'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ! | Do You Know That Megastar Chiranjeevi Was First Choice For The Family Man Web Series, Deets Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi-Family Man Web Series: చాన్నాళ్ల క్రితమే చిరుకు వెబ్ సిరీస్ ఆఫర్.. కాకపోతే

Published Wed, Aug 30 2023 2:58 PM | Last Updated on Wed, Aug 30 2023 6:02 PM

Actor Chiranjeevi First Choice The Family Man Web Series - Sakshi

ఒకరు చేయాల్సిన సినిమాని మరొకరు చేయడం.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే. స్టార్ హీరోలు కొన్నిసార్లు తమకు ఈ స్టోరీకి సెట్ కాదని వదిలేస్తుంటారు. కట్ చేస్తే అది బ్లాక్‌బస్టర్ అయిపోతుంది. కొన్నాళ్లకు ఎవరో చెబితే.. అప్పుడు అవునా అలా జరిగిందా? అని ఫ్యాన్స్ బాధపడుతుంటారు. తాజాగా 'ఫ్యామిలీమ్యాన్' విషయంలో మెగా ఫ్యాన్స్ అలానే అనుకుంటున్నారు.

ఏం జరిగింది?
మెగాస్టార్ చిరంజీవి.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలని పూర్తిగా పక్కనబెట్టేశారు. ఎందుకో ఆ ఫీల్డ్ లో సెట్ కాకపోయేసరికి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. 'ఖైదీ నం.150'తో మంచి హిట్ కొట్టారు. సరిగ్గా ఇదే సమయంలో తెలుగు దర్శక ద్వయం రాజ్ & డీకే.. 'ఫ్యామిలీమ్యాన్' వెబ్ సిరీస్ స్క్రిప్ట్‌తో నిర్మాత అశ్వనీదత్‌ని కలిశారు. ఈ స్క్రిప్ట్‌ని ఆయన చిరంజీవికి వినిపించారు. మెగాస్టార్‌కి ఇది బాగా నచ్చేసింది.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ 'కల్కి' ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి)

చిరు వెనకడుగు
అయితే ఈ వెబ్‌సిరీస్‌లో హీరో ఎన్ఐఏ అధికారి, గూఢచారి తరహా పాత్ర.. ఇది చిరుకు నచ్చేసింది. కానీ భార్య డిఫరెంట్ క్యారక్టరైజేషన్, తన పాత్రకు ఇద్దరు పిల్లలు ఉండటం లాంటి అంశాలు చిరుని ఆలోచనలో పడేశాయి. ఇదే విషయాన్ని దర్శకులకు చెబితే ఆ పిల్లల పాత్రల్ని తీసేయడానికి కూడా రెడీ అయిపోయారు. కానీ చిరు మాత్రం.. అప్పుడే రీఎంట‍్రీ ఇచ్చారు. ఆ టైంలో ఇలాంటి స్క్రిప్ట్ సెట్ అవుతుందో లేదో అని వెనకడుగు వేశారు. 

ఎవరు చెప్పారు?
అయితే ఈ విషయాలన్నీ నిర్మాత అశ్వనీదత్ తాజాగా రివీల్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. ఈ విషయాలన్ని బయటపెట్టారు. ఈ క్రమంలోనే మెగాఫ్యాన్స్.. చిరు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి రెండు సీజన్లుగా వచ్చిన ఈ సిరీస్.. గ్లోబల్ వైడ్ వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. చిరంజీవికి ఇలాంటి స్టోరీలు చేస్తే నిజంగా బాగుంటాయి. ప్రయత్నిస్తే అద్భుతాలు జరగొచ్చు.

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసుపై వరలక్ష్మీ శరత్‌కుమార్ వివరణ​.. ఆదిలింగం ఎవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement