![Sanjay Dutt Birthday Bhuj The Pride Of India BhaiBhaisong out - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/29/Sanjay-Dutt.jpg.webp?itok=wM2NFzK-)
సాక్షి, ముంబై: పుట్టిన రోజు సందర్భంగా సంజయ్ దత్‌కు మరో అపురూపమైన కానుక అందింది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా నటిస్తున్న బాలీవుడ్ మూవీ భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలోని ‘భాయీ భాయీ’ పాటను చిత్ర యూనిట్ గురువారం రిలీజ్ చేసింది. ఇది తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా చేసిందంటూ సంజయ్ దత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆగస్టు 13 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వీఐపీలో మాత్రమే ఈ మూవీ విడుదలకానుంది.
కాగా 1971 భారత, పాకిస్థాన్ మధ్య జరిగియన యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ్ రావెల్ దర్శకత్వం వహిస్తుండగా, నోరా ఫతేహీ, ప్రణీత, శరద్‌ఖేల్కర్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల (జూలై 12) విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్‌ను బాగానే ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment