Ashwini dutt
-
స్వప్న బ్యానర్‌కు ఆ హీరోతోనే బాగా కలిసొచ్చింది : స్వప్న దత్
-
దిల్ రాజు చేతుల మీదుగా ‘పిక్సెల్స్ అండ్ స్ట్రింగ్స్ స్టూడియో’ ప్రారంభం
-
అమితాబ్ అలా చేస్తారని ఊహించలేదు: నిర్మాత సి. అశ్వినీదత్
‘‘అమితాబ్ బచ్చన్‌గారు లెజెండ్. మేము సెట్స్‌లో కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. కానీ ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకలో నా కాళ్లకి అమితాబ్‌గారు నమస్కరించడంతో నాకు తల కొట్టేసినంత పని అయింది. ఆయన అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సి. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాగ్ అశ్విన్ ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది. ఈ శతాబ్దంలో ఒక మంచి దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు (నవ్వుతూ). ‘కల్కి’ విషయంలో టెన్షన్ పడలేదు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే తీశాం... అది నెరవేరింది. ప్రభాస్ సహకారం లేకపోతే అసలు ఈ సినిమా బయటికి రాదు. రాజమౌళి–ప్రభాస్‌ల ఎపిసోడ్ ఫన్నీగా పెట్టిందే. అలాగే బ్రహ్మానందం, రామ్‌గోపాల్ వర్మ పాత్రలని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.ఈ కథ అనుకున్నప్పుడే రెండో భాగం ఆలోచన వచ్చింది. కమల్‌గారు ఎంటరైన తర్వాత పార్ట్ 2 డిసైడ్ అయిపోయాం. ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2 వచ్చే ఏడాది జూన్‌లోనే విడుదల కావొచ్చు. 50 ఏళ్ల వైజయంతీ మూవీస్ ప్రయాణం అద్భుతం. ప్రస్తుతం శ్రీకాంత్‌గారి అబ్బాయి రోషన్‌తో ఓ సినిమా, దుల్కర్ సల్మాన్‌తో ఒక చిత్రం నిర్మిస్తున్నాం’’ అన్నారు. -
'కల్కి 2' షూటింగ్ 60% అయిపోయింది.. నిర్మాత కామెంట్స్
ప్రస్తుతం 'కల్కి' హ్యాంగోవర్ నడుస్తోంది. ఇక్కడ అక్కడా అనే తేడా లేకుండా అందరూ ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. తొలిరోజు రూ.191 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. లాంగ్ రన్లో రూ.1000 కోట్లు సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి? ఇలా అందరూ 'కల్కి' ఊపులో ఉండగానే సీక్వెల్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: 'కల్కి'పై హాలీవుడ్ ప్రశంసలు.. రేంజు పెరిగిపోయింది!)'కల్కి' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నిర్మాత అశ్వనీదత్ మీడియాతో మాట్లాడారు. సీక్వెల్ గురించి అడగ్గా.. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని, కాకపోతే మేజర్ సీక్వెన్స్ మాత్రం పెండింగ్‌లో ఉంచామని చెప్పారు. వాటి షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇస్తామని అన్నారు.అశ్వనీదత్ చెప్పిన దానిబట్టి చూస్తే ఏడాది ఏడాదిన్నరైనా చిత్రీకరణం పూర్తి చేయొచ్చు. కానీ అందరూ డేట్స్ కుదిరితేనే ఇది సాధ్యమవుతుంది. నాగ్ అశ్విన్ చేతిలో వేరే ప్రాజెక్ట్ ఏం లేదు కాబట్టి ముందు దీన్నే కంప్లీట్ చేస్తాడు. చూడాలి మరి 'కల్కి'ని సినిమాటిక్ యూనివర్స్‌గా ప్రకటించారు కాబట్టి రెండో భాగంలో కొత్త పాత్రలు ఏమైనా వచ్చి సర్ప్రైజ్ చేస్తాయేమో?(ఇదీ చదవండి: మహాభారతం గురించే డిస్కషన్.. ఇదంతా 'కల్కి' వల్లే) -
'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!
ఒకరు చేయాల్సిన సినిమాని మరొకరు చేయడం.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండేదే. స్టార్ హీరోలు కొన్నిసార్లు తమకు ఈ స్టోరీకి సెట్ కాదని వదిలేస్తుంటారు. కట్ చేస్తే అది బ్లాక్‌బస్టర్ అయిపోతుంది. కొన్నాళ్లకు ఎవరో చెబితే.. అప్పుడు అవునా అలా జరిగిందా? అని ఫ్యాన్స్ బాధపడుతుంటారు. తాజాగా 'ఫ్యామిలీమ్యాన్' విషయంలో మెగా ఫ్యాన్స్ అలానే అనుకుంటున్నారు. ఏం జరిగింది? మెగాస్టార్ చిరంజీవి.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలని పూర్తిగా పక్కనబెట్టేశారు. ఎందుకో ఆ ఫీల్డ్ లో సెట్ కాకపోయేసరికి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. 'ఖైదీ నం.150'తో మంచి హిట్ కొట్టారు. సరిగ్గా ఇదే సమయంలో తెలుగు దర్శక ద్వయం రాజ్ & డీకే.. 'ఫ్యామిలీమ్యాన్' వెబ్ సిరీస్ స్క్రిప్ట్‌తో నిర్మాత అశ్వనీదత్‌ని కలిశారు. ఈ స్క్రిప్ట్‌ని ఆయన చిరంజీవికి వినిపించారు. మెగాస్టార్‌కి ఇది బాగా నచ్చేసింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి) చిరు వెనకడుగు అయితే ఈ వెబ్‌సిరీస్‌లో హీరో ఎన్ఐఏ అధికారి, గూఢచారి తరహా పాత్ర.. ఇది చిరుకు నచ్చేసింది. కానీ భార్య డిఫరెంట్ క్యారక్టరైజేషన్, తన పాత్రకు ఇద్దరు పిల్లలు ఉండటం లాంటి అంశాలు చిరుని ఆలోచనలో పడేశాయి. ఇదే విషయాన్ని దర్శకులకు చెబితే ఆ పిల్లల పాత్రల్ని తీసేయడానికి కూడా రెడీ అయిపోయారు. కానీ చిరు మాత్రం.. అప్పుడే రీఎంట్రీ ఇచ్చారు. ఆ టైంలో ఇలాంటి స్క్రిప్ట్ సెట్ అవుతుందో లేదో అని వెనకడుగు వేశారు. ఎవరు చెప్పారు? అయితే ఈ విషయాలన్నీ నిర్మాత అశ్వనీదత్ తాజాగా రివీల్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. ఈ విషయాలన్ని బయటపెట్టారు. ఈ క్రమంలోనే మెగాఫ్యాన్స్.. చిరు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి రెండు సీజన్లుగా వచ్చిన ఈ సిరీస్.. గ్లోబల్ వైడ్ వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. చిరంజీవికి ఇలాంటి స్టోరీలు చేస్తే నిజంగా బాగుంటాయి. ప్రయత్నిస్తే అద్భుతాలు జరగొచ్చు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసుపై వరలక్ష్మీ శరత్‌కుమార్ వివరణ.. ఆదిలింగం ఎవరంటే?) -
ఒక్క మూవీకే రూ.32 కోట్ల నష్టం, సినిమాలు వదిలేద్దామనుకున్నా
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని.. అన్నాడో సినీ కవి. ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏ సినిమా అయినా హిట్టవ్వాలని కోరుకుంటారు. కానీ ప్రతి సినిమా హిట్టవ్వదు. ప్రేక్షకులకు నచ్చితేనే ఓటేస్తారు, నచ్చకపోతే తిరస్కరిస్తారు. అలా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడి నిర్మాతలకు తలనొప్పి తెచ్చి పెట్టాయి. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన శక్తి సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి స్పందించాడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్. 'ఆ రోజుల్లో పంపిణీ అంతా నిర్మాతలే చూసుకునేవారు. అందువల్ల నష్టం వస్తే నిర్మాతలు తట్టుకోలేకపోయేవారు. చేసిన అప్పులు తీర్చేందుకు ఇళ్లు, పొలాలు, భూములు అమ్ముకున్న ఎంతోమందిని కళ్లారా చూశాను. అందుకే నేను ఎప్పుడూ కొంత జాగ్రత్త పడేవాడిని. ఏదైనా సినిమా తీసి దెబ్బతిన్నప్పుడు చిరంజీవి పిలిచి కథ రెడీ చేసుకోండి, మనం సినిమా చేద్దాం అనేవారు. నాగార్జున కూడా అంతే, వేరే సినిమాలు ఆపేసి మరీ నాకోసం సినిమాలు చేసేవారు. ఆరోజుల్లో అలా ఉండేది. నాకు బాగా అసంతృప్తిని ఇచ్చిన సినిమా శక్తి. ఈ ఒక్క సినిమాతోనే రూ.32 కోట్లు పోయాయి. నేను షాక్‌లోకి వెళ్లిపోయాను. అందుకే నాలుగైదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాను. నిజానికి ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోదామనుకున్నాను. ఇక్కడ బాగా సక్సెస్ అయిన చూడాలని ఉంది సినిమాను నేను, అరవింద్ కలిసి హిందీలో తీశాం. రూ.12 కోట్ల నష్టం వచ్చింది. అంటే చెరి ఆరు కోట్ల నష్టం. అప్పటికి ఇద్దరం ఫామ్‌లో ఉన్నాం కాబట్టి మళ్లీ వెంటనే కోలుకున్నాం' అని చెప్పుకొచ్చాడు. కాగా అశ్వినీదత్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె(వర్కింగ్ టైటిల్) సినిమా నిర్మిస్తున్నాడు. చదవండి: ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో వెధవ పనులు చేశా: డైరెక్టర్ నేను చనిపోలేదు, అలా అని రిటైర్మెంటూ తీసుకోలేదు: నటుడు -
‘అరి’ ట్రైలర్ చూడగానే పులకింత వచ్చేసింది: నిర్మాత అశ్వనీదత్
‘అరి సినిమా ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూడగానే టెక్నీషియన్ అంతా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు అనిపిస్తోంది. ఈ సమ్మర్ లో వస్తోన్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అన్నారు. పేపర్‌బాయ్ ఫేం జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం అరి. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. నిర్మాత అశ్వనీదత్‌ని కూడా ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెస్కే ప్రసాద్ గారి ద్వారా నిర్మాత శేషుగారు నిర్మించిన అరి చిత్ర ట్రైలర్ ను చూశాను. చూడగానే నాకు ఎంతో పులకింత వచ్చేసింది. పర్టిక్యులర్ గా చెప్పాలంటే శ్రీ కృష్ణుడు ఎక్కడ కనిపించినా.. మా వైజయంతీ మూవీస్ లాగా అది ఎప్పుడూ శుభ సూచకం. గ్యారెంటీ హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ అందరికీ అడ్వాన్స్ గా కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నాను’ అన్నారు. -
ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ లో కీలక మార్పులు.. మిక్కీ ఔట్!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కీలక మార్పులు చేశారు మేకర్స్. ఈ సినిమా సంగీత దర్శకుడిని మార్చేశారు. తొలుత ‘ప్రాజెక్ట్ కె’ అనౌన్స్ చేసినప్పుడు మిక్కీ జె మేయర్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో సంతోష్ నారాయణన్ వచ్చి చేరారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ మార్పుకు గల కారణాన్ని మాత్రం తెలియజేయలేదు. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తకిర విషయాలను కూడా పంచుకున్నారు. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జానర్ అయినా.. ఎమోషన్స్, సెంటిమెంట్ అన్ని ఉంటాయని అన్నారు. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయినట్ల ఆయన వెల్లడించారు. ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్‌లకు స్క్రీన్ స్పెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఐదారు కంపెనీలు చేస్తున్నాయని.. వాటిని తెరపై చూసినప్పుడు అద్భుతంగా ఉంటుందని అన్నారు. ఇక సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ విషయానికొస్తే.. తమిళంలో పలు చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన పని చేసే చిత్రాలలో నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. తెలుగు ప్రస్తుతం నాని ‘దసరా’, వెంకటేశ్ ‘సైంధవ్’ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. -
నైజాంలో రికార్డు దరకు ప్రభాస్ ప్రాజెక్ట్ - కే రైట్స్
-
వైవిధ్యమైన రణస్థలి
‘‘రణస్థలి’ టీజర్, ట్రైలర్ చూస్తుంటే ‘ఇంద్ర’ సినిమా గుర్తుకు వస్తోంది. ఇందులోని కొన్ని సీన్స్ చూసిన తర్వాత సినిమా హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది’’ అని నిర్మాత సి. అశ్వినీదత్ అన్నారు. ధర్మ, అమ్ము అభిరామి, చాందినీ రావు హీరో హీరోయిన్లుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణస్థలి’. సూరెడ్డి విష్ణు సమర్పణలో అనుపమ సూరెడ్డి నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘విజయా పిక్చర్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా 50 ఏళ్లు నడిపిన వెంకటరత్నంగారి అబ్బాయి విష్ణు సినిమా రంగంలోకి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటీనటులు కొత్తవారే అయినా అద్భుతంగా నటించారు’’ అన్నారు సూరెడ్డి విష్ణు, సహనిర్మాత లక్ష్మీజ్యోతి శ్రీనివాస్. ‘‘పూరి జగన్నాథ్‌గారు నా గురువు. రొటీన్‌గా వచ్చే కథలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు పరశురాం శ్రీనివాస్. ఈ వేడుకలో హీరోలు ఆకాష్ పూరి, నందు, గౌతమ్, నటుడు సమ్మెట గాంధీ, కెమెరామేన్ బాలాజీ, చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కేశవ్ కిరణ్. -
మరో ప్రేమకథతో రాబోతున్న ‘సీతారామం’ టీం!, ఆ నిర్మాత క్లారిటీ..
ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘సీతారామం’. యుద్దం భూమిలో పుట్టిన అందమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీ విడుదలైన నెల దాటిన ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తోంది. అంతేకాదు ఓటీటీలో సైతం ఈమూవీ దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైంలో ప్రస్తుతం సీతారామం స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో లీడ్‌రోల్స్ పోషించిన హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ల నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ ఇదిలా ఉంటే దుల్కర్, మృణాల్ హీరోహీరోయిన్లుగా మరో చిత్రం ప్రేమకథా చిత్రం రాబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినిదత్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చెకూరుస్తున్నాయి. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సందర్భంగా ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించారు అశ్విని దత్. ఈ సందర్భంగా సీతారామం చిత్ర విశేషాలను పంచుకున్న ఆయన వైజయంతి బ్యానర్లో మరో ప్రేమ కథ చిత్రం రాబోతుందన్నారు. అదే సీతారామం కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా హనురాఘవపూడి దర్శకత్వంలో మరో లవ్‌స్టోరీని రూపొందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. చదవండి: ఈ చిత్రంలో రజనీ నటిస్తానంటే వారి మధ్య చిక్కుకునేవారు: మణిరత్నం ఇక ఇది తెలిసి ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఓ చక్కటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ చూశామని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ అదే టీంతో సీతారామం లాంటి చిత్రం వస్తుందని చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచానాలు పెరిగిపోయాయి. మరి హనురాఘవపూడి ఈసారి ఎలాంటి ప్రేమకథతో వస్తారనేతి ఆసక్తిని సంతరించుకుంది. కాగా దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం చుప్ సెప్టెంబర్ 23 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సీతారామం మూవీతో తెలుగులో అడుగుపెట్టిన మృణాల్ వైజయంతి బ్యానర్లోనే ఓ సినిమాకు సంతకం చేసిందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
తారక్ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాత నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని తనదైన నటన, డాన్స్ ఎంతోమంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎంతపెద్ద స్టార్ అయిన ఒదిగిపోయే ఉండే ఆయన వ్యక్తిత్వం చూసి అంత ఆశ్చర్యవ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తారక్‌కు సాధారణ ప్రజలే కాదు ఇండస్ట్రీలోనూ అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రముఖ బడా నిర్మాత అశ్వినీదత్ కూతురు స్వప్నాదత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: అలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలంటున్న నటి సురేఖ వాణి ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తారక్ వల్లే తన పెళ్లి జరిగిందని చెప్పంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నా వివాహం జరగడానికి జూనియర్ ఎన్టీఆరే కారణం. పెళ్లికి ముందు తన భర్త ప్రసాద్ వర్మ, తాను కొంతకాలం ప్రేమించుకున్నాం. అయితే ఈ విషయాన్ని మా నాన్నకు(వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీదత్) చెప్పేంత ధైర్యం లేదు. ఎందుకంటే నాన్న నా ప్రేమను కచ్చితంగా నిరాకరిస్తారని తెలుసు. అయితే ఈ విషయాన్ని నేను శక్తి మూవీ షూటింగ్ సమయంలో తారక్‌తో పంచుకున్నా. తను వెంటనే ఇంట్లో చెప్పమని సలహా ఇచ్చాడు. చదవండి: లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్ ‘ఇలాంటి విషయాల్లో అసలు ఆలస్యం చేయకూడదు. మీ నాన్నగారితో నేను మాట్లాడుతా’ అని చెప్పి షూటింగ్ అయిపోయాక మా ఇంటికి వచ్చి నాన్నతో నా ప్రేమ విషయం చెప్పాడు. మొదట ఆయన కాస్తా సీరియస్ అయినా ఆ తర్వాత తారక్ తన మాటలతో నాన్నను ఒప్పించాడు. అలా మా పెళ్లికి తారక్ మూలకారణం అయ్యాడు’’ అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా స్వప్నా దత్ ప్రసాద్ వర్మను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి 2010లో జరిగింది. తండ్రి అనంతరం ప్రస్తుతం వైజయంత్ బ్యానన్ వ్యవహారాలు, బాధ్యతలను స్వప్నాదత్ ఆమె సోదరి ప్రియాంక దత్‌లు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. -
సీనియర్ ఎన్టీఆర్‌గా తారక్‌ను అందుకే తీసుకోలేదు: అశ్వినీదత్
దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ను తీసుకొచ్చింది. ఓవర్ నైట్ స్టార్డమ్తో కీర్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిందీ సినిమా. అంతేకాకుండా జాతీయ అవార్డును సైతం అందుకుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో శివాజీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించగా, అక్కినేని నాగేశ్వర రావు పాత్రను ఆయన మనవడు, యంగ్ హీరో నాగ చైతన్య పోషించి మెప్పించిన విషయం తెలిసిందే. కానీ నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ పాత్రను మాత్రం ఎవరూ చేయలేదు. ముందుగా సీనియర్ ఎన్టీఆర్ రోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సింది. పలు కారణాల వల్ల అలా కుదరలేదని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తాజాగా తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మహానటి చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను తారక్‌తో చేయిద్దామని అనుకున్నాం. కానీ ఈలోగా బాలకృష్ణ గారు ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించారు. దీంతో మా సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో ఎవరిని పెట్టి తీసినా తప్పుగా భావిస్తారేమో అని అనిపించింది. ఒకవేళ తారక్ చేసినా బాగుండదేమో అని కూడా అనిపించింది. నాగ్ అశ్విన్‌తో చెబితే అసలు ఆయన పాత్ర లేకుండానే తీస్తా అని చెప్పి తెరకెక్కించాడు. ఆయన పాత్రకు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చేప్పారు. మిగతా అంతా మేనేజ్ చేశాం'' అని వెల్లడించారు. చదవండి: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు ! నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్ సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! -
అందుకే నిత్యామీనన్‌ను వద్దనుకున్నారా? రివీల్ చేసిన నిర్మాత
దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ను తీసుకొచ్చింది. ఓవర్ నైట్ స్టార్డమ్తో కీర్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిందీ సినిమా. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డు కూడా దక్కింది. అయితే ఈ ప్రాజెక్ట్ కీర్తి సురేష్‌కి ముందు వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా వైజయంతీ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ వెల్లడించారు. ఓ ప్రముఖ షోలో పాల్గొన్న ఆయన మహానటి ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సినిమాకు కీర్తికి ముందు ఓ మలయాళ నటిని అనుకున్నాం. కానీ కథ చెప్పాక అందులో మద్యం తాగే సన్నివేశాలు ఉంటే నేను చేయను అంటూ కండిషన్స్ పెట్టింది. దీంతో ఆమెను తీసుకోవడానికి వీల్లేదు అని నేనే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు చెప్పాను. కట్ చేస్తే కీర్తి సురేష్ చేతుల్లోకి ఈ సినిమా వెళ్లింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్ పేరు చెప్పడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు.అయితే మహానటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే మలయాళ హీరోయిన్ నిత్యామీనన్ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాకుండా సావిత్రి పాత్రలో ఆమె ఫోటోలు కూడా కొన్ని బయటికొచ్చాయి. ఏది ఏమైనా నిత్యామీనన్ ఓ మంచి సినిమాను దూరం చేసుకుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
స్టూడెంట్ నెం.1లో మొదట ప్రభాస్‌ను అనుకున్నాం: నిర్మాత
సీతారామం సక్సెస్‌తో నిర్మాతగా మరో జన్మ ఎత్తినట్లుందని తన్మయత్వానికి లోనవుతున్నాడు అశ్వినీదత్. వైజయంతి బ్యానర్లో ఆయన తీసిన ఎన్నో సినిమాలు మరపురాని విజయాలను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'పెళ్లి సందడి సినిమాను హిందీలో తీశాం. తర్వాత నేను, అరవింద్‌గారు కలిసి అనిల్ కపూర్‌తో చూడాలని ఉంది మూవీ తీశాం. అప్పుడిద్దరికీ చెరో ఆరు కోట్లు పోయాయి. అప్పట్లో ఓ సినిమాకు వాణిశ్రీని ఫిక్స్ చేశాం. ఆమె రూ. 2 లక్షలు కావాలంది. ఆమె అంత అడిగిందంటే ఎన్టీఆర్ రెండున్నర అడుగుతారేమోనని యాభైవేలు ఓ పొట్లంలో పట్టుకుని వెళ్లా. దానికాయన ఇంత డబ్బుందేంటి? మనం తీసుకునేది రెండు లక్షలే అని మిగతాది తిరిగిచ్చేశాడు. మహేశ్‌బాబు- రాజకుమారుడు, రామ్‌చరణ్- చిరుత, అల్లు అర్జున్- గంగోత్రి. ఇలా ఈ హీరోల మొదటి సినిమాలన్నీ మా బ్యానర్లో వచ్చినవే. తారక్‌ది మాత్రం రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1 తీశాం. ఈ సినిమాకు మొదట ప్రభాస్‌ను అనుకున్నాం. ఇంతలో హరికృష్ణ ఫోన్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ తారక్‌కు వచ్చింది. ఇక నా జీవితంలో ఆఖరి చిత్రం.. జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2. శక్తి సినిమా రిలీజైనప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అప్పుడే నాన్న చనిపోయారు. రజనీకాంత్ నా మాట వినలేదు, నా భార్య కూడా చెప్పింది వినలేదు. అప్పుడు నాలో శక్తి నశించిపోయినట్లనిపించింది' అని చెప్పుకొచ్చాడు అశ్వినీదత్. చదవండి: ఆ యాంకర్‌తో కొణిదెల హీరో ఎంగేజ్మెంట్! సీతారామం సక్సెస్ మీట్‌కు సుమంత్ గైర్హాజరు, ఎందుకో చెప్పిన హీరో -
సీతారామం సక్సెస్.. ఆరోజు ఏడ్చేశా..: దుల్కర్ సల్మాన్
ఓటీటీలు వచ్చాక ఇంకా జనాలు థియేటర్లకు ఎలా వస్తారు? అబ్బే, సినిమాలు ఆడటం ఇప్పుడంత సులువు కాదు, ఏదో భారీ బడ్జెట్ సినిమాలు అందులోనూ స్టార్ హీరో మూవీస్ అంటే మాత్రమే ప్రేక్షకులు థియేటర్ వైపు ఓ లుక్కిస్తారు.. ఇలా చాలా మాటలే వినిపించాయి. జూలైలో సినిమాలు వరుస ఫెయిల్యూర్స్ అందుకోవడంతో సినీపండితులు గాబరా పడ్డారు. కానీ ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సీతారామం, బింబిసార సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాయి. మీడియం రేంజ్ సినిమాలైనా కంటెంట్ ఉంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందేనని స్పష్టం చేశాయి. తాజాగా ఈ సినిమా సక్సెస్ అవడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ విజయంపై హీరో దుల్కర్ సల్మాన్ ఎమోషనల్ అయ్యాడు. 'తెలుగులో డబ్ అయిన నా మొదటి సినిమా ఓకే బంగారం. ఇందుకు మణిరత్నంగారికి ధన్యవాదాలు. తర్వాత నాగి, వైజయంతి.. మహానటిలో జెమిని అనే నెగెటివ్ పాత్ర ఇచ్చారు. ఇక్కడా నన్ను ఆదరించారు. కనులు కనులను దోచాయంటే, కురుప్ కూడా డబ్ అయ్యాయి. ఇలా ప్రతి సినిమాను ఆదరిస్తూ నామీద చూపించిన ప్రేమాభిమానాలను నేనెన్నటికీ మర్చిపోలేను. స్వప్న, హను నన్ను సీతారామం కోసం అడిగారు. ఎప్పటినుంచో నేనొక యునిక్ సినిమాతో తెలుగులో స్ట్రయిట్ ఫిలిం చేయాలనుకున్నా. ఇదొక క్వాలిటీ ఫిలిం కాబట్టి దీనితోనే ప్రయాణాన్ని ఆరంభించా. ఎంతోమంది ఆర్టిస్టులు, సిబ్బంది శ్రమ వల్లే సీతారామం ఇంత అందంగా వచ్చింది. సినిమా రిలీజ్ రోజు వచ్చిన స్పందన చూసి సంతోషంతో ఏడ్చేశాను. మా మీద మీరు చూపిస్తున్న ప్రేమకు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. సినిమాను ప్రేమించే తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీవాడిలా నన్ను భావించినందుకు మరోసారి కృతజ్ఞతలు.. మీ రామ్' అని ఓ లేఖ రాసుకొచ్చాడు. Filled with gratitude and emotion !! 🥹🥹🥹❤️❤️🦋🦋🦋#SitaRamamSaysThankU 🙏💕#SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @RelianceEnt @SonyMusicSouth pic.twitter.com/cF5u4tqeNw — Dulquer Salmaan (@dulQuer) August 9, 2022 మరోవైపు నిర్మాత అశ్వినీదత్ సైతం సినిమా విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు. సీతారామం సినిమాకు అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు రుణపడి ఉన్నానన్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, కేరళ ప్రేక్షకులు సైతం సీతారామం చూసి కన్నీటి పర్యంతమవుతూ, ప్రభంజనం సృష్టిస్తుంటే నిర్మాతగా మరోజన్మ ఎత్తినంత తన్మయత్వానికి లోనవుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ చిత్ర నిర్మాణాన్ని రెండేళ్లపాటు ఒంటిచేత్తో నడిపించి మరో చరిత్రకు శ్రీకారం చుట్టిన స్వప్నకు అభినందనలు తెలియజేస్తూ లేఖ విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ లేఖలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. A big thank you to everyone 🙏 - @AshwiniDuttCh#SitaRamamSaysThankU #SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @RelianceEnt @SonyMusicSouth pic.twitter.com/PtJ2vyf3Vp — Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 9, 2022 చదవండి: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్ సోనమ్.. నీ ఫ్రెండ్స్ ఎంతమందితో అతడు బెడ్ షేర్ చేసుకున్నాడు? -
నా జేబులో డబ్బులుండవు, మాకు థియేటరే గుడి: ప్రభాస్
Prabhas Interesting Comments In Sita Ramam Pre Release Event: తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (ఆగస్టు 3) ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో భాగంగాలో స్టేజ్‌పైకి వచ్చిన ప్రభాస్ మొదట ఏం మాట్లాడను అని షాక్ ఇచ్చాడు. తర్వాత ఈ సినిమా నిర్మాత స్వప్నదత్ వచ్చి మాట్లాడితే గానీ తాను మాట్లాడనని చెప్పాడు డార్లింగ్. 'ప్రభాస్ సాధారణంగా బయటకు రారు. ఒకటి మాకోసం వచ్చారు. రెండు సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు' అని స్వప్న దత్ తెలిపారు. అనంతరం స్వప్న దత్ మాట్లాడకా ఆమె కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చానని నవ్వులు పంచాడు. ''ఇలాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదు. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి 'సీతారామం' సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఇంట్లో దేవుడు ఉన్నాడని గుడికి వెళ్లడం మనేస్తామా? ఇది అంతే. మా సినీ ఫీల్డ్‌కు థియేటర్సే దేవలయాలు. తప్పకుండా సినిమాని థియేటర్లో చూడండి'' అని ప్రభాస్ పేర్కొన్నాడు. కార్యక్రమం చివర్లో రూ. 100 పెట్టి అశ్వనిదత్ వద్ద టికెట్ కొనుక్కోవాలని యాంకర్ సుమ చెప్పగా.. 'నా జేబులో డబ్బులుండవు. ఇందాక నాగ్ అశ్విన్ వద్ద అడిగి తీసుకున్న' అని ప్రభాస్ చెప్పడం నవ్వు తెప్పించేలా ఉంది. తర్వాత అశ్వనిదత్‌కు రూ. 100 ఇచ్చి టికెట్ తీసుకున్నాడు ప్రభాస్. 'సీతారామం' చిత్ర యూనిట్ అంతా టికెట్‌తో పాటు ఫొటోలకు ఫోజులివ్వడంతో ఈ ఈవెంట్ ముగిసింది. -
సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడట. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వెల్లడించాడు. ప్రాజెక్ట్ కె సినిమా గురించి గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన సీతారామం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ కాలి సర్జరీ కోసం విదేశంలో ఉండటంతో రాలేకపోయాడు అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రభాస్‌కు గతంలోనూ సర్జరీ జరిగినట్లు వార్తలు విచ్చిన విషయం తెలిసిందే! ఇక ప్రాజెక్ట్ కెను వచ్చే ఏడాది అక్టోబర్ 18న ప్లాన్ చేయాలని భావిస్తున్నట్లు అశ్వినీదత్ పేర్కొన్నాడు. ఒకవేళ అప్పటికి కుదరకపోతే 2024 జనవరిలో రిలీజ్ చేస్తామని వెల్లడించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణ్ నటిస్తుండగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. చదవండి: చైతూతో కలిసి ఉన్న ఇంటినే సమంత ఎక్కువ రేటుకు కొనుక్కుంది -
దుల్కర్‌తో ప్రతి ఏడాది ఒక మూవీ తీద్దామని చెప్పా: అశ్వినీదత్
మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ సల్మాన్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం'అని స్వప్నతో అప్పుడే చెప్పాను’అని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అన్నారు. దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి మరో చరిత్ర, మణిరత్నం గారి గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వుంది. ►ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోవడానికి కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ► ఎన్టీఆర్, రాఘవేంద్రరావు, చిరంజీవితో సినిమాలు చేసినప్పుడు వారి రూపంలో నాకు కనిపించని బలం ఉండేది. ఇద్దరు పిల్లలు చదువుపూర్తి చేసుకొని వచ్చి సినిమా నిర్మాణ రంగంలోకి వస్తామని చెప్పారు. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. స్వప్న ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఒంటి చేత్తో నడిపిస్తుంది. నిర్మాణం దాదాపు గా వాళ్లకి అప్పగించినట్లే. అయితే సంగీతం, సాహిత్యం నేను చూస్తాను. అలాగే స్క్రిప్ట్ కూడా. మహానటి లాంటి సినిమా తీసినప్పుడు సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాను. హను రాఘవపూడి ఈ సినిమాని దాదాపు అవుట్ డోర్ లో తీశారు. నేను షూటింగ్ కి వెళ్ళలేదు. సీతారామం మొత్తం స్వప్న చూసుకుంది. ఈ సినిమా క్రెడిట్ స్వప్నకి దక్కుతుంది. ► సీతారామంకు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విశాల్ ని తీసుకోవాలనేది హను చాయిస్. నేనూ విశాల్ మ్యూజిక్ విన్నాను. విశాల్ గారి భార్య కూడా సంప్రాదాయ సంగీత గాయిని. ఆమె సహకారం కూడా ఎక్కువ వుంటుందనిపించింది. వారిద్దరూ చాలా కష్టపడ్డారు. నేపధ్య సంగీతం కూడా చాలా గ్రాండ్ గా చేశారు. ► హను రాఘవపూడి చాలా మంచి టెక్నిక్ తెలిసిన దర్శకుడు. చాలా గొప్ప కథ చెప్పాడు. అతనికి కెమారా పై అద్భుతమైన పట్టు ఉంది. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీశారు. కాశ్మీర్ తో పాటు మిగతా చాలా అందమైన లొకేషన్ ఇందులో విజువల్ ఫీస్ట్ గా ఉంటాయి. ► మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం'అని స్వప్నతో అప్పుడే చెప్పాను. హను ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా నేరుగా దుల్కర్ కి చెప్పమని చెప్పాను. ఎందుకంటే నేషనల్ వైడ్ గా రీచ్ ఉండే ఈ ప్రేమ కథకు దుల్కర్ అయితే సరైన న్యాయం చేయగలడు. సుమంత్ పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్రతో ఆయన అన్ని భాషలకు పరిచయం అవుతారు. చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ► ఈ సినిమా సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు ఉంటుంది. సినిమా ఫాస్ట్‌గా ఉంటుంది. తమిళ్, మలయాళం వెర్షన్ సెన్సార్ దుబాయ్ లో జరిగింది. అద్భుతమైన రిపోర్ట్స్ వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమా ఏకకాలంలో విడుదలవుతుంది. ► ప్రాజెక్ట్ కె షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. నాగచైనత్య సినిమా, శ్రీకాంత్ అబ్బాయి రోషన్ తో ఒక సినిమా చర్చల్లో ఉన్నాయి. అన్నీ మంచి శకునములే అక్టోబర్ 5న విడుదలవుతుంది. -
ఆ వార్తల్లో నిజం లేదు: ‘ప్రాజెక్ట్ కె’ టీం క్లారిటీ
‘డార్లింగ్’ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. దీపికా ఆస్వస్థకు గురవడంతో ప్రభాస్ మూవీ షూటింగ్‌ను వాయిదా వేయాలని దర్శక-నిర్మాతలను కోరాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రూమర్లపై చిత్ర బృందం స్పందించింది. ప్రాజెక్ట్ కె షూటింగ్ వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ ఇక్కడ షూటింగ్లో పాల్గొన్న దీపికా అస్వస్థగా అనిపించడంతో కామినేని ఆసుప్రతిలో చెకప్ చేయించుకుంది. దీంతో ఆప్పటి నుంచి ఈ మూవీ షూటింగ్ వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ‘షూటింగ్‌కు ఎటువంటి అంతరాయం కలగలేదు. ప్లాన్ చేసుక్ను ప్రకారం సజావుగా జరుగుతోంది’ అని మూవీ నిర్మాత నిర్మాత అశ్వనీదత్ తెలిపాడు. అయితే ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం దీపికా యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఆమె ప్రాజెక్ట్ కె కోసం నేరుగా హైదరాబాద్ వచ్చింది. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య అయితే గతేడాది దీపికా కరోనా బారిన పడ్డిన విషయం విధితమే. ఆ సమయంలో తన గుండె వేగంగా కొట్టుకునేదట. తాజాగా అలానే అనిపించడంతో చెకప్ కోసం దీపికా హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లొచ్చింది. దీంతో ఆమె రెండు గంటల ప్రాజెక్ట్ కె షూటింగ్‌ను వెళ్లింది. కాగా ప్రస్తుతం దీపికా, అమితాబ్ బచ్చన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లోని సీన్స్ ఈ నెల 20తో పూర్తవుతాయట. ఆ తర్వాత ఈ నెల 21 నుంచి ప్రభాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ దాదాపు పది రోజుల పాటు జరగనుందని సినీ వర్గాల నుంచి సమాచారం. -
హాలీవుడ్ సైతం ఆరా తీస్తున్న ఏకైక ఇండియన్ హీరో ప్రభాస్: నిర్మాత
Ashwini Dutt Sensational Comments On Prabhas Regarding Hollywood: ఈశ్వర్‌గా సినిమా వంటి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి అభిమానుల గుండెల్లో డార్లింగ్‌గా ముద్ర వేసుకున్నాడు ప్రభాస్. అనేక చిత్రాలతో అలరించిన ప్రభాస్ బాహబలిగా మారి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అప్పటినుంచి ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్‌లోనే తీస్తున్నాడు మిర్చి హీరో. ప్రభాస్ తరహాలో ఎవరూ ఇలా వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేయలేదు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తయినట్లు ఇటీవలే ప్రకటించారు. ఇవే కాకుండా సందీప్ వంగాతో 'స్పిరిట్', అశ్వనీదత్ నిర్మాతగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' కూడా కమిట్ అయ్యాడు. 'ప్రాజెక్ట్ కె' సినిమా కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తుండగా వీరి ఇద్దరి మధ్య ఒక సన్నివేశాన్ని సైతం చిత్రీకరించారు. ఈ క్రమంలో నిర్మాత అశ్వనీదత్ ప్రభాస్‌పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ దర్శకులే కాకుండా హాలీవుడ్ డైరెక్టర్లు ప్రభాస్‌తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారట. హాలీవుడ్ డైరెక్టర్లు ఆరా తీస్తున్న ఏకైక ఇండియన్ హీరో ప్రభాస్ అని, 'ప్రాజెక్ట్ కె' తర్వాత డార్లింగ్ హాలీవుడ్ చిత్రాలకు పరిమితమైనా ఆశ్యర్యపోవాల్సింది లేదని గూస్ బంప్స్ తెప్పించే కామెంట్లు చేసినట్లు సమాచారం. ప్రభాస్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది బాహుబలి సినిమాతోనే. ఇందులో ప్రభాస్ ఆహ్యార్యం, స్క్రీన్ లుక్ హాలీవుడ్ దర్శకుల్ని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఓకే అంటే హాలీవుడ్ నుంచి అదిరిపోయే ఆఫర్లు ఇవ్వడానికి డైరెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు చిత్ర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టామ్ క్రూజ్ నటించిన ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ తర్వాతి సినిమాలో ప్రభాస్ కూడా చేయనున్నట్లుగా ఆ మధ్య వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ప్రభాస్ తన ఫిజిక్‌లో మార్పులు రాకుండా జాగ్రత్త పడితే 'మోస్ట్ ఎలిజిబుల్ ఇండియన్ హీరో ఫర్ హాలీవుడ్' అవుతాడని అంటున్నారు. ఇదిలా ఉంటే 'ప్రాజెక్ట్ కె' సినిమాలో మూడో ప్రపంచ యుద్ధం నుంచి ప్రజలను కాపాడే సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: 'స్పిరిట్'లో ప్రభాస్ రోల్ రివీల్ !.. ఇక ఫ్యాన్స్‌కు పండగే -
సూపర్‌స్టార్ కృష్ణకు ఘన సన్మానం.. 350కిపైగా చిత్రాల్లో నటించినా
Tribute To superstar Krishna Under Alluri Sitaramaraju 125th Birth Anniversary: తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలకు నిర్వచనం సూపర్ స్టార్ కృష్ణ. జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ తరహా పాత్రలను టాలీవుడ్‌కు పరిచయం చేసి హిట్ కొట్టారు. విభిన్న పాత్రలు, కథలతో ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించారు. 350పైగా చిత్రాల్లో నటించి సూపర్ స్టార్‌గా ఎదిగారు. నిర్మాతగా, దర్శకుడిగా సైతం రాణించి ఎందరో ఆర్టిస్ట్‌లకు దేవుడిగా మారారు. ఎన్నో మైలు రాళ్లు చేరుకున్న ఘట్టమనేని కృష్ణకు హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా సన్మానం జరిగింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల మంత్రులు శ్రీనివాస్ గౌడ్, అవంతి శ్రీనివాస్‌తోపాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నిర్మాతలు అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల గుండెల్లో అల్లూరిసీతరామరాజుగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కృష్ణకు సన్మానం చేశారు. అలాగే తన 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు విశేషాల్ని పంచుకున్నారు కృష్ణ. 350 చిత్రాల్లో నటించినా అల్లూరి సీతారామరాజు సినిమానే తనకిష్టమని తెలిపారు. -
Kapata Nataka Sutradhari: 99 కోట్ల బంగారం కొట్టేశారు, తర్వాత?
వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం 'కపటనాటక సూత్రధారి'. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు క్రాంతి సైన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి, ఫస్ట్ కాపీ సిద్దంగా ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ... ఈరోజుల్లో సినిమా పరిశ్రమకు చాలామంది కొత్త దర్శకులు, నిర్మాతలు వస్తున్నారు. వారు కంప్యూటర్ టెక్నాలజీ విషయంలో అన్ని నేర్చుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కపట నాటక సూత్రదారి ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఈ చిత్రాన్ని క్రాంతి అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా మనీష్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తప్పకుండా వీరు చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అందరికి అల్ ది బెస్ట్ అన్నారు. నిర్మాత మనీష్ మాట్లాడుతూ...మా కపట నాటక సూత్రదారి సినిమా ట్రైలర్‌ని ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీదత్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతగా ఆయనే మాకు స్ఫూర్తి, మా దర్శకుడు క్రాంతి సినిమాను చాలా కొత్తగా ఆవిష్కరించాడు. ఇక సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి ఫస్ట్ కాపీ సిద్దంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. అత్యంత ఉత్కంఠ భరితంగా, క్యూరియాసిటీని పెంచేవిధంగా ఉంది. శ్రమ బ్యాంక్ సిబ్బంది తమ బ్యాంక్‌లోదాచుకున్న రూ.99 కోట్ల విలువ గల బంగారాన్ని దొంగిలించారు. దీంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. ఈ కేసును పోలీసులు ఎలా చేధించారనేదే మిగతా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతంది. -
నమస్కారం బిగ్ బీ
ప్యాన్ ఇండియా సరికొత్త సూపర్‌స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ 50 ఏళ్ల ప్రయాణంలో భాగంగా ఈ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ – ‘‘మా సినిమాలో భారతీయ సినిమా గర్వించదగ్గ ఆర్టిస్ట్ అమితాబ్‌గారు భాగమవ్వడం చాలా సంతోషం. ఆయనకు స్వాగతం పలకడం నాకు లభించిన అద్భుతమైన, అత్యంత సంతృప్తికర క్షణం’’ అన్నారు. ‘‘అమితాబ్ బచ్చన్‌గారితో నటించాలనే నా కల ఎట్టకేలకు నిజమౌతోంది. నమస్కారం బిగ్ బీ’’ అన్నారు ప్రభాస్. ‘‘అమితాబ్‌గారికి ఎన్నో ఆఫర్లు వస్తాయి. వాటిలో మా సినిమా అంగీకరించడం అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయనది కేవలం అతిథి పాత్రో, ప్రత్యేక పాత్రో కాదు. కథకు చాలా ముఖ్యమైన పాత్ర. బిగ్ బీ మాకు కేటాయించిన సమయానికి న్యాయం చేస్తాం’’ అన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. 2021లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2022లో విడుదల కానుంది. -
రాజుకు తగ్గ రాణి
ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్ సహనిర్మాతలు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కథానాయికగా నటించనున్నట్లు చిత్రబృందం ఆదివారం అధికారికంగా వెల్లడించింది. వైజయంతీ మూవీస్ సంస్థ గోల్డెన్ జూబ్లీ పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం ఈ ప్రకటన చేశారు. ‘‘ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు దీపికా పదుకొనే. ‘‘కింగ్‌కి సరిపడేంత క్వీన్ కావాలి కదా మరి! చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం (దీపికా ఎంపికను ఉద్దేశించి) ఇది. పిచ్చెకిద్దాం. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రను దీపికా పదుకొనే చేయనుండటం నన్నెంతో ఎగై్జట్‌మెంట్‌కి గురి చేస్తోంది. ఇందులో ప్రభాస్–దీపికల జంట ఓ మెయిన్ హైలైట్. వాళ్లిద్దరి మధ్య నడిచే కథ రాబోయే సంవత్సరాల్లో ప్రేక్షకుల హృదయాల్లో గాఢమైన ముద్ర వేస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నాగ్ అశ్విన్. ‘‘భారతీయ సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసినవారి జాబితాలో మా స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ సినిమా మాకో సువర్ణావకాశం. ప్రేక్షకులు ఓ కొత్త అనుభవాన్ని ఆస్వాదించేలా చేసేందుకు కూడా మాకు ఇదో గొప్ప అవకాశం’’ అన్నారు అశ్వినీదత్. ‘‘భారతీయ సినిమాలో మా మరపురాని 50ఏళ్ల ప్రయాణాన్ని ఇలాంటి గొప్ప, ఉద్వేగభరితమైన వార్తతో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నారు ప్రియాంక, స్వప్నా. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. -
104 డిగ్రీల జ్వరంతో ధినక్ తా ధినక్ రో...
స్క్రీన్ మీద మాస్ హీరో చిరంజీవి, అందాల సుందరి శ్రీదేవి ‘ధినక్ తా ధినక్ రో..’ అంటూ డ్యాన్స్ చేస్తున్నారు. చూస్తున్న ప్రేక్షకులకు ఒకటే హుషారు. అభిమానులు కూడా థియేటర్లో స్టెప్పులేశారు. హీరోయిన్లు ఎలానూ పాటల్లో గ్లామరస్‌గా కనిపిస్తారు. హీరోలు కూడా హ్యాండ్సమ్గా కనిపిస్తారు. ఈ పాటలో చిరంజీవి అలానే కనిపించారు. అయితే ఈ పాట చిత్రీకరించినప్పుడు ఆయన 104 డిగ్రీల జ్వరంతో ఉన్నారు. నేటితో (మే 9) ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ విడుదలై 30 ఏళ్లయింది. చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమాలోని పాటల గురించి కొన్ని విశేషాలను వైజయంతీ సంస్థ పంచుకుంది. ‘దినక్ తా ధినక్ రో’.. పాటకు వాహినీ స్టూడియోలో భారీ సెట్ వేశాం. షూటింగ్ అయిపోగానే శ్రీదేవి హిందీ సినిమా షూటింగ్‌కు ఫారిన్ వెళ్లిపోవాలి. కానీ చిరంజీవికి 104 డిగ్రీల హై ఫీవర్. రిలీజ్ డేట్ మే 9 అని ప్రకటించాం. చిరంజీవి హై ఫీవర్‌తోనే షూటింగ్‌కు రెడీ అయ్యారు. ఒక డాక్టర్ సెట్లో ఉండేట్లు ప్లాన్ చేసుకున్నాం. అనకున్న తేదీకి విడుదల చేయగలిగామంటే చిరంజీవియే కారణం. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతదర్శకుడు. ట్యూన్స్ అన్నీ మెలోడీవే. కానీ చిరంజీవి, శ్రీదేవి అంటే మాస్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా? రాఘవేంద్రరావు ఆలోచనలో పడ్డారు. అప్పుడు వేటూరి ‘ఇదే ట్యూన్ ని మాస్ సాంగ్ చేస్తాను చూడండి’ అంటూ ‘అబ్బ నీ తీయనీ దెబ్బ’ అని రాశారు. ఈ పాటని రాఘవేంద్రరావు మైసూర్, బెంగళూర్లలో జస్ట్ రెండే రోజుల్లో ఫినిష్ చేశారు. కానీ ‘అందాలలో మహోదయం’ పాటకు మాత్రం 11 రోజులు పట్టింది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్ వండర్ వెనక చాలామంది ఛాంపియన్స్ ఉన్నారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌నీ మ్యాజికల్‌గా చూపించిన డీఓపీ విన్సెంట్ గారు, అద్భుతమైన సెట్స్‌తో మైమరపింపజేసిన ఆర్ట్ డైరెక్టర్ చలం, ఎడిటింగ్ స్కిల్‌తో సినిమాకి సూపర్ టెంపోనిచ్చిన చంటి, పాటలు, మాటలతో మెస్మరైజ్ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు.. ఇలా ఎందరో. ఎన్నో రకాలుగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్ స్టోన్ . ఓ హిస్టారికల్ ల్యాండ్ మార్క్. -
నాన్నను చూసి ఎంచుకున్నాం
►స్క్రీన్ మీద స్త్రీలు కనిపించడం సాధారణమే. కానీ కెమెరా వెనక పని చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కారణం? స్వప్నా దత్: సినిమా నిర్మాణం ఎందుకు ఎంచుకున్నాం అంటే మా నాన్నగారిని (అశ్వనీదత్) చూశాం. ఆయన ప్యాషన్‌తో సినిమాలు నిర్మించడం చూశాం. కథను ఎంచుకోవడం, నటీనటులను, దర్శకుడిని ఎంపిక చేసుకోవడం వంటి విషయాలు చూసి ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా యాక్టింగ్ అయినా, డిజైనింగ్ పైన అయినా ఆసక్తి చూపుతారు. కానీ మా ఇంట్లో అంత మంచి ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు నిర్మాణం కాకుండా ఏం చేస్తాం చెప్పండి. సినిమా నిర్మాణమే అన్నింటికంటే సాహసమైనది అనిపించింది. అదే చేస్తున్నాం (నవ్వుతూ). ►స్త్రీలు నిర్మాతలైతే షూటింగ్ లొకేషన్లో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది? ప్రియాంకా దత్: నిర్మాత ఆడవారైనా మగవారైనా సరే అందరూ సురక్షితంగా పని చేసుకునే వాతావరణం కల్పించాలి. లేడీ నిర్మాతలంటే.. మేం కొంచెం ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటాం కాబట్టి సెట్లో అమ్మాయిలు ఉంటే వాళ్లు సేఫ్‌గా ఇంటికి వెళ్లగలుగుతున్నారా? వాళ్ల బాత్రూమ్స్ సరిగ్గా ఉంటున్నాయా? అని చూస్తాం. అలాగే ఏదైనా ఇష్యూలు వస్తే వెంటనే మాతో చెప్పగలిగే వాతావరణం ఉంటుంది. మా మేనేజర్లతో అన్నీ సరిగ్గా చూసుకోమని చెబుతాం. నిర్మాత ఆడైనా మగైనా ఎవ్వరైనా సరే సెట్లో అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ►రామానాయుడుగారు నిర్మాతగా వంద సినిమాలుపైనే నిర్మించారు. లేడీ ప్రొడ్యూసర్స్ కూడా ఆ రికార్డుని అందుకోగలుగుతారా? స్వప్నా: ఇది ఆడా మగా సమస్య అని చెప్పను. కొంచెం మేల్ డామినేటెడ్ ప్రపంచంలో ఉమెన్‌కి కచ్చితంగా చాలెంజెస్ ఉంటాయి. కష్టం అయితే అందరికీ ఒకటే. రామానాయుడిగారి అంత విజన్ ఉంటే ప్రయత్నించొచ్చు అనుకుంటా. ►నాన్నగారి బాటలో నిర్మాతలు అయి ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, దేవదాస్ వంటి సినిమాలు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ లెగసీని మోయడం ఒత్తిడి ఏమైనా? స్వప్నా: అవును. ఏదైనా పెద్ద పెద్ద పనులు చేస్తున్నప్పుడు కచ్చితంగా ఉంటుంది. అలాంటిది 50 ఏళ్ల హిస్టరీ ఉన్న సంస్థ (వైజయంతీ మూవీస్)ను ముందుకు తీసుకెళ్లడం కచ్చితంగా ప్రెషరే. అలాగే ప్లెషర్ కూడా. ►లేడీ ప్రొడ్యూసర్స్ ఎదుర్కొనే చాలెంజ్‌లు? స్వప్నా: ప్రొడక్షన్ అంటేనే చాలెంజ్. ప్రొడ్యూసర్స్ అంటేనే చాలెంజెస్ ఎదుర్కొనేవారు. అందులో ఆడామగా అని ఉండదనుకుంటున్నాను. జెన్యూన్‌గా సినిమా తీసేవాళ్లకు ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. -
50 ఇయర్స్ స్పెషల్
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 50వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా బుధవారం స్పెషల్ అనౌన్స్మెంట్ చేశారు. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ తెరకెక్కించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా ఉంటుందని ప్రకటన విడుదల చేశారు. తండ్రి అశ్వనీదత్‌తో కలసి స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రభాస్‌గారికి థ్యాంక్స్. ప్రస్తుతానికి సినిమా గురించి ఏం చెప్పదల్చుకోలేదు. ఇది ప్యాన్ ఇండియన్ సినిమా కాదు.. ప్యాన్ వరల్డ్ సినిమా’’ అన్నారు నాగ్ అశ్విన్. -
గొప్ప అవకాశం లభించింది : అశ్వినీదత్
వైజయంతీ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ను మంగళవారం ఆయన కార్యాలయంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి కలిశారు. మోదీ ప్రభుత్వం సాధించిన ఆర్టికల్ 370 విజయ కరదీపికను, మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి నివేదికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రహ్లాద్ జోషితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇరవై నిమిషాల పాటు సినిమాలు, మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై పరస్పరం చర్చించుకున్నారు. అశ్వినీ దత్ నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ఇటీవల జాతీయ అవార్డు సాధించిన ‘మహానటి’ సినిమా గురించి మాట్లాడుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వప్నాదత్, ప్రియాంకా దత్ ‘మహానటి’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘ఈ రోజు గొప్ప అవకాశం లభించింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వచ్చి నాగ్ అశ్విన్, ప్రియాంకాలను అభినందించారు. దేశం మొత్తం మోదీ పనితీరును ప్రశంసిస్తోంది. ప్రధాని మోదీ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం మనకు గర్వకారణం. కశ్మీర్ మనదని చాటారు. దేశం కోసం మోదీ ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. ఆనాడు మాజీ ప్రధాన మంత్రి, దివంగత నేత వాజ్పాయ్ పాలనలో గొప్ప పరిపాలన చూశాం. మళ్లీ మోదీ హయాంలో చూస్తున్నాం. జీఎస్టీ విషయంలో మేం సూచించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి సహకరించారు. మోదీకి (మంగళవారం మోదీ పుట్టినరోజు) ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలి. మా నుంచి ప్రభుత్వానికి అన్నిరకాల సహకారాలు ఉంటాయని ప్రహ్లాద్ జోషీకి చెప్పాం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై దృష్టి సారించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరాను’’ అని అన్నారు. -
ఫ్యాన్సే కాదు.. నేనూ కాలర్ ఎగరేస్తున్నా
‘‘నా కెరీర్లో ‘మహర్షి’ స్పెషల్ ఫిల్మ్. నా బిగ్గెస్ట్ హిట్స్‌ని వారంలో దాటేయబోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు లేదు. సినిమాను సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు, మా నాన్నగారి(కృష్ణ) అభిమానులకు, నా అభిమానులకు హ్యాట్సాఫ్’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. సి. అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడులైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘ఈ రోజు మదర్స్ డే (ఆదివారం). నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడూ సినిమా రిలీజ్‌కు ముందు అమ్మ ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. అమ్మ ఆశీస్సులు నాకు చాలా ముఖ్యం. అందువల్లే ‘మహర్షి’ సినిమా ఇంత సక్సెస్ అయ్యింది. అందుకే అమ్మలకు ఈ సినిమా సక్సెస్‌ను అంకితం ఇస్తున్నాం. ‘మహర్షి’ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో వంశీ మాట్లాడుతూ నాన్నగారి అభిమానులు, నా అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారని అన్నాడు. వాళ్లు (అభిమానులు) కాలర్ ఎత్తారు వంశీ... ఇవాళ నేను కూడా కాలర్ ఎత్తాను. దత్‌గారు నన్ను ఎప్పుడూ ప్రిన్స్ బాబు అని పిలుస్తుంటారు. విపరీతంగా నచ్చినప్పుడు మాత్రం మహేశ్ అని పిలుస్తారు. ఆ పేరు కోసం ఎప్పుడూ వేచి చూస్తుంటాను. ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ మహేశ్ అని దత్‌గారు అనడంతో చాలా సంతోషంగా అనిపించింది’’ అన్నారు. అశ్వనీదత్ మాట్లాడుతూ– ‘‘కృష్ణగారు హిట్సాధించిన ఎక్కువ సినిమాలు రైతు నేపథ్యంలో తెరకెక్కినవే. ఇప్పుడు మహేశ్ 25వ సినిమా రైతుల నేపథ్యంలో తెరకెక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా సంచలన విజయానికి కారణం మహేశ్‌బాబు, వంశీలే. మే 9న వైజయంతీ బ్యానర్లో విడుదలైన మూడు సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి గౌరవం తీసుకువచ్చినందుకు గర్వంగా ఉంది. ‘దిల్’ రాజును చూస్తే డి.రామానాయుడుగారు గుర్తుకువస్తారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నానంటే సీనియర్ ప్రొడ్యూర్స్ నుంచి నేను పొందిన ప్రేరణే కారణం. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో నేను మాట్లాడిన మాటలు నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఫస్ట్ వీక్‌లోనే మహేశ్‌గారి కెరీర్‌లోని రికార్డులను క్రాస్ చేయబోతున్నాం. ఈ సినిమా విజయం ఎంత పెద్దదో ఇప్పుడే చెప్పలేం’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మా అమ్మగారే. ‘మహర్షి’ సక్సెస్ క్రెడిట్లో 80శాతానికిపైగా మహేశ్‌గారికే చెందుతుంది. అశ్వనీదత్‌గారు, పీవీపీగారు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్‌గా నాకు జన్మనిచ్చిన ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్. ఇది మైండ్లకు చెప్పే సినిమా కాదు. మనసులకు చెప్పే సినిమా అని చెప్పాను. మనసుతో సినిమా చూసి ఇంత ఆనందాన్ని మాకు ఇస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారు పర్ఫెక్షన్కి నిదర్శనం. నేను సీరియస్ క్యారెక్టర్స్‌ను చేయగలనని నమ్మిన వంశీ, మహేశ్‌లకు థ్యాంక్స్. ఇవాళ మా నాన్న(దర్శక–నిర్మాత ఈవీవీ సత్యనారాయణ) ఉండి ఉంటే చాలా సంతోషంగా ఫీలయ్యేవారు. ఒక డైరెక్టర్‌గా ఆయన గర్వపడేవారు. ఎందుకంటే ఆయన డైరెక్టర్ కంటే ముందు రైతు. ఆ రైతుగా ఇంకా గర్వపడేవారు. హిట్ అన్న పదం విని నాలుగేళ్లు అయ్యింది. ‘మహర్షి’ సక్సెస్‌తో నాకు అనిపించింది... సక్సెస్‌కు కామాలే ఉంటాయి... ఫుల్‌స్టాప్‌లు ఉండవు’’ అన్నారు. ‘‘మహేశ్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ చిత్రం. కథకు తగ్గట్టు సినిమాను తీస్తాడు వంశీ. పెద్ద సినిమాను ఎంత ప్రేమించి తీస్తారో, చిన్న సినిమానూ అంతే ప్రేమించి తీస్తారు ‘దిల్’ రాజు. అశ్వనీదత్ వంటి సీనియర్ ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి అవసరం’’ అని పోసాని కృష్ణమురళి అన్నారు. ‘‘రైతుల గురించి చర్చించిన ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉండటం హ్యాపీ’’ అన్నారు పృధ్వీ. ‘‘నేను కర్నూలులో స్టేజ్ ఆర్టిస్టుని. షార్ట్స్ఫిల్మ్స్లో నటిస్తున్న నన్ను చూసి దర్శకుడు వంశీ నాకు మహేశ్‌బాబుతో కలిసి నటించే అవకాశం ఇచ్చారు’’ అని రైతు పాత్ర చేసిన గురుస్వామి అన్నారు. నటులు శ్రీనివాసరెడ్డి, కమల్ కామరాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గీత రచయిత శ్రీ మణి, వీఎఫ్ఎక్స్ నిపుణుడు యుగంధర్ మాట్లాడారు. -
నాగార్జున, అశ్వినీదత్‌లతో ప్రత్యేక ఇంటర్వూ
-
దేవదాస్ సెంటిమెంట్
ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించి ఇండస్ట్రీలో ఉన్నత స్థానంతో పాటుగా మంచి పేరు కూడా సంపాదించుకుంది అశ్వనీదత్ ‘వైజయంతీ మూవీస్’ సంస్థ. ఈ సంస్థ నుంచి వచ్చే సినిమాల పట్ల ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఉంటాయి. ఇక సెప్టెంబర్ నెల వైజయంతీ మూవీస్‌కు ఎంత ప్రత్యేకమైనదో చెప్పక్కర్లేదు. దాదాపు 24 ఏళ్ల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, ఆమని, రోజా నటించిన ‘శుభలగ్నం’ సెప్టెంబర్‌లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. అలాగే దాదాపు పదిహేడేళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అశ్వనీదత్ ఒక నిర్మాతగా తెరకెక్కిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలై, బంపర్ హిట్ సాధించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన రామ్‌చరణ్ పరిచయ చిత్రం ‘చిరుత’ కూడా సెప్టెంబర్ 28న రిలీజై బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. ఇప్పుడు ఈ ఏడాది సెప్టెంబర్ 27న వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’ రిలీజ్‌కు సిద్ధమైంది. నాగార్జున, నానీ హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. ఆకాంక్ష సింగ్, రష్మిక కథానాయికలు. సెప్టెంబర్ సెంటిమెంట్‌తో వస్తోన్న ‘దేవదాస్’ చిత్రం కూడా హిట్ అవుతుందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రిలీజైన మే 9నే ఈ ఏడాది ‘మహానటి’ విడుదలై బ్లాక్‌బస్టర్ అయ్యింది. సో.. సెంటిమెంట్‌గా ఆలోచిస్తే.. ‘దేవదాస్’ కూడా హిట్టే అని చిత్రబృందం చెబుతోంది. -
వారికి నిండు నూరేళ్లు ప్రసాదించాలి : మోహన్‌బాబు
మహానటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ముందుకు రావడమే కాదు... ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్లింది. సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. చిత్రబృంధానికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. చూసిన ప్రతి ఒక్కరూ... ‘మహానటి’ అద్వితీయ చిత్రమని అభివర్ణిస్తున్నారు. ఈ సినిమా ఓ క్లాసిక్‌లా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ‘మహానటి’ నటీనటులందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయే చిత్రిమిది. ఈ సినిమా తీసిన నిర్మాతల నమ్మకం నిజమైంది. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని మరొకసారి రుజువైంది. ఈ చిత్రంపై మోహన్‌బాబు స్పందిస్తూ... ‘అశ్వనిదత్ ఒక మంచి నిర్మాత. అతని కుమార్తెలిద్దరూ ధైర్యం చేసి డబ్బుకు వెనుకాడక సావిత్రి జీవితచరిత్రను సినిమాగా తీశారు. గొప్ప విజయాన్ని సాధించిందని విన్నాను. అటువంటి మంచి సినిమాలో నాకూ ఒక మంచి పాత్రనిచ్చి శభాష్ అనిపించుకునేలా చేశారు. ది క్రెడిట్ గోస్ టూ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఆ బిడ్డలు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైనందుకు ఆ భగవంతుడు వారికి నిండు నూరేళ్లు ప్రసాదించాలనీ, ఆయురారోగ్యాలతో ఉండాలని ఇటువంటి మంచి చిత్రాలు మరెన్నో తీయాలని ఆ బిడ్డలను ఆశ్వీరాదిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. అశ్వినిదత్ ఒక మంచి నిర్మాత. అతని కుమార్తెలిద్దరూ ధైర్యం చేసి డబ్బుకు వెనుకాడక 'సావిత్రి' గారి జీవిత చరిత్రని సినిమాగా తీశారు. గొప్ప విజయాన్ని సాధించిందని విన్నాను. అటువంటి మంచి సినిమాలో నాకూ ఒక మంచి పాత్రనిఛ్చి 'శభాష్' అనిపించుకునేలా చేసారు. #Mahanati (1/2) — Mohan Babu M (@themohanbabu) May 9, 2018 ది క్రెడిట్ గోస్ టూ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్.ఆ బిడ్డలు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైనందుకు ఆ భగవంతుడు వారికీ నిండు నూరేళ్ళు ప్రసాదించాలనీ... అయుఆరోగ్యాలతో ఉండాలని ఇటువంటి మంచి చిత్రాలు మరెన్నో తీయ్యాలని ఆ బిడ్డలనిద్దరిని ఆశీర్వదిస్తున్నాను. #Mahanati (2/2) — Mohan Babu M (@themohanbabu) May 9, 2018 -
మహేశ్ సినిమాతో ఎంట్రీ షురూ
ఒక్కొక్కరుగా టీమ్‌లో యాడ్ అవుతున్నారు. ఎవరి టీమ్‌లో అంటే.. మహేశ్‌బాబు టీమ్‌లో. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్ పతాకాలపై ‘దిల్’ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్, లొకేషన్స్ హంట్ కంప్లీట్ చేసిన చిత్రబృందం ఇప్పుడు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్గా కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసిన చిత్రబృందం, ఇప్పుడు లేటెస్ట్గా బాలీవుడ్ కెమెరామేన్ కేయు మోహనన్‌ను టీమ్‌లోకి తీసుకున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసింది. ‘డాన్, తలాష్, రాయీస్’ వంటి హిందీ చిత్రాలకు కెమెరామేన్‌గా వర్క్ చేశారు మోహనన్. తెలుగు సినిమాకి ఆయన వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ఏప్రిల్‌లో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. -
పిల్లల ముఖాలు చూడలేకపోయా
ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరి, గోవిందా గోవిందా... శ్రీదేవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఈ మూడు చిత్రాలకూ ప్రత్యేకమైన స్థానం ఉంది. వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ చిత్రాలను నిర్మించిన అశ్వినీదత్ ముంబై వెళ్లి, శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషీ ఎలా ఉన్నారు? అని అడిగిన ‘సాక్షి’తో ‘‘పిల్లల ముఖాలు చూడలేకపోయాను. ఆ కుటుంబం మొత్తం బాధలో ఉంది. శ్రీదేవి మరణం ఆ కుటుంబానికే కాదు.. అందరికీ పెద్ద షాక్’’ అన్నారు. శ్రీదేవి ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టేనా? ఎప్పుడైనా నిర్మాతలను ఇబ్బందిపెట్టారా? అని అడిగితే – ‘‘హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్. అందుకు ఉదాహరణగా ఒకే ఒక్క సంఘటన చెబుతాను. ‘గోవిందా గోవిందా’ షూటింగ్ తిరుపతిలో జరిగినప్పుడు ఒకరోజు తెల్లవారుజాము నాలుగు గంటలకు లోబీపీతో శ్రీదేవి పడిపోయింది. అప్పుడు పెదవి పగిలి, రక్తం వచ్చింది. నేను చాలా కంగారుపడి, వెంటనే మద్రాసులో మంచి హాస్పటల్‌కి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాను. కానీ షూటింగ్ డిస్ట్రబ్ అవుతుందని తిరుపతిలో ఓ లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని షూటింగ్ చేసింది. పెదవి వాపు కనపడనివ్వకుండా మేకప్‌తో మేనేజ్ చేసింది. చాలా డిగ్నిఫైడ్‌గా ఉండేది. ఎన్టీఆర్‌గారు ఎంత డిగ్నిఫైడ్‌గా ఉండేవారో శ్రీదేవి అలా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే తను ‘లేడీ ఎన్టీఆర్’. ఆమెలాంటి హీరోయిన్స్‌ని చూడలేం’’ అన్నారు. పారితోషికం విషయంలో పట్టూవిడుపుగా ఉండేవారా? డిమాండ్ చేసేవారా? అన్న ప్రశ్నకు – ‘‘అసలు ఆ విషయాలేవీ శ్రీదేవికి తెలియదు. అంతా వాళ్ల అమ్మగారే చూసుకునేవారు. చెప్పిన టైమ్‌కి షూటింగ్‌కి రావడం, ఇబ్బంది పెట్టకుండా నటించడం.. ఇదే శ్రీదేవికి తెలుసు. ఆ క్రమశిక్షణే తనను పెద్ద స్థాయికి తీసుకెళ్లింది. ఎంత పెద్ద రేంజ్‌కి వెళ్లినా ఒదిగి ఉన్న హీరోయిన్. హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాక అక్కడ బిజీగా ఉన్నా నేను అడగ్గానే కాదనకుండా ‘ఆఖరి పోరాటం’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలు చేసింది. ఆ రెండూ మా వైజయంతీ మూవీస్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యాయి. ఆ తర్వాత చేసిన ‘గోవిందా గోవిందా’ కూడా సూపర్ హిట్’’ అన్నారు. -
మల్టీస్టారర్ స్టార్ట్
నాగార్జున, నాని హీరోలుగా వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ మల్టీస్టారర్ మూవీ శనివారం హీరో నాని పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమైంది. సాంగ్స్ రికార్డింగ్‌తో స్టార్ట్ చేశారు. నాగ్‌కి ఈ బేనర్లో సినిమా చేయడం కొత్త కాదు. ఆఖరి పోరాటం, ఆజాద్, రావోయి చందమామ వంటి సినిమాలు చేశారు. నానీకి మాత్రం ఈ బేనర్లో ఫస్ట్ మూవీ. చిత్రనిర్మాత సి.అశ్వనిదత్ మాట్లాడుతూ– ‘‘నాగార్జున, నాని కాంబినేషన్లో ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో ఎంటర్టైన్మెంట్ అంశాలు కొదవ లేకుండా నిర్మిస్తున్నాం. మా బ్యానర్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ సంగీత సారథ్యంలో పాటల రికార్డింగ్ ప్రారంభించాం. మార్చిలో షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. ‘‘వైజయంతి మూవీస్ వంటి పెద్ద బ్యానర్లో నాగార్జున, నాని కాంబినేషన్లో మూవీని డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఇది దర్శకుడిగా నాకు ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ దత్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్ డి. -
చిరుత... పదేళ్ల తర్వాత!?
రేపటికి సరిగ్గా పదేళ్లు... ‘చిరుత’తో రామ్‌చరణ్ హీరోగా పరిచయమై! ఈ పదేళ్లలో తొలి సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో గానీ, నిర్మాత సి. అశ్వనీదత్‌తో గానీ చరణ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఒక్కోసారి అంతే! కాంబినేషన్ సెట్ కావడానికి ఎందుకో లేటవుతుంటుంది! ఈసారి అశ్వనీదత్, చరణ్, పూరీలు లేట్ చేయకుండా కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్. రీసెంట్గా రామ్‌చరణ్‌ను కలసిన పూరి ఓ కథను వినిపించారట. చరణ్ కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ చిరుత కాంబినేషన్ సినిమా పట్టాలు ఎక్కుతుంది. వైజయంతి మూవీస్ పతకాంపై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించనున్నారట. ప్రస్తుతం చరణ్ ‘రంగస్థలం’ చేస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేస్తారు. ప్రస్తుతం తనయుడు ఆకాశ్ హీరోగా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు పూరి జగన్నాథ్. ఈ మూడు సినిమాలు పూరై్తన తర్వాత చరణ్, పూరిల సినిమా ప్రారంభమవుతుందట!! -
'భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను'
మహేష్‌బాబుతో చిత్ర నిర్మాణం ఆ సంస్థ అధినేత అశ్వనీదత్ కొత్తపేట : తెలుగులో ప్రముఖ దర్శకులు, హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల్ని నిర్మించిన వైజయంతీ మూవీస్ కొన్నేళ్ల విరామం తరువాత తిరిగి చిత్ర నిర్మాణాన్ని చేపడుతున్నట్టు ఆ సంస్థ అధినేత సి.అశ్వనీదత్ తెలిపారు. ఆయన శనివారం సతీసమేతంగా మందపల్లి మందేశ్వర (శనేశ్వర) స్వామివార్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాలం కలిసి రాక చిత్ర నిర్మాణంలో విరామం ఏర్పడిందని, ఈ ఏడాది నుంచి వరుసగా చిత్రనిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరో గా త్వరలో చిత్ర నిర్మాణం ప్రారంభించి వచ్చే ఏడాది మేలో విడుదలకు ప్లాన్ చేశామని, ఈ ఏడాది ద్వితీయార్థంలోనే రామ్‌చరణ్ హీరోగా చిత్రనిర్మాణం ప్రారంభిస్తామని, ఆ చిత్రానికి దర్శకుడిని నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. తన అభిమాన హీరోలు సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి అని చెప్పారు. చిరంజీవితో తీసిన ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ ఎక్కువ పేరు తెచ్చిందన్నారు. చిరంజీవి 151 లేదా 152 చిత్రాన్ని తానే నిర్మిస్తానన్నారు. తన కుమార్తె ప్రియాంకదత్ స్వప్నా బ్యానర్ స్థాపించి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని నిర్మించిందని, ఆ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితకథతో చిత్రాన్ని నిర్మించనుందని చెప్పారు. మహానటుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీలోకి వచ్చిన తాను అదే పార్టీలో కొనసాగుతున్నానన్నారు. ఒక్కసారి టీడీపీ తరఫున ఎన్నిక ల్లో పోటీ చేసినా ప్రస్తుతం ఆ ఆలోచన లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని అన్నారు.