Ram Gopal Varma Released Satirical Song Released On Chandrababu Birthday, Video Viral - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: కర్మ ఫలితం రిపీట్‌ అయింది: చంద్రబాబుపై ఆర్జీవీ సాంగ్ వైరల్

Published Thu, Apr 20 2023 3:01 PM | Last Updated on Thu, Apr 20 2023 3:23 PM

Ram Gopal Varma satirical Song Released On Chandrababu Birthday - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా స్పెషల్‌గానే ఉంటుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు బర్త్‌డే సందర్భంగా ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేశాడు రాంగోపాల్ వర్మ. ఒకవైపు హ్యాపీ బర్త్‌డే చెబుతూనే.. సిక్కోసైకో అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ సాంగ్‌ను ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రూపొందించినట్లు ట్వీట్‌లో వెల్లడించారు. 

ఈ సాంగ్‌లో చంద్రబాబు రాజకీయ జీవితం కాంగ్రెస్‌లో ప్రారంభం.. ఆ తర్వాత అధికారం కోసం సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం నుంచి.. ఇప్పటి దాకా చేసిన రాజకీయ కుట్రలను ప్రస్తావించాడు. పదవి కోసం చంపేసిన మామ ఫోటోనే అడ్డం పెట్టుకుని ఎల్లో మీడియా సాయంతో జనాన్ని మోసం చేశాడంటూ చూపించారు. అలాగే లోకేశ్‌పై సెటైరికల్ లిరిక్స్ కూడా ఈ సాంగ్‌లో ఉన్నాయి. అవతలి వాళ్లవైపు ఒకవేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు నీవైపు చూపిస్తాయని..  40 ఏళ్ల ఇండస్ట్రీ తెలుసుకోలేక అదృష్టపరంగా దురదృష్టం అంటూ అర్జీవీ సెటైర్స్ వేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement