upcoming movie
-
అజ్ఞానివా, మూర్ఖుడివా పవన్
-
విజయ్ భారీ స్కెచ్ 1000 కోట్లకు టార్గెట్ ఫిక్స్ ?
-
మళ్ళి ఒక్కటి కాబోతున్న అనుష్క ప్రభాస్
-
NTR 30 పై అదిరిపోయే లీక్ ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ఫాన్స్ కి పండగే
-
మీరు ఎంత ఊహించుకున్నా దానికి 10 రెట్లు ఉంటుంది ఉగ్రం
-
నేను పెద్దయ్యాక సమంత అవుతా...
-
కాంచన 4 వచ్చేస్తుంది.. క్లారిటీ ఇచ్చిన రాఘవ లారెన్స్
-
శాకుంతలం టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
పాన్ ఇండియా రేంజ్ లో సమంత.. కాంతర తోనే పోటీనా..
-
ఇది అన్యాయం.. అప్పుడు చరణ్ తో, ఇప్పుడు హృతిక్ తో
-
చరణ్ తో రొమాన్స్ చేయబోతున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్
-
గేమ్ చేంజర్ అదిరిపోయే అప్డేట్.. మెగా ఫ్యాన్స్‌కి డబుల్ బొనాంజా
-
పగ, ప్రతీకారంతో త్రిష.. ఎందుకంటే ?
Trisha Upcoming Movie The Road With Debutant Director Arun Vaseegaran: ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు హీరోయిన్ త్రిష. అయితే ఆమె పగ, ప్రతీకారాలు ఎందుకు? ఎవరిపై? అనే సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది రోడ్’. వి.అరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి ‘ది రోడ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 22 సంవత్సరాల క్రితం మధురైలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మధురైలో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌ను దాదాపు 50 రోజులు మధురై లొకేషన్స్‌లోనే ప్లాన్ చేశారని తెలిసింది. సంతోష్ ప్రతాప్, షబ్బీర్, మీయా జార్జ్, వివేక్, ఎమ్ఎస్ భాస్కర్, వేలా రామ్మూర్తి ఇతర ముఖ్యతారాగణంగా నటిస్తున్న ‘ది రోడ్’ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన త్రిష, కానీ సంతోషంగా లేనంటూ ట్వీట్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1551342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దుబాయ్‌కు వెళ్లిన మహేశ్ బాబు.. అందుకోసమేనా ?
SSMB29: Mahesh Babu SS Rajamouli To Discuss Script In Dubai: మహేశ్‌బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ షూటింగ్ పూర్తయింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా స్టార్ట్ కావాల్సిన సినిమా షూటింగ్‌కు కాస్త సమయం ఉంది. దీంతో వేసవి వెకేషన్ కోసం ఆయన దుబాయ్ వెళ్లారని తెలిసింది. ఈ వెకేషన్‌ను పూర్తి చేసుకుని వచ్చాక ‘సర్కారువారి పాట’ ప్రమోషన్స్‌లో పాల్గొంటారు మహేశ్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే మహేశ్ బాబు లానే జక్కన్న కూడా దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. తమ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన కథా చర్చల్లో భాగంగానే మహేశ్, రాజమౌళి దుబాయ్ వెళ్లారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. చదవండి: ప్రభాస్, మహేశ్ బాబును దాటేసిన విజయ్ దేవరకొండ.. చదవండి: ఈవీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేశ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బెస్ట్ డైరెక్టర్ తో రజనీకాంత్ కొత్త చిత్రం
-
సంజూ బాబాకు మరో బర్త్‌డే గిఫ్ట్: అదుర్స్
సాక్షి, ముంబై: పుట్టిన రోజు సందర్భంగా సంజయ్ దత్‌కు మరో అపురూపమైన కానుక అందింది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా నటిస్తున్న బాలీవుడ్ మూవీ భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలోని ‘భాయీ భాయీ’ పాటను చిత్ర యూనిట్ గురువారం రిలీజ్ చేసింది. ఇది తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా చేసిందంటూ సంజయ్ దత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆగస్టు 13 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వీఐపీలో మాత్రమే ఈ మూవీ విడుదలకానుంది. కాగా 1971 భారత, పాకిస్థాన్ మధ్య జరిగియన యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ్ రావెల్ దర్శకత్వం వహిస్తుండగా, నోరా ఫతేహీ, ప్రణీత, శరద్‌ఖేల్కర్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల (జూలై 12) విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by Sanjay Dutt (@duttsanjay) -
బడా నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకున్న 'జాంబిరెడ్డి' హీరో
‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తేజ సజ్జా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన తేజ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఓ బేబీతో మళ్లీ తెరపైకి వచ్చాడు. ఆ తర్వాత తొలి సినిమా ‘జాంబీరెడ్డి’తో హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన జాంబీస్ లాంటి కొత్త జోనర్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ మూవీకి పాజిటివ టాక్ రావడంతో తేజకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికే మలయాళీ కుట్టి, కన్ను గీటు భామ్మ ప్రియా ప్రకాశ్ వారియర్‌తో చెక్ సినిమాలో నటించాడు. అదేవిధంగా.. శివానీ రాజశేఖర్ తో కలిసి ‘వెన్నెల’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఓ బడా బ్యానర్లో తేజ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్‌తో తేజ ఓ చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. చదవండి : మెగా హీరోతో గరుడవేగ డైరెక్టర్ తర్వాతి సినిమా? ఐదెకరాల పొలంతో పాటు ఓ స్కూటర్ ఉంది..నన్ను పెళ్లిచేసుకుంటావా? -
సెట్స్‌పైకి వైష్ణవ్ కొత్త సినిమా
-
సెట్స్‌పైకి వైష్ణవ్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే..
తొలి సినిమా ఉప్పెన తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే తనదైన నటనతో సముద్రమంత క్రేజ్ సంపాదించుకొని ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. దీంతో వైష్ణవ్ తేజ్‌కి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. మెగా కాంపౌండ్ హీరో కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఉప్పెన రిలీజ్ కాకముందే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటోంది. ఇందులో వైష్ణవ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ నటించింది. ఇప్పటికే పలు సినిమాలు వైష్ణవ్ చేతిలో ఉన్నాయి. తాజాగా వైష్ణవ్ చేస్తున్న మూడో సినిమా గురించి అప్డేట్ వచ్చేసింది. అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను డైరెక్ట్ చేసిన గిరీశయ్యతో చేస్తున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. శుక్రవారం సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ఆకాష్ పూరీ హీరోగా రూపొందుతున్న 'రొమాంటిక్' మూవీలోనూ నటిస్తుంది. తొలి సినిమాతోనే లక్కీ హీరో అనిపించుకున్న వైష్ణవ్‌తో సినిమా అనగానే కేతిక వెంటనే ఓకే చేసిందట. మరి రెండవ సినిమాతో వైష్ణవ్..మరో హిట్‌ను అందుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చదవండి : వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే? ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ -
ఫ్యాన్స్‌కు శింబు బర్త్‌డే గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్: కోలీవుడ్ సూపర్ స్టార్ శింబు నటిస్తున్న ‘మానాడు’ మూవీ టీజర్‌ను విడుదలైంది. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ‘మానాడు’ టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. శింబు పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేసిన ఈ టీజర్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. దీంతో ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సందర్భంగా రవితేజ శింబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. అలాగే టీమ్‌కు కూడా అభినందనలు తెలిపారు. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘రివైండ్’ పేరుతో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా కనిపించనున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తున్నారు. టైమ్ ఎవరి గురించి వెయిట్ చేయదు.. ఒకవేళ వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ప్రముఖ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఈ మూవీలో నటిస్తుండడం మరో విశేషం. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ కామాచి నిర్మిస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం మరో హైలైట్‌గా నిలవనుంది. Happy Birthday @SilambarasanTR_ !! 🤗🤗 Super happy to launch the #Rewindteaser. Looks gripping! Good luck to the entire team! @vp_offl @sureshkamatchi @thisisysrhttps://t.co/WFiTDwoJiS — Ravi Teja (@RaviTeja_offl) February 3, 2021 -
పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో బన్నీ సినిమా!
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త ప్రాజెక్టు ఒకే చెప్పినట్లు సమాచారం. ‘యాత్ర’ ఫేం డైరెక్టర్ మహి ఆర్ రాఘవ దర్శకత్వంలో నటించేందుకు బన్నీ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో లాక్డౌన్లో మరో క్రేజీ స్క్రిప్ట్ కోసం ఎదురుచుస్తున్న బన్నీకి దర్శకుడు ఆర్ రాఘవ స్క్రిప్ట్ వినిపించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చదవండి: అందుకే ‘పుష్ప’ నుంచి తప్పుకున్నా: విజయ్ ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న వాస్తవిక సంఘటన ఆధారం తెరకెక్కనుందని తెలుస్తోంది. మొదటిసారిగా బన్నీ-మహీ కాంబినేషన్లో ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రసాద్ వి పొట్లూరి నిర్మించేందుకు ఆసక్తిని చూపినట్లు టాలీవుడ్ టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8), పుష్ప నిర్మాతలు ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. (చదవండి: బన్నీని ఒక్క ఛాన్స్ అడిగిన బాలీవుడ్ డైరెక్టర్) -
ఈనాడు పండుగే పండుగ
సాక్షి, హైదరాబాద్: ఖైదీ సినిమా భారీ విజయంతో తెలుగులో మరోసారి మంచి జోష్ మీద ఉన్న కార్తీ త్వరలోనే దొంగ సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ను అందుకునేందుకు సిద్ధమవు తున్నాడు. కార్తీ అప్ కమింగ్ మూవీ ‘దొంగ’ సినిమా పోస్టర్స్‌కి, టీజర్‌తోపాటు రూపీ రూపీ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో ప్రేక్షకుల అంచనాలు ఇలానే ఉన్నాయి. కార్తీకి నిఖిలా విమల్ జంటగా నటిస్తున్న మరో సూపర్ హీరోయిన్ జ్యోతిక (హీరో సూర్య భార్య), సత్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా ఈనాడు పండగే పండగే అనే వీడయో పాటు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అన్సన్ పాల్, ఇలావరసు, అమ్మూ అభిరామి, షావుకారు జానకి, సీత, అశ్వంత్ అశోక్ కుమార్, రమేష్ తిలక్ తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి జోసెష్ దర్శకత్వం వహిస్తుండగా, వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరులో అన్ని భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సాహిత్యాన్ని రామజోగయ్యశాస్త్రి అందించగా రంజింత్ గోవింద్ స్వరాలు కూర్చారు. ఎప్పటిలాగానే గాయని చిన్మయి శ్రీపాద తన స్వరంలో మెలోడీతో మ్యాజిక్ చేశారు. ఒకవైపు కేరళ అందాలు అలరిస్తోంటే.. రూపి రూపి పాటలో లాంగ్ హెయిర్‌తో..విలక్షణంగా ఆకట్టుకున్న కార్తీ తాజా సాంగ్‌లో మాత్రం రఫ్ లుక్‌తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. -
కొత్తరకం గ్యాంగ్‌స్టర్
స్వాతంత్య్ర దినోత్సవం రోజున గ్యాంగ్‌స్టర్‌గా థియేటర్స్‌లోకి రానున్నారు శర్వానంద్. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలుగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మంగళవారం కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఇది వరకు ఈ చిత్రాన్ని ఆగస్టు 2న విడుదల చేయాలనుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘ఈ సినిమాలో శర్వానంద్ నటన ఆయన గత చిత్రాలతో పోల్చినప్పుడు విభిన్నంగా ఉంటుంది. 1990–2000 సమయంలో ఈ సినిమా స్క్రీన్ ప్లే ఉంటుంది. సుధీర్ వర్మ బాగా తెరకెక్కించారు. అన్నివర్గాల వారికీ నచ్చుతుంది. మా నూతన గ్యాంగ్‌స్టర్‌ను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మెగాస్టార్
సాక్షి,ముంబై: బాలీవుడ్ మోగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (76) మరోసారి తన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. లేటు వయసులో కూడా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న అమితాబ్ రాబోయే చిత్రం "గులాబో సితాబో" ఫస్ట్‌లుక్ విడుదలైంది. పొడవాటి గడ్డం, కళ్ళజోడు, వెరైటి తలపాగా, ప్రొస్థెటిక్ ముక్కుతో ఓల్డ్ మాన్ లుక్‌లో గుర్తుపట్టలేనంతగా బిగ్ బి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. ఆయుష్మాన్ హీరోగా సుజీత్ సిర్కార్ తెరకెక్కిస్తునన్న గులాబో సితాబొ అనే చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. అందులో అమితాబ్‌కు చెందిన ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ విమర్శకుడు తరన్ ఆదర్శ్ ట్విటర్లో షేర్ చేశారు. పికూ రచయిత జుహీ చతుర్వేది కథను సమకూర్చగా.. లక్నో పరిసర ప్రాంతాలల్లో షూటింగ్ జరపుకుంటోంది. ఇదివరకెన్నడూ నటించని పాత్రలో విలక్షణంగా అమితాబ్ ఈ మూవీలో అలరించనున్నారట. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. Unveiling Amitabh Bachchan's quirky character look from #GulaboSitabo... Costars Ayushmann Khurrana... Directed by Shoojit Sircar... 24 April 2020 release. pic.twitter.com/Tg2V678xSu — taran adarsh (@taran_adarsh) June 21, 2019 -
రేస్ 3...తాజా పోస్టర్ చూస్తే...
సాక్షి,ముంబై: బాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీపై తాజాగా వెల్లడైన పోస్టర్ అభిమానుల్లో హల్చల్ చేస్తోంది. తన అప్‌కమింగ్ మూవీ ‘రేస్ 3’ ట్విటర్లో హింట్లు ఇస్తున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ తాజాగా మరో ఫోటోను షేర్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ పోస్టర్ని ట్విటర్లో సల్మాన్ పోస్ట్ చేశారు. అయితే ఈ సారి మాత్రం హీరో బాబీ డియోల్‌తో జాక్విలైన్ ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను పోస్ట్ చేయడం విశేషం. ఈ పోస్టర్ లుక్, బాబీ, జాక్విలైన్ మధ్య రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల సల్మాన్ ట్వీట్ ప్రకారం సల్మాన్‌తో వెరైటీగా పోజులిచ్చిన జాక్విలైన్, ఇప్పుడు బాబీడియోల్‌తో కనిపించడంతో ఈ సినిమాపై ఇంకా భారీ క్రేజ్ నెలకొనడంతోపాటు యూత్‌లో భారీ సస్పెన్స్ నెలకొంది. ఎవరు ఏంటో అనే సీక్రెట్ త్వరలోనే రివీల్ అవుతుందంటూ సల్మాన్ ప్రకటించడంతో.. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరితో రొమాన్స్ చేయబోతోందన్న డౌట్ సినీలవర్స్‌ని వెంటాడుతోంది. రెమో డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌లో సల్మాన్, అనిల్‌కపూర్ బాబీడియోల్తోపాటు జాక్విలైన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా ‘రేస్’ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టగా, గతంలో సైఫ్ చేసిన రోల్లో ఇప్పుడు సల్మాన్ అలరించనున్నారు. జాక్విలైన్ మొదటి రెండు భాగాల్లోనూ నటించారు. ఈద్ సందర్భంగా జూన్ 15 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
'పూరీ సినిమాలో మహేష్ పాత్ర అదుర్స్'
పూరీ జగన్నాథ్, మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా మీద వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను పూరీ జగన్ స్టోరీ విన్నానని, ఇది ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల కంటే బెస్ట్ అని అన్నాడు. ఈ కొత్త సినిమాలో మహేశ్ బాబు పాత్ర ఇప్పటివరకు పూరీ జగన్నాథ్ సృష్టించిన అన్ని పాత్రల కంటే, అలాగే మహేష్ పోషించిన అన్ని పాత్రల కంటే పది రెట్లు బాగుందని చెప్పాడు. ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర, డైలాగులు సన్నీ లియోన్ కంటే పది రెట్లు సెక్సీగా ఉంటాయని, పోకిరీ, బిజినెస్‌మ్యాన్, దూకుడు కంటే కూడా పదిరెట్లు బాగుంటాయని వర్మ తెలిపాడు. తాను విన్న స్టోరీ ప్రకారం అయితే పూరీ జగన్నాథ్, మహేశ్ బాబు కలిసి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల విషయంలో సరికొత్త రికార్డు సృష్టిస్తారని, హీరోయిజం కూడా హిమాలయాలంత ఎత్తుకు ఎదుగుతుందని రాంగోపాల్ వర్మ చెప్పాడు. Just heard puri jagans story with Mahesh babu..compared to this Sholay size of a story Pokiri,Businessman,Dookudu are Aag — Ram Gopal Varma (@RGVzoomin) May 13, 2015 Mahesh babu's character in Puri Jagan's new film is 10 times better than any character Jagan created and any character Mahesh babu played — Ram Gopal Varma (@RGVzoomin) May 13, 2015 Mahesh babu character nd dialogue in Puri's is 10 times sexier than Sunny Leone nd 10 times more Bahubalier than Pokiri, Businessman,Dookudu — Ram Gopal Varma (@RGVzoomin) May 14, 2015 Going by the story I heard Puri Jagan, Mahesh babu film will set an ultra new bench mark for action entertainers and a Himalayan heroism — Ram Gopal Varma (@RGVzoomin) May 14, 2015