The Family Man
-
ఓటీటీలోనే టాప్ వెబ్ సిరీస్.. కొత్త సీజన్‌పై ప్రకటన
ఓటీటీలో సూపర్ సక్సెస్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి మూడో భాగం తర్వలో విడుదల కానుంది. 2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. అయితే, రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విభాగంలో పనిచేసే వ్యక్తికి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయో ఇప్పటి వరకు దర్శకులు చూపించారు.'ఫ్యామిలీ మ్యాన్ 3'లో మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి అయినట్లు మనోజ్ తాజాగా ప్రకటించారు. ఈమేరకు తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. విజయవంతంగా మూడో సీజన్ షూటింగ్ ముగిసిందని తెలిపిన ఆయన త్వరలో సరికొత్తగా ఈ ఫ్యామిలీ మ్యాన్ మీ ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో విడుదల కానుంది. అయితే, రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించలేదు.ఈ సిరీస్ తొలి సీజన్ భారత్‌పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్‌పై చేసే ఆపరేషన్ వంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు. దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో
తెలుగులో పలువురు హీరోహీరోయిన్లకు రెస్టారెంట్స్, పబ్బులు ఉన్నాయి. యాక్టింగ్ కాకుండా ఇలా బిజినెస్‌లోనూ కాలు పెడుతున్నారు. బాలీవుడ్లో మాత్రం యాక్టర్స్ చాలామంది కొత్త తరహా బిజినెస్‌లు చేస్తున్నారు. ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనడం.. కొన్నేళ్ల తర్వాత దాన్ని అమ్మడం, తద్వారా కోట్లలో లాభాలు అర్జించడం పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)ప్రేమకథ, హ్యాపీ, పులి, వేదం తదితర తెలుగు సినిమాల్లో నటించిన మనోజ్ బాజ్‌పాయ్.. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని తర్వాత హిందీలో సోలోగా మూవీస్ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. అయితే పదేళ్ల క్రితం ముంబైలోని మినర్వా ప్రాంతంలో భార్యతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌ని రూ.6 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇప్పుడు దీన్నే రూ.9 కోట్లకు విక్రయించాడు.కొన్నిరోజుల క్రితమే విక్రయం జరిగిందని, ఈ అపార్ట్మెంట్ అమ్మడం ద్వారా మనోజ్ బాజ్‌పాయ్‌కి దాదాపు రూ.3 కోట్లు లాభమొచ్చినట్లే. ఇదిలా ఉండగా రీసెంట్గా హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా తన ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఇంటిని రూ.25 కోట్ల అమ్మకానికి పెట్టింది. ఖరీదైన బాంద్రా ఏరియాలో ఈ ఫ్లాట్ ఉంది. ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ స్టార్స్ రెండు చేతులా సంపాదించేస్తున్నారు అనిపిస్తోంది. (ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
నాగచైతన్య ఎంగేజ్మెంట్.. అతనితో సమంత డేటింగ్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా నిశ్చితార్థం తర్వాత చైతూ చాలా సంతోషంగా ఉన్నాడని నాగ్ తెలిపారు.అయితే చైతూకు ఎంగేజ్మెంట్ కావడంతో అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంతపైనే పడింది. చైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత ఎలాంటి పోస్టులు పెడుతుందా అని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురించి ఆమె ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు.డైరెక్టర్‌తో డేటింగ్?ఈ సంగతి అటుంచితే.. తాజాగా సమంతపై నేషనల్ మీడియాలో తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రెడ్ఇట్ కథనం ప్రకారం సామ్ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వరుస కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అతను సమంత నటిస్తోన్న సిటాడెల్.. హనీ బన్నీ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలోనూ సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేశారు. ఆ సిరీస్ తర్వాతే అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుంది. అయితే సమంత- రాజ్ నిడిమోరుపై వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రెండు వెబ్ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి కథనాలు వినిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లయిన రాజ్ నిడిమోరు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు.కాగా.. 2017లో సమంత- నాగచైతన్య పెళ్లాడింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు తమ తమ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. -
అబ్బాయినని చెప్పిన వదల్లేదు.. బలవంతం చేశారు: యంగ్ హీరో
సెలబ్రిటీలు అనగానే వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొందరు నెపోటిజం కిడ్స్‌కి మినహా మిగిలిన వాళ్లందరూ ఓ మాదిరి కష్టాలు పడిన తర్వాతే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ ఉంటారు. బాలీవుడ్ యంగ్ హీరో అభయ్ వర్మది కూడా అలాంటి పరిస్థితే. చిన్న చిన్న పాత్రలు, యాడ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. రీసెంట్గా వచ్చిన 'ముంజ్య' అనే హారర్ మూవీతో హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. అలా గతంలో తనకు జరిగిన షాకింగ్ సంఘటనని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)హర్యానాలోని మధ్య తరగతి కుటుంబానికి చెందిన అభయ్ వర్మ తండ్రి చిన్నప్పుడే మంచానికి పరిమితమయ్యాడు. దీంతో ఇల్లు తాకట్టు పెట్టి మరీ తల్లి.. పిల్లల బాగోగులు చూసింది. ఓవైపు చదువుతూనే నటుడి అవ్వాలని అభయ్ ఫిక్సయ్యాడు. అలా 'సూపర్ 30' మూవీలో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు. గతేడాది 'సఫేద్' మూవీలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఈ మూవీ చేస్తున్నప్పుడు ఓ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికెళ్తుంటే తనని హిజ్రా అనుకుని కొందరు కుర్రాళ్లు ఇబ్బంది పెట్టారని అభయ్ చెప్పుకొచ్చాడు.'ఓ రోజు రాత్రి హోటల్‌కి తిరిగెళ్తుంటే కొందరు తాగుబోతులు ఎదురుపడ్డారు. హిజ్రా అనుకుని అడ్డగించి నాతో అసభ్యంగా ప్రవర్తించారు. పరిస్థితి చేయి దాటిపోయేసరికి నేను నిజం చెప్పాల్సి వచ్చింది. నేను అబ్బాయిని, సినిమా కోసమే ఈ వేషం వేసుకున్నానని చెప్పడంతో వాళ్లు నన్ను వదిలేశారు' అని అభయ్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే ట్రాన్స్ జెండర్ రోల్ చేస్తున్నప్పుడు పాత్ర ఫెర్ఫెక్షన్ కోసం ఆ గెటప్‌లోనే పలువురిని కలిసేవాడినని చెప్పిన అభయ్.. ఈ క్రమంలోనే చాలా అవమానాలు కూడా ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ కుర్రాడు 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో కూడా హీరో కూతురిని మోసం చేసే కుర్రాడి పాత్రలో నటించాడు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఆ అవకాశమే లేదు!) -
ఆ విషయంలో తప్పు చేశాను: సమంత
‘‘నేను గతంలో కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి తప్పు చేశాను. అయితే కావాలని చేసిన తప్పు కాదు’’ అంటున్నారు సమంత. గత ఏడాది విడుదలైన ‘ఖుషి’ తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని, పూర్తి స్థాయిలో ఆరోగ్యంపై దృష్టి పెట్టారామె (గతంలో మయోసైటిస్ బారినపడ్డారు). అయితే సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంతో పాటు అభిమానులతోనూ ముచ్చటిస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేశారు సమంత. ‘ఆరోగ్యం గురించి ఇప్పుడు మీరు మంచి విషయాలు చెబుతున్నారు. కానీ గతంలో మీరే అనారోగ్యకరమైన ఉత్పత్తులని ప్రమోట్ చేశారు కదా?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఇందుకు సమంత బదులిస్తూ– ‘‘అవును.. నేను గతంలో తప్పులు చేసిన మాట వాస్తవమే. కానీ కావాలని చేసినవి కావు. వాటి గురించి తెలిసిన తర్వాత ఆ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయడం మానేశాను.ప్రస్తుతం నేను ఏదైతే చేస్తున్నానో వాటిని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాను’’ అన్నారు. కొత్త వెబ్ సిరీస్‌లో... దర్శక–ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’లో సమంత నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరూ తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌లోనూ సమంత నటించారు. ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. కాగా రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించనున్న కొత్త వెబ్ సిరీస్‌లో సమంత కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ కూడా నటించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌కి ‘రక్తబీజ్’ అనే టైటిల్ ఖరారు చేశారని భోగట్టా. ఆగస్ట్‌లో ఈ సిరీస్ షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం. -
హమ్మయ్యా.. బ్లాక్ బస్టర్ సిరీస్ మూడో సీజన్ మొదలైంది
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్ల కంటే ఓటీటీల్లో మూవీస్-వెబ్ సిరీసులు చూసేవాళ్లే ఎక్కువయ్యారు. అందుకు తగ్గట్లే ఆయా సంస్థలు సరికొత్త సిరీసులు తీసుకొస్తున్నాయి. అలానే కొన్ని హిట్ సిరీస్‌లకు తర్వాత భాగాల్ని కూడా మొదలుపెడుతున్నాయి. అలా ఓటీటీలో సెన్షేషన్ సృష్టించిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది.దేశభక్తి అనేది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. ఇప్పటికే వందలాది సినిమాలు వచ్చాయి. పదుల సంఖ్యలో సిరీసులు వస్తున్నాయి. అయితే దేశభక్తి ప్లస్ ఓ మధ్య తరగతి వ్యక్తి నేపథ్యంగా తీసిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్.. ఈ జానర్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్‌లో మనోజ్ భాజ్‌పాయ్-ప్రియమణి జంటగా నటించారు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రిపీట్స్‌లో చూశారు. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. తొలి భాగమంతా కానప్పటికీ మంచి స్పందన దక్కించుకుంది. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు.అయితే రెండో సీజన్ వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ అప్డేట్ లేకపోయేసరికి చాలామంది దీని గురించి మర్చిపోయారు. సరిగ్గా ఇలాంటి టైంలో మూడో సీజన్ షూటింగ్ మొదలైందని డైరెక్టర్స్ ప్రకటించారు. లొకేషన్ నుంచి ఓ పిక్ కూడా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది దీని రిలీజ్ ఉంటుంది.(ఇదీ చదవండి: ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
నా జర్నీ ఒక్క సినిమానే కాదు..!
-
సమంత నటించిన వెబ్ సిరీస్ తన ఫేవరెట్ అంటున్న చై
అక్కినేని నాగచైతన్య దూత వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డిసెంబర్ 1 నుంచి ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు చై. ఈ సందర్భంగా అతడు సమంత నటించిన ద ఫ్యామిలీ మ్యాన్ తన ఫేవరెట్ సిరీస్ అని పేర్కొన్నాడు. ఆ సిరీస్ తనకు చాలా బాగా నచ్చిందన్నాడు. కాగా ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్లో సమంత కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే! ఈ సిరీస్‌లో మనోజ్ భాజ్‌పాయ్, ప్రియమణి, శరద్ కేల్కర్, నీరజ్ మాధవ్, షరీబ్ హష్మీ, దలీప్ తాహిల్, సన్నీ హిందూజ, శ్రేయ ధన్వంతరి పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన దాదాపు 25 మంది మత్స్యకారులు బతుకుతెరువు కోసం గుజరాత్ తీర ప్రాంతంలోని వీరవల్ వద్ద చేపల వేట కొనసాగిస్తూ .. 2018 నవంబర్‌లో పొరపాటున పాకిస్తాన్ సముద్ర తీర అధికారులకు బందీలుగా చిక్కారు. దీంతో మత్స్యకారులు దాదాపు ఏడాదిన్నరపాటు అక్కడే బందీలయ్యారు. జైలు జీవితం అనుభవించిన వారి జీవితాలను ఆధారంగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్లో షూటింగ్ మొదలుకానుంది. ప్రేమమ్ డైరెక్టర్ చందూ మెండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. చదవండి: నాగార్జున చేతికి బ్యాండ్ వెరీ స్పెషల్.. ప్రతి ఏడాది డబ్బులు కట్టాల్సిందే? -
'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!
ఒకరు చేయాల్సిన సినిమాని మరొకరు చేయడం.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే. స్టార్ హీరోలు కొన్నిసార్లు తమకు ఈ స్టోరీకి సెట్ కాదని వదిలేస్తుంటారు. కట్ చేస్తే అది బ్లాక్‌బస్టర్ అయిపోతుంది. కొన్నాళ్లకు ఎవరో చెబితే.. అప్పుడు అవునా అలా జరిగిందా? అని ఫ్యాన్స్ బాధపడుతుంటారు. తాజాగా 'ఫ్యామిలీమ్యాన్' విషయంలో మెగా ఫ్యాన్స్ అలానే అనుకుంటున్నారు. ఏం జరిగింది? మెగాస్టార్ చిరంజీవి.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలని పూర్తిగా పక్కనబెట్టేశారు. ఎందుకో ఆ ఫీల్డ్ లో సెట్ కాకపోయేసరికి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. 'ఖైదీ నం.150'తో మంచి హిట్ కొట్టారు. సరిగ్గా ఇదే సమయంలో తెలుగు దర్శక ద్వయం రాజ్ & డీకే.. 'ఫ్యామిలీమ్యాన్' వెబ్ సిరీస్ స్క్రిప్ట్‌తో నిర్మాత అశ్వనీదత్‌ని కలిశారు. ఈ స్క్రిప్ట్‌ని ఆయన చిరంజీవికి వినిపించారు. మెగాస్టార్‌కి ఇది బాగా నచ్చేసింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి) చిరు వెనకడుగు అయితే ఈ వెబ్‌సిరీస్‌లో హీరో ఎన్ఐఏ అధికారి, గూఢచారి తరహా పాత్ర.. ఇది చిరుకు నచ్చేసింది. కానీ భార్య డిఫరెంట్ క్యారక్టరైజేషన్, తన పాత్రకు ఇద్దరు పిల్లలు ఉండటం లాంటి అంశాలు చిరుని ఆలోచనలో పడేశాయి. ఇదే విషయాన్ని దర్శకులకు చెబితే ఆ పిల్లల పాత్రల్ని తీసేయడానికి కూడా రెడీ అయిపోయారు. కానీ చిరు మాత్రం.. అప్పుడే రీఎంట్రీ ఇచ్చారు. ఆ టైంలో ఇలాంటి స్క్రిప్ట్ సెట్ అవుతుందో లేదో అని వెనకడుగు వేశారు. ఎవరు చెప్పారు? అయితే ఈ విషయాలన్నీ నిర్మాత అశ్వనీదత్ తాజాగా రివీల్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. ఈ విషయాలన్ని బయటపెట్టారు. ఈ క్రమంలోనే మెగాఫ్యాన్స్.. చిరు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి రెండు సీజన్లుగా వచ్చిన ఈ సిరీస్.. గ్లోబల్ వైడ్ వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. చిరంజీవికి ఇలాంటి స్టోరీలు చేస్తే నిజంగా బాగుంటాయి. ప్రయత్నిస్తే అద్భుతాలు జరగొచ్చు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసుపై వరలక్ష్మీ శరత్‌కుమార్ వివరణ.. ఆదిలింగం ఎవరంటే?) -
ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌లు ఇవే! టాప్ 5లో ఏమున్నాయంటే?
ఓటీటీల రాకతో ఎంటర్టైన్మెంట్ డబుల్ అయిందనే చెప్పాలి. కాలక్షేపం కోసం థియేటర్ దాకా వెళ్లనవసరం లేకుండా గడప దాటకుండానే అరచేతిలో కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. థియేటర్లో రిలీజైన సినిమాలతో పాటు ప్రత్యేకంగా కంటెంట్ క్రియేట్ చేసుకుని మరీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు లేదా కొత్త వెబ్ సిరీస్‌లతో మస్త్ మజా అందిస్తున్నాయి. దీంతో గడిచిన రెండేళ్లలోనే ఓటీటీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారి అభిరుచికి తగ్గట్లుగానే కామెడీ, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని రకాల కంటెంట్‌ను అందిస్తోంది. ఈ సినిమాలు, సిరీస్‌లపై రివ్యూలు ఇచ్చే ఐమ్డీబీ ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. సాక్ర్డ్ గేమ్స్, మీర్జాపూర్, స్కామ్, ద ఫ్యామిలీ మ్యాన్, ఆస్పిరంట్ టాప్ 5 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరి ఇంకా ఏయే సిరీస్‌లు ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నాయి? అవి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో కింది పట్టికలో చూసేయండి. వాటిలో మీకు నచ్చినవాటిని వీకెండ్లో చూసేయండి. ర్యాంక్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 1 సాక్ర్డ్ గేమ్స్ నెట్‌ఫ్లిక్స్ 2 మీర్జాపూర్ అమెజాన్ ప్రైమ్ 3 స్కామ్ 1992 సోనీలివ్ 4 ద ఫ్యామిలీ మ్యాన్ అమెజాన్ ప్రైమ్ 5 ఆస్పిరంట్స్ యూట్యూబ్ 6 క్రిమినల్ జస్టిస్ హాట్‌స్టార్ 7 బ్రీత్ అమెజాన్ ప్రైమ్ 8 కోటా ఫ్యాక్టరీ నెట్‌ఫ్లిక్స్ 9 పంచాయత్ అమెజాన్ ప్రైమ్ 10 పాతాళ్ లోక్ అమెజాన్ ప్రైమ్ 11 స్పెషల్ ఓపీఎస్ హాట్‌స్టార్ 12 అసుర్: వెల్కమ్ టు యువర్ డార్క్ సైడ్ జియో సినిమా 13 కాలేజ్ రొమాన్స్ సోనీలివ్ 14 అఫరన్ జియో సినిమా 15 ఫ్లేమ్స్ అమెజాన్ ప్రైమ్ 16 దిండోరా యూట్యూబ్ 17 ఫర్జి అమెజాన్ ప్రైమ్ 18 ఆశ్రమ్ MX ప్లేయర్ 19 ఇన్సైడ్ ఎడ్జ్ అమెజాన్ ప్రైమ్ 20 ఉందేఖి సోనీలివ్ 21 ఆర్య హాట్‌స్టార్ 22 గుల్లక్ సోనీలివ్ 23 టీవీఎఫ్ పిచర్స్ జీ5 24 రాకెట్ బాయ్స్ సోనీలివ్ 25 ఢిల్లీ క్రైమ్స్ నెట్‌ఫ్లిక్స్ 26 క్యాంపస్ డైరీస్ MX ప్లేయర్ 27 బ్రోకెన్: బట్ బ్యూటిఫుల్ MX ప్లేయర్ 28 జంతారా: సబ్కే నంబర్ ఆయేగా నెట్‌ఫ్లిక్స్ 29 తాజ్ ఖబర్ హాట్‌స్టార్ 30 అభయ్ జీ5 31 హాస్టల్ డేస్ అమెజాన్ ప్రైమ్ 32 రంగ్‌బాజ్ జీ5 33 బందిష్ బందిత్స్ అమెజాన్ ప్రైమ్ 34 మేడ్ ఇన్ హెవన్ అమెజాన్ ప్రైమ్ 35 ఇమ్మాచ్యూర్ అమెజాన్ ప్రైమ్ 36 లిటిల్ థింగ్స్ నెట్‌ఫ్లిక్స్ 37 ద నైట్ మేనేజర్ హాట్‌స్టార్ 38 క్యాండీ జియో సినిమా 39 బిచ్చూ కా ఖేల్ జీ5 40 దహన్: రాఖన్ కా రహస్య హాట్‌స్టార్ 41 జేఎల్ 50 సోనీలివ్ 42 రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్ 43 రే నెట్‌ఫ్లిక్స్ 44 సన్‌ఫ్లవర్ జీ5 45 ఎన్సీఆర్ డేస్ యూట్యూబ్ 46 మహారాణి సోనీలివ్ 47 ముంబై డైరీస్ 26/11 అమెజాన్ ప్రైమ్ 48 చాచా విధాయక్ హై హమారా అమెజాన్ ప్రైమ్ 49 యే మేరీ ఫ్యామిలీ అమెజాన్ మినీ టీవీ 50 అరణ్యక్ నెట్‌ఫ్లిక్స్ View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) చదవండి: పంచెకట్టులో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్ -
కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్
మనోజ్ భాజ్‌పేయి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులోనూ అగ్రహీరోల సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. మనోజ్ భాజ్‌పేయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ 'ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్' గురించి మాట్లాడారు. (ఇది చదవండి: అలాంటి సీన్స్ చూసి నా భార్య ఫీలైంది: మనోజ్ భాజ్‌పేయి) దర్శకద్వయం రాజ్, డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు మనోజ్ బాజ్‌పేయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సిరీస్‌లో శ్రీకాంత్ తివారీగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈ సిరీస్‌లో నటించడానికి మనోజ్ మొదట్లో ఆసక్తి చూపించలేదట. మరోవైపు ఆయన భార్య కూడా ఈ సిరీస్ గురించి విని కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావు? అని అడిగిందట. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. మనోజ్ మాట్లాడుతూ.. 'ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కోసం రాజ్ అండ్ డీకే నన్ను ఫోన్లో సంప్రదించేందుకు యత్నించారు. ఆ సిరీస్‌లో శృంగారం, హింస మితిమీరి ఉంటాయని భావించి ఇలాంటి ప్రాజెక్ట్‌లు చేయనని వారికి చెప్పేశా. మీరు అనుకున్నట్టుగా ఆ సిరీస్ ఉండదు. ఒక్కసారి వచ్చి కలవండి అని చెప్పారు. వారి మాటపై నమ్మకం ఉంచి వాళ్లను కలిశా. స్క్రిప్ట్ విన్నాక నాలో ఆసక్తి పెరిగింది. దీంతో ఒకే చెప్పేశా. ఎనిమిది నెలలపాటు ఈ ప్రాజెక్ట్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నా.' అని తెలిపారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత) ఆ తర్వాత ఈ విషయం నా భార్యకు తెలిసి వెబ్‌సిరీస్ అంటే టీవీ సీరియల్ అనుకుని నటించవద్దని చెప్పింది. ఇలాంటి వాటిల్లో నటించి నీ కెరీర్ నాశనం చేసుకుంటావు? అని ప్రశ్నించింది. అయితే సిరీస్ విడుదలయ్యాక వచ్చిన ఆదరణ చూసి ఆమె ఆనందించిందని తెలిపారు. మనోజ్ బాజ్‌పేయి నటించిన చిత్రం సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై. కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వం వహించారు. -
సమంత ప్రాజెక్ట్ క్రేజీ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్లో క్రేజ్ సంపాందించుకున్న స్టార్ హీరోయిన్ సమంత. ఇటీవల ఆమె బాలీవుడ్లో ఓటీటీ ప్రాజెక్ట్‌ల్లోనూ నటిస్తోంది. తాజాగా ఆమె లేటెస్ట్ వెబ్ సిరీస్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఆమె మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఓటీటీ ప్రాజెక్ట్‌కు సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన రెండు పాన్-ఇండియా చిత్రాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ మేకర్స్ రాజ్, డీకే దర్శకత్వం వహించే ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్‌తో కలిసి ఈ భామ నటించనుంది. ఇది హాలీవుడ్ సిరీస్ 'సిటాడెల్'కి రీమేక్‌గా వస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత రాజ్, డీకేతో సమంత రెండో ప్రాజెక్ట్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాని నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఆ మధ్య ప్రకటించింది. అయితే ‘శాకుంతలం’ని 3డీలో అందించాలనే నిర్ణయంతో సినిమా విడుదలని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. -
గోవాలో సమంతా, ఆ క్రెడిట్ ఆమెదే: పిక్స్ వైరల్
International Film Festival 2021: అత్యంత ప్రతిష్టాత్మక 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు గోవాలోని పనాజీలో తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి. కరోనా మహమ్మారి తరువాత గోవా ప్రభుత్వం, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ ఈవెంట్ ఇది. ఈ వేడుకల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతోపాటు, బాలీవుడ్ స్టార్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కరణ్ జోహార్, మనీష్ పాల్ ఈ ఈవెంట్‌కి హోస్ట్‌గా , ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సమంత, ది ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకులు రాజ్ అండ్ డీకే టీమ్‌తో సందడి చేసింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు స్పీకర్‌గా ఆహ్వానించబడిన తొలి దక్షిణ భారత నటి సమంత కావడం విశేషం. 52వ ‘ఇఫీ’లో భాగంగా రాజ్, డీకే, అమెజాన్ ఇండియా ఒరిజినల్స్‌కు హెడ్ అపర్ణాపురోహిత్లతో ‘మాస్టర్‌క్లాస్’ గోష్ఠి జరిగింది. అందులో సమంత మాట్లాడుతూ, తెలుగు పరిశ్రమ, హైదరాబాద్ తనకు పుట్టినిల్లు అని పేర్కొంది. ఈ చిత్రోత్సవంలో ఇతర వక్తలుగా దర్శకురాలు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, నటుడు మనోజ్ బాజ్‌పేయి (వర్చువల్, సమంతా కూడా వర్చువల్ గానే పాల్గొంటుందని భావించారు) డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి పాల్గొన్నారు. ఇది తనకు మర్చిపోలేని అనుభవం అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సమంతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయిన మనోజ్ బాజ్‌పేయి వీడియో కాల్ ద్వారా సభనుద్దేశించి ప్రసంగించారు. ది ఫ్యామిలీ మ్యాన్-2 మేకింగ్ ముచ్చట్లను ఆడియెన్స్‌తో పంచుకున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్ ఈ నెల 28వరకు కొనసాగనుంది. కాగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక సినిమా 'శాకుంతలం'లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుంది. రాబోయే చిత్రం 'కత్తువాకుల రెండు కాదల్' షూటింగ్ కోసం చెన్నైలో ఉంది సమంత. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్లో థియేటర్లను పలకరించనుంది. సమంత, విజయ్ సేతుపతి, నయనతార ఇందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత హవా మామూలుగా లేదుగా, డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరో ఘనతను సాధించింది. ఎఫ్‌సి డిస్రప్టర్స్-2021 జాబితాలో బెస్ట్‌గా నిలిచింది. ఎఫ్‌సీ 2021 టాప్ 20 లిస్ట్‌లో సమంత 8వ స్థానంలో నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు అభినందనల వెల్లువ కురుస్తోంది. నటుడు రాహుల్ రవీంద్రన్, సుమన్ లాంటి సెలబ్రిటీలతోపాటు, ఆప్ నేత, న్యాయవాది సోమనాథ్ భారతి కూడా సమంతాను అభినందిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే ఓటీటీ అండ్ డిజిటల్ మార్కెట్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2021లో సమంత బెస్ట్ ఫీమేల్ లీడ్ అవార్డును ది ఫ్యామిలీ మ్యాన్-2కి అందుకుంది. తాజాగా ఫిల్మ్ ఛాంపియన్ డిస్రప్టర్స్- 2021లో టాప్-20లో సమంత స్థానం సంపాదించుకుంది. ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంపియన్ ఎఫ్‌సీ డిస్రప్టర్స్ 2021 జాబితాలో జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి 20 లిస్ట్ లో టాప్ 3 లో నిలిచాడు. దీంతో సమంతాతోపాటు, టాలీవుడ్ నుండి ఇద్దరు స్టార్స్ స్థానం సంపాదింకున్నట్టయింది. ఇక ఈ లిస్ట్‌లో ఓటీటీ సూపర్‌స్టార్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఫస్ట్ ప్లేస్ కొట్టేశాడు. సమంతతోపాటు నటి నిమిషా సజయన్, మహిళా డైరెక్టర్లు పాయల్ కపాడియా, గునీత్‌మోంగా కూడా టాప్ 20లో నిలిచారు. కాగా ఇదే సిరీస్గాను ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2021 (ఐఐఎఫ్ఎం) అవార్డును కూడా సమంత కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సమంతకు ఉత్తమ నటిగా, మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ నటుడు అవార్డును గెల్చుకున్నారు. రాజీగా ఈ సిరీస్‌లో డీగ్లామర్ పాత్రను పోషించిన సమంత తన అద్భుతమైన నటనతో అందరినీ కట్టి పడేసింది. రంగస్థలం, యు టర్న్ , సూపర్ డీలక్స్ చిత్రాలలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత హిందీలోకి అరంగేట్రం చేయడం,ఆ సిరీస్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో నేషనల్ స్టార్‌గా మారిపోయింది. మరోవైపు హీరోల ఆధిపత్యమే ఎక్కువగా సాగే తెలుగు సినీ పరిశ్రమలో, సమంత ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో రానున్న పాన్-ఇండియన్ పౌరాణిక మూవీ శాకుంతలంలో నటిస్తోంది. Woo hoo 🙌 Thankyou @fcompanionsouth 💃 https://t.co/JKDZbConlv — Samantha (@Samanthaprabhu2) November 9, 2021 Thankyou sir 🙏 https://t.co/efOslTbDGG — Samantha (@Samanthaprabhu2) November 10, 2021 Double honor for @Samanthaprabhu2 Best Actress for #TheFamilyMan2 #FC Distruptor 20 list.. Congrats 👏 pic.twitter.com/EdmCP1hHNo — Ramesh Bala (@rameshlaus) November 9, 2021 -
‘ఫ్యామిలీ మ్యాన్’ హీరో మనోజ్ బాజ్‌పేయి ఇంట తీవ్ర విషాదం
బాలీవుడ్ నటుడు, ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఫేం మనోజ్ బాజ్‌పేయి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆర్కే బాజ్‌పేయి (83) ఆదివారం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెల్వా అనే చిన్న గ్రామంలో జన్మించిన మనోజ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడానికి ఢిల్లీకి మకాం మార్చాడు. తర్వాత అవకాశాల కోసం ముంబైకి చేరాడు. ఈ 52 ఏళ్ల నటుడు ప్రస్తుతం ఓటీటీల్లో విజయాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
Samantha: ఆమెతో కలిసి నటించడమే నా కల: బాలీవుడ్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ టాలీవుడ్ హీరోయిన్ సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం ట్విటర్లో లైవ్ సెషన్ నిర్వహించి అభిమానులతో ముచ్చటించాడు షాహిద్. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో షాహిద్ రాజ్ అండ్ డీకేలతో కలిసి చేసిన తన వెబ్ సిరీస్, జెర్సీ మూవీలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ గురించి అడిగాడు. దీంతో షాహిద్ ఈ వెబ్ సిరీస్ తనకు బాగా నచ్చిందని ముఖ్యంగా ఇందులో సమంత నటనకు ఫిదా అయ్యానని చెప్పాడు. చదవండి: పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు అంతేగాక ‘ఈ సిరీస్ చూస్తున్నంత సేపు తనతో, తన నటనతో ప్రేమలో పడిపోయాను. చెప్పాలంటే ఈ షో మొత్తంలో సమంత నటన నన్ను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి పెరిగింది. ఇప్పుడు తనతో ఓ సినిమా చేయడమే నా కల’ అంటూ సామ్‌పై షాహిద్ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా రాజ్-డీకే దర్శకత్వలో క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత నెగిటివ్ షెడ్స్ ఉన్న రాజీ పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ కూడా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక షాహిద్ కపూర్ సినిమాల విషయానికొస్తే.. రాజ్ అండ్ డీకేలతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేశాడు. ఈ సిరీస్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. అలాగే అతడు నటించి జెర్సీ మూవీ రీమేక్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుందని, ఈ ఏడాది డిసెంబర్ 31 విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు షాహిద్ తెలిపాడు. చదవండి: మందు గ్లాస్‌తో పూరికి బర్త్‌డే విషెస్ తెలిపిన చార్మీ -
నయనతార, విజయ్ సేతుపతిలతో సమంత సెలబ్రేషన్.. ఫోటోలు వైరల్
తమిళ సినిమా: నటి సమంతకిది సెలబ్రేషన్ టైమ్. ఇటీవల జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో ది ఫ్యామిలీ మెన్– 2 వెబ్ సిరీస్‌కు గాను సమంత ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో శాకుంతలం అనే చారిత్రాత్మక కథా చిత్రంతో పాటు తమిళంలో కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి నయనతార మరో కథానాయిక. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్నారు. (చదవండి: నేను ప్రేమలో పడిపోయా : జగపతి బాబు) నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తాజా షెడ్యూల్ పాండిచ్చేరిలో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్లో నటి సమంత కూడా పాల్గొన్నారు. ఉత్తమ నటి అవార్డు అందుకున్న సమంతను కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్ర సెట్లో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ చేసుకున్నారు. -
IFFM: రాజీ నటనకు దిగొచ్చిన అవార్డు.. ఉత్తమ నటిగా సమంత
గ్లామర్‌తో పాటు అద్భుత నటనతో అదరగొడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంతకు ఉత్తమ అవార్డు వరించింది. సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐ.ఎఫ్.ఎఫ్.ఎం) 2021 అవార్డ్స్‌ను ప్రకటించింది. ఇందులో ‘ఫ్యామిలీ మ్యాన్-2’కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటిగా సమంత, ఉత్తమ నటుడుగా మనోజ్ బాజ్‌పాయ్ అవార్డును సొంతం చేసుకున్నారు. (చదవండి: నాకు చేతబడి చేశారు, 13 ఏళ్లు నరకం చూశా: నటుడు) ఈ సిరీస్‌లో రాజీగా డీగ్లామర్ పాత్రను పోషించిన సమంత తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఉత్తమ చిత్రంగా సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) నిలిచింది. ఇదే సినిమాకుగాను ఉత్తమ నటుడిగా సూర్య ఎంపికయ్యాడు. అలాగే షేర్నీ సినిమాకు గాను విద్యా బాలన్‌కు ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఐఎఫ్ఎఫ్ఎమ్- 2021 అవార్డుల జాబిత ఉత్తమ నటుడు: సూర్య (ఆకాశం నీ హద్దురా) ఉత్తమ నటి: విద్యా బాలన్ (షేర్నీ) ఉత్తమ వెబ్ సిరీస్ నటుడు: మనోజ్ బాజ్‌పాయ్ ( ది ఫ్యామిలీమ్యాన్ 2) ఉత్తమ వెబ్ సిరీస్ నటి: సమంత(‘ది ఫ్యామిలీమ్యాన్ 2’) ఉత్తమ చిత్రం: ‘సూరరై పొట్రు’(ఆకాశం నీ హద్దురా) ఉత్తమ డైరెక్టర్: అనురాగ్ బసు(లూడో) ఉత్తమ వెబ్ సిరీస్: మీర్జాపూర్ 2 ఇక్వాలిటీ ఇన్ సినిమా అవార్డు :‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ డైవర్సిటీ ఆఫ్ సినిమా అవార్డు : పంకాజ్త్రిపాటి ఉత్తమ డాక్యుమెంటరీ: షటప్ సోనా -
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’.. ఇప్పుడు తెలుగులో
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టున్నాయి. ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా విజయవంతమయ్యాయి. ఇక మొదటి సీజన్ సంచలన విజయంతో మేకర్స్ రెండవ సీజన్‌ను మరింత ఆసక్తిగా రూపొందించారు. ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ రికార్డు స్టాయిలో విజయం సాధించింది. ఈ సీజన్ సమంత నటించడంతో తెలుగు ప్రేక్షకుల్లో సైతం భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీంతో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ను తెలుగులో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ విడుదలై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తెలుగు వెర్షన్ విడుదల కాలేదు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడేఎప్పుడా అని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరి ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పెడుతూ అమెజాన్ ప్రైం ఫ్యామిలీ మ్యాన్ 2ను విడుదల చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే తేదీని మాత్రం ప్రకటించలేదు. కానీ తెలుగు ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా త్వరలోనే స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తుందట. ఈ సెకండ్ సీజన్లో బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్‌పాయి లీడ్రోల్లో నటించగా ప్రయమణి, సమంతలు కీలక పాత్రల్లో నటించారు. ఇందులో సమంత శ్రీలంక మహిళ టెర్రరిస్టుగా నటించింది. -
పోర్నోగ్రఫీ కేసు: మనోజ్ బాజ్‌పాయ్ నీచుడు, సభ్యత లేనివాడు
Sunil Pal: నీలి చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడంపై కమెడియన్ సునీల్ పాల్ స్పందించాడు. పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టు రట్టు చేయడమే కాక అతడిని అరెస్ట్ చేసినందుకు పోలీసులను అభినందించాడు. అయితే ఈ పోర్న్ అనేది రకరకాల రూపాల్లో విస్తరిస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడాడు. 'రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయడం సబబైనదే. ఇదిప్పుడు అవసరం కూడా! ఎందుకంటే పలుచోట్ల సెన్సార్ లేకపోవడంతో కొందరు పెద్ద తలకాయలు అడ్డగోలు వెబ్‌సిరీస్‌లు తీస్తున్నారు. అవి ఇంట్లోవాళ్లతో కలిసి చూడలేనంత ఘోరంగా ఉంటున్నాయి. ఉదాహరణకు మనోజ్ బాజ్‌పాయ్‌ను తీసుకుందాం. అతడు పెద్ద నటుడే కావచ్చు. కానీ అతడిలాంటి సభ్యత లేని వ్యక్తిని, నీచుడిని నేనింతవరకు చూడలేదు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న అతడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఏం చేస్తున్నాడు? అతడు నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో.. భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో ఎఫైర్, మైనర్ బాలికకు బాయ్‌ఫ్రెండ్, చిన్న పిల్లాడు తన వయసుకు మించి ప్రవర్తించడం.. ఓ కుటుంబం అంటే ఇలాగే ఉంటుందా? ఇవా మీరు చూపించేది? ఇక పంకజ్ త్రిపాఠి నటించిన మీర్జాపూర్ పనికిరాని వెబ్‌సిరీస్. అందులో చేసినవాళ్లంటేనే నాకు అసహ్యం. పోర్న్‌పై నిషేధం విధించినట్లుగానే ఈ పనికిరాని వెబ్‌సిరీస్‌లను కూడా బ్యాన్ చేయాలి. కేవలం కళ్లకు కనిపించేదే కాదు, ఆలోచనల్ని చెడగొట్టేది కూడా పోర్న్ కిందకే వస్తుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా సునీల్ పాల్ 2005లో ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్‌లో విజేతగా నిలిచాడు. 2010లో 'భవ్నావో కో సమజో' అనే కామెడీ సినిమాకు దర్శకత్వం వహించాడు. -
ముద్దు సీన్లలో నటించడానికి రీసెర్చ్ చేశానంటోన్న నటి
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మార్మోగిపోయిన వెబ్ సిరీస్ ఏదైనా ఉందా? అంటే అది 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'నే. విమర్శలు, ప్రశంసలు, వివాదాలు, వాదనలతో ఈ సీజన్‌కు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. అందులో యాక్ట్ చేసిన నటీనటులకు కూడా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఇందులో మనోజ్ తివారీ నటించిన శ్రీకాంత్ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. మొదటి సీజన్లో అతడికి కూతురిగా నటించిన ఆశ్లేష ఠాకూర్ కూడా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఆన్‌స్క్రీన్ బాయ్‌ఫ్రెండ్‌తో ముద్దు సీన్లలోనూ నటించింది. అయితే ఇలాంటి సన్నివేశాల్లో నటించడం అంత ఈజీ కాదంటోందీ భామ. 17 ఏళ్ల ఆశ్లేష తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ముద్దు సీన్లలో నటించడం నాకు కొత్త కావడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. చిన్నపిల్లలా ఏదో విధంగా చేసేయకుండా అవి చాలా సహజంగా రావాలనుకున్నాను. ఇందుకోసం ప్రేమ మిళితమై ఉండే వెబ్ సిరీస్‌లు చూశాను. చాలా రీసెర్చ్ చేశాను. ఎంత అధ్యయనం చేసినప్పటికీ షూటింగ్ వరకు వచ్చేసరికి అదంత సరదాగా ఏమీ ఉండదు. అయితే నటిగా నేను చేసే పాత్రలో లీనమైపోవాలి. ముద్దు సన్నివేశం తెర మీద ఎలా వస్తుందనే దాని గురించి నేను పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దర్శకనిర్మాతల మీద పూర్తి నమ్మకముంచాను. అయినా ఆ సీన్ చాలా సాంకేతికంగా జరిగిపోతుంది' అని చెప్పుకొచ్చింది. -
The Family Man 2: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఫ్యామిలీ మ్యాన్ 2
సమంత అక్కినేని తొలిసారి నటించిన వెబ్ సిరీస్‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ప్రపంచ రికార్డును సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పాపురల్ వెబ్ సిరీస్‌లలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 చోటు సంపాదించుకుంది. ఐఎండీబీ విడుదల చేసిన తాజా జాబితాలో మోస్ట్ పాపులర్ షోస్ ఇన్ ది వరల్డ్ జాబితాలో ఫ్యామిలీ మేన్ 2 నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. హాలీవుడ్ కి చెందిన లోకీ, స్వీట్ టూత్, మేర్ ఈస్ట్ టౌన్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. వరల్డ్ సీరీస్‌లో స్థానం దక్కించుకోవడం పట్ల ఫ్యామిలీ మ్యాన్-2 యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. రాజ్ అండ్ డీకే పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేకి తోడు మనోజ్, ప్రియమణి, సామ్ నటన ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యేలా చేశాయి. #TheFamilyManSeason2 is the 4th most popular show in the world right now! 🙏 @BajpayeeManoj @Samanthaprabhu2 @sumank @Suparn @sharibhashmi @PrimeVideoIN @IMDb pic.twitter.com/Zq92vB3vJU — Raj & DK (@rajndk) June 20, 2021 చదవండి: ఫ్యామిలీ మ్యాన్ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా? -
నా డిజిటల్ ఎంట్రీ గురించి భయంగా ఉంది: షాహిద్ కపూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ త్వరలో తన డిజిటల్ ఎంట్రీకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా సోమవారంతో షాహిద్ ‘కబీర్ సింగ్’ మూవీ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో డిజిటల్ ఎంట్రీపై స్పందించాడు. ఓ అభిమాని తన ఓటీటీ ఎంట్రీపై ప్రశ్నించగా.. రాజ్, డీకేలతో కలిసి ఓ వెబ్ సిరీస్ కోసం పనిచేయడం సంతోషంగా ఉన్నా అదే సమయంలో చాలా భయంగా కూడా ఉందంటూ సమాధానం ఇచ్చి షాహిద్ ఆశ్చర్యపరిచాడు. ‘నిజంగా నా డిజిటల్ ఎంట్రీపై భయపడుతున్న. ఎందుకంటే బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకుల ప్రేమ, అభిమానాన్ని అందుకున్న ప్రతి నటీనటులంతా ఓటీటీలో వారి ప్రశంసలు అందుకోవచ్చు లేదా అందుకోకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అలాగే సినిమాల్లో వచ్చిన సక్సెస్ ఓటీటీలో రాకపోవచ్చు. సినిమాలకు అక్కడ ఆదరణ ఉంటుందన్న గ్యారంటీ లేదు’ అంటూ వివరణ ఇచ్చాడు. కాగా రాజ్, డీకే దర్శకత్వంలో వస్తున్న ఓ వెబ్ సిరీస్‌తో షాహిద్ కపూర్ ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో షాహిద్ ‘ఆమెజాన్ ప్రైంలో తనకు ఇష్టమైన ఇండియన్ షో ‘ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్’. అదే సిరీస్ డైరెక్టర్స్‌తో నా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. వారు నాకు కథ వివరించగానే నాకు నచ్చి ఒకే చెప్పాను. ఆ కథతో త్వరలోనే మీ ముందుకు వస్తున్నాను. అప్పటి వరకు వేచి ఉండలేక పోతున్న అంటూ రాజ్, డీకేలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. -
ఫ్యామిలీ మ్యాన్-3లో నటించనున్న విజయ్ సేతుపతి?
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఓటీటీలో విశేష ప్రేక్షకాదరణ పోందుతూ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో విడుదలైన రెండు సీజన్లకు ఓటీటీ వాసులు బ్రహ్మరథం పట్టారు.దీనికి కొనసాగింపుగా సీజన్-3 కూడా రానున్న నేపథ్యంలో మేకర్స్ రాజ్ అండ్ డీకే తదుపరి సీజన్‌ను ఓ రేంజ్లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సౌత్ స్టార్ తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫ్యామిలీ మ్యాన్-3లో విజయ్ నటించనున్నాడా ? ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం, ఓటీటీ కి ప్రేక్షకాదరణ పెరగడంతో తారల అడుగు ఓటీటీ వైపు పడుతోంది. ఈ క్రమంలో ఇటీవల సామ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇదే తరహాలో ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా ఓటీటీలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అసలు సీజన్-2 కే సేతుపతి నటించాల్సి ఉండగా అది కుదరలేదు. కాగా తదుపరి సీజన్లో విజయ్ సేతుపతి రాకతో ఈ సిరీస్ కు మరింత హైప్ తీసుకురావాలని మేకర్స్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి విజయ్ సేతుపతి నిజంగానే ఫ్యామిలీ మ్యాన్‌లో నటించనున్నాడా? నటిస్తే ఏ పాత్రలో కనిపించనున్నాడన్న దానిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంది. మొదటి సిరీస్‌కు కొనసాగింపుగా వచ్చిన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఇక సీజన్ 2 లో ప్రత్యేకంగా చెప్పలాంటే సమంత తన నటనతో సీజన్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇందులో సామ్ నటనతో పాటు స్టంట్స్ కూడా ఇరగదీసిందనే చెప్పాలి. చదవండి: ‘అర్జున్ రెడ్డి’లా పవన్ కల్యాణ్.. ఓ రేంజ్లో వైరల్ అవుతున్న ఓల్డ్ పిక్ -
సమంత నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా: నటుడు
సమంత, మజోజ్బాయ్పేయి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. రాజ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ ఆమెజాన్ ప్రైంలో ఇటీవల విడుదలై అత్యధిక రేటింగ్స్ దూసుకోపోతుంది. పాజిటివ్ టాక్ తెచ్చకుంటూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సిరీస్‌లో ఢిల్లీకి చెందిన నటుడు షాహబ్ అలీ కీలక పాత్ర పోషించాడు. ఇందులో తన పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకున్నాడు షాహబ్ అలీ. ఈ నేపథయంలో తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి షాహబ్ అలీ మాట్లాడుతూ..డైరెక్టర్స్ రాజ్ డీకే నన్ను సంప్రదించినపుడు ఈ సిరీస్‌లో సమంత ఉందని తెలిసి చాలా ఎక్సయిట్ అయ్యాను అని చెప్పాడు. ‘ఆమె పెద్ద స్టార్. నాకు స్ఫూర్తి. సూపర్ డీలక్స్‌తో పాటు సమంత నటించిన కొన్ని సినిమాలు చూశాను. మొదట భయపడ్డా. కానీ షూటింగ్ మొదలయ్యాక నాలో ఉన్న భయం పోయి సౌకర్యంగా ఫీలయ్యేలా చేశారు సమంత. ఆమె చాలా డెడికేషన్ కలిగిన నటి. సమంత నుంచి చాలా నేర్చుకున్న. ఆమె దగ్గర నేర్చుకున్న విషయాలు నా కెరీర్‌కు ఉపయోగపడుతాయి’ అంటూ షాహబ్ చెప్పుకొచ్చాడు.