చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా 'నిజమా' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.
అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలోని 'నిజమా' పాటను ఇప్పుడే చూశా. పాటను చాలా బాగా చిత్రీకరించారు. నేను విడుదల చేయడం ఇంకా సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్తో వస్తోన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని అన్నారు.
దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. "రామ్ గోపాల్ వర్మతో బ్యూటీ ఆఫ్ ప్యాషన్, ఆట అనే రెండు చిత్రాలకు పని చేశా. ఆయన చిత్రాలు మా లాంటి దర్శకులకు మంచి స్ఫూర్తి. శివ చిత్రం నాకు దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నా. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. రామ్ గోపాల్ వర్మ మా చిత్రంలోని మొదటి పాట లిరికల్ వీడియోని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment