జేడీ వాన్స్‌ కుమారుని బర్త్‌డే వేడుకలకు ప్రధాని మోదీ | America Vice President JD Vance Son Birthday, PM Modi Meets Family | Sakshi
Sakshi News home page

జేడీ వాన్స్‌ కుమారుని బర్త్‌డే వేడుకలకు ప్రధాని మోదీ

Published Wed, Feb 12 2025 10:27 AM | Last Updated on Wed, Feb 12 2025 11:11 AM

America Vice President JD Vance Son Birthday, PM Modi Meets Family

పారిస్‌: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కుమారుని పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జేడీ వాన్స్‌, భారత సంతతికి చెందిన అతని భార్య ఉషలతో సమావేశమయ్యారు. జేడీ వాన్స్ కుమారుడు వివేక్‌కు మోదీ పుట్టినరోజు బహుమతులను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోను ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫొటోలో వాన్స్‌తో పాటు అతని భార్య ఉష, కుమారులు ఇవాన్, వివేక్‌లు కూడా ఉన్నారు.

ప్రధాని మోదీ తన ట్వీట్‌లో.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను, ఆయన కుటుంబ సభ్యులను కలుసుకున్నాను. వివిధ అంశాలపై మేము మాట్లాడుకున్నాం. వాన్స్‌ కుమారుడు వివేక్ పుట్టినరోజు వేడుకకు హాజరు కావడం  చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. కాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ చాలా  మంచి మనసు కలిగిన వ్యక్తి అని, ఆయన మా పిల్లలకు ఇచ్చిన బహుమతులను  చూసి వారు చాలా  ఆనందించారన్నారు. ఆయనకు కృతజ్ఞతలు అని జేడీ వాన్స్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

కాగా ప్రధాని మోదీ, జేడీ వాన్స్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) షేర్ చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు తన ప్రసంగంలో సమ్మిట్‌కు సహ అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ కృత్రిమ మేధస్సుపై చూపిన సానుకూల వైఖరిని స్వాగతించారు. ఏఐ ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందిస్తుందని, ఉత్పాదకతను  మరింతగా పెంచుతుందన్నారు. అయితే ఇది  మనుషుల మేథను ఎప్పటికీ భర్తీ  చేయలేదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: నేడు రాష్ట్రపతి భవన్‌లో తొలి పెళ్లి బాజాలు.. వివాహం ఎవరికంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement