Hero Teja Sajja Signed Next Movie Project With Vyjayanthi Banner - Sakshi
Sakshi News home page

బడా నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకున్న 'జాంబిరెడ్డి'  హీరో 

Published Sat, May 22 2021 1:52 PM | Last Updated on Sat, May 22 2021 2:24 PM

Hero Teja Sajja Upcoming Movie With Vyjayanthi Movies? - Sakshi

‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తేజ సజ్జా. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన తేజ తర్వాత సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి ఓ బేబీతో మళ్లీ తెరపైకి వచ్చాడు. ఆ తర్వాత తొలి సినిమా ‘జాంబీరెడ్డి’తో హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.  హాలీవుడ్‌కు మాత్రమే ప‌రిమిత‌మైన జాంబీస్‌ లాంటి కొత్త జోన‌ర్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ మూవీకి పాజిటివ​ టాక్‌ రావడంతో తేజకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.

ఇప్పటికే మలయాళీ కుట్టి,  క‌న్ను గీటు భామ్మ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో చెక్‌ సినిమాలో నటించాడు. అదేవిధంగా.. శివానీ రాజశేఖర్ తో కలిసి ‘వెన్నెల’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఓ బడా బ్యానర్‌లో తేజ సినిమా చేయబోతున్నాడని టాక్‌ వినిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్‌తో తేజ ఓ చిత్రానికి సైన్‌ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు తెలుస్తోంది. 

చదవండి : మెగా హీరోతో గరుడవేగ డైరెక్టర్‌ తర్వాతి సినిమా?
ఐదెకరాల పొలంతో పాటు ఓ స్కూటర్‌ ఉంది..నన్ను పెళ్లిచేసుకుంటావా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement