ 3.. స్ట్రీమింగ్ అవుతుందని చెప్పాడు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణితో పాటు ఈసారి జైదీప్ అహ్లవత్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
(ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదు)