
ప్రభాస్, అశ్వనీదత్, నాగ్ అశ్విన్
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 50వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా బుధవారం స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేశారు. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ తెరకెక్కించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా ఉంటుందని ప్రకటన విడుదల చేశారు. తండ్రి అశ్వనీదత్‌తో కలసి స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రభాస్‌గారికి థ్యాంక్స్. ప్రస్తుతానికి సినిమా గురించి ఏం చెప్పదల్చుకోలేదు. ఇది ప్యాన్ ఇండియన్ సినిమా కాదు.. ప్యాన్ వరల్డ్ సినిమా’’ అన్నారు నాగ్ అశ్విన్.