vyjayanthi movies
-
క్రికెట్ బెట్టింగ్‌లో ఒకరి అరెస్ట్.. స్పందించిన వైజయంతి మూవీస్
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ నిలేశ్ చోప్రా అనే వ్యక్తి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు పట్టుపడ్డాడు. అయితే, తాను వైజయంతీ మూవీస్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు నిలేశ్ చోప్రా చెప్పారని వార్తలు రావడంతో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో తాజాగా వైజయంతీ మూవీస్ ఎక్స్ పేజీ ద్వారా స్పందించింది. నిలేశ్ చోప్రా ఎవరో తమకు తెలియదని , అలాంటి పేరుతో ఉన్న వ్యక్తి తమ వద్ద ఎప్పుడు కూడా పనిచేయలేదని పేర్కొంది.'ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నందుకు నీలేష్ చోప్రా అనే వ్యక్తిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. అలా చెప్పబడుతున్న వ్యక్తి వైజయంతి మూవీస్ ఆఫీస్‌లో ఎప్పుడూ పని చేయలేదు. అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం గురించి ఎస్ఆర్ నగర్ సంబంధిత పోలీసు అధికారులతో మేము ఇప్పటికే మాట్లాడాం. వాస్తవాలను వారికి వివరించాం. ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు తమను సంప్రదించి వాస్తవాలను ధృవీకరించవలసిందిగా మీడియాను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము' అని పేర్కొంది.It has come to our notice that a person named Nilesh Chopra had been arrested by SR Nagar Police for online gambling.THE SAID INDIVIDUAL HAS NEVER WORKED WITH US AT VYJAYANTHI MOVIES OFFICE AND WE ARE UNAWARE OF ANY ASSOCIATION WITH HIM IN ANY OTHER FORM.We have formally…— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 6, 2025 -
కల్కి ఖాతాలో మరో మైలురాయి.. ఆ మార్కును దాటేసింది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఓవర్సీస్లోనూ అత్యధిక వసూళ్లతో సత్తా చాటింది. విడుదలైన రెండువారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త మైలురాయిని అధిగమించింది.తాజాగా కల్కి మూవీ మరో రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోపే రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ మేరకు ఎపిక్ మహా బ్లాక్‌బస్టర్ అంటూ కల్కి పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సైతం అతిథి పాత్రల్లో మెరిశారు. 𝐀 𝐫𝐞𝐬𝐨𝐮𝐧𝐝𝐢𝐧𝐠 𝐩𝐡𝐞𝐧𝐨𝐦𝐞𝐧𝐨𝐧 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐛𝐨𝐱 𝐨𝐟𝐟𝐢𝐜𝐞...❤️🔥1100 CRORES and counting… #Kalki2898AD continues its epic run into the 5th week! @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms… pic.twitter.com/WQOeT9a3Zf— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 25, 2024 -
ఇంద్ర మళ్లీ వస్తున్నాడు
చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఇంద్ర’ (2002). ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. బి. గోపాల్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఇంద్ర సేనారెడ్డి అలియాస్ శంకర్ నారాయణ పాత్రలో చిరంజీవి నటించారు. ఈ సినిమా రీ–రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. వైజయంతీ మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్‌ని సెలబ్రేట్ చేస్తూ, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘ఇంద్ర’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తోంది. -
మెగాస్టార్ బర్త్ డే.. రీ రిలీజవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ!
టాలీవుడ్లో కొంతకాలంగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్ అయినా చాలా చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేశాయి. ఇటీవల హీరోల బర్త్ డే రోజున బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ సైతం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన ఇంద్ర మూవీని మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను పంచుకుంది.కాగా..2002లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే మెగాస్టార్ సరసన హీరోయిన్లుగా నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించారు. కాగా.. ఆగస్టు 22న వైజయంతి మూవీస్ స్థాపించి 50 ఏళ్ల పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే 50 స్వర్ణోత్సవాల వేడుకతో పాటు చిరంజీవి బర్త్ డే కావడంతో ఇంద్ర సినిమాను మరోసారి టాలీవుడ్ ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.22 glorious years of MEGA BLOCKBUSTER #Indra, a film that etched its mark on cinema and our hearts forever ❤️In celebration of 50 GOLDEN YEARS OF VYJAYANTHI MOVIES, let’s relive the magic with a 𝐆𝐫𝐚𝐧𝐝 𝐑𝐞-𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐨𝐧 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝟐, in honour of Megastar… pic.twitter.com/jF3eSXrUX7— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2024 -
రికార్డులు క్రియేట్ చేసే వాళ్లు పరుగులు పెట్టరు: స్వప్న దత్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం తాజాగా విడుదలైంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కల్కి నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ తాజాగా స్పందించారు. 'కల్కి సినిమా విడుదల తర్వాత చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. ఇతర సినిమాలకు చెందిన రికార్డులను 'కల్కి' క్రాస్ చేసిందా..? అని కొందరు అభిమానులు అడుగుతున్నారు. ఈ ప్రశ్న నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన వారెవ్వరూ మళ్లీ వాటికోసమే పరుగులు పెట్టి సినిమాలు చేయరు. కల్కి చిత్రాన్ని ప్రేక్షకుల కోసం తీశాం. ఇలాంటి ప్రశ్నలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి.' అని స్వప్నదత్ అన్నారు.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన వంటి స్టార్స్ నటించారు. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా విడుదలైన కల్కి సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ప్రభాస్, వైజయంతి మూవీస్ బ్యానర్లో కల్కి చిత్రం కూడా ఎవర్‌గ్రీన్‌గా ఉండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. -
ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?
డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు చేదు వార్త. అదేంటి త్వరలో 'కల్కి' రిలీజ్ కానుంది. ఈ టైంలో బ్యాడ్ న్యూస్ ఏంటా అని మీరు అనుకోవచ్చు. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరి ప్రమోషన్స్ చేస్తున్నారు. అలా ఓ విషయమై ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నారా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)సాధారణంగా చిన్నా పెద్దా సినిమాల విడుదల ముందు ఎవరికి తగ్గట్లు వాళ్లు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది చేస్తారు. కానీ ఇప్పుడు 'కల్కి' నిర్మాతలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించట్లేదని, ఇలాంటి ఈవెంట్ ఏం ఉండట్లేదని సమాచారం. శుక్రవారం సాయంత్రం కూడా యూట్యూబ్‌లో మరో కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీనిబట్టి కూడా ఈవెంట్ ఏం నిర్వహించరని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసినట్లే.'కల్కి'కి అసలు ప్రమోషన్స్ చేయట్లేదని ఓ వైపు అభిమానులు బాధ పడుతున్నప్పటికీ.. చిత్రబృందం మాత్రం షార్ట్ అండ్ స్వీట్ అన్నట్లు బుజ్జి, ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. ఇలా సింపుల్‌గా చేసేస్తున్నారు. చూడాలి మరి 'కల్కి' నిర్మాతలు ఏం ప్లాన్ చేస్తున్నారో?(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!) -
Kalki 2898 AD Bujji Event Photos: అట్టహాసంగా ‘కల్కి 2898 ఏడీ’ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ చూశారా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ను మేకర్స్ రివీల్ చేయనున్నారు.ఈ సినిమాలోని బుజ్జి పేరుతో ఉన్న కారును ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ఈవెంట్లో బుజ్జి లుక్‌ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Darlings... In life, you meet people for the first time only once. World, meet #Bujji...- https://t.co/8XhJordNtn#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal… pic.twitter.com/SvwwuXpzBa— Kalki 2898 AD (@Kalki2898AD) May 22, 2024 -
'కల్కి' ప్రభాస్ పాత్ర గురించి స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో 'కల్కి 2898 ఎ.డి' చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని కూడా ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మహా శివరాత్రి కానుకగా ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ... ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరు 'భైరవ' అని పేర్కొని, ఆయన లేటెస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 'భైరవ' పాత్ర గురించి నిర్మాత స్వప్న దత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన ‘సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్’ వేదికపై కల్కి చిత్రం గురించి ఆమె ఇలా మాట్లాడారు. 'ప్రభాస్ పోషిస్తున్న 'భైరవ' పాత్ర చాలా సంవత్సరాల పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది' అంటూ స్వప్న పేర్కొన్నారు. అందుకు సంబంధిత విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రొడ్యూసర్ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కల్కి సినిమా కథ గురించి గతంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఇలా వ్యాఖ్యానించారు. 'మహాభారతంతో కథ మొదలై.. క్రీస్తుశకం 2898లో ముగుస్తుంది. కల్కి కథ మొత్తం ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా సినిమా విలువలు ఉంటాయి. గతం, భవిష్యత్తు ప్రపంచాలను క్రియేట్ చేయడంలో భారతీయతని ప్రతిబింబించేలా ఉంటాయి. అందరూ అనుకున్నట్లు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'బ్లేడ్ రన్నర్' చిత్రంతో కల్కికి పోలికలు ఉండవు. అని అశ్విన్ తెలిపాడు. మే 9న విడుదల కానున్న కల్కి సినిమా ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. Bhairava is gonna stay in hearts for a very long time -#Prabhas 💥🫶 pic.twitter.com/w00j7uF7JL — Ace in Frame-Prabhas (@pubzudarlingye) March 22, 2024 -
ప్రభాస్ 'కల్కి' సినిమా వాయిదా..?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో 'కల్కి 2898 ఎ.డి' చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని కూడా ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ కల్కి సినిమా వారు ప్రకటించిన సమయానికి విడుదల కాకపోవచ్చని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి. మే 7న కూడా 12 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న కల్కి చిత్రానికి ఎన్నికలు అడ్డుపడే అవకాశం ఉంది. దీంతో మే 9న విడుదల కానున్న కల్కి సినిమా దాదాపు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ మార్కెట్ ఎక్కువ.. అలాంటిది ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల ముందు కల్కి సినిమాను విడుదల చేస్తే పలు ఇబ్బందులు ఎదురు కావచ్చు. అంతే కాకుండా రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఉండటం వల్ల రాత్రి సమయాల్లో గుంపులుగా తిరిగేందుకు ఆవకాశం ఉండదు. దీంతో సినిమాకు వెళ్లే వారికి అనేక అడ్డంకులు ఎదురుకావచ్చు. దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికలు కాబట్టి ప్రతి రాష్ట్రంలో కల్కి చిత్రానికి కలెక్షన్స్ విషయంలో పలు ఇబ్బందులు రావచ్చని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. కల్కి కలెక్షన్స్‌పై కూడా భారీగా ఎన్నికల ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మే 9న కల్కి చిత్రం విడుదల కావడం దాదాపు కష్టమేనని సమాచారం. కల్కి వాయిదా విషయంలో అధికారికంగా వైజయంతీ మూవీస్ వారి నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మే 9వ తేదీతో వైజయంతీ మూవీస్‌కీ ఎంతో అనుబంధం ఉంది. ఈ సంస్థ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి చిత్రాలు మే 9నే విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. దీంతో కల్కి 2898 AD చిత్రాన్ని కూడా అదే రోజునే విడుదల చేస్తామని వైజయంతీ మూవీస్ గతంలో ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పఠానీ కీలక పాత్రలు పోషించారు. -
చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా.. ఇప్పుడు కొత్త గొడవ?
'కల్కి' నిర్మాతలు మరోసారి సీరియస్ అయ్యారు. డార్లింగ్ ప్రభాస్ సినిమా విషయంలో నోటీసు ఇచ్చి ఇరవై రోజులు కూడా కాలేదు. ఇప్పుడు మరో మూవీ విషయంలో లీగల్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది కూడా అప్పుడెప్పుడో 1990లో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' కోసం. ఇలా సడన్‌గా సోషల్ మీడియాలో చిరు క్లాసిక్ హిట్ సినిమాపై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ అసలేంటి గొడవ? ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?) అసలు ఏమైంది? టాలీవుడ్లో వైజయంతీ మూవీస్ ప్రముఖ నిర్మాణ సంస్థ. నిర్మాత అశ్వనీదత్ అప్పట్లో సినిమాలు తీశారు. కానీ ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు మూవీస్ తీయలేకపోయారు. నిర్మాణం ఆపేశారు. దీంతో ఆయన కూతుళ్లు నిర్మాతలుగా మారారు. 'మహానటి', 'సీతారామం' లాంటి హిట్ సినిమాలతో మళ్లీ లైన్లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ పెట్టి 'కల్కి' అనే పాన్ ఇండియా చిత్రాన్ని తీస్తున్నారు. కొన్నాళ్ల ముందు 'కల్కి' నుంచి ఓ ఫొటో లీక్ కావడం, అది సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యేసరికి నిర్మాతలు సీరియస్ అయ్యారు. ఎవరైనా సరే దాన్ని షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సెప్టెంబరు 21న ఈ నోటీసు విషయమై ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇది జరిగి 20 రోజులు కూడా కాలేదు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా కాపీరైట్స్ విషయమై ప్రకటనతో పాటు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. (ఇదీ చదవండి: ఆ వార్తల వల్ల చాలా బాధపడ్డాను: మెగాస్టార్ చిరంజీవి) ఆ సినిమాపై పరోక్షంగా? ఈ పోస్ట్ ప్రకారం.. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలోని స్టోరీ, కాన్సెప్ట్, పాత్రలు ఇలా దేన్ని కూడా తమ ప్రమేయం లేకుండా ఉపయోగించడానికి వీల్లేదని.. ఒకవేళ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకటనతో పాటు ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇలా సడన్‌గా ఎందుకు సీరియస్ అయ్యారా అనేది చాలామందికి అర్థం కాలేదు. అయితే చిరు 157వ సినిమాని ఉద్దేశిస్తూనే పరోక్షంగానే ఈ నోటీస్ ఇచ్చారా అనేది డౌట్ కొందరికి వస్తోంది. ఎందుకంటే 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ్ దర్శకత్వంలో చిరు చేస్తున్న ఈ సినిమాకు 'ముల్లోకవీరుడు' అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ మూవీ కాన్సెప్ట్.. హీరో, వేరే లోకానికి వెళ్లడం అక్కడ దేవకన్యలని కలవడం ఇలానే ఉండబోతుందని అంటున్నారు. చూస్తుంటే 'జగదేకవీరుడు అతిలోక సుందరి'తో పోలికలు కనిపిస్తున్నాయి కదా! అందుకే 'వైజయంతీ' సంస్థ ఎవరు కాపీ కొడుతున్నారు? లేదా కొట్టాలని ట్రై చేస్తున్నారనేది పేరు చెప్పకుండా నోటీసు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!
సినిమా హిట్ అవుతుందా లేదా అనేది పక్కనబెడితే చాలా ఏళ్ల నుంచి నిర్మాతలు, ఇండస్ట్రీని వేధిస్తున్న సమస్య ఒకటుంది. అదే పైరసీ. షూటింగ్ జరుగుతున్నప్పుడు కావొచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ టైంలో కావొచ్చు. చాలా మూవీస్ ఈ సమస్య బారిన పడుతున్నాయి. లేదంటే ఫొటోలు లీకవుతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ 'కల్కి' నుంచి పిక్ ఒకటి బయటకొచ్చింది. దీనిపై నిర్మాతలు.. అవతలి వాళ్ల గుండె ఆగిపోయే నిర్ణయం తీసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్, కల్కి లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో 'సలార్' ఈ ఏడాది రానుండగా, 'కల్కి' అలియాస్ ప్రాజెక్ k.. వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. కొన్నాళ్ల క్రితం ఓ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్లో టీమ్ అంతా బిజీగా ఉన్నారు. అయితే సినిమాలోని కీలకమైన సీన్లో ప్రభాస్ పిక్ ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపించింది. (ఇదీ చదవండి: ‘గేమ్ ఛేంజర్’ ఆడియో లీక్‌పై దిల్ రాజు ఫైర్.. పోలీసులకు ఫిర్యాదు) అయితే 'కల్కి' మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్న కంపెనీ నుంచే ఈ లీక్ జరిగినట్లు తేలింది. దీనికి కారణమైన వ్యక్తిని సదరు కంపెనీ.. వెంటనే తొలగించింది. కానీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అస్సలు ఊరుకోలేదు. లీక్ చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టారని, సదరు కంపెనీపై పరువు నష్టం దావా వేశారని తెలుస్తోంది. అయితే ఈ రేంజులో సీరియస్ అవుతుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే గతంలోనూ తెలుగులో పలు సినిమాలు ఇలా లీకుల బారిన పడ్డాయి. కానీ వైజయంతీ నిర్మాతలు తీసుకున్నారని వినిపిస్తున్న ఇలాంటి డెసిషన్ అయితే ఇప్పటివరకు ఎవరూ తీసుకోలేదని చెప్పొచ్చు. మరి ఈ విషయంలో నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడాలి. (ఇదీ చదవండి: 'చంద్రముఖి 2' దర్శకుడి బర్త్ డే.. గిఫ్ట్‌గా ల్యాప్‌ట్యాప్స్) -
రోషన్ చేతిలో రెండు పాన్ ఇండియా చిత్రాలు
‘నిర్మలా కాన్వెంట్’ (2016)లో లీడ్ రోల్ చేసి, ‘పెళ్లి సందడి’ (2021)తో హీరోగా మంచి మార్కులు తెచ్చుకున్నారు నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో హీరోగా సినిమాలు సైన్ చేశారు. రోషన్ ఒకేసారి రెండు పాన్ ఇండియా చిత్రాలు అంగీకరించడం విశేషం. కన్నడ దర్శకుడు నందకిశోర్ దర్శకత్వంలో రోషన్–మోహన్‌లాల్ కాంబినేషన్లో రూపొందనున్న పాన్ ఇండియా చిత్రం షూటింగ్ ఈ నెలాఖరులో ఆరంభం కానుంది. తండ్రీ–కొడుకుల అనుబంధం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందనుంది. రోషన్ నటించనున్న మరో పాన్ ఇండియా చిత్రం వైజయంతీ మూవీస్–స్వప్నా సినిమా బేనర్లపై రూపొందనుంది. నూతన దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. -
ప్రాజెక్ట్- కే యూనిట్‌పై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్- కే'పై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. అశ్వీనీదత్ వైజయంతి మూవీస్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 20న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో 'ప్రాజెక్ట్ కే' టైటిల్‌ను రివీల్ చేస్తామని కూడా ప్రకటించారు. (ఇదీ చదవండి: ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోండి కానీ...: ఎంఎస్ ధోని) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'ప్రాజెక్ట్ కే' అంటే ఏమిటి? అంటూ మేకర్స్ ప్రకటన జారీ చేశారు. అందులో భాగంగా ఫ్రీగా టీ షర్ట్స్ ఇస్తున్నామంటూ ప్రచారం కూడా చేశారు. టీ షర్ట్స్ కోసం వైజయంతీ మూవీస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో లింక్‌ను కూడా ఉంచారు. కానీ ఈ విషయంపై అశ్వీనీదత్ వైజయంతి మూవీస్ చేస్తుంది పెద్ద చీటింగ్ అని సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందుకు సంబంధించి నెట్టింట కామెంట్లు కూడా చేస్తున్నారు. టీ షర్ట్స్ అందుబాటులో ఉంచుతున్నామని ఇప్పటికే మూడు సార్లు లింక్ ఓపెన్ చేసినా ఎలాంటి ఉపయోగం లేదని వారు తెలుపుతున్నారు. జులై 10న కూడా సాయంత్రం 7:11 నిమిషాలకు లింక్ ఓపెన్ చేశారు. సెకన్ల వ్యవధిలోనే లింక్ ఓపెన్ చేస్తే సర్వర్ ఎర్రర్ అని చూపిస్తుందని ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నో గంటల పాటు వేచి ఉన్నటువంటి ఫ్యాన్స్‌కు మూడోసారి కూడా నిరాశే ఎదురైందని తెలుపుతున్నారు. జస్ట్ 4 నిమిషాల తర్వాత స్టాక్ అయిపోయిందని ప్రకటించారు. లింకే ఓపెన్ కాలేదు, స్టాక్ అయిపొవడం ఏంటని ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఫ్యాన్స్‌తో గేమ్స్ ఆడుతున్నారా..? ఇది పెద్ద స్కామ్, చీటింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా వారు సీరియస్ అవుతున్నారు. (ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?) అంతేకాకుండా ఇప్పటి వరకు టీ షర్ట్స్ అందినట్లు ఎవరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా చేయలేదు. దీంతో వీళ్లు నిజంగానే టీ షర్ట్స్ ఇస్తున్నారా? అనే సందేహాలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. మెజారిటీ ఫ్యాన్స్‌కే దక్కలేదు... ఇక సాధారణమైన వాళ్లకు ఏం దక్కింటాయని వారు అంటున్నారు. ఇది కేవలం ప్రమోషనల్ ట్రిక్ అంటూ.. కనీసం వందల్లో కూడా టీ షర్ట్స్ ఇచ్చి ఉండరని ఫ్యాన్స్ వాపోతున్నారు. Thank you for the BLASTing response for 'The Rise' 💥💥💥 After multiple Krashes all stock claimed in 4 minutes.#ProjectK #WhatisProjectK pic.twitter.com/QBPg4JpE6v — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 10, 2023 -
ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ కే' ప్రమోషన్స్ జోష్ పెంచింది. ఇప్పటికే జులై 20న కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించనున్న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో ‘ప్రాజెక్ట్ కె’ సినిమా టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని లాంచ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (ఇదీ చదవండి: నయనతార ఆస్తుల వివరాలపై మళ్లీ చర్చ) తాజాగా 'ప్రాజెక్ట్ కే' అంటే ఏమిటి..? అని రాసి ఉన్న ఓ టీషర్ట్‌ని అందుబాటులో ఉంచారు. అయితే.. దీన్ని సొంతం చేసుకోవాలంటే మాత్రం అంత సులువు కాదు. డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ అలా ఉంటుంది. కాబట్టి టీ షర్ట్ కావాలనుకునే వారు చాలా వేగంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వైజయంతి ట్విటర్ అకౌంట్ నుంచి లింక్‌ను షేర్ చేశారు. దీనిని ఇప్పటికే ప్రాజెక్ట్ -కే టీమ్ కూడా ప్రమోట్ చేస్తుంది. (ఇదీ చదవండి: గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్) ఇలా బుక్ చేసుకోండి వారు షేర్ చేసిన లింక్‌ని క్లిక్ చేసి.. ఆపై ఓపెన్ అయిన విండో 'పసుపు రంగులో' ఉంటే కంటిన్యూ బటన్ని కానీ వైజయంతి మూవీస్ లోగోనైనా నొక్కాలి. దాన్ని నొక్కగానే.. మీ పేరుతో పాటు ఈమెయిల్ని పొందుపరచాలి. అంతే సింపుల్ మీకు కావాల్సిన సైజ్‌లో టీషర్ట్‌ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా వస్తుంది. ఈ విధంగా ప్రాజెక్ట్ కే టీషర్ట్‌ని ఏవరైనా సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే మొదటి డ్రాప్ పేరుతో లింక్ విడుదల చేశారు. మరోసారి నేడు కూడా విడుదల చేయనున్నట్లు ట్విటర్లో సినిమా యూనిట్ తెలిపింది. Brace yourselves, First Drop 'The Force' is getting ready for dispatch. Get ready for the next drop. Stay Tuned🔗 https://t.co/0rC0ez8o2N#ProjectK #WhatisProjectK pic.twitter.com/4Ni9hT0YVJ — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 8, 2023 -
వైజయంతీ మూవీస్‌తో శ్రీకాంత్ కొడుకు నెక్ట్స్ మూవీ.. త్వరలోనే ప్రారంభం
‘నిర్మలా కాన్వెంట్’(2016), ‘పెళ్లిసందడి’ (2021) చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోషన్. ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటున్నారు. అయితే రోషన్ నెక్ట్స్ మూవీ వైజయంతీ మూవీస్‌లో చేస్తున్నాడు. అలాగే వేదాన్షన్ పిక్చర్స్ పతాకంపై కూడా మరో చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ సినిమాల దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణల పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. తన తదుపరి సినిమాలు ప్రఖ్యాత నిర్మాణ సంస్థలలో రాబోతున్నాయి అని యువ నటుడు రోషన్ చాలా ఉత్సాహంగా వెల్లడించారు. -
ప్రాజెక్ట్- కె సెట్స్‌లో ప్రభాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. తాజాగా ఆదివారం ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ప్రాజెక్ట్ కె సెట్లో ప్రభాస్ బర్త్‌డే వేడుకలు జరిగాయి. సెట్లో భారీగా టపాసులు పేల్చుతూ మూవీ టీం డార్లింగ్‌కు బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ ట్విటర్ వేదికగా పంచుకుంది. From the Sets of #ProjectK, Wishing the one and only darling #Prabhas a very Happy Birthday ❤️💫@nagashwin7 @SrBachchan @deepikapadukone @AshwiniDuttCh @VyjayanthiFilms #HappyBirthdayPrabhas pic.twitter.com/GJY9ClRUHu — Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 22, 2022 -
జోడీ రిపీట్?
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అలా ఈ చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి అరంగేట్రం లభించింది. ‘సీతారామం’ను నిర్మించిన వైజయంతీ మూవీస్‌లోనే మృణాల్ మరో సినిమా సైన్ చేశారట. ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుల్లో హను రాఘవపూడి, నందినీ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరో పాత్రకు దుల్కర్ సల్మాన్ పేరు పరిశీలనలో ఉందట. ఒకవేళ ఈ సినిమాలో హీరోగా దుల్కర్ సల్మాన్ ఫిక్స్ అయితే ‘సీతారామం’ జోడీ రిపీటైనట్లే. మరి.. దుల్కర్, మృణాల్ మళ్లీ జోడీ కడతారా? వేచి చూడాల్సిందే. -
అందుకే నిత్యామీనన్‌ను వద్దనుకున్నారా? రివీల్ చేసిన నిర్మాత
దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ను తీసుకొచ్చింది. ఓవర్ నైట్ స్టార్డమ్తో కీర్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిందీ సినిమా. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డు కూడా దక్కింది. అయితే ఈ ప్రాజెక్ట్ కీర్తి సురేష్‌కి ముందు వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా వైజయంతీ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ వెల్లడించారు. ఓ ప్రముఖ షోలో పాల్గొన్న ఆయన మహానటి ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సినిమాకు కీర్తికి ముందు ఓ మలయాళ నటిని అనుకున్నాం. కానీ కథ చెప్పాక అందులో మద్యం తాగే సన్నివేశాలు ఉంటే నేను చేయను అంటూ కండిషన్స్ పెట్టింది. దీంతో ఆమెను తీసుకోవడానికి వీల్లేదు అని నేనే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు చెప్పాను. కట్ చేస్తే కీర్తి సురేష్ చేతుల్లోకి ఈ సినిమా వెళ్లింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్ పేరు చెప్పడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు.అయితే మహానటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే మలయాళ హీరోయిన్ నిత్యామీనన్ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాకుండా సావిత్రి పాత్రలో ఆమె ఫోటోలు కూడా కొన్ని బయటికొచ్చాయి. ఏది ఏమైనా నిత్యామీనన్ ఓ మంచి సినిమాను దూరం చేసుకుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో ‘సీతారామం’ టీం సందడి (ఫొటోలు)
-
ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ ప్రముఖులు.. అమితాబ్ ఆసక్తికర పోస్ట్
Amitabh Bachchan Meets Stalwarts Of Cinema Prabhas Nani Nag Ashwin: మన ఫేవరేట్ హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో ఉంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ఒక చిత్ర పరిశ్రమకు చెందిన మల్టీస్టారర్స్ కాకుండా వివిధ సినీ ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీస్ ఒకే చోట దర్శనమిస్తే. కన్నులకు ఆహా అనిపిస్తుంది. అలాంటి సంఘటన చోటుచేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చి అభిమానులకు కనులవిందు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలను రూపొందించింది వైజయంతీ మూవీస్. ఈ సంస్థ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ వేడుకలో అతిరథ సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ప్రభాస్, నాని, దుల్కర్ సల్మాన్, కె రాఘవేంద్ర రావు, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరందరు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా వీరందరూ కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తూ బిగ్ బీ అమితాబ్ తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నారు. వీరంతా కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ 'సినీ ప్రముఖులతో ఒక సాయంత్రం. సినిమా విశేషాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది' అంటూ రాసుకొచ్చారు. అలాగే ఈ వేడుకకు సంబంధించిన అనుభూతి గురించి ఆయన బ్లాగ్‌లో తెలిపారు. కాగా వైరలైన ఈ ఫొటోను నెటిజన్లు 'పాన్ ఇండియా పిక్'గా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) ఇదిలా ఉంటే వైజయంతీ మూవీస్ బ్యానర్లోనే ప్రాజెక్ట్ కె తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. నాని ఇదే బ్యానర్లో వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాల్లో నటించాడు. 'మహానటి' సినిమాతో విజయం అందుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం 'సీతరామం' చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఈ సంస్థలో వచ్చిన ఎన్నో హిట్ సినిమాలకు డైరెక్షన్ చేశారు. -
'ప్రాజెక్ట్ కె'లో బాలీవుడ్ హీరోయిన్, వైరల్ అవుతున్న పోస్ట్!
బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్‌కు ఈ మధ్య ఏదీ కలిసిరావడం లేదు. బాహుబలి రెండు భాగాల తర్వాత చేసిన సాహో హిందీలో బాగా ఆడినప్పటికీ తెలుగులో మాత్రం అంతంతమాత్రంగానే కలెక్షన్లు వసూలు చేసింది. ఆ తర్వాత భారీ బడ్జెట్‌తో చేసిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె మీదనే పెట్టుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కెలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె మూవీలోకి మరో హీరోయిన్ను తీసుకున్నారు. బాలీవుడ్ భామ దిశా పటానీకి వెల్కమ్ చెప్తూ ఆమెకు పుష్పగుచ్చాన్ని పంపారు. దీంతో సర్ప్రైజ్ అయిన దిశాపటానీ బొకే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. కాగా పాన్ ఇండియాగా తెరెక్కుతున ప్రాజెక్ట్ కె తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి తోట రమణి ఓ ఆర్ట్ డైరెక్టర్. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. చదవండి: ‘శివకార్తికేయన్ చేసిన ఒక్క ఫోన్‌కాల్ నా జీవితాన్నే మార్చేసింది’ యాంకర్ లాస్య నోట ర్యాప్ సాంగ్, అట్లుంటది ఆమెతోని! -
రష్మిక అసలు హీరోయినే కాదు : డైరెక్టర్ కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలె ఈ ముద్దుగుమ్మ 'సీతారామం' అనే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో రష్మిక అఫ్రీన్ అనే కశ్మీరీ ముస్లీం అమ్మాయి పాత్రలో నటిస్తుండటంతో ఇక హీరోయిన్ రష్మికే అన్న కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఇదే అంశంపై డైరెక్టర్ హను క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ కాదు.. హీరో అనే చెప్పాలి అంటూ కామెంట్స్ చేశారు. పాత్రకు తగ్గట్లు రష్మిక ఎంతో కష్టపడిందని, ఆమె నటన చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
మీలో ఆ టాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో ఛాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవలె రాధేశ్యామ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ చేతిలో ఇప్పుడు వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ఆది పురుష్, సలార్ షూటింగులతో బిజీగా ఉన్న ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎక్కువగా కొత్తవారికి ఛాన్స్ ఇచ్చేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు క్యాస్ట్ కాలింగ్ అంటూ ఆడిషన్స్‌కు పిలుపునిచ్చిన ప్రాజెక్ట్ కే.. తాజాగా మరోసారి టాలెంట్ ఉన్న వారిని తమ సినిమాలో నటించేందుకు అవకాశం కల్పించింది. మార్షల్ ఆర్ట్స్‌లో టాలెంట్ ఉన్నవారు, పార్కౌట్ ప్లేయర్స్, న్యూ ఏజ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఉంటే టీంను సంప్రదించాలను కోరుతూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Come on board and let's create #ProjectK together.#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/gP5J0i2SV3 — Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 21, 2022 -
'సలార్' ప్రొడక్షన్ బ్యానర్లో శ్రీకాంత్ కొడుకు రోషన్ సినిమా
Hero Srikanth Son Roshan Next Film With Vyjayanthi Movies: నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు రోషన్. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని పెళ్లి సందD సినిమాలో నటించాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయినా రోషన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు వస్తున్నా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేషనల్ అవార్డు విన్నర్ ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, స్వప్నా సినిమాస్ ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఆదివారం(మార్చి13)న రోషన్ బర్త్‌డే సందర్భంగా వైజయంతి మూవీస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. We are delighted to announce our Production No.9 with #Roshann, Directed by National Award Winning Director @PradeepAdvaitam. Wishing 'Roshann' a very Happy Birthday.@SwapnaCinema @VyjayanthiFilms pic.twitter.com/NEpCwzhJHl — Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 13, 2022 -
శ్రీకాంత్ కొడుకు స్పీడు.. బడా బ్యానర్స్‌లో సినిమాలకు సైన్
నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రోషన్. ఈ చిత్రం అనంతరం కొంత గ్యాప్ తీసుకొని పెళ్లి సందడి సినిమాతో మరోసారి అలరించాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఆశించకపోయినా రోషన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు వరిస్తున్నాయి. తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సన్నాహకాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు సితార బ్యానర్‌లోనూ ఓ చిత్రానికి రోషన్ సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. -
ప్రభాస్‌తో కలిసి సినిమాలో నటించాలనుకుంటున్నారా?
Want To Act With Prabhas In Nag Ashwin Movie?: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు వైజయంతి మూవీస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్‌ని సొంతం చేసుకోవచ్చంటూ కాస్టింగ్ కాల్‌ను అనౌన్స్ చేశారు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తన నెక్స్ట్ ఫిల్మ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్-కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె నటించనుంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 50-70 ఏళ్ల వయసున్న ఆసక్తి ఉన్న స్త్రీ -పురుషులు ఆడిషన్స్ వీడియో పంపాలంటూ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పేర్కొంది. అయితే హైదరాబాద్‌లో నివసించే వారికే ఈ అవకాశం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాను భారీ సాంకేతిక హంగులతో తెరకెక్కించనున్నారు. దాదాపు 300కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. Hyderabadis, its your turn now, Hurry up!!! Be the Face of the Future.#ProjectK #Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/4ECOnL0wQO — Vyjayanthi Movies (@VyjayanthiFilms) November 26, 2021 -
ఎట్టకేలకు సెట్స్ పైకి ప్రభాస్ కొత్త సినిమా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రభాస్-నాగ్ అశ్విన్‌ల ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. గురు పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ పాన్ ఇండియా చిత్రానికి ‘ప్రాజెక్ట్ కే’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాల్గోన్నాడు. ముహూర్తపు షాట్‌కి ప్రభాస్ క్లాప్ కొట్టారు. ఇందులో భాగంగా బిగ్‌బీపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకు రాలేదు. ‘గురు పౌర్ణమి సందర్భంగా ఇండియన్ సినిమాల గురువుని స్టార్ట్ చేశాం’అని వైజయంతతీ మూవీస్ ట్వీట్ చేసింది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. మొత్తానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మూవీ సెట్స్ పైకి రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నిజానికి ఈ సినిమా ముందే మొదలవ్వాల్సి ఉన్నా ప్రభాస్ సలార్, ఆదిపురుష్ మూవీతో బిజీగా మారటంతో వాయిదా పడుతూ వచ్చింది. 𝑰𝒕 𝑩𝒆𝒈𝒊𝒏𝒔... On the special day of #GuruPurnima, We start with the guru of Indian cinema. Clap by our #Prabhas.#ProjectK@SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/kvxcKNbLMT — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2021 -
బడా నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకున్న 'జాంబిరెడ్డి' హీరో
‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తేజ సజ్జా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన తేజ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఓ బేబీతో మళ్లీ తెరపైకి వచ్చాడు. ఆ తర్వాత తొలి సినిమా ‘జాంబీరెడ్డి’తో హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన జాంబీస్ లాంటి కొత్త జోనర్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ మూవీకి పాజిటివ టాక్ రావడంతో తేజకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికే మలయాళీ కుట్టి, కన్ను గీటు భామ్మ ప్రియా ప్రకాశ్ వారియర్‌తో చెక్ సినిమాలో నటించాడు. అదేవిధంగా.. శివానీ రాజశేఖర్ తో కలిసి ‘వెన్నెల’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఓ బడా బ్యానర్లో తేజ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్‌తో తేజ ఓ చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. చదవండి : మెగా హీరోతో గరుడవేగ డైరెక్టర్ తర్వాతి సినిమా? ఐదెకరాల పొలంతో పాటు ఓ స్కూటర్ ఉంది..నన్ను పెళ్లిచేసుకుంటావా? -
'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు!
ఇటీవల వచ్చిన చిన్న సినిమా జాతిరత్నాలు పెద్ద హిట్టు సాధించింది. థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత కామెడీని పంచిన చిత్రం మరొకటి లేదనడంలో ఆశ్చర్యమేమీ లేదు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తాజాగా ఆస్కార్‌కు ఎంపికైందట. ఈ మేరకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన సర్టిఫికెట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బెస్ట్ జానే జిగర్ మూవీ కేటగిరీ కింద ఈ సినిమాకు నామినేషన్ అయ్యిందని సంస్థ తెలియజేసింది. అయితే ఈ మధ్యే ఆస్కార్ అవార్డుల ప్రదానం అయిపోతే కొత్తగా జాతిరత్నాలు సినిమా నామినేట్ అవడమేంటి అని బుర్రలు బద్ధలు చేసుకున్నారు. కానీ కాసేపటికే వారికి అసలు విషయం అర్థమైంది. ఈ రోజు ఏప్రిల్ 1 కావడంతో అందరినీ ఏప్రిల్ ఫూల్ చేశారని తెలిసొచ్చింది. అలా ఈ రోజు మన జాతిరత్నాలు అందరినీ వెర్రివెంగళప్పలను చేశారన్నమాట! Eeeeyyy... Congratulations 🥳#JathiRatnalu @NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul @anudeepfilm @vennelakishore @actorbrahmaji @ItsActorNaresh @murlisharma72 @radhanmusic #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema @VyjayanthiFilms @LahariMusic pic.twitter.com/4PWLEJefti — Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 1, 2021 చదవండి: చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది: ఫరియా ఏప్రిల్: రిలీజయ్యే కొత్త సినిమాలివే గురూ.. -
ప్రభాస్ సినిమా..క్రేజీ అప్డేట్
ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. (ప్రభాస్ కొత్త రికార్డు.. అత్యంత వేగంగా ఆ మైల్స్టోన్..) `మహానటి`కి పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నట్లు వైజయంతి సంస్థ పోస్టర్‌ను రిలీజ్‌ను చేసింది. అలాగే మిక్కీజే మేయర్ సంగీతాన్ని అందించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ప్రభాస్..తాజాగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘సలార్’షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఆదిపురుష్ షూటింగ్లో పాల్గొంటారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు. అన్నీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లే. మరో రెండుమూడేళ్ల వరకూ ప్రభాస్ కాలెండర్ ఫుల్ బిజీ. (ఒలీవియా మోరిస్ బర్త్‌డే.. ఫస్ట్‌లుక్ విడుదల) -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు నాగ్ అశ్విన్ గుడ్ న్యూస్
ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ ఇస్తానని చెప్పిన దర్శకుడు నాగ్అశ్విన్.. పండుగ వెళ్లి పది రోజులు కావొస్తున్నా..ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తమ అభిమాన హీరో మూవీపై అప్డేట్ ఇవ్వండంటూ ప్రభాస్ ఫ్యాన్స్ వరుస ట్వీట్లతో నాగ్ అశ్విన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఎట్టకేలకు నాగ్ అశ్విన్ కొత్త మూవీ అప్డేట్పై స్పందించారు. 'కచ్చితంగా చెప్పాలంటే జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న మరొక అప్డేట్ రాబోతుంది' అని ఫ్యాన్స్‌కు రిప్లై ఇచ్చాడు. దీంతో వాళ్లు ఫుల్ హ్యాపీ అయిపోయారు. నాగ్ అశ్విన్ ఇచ్చే అప్డేట్స్ ఏమై ఉంటాయానన్న ఆసక్తి నెలకొంది. కాగా ప్రభాస్.. తాజాగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘సలార్’షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఆదిపురుష్ షూటింగ్లో పాల్గొంటారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. Exact ga cheppalante...29th Jan and 26th feb.. :)) — Nag Ashwin (@nagashwin7) January 23, 2021 -
ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్ ఇదే!
ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి. అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్ సహనిర్మాతలు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకోనె నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం ట్విటర్లో ఓ బిగ్ సర్ప్రైజ్ షేర్ చేసింది. దిగ్గజ నటుడు అబితాబ్ బచ్చన్ తమ సినిమాలో నటిస్తున్నారని పేర్కొంది. ఆయన సినిమాలకు సంబంధించిన వివరాలతో 27 సెకండ్ల నిడివి గల వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. భారతీయ సినిమా లెజెండ్ లేకుండా లెజెండరీ ఫిల్మ్ ఎలా తీయగలమని పేర్కొంది. ‘కోట్లాది భారతీయుల అభిమాన నటుడు. బిగ్ బీ అమితాబ్‌కి ఇదే మా సాదర ఘన స్వాగతం. ఆయన రాకతో మా జర్నీ మరింత BIG-ger! అయింది’అని వైజయంతీ మూవీస్ సంస్థ ట్వీట్ చేసింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. (చదవండి: నాగ్ అశ్విన్ మూవీకి మెంటార్‌గా సింగీతం) -
సింగీతం... స్క్రిప్ట్ మెంటార్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ ప్యాన్ ఇండియా ఫిల్మ్‌ను సి. అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఓ ఆసక్తికరమైన విషయమేంటంటే... తన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక బ్లాక్‌బస్టర్స్‌ను రూపొందించిన లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. సింగీతం పుట్టినరోజు సందర్భంగా సోమవారం (సెప్టెంబర్ 21) ఈ చిత్రానికి ఆయన మెంటార్‌గా చేస్తున్న విషయాన్ని ప్రకటించారు. ‘‘మా ఎపిక్‌కు సింగీతం శ్రీనివాసరావుగారిని ఆహ్వానిస్తున్నందుకు థ్రిల్ ఫీలవుతున్నాం. ఆయన క్రియేటివ్ సూపర్ పవర్స్ కచ్చితంగా మాకు మార్గదర్శక శక్తిగా ఉంటుంది’’ అని వైజయంతీ మూవీస్ ప్రకటించింది. -
మే 9 వెరీ స్పెషల్ డే ఎందుకంటే?
ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన తేదీలు జనాల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతాయి. అలా సినీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని తేదీ మే9. ఈ తేదీకి ఘనమైన సినీ చరిత్రే ఉంది. ఈ తేదీ కోసం అభిమానులే కాదు దర్శకనిర్మాతలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. అసలు ఎందుకు మే 9 వెరీ స్పెషల్? అనేది చూద్దాం. సినీ పంచాంగం ప్రకారం ఈ తేదీన విడుదలైన దాదాపు అన్ని సినిమాలు సూపర్‌డూపర్ హిట్ అవుతాయి. అయ్యాయి కూడా. అవేంటో ఓ లుక్కేద్దాం.. జగదేకవీరుడు అతిలోకసుందరి, మరో చరిత్ర, భారతీయుడు, ప్రేమించుకుందాం రా, మహానటి, మహర్షి వంటి చిత్రాలు మే9న విడుదలయ్యాయి. ఈ చిత్రాలు ఏ రేంజ్లో విజయాలు అందుకున్నాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి టాలీవుడ్ చరిత్రలోనే ఓ అద్భుతం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం వచ్చి నేటికి 30 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే చూడకుండా ఎవరూ ఉండలేరు. ‘ప్రేమించుకుందాం రా’తో వెంకటేష్ తన నటనతో ప్రతీ ఒక్క ప్రేమికుడి మనసు గెలుచుకున్నాడు. విజయం అందుకున్నాడు. మహానటి సావిత్రి జీవితమే ఓ చరిత్ర. అలాంటి ఆమె జీవితకథను బయోపిక్‌గా రూపొందించి ‘మహానటి’గా చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో పరకాయప్రవేశం చేశారు. క్లాసిక్ వండర్‌గా వచ్చిన ఈ చిత్రం ఎన్నో సెన్సేషన్ రికార్డులను నమోదు చేసింది. ఈ తరం సినీ అభిమానులకు సావిత్రి గురించి తెలిపిన మహా చిత్రం ‘మహానటి’. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, వంశీపైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన కమర్షియల్ చిత్రం ‘మహర్షి’. పాటలు ఓ వండర్‌ను క్రియేట్ చేస్తే.. సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. మహేశ్ కెరీర్లో మర్చిపోలేని మైలురాయిగా ‘మహర్షి’ నిలిచింది. ఈ చిత్రాలన్నీ మే 9న విడుదల కావడం విశేషం. ఇక ప్రేమించుకుందాం రా మినహా మిగతా మూడు చిత్రాలు వైజయంతీ మూవీస్ పతాకంపైనే విడుదల కావడం మరో విశేషం. అంతేకాకుండా ఈ రోజు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్నారు. టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, హీరో రానా తమ్ముడు అభిరామ్లది ఈరోజు బర్త్‌డే. దీంతో వారి అభిమానులు, సహచర నటీనటులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో బర్త్‌డే శుభాకాంక్షలతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ తేదీన మరిన్ని చిత్రాలు, విశేషాలు వచ్చి చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: 104 డిగ్రీల జ్వరంతో ధినక్ తా ధినక్ రో... ‘సితారా.. సింగర్‌గా ట్రై చేయ్’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_541241401.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సీసీసీకి వైజయంతీ మూవీస్ రూ. 5 లక్షలు విరాళం
కరోనా నియంత్రణకు ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తాజాగా కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి మరో రూ. 5 లక్షలు విరాళం ప్రకటించింది. ఇంతకముందే కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు అందజేసిన విషయం తెలిసిందే. ఫలితంగా ఇప్పటివరకు వైజయంతీ మూవీస్ అందజేసిన కరోనా విరాళం మొత్తం రూ. 25 లక్షలకు చేరుకుంది. చిత్ర పరిశ్రమకు వెన్నెముక అయిన దినసరి వేతనంతో పనిచేసే కార్మికులను ఆదుకోవడానికి సీసీసీకి రూ. 5 లక్షలు అందజేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వైజయంతీ మూవీస్ సంస్థ ప్రకటించింది. (మీకు అమ్మ, అక్కాచెల్లెళ్లు లేరా..) సినీ కార్మికులను ఆదుకోవడానికి సీసీసీని ఏర్పాటు చేయడాన్ని తాము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామనీ, చిత్రసీమలోని మిగతా ప్రముఖులంతా ఈ మంచి పనికి తోడ్పాటునివ్వాలని కోరింది. ప్రజలందరూ ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని, కరోనాపై రాజీలేని పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు అందరూ సహకరించాలని వైజయంతి సంస్థ విజ్ఞప్తి చేసింది. (పుష్ప: విలన్‌గా బాలీవుడ్ అగ్ర నటుడు) -
50 ఇయర్స్ స్పెషల్
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 50వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా బుధవారం స్పెషల్ అనౌన్స్మెంట్ చేశారు. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ తెరకెక్కించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా ఉంటుందని ప్రకటన విడుదల చేశారు. తండ్రి అశ్వనీదత్‌తో కలసి స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రభాస్‌గారికి థ్యాంక్స్. ప్రస్తుతానికి సినిమా గురించి ఏం చెప్పదల్చుకోలేదు. ఇది ప్యాన్ ఇండియన్ సినిమా కాదు.. ప్యాన్ వరల్డ్ సినిమా’’ అన్నారు నాగ్ అశ్విన్. -
ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్: ప్రభాస్‌తో ‘మహాదర్శకుడు’
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్. ‘మహానటి’తో జాతీయ అవార్డును దక్కించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తన 21వ చిత్రం చేయబోతున్నాడు. వైజయంతి మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ‘వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని చెప్పడానికి గర్విస్తున్నాం’అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఈ సినిమా టైటిల్, కథ, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. గతంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రభాస్‌తోనే చేస్తారో లేదో తెలియాల్సి ఉంది. నాగ్ అశ్విన్ తీసింది రెండు చిత్రాలైనప్పటికీ విభిన్నంగా ఆలోచించే దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టు పక్కా కమర్షియల్ కథను నాగ్ అశ్విన్ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. మహర్షి తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ఇప్పుడు అందరి కన్ను పడింది. కాగా, ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ఫేమ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాతనే నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కనుంది. Proud to associate with #Prabhas for our prestigious project directed by @nagashwin7.https://t.co/WYEptLI3MF#PrabhasNagAshwin — Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 26, 2020 చదవండి: చిరు సినిమాలో మహేశ్‌బాబు..! 'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు' -
సెప్టెంబర్‌లో సాహసం
లెజండరీ నటి సావిత్రి బయోపిక్‌ని ‘మహానటి’ పేరుతో వెండితెరపై చక్కగా ఆవిష్కరించి మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. తొలి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’తో హిట్ సాధించిన నాగ్ అశ్విన్ రెండో సినిమా ‘మహానటి’తో ఘన విజయం అందుకున్నారు. గత ఏడాది మేలో ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఆ చిత్రం తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయనున్నారనే ఆసక్తి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు అటు ప్రేక్షకుల్లో నెలకొంది. పలువురు హీరోలు అశ్విన్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపారని టాక్. అయితే తాజాగా నాగ్ అశ్విన్ తన కొత్త సినిమాను ప్రకటించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ‘సాహసం సెప్టెంబర్‌లో మొదలవుతుంది. ఈ సినిమాకు రచయితలు, విజువల్ ఆర్టిస్ట్స్, డిజైనర్స్ కొత్తవారు కావాలి. అందుకోసం అన్వేషణ జరుగుతోంది’’ అని వైజయంతీ మూవీస్ ప్రకటించింది, ఈ సినిమా హీరో, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మాత్రం ప్రకటించలేదు. -
ఆ వార్తల్లో నిజం లేదు : వైజయంతీ మూవీస్
మహానటి సినిమాను నిర్మించి టాలీవుడ్లో మళ్లీ తన సత్తాను చాటుకుంది వైజయంతీ మూవీస్. ఒకప్పుడు తిరుగులేని హిట్లు ఇచ్చిన ఈ సంస్థ గత కొంతకాలంపాటు విజయాలను అందించలేకపోయింది. మహానటి ఇచ్చిన కిక్‌తో మళ్లీ వరుసబెట్టి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తోంది. రీసెంట్గా ‘దేవదాస్’ తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సంస్థ ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాను నిర్మిస్తోంది. అయితే సోషల్ మీడియాలో బుధవారం రోజున ఓ వార్త హల్చల్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో వైజయంతీ మూవీస్ నిర్మిస్తోందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. తాము చిరంజీవి 152వ సినిమాను నిర్మించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ.. మెగాస్టార్‌తో ఇప్పటికే నాలుగు బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు చేశామని, ఐదో బ్లాక్‌బస్టర్ సినిమా చేస్తే తామే గర్వంగా ప్రకటిస్తామంటూ ట్వీట్ చేశారు. There is no truth in reports circulating in the media regarding @VyjayanthiFilms next film with Chiranjeevi garu.Vyjayanthi has given 4 all time blockbusters with Megastar and when the 5th film happens,It will be an exclusive Vyjayanthi production and we will proudly announce it. — Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 11, 2018 -
వైజయంతీకి వందేళ్ల ప్రయాణం ఖాయం
1973లో మా నాన్నగారు ఇచ్చిన డబ్బును మదరాసు టీ నగర్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కోట్లకు అధిపతిని అయ్యుండేవాడ్ని. డబ్బుల పరంగా బ్యాలెన్స్ షీట్ చూసుకోలేదు. నాకున్న పేరు, ప్రఖ్యాతుల పట్ల హ్యాపీ. ముందు తరం హీరోలతో సినిమాలు తీశాను. ఆ హీరోల కొడుకులు, మనవళ్లతోనూ తీశాను. 45 ఏళ్లయింది ఇండస్ట్రీకి వచ్చి. మరో 55 ఏళ్లు మా పిల్లలు రన్ చేస్తారు. వైజయంతీ మూవీస్ ప్రయాణం వందేళ్లయినా ఆగదని చెప్పడానికి గర్వంగా ఉంది. మా బ్యానర్‌కు ఎన్టీఆర్‌గారు పేరుపెట్టారు. ఆయనకు ధన్యవాదాలు. ‘‘ఇండస్ట్రీలో 45వ ఏట అడుగుపెట్టాను. ‘దేవదాస్’ 52వ చిత్రం. ఈ జర్నీలో తృప్తి, ఆనందం ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోల పేర్లు మాదిరిగానే నా పేరు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. నా ఎదుగుదలలో నా భార్య పాత్ర కూడా ఉంది. పిల్లలు ముగ్గరు అమెరికాలో చదువుకుని ఈ రంగాన్ని ఎంచుకోవడం హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో ఓ ఫైన్ మార్నింగ్ అందర్నీ పిలిచి ‘రిటైర్డ్’ అని చెబుతాను. అందుకు ఎక్కువ టైమ్ కూడా పట్టకపోవచ్చేమో. ఎందుకంటే స్వప్నా అండ్ ప్రియాంకా చాలా స్ట్రాంగ్ అండ్ మోర్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తున్నారు’’ అన్నారు నిర్మాత అశ్వనీదత్. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్, వయాకామ్ 18 మీడియా పతాకాలపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్వనీదత్ చెప్పిన విశేషాలు... ∙స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్‌లో నిర్మించిన ‘మహానటి’ మాకు మంచి కమ్‌బ్యాక్ అయింది. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’ సినిమా చేశాం. ఇద్దరు డిఫరెంట్ వ్యక్తులు కలిసి చేసే ట్రావెల్ ఎలా ఉంటుంది? అన్నదే ఈ చిత్రకథ. నాగార్జున, నాని ఇద్దరూ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు. ‘గుండమ్మకథ’ లాంటి ప్రయత్నం చేశాం. ముందు సినిమా లైన్ సెలక్ట్ చేసుకున్నాం. నాగార్జున, నానీలను శ్రీరామ్ సెలక్ట్ చేశారు. కథ విన్న ఇద్దరు హీరోలు వెంటనే ఓకే అన్నారు. ‘ఆజాద్’ తర్వాత నాగార్జునగారితో సినిమా తీయలేదు. ఇప్పుడు నాగార్జున ఇన్వాల్వ్మెంట్ చూసి కాస్త షాక్ అయ్యాను. సినిమాలో నాని ఇన్వాల్వ్మెంట్ను ‘ఎవడే సుబ్రమణ్యం’ అప్పుడు చూశాను. ఇద్దరి టైమింగ్స్ సూపర్. బాంబే రైటర్ శ్రీధర్ రాఘవన్, భూపతి రాజా, సత్యానంద్, సాయి మాధవ్ బుర్రా బాగా సహకరించారు. మంచి సినిమాలు తీస్తున్న యంగ్ డైరెక్టర్స్‌లో శ్రీరామ్ ఆదిత్య ఒకరు. ఈ సినిమాను బాగా తీశారు. ∙ఈ ‘దేవదాస్’ చిత్రంతో మా బ్యానర్లో మణిశర్మగారు 17 సినిమాలు పూర్తి చేశారు. ఆయన్ను ‘చూడాలని ఉంది’ ద్వారా నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ∙కొంతకాలంగా మా బ్యానర్లో హిందీ సినిమాలు చేయడం లేదు. ప్రియాంకా అండ్ స్వప్నా లీడర్షిప్స్లో వైజయంతీ మూవీస్‌లో పలు భాషల్లో సినిమాలు చేయాలని ఉంది. నాగ్ అశ్విన్ (దర్శకుడు, అశ్వనీదత్ అల్లుడు) కూడా ఓ హిందీ, తెలుగు ద్విభాషా చిత్రంపై ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. హిందీ సినిమాలు కూడా చేయాలని నిర్మాణ సంస్థ వయాకామ్ 18తో అసోసియేట్ అవుతున్నాం.వైజయంతీ మూవీస్‌ను తిరిగి పెంచాలని ప్రియాంకా, స్వప్నా ప్రయత్నం చేస్తున్నారు. స్వప్నా, ప్రియాంకాలు వైజయంతీ మూవీస్‌ను లాక్కోలేదు. హైజాక్ చేశారంటే çకరెక్ట్ (నవ్వుతూ). ∙హీరోనే సినిమా అని నమ్మి నేను సినిమాల్లోకి వచ్చాను. అదే నా స్లోగన్. హీరోలందరూ నాతో ఇష్టంగా ఉంటారు. నేను ఈ హీరోతో సినిమా తీయను అనే పరిస్థితి నాకెప్పుడూ రాలేదు. అంత మంచి వాతావరణంలో సినిమాలు నిర్మించాను. ∙నాకు కెమెరా ముందుకు రావాలనిపించలేదు. డైరెక్షన్ చేయాలనిపించలేదు. అన్నం ఉడికిన తర్వాత ఇది ఉంది.. అది లేదు అని చెప్పడంలో నా జడ్జిమెంట్ ఉంది. వాళ్లు చేయాల్సిన పనిని మనం చేయకూడదన్నదే నా సిద్ధాంతం. ∙సినిమా చేద్దాం అంటే ఏ తల్లిదండ్రులూ ఒప్పుకోరు. కానీ వారిని కన్విన్స్ చేసి విశ్వనాథ్‌గారితో ‘ఓ సీత కథతో’ సినిమా తీశాను. ఆ తర్వాత అభిమాన హీరోలతో సినిమాలు తీశాను. కానీ వాటి మధ్య చిన్న సినిమాలను మరిచిపోలేదు. అన్నీ పోయి ఇంటికెళ్లిపోయే పరిస్థతి వచ్చినప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డిగారితో ‘శుభలగ్నం’ సినిమా తీశాం. ఆ తర్వాత రాఘవేంద్రరావుగారితో తీసిన ‘పెళ్లి సందడి’ కూడా మంచి హిట్. చిన్న సినిమా అయినా,పెద్ద సినిమా అయినా కరెక్ట్ ఎటెమ్ట్ కాకపోతే, స్టోరీ ఆడియన్స్‌కి నచ్చకపోతే, ఆపై మన టైమ్ బాగోలేకపోతే కిందికీ, పైకి వెళ్తాం. ఎప్పుడూ తలదించుకునే సినిమాలు తీయాలనుకోలేదు. తీయగలను అనుకుంటేనే సినిమా తీశా. అందుకే ఏడేళ్ల గ్యాప్ కూడా వచ్చింది. ∙‘మహానటి’ సినిమాకు దాదాపు 17 కోట్లు బడ్జెట్ అవుతుందని స్వప్నా చెప్పింది. లేడీ ఒరియంటెడ్ సినిమాకు అంత బడ్జెట్ ఎక్కువ అనుకున్నాను. కానీ సావిత్రిగారి కథ. ఒకటీ రెండు కోట్ల ఎక్కువైనా పర్లేదు. గ్రాఫిక్స్ దగ్గర కాంప్రమైజ్ కావద్దు. ఆడియన్స్‌కు 1980 ఫీల్‌ను, కథను సరిగ్గా చెప్పకపోతే ఈ సినిమాను తీయవద్దు అని చెప్పాను. దాని కోసం ఏమైనా ఖర్చుపెట్టండి అన్నాను. చివరికి ఆ సినిమా బడ్జెట్ 29 కోట్ల దగ్గర ఆగింది. ∙అప్పట్లో విజయా ప్రొడక్షన్స్, రామానాయుడుగారు, జగపతి పిక్చర్స్ ఇలా ఓ నలుగురైదుగురు మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు తీయగలిగేవారు. ఇప్పుడు అందరూ తీస్తున్నారు. ఇప్పుడు వందకు 90 శాతం మంది అలాగే తీస్తున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ పెరగాలి. ఇప్పుడు నిర్మాతలకు డిజిటల్ రైట్స్, శాటిలైట్స్ రూపంలో మంచి ఆదాయం వస్తోంది. ఇది మంచి పరిణామం. నిర్మాతలకు కాస్త రిస్క్ తగ్గింది. ∙ఆ రోజుల్లో పద్మాలయావారు గొప్ప సినిమాలు తీశారు. కానీ మహేశ్‌బాబును (రాజకుమారుడు) నేను ఇంట్రడ్యూస్ చేశాను. చాలా గౌరవంగా భావించాను. అలాగే హరికృష్ణ కోరిక మేరకు ‘స్టూడెంట్ నెం. 1’ సినిమా తీశాం. చిరంజీవిగారికి పెద్ద బ్యానర్ ఉంది. అల్లు అరవింద్‌కి బ్యానర్ ఉంది. కానీ రామ్‌చరణ్‌ను నేను ఇంట్రడ్యూస్ చేశాను. నాకు, రాఘవేంద్రరావుకి, అరవింద్‌కి మంచి బాండింగ్ ఉంది. నేను, రాఘవేంద్రరావు మాట్లాడుకుని అల్లు అర్జున్‌ని ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నాం. అరవింద్‌కి చెబితే హ్యాపీ ఫీలయ్యారు. చంద్రబాబుగారు రోహిత్‌ను అడిగారు. కొత్తదనానికి, వారసత్వానికి పీట వేసుకుంటూ వచ్చాం. ∙నెక్ట్స్ సినిమా కోసం నాగీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు. నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ చిరంజీవిగారి కోసమేనా? అంటే ఇప్పుడే చెప్పలేను. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఓ సినిమా స్టార్ట్ చేస్తాం. ఎన్టీఆర్‌తో ఒక సినిమా ఉంది. విజయ్ దేవరకొండతో రెండు సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ చేసే ఒక సినిమాకు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తారు. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలని ఉంది. -
‘దేవదాస్’తో బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ..!
ముంబాయి కి చెందిన ప్రముఖ మీడియా సంస్థ వయాకామ్ 18 మీడియా ప్రతిష్టాత్మక వైజయంతి సంస్థతో చేతులు కలిపింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో నిర్మిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ దేవదాస్ చిత్రానికి వయాకామ్ 18 భాగస్వామిగా దక్షిణాది చిత్ర సీమలో అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ, వయాకామ్ 18తో భాగస్వామి గా కావడం చాలా ఆనందంగా ఉంది. వారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం. దేవదాస్ తో దక్షిణాది చిత్ర సీమ లోకి ప్రవేశిస్తున్న వారికి టాలీవుడ్ తరపున ఘన స్వాగతం పలుకుతున్నాం’ అన్నారు. వయా కామ్ 18 సీఓఓ అజిత్ అంధారే మాట్లాడుతూ, ‘అశ్వినిదత్ గారి ప్రఖ్యాత వైజయంతి మూవీస్ సంస్థ భాగస్వామ్యం లో భారీ చిత్రం దేవదాస్ తో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశిస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. మా సంస్థ తెలుగులో అనేక దశాబ్దాల అనుభవం ఉన్న దత్ గారు, వైజయంతి మూవీస్ భాగస్వామ్యం తో మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తాం. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిల కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న, అందరూ ఎంత గానో ఎదురు చూస్తున్న దేవదాస్ తో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంద’న్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సెప్టెంబర్‌లో ‘దేవదాస్’
ఒకప్పటి క్లాసికల్ హిట్ మూవీ దేవదాసు. ప్రస్తుతం కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని హీరోలుగా నటిస్తున్న సినిమా దేవదాసు. ఈ మూవీలో డాన్, డాక్టర్ పాత్రల్లో వీరిద్దరు ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చేసింది. డాన్‌గా దేవ పాత్రలో నాగ్, డాక్టర్‌గా దాస్ పాత్రలో నాని ప్రేక్షకులను పలకరించేందుకు సెప్టెంబర్ 27న రాబోతున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీకి మణి శర్మ సంగీతాన్ని అందించగా, ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా నానికి జోడీగా రష్మికా మందన యాక్ట్ చేస్తున్నారు -
‘మహానటి’ శాటిలైట్ హక్కులపై రూమర్స్
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏది ప్రధానంగా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు ఫలానా సినిమాలు ఎన్ని రోజులు, ఎన్ని సెంటర్లో ఆడాయి... అని లెక్కేసుకునేవారు. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్, వంద, రెండు వందల కోట్ల క్లబ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. దీనిలో భాగంగానే సినిమా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఎంత పలుకుతున్నాయో కూడా ప్రస్తుతం బాగా పాపులర్ అయ్యాయి. ఫలానా సినిమా శాటిలైట్ రైట్స్‌ను ఎంతకు అమ్మారు... ఏ ఛానల్‌కు అమ్మారు లాంటి విషయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ప్రస్తుతం మహానటికి సంబంధించిన ఈ విషయాలే హల్చల్ చేస్తున్నాయి. మహానటి విడుదలైనప్పటి నుంచి విజయవంతంగా దూసుకెళ్తోంది. కలెక్షన్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఓవర్సిస్లో కూడా ఈ సినిమా బాగానే రన్ అవుతోంది. అయితే మహానటి శాటిలైట్ రైట్స్‌ను దాదాపు 18కోట్లకు అమ్మాలని నిర్మాతలు అనుకుంటున్నారని సమాచారం. అయితే సినిమాకు పెరుగుతున్న ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని పలు ఛానెళ్లు ఈ రైట్స్‌కు పోటీపడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా టీవీలో ప్రసారం అయితే టాప్ రేటింగ్ రావడం ఖాయమంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. -
‘నా సినిమా రీమేక్ కాదు’
కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ.. రీమేక్ అంటూ రూమర్స్ వచ్చాయి. సోషల్‌మీడియా హవా కొనసాగుతున్న ఈ తరుణంలో ఇలాంటి రూమర్స్ మరింత వేగంగా అందరికి చేరుతాయి. దీనిపై చిత్రదర్శకుడు శ్రీరామ్ ఆదిత్య స్పందించారు. తాను నాగ్, నానిలతో రూపొందిస్తున్న మూవీ ఏ సినిమాకు రీమేక్ కాదంటూ, బయట వస్తున్నరూమర్స్లో ఏ మాత్రం నిజం లేదంటూ ట్విటర్లో పేర్కొన్నారు. నిన్న సోషలమీడియాలో ఈ మూవీ బాలీవుడ్ సినిమా జానీ గద్దర్‌కు రీమేక్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. My next film with @iamnagarjuna sir and @NameisNani Produced by @VyjayanthiFilms is not a Remake of any film. Its a original script .Just wanted clarify :) — Sriram adittya (@SriramAdittya) 22 May 2018 -
చిరును డైరెక్ట్ చేయనున్న నాగ్ అశ్విన్?
-
మెగాస్టార్‌తో నాగ్ అశ్విన్ సినిమా...?
మహానటి మూవీతో అభిరుచి గల డైరెక్టర్ అని నిరూపించుకున్నారు నాగ్ అశ్విన్. తీసింది రెండు సినిమాలే అయినా... రెండూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మహానటి సినిమా విడుదలైనప్పటి నుంచి నాగ్ అశ్విన్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. సినిమా కోసం నాగ్ పడిన కష్టం తెరపైన కనపడుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు మహానటి దర్శక నిర్మాతలను సత్కారించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అశ్వనీదత్ మాట్లాడుతూ... గత రెండు మూడేళ్లుగా చిరంజీవి గారికి ఎన్నో కథలు వినిపిస్తున్నాము, కానీ కుదరట్లేదు. మా కాంబినేషన్లో ఒక పెద్ద సినిమా ఉంటుంది. నాగ్ అశ్విన్ కూడా ఒక లైన్ అనుకున్నారని.. సినిమా పేరు భైరవ అని... టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో సినిమా ఉండొచ్చని అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. నాకూ పాతాళ భైరవి లాంటి సినిమా, జానపద నేపథ్యంలో, మాయలు మంత్రాలు లాంటి సినిమా చేయాలని ఉందంటూ తెలిపారు. వైజయంతీ మూవీస్, చిరంజీవి, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ సినిమా మాత్రం ఉంటుందని తెలిసిపోయింది. అయితే అది ఇప్పట్లో మాత్రం కుదిరేలా లేదు. చిరంజీవి ప్రస్తుతం సైరాతో బిజీగా ఉన్నారు. తరువాత బోయపాటి శీను, త్రివిక్రమ్, కొరటాల శివతో సినిమాలు ఉంటాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నంటిలో ఏది పట్టాలెక్కుతుందో చూడాలి. -
‘మహానటి’కి అభినందనల వెల్లువ
సాక్షి, సినిమా: దేశం గర్వించదగిన మహానటి సావిత్రి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అద్భుతంగా నిజంగానే మహాద్భుతంగా ఉందటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్, జెమినీ గణేషన్‌గా దుల్కర్ సాల్మన్ జీవించారని అభినందనలు కురుస్తున్నాయి. (చూడండి: ‘మహానటి’ మూవీ రివ్యూ) 28 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు..: మహానటి విడుదల సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావ్ ఒకింత భావోద్వేగపూరిత కామెంట్లు చేశారు. ‘‘సరిగ్గా 28 ఏళ్ల కిందట ఇదే వైజయంతీ మూవీస్ బ్యానర్లో నేను తీసిన ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ ఇదే రోజు(మే 9న) విడుదలైంది. మళ్లీ ఇప్పుడు ‘మహానటి’ లాంటి గొప్ప సినిమా వచ్చింది. సావిత్రి జీవితచరిత్రను సినిమాగా మలిచిన వైజయంతి మూవీస్‌కి అభినందనలు’’అని పేర్కొన్నారు. ఫ్యాన్ అయిపోయా: జక్కన్న ‘‘ఏదో అనుకరిస్తున్నట్లు కాకుండా పాత్రల్లో అద్భుతంగా జీవించారు. కీర్తి సురేశ్.. సావిత్రిని మళ్లీ మనముందుకు సజీవంగా తీసుకొచ్చారు. ఇక దుల్కర్ సాల్మన్.. ఫెంటాస్టిక్! నేను అతనికి ఫ్యాన్ అయిపోయా. స్వప్నదత్, నాగ అశ్విన్‌లకు అభినందనలు’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు. సావిత్రి ఆత్మే చేయించుకుంది: విజయవాడలో ‘మహానటి’ సినిమా చూసిన అనంతరం నిర్మాత అశ్వినీ దత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘18 నెలల కష్టానికి ఫలితం దక్కింది. బహుశా సావిత్రిగారి ఆత్మే దగ్గరుండిమరీ ఈ సినిమాను చేయించుకుంది. నా 44 ఏళ్ల సినీ జీవితంలో అత్యంత సంతృప్తి ఇచ్చిన సినిమా ఇదే. ఓవర్సీస్లో ప్రభంజనం సృష్టించడం ఖాయం. సినిమాలో పాలుపంచుకున్న నటీనటులు, సాంకేతిక బృందం అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. సావిత్రి కూతురి వ్యాఖ్య: మహానటి సావిత్రి కూతురు చాముండేశ్వరి సైతం తొలిరోజే ‘మహానటి’ని చూసి తన భావాలను పంచుకున్నారు.‘‘అమ్మ చిన్నతనం నుండి అగ్రకథానాయికగా ఎదిగిన తీరును సినిమాలో చూడటం ఆనందంగా ఉంది. అమ్మే నాలో ఉండి తన కథని ఇలా చిత్ర రూపంలో చేయించుకుంది. కీర్తి సురేష్ చక్కగా ఒదిగిపోయారు. దుల్కర్ సాల్మన్ అచ్చు మా నాన్నను అనుకరిస్తూ నటించారు. మహానటిపై ప్రముఖుల ట్వీట్స్... . @KeerthyOfficial’s potrayal of Savitri garu is one of the finest performances I've ever seen. It is not just imitating. She brought the legendry actress back to life. @dulQuer is absolutely fantastic. I am his fan now. — rajamouli ss (@ssrajamouli) 9 May 2018 Hearing the most wonderful things about #Mahanati ! Overwhelmed and grateful ! Thank you @nagashwin7 Swapna Priyanka and Ashwini Dutt garu for putting their faith in me. Lots of love to @KeerthyOfficial @Samanthaprabhu2 @TheDeverakonda Rajendra Prasad garu & the entire cast ! — dulquer salmaan (@dulQuer) 9 May 2018 28 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారీ వర్షం... చాలా పెద్ద సినిమా తీసాము అనే ఆనందం, ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు... ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు... మరుసటి రోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది. — Raghavendra Rao K (@Ragavendraraoba) 9 May 2018 మా దత్తు గారికి ఆరోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికి మర్చిపోలేదు. అదే రోజు న నేడు మహానటి విడుదలయింది. ఆరోజున జగదేక వీరుడు అతిలోకసుందరి నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో నేడు మహానటి నిర్మించడానికి అంతే ధైర్యం కావాలి. 🙏🏻🙏🏻🙏🏻 — Raghavendra Rao K (@Ragavendraraoba) 9 May 2018 సావిత్రి గారి చరిత్ర తరతరాలకు అందించిన స్వప్న సినిమా వైజయంతి మూవీస్ కి ధన్యవాదాలు . @KeerthyOfficial పాత్ర లో జీవించింది. శివాజీ గణేశన్ గా @dulQuer నటన అద్భుతం. నాగ అశ్విన్ మరియు చిత్ర యూనిట్ కి నా అభినందనలు. 😊 — Raghavendra Rao K (@Ragavendraraoba) 9 May 2018 #Mahanathi classic ,emotional inspirational bio epic of savithri Amma @KeerthyOfficial brought back the legendary actress hats off espl Mayabazar dance @Samanthaprabhu2 Thambi u rocked , congrats to whole team & Spl Thx to @VyjayanthiFilms for this unforgettable classic ... pic.twitter.com/2xvylpqufy — atlee (@Atlee_dir) 9 May 2018 I am very proud to have played a small part in this CLASSIC ❤️ Thankyou @nagashwin7 for Madhuravani .. #Mahanati @KeerthyOfficial you were just Outstanding !! Much love to my producers @VyjayanthiFilms and @TheDeverakonda @dulQuer . #TeamMahanati — Samantha Akkineni (@Samanthaprabhu2) 9 May 2018 -
'భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను'
మహేష్‌బాబుతో చిత్ర నిర్మాణం ఆ సంస్థ అధినేత అశ్వనీదత్ కొత్తపేట : తెలుగులో ప్రముఖ దర్శకులు, హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల్ని నిర్మించిన వైజయంతీ మూవీస్ కొన్నేళ్ల విరామం తరువాత తిరిగి చిత్ర నిర్మాణాన్ని చేపడుతున్నట్టు ఆ సంస్థ అధినేత సి.అశ్వనీదత్ తెలిపారు. ఆయన శనివారం సతీసమేతంగా మందపల్లి మందేశ్వర (శనేశ్వర) స్వామివార్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాలం కలిసి రాక చిత్ర నిర్మాణంలో విరామం ఏర్పడిందని, ఈ ఏడాది నుంచి వరుసగా చిత్రనిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరో గా త్వరలో చిత్ర నిర్మాణం ప్రారంభించి వచ్చే ఏడాది మేలో విడుదలకు ప్లాన్ చేశామని, ఈ ఏడాది ద్వితీయార్థంలోనే రామ్‌చరణ్ హీరోగా చిత్రనిర్మాణం ప్రారంభిస్తామని, ఆ చిత్రానికి దర్శకుడిని నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. తన అభిమాన హీరోలు సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి అని చెప్పారు. చిరంజీవితో తీసిన ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ ఎక్కువ పేరు తెచ్చిందన్నారు. చిరంజీవి 151 లేదా 152 చిత్రాన్ని తానే నిర్మిస్తానన్నారు. తన కుమార్తె ప్రియాంకదత్ స్వప్నా బ్యానర్ స్థాపించి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని నిర్మించిందని, ఆ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితకథతో చిత్రాన్ని నిర్మించనుందని చెప్పారు. మహానటుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీలోకి వచ్చిన తాను అదే పార్టీలో కొనసాగుతున్నానన్నారు. ఒక్కసారి టీడీపీ తరఫున ఎన్నిక ల్లో పోటీ చేసినా ప్రస్తుతం ఆ ఆలోచన లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని అన్నారు.