lyrics
-
అజిత్ కుమార్ విదాముయార్చి.. రెండో లిరికల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie). ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కాగా.. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పతికిచ్చు అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ సాంగ్ అజిత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంక్రాంతికి వాయిదా..ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.రేస్ గెలిచిన అజిత్..ఇటీవల దుబాయ్‌లో జరిగిన 24హెచ్ కారు రేసులో అజిత్ టీమ్ మూడోస్థానంలో నిలిచింది. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత అజిత్ తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. దీంతో అజిత్ టీమ్‌పై సినీ తారలు ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన అనంతరం అజిత్ జాతీయజెండా పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. #PATHIKICHU Out Now 💥➡️ https://t.co/BDeqesYfGc#AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/9fDtLofv7h— Ajith Kumar (@ThalaFansClub) January 19, 2025 -
బెల్లంకొండ బర్త్ డే స్పెషల్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం భైరవం. ఈ చిత్రంలో ఆదితి శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన హీరోకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఓ వెన్నెల అంటూ సాంగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన సాంగ్ ఓ వెన్నెల సాంగ్‌కు తిరుపతి జావన లిరిక్స్ అందించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, యామిని ఆలపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతమందిస్తోన్న ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అదితి శంకర్‌తో పాటు దివ్యా పిళ్లై, ఆనంది కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.Happy to launch this soothing melody #OoVennela from #Bhairavam ▶️ https://t.co/BvAn6n84rt Happy Birthday @BSaiSreenivas, wish you all the luck and success this year.All the best @AditiShankarofl, @KKRadhamohan Garu , @DirVijayK, @sricharanpakala & Team pic.twitter.com/eZ9lNclFkK— Nani (@NameisNani) January 3, 2025 -
విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రం మెకానిక్ రాకీ. ఈ సినిమాకు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.తాజాగా విడుదలైన ఐ హేట్ యూ మై డాడీ అంటూ సాగే పాట ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా.. సింగర్ రామ్ మిరియాల ఆలపించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మెకానిక్ పాత్రతో అలరించనున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్, నరేష్ వీకే, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వైవా హర్ష, రఘురామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జేక్స్ బేజోయ్ సంగీతమందిస్తున్నారు. It’s a new vibe, for sure😂Listen to our #IHateuMyDaddy from #MechanicRocky 🛠🔥🔗https://t.co/C0XtVfkoPW#MechanicRockyOnNOV22 🛠🎵 @JxBe🎤 #RamMiriyala✍️ #Sanare@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @ShraddhaSrinath @JxBe #RajaniTalluri @SRTmovies… pic.twitter.com/lpU6FzRc9X— VishwakSen (@VishwakSenActor) November 6, 2024 -
ఫస్ట్–రేట్ రచయిత
సెకండ్–రేట్ రచయితల్లో తాను మొదటి వరుసలో ఉంటానని చెప్పుకొన్నాడట సోమర్సెట్ మామ్. ఆయన దృష్టిలో బాల్జాక్, డికెన్ ్స, టాల్‌స్టాయ్, దోస్తోవ్స్కీ ప్రపంచం చూసిన నలుగురు గొప్ప నవలాకారులు. పాఠకులను సాహిత్యం వైపు ఆకర్షించడమే కొందరు రచయితల విలువైన కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ కూడా మామ్ మొదటి వరుసలో ఉంటారు. ఆంగ్ల అనువాద కథలతో పరిచయం ఉండే తెలుగు పాఠకులకు దాదాపుగా తగిలే మొదటిపేరు విలియమ్ సోమర్సెట్ మామ్. అత్యధిక కాపీల అమ్మకం, అత్యంత పేరు, అత్యధిక సంపాదనలతో చాలా విధాలుగా ఒక కమర్షియల్ రచయిత కూడా కలలు కనలేని జీవితాన్ని మామ్ అనుభవించాడు. హాలీవుడ్ సినిమాలకు పనిచేశాడు, దేశదేశాలు తిరిగాడు, అత్యంత ప్రముఖులతో విలాసవంతమైన టూర్లు, డిన్నర్లల్లో పాల్గొన్నాడు. తన గురించి మామ్ ఏమని చెప్పుకొన్నా, ఆయన ‘ద మూన్ అండ్ సిక్స్పెన్ ్స’, ‘ద పేంటెడ్ వీల్’, ‘కేక్స్ అండ్ ఎయిల్’, ‘ద రేజర్స్ ఎడ్జ్’ గొప్ప నవలలుగా పేరొందాయి. ఇక మామ్ మాస్టర్‌పీస్‌గా చెప్పే ‘ఆఫ్ హ్యూమన్ బాండేజ్’ ప్రపంచ గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచిపోయింది. నూటికి పైగా కథలు, పదులకొద్దీ నాటకాలు, నవలలు... ఎంత విస్తృతంగా రాశాడో అంత ఆదరణ పొందిన మామ్‌కు ఇది నూటా యాభయ్యో జయంతి సంవత్సరం. మామ్ జీవితంలోనూ ఒక రచనకు కావాల్సినంత డ్రామా, కన్నీళ్లు, కష్టాలు, ట్విస్టులు ఉన్నాయి. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఆంగ్లాన్ని చిన్నతనంలో సాటి విద్యార్థులు హేళన చేసేవారు. కారణం, జన్మకు ఆంగ్లేయుడు అయినా, పుట్టింది ఫ్రెంచ్ గడ్డ మీద. అలా ఫ్రెంచ్ ఆయన మొదటి భాష అయింది. ఫ్రెంచ్ గడ్డ మీద పుట్టిన అందరూ ఫ్రెంచ్‌వాళ్లే అవుతారనీ, తప్పక మిలిటరీలో చేరాల్సిందేననీ శాసనం వచ్చినప్పుడు ఆ స్థానీయతను తప్పించుకోవడానికి మామ్ కుటుంబం ఫ్రాన్ ్సలోని బ్రిటిష్ దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించింది. అందులోనే మామ్‌కు జన్మనిచ్చింది(1874 జనవరి 25) వాళ్ల తల్లి. అలా బ్రిటన్ ఎంబసీలో జన్మించడం వల్ల మామ్ బ్రిటనీయత స్థిరపడిపోయింది. వాళ్ల గ్రేట్–అంకుల్ గుర్తుగా పెట్టిన సోమర్సెట్ అనే మధ్యపేరు ఆయనకు నచ్చలేదు. ఇంట్లో విల్లీ అని పిలిచేవాళ్లు. మామ్‌కు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే తల్లి క్షయవ్యాధితో చనిపోయింది. ఆ లోటు ఆయనకు ఎప్పుడూ తీరలేదు. ‘అది ఎప్పడూ పూర్తిగా మానని గాయం’గానే ఉండిపోయింది. వృద్ధుడయ్యాక కూడా తల్లి ఫొటోను మంచం పక్కనే ఉంచుకునేవాడు. ఆ తర్వాత రెండేళ్లకే తండ్రి చనిపోవడం మరో దెబ్బ. అప్పుడు బ్రిటన్ లోని చిన్నాన్న దగ్గరికి వచ్చాడు. ఆ కొత్త ఇల్లు, వాతావరణం బాగున్నప్పటికీ, తల్లిదండ్రులు లేని చింత, కొత్త సమాజంలో కలవలేకపోవడం, సిగ్గరి కావడం వంటి కారణాల వల్ల ఇట్టే మాట్లాడేవాడు కాదు. అది క్రమంగా నత్తిగా మారి జీవితాంతం ఆయనతో ఉండిపోయింది. తాత, తండ్రి న్యాయవాదులు అయినప్పటికీ మామ్ ఆ బాటలోకి పోకపోవడానికి ఈ నత్తి కూడా ఒక కారణం. డాక్టర్ కాబోయి యాక్టర్ అవడంలా కాకుండా, నిజంగానే డాక్టరీ చదివినా దాని జోలికి పోకుండా రంగస్థలంలో ప్రాక్టీస్ చేశాడు మామ్. నాటకాలతో ముందు ప్రజాదరణ పొందినా తర్వాత నవలలు, కథల మీద మాత్రమే దృష్టిసారించాలని నిశ్చయించుకున్నాడు. ఒక చదవదగ్గ కథకు మెటీరియల్ రాకపోతే తానెవరి సమక్షంలోనూ గంటసేపు కూడా గడపనని అనేవాడు. ఆయనకు ఏదైనా కథావస్తువే. దానికి తగినట్టే ఆయన జీవితం కూడా అనుభవాల పుట్ట. యువకుడిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ సీక్రెట్ ఇంటెలిజెన్ ్స సర్వీస్ కోసం కొన్నాళ్లు స్విట్జర్లాండ్‌లో గూఢచారిగా పనిచేశాడు. ఫ్రెంచ్ నాటక రచయిత అన్నది అప్పుడు ఆయన కవర్. తర్వాత, రష్యాలోనూ బోల్షివిక్కులకు వ్యతిరేకంగా, జర్మన్ నిఘా నెట్వర్క్ మీద సమాచారాన్ని పంపాడు. మెన్షివిక్కులకు మద్దతు ఇవ్వాలన్నది బ్రిటన్ ఆలోచన. జర్మనీలో చదువుకున్నందువల్ల మామ్‌కు జర్మన్ వచ్చు. ఈసారి అమెరికా పబ్లిషర్ అనేది కవర్. అయితే ఈ అనుభవాలను రచనలుగా తెచ్చాడుగానీ అధికార రహస్యాల చట్టాన్ని ఇవి ఉల్లంఘిస్తుండటంతో చాలావాటిని కాల్చేశాడు. అయినా గూఢచర్య కథలు రాసిన తొలి గూఢచార రచయిత మామ్ అయ్యాడు. జేమ్స్ బాండ్ సిరీస్ రాయడానికి ఇయాన్ ఫ్లెమింగ్‌కు ప్రేరణగా నిలిచాడు. కానీ గూఢచర్యంలో పనిరోజులు ఒకేవిధంగా ఉండి విసుగు పుట్టిస్తాయనీ, చాలా రోజులు నిరర్థకమనీ వ్యాఖ్యానించాడు. ఇటీవల వచ్చిన మలయాళ సినిమా ‘కాదల్’లో హోమోసెక్సువల్ అయినప్పటికీ హీరోకు ఒక కూతురు ఉంటుంది. దాంపత్య బంధపు ఒత్తిడి అది. మామ్ కూడా లైంగిక ధోరణి రీత్యా హోమోసెక్సువల్. పదేళ్ల వివాహ బంధంతో ఆయనకు ఒక కూతురు. కానీ తర్వాత వివాహం నుంచి విముక్తం అయ్యి స్నేహితులతో స్వేచ్ఛాజీవితం గడిపాడు. తల్లి దూరమవడం మొదలు తన జీవితంలోని అపసవ్యతలన్నింటి కారణంగా, జీవితాంతం దేవుడి మీద అవిశ్వాసిగా ఉన్న మామ్ తన ఆత్మకథాత్మక నవలను చివరి దశలో చదువుకున్నా కన్నీళ్లు కార్చకుండా పూర్తిచేసేవాడు కాదు. ఇంకేది కలిపినా డిజైన్ పాడవుతుందని తెలిసినప్పుడు ఆర్టిస్ట్ ఇక దాన్ని వదిలేసినట్టుగా, తాను రచయితగా సంతృప్తికర దశలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలించాలని మామ్ ఆశపడ్డాడు. అన్నింటి విషయంలో జరిగినట్టుగానే ప్రకృతికి ఆయన విషయంలో వేరే లెక్ఖుంది. కోరుకున్న ముప్పై సంవత్సరాల తర్వాత, అన్ని వృద్ధాప్యపు సమస్యలతో పాటు 91 ఏళ్ల నిండుతనం కూడా ఇచ్చిగానీ ఆయన్ని సాగనంపలేదు. -
నా స్నేహితుడి సినిమా హిట్ అవ్వాలి: ఆర్జీవీ
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా 'నిజమా' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలోని 'నిజమా' పాటను ఇప్పుడే చూశా. పాటను చాలా బాగా చిత్రీకరించారు. నేను విడుదల చేయడం ఇంకా సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని అన్నారు. దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. "రామ్ గోపాల్ వర్మతో బ్యూటీ ఆఫ్ ప్యాషన్, ఆట అనే రెండు చిత్రాలకు పని చేశా. ఆయన చిత్రాలు మా లాంటి దర్శకులకు మంచి స్ఫూర్తి. శివ చిత్రం నాకు దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నా. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. రామ్ గోపాల్ వర్మ మా చిత్రంలోని మొదటి పాట లిరికల్ వీడియోని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. -
‘కొడిపాయే లచ్చమ్మది’ అంటోన్న హెబ్బా పటేల్.. !
యంగ్ హీరో దినేష్ తేజ్, హీరోయిన్ హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'అలా నిన్ను చేరి'. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'కొడిపాయే లచ్చమ్మది' అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను మంగ్లీ పాడగా.. కుర్రకారుని కట్టిపడేసేలా మరో జానపదంగా నిలవబోతోంది. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య రిలీజ్ చేసిన అలా నిన్ను చేరి టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండింగ్‌లో నిలిచిన తెలిసిందే. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘యంగ్ టీం అంతా కలిసి ఈ సినిమాను నిర్మించారు. యంగ్ టాలెంట్‌ను ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. కొత్త సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. యంగ్ టాలెంట్ టీం తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ మూవీపెద్ద విజయం సాధించాలి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. Mass Folk Fest Begins!! Put Your dance shoes to groove 💃 🕺 Honourable Minister Sri @YadavTalasani launched the Folk Number #KodiBhayeLachammadi from #AlaNinnuCheri and wished the team all the luck@iamMangli sensational singing Watch the Lyrical Here:https://t.co/J2LUBtDhpd pic.twitter.com/c1ivLs3kti — Dinesh Tej (@idineshtej) September 27, 2023 -
సింగిల్‌గా ఉండు మామా..
‘హే సింగిల్‌గా ఉండు మామా.. గాళ్‌ఫ్రెండ్ ఎందుకు?..హైదరాబాద్.. సికింద్రాబాద్..పొరెంటబడితే నువ్వు బరాబాత్’ అంటూ మొదలవుతుంది ‘మ్యాడ్’ చిత్రంలోని ప్రౌడ్సే బోలో ఐయామ్ సింగిల్’ పాట. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో ఎస్. హారిక, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్..’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సారథ్యంలో రఘురామ్ సాహిత్యం అందించారు. నకాష్ అజీజ్‌తో కలిసి భీమ్స్ సిసిరోలియో ఈ పాటను ఆలపించారు. -
లిరిక్స్ వివాదం.. యండమూరికి చంద్రబోస్ గట్టి కౌంటర్
ప్రముఖ నవలా రచయిత, మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్‌కు సినీ గేయ రచయిత చంద్రబోస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చంద్రబోస్ రాసిన టైటిల్ సాంగ్‌పై ఫేస్బుక్ వేదికగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ పాటలో సాహిత్యం అర్థం లేకుండా ఉందని, పాటలోని కొన్ని పంక్తులపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తుఫాన్ అంచున తపస్సు చేసే వశిష్టుడే వీడే..తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే’ అనే పంక్తిని ఉద్దేశిస్తూ ‘తిమిరము’ అంటే అర్థం తెలుసా? శివదూషణ కాదా ఇది? ఎవరు రాశారో కానీ ఏమిటీ పిచ్చి రాతలు? అంటూ యండమూరి వీరేంద్రనాథ్ పోస్ట్ చేశారు. చదవండి: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ ఆయన కామెంట్స్‌కి చంద్రబోస్ గట్టిగా బదులిచ్చారు. తాను రాసిన పాటలోని లైన్లు విరోధాబాసాలంకారం కిందకు వస్తాయని, పరస్పర విరుద్ధమైన రెండు పదాలు కలయికను లోతుగా పరికిస్తే విరోధం తొలగిపోయి ఆ పదబంధం లోతు తెలుస్తుందన్నారు. ఇది రచయితలు అందరికీ తెలుసని, తనకు తెలిసే ఈ ప్రయోగం చేశానని వివరణ ఇచ్చారు. అసలు తిమిరంలోని నిగూడార్థం తెలియని వారే అసలైన తిమిరమంటూ చంద్రబోస్ రీకౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ప్రముఖ రచయిత సత్యానంద్ ఫోన్ చేసి సాహిత్యపరంగా అధ్యయనం చేయాల్సిన గీతమిదని ప్రశంసించారన్నారు. చదవండి: సందీప్ రెడ్డి వంగ, రణ్‌బీర్ కపూర్ యానిమల్ నుంచి క్రేజీ అప్డేట్ -
షాకింగ్ ఘటన: స్టేజ్‌పై ఉన్నట్టుండి పాడటం ఆపేసిన సింగర్
కొత్త గొంతుకలను వెలుగులోకి తీసుకొచ్చే షో ఇండియన్ ఐడల్. ఈ ప్రఖ్యాత పాటల పోటీల్లో పాల్గొన్న వారు భావి గాయకులుగా మారి సంగీతప్రియుల మది దోచుకుంటున్నారు. మన తెలుగు సినీ గాయకుడు రేవంత్ కూడా ఆ కోవకు చెందిన వాడే. తాజాగా హిందీ ఇండియన్ ఐడల్ 12వ సీజన్ కొనసాగుతోంది. ఈ పోటీల్లో తన పాటలతో మెస్మరైజ్ చేస్తున్న పవన్‌దీప్ రాజన్ అనూహ్యంగా ప్రేక్షకులతో పాటు జడ్జిలను షాక్‌కు గురి చేశాడు. తన్మయత్వంతో పాట పాడుతుండగా అందరూ మరో లోకంలో తేలుతున్న సమయంలో హఠాత్తుగా పవన్‌దీప్ అర్ధాంతరంగా పాట ఆపేసి.. ఇక చాలు అని వెళ్లిపోయాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను సోనీ టీవీ విడుదల చేసింది. పవన్‌దీప్ ‘హోతన్ సే చులో తుమ్’ పాట పాడుతూ అకస్మాత్తుగా ఆపేశాడు. అంతసేపు ఆసక్తిగా వింటున్న జడ్జిలు ఒకప్పటి నటీనటులు ధర్మేంద, అనితా రాజ్ పాట ఆగిపోవడంతో జడ్జిలు, తోటి పోటీదారులు షాకయ్యారు. మైక్ ఆపేసి వెళ్తున్న పవన్‌దీప్‌ను మరో పార్టిస్పెంట్ నిలువరించి పాటను గుర్తు చేసే ప్రయత్నం చేసింది. ప్రేమ్‌గీత్ సినిమాలో ఆ పాటను గజల్ కింగ్ జగ్జీత్ సింగ్ పాడారు. ఆయనను మరిపించేలా పాడుతున్న పవన్‌దీప్ ఇలా చేయడంతో ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు. ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్ దీప్ సీజన్ మొదటి నుంచి ప్రేక్షకులను తన పాటలతో రంజింపజేస్తున్నారు. అతడి మధురమైన గాత్రానికి సోషల్ మీడియా ఫిదా అవుతోంది. ఇండియన్ ఐడల్ 12వ విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. అలాంటి రాజన్ అకస్మాత్తుగా ఇలా చేయడంతో షోలో అతడిపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న పవన్‌దీప్ గతంలో కరోనా బారినపడ్డాడు. దీంతో పవన్‌దీప్ వర్చువల్‌గా ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొని వార్తల్లో నిలిచాడు. #IdolPawandeep ki iss performance se kya rang layega iss shaam ka mausam? Dekhiye #DharmendraAndAnitaRajSpecial #IndianIdol2020 aaj raat 9:30 baje, sirf Sony par! pic.twitter.com/YxptSJS1QO — sonytv (@SonyTV) July 18, 2021 -
అరే...! ఈ పాట ఎక్కడో విన్నట్టుందే ?
ఇలా మీకు చాలాసార్లు జరిగి ఉండొచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్‌కో, లేదంటే లాంగ్ డ్రైవింగ్‌కి వెళ్లే సమయంలో ఎఫ్ఎమ్ లో మీకు నచ్చిన పాట ప్లే అవుతుంది. అరే ఈ పాటేదో బాగుందే. ఆ ఆల్బమ్ ను కొనుక్కోని మరోసారి వినాలని'అనుకుంటారు. కానీ అది సాధ్యపడదు. ఎందుకంటే మీకు ఆ సాంగ్ లిరిక్ తెలియదు. ఏ ఆల్బమ్ లోని పాటో గుర్తించలేరు. కానీ ఈ చిన్న టిప్స్‌తో మీకు నచ్చిన సాంగ్స్ ను చిటికెలో కనిపెట్టేయోచ్చు. ఆ సాంగ్ పేరేంటో? లిరిక్స్ ఏంటో తెలియదా? మీకు ఇష్టమైన సాంగ్ గురించి గూగుల్ లో మీకు నచ్చిన విధంగా సెర్చ్ చేస్తుంటారు. ఆ పాటకు సంబంధించిన ఆల్బమ్ పేరు, పాడింది ఎవరో ఒక క్లూ దొరకుతుంది. మరి ప్రత్యేకంగా మీకు నచ్చిన సాంగ్ ను ఎలా గుర్తించాలి. సింపుల్. 1. షాజామ్: షాజామ్ అనే ఫ్రీ మొబైల్ అప్లికేషన్ ను మీ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. డౌన్ లోడ్ అనంతరం ఆడియో సోర్స్ లో ట్యాగ్ బటన్ క్లిక్ చేస్తే మీకు మీకు నచ్చిన సాంగ్ ప్లే అవుతుంది. కాకపోతే ఈ సదుపాయం కేవలం ప్రీ రికార్డ్ సాంగ్స్ కు మాత్రమే ఉంది. లైవ్ సాంగ్స్ కు అనుమతిలేదు. ఇక అన్ లిమిటెడ్ కావాలనుకుంటే నెలకు రూ.900పే చేయాల్సి వస్తుంది. 2. మ్యూజిక్ ఐడియా : అనే యాప్ ను ఐఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ పాడితే .. వెంటనే ఆ పాట ప్లే అవుతుంది. పెయిడ్ వెర్షన్ కింద నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. 3. వాయిస్ తో సాంగ్ ను గుర్తించడం ఎలా? మిడోమీ : ముందుగా ఫ్రీ వెర్షన్లో ఉన్న మిడోమీ అనే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం హెడ్ సెట్ తగిలించుకొని యాప్ లో 'అన్నోన్' అనే ఆప్షన్ క్లిక్ చేసి పాట పాడితే.. మీరు పాడిన పాట ఏ ఆల్బమ్, ఏ సినిమాలోనిదో ఇట్టే చెప్పేస్తుంది. 4. ఆడియో ట్యాగ్ : ఆడియో ట్యాగ్ లో మీకు నచ్చిన సాంగ్‌ను సిస్టమ్‌లో రికార్డ్ చేసి ఉంటే ఆడియో ట్యాగ్ యాప్ లో అప్ లోడ్ చేయాలి. అనంతరం సెకన్ల వ్యవధిలోనే మీకు నచ్చిన సాంగ్, ఆ సాంగ్ కు సంబంధించిన వివరాలు ఆడియో డేటా బేస్ లో డిస్ప్లే అవుతాయి. చదవండి: Facebook: కొత్త ఫీచర్ గురించి తెలుసా?! -
జల జల జల జలపాతం నువ్వు.. లిరికల్ సాంగ్
జల జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చెర చెర నువు అల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను హే... మన జంటవైపు జాబిలమ్మ తొంగి చూసెనే హే... ఇటు చూడకంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసెనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే ‘‘జల జల‘‘ సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుందీ లోపలా ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఎలాగ బైటపడుతోంది ఈవేళా నడి ఎడారి లాంటి ప్రాణం తడి మేఘానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్నూ తెంచలేదు లోకం ‘‘జల జల‘‘ ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజూ ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్లు ఎలాగ దీన్ని గుండెల్లో దా^è డం ఎప్పుడూ లేనిదీ ఏకాంతం ఏక్కడా లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం ‘‘చలి చలి‘‘ చిత్రం : ఉప్పెన రచన : శ్రీమణి గానం : జస్ప్రీత్ జాజ్, శ్రేయా ఘోషల్ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ -
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. లిరికల్ సాంగ్
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే ‘‘2‘‘ సానిసా సారిగారి సానిసానిసాని సానిసా సాగమామపమాగారీస సానిసా సారిగారినీ సానిపానిసానిసా సాగమమమ మాప మాగరీస అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చిరాతలైన కవితలవునులే ప్రేమకెపుడు మనసులోన భేదముండదే ఎంగిలైన అమృతమ్ములే బొండుమల్లి ఒక్క రూపాయి నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు పీచు మిఠాయ్ అర్ధరూపాయి నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరూపాయలు ‘‘అందమైన‘‘ ప్రేమ ఎపుడు ముహుర్తాలు చూసుకోదులే రాహుకాలం కూడా కలిసి వచ్చులే ప్రేమ కొరకు హంస రాయబారమేలనే కాకి చేత కూడా కబురు చాలులే ప్రేమ జ్యోతి ఆరిపోదే ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే ఇది నమ్మరానిది కానెకాదే ఈ సత్యం ఊరికీ తెలియలేదే ఆకశం భూమి మారినా మారులే కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే.. ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని... ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో.. ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందులో నువ్వు వెళ్ళు నిర్భయంగా.. చిత్రం : ప్రేమికుడు రచన : రాజశ్రీ గానం : యస్పీ బాలు, ఉదిత్ నారాయణ్, యస్పీ పల్లవి సంగీతం : ఏఆర్ రెహమాన్ -
ఓ బేబీ.. సాంగ్ లిరిక్స్
ఏదో ఏదో ఉల్క నేరుగా భూమి పైన వాలగా బేబీ అవతరించే అదిగో (2) ఒళ్లంత వెటకారం పుట్టింది సూర్యకాంతం ఆకారం తూనీగ ముట్టుకుంటే కందిరీగ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ బ్లాక్ అండ్ వైట్ దొరసాని ట్రెండీగా మారే కహానీ అల్లాద్దీన్ దీపంలా దొరికింది మళ్లీ జవానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నీ లైఫ్‌కి నువ్వే రారాణి దాచుకున్న ఆశ విహంగంలా ప్రపంచాన్నే జయించాలి లోకంలో ఈ వింత జరిగిందా ఎపుడైనా నక్కతోక తొక్కినట్టు గడియారం ముల్లేదో రూట్ మారి తిరిగినట్టుగా ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ సూర్యుడైన నీవైపు సన్ గ్లాసే పెట్టి చూడాలి మూన్ వాక్‌తో బేబీ వస్తుంటే ఈలే కొట్టాలి మూవీ స్టార్స్ నీకోసం పిచ్చోళ్లై క్యూలే కట్టాలి ఎంత మారిపోయే ఓవర్ నైట్ ఏ బేబీ రూట్ ఏ సూపర్ క్యూట్ ఏ ఈ మాయ కనికట్టా ఇంకోటా అనుకుంటూ పిచ్చి ప్రశ్నలెయ్యకుండ ఎంజాయే చెయ్యాలి లైఫ్ నీకు నచ్చినట్టుగా ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ చిత్రం: ఓ బేబీ సంగీతం: మిక్కీ జె. మేయర్ రచన: లక్ష్మీ భూపాల్ గానం: అనురాగ్ కులకర్ణి -
మై నేమ్ ఈజు రాజూ.. సాంగ్ లిరిక్స్
పల్లవి ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా పుట్టావురో.. అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగే పోతావురో.. ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలైపోతారేందిరో... సత్తే సత్తే సత్తే సత్తే సత్తే ఏమౌతాదిరో... గాల్లో దీపం...గుండెల్లో ప్రాణం... ఎప్పుడు తుస్సంటుందో ఎవడికి తెలుసును లేరా... ఒంట్లో జీవం కాదె మన సొంతం ఉన్నన్నాళ్లు పండగ చేసి పాడెక్కేయిరా.. పోయేవాడిని పోనివ్వక నీ ఏడుపు ఎందుకు రా... నీ ఆస్తి గీస్తి ఏమైనా ఆడట్టుకుపోతాడా... కోటల్లోని రారాజైన కాటికి పోవాలా.. నువ్వు నేను ఎవడైనా కట్టెల్లో కాలాల... మై నేమ్ ఈజు రాజూ... బస్తి బాలరాజు... చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ చరణం చుట్టం చూపుకు వస్తాం పెట్టిందల్లా తింటాం. పెర్మనెంటుగా ఆ ఇంట్లోనే బైఠాయిచ్చముగా... సినిమా పోస్టరు చూస్తాం... ఓ టికెట్ చూసి వెళతాం... అయిపోయాక కుర్చీ ఖాళీ చెయ్యక తప్పదుగా... ఆరడుగుల బాడీ అంతే... అద్దెకు ఉంటున్నామంతే.... ఈ బాడీ కంపనీ వదిలేయాలి టైమే అయిపోతే.. పుట్టేటప్పుడు ఊపేస్తారు నిన్నే ఉయ్యాల.. పోయేటప్పుడు నలుగురు వచ్చీ చక్కా మోయాలా.. ఉన్నన్నాళ్ళు ఆ నలుగురిని సంపాదించాలా... ఊరాంతా నిను ఊరేగించి టాటా సెప్పాలా... స్వర్గానికి తొలిమెట్టు నా బండేరా ఒట్టు ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోనూ కొట్టు... చరణం సన్ను డాటరు అవుతాం... సిస్టరు బ్రదరు అంటాం అందరితోనూ బంధాలెన్నో కలుపుకుపోతుంటాం అప్పుల్లో మునిగుంటాం.. అంబానీ కల కంటాం... చిల్లర కోసం ఎన్నో ఎన్నో వేషాలే వేస్తాం... ఈ లైఫ్ ఒక నాటకమేలే... మన యాక్టింగులు అయిపోతే.. ఈ ఊరు పేరు మేకప్ తీసి చెక్కేయాలంతే... శివుడాగ్నే లేకుండా చీమైనా కుడుతుందా... అంటూ మహాబాగా ఏదాంతం సెబుతావంట.. అన్ని ఇచ్చిన ఆ సామె సావుని గిఫ్ట్ ఇవ్వంగ... అయ్యయ్యయ్యో వద్దంటా వేందయ్యా సిత్రంగా.. జజ్జనకా జజ్జనకా తోడుంటా నీ ఎనకా.. పువ్వుల్లోన మోసుకెళ్లి పూడ్చేస్తా పద కొడకా... మై నేమ్ ఈజు రాజూ....బస్తి బాలరాజు.. చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ చిత్రం: చావు కబురు చల్లగా...! రచన: కరుణకుమార్ అడిగర్ల గానం: రేవంత్ సంగీతం: జేక్స్ బిజోయ్ -
శివయ్యా... కరుణించు
‘‘హే శీశైలం మల్లయ్యా... ఈ భూగోళం మంచిగా లేదయ్యా...’’ అంటూ తనదైన శైలిలో స్పందించారు ప్రముఖ సినీ గేయరచయిత రామజోగయ్య శాస్త్రి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయన ‘మల్లయ్యా...’ అని లిరికల్ సాంగ్‌ను రాసి, తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘మూకుమ్మడి మరణాలు, శవాల దగ్గరికి మనుషులు రాకపోవటం ఇదంతా ఏంటి? అని నా మనసుకు అనిపించింది. ప్రపంచం అంతా ఇదే ఆలోచనతో ఉండి ఉంటుంది. కానీ నేను దాన్ని కొంచెం పొడిగించి నాదైన ధోరణిలో ఆ శివయ్యను అడుగుదామనుకున్నాను. అందుకే ఈ పాట రాశాను. విన్నవాళ్లందరూ ‘మీ భావం చాలా చక్కగా ఉంది’ అన్నారు. ‘అయ్యా శివయ్యా, మూడోకన్ను తెరిచే సమయం ఆసన్నం కాలేదయ్యా, వద్దయ్యా వదిలిపెట్టయ్యా, మేము తప్పొప్పులు చేస్తే మమ్మల్ని నిండు మనసుతో క్షమించాల్సిన పెద్దరికం మీది. పిల్లలు తప్పు చేస్తే మందలించాలి కానీ, వీరభద్రుడివి అవుతావేంది. మంచి చెప్పాలి కానీ, కోప్పడతావేంది.. ఏదో చెంపదెబ్బ కొట్టి సరిపెట్టుకోవాలి కానీ, అలా శివాలెత్తుతావేమయ్యా, శివయ్యా.. మనుషులన్నాక ఆ మాత్రం తప్పులు చేస్తాం. ఆ తప్పులను సరిచేసే భాద్యత నీదే. అంతేకానీ, ఇలా మూకుమ్మడిగా ప్రాణాలు తీస్తావా, మమ్మల్ని ఇబ్బంది పెడితే మా బాధ దేవుడెరుగు. మమ్మల్ని పుట్టించిన పార్వతీదేవికి కడుపుకోతను మిగులుస్తావా. కొంచెం శాంతించు, కరుణించు అనే ఉద్దేశంతో పాట ఉంటుంది’’ అన్నారు. ‘‘నా కెరీర్లో ఇప్పటివరకు 1200 పాటలను రాశాను. ఈ ఏడాది అనేక పెద్ద సినిమాలకు రాస్తున్నాను’’ అని కూడా చెప్పారు రామజోగయ్య. -
మర్రిచెట్టు కింద పాట
సురేశ్, ఆనంద్, రాశి, శ్రద్ధాదాస్, అమిత్, తేజ ప్రధాన పాత్రల్లో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లేవాడు). వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీ కార్ప్ సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాట లిరికల్ వీడియోను ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ మణికొండలోని మర్రిచెట్టు కింద విడుదల చేశారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలోని ‘ఓడ్కా మీద ఒట్టు...’ అంటూ సాగే మొదటి పాట విడుదలైన రెండు వారాల్లోనే యూట్యూబ్‌లో 20లక్షల వ్యూస్ సాధించింది. రెండో పాటను రామ్‌గోపాల్‌వర్మకి అంకితం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం’’ అని వెంకట శ్రీనివాస్ బొగ్గరం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేదాంత్ మల్లాది, సంగీతం: వీణాపాణి. -
జగమంతా బొమ్మలాటమ్మా!
‘బంగారు పాప’ చిత్రంలోని ఆ... ఆ.... ఆ... ఉళళళళళళళళళళ ఆయీ/ఆయి ఆయి ఆయీ ఆపదలు గాయీ/తాథిమి తకథిమి తోల్బొమ్మా దీని తమాష చూడవే కీల్బొమ్మా/దీని తమాషా చూడవే మాయబొమ్మా/ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మలాటమ్మా /తళాంగు తకథిమి తోల్బొమ్మా తోం తకతై తకతై మాయబొమ్మా/ఆయి ఆయి ఆయీ ఆపదలు గాయీ... పాట సమయానికి నేను పుట్టానో లేదో తెలియదు. ఈ పాట సందర్భం మనిషి హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. అంతవరకు రౌడీ జీవితాన్ని గడుపుతూ, మొరటుగా ఉండే ఒక మనిషిని చిన్న పాప పూర్తిగా మారుస్తుంది. తండ్రి స్థానం వచ్చాక, తన పిల్ల కాకపోయినా, తను చూపే వాత్సల్యం మనసును హత్తుకునేలా తీశారు ఈ చిత్రంలో. ఈ పాటను మా నాన్నగారు మనసు ద్రవించేలా ఆర్ద్రత నిండిన గొంతుతో పాడారు. ఆ పాట చూస్తుంటే రంగారావుగారే పాడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక చిన్న తోలుబొమ్మను చేతిలో పట్టుకుని, దానిని ఆడిస్తూ పాడతారు ఈ పాటను. చాలా చిన్న పాట. కేవలం నాలుగు లైన్ల పాట. కాని ఆ పాటలో ఎంతో అర్థం నిండి ఉంటుంది. ఆ పిల్లకు తండ్రి ఎవరో తెలియదు. కాని రంగారావుగారినే తన తండ్రిగా భావిస్తుంది. కన్న తండ్రి కాకపోయినా, కన్న తండ్రి కంటె ఎక్కువగా చూస్తారు రంగారావుగారు ఆ పాత్రంలో. ఎంతటి వాడైనా తండ్రి తండ్రే. తండ్రీకూతుళ్ల అనుబంధం చాలా బాగా చూపించారు ఈ చిత్రంలో. నాన్నగారికి నచ్చిన పాటలలో ఇది ఒకటనీ, తన మనసుకు నచ్చి, భావంతో పాడిన పాటలలో కూడా ఇది ఒకటనీ ఆయన చెబుతుండేవారు. నాన్నగారికి వివాహం అయిన చాలా కాలానికి మా పెద్దక్క పుట్టింది. అక్కని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కుటుంబంలో అందరూ రాకుమార్తెలా చూసేవారు. అక్క మీద ఈగ వాలకూడదు, దోమ కుట్టకూడదు. అంత ప్రేమ. ఆ ప్రేమ ప్రభావం అంతా ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాటలో నాన్నగారు తన గొంతులో జీవించారు. లాలి పాటకు పాడుతున్నట్లు నోటితో ఉచ్చరించే ‘ఉళళళళళళళళళ’ వింటుంటే, ఇంత కంటె జోల పాట ఎవరు బాగా పాడగలరు అనిపిస్తుంది. నాన్నగారికి ఎస్వి. రంగారావుగారితో విడదీయరాని అనుబంధం ఉండేది. ఒకసారి నన్ను రంగారావుగారి ఇంటికి తీసుకువెళ్లారు. ‘మాధవపెద్ది సత్యం గారు వచ్చారు’ అని ఆయనకు కబురు వెళ్లగానే, ఆయన వెంటనే పైకి రమ్మని ఆప్యాయంగా పిలిచారని, నన్ను ఆయన ఒళ్లో కూర్చోపెట్టారని నాన్న చెప్పేవారు. రంగారావుగారితో నాన్నకు అంత సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ ఏరా అంటే ఏరా అని పిలుచుకునేవారు. రంగారావుగారి మీద అభిమానంతో, నాన్నగారు ఎంతో అనుభూతి చెంది పాడి ఉంటారా అనిపిస్తుంది. తన గళం దానం చేసి, జీవం పోశారు. రంగారావుగారి వంటి ప్రఖ్యాత నటుడికి పాడటం కంటె అదృష్టం ఏముంటుంది. నాన్నగారి గొంతు గంభీరంగా ఉంటుంది. ఆయన పాడిన పాటలు కూడా చాలావరకు గంభీరమైనవే. కాని ఈ పాటను నాన్నగారు పాడిన విధానం చూస్తే, ఎంతో సున్నితంగా, స్వయంగా తన కూతురికే లాలి పాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ పాట చాలా బావుంటుందని, తనకు చాలా ఇష్టం అని చెప్పేవారు. నాన్నగారికి తత్త్వాలు, పద్యాలు కూడా చాలా ఇష్టం. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
'నేరేడు చెట్టు కాడ నా రేడు మాటేసి'
చిత్రం: భక్తకన్నప్ప రచన: సి.నారాయణరెడ్డి గానం: పి. సుశీల, వి. రామకృష్ణ సంగీతం: సత్యం భక్త కన్నప్ప చిత్రంలోని ‘కండ గెలిచింది కన్నె దొరికింది గుండె పొంగిందిరా/మాత పలికింది మనువు కలిపింది మనసు గెలిచిందిరా/ హైరా మా దొరగారికి వీరగంధాలు/సైరా మా దొరసానికి పారిజాతాలు’ పాటను డ్రమ్స్ మీద నాట్యం చే స్తున్నట్లుగా చిత్రీకరించాను. సాధారణంగా ఆ పాట సిట్యుయేషన్‌కి ఒక డ్యూయెట్ పెడతారు ఎవరైనా. కాని బాపుగారు కొత్త తరహాలో రాయించుకున్నారు. ఈ పాటలో వీరం, శృంగారం, భక్తి, నాట్యం అన్నీ కలిసి ఉన్నాయి. అలాగే నృత్యం, నాట్యం, నృత్తం మూడూ ఈ పాటలో ఉంటాయి. కథానాయిక నీల (వాణిశ్రీ)కు భక్తి ఉంటుంది. ‘ధిమింధిమింధిమి భేరీ ధ్వనులు తెలిపెనురా నా గెలుపునే/ఘలం ఘలల చిరుగజ్జెల మోతలు పలికెనురా నా వలపునే/అల్లె తాళ్ల ఝంకారాలే జయం దొరా అని పాడెనులే/నల్ల త్రాచు వాలు జడలే ఆ పాటకూ సయ్యాడెనులే’ అని సాగే మొదటి చరణంలో ప్రియుడు తన గెలుపును తెలిపేలా, వీరత్వం గురించి ఆనంద తాండవం చేస్తూ పాడుతుంటే, ప్రియురాలు తన ప్రేమను శృంగార రసంలో తెలుపుతుంది. ‘నేరేడు చెట్టు కాడ నా రేడు మాటేసి/చారెడేసి కళ్లతోటి బారెడేసి బాణమేసి/బాణమేసి నా ప్రాణం తోడేస్తుంటే/ఓయమ్మో ఓలమ్మో నీ ప్రాణం తోడేస్తుంటే’ అంటూ సాగే రెండో చరణంలో నాయిక పరవశంగా డ్రమ్ మీద కూర్చుని పాడుతుంటే, కిందే నిలబడిన నాయకుడు ఆమె వైపు ఆరాధనగా చూస్తున్నట్టుగా కంపోజ్ చేశాను. ఈ చరణం నడక చాలా వేగంగా ప్రారంభమై, అక్కడకు వచ్చేసరికి మెలోడియస్గా ఉంటుంది. ఆ తరవాత వచ్చే ‘ఎంతా చక్కని కన్ను, ఎంతో చల్లని చూపు/ఇంతకన్న ఇంకేమి కావాలి/ నా బతుకంతా ఇలా ఉండిపోవాలి’ చరణంలో ముందుగా కృష్ణంరాజు చుట్టూ బల్లాలు వేస్తారు. వాణిశ్రీ వాటిని తొలగించుకుంటూ వస్తుంది. దర్శకుడు బాపుగారు ‘ఎంత చల్లటి చూపు’ పదాలు వచ్చినప్పుడు అమ్మవారిని చూపించమన్నారు. ఆ కళ్లు ఈ కళ్లు... అటు భక్తి, ఇటు ప్రేమ రెండు కళ్లు ఒకేలా ఉన్నాయన్నట్టుగా చూపాను. పాటంతా పూర్తయ్యాక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మొదలవుతుంది. డిఫరెంట్ పోశ్చర్లు తీశాను. ఇలాంటివి ఆ రోజుల్లోనే ప్రారంభించాం. ఈ సినిమా పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలో తీశారు. అక్కడ దొరలు వాళ్ల ఇళ్లల్లోనే మమ్మల్ని ఉంచుకుని, వాళ్ల ఆహారమే పెట్టారు. అక్కడే ఔట్‌డోర్‌లో తీశారు ఈ సినిమా. ఒక ఎకరం స్థలం సేకరించి, సెట్ వేశారు. ఈ పాటను ఆరు రోజులు తీశాను. ఆరు రోజుల పాటు తీసిన నాలుగైదు పాటలలో ఇది ఒకటి. వాణిశ్రీ, కృష్ణంరాజు... ఇద్దరూ లొకేషన్లోనే నాట్యం నేర్చుకున్నారు. వాణిశ్రీకి వాణిశ్రీనే సాటి అని నా ఉద్దేశం. కృష్ణంరాజును ఈ పాట కోసం చాలా కష్టపెట్టాను. మంచి సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్రాజుగారిని అభినందించాలి. ఈ పాట పూర్తయిన తరవాత చూస్తే, నాకు ‘శివపార్వతుల తాండవం’ లా అనిపించింది. - వైజయంతి పురాణపండ -
‘కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది'
చిత్రం : ఉయ్యాల జంపాల రచన : ఆరుద్ర గానం : ఘంటసాల, సుశీల సంగీతం : పెండ్యాల ‘ఉయ్యాల – జంపాల’ చిత్రంలో ఆరుద్ర సమకూర్చిన పాట ‘కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది’. అప్పటికీ (1965) ఇప్పటికీ మసకబారలేదు. ప్రతి పదం పూలరెక్కల కోమలం. కవితామయం. అన్ని వర్గాల తెలుగు శ్రోతలకి యీ పాట ఒక కలవరం. మాన్యులు ఆరుద్రని ఎప్పుడు కలిసినా ‘కొండగాలి తిరిగింది’ పల్లవిని మెచ్చుకునేవాణ్ని. ఆయన ఒకసారి ఆ పల్లవి రహస్యం చెప్పమంటారా అని మొదలుపెట్టారు. ‘‘కె. బి. తిలక్, నేను బాగా కావల్సినవాళ్లం. ‘ఉయ్యాల – జంపాల’ లొకేషన్స్ వేటలో తిలక్‌తో బాటు నేనూ వెళ్లాను. మద్రాసు దాటి ఆంధ్రా నడిబొడ్డుకు వచ్చాం. ఎక్కడ చూసినా రోడ్డు పక్క పశువులు, వాటి కాపర్లు. నిదానంగా కారులో వెళుతున్న మాకు గొడ్ల కాడి బుడ్డోడు గేదె మీద ఎక్కి వుల్లాసంగా పాడుకున్న పాట గూబలు అదిరేలా వినిపించింది. పరమ జానపదం. అది చెప్పలేనంత ముతక భాష, ముతక భావం. కారు వెంటనే రోడ్డు వార ఆపించాను. ఆ పిల్లలు అడిగితే మళ్లీ పాడరు. వాళ్లంత వాళ్లు పాడినపుడే దాని అందం, మళ్లీసారి శ్రద్ధగా విన్నా. ‘‘,,,,,.... కొండగాలి తిరిగింది..... కూతుర్ని పంపారో మామో’’ – యిదీ... మినహాయింపులతో మాతృక. ఆ జానపదంలోంచి కొండగాలి తిరిగింది పల్లవి పుట్టింది. స్వేచ్ఛగా, ఏ సెన్సారు జంకులూ లేకుండా వచ్చిన పల్లవి కదా... జీవశక్తి దానికి అధికం’’ అంటూ ఆరుద్ర గడ్డం సవరించుకున్నారు. పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికింది.. అసలే పాలపిట్ట రంగులతో సొగసుగా వుంటుంది. ఇక అది కులికితే చెప్పాలా! పచ్చని గట్ల మీద చెంగుచెంగున వయసులో వున్న లేడి గంతులేసి ఆడుతుంటే చూడముచ్చట. పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడడం, పట్టరాని లేతవలపు పరవశించి పాడడం... కన వేడుకే. అన్నీ కవి సమయాలే! ఈ చక్కదనాల్ని ఆరుద్ర చరణాలలో సమకూర్చారు. నిలువెల్లా పాటకు నిండుదనం తెచ్చారు. తర్వాతి చరణంలో – మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది/ నాగమల్లెపూలతో నల్లని జడ నవ్వింది పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది/ ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది అంటూ పాట ముగించారు. సినిమా పాటకు కొత్త ఆయతనం తెచ్చారు ఆరుద్ర. పడుచుదనానికి ఉద్దీపకం తాంబూలం. తాంబూలంతో పడుచుదనం మరింత అందగిస్తుంది. అన్ని ఆశలూ చూపించి చివరకు ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది అనే తాత్విక ధోరణిలో తీర్మానించారు. కవికి యీ పాట పల్లవి ఒక ముతక సాహిత్యం ప్రేరణ అయితే, మిగతా పాటని ఒక పూనకంలో తన్మయత్వంలో రాశారన్నది నిజం. ఈ పాటంటే తెలుగువారికే కాదు ఆరుద్రకి కూడా యిష్టం. ‘అది అలా కుదిరింది’ అని ఆరుద్ర గడ్డం సవరించుకునేవారు. – నిర్వహణ : వైజయంతి పురాణపండ -
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
చిత్రం: ముత్యాలముగ్గు రచన: గుంటూరు శేషేంద్ర శర్మ గానం: పి. సుశీల సంగీతం: కె. వి. మహదేవన్ బాపురమణల సారథ్యంలో రూపొందిన ‘ముత్యాల ముగ్గు’. విడుదలై నాలుగు న్నర దశాబ్దాలు కావస్తున్నా ఆ చిత్రంలోని మాటలు పాటలు పచ్చతోరణాలుగా తెలుగువారి మనసులో రెపరెపలాడుతూనే ఉన్నాయి, నిత్య నూత నంగా నిలిచాయి. ఇందులో గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన అధివాస్తవిక గీతం ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది’ జనసామాన్యంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ పాట చాలామంది అనుకున్నట్టు చిత్రం కోసం సందర్భానికి తగినట్టు కూర్చిన సాహిత్యం కాదు. అంతకుముందెప్పుడో ఒక వారపత్రికలో కవితగా వెలువడింది. ‘ముత్యాలముగ్గు’ చిత్రానికి నిర్మాతగా యమ్వీయల్ పేరు వుంటుంది. ఆయన నూజివీడు రాజావారి కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షులు. సుకుమార్ రాజా (రాజావారి వారసులు) యమ్వీయల్ గారి విద్యార్థి. సుకుమార్ బాపురమణలతో సినిమా తియ్యాలను కున్నప్పుడు యమ్వీయల్ సంధానకర్తగా వున్నారు. ఆయన శేషేంద్రకి అభిమాని, అంతకుమించి సాహిత్యాభిమాని. బాపు రమణలతో కథా చర్చలు జరిగేప్పుడే ఈ పాటను యమ్వీయల్ సూచించారు. సినిమాలో చక్కగా అమరింది. అనుమానంతో ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా పంపివేయబడిన కథానాయిక, తన ఇద్దరు పిల్లలతో వాల్మీకి ఆశ్రమంలాంటి చోట తల దాచుకుంటుంది. భర్త ఎక్కడో రాజమహల్లో వుంటాడు. యాదృచ్ఛికంగా లాంచీ మీద, కథానాయిక ఉండే రేవు మీదుగా కథా నాయకుడు దాటి వెళ్లే నేపథ్యంలో కథా నాయిక మనస్థితిని విప్పిచెప్పే పాటగా నడుస్తుంది. రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లింది/దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది/శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది/ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది’ అనే పదాలు... ఆ సన్నివేశాన్ని బాపురమణలు ఈ పాట కోసమే సృష్టించారా అనిపించేలా అమరాయి. అందుకే ఇది శేషేంద్ర సినిమాకి రాసిన పాట అనుకుంటారు. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో/ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి/కొమ్మల్లో పక్షుల్లారా/గగనంలో మబ్బుల్లారా/నది దోచుకు పోతున్న నావను ఆపండి/రేవు బావురుమంటోందని నావకు చెప్పండి’ – అంటూ కథానాయిక బావురు మంటుంది. శేషేంద్ర లాంటి మహానుభావుడు సర్రియ లిస్టిక్ ధోరణిలో నిగూఢ భావాలతో రాసిన ఈ గేయాన్ని ముత్యాలముగ్గులో సంద ర్భోచితంగా పొదిగి పాటకి బాపురమణలు వన్నె తెచ్చారు. జనం మెచ్చారు. శేషేంద్ర సవ్యసాచి! – సంభాషణ: వైజయంతి పురాణపండ -
గోపికనై నేను జలకములాడేను
నా తమ్ముడు చిత్రంలోని ‘హే సుందరాకార హేబృంద సంచార/ఏ బండికొచ్చావురా/నేను నా మేను ఇస్తాను నీతోటి వస్తా ను ఛస్తాను నీ కోసమే’ అని సరదాగా సాగే ఈ పాటలో నేను, రాజబాబు నటించాం. ఈ పాటకు పెండ్యాల శాస్త్రీయ సంగీతం, పసుమర్తి కృష్ణమూర్తి శాస్త్రీయ నాట్యం కూర్చారు. నా నాలుగో ఏట నుంచే నాట్యం నేర్చుకోవడం వల్ల సెమీ క్లాసికల్ చేయడానికి ఇబ్బంది అనిపించలేదు. చాలా సులువుగా చేశాను. ఏ పాత్రనైనా చేస్తున్నంత సేపు పాత్రలో నిమగ్నమైపోతాను. ‘శ్రీకృష్ణుడి కోసం కల కంటే ఆయన ప్రత్యక్షమైనట్టు భావించే సన్నివేశం’ అని పాట సిట్యుయేషన్ చెప్పారు. చాలా సరదా సన్నివేశం. పాట షూటింగ్ అయిపోయాక అందరూ ఫక్కున నవ్వేశారు. నేను కూడా నవ్వాను. ‘నీ సొద విన్నాను పింఛము కొన్నాను/రిక్షాలో వచ్చాను దరిశనమిచ్చాను/కలలో కనిపించి పులకలు పెంచావురా/ఇంక పైని చాలజాల జాలి పూని ఏలుకోరా’ చరణంలో నేను రాజబాబు ఇద్దరం పోటీ పడి నాట్యం చేశాం. ఆయనకి ఈ పాటంటే చాలా ఇష్టం. ఆయన చాలా సరదా మనిషి. అందరితోనూ స్నేహంగా మెలిగేవారు. ఆయన ఇంటి నుంచి షూటింగ్ స్పాట్‌కి మధ్యాహ్నం క్యారేజీ వచ్చేది. ఆయన అందరికీ రుచి చూపించేవారు. ఒకవేళ నేను రాలేకపోతే, నాకు గదికి పంపేవారు. రాజబాబుగారి భార్య రెండు చేతుల నిండుగా బంగారు గాజులు వేసుకునేవారు. ఆవిడ నాకు అలా గుర్తుండిపోయారు. మా అమ్మకి నేను ఒక్కర్తినే ఆడపిల్లను. ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒకటి చేయించేది. ఒక సంవత్సరం నడుముకి గొలుసు చేయించింది. ఏ ఫంక్షన్‌కి వెళ్లినా నా నడుముకి గొలుసు తప్పనిసరి. ప్రసన్నరాణి అంటే ‘నడుముకి చెయిన్’ అని గుర్తింపు తెచ్చుకున్నాను. ‘ఇది యమునా నది మనకై గదిలో పడుతున్నది/గోపికనై నేను జలకములాడేను/ఇసుకతిన్నెలవిగో పొన్నమాను ఇదిగో/నీ చిలిపి గోపబాలుడనై దాగి చీర దోచుకుని పోయెదనిపుడే’ చరణం చాలా సరదాగా ఉంటుంది. ఈ పాట అంతా ఒకే గదిలో తీశారు. ఒక వాటర్ క్యాన్, బేసిన్ పెట్టి, క్యాన్‌లో నీళ్లు పడుతుంటే, అదే యమునానది అంటూ, ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ జలకాలాడుతున్నట్లు భావిస్తాం. గదిలో వస్తువులు చూడగానే నవ్వు ఆగలేదు. ఈ పాటలో నా డ్యాన్స్‌కి ఆయన కాంప్లిమెంట్స్ ఇచ్చారు. పక్కన ఉన్న స్టూడియోలలో వారు కూడా వచ్చి నన్ను ప్రశంసించారు. ఫస్ట్ టేక్‌లోనే ఓకే అయిపోయింది. రెండు రోజుల్లో షూటింగ్ పూర్తయిపోయింది. షూటింగ్ పూర్తవ్వగానే ఇంటికి వెళ్లిపోయేదాన్ని. ఈ పాట నాకు మంచి గుర్తింపు తెచ్చింది. నాగేశ్వరరావుగారు నన్ను గట్టి పిండం అన్నారు. చిత్రం: నా తమ్ముడు రచన: అప్పలాచార్య గానం: బి. వసంత, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సంగీతం: పెండ్యాల సంభాషణ: వైజయంతి పురాణపండ -
శ్రీనివాస్ కల్యాణం పాట విడుదల
-
కళ్యాణం.. వైభోగం.. ఆనంద రాగాల శుభయోగం..
నితిన్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీనివాస్ కల్యాణం’ సినిమా రిలీజ్‌కు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘కళ్యాణం.. వైభోగం.. ఆనంద రాగాల శుభయోగం’ అనే పల్లవితో మొదలై.. రుక్మిణీ కల్యాణం, సీతా స్వయంవరం, శ్రీనివాస కల్యాణ ఘట్టాలను ఉటంకిస్తూ వివాహ ప్రాశస్త్యాన్ని వివరించే ఈ పాట సంగీత ప్రియుల మనసు దోచుకుంటోంది. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా ఎస్పీ బాలు తన స్వరంతో ప్రాణం పోశారు. చాలా కాలం తర్వాత సాహిత్య విలువలు ఉన్న పాట వినడం సంతోషంగా ఉందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను వినేయండి మరి. -
పదం పలికింది – పాట నిలిచింది
ప్రేమలో పడితే నిద్రాహారాలు ఉండవని చెప్పడం ప్రేమంత పాత వ్యక్తీకరణ. మళ్లీ అదే భావాన్ని అటూయిటూ తిప్పి, ప్రేమంత నిత్యనూతనంగా వ్యక్తీకరించడం వేటూరి సుందరరామ్మూర్తికే చెల్లింది. ‘ఒట్టేసి చెపుతున్నా’ చిత్రంలో ఈ పల్లవితో సాగే సరదా పాటొకటుంది. ‘వెన్నెల్లో వేసవికాలం, ఎండల్లో శీతాకాలం, నీ ఒళ్ళో సాయంకాలం, హాయిలే హలా!’ అని అతడు అంటే, ‘కన్నుల్లో తొలి కార్తీకం, కౌగిట్లో కసి తాంబూలం, సరసంలో సంధ్యారాగం సాగునే ఇలా!’ అని ఆమె అంటుంది. చరణంలో మరింత ముందుకెళ్లి– ‘నీ తోడులేనిదే నాకు తోచదు’ అని అబ్బాయి పాడితే, ‘నీ నీడ కానిదే ఊపిరాడదు’ అని అమ్మాయి వంతపాడుతుంది. ఇక తర్వాత భావం చూడండి: ‘ఆకలమ్మ ఏనాడో కడుపు దాటిపోయింది దాహమంత కళ్ళల్లో దాగి నిన్ను తాగింది’ ఆకలి ఎటూ లేదు. పోనీ దాహమైనా ఉందా, అది కళ్లల్లో దాగింది. ఈ దాహాన్ని రెండు విధాలుగా అన్వయించుకోవచ్చు. వయసులో మాత్రమే ఉండే దాహం. ప్రేయసిని నిలువెల్లా చూడటంలో తీరే దాహం. 2003లో వచ్చిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించారు. పాడినవారు బాలసుబ్రహ్మణ్యం, సాధనా సర్గమ్. దర్శకుడు ఇ.సత్తిబాబు. శ్రీకాంత్, కనిక నటించారు. -
మళ్లీ చెబుతా ప్రియా...
ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్ నటీనటులుగా శ్రీ చైత్ర చలనచిత్ర సంస్థ నిర్మించిన సినిమా ‘మరల తెలుపనా ప్రియా’. వాణి ఎమ్.కొసరాజు దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేశ్ ప్రసాద్ నిర్మాణ సంస్థ లోగోని, హీరో నిఖిల్ పాటల సీడీలను ఆవిష్కరించారు. ‘‘భిన్నమైన వ్యక్తిత్వాలు, నేపథ్యాలు ఉన్న ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథా చిత్రమిది’’ అని వాణి ఎమ్.కొసరాజు అన్నారు. ‘‘శేఖర్‌చంద్ర బాణీలు, భాస్కరభట్ల సాహిత్యం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నటీనటులతో పాటు విలన్‌గా సుజోమ్యాథ్యూ చక్కగా నటించారు. సినిమా బాగా వచ్చింది’’ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు కె.సురేష్ బాబు, వుడిగ శ్రీనివాస్‌లు తెలిపారు. రాహుల్ రవీంద్రన్, అశ్విన్, ప్రిన్స్, వ్యోమనంది, శేఖర్ చంద్ర, భాస్కరభట్ల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
స్వెత్లానా అలెక్సియేవిచ్‌కు సాహితీ నోబెల్
బెలారస్ రచయిత్రికి పురస్కారం ప్రకటన స్టాక్‌హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సియేవిచ్(67)కు ప్రకటించారు. ఆమె విభిన్న స్వరాల రచనలు మన కాలంలో బాధలకు, సాహసానికి ప్రతీకలని అభివర్ణిస్తూ.. ఆమెను నోబెల్ బహుమతితో గౌరవిస్తున్నట్లు స్వీడన్‌లోని నోబెల్అకాడమీ గురువారం నాడు ప్రకటించింది. చెర్నోబిల్ విపత్తు, రెండో ప్రపంచ యుద్ధంపై ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా స్వెత్లానా చేసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఈ అనుభవాలను సాక్షుల సొంత మాటల్లోనే నమోదు చేయటం వల్ల ఆమె రచనలు అనేక భాషల్లోకి అనువాదమవటంతో పాటు అంతర్జాతీయ అవార్డులూ పొందా యి. రష్యా భాషలో రాసిన ఆమె రచనలు.. అధికారవాది అలెక్సాండర్ లుకాషెంకో పాలనలో సెన్సార్షిప్ ఉండటం వల్ల ప్రచురితం కాలేదు. నోబెల్ సాహిత్య బహుమతి అందుకున్న రచయిత్రుల్లో స్వెత్లానా 14వ వ్యక్తి. ఈ బహుమతి కింద ఆమెకు సుమారు రూ. 6.31 కోట్లు బహూకరిస్తారు. నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించనున్నారు. స్కూల్లో చదివేటపుడే విలేకరిగా...: స్వెత్లానా 1948 మే 31న ఉక్రెయిన్‌లో జన్మించారు. ఆమె తల్లి ఉక్రెయిన్ పౌరురాలు, తండ్రి బెలారస్ పౌరుడు. ఆయన సైన్యంలో పనిచేసేవారు. విధుల నుంచి వైదొలగిన తర్వాత కుటుంబం బెలోరష్యాకు వెళ్లి ఓ గ్రామంలో స్థిరపడింది. తల్లిదండ్రులు స్కూల్ టీచర్లుగా పనిచేసేవారు. స్వెత్లానా స్కూల్లో చదివేటపుడే.. నర్వోల్ పట్టణంలో స్థానిక వార్తాపత్రికకు విలేకరిగా పనిచేశారు. ఈ వృత్తిలోనే ముందుకు వెళ్లారు. వార్తాకథనాలతో పాటు కథలూ రాశారు. చెర్నోబిల్ విషాదం, అఫ్ఘానిస్థాన్‌లో సోవియట్ రష్యా యుద్ధం తదితర ఎన్నో ముఖ్యమైన ఘటనలపై ఆమె తన రచనా వ్యాసంగాన్ని కేంద్రీకరించారు. ఇందుకోసం వేలాది మంది ప్రత్యక్ష సాక్షులను ఇంటర్వ్యూ చేశారు. బెలారస్‌లోని అలెక్సాండర్ లుకాషెంకో నియంతృత్వ ప్రభుత్వం ఆమెను అనేక వేధింపులకు గురిచేసింది. దీంతో 2000 సంవత్సరంలో ఆమె బెలారస్ విడిచి పారిస్, గోథెన్బర్గ్, బెర్లిన్‌లకు వెళ్లారు. మళ్లీ 2011లో బెలారస్‌కు తిరిగివచ్చారు. -
గోర్కీ మనవాడు కూడా!
ఫ్లాష్‌బ్యాక్ ‘నాలో సాహిత్యాన్ని సృష్టించే సామర్థ్యం లేదు’ అని నిజాయితీగా చెప్పుకున్న ప్రేమ్‌చంద్ భార్య శివరాణీదేవి తన భర్తతో గల జ్ఞాపకాలను ‘ప్రేమ్‌చంద్ ఘర్ మే’ పేరిట హిందీలో పుస్తకంగా తెచ్చారు. దాన్ని తెలుగులోకి ‘ఇంట్లో ప్రేమ్‌చంద్’గా ఆర్.శాంతసుందరి అనువదించగా, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. అందులో 1936 జూన్‌లో మక్సీమ్ గోర్కీ మరణం తర్వాతి (అదే సంవత్సరం అక్టోబర్‌లో ప్రేమ్‌చంద్ కూడా మరణించడం గమనార్హం.) ఒక ఘటన ఉంది. అది ఇలా సాగుతుంది: ‘‘ఏదో రాస్తున్నారు.’’ ‘‘ఎల్లుండి ‘ఆజ్’ ఆఫీసులో గోర్కీ గురించి మీటింగ్ ఉంది.’’ ‘‘ఏం మీటింగ్ అది? ఒక పక్క ఒంట్లో బాగాలేనప్పుడు, ఈ రాతలేమిటి? ఇప్పుడు టైమెంతో తెలుసా? అర్ధరాత్రి రెండు గంటలు!’’ ‘‘నిద్ర రావటం లేదు ఏం చేసేది. అందుకే ఉపన్యాసం రాసుకుంటున్నాను.’’ ‘‘ఒంట్లో బాగాలేకపోయినా రాయాల్సిందేనా?’’ ‘‘అవును, రాయకపోతే కుదరదు. పైగా నాకిష్టమైన పని చేసేప్పుడు కష్టమనిపించదు! నా కర్తవ్యం అనుకుని చేసేపని ఏదైనా కానీ, కష్టంగా తోచదు. అవే ఒక మనిషికి అన్నిటికన్నా ముఖ్యమని అనిపిస్తాయి.’’ ‘‘అసలది ఎలాంటి మీటింగ్?’’ ‘‘సంతాప సభ.’’ ‘‘అతనెవరు, భారతీయుడేనా?’’ ‘‘అదే మన సంకుచిత మనస్తత్వం! గోర్కీ మహా రచయిత. ఆయనని ఒక ప్రాంతానికీ, దేశానికీ సంబంధించినవాడని అనలేం. ఒక రచయిత ఎక్కడివాడని అడక్కూడదు. ఆయన రచనలు ప్రపంచంలోని అందరికీ మేలు చేసేవే అనుకోవాలి.’’ ‘‘సరే! కానీ ఆయన మన దేశానికి కూడా పనికివచ్చే విషయాలేవైనా రాశాడా?’’ అని అడిగాను. ‘‘రాణీ, ఇంకా నువ్వు తప్పుదారినే ఉన్నావు. అసలు రచయిత దగ్గర ఏం ఉంటుంది అందరికీ విడివిడిగా పంచిపెట్టేందుకు? అతనికున్న ఆస్తల్లా అతని తపస్సు. దాన్నే అందరికీ పంచగలడు. దానివల్ల అందరూ లాభం పొందుతారు. అతను తన తపఃఫలాన్ని తనకోసమంటూ ఏం మిగుల్చుకోడు. సామాన్యంగా అందరూ తపస్సు చేసేది సొంతలాభం కోసం, కానీ రచయిత చేసే తపస్సు వల్ల జనం బాగుపడతారు.’’ ‘‘సరే! కానీ ఆయన మన దేశానికి కూడా పనికివచ్చే విషయాలేవైనా రాశాడా?’’ అని అడిగాను. -
సినీ గీత రచయితగా కపిల్ సిబల్!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సినీ గీత రచయిత అవతారమెత్తారు. ‘జైనాబ్- ఏ సెలబ్రేషన్ ఆఫ్ హ్యూమానిటీ’ అనే సినిమాకు ఖవ్వాలి పాటతో సహా 7 పాటలను రాశారు. ఉత్తరప్రదేశ్‌లో 2011 నుంచి ఇటీవలి వరకూ మహిళలపై జరిగిన వేధింపులను స్పృశిస్తూ తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్‌ను శనివారం సిబల్ ఆవిష్కరించారు. సామాజిక సందేశం ఇచ్చేందుకు సినిమా ప్రభావవంతమైన మాధ్యమమని, ఈ సినిమా ద్వారా సంతోషం, మత సామరస్యం వంటి అంశాలను తెలియజేయాలని భావించామన్నారు. ‘మన మనస్తత్వం మారేంత వరకూ ఏ చట్టమూ సమాజంలో మార్పు తీసుకురాలేద’న్నారు. జైనాబ్ (మహ్మద్ ప్రవక్త కూతురు) సినిమాకు ప్రణవ్ సింగ్ దర్శక నిర్మాత . -
రచయిత ఎలా బతకాలో అలా బతికాడు...
జయకాంతన్‌కు నలభై ఏళ్ల వయసు లోపలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అప్పుడాయన ఒకచోట రాసుకుంటూ ‘ప్రపంచ కథాసాహిత్యంలో నేను ముఖ్యుణ్ణి’ అని చెప్పుకున్నాడు. అది అతివిశ్వాసం కాదు. ఆత్మవిశ్వాసమూ కాదు. తనను తాను తెలుసుకోవడం. ఆ మాటకొస్తే ఆ సంగతి పాఠకులకు కూడా తెలుసు. అవును. ప్రపంచ సాహిత్యంలో ఆయనొక ముఖ్య రచయిత. తమిళులు తమవారిని గొప్పవారిగా తయారు చేసుకోరు. కాని వారి గొప్పతనం ఏమిటంటే తమవారిలోని గొప్పతనాన్ని వారు గుర్తిస్తారు. సాహిత్యంలో అడుగుపెట్టినప్పటి నుంచి జయకాంతన్ ప్రభావాన్ని తమిళులు ఏ మాత్రం ఆలస్యం లేకుండా గుర్తించారు. ఆయన రచనలను ఆదరించారు. ‘ప్రొఫెషనల్ రైటర్‌గా ఒక మనిషి బతకొచ్చు అని నేను నిరూపించాను’ అని జయకాంతన్ అనగలిగారంటే అందుకు తమిళ పాఠకులు ఆయన పట్ల చూపిన ఆదరణే కారణం. నాకు జయకాంతన్ 1975లో పరిచయం. నేరుగా కాదు. తన రచనల ద్వారా. అప్పుడు మా నాన్న మధురాంతకం రాజారాం జయకాంతన్ కథలను నేషనల్ బుక్‌ట్రస్ట్ కోసం అనువాదం చేయడం మొదలుపెట్టారు. ఆయన సగం సగం చేసి పక్కన పెట్టిన అనువాదాలను నేను చదువుతుండేవాణ్ణి. అప్పుడు నా వయసు 18 ఏళ్లే అయినా ఒక పద్దెనిమిదేళ్ల వయసున్న కుర్రవాణ్ణి ఒక ఆరోగ్యవంతమైన సృజనా ప్రపంచంలోకి జయకాంతన్ ఈడ్చుకెళ్లిన తీరు నేను మర్చిపోలేను. ఆయనవి ‘షోయింగ్ స్టోరీస్’. అంటే కళ్లకు కట్టినట్టుగా రాసే రచయిత. అందువల్లే మా నాన్నను అనువాదం పూర్తి చేయమని వెంట పడి మరీ ఆ కథలను చదివేవాణ్ణి. అలా నేను చదివిన జయకాంతన్ మొదటి కథ ‘అగ్నిప్రవేశం’. ఇందులో వాన కురుస్తున్న రోజు ఒక కాలేజీ అమ్మాయికి ఒక డబ్బున్న వ్యక్తి లిఫ్ట్ ఇస్తాడు. కారు లోపల ఏం జరిగింది? అత్యాచారం జరిగిందా లేదా అనేది రచయిత చెప్పడు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి మంచివాడు. అతడి లోపల ఉద్దేశం ఉంది. కాని గట్టిగా ప్రయత్నించాడో లేదో రచయిత చూపడు. కాని అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వస్తే, ఆ దిగువ మధ్యతరగతి ఇంటిలో, ఆ తల్లి రాద్ధాంతం చేయదు. కూతురిని స్నానాల గదిలోకి తీసుకెళ్లి పెద్ద చెర్వ నిండుగా నీళ్లు కుమ్మరించి ‘నీకేం కాలేదుపో. నువ్వు పునీతవయ్యావు పో’ అంటుంది. ఈ కథనే విస్తరించి కొన్నాళ్లకు ఆయన ‘కొన్ని సమయాలు కొందరు మనుషులు’గా రాశాడు. విశేష ఆదరణ పొందింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మరి కొన్నాళ్లకు ఈ నవలకే సీక్వెల్‌గా ‘గంగ ఎక్కడికి వెళుతోంది’ పేరుతో మరో నవల రాశాడు. జయకాంతన్‌ను చూసి ప్రతి రచయిత నేర్చుకోవలసింది అదే. ప్రయోగం. ఆయన నిత్య ప్రయోగశాలి. ఏ రోజైతే కొత్తది మానేస్తామో ఆ రోజున మనం నిర్జీవం అయ్యామని అర్థం. జయకాంతన్ కథలన్నీ నాకు కంఠోపాఠం. ‘నేనున్నాను’, ‘గురుపీఠం’, ‘ఒక పగటివేళ పాసింజర్లో’, ‘నందవనంలో ఆండీ’, ‘చీకట్లోకి’, ‘అగ్రహారంలో పిల్లి’, ‘శిలువ’... ఆయన కథల్లో ‘మౌనం ఒక భాష’ అనే కథ ఉంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో తల్లి, కూతురు ఒకేసారి గర్భవతులవుతారు. ఇందుకు తల్లి సిగ్గుతో చితికిపోతుంది. కూతురి ముందుకు ఎలా రావడం? అప్పుడు రచయిత సాంత్వనం పలుకుతాడు. ‘పర్లేదులేమ్మా... పనసచెట్టుకు మొదట్లో కూడా కాయలు కాస్తాయి... తప్పులేదు’ అంటాడు. ఆయన మరో కథ ‘బ్రహ్మోపదేశం’. అందులో జీవితాంతం మంత్రోచ్ఛారణ చేసిన ఒక బ్రాహ్మణుడు చివరకు తనకు మంత్రాలు రావని గ్రహించి, వాటి అసలైన అర్థాలు పరమార్థాలు అవసరాలు ఏమీ తెలియవని గ్రహించి, జంధ్యం తెంచి పడేసి అంతర్థానం అయిపోతాడు. అలాంటి విప్లవాత్మకమైన కథలు జయకాంతన్ ఎన్నో రాశాడు. ఒక చెట్టును పెకలించి చూసినప్పుడు దాని కుదుళ్లతో పాటు మట్టిపెళ్లలు తేమ అంతా అంటుకుని దర్శనమిచ్చి నట్టుగా జయకాంతన్ ఏది రాసినా లోలోపలి నుంచి ఏదో పెళ్లగించి చూపినట్టుగా లోతుగా, విస్తృతంగా, దిగ్భ్రమగా ఉంటుంది. స్త్రీల గురించి, వారి చుట్టూ ఏర్పరచిన పవిత్రత గురించి పేరుకొని ఉన్న కొన్ని అభిప్రాయాలను బోర్లగించినవాడు జయకాంతన్. దాదాపు 200 కథలు, 25 నవలలు... ఇవిగాక వ్యాసాలు... సినిమా స్క్రిప్ట్‌లు... సినిమాకు దర్శకత్వాలు... ఎన్నని. మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఏ వైటాలిటితో ఆయన బయలుదేరాడో చివరివరకూ ఆయన దానిని కాపాడుకుంటూనే వచ్చాడు. బహుముఖాలుగా... వేయి బాహువు లుగా... ఏ రచయిత అయినా అలా జీవించాలి. ఆయన రచన ఆధారంగా వచ్చిన సినిమాని ఒకసారి టీవీలో చూసి ఇది ఏ నవల అనే అన్వేషణ సాగించాను. చివరికి అది ‘ఒక నటి నాటకం చూస్తోంది’ నవల అని తెలిసింది. మిత్రులు జిల్లేళ్ల బాలాజీ దానిని ‘కల్యాణి’ పేరుతో అనువాదం చేసినప్పుడు చాలా సంతోషం కలిగింది. దానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినప్పుడు మరింత సంతోషం కలిగింది. అది పుస్తకంగా వెలువడుతున్న సందర్భంగా చెన్నైలో ఆయనను కలవాలని జిల్లేళ్ల బాలాజీ, సుంకోజి దేవేంద్రాచారి, నేనూ తిరుపతి నుంచి వెళ్లాం. ఆయన తన ఇంటి మూడో ఫ్లోర్ మీద టీస్టాల్ వంటి ఒక తాటిపాక వేసుకొని ఎక్కువ భాగం అక్కడే గడుపుతూ ఉన్నాడు. మేం వచ్చామని తెలిసి ఆ తాటిపాకలోనే కూచోబెట్టి కాసేపటికి లుంగీ, గళ్ల చొక్కా మీద వచ్చి కూచున్నాడు. అంత పెద్ద రచయిత అయినా మా స్థాయికి దిగి ఎన్ని కబుర్లు చెప్పాడో ఎంత సంతోషం పొందాడో చెప్పలేను. అయితే ఆయన అందరినీ రచయితలుగా గుర్తిస్తాడని చెప్పలేము. అన్నాదురై, కరుణానిధి వంటి మహామహులను కూడా వారు రచయితలే కాదు అని తేల్చి చెబుతాడాయన. ఆయనకు ఇష్టమైన కవి కన్నదాసన్. అయినప్పటికీ జయకాంతన్ ధోరణిని అందరూ స్వీకరించారు. ఆయన స్టైల్‌ని హీరో పాత్రలకు ఆపాదించారు. జయకాంతన్వి పెద్ద పెద్ద మీసాలు. మాతో మాట్లాడుతున్నంత సేపు వాటిని మెలి తిప్పుకుంటూనే ఉన్నాడు. అయితే ఆ చేష్ట మాకు పొగరుగా, అహంకారంగా అనిపించలేదు. ముచ్చటగొలిపేదిగానే ఉంది. ఎందుకంటే మా ఎదురుగా ఉన్నది ఒక కథావీరుడు అని మాకు తెలుసు. అవును. ఆయన కథావీరుడే. ఇప్పుడే కాదు మరో వందేళ్లకు కూడా భారతీయ సాహిత్యంలో మనం మళ్లీ చూడలేని ఒక అరుదైన సాహితీ వీరుడు- జయకాంతన్. - మధురాంతకం నరేంద్ర 9866243659 మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఏ వైటాలిటితో ఆయన బయలుదేరాడో చివరివరకూ ఆయన దానిని కాపాడుకుంటూనే వచ్చాడు. బహుముఖాలుగా... వేయి బాహువులుగా... ఏ రచయిత అయినా అలా జీవించాలి. -
మాస్కోలో తెలుగును వెలిగించినవాడు.....
స్మరణీయులు ‘నేను సామాన్యులలోకెల్లా సామాన్యుడిని. అయినా సరే వినకుండా నా ఆత్మకథ రాయమంటున్నారు. అందుకే రాస్తున్నాను’ అని చెప్పుకున్నారు వుప్పల లక్ష్మణరావు తన ఆత్మకథ ‘బతుకు పుస్తకం’లో. ఆ కాలం మనుషులు అలాగే ఉండేవారు. అసామాన్యమైన పనులు చేసినా సామాన్యమైనవిగా భావిస్తూ వినమ్రంగా ఉండేవారు. నిజంగా వుప్పల లక్ష్మణరావు చేసిన పనులు సామాన్యమైనవా? ఎక్కడి బరంపురం? ఎక్కడి సబర్మతి? ఎక్కడి ఎడిన్‌బరో? వుప్పల లక్ష్మణరావు ఒక బిందువు నుంచి మరో బిందువుకు చేసిన ప్రయాణం విలక్షణమైనది. పొందిన సాక్షాత్కారం కూడా. ఆయన చదువు వృక్షశాస్త్రం. అందులోనే డాక్టరేట్ చేశారు. దానినే విద్యార్థులకు బోధించారు. అయితే సంతృప్తి కలగలేదు. జాతీయోద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన ఊరికే ఉండలేకపోయారు. బోధనను పక్కన పెట్టారు. నేరుగా సబర్మతి ఆశ్రమానికి చేరుకుని అక్కడ ఖాదీ పరిశ్రమ మీద పరిశోధన సాగించారు. అక్కడి నుంచి తిరిగి వచ్చి అనేక ఇంజనీరింగ్ సంస్థలపై పరిశోధనలు సాగించారు. మళ్లీ వృక్షశాస్త్రం కోసం జర్మనీ వెళ్లి అక్కడ ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పరిశోధనలు సాగించారు. అనేక దేశాల విశ్వ విద్యాలయాలు ఆయన ప్రతిభను గుర్తించాయి. విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించాయి. అయినా ఆయనకు సంతృప్తి కలగలేదు. తన మనసు నిమగ్నమై ఉన్నది సాహిత్యంలోనే అని చివరకు కనిపెట్టగలిగారు. ఆ తర్వాత మడమ తిప్పలేదు. సాహిత్యానికే జీవితాన్ని అంకితం చేశారు. వుప్పల లక్ష్మణరావు జీవితంలో కీలక మలుపు ఆయన 1958లో మాస్కో చేరుకోవడం. అప్పటి నుంచి 1970 వరకూ అక్కడే ఉన్నారు. ‘ప్రగతి’ ప్రచురణాలయంలో అనువాదకునిగా ఉంటూ అక్కడి వారికి తెలుగు నేర్పించడం, తెలుగు పుస్తకాల ప్రచురణకు విస్తృతి కల్పించడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇక్కడ ఒక సంఘటన చెబుతారు. లెనిన్గ్రాడ్లో సోవియెట్ విజ్ఞానకేంద్రం నిర్వహించిన ఒక ఇష్టాగోష్టిలో వుప్పల లక్ష్మణరావుకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయన ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సోవియెట్వారు భారతదేశం అంటే ఉత్తరాది భాషలే అని భావిస్తున్నారని, ద్రవిడ భాషల సారస్వతాన్ని పట్టించుకోవడం లేదని అభ్యంతరం ప్రకటించారు. ఆ తర్వాతనే సోవియెట్‌లో తెలుగుకు ప్రాముఖ్యం పెరిగిందనీ మాస్కో రేడియోలో ఇతర భాషలతో పాటు తెలుగు వాణి వినిపించిందనీ తెలుగువారందరూ ఇందుకు లక్ష్మణరావుకు రుణపడి ఉండాలనీ అంటారు. మాస్కోలో ఉండగా వుప్పల లక్ష్మణరావు దాదాపు నలభై రష్యన్ పుస్తకాలకు తెలుగు అనువాదం చేశారు. వాటిలో మాక్సిమ్ గోర్కి ‘నా బాల్యం’, చెంగిజ్ ఐత్మాతోవ్ ‘జమీల్యా’, ‘తల్లి భూదేవి’ ముఖ్యమైనవి. ద్మీత్రియ్ మెద్వేదేవ్ ‘దిటవు గుండెలు’ కూడా. ఇవి గాక ఆర్మేనియన్ సాహిత్యాన్ని చాలా ఇష్టంగా తెలుగులోకి తీసుకువచ్చారు. ‘ఎందరు రచయితలు ఉన్నా గోర్కియే నా అభిమాన రచయిత. వాస్తవిక దృష్టి లేకుండా రచనలు చేయరాదని ఆయన చెప్పాడు. ఒకసారి గోర్కి ఒక రచయితల సమావేశంలో- మీ గుండెల మీద తుపాకీ పెట్టి కాలిస్తే ముందుకు పడిపోతారా వెనక్కు పడిపోతారా? అని అడిగాడు. చాలా మంది వెనక్కు పడిపోతామని చెప్పారు. కాని గోర్కి- కాదు. ముందుకే పడిపోతాం. నేనలా ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు ముందుకే పడ్డాను అని చెప్పాడు. దీనర్థం ప్రతిదీ తెలుసుకొని చేయాలని కాదు. ప్రతిదీ ఊహించరాదని’ అంటారు లక్ష్మణరావు. తెలుగు నేల వుప్పల లక్ష్మణరావును కేవలం అనువాదకునిగానే చూడలేదు. ఆయన నవల ‘అతడు-ఆమె’కు విశిష్టస్థానం ఇచ్చి అక్కున జేర్చుకుంది. భారత స్వాతంత్య్ర పోరాటం నాటి సాంఘిక, రాజకీయ పరిస్థితులను ఈ నవల సాకల్యంగా ముసుగులు లేకుండా పాఠకుల ముందు పరుస్తుంది. ఆ విధంగా వుప్పల లక్ష్మణరావు తెలుగు సాహిత్యంలో రాజకీయాలను నేరుగా సాహిత్యం చేసిన మహీధర రామమోహనరావు తర్వాతి స్థానాన్ని అందుకున్నారు. ‘అతడు-ఆమె’ నవలలో లక్ష్మణరావు పాటించిన టెక్నిక్ కూడా వినూత్నమైనదే. అది ‘డైరీ టెక్నిక్’. ఒక స్త్రీ, ఒక పురుషుడు డైరీ రాసుకున్నట్టుగా సాగే ఈ నవలలో- అది డైరీ కనుక- వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అనుకోకుండా నిజాయితీగా అభిప్రాయాలు సాగుతాయి. ఉద్వేగ సమయాల్లో ఉద్వేగం కలుగుతుంది. విచార సమయాల్లో విచారం. పాత్రలు తమకు తాముగా ప్రజాస్వామికంగా ఎదగడం అంటే ఏమిటో ఈ నవల చదివితే తెలుస్తుంది. లక్ష్మణరావులో ఉండే జిజ్ఞాస అసామాన్యమైనదని అంటారు. ఆయన తన అరవయ్యవ ఏట రష్యన్ అక్షరాలు దిద్ది, నేర్చుకుని, తయారు చేసిన రష్యన్-తెలుగు నిఘంటువును అందుకు ఉదాహరణగా చూపుతారు. మంచి ఎక్కడ ఉన్నా ప్రోత్సహించడం, కొత్త రచయితలను ఉత్సాహపరచడం ఆయన వ్యక్తిత్వంలో భాగం. లక్ష్మణరావు స్విస్ వనిత మెల్లి శాలింజర్ను వివాహం చేసుకున్నారు. ఆ రోజుల్లో తెలుగు సమాజానికి విడ్డూరమైన సంగతే అయినా వారి కుటుంబం ఆమెను స్వీకరించింది. ‘అందుకు నా ఇద్దరు తమ్ముళ్లకూ మరదళ్లకూ కృతజ్ఞుడనై ఉంటాను’ అంటారాయన. అంతేకాదు తన ఆత్మకథ ‘బతుకు పుస్తకం’ను వారికే అంకితం ఇచ్చారు. 1970లో మాస్కో నుంచి తిరిగి వచ్చాక లక్ష్మణరావు బరంపురంలోనే ఉండిపోయారు. విజయనగరం, రాయగఢ్, జయపురం వంటి చోట్ల సాహిత్య కార్యక్రమాలు చురుగ్గా సాగేలా కృషి చేశారు. ఇన్ని చేసినా ఆయన ఏనాడూ తన ఘనతలు చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. అవార్డులు, రివార్డుల కోసం పట్టుపట్టలేదు. ఒక చెట్టు నిశ్శబ్దంగా ఎదిగి నీడనిచ్చి, ఫలాలనిచ్చి, కలపనిచ్చి ఏమీ ఆశించకనే తన కర్తవ్యాన్ని ముగించుకుంటుంది. బహుశా లక్ష్మణరావు కూడా అంతే. ఎవరో ఒక ఇంటర్వ్యూలో అడిగారు ‘మీరు రాసినదానికీ మీ నిజ జీవితానికీ తేడా ఉందా?’ అని?. దానికి ఆయన జవాబు- ‘నా బతుకు పుస్తకం చదవండి. మీకే తెలుస్తుంది’. మహా మహా విజేతలు కూడా తలెత్తి చూడక తప్పని నిరాడంబరులు- సామాన్యులు- వుప్పల లక్ష్మణరావుగారు. - సాక్షి సాహిత్యం లక్ష్మణరావులో ఉండే జిజ్ఞాస కూడా అసామాన్యమైనదని అంటారు. ఆయన తన అరవయ్యవ ఏట రష్యన్ అక్షరాలు దిద్ది, నేర్చుకుని తయారు చేసిన రష్యన్- తెలుగు నిఘంటువును అందుకు ఉదాహరణగా చూపుతారు. వుప్పల లక్ష్మణరావు -
ఆరు రుచుల పుస్తకాలు...
ఉగాది ప్రత్యేకం పదార్థానికే కాదు పుస్తకానికి కూడా ఒక రుచి ఉంటుంది. తీపి, కారం, వగరు, చేదు... జీవితంలోని ఈ రుచులన్నింటినీ పుస్తకాలు చూపిస్తాయి. అవి ఎదురైనప్పుడు వాటిని ఎలా స్వీకరించాలో ఎంతవరకు స్వీకరించాలో ఎలా తప్పుకుపోవాలో ఎలా వాటిని ఎదిరించి నిలవాలో సూచిస్తాయి. ఉగాదికీ సాహిత్యానికీ మధ్య ఉన్న బంధం రుతువుకూ చివురుకూ ఉన్న బంధం. తెలుగువారు ఉగాది రాగానే పూతతో పాటు పద్యాన్ని కూడా గుర్తు చేసుకుంటారు. అసలు సిసలు తెలుగు సారస్వతాన్ని తలచుకుని గర్వపడతారు. ప్రహసనంగా మారిన వాటిని హాస్యమాడి పండగ పూట కాసింత వినోదిస్తారు. ఉగాది కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ పేజీల్లో అవన్నీ ఉన్నాయి. ఆరు రుచుల పేర్లు చెప్పగానే ఆ రుచికి తగ్గ పుస్తకాన్ని ఇక్కడ కొందరు రచయితలు పంచుకున్నారు. పాప్యులర్ రచయితలు వారికి నచ్చిన ఆరు పుస్తకాలను ఎంచి చూపారు. పండగపూట ఇవన్నీ తేలికపాటి ఆరగింపులు. చిరు జలదరింపులు. చిత్తగించండి. తీపి మోహనవంశీ... సాహిత్యంలో తీపి అంటే నాకు లత రాసిన ‘మోహనవంశీ’యే గుర్తుకు వస్తుంది. లత వాక్యం, రచనను ఆమె నిర్వహించే తీరు అద్భుతం. అంత తీయగా ఎవరైనా రాయగలరా? తియ్యటి పాయసంలాంటి ప్రేమ మాధుర్యాన్ని వొంపి, జీవన మధువునంతా నింపి ఆమె ఆ రచన చేసిందా అనిపిస్తుంది. జీవితంలోని అన్ని ప్రశ్నలకూ తాత్విక సమాధానం తీయని వలపులో ఉందని చెప్పడానికే లత ఈ మధుర కావ్యం రాసి ఉండవచ్చు. ఈ నవలలోని రాధకానీ, ఆమె ప్రేమకానీ ఒక ఊహే కావచ్చు. కృష్ణుడిని దైవత్వ పీఠం నుంచి తొలగించి రాధ మనోవేదిక మీద ఒక ప్రేమికుడిగా కూర్చోబెట్టడమూ ఊహే కావచ్చు. కాని, ఆ ఊహలోని తియ్యదనం మాత్రం నిజం. ప్రేమ గురించి ఉమర్ ఖయ్యాం మొదలు ఎందరు కవులు చెప్పినా ఆ పాటలన్నీ అందమైన వచనంలోకి మారింది మాత్రం లత మోహనవంశీలోనే. అందుకే ఆమె లత. తెలుగు లత. - కల్పనా రెంటాల, రచయిత్రి చేదు మహాప్రస్థానం జీవితంలోనూ సాహిత్యంలోనూ చేదునిజాన్ని చెప్పిన కవిత్వం ‘మహాప్రస్థానం’. ఇంతటి చేదును ఇంతకు మునుపు ఎవరైనా చూశారా? ఎలాంటి చేదు ఇది? కడుపులో చేతులు పెట్టి దేవినట్టు అనిపించే చేదు. అంతవరకూ కవిత్వం అంటే కమనీయంగా రమణీయంగా ఉండాలని అనుకుంటూ ఉన్న నాకు ఈ పుస్తకం ఉలిక్కిపడేలా చేసింది. ‘చేదువిషం జీవఫలం’ అంటూ భయోద్విగ్నంగా జాగృతం చేసింది. ఆకలేసి కేకలేసే అభాగ్యులను, పతితులను, బాధాసర్పదష్టులను విముక్తంచేయమని పిలుపునిచ్చిన ఆ కవిత్వాన్ని ప్రతి ఒక్కరూ నాలుక మీద చేదుగా రాసుకోవాలి. అప్పుడే సత్యం పలకడం సాధ్యమవుతుంది. తాంబూల సేవనంలో ఉన్న కవిత్వాన్ని వేపమండలతో చరిచి మేల్కొల్పిన శ్రీశ్రీ ధన్యుడు. - సింగమనేని నారాయణ, కథా రచయిత కారం ఖాకీవనం కారం అనగానే నాకు వెంటనే గుర్తుకొచ్చేది పతంజలి వచనం. అది ఒక్కోసారి మామిడికాయ ముక్కకి అద్దినట్టుగా ఉంటుంది. మరోసారి పుండు మీద జల్లినట్టుగా ఉంటుంది. ఇంకోసారి కళ్లలో కొట్టినట్టుగా ఉంటుంది. పతంజలి ప్రతి రచనా ఒక రకం కారమే. ‘దిక్కుమాలిన కాలేజీ’లో ఆగ్రహానికి ఒక ఈస్థటికల్ పవర్ కనిపిస్తుంది. ‘ఖాకీవనం’లో కనిపించేది ఆగ్రహ వ్యాకరణం. ‘పతంజలి భాష్యం’లో కనిపించేది కోప కారణం. అయితే ఈ వ్యవస్థ మీదా వ్యక్తుల మీదా ఈ రాజ్యం మీదా మళ్లీ మళ్లీ కోపం తెచ్చుకోవాలంటే మాత్రం ‘ఖాకీవనం’లోకి వెళ్లిపోతాను. కోపాన్ని ఎన్ని ప్రతీకల్లో ఎంత దూరం చెప్పవచ్చో తనని తాను పరీక్షించుకోడానికి ఆయన ఈ నవల రాశారా అనిపిస్తుంది. అప్పటి దాకా మన సాహిత్యంలో కోప వ్యాకరణం లేదని కాదు. చాలా ఉంది. శ్రీపాద నుంచి చలం దాకా దూర్జటి నుంచి దిగంబర కవుల దాకా... కాని కోపాన్ని కోపంగానే పొగరు గానే వ్యక్తం చేయాలి అనుకొని దానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేసినవాడు మాత్రం పతంజలి. - అఫ్సర్, కవి వగరు పితృవనం వగరు... ఈ రుచి అనగానే నాకు కాటూరి విజయసారథి గుర్తుకు వస్తారు. ఆయన నవల ‘పితృవనం’ తెలుగులో చాలా మంచి నవల నా దృష్టిలో. ఆయన కాంట్రిబ్యూషన్ గురించి ఎవరైనా మాట్లాడారో లేదో నాకు తెలియదు. బ్రాహ్మణుల శవాలను మోసే ఒక నిరుపేద బ్రాహ్మణుడి కథ అది. ఆ రోజుల్లోనే పదివేల రూపాయల బహుమతి గెలుచుకుంది. విజయసారథి చాలా జోవియెల్. బాగా నవ్వించేవాడు. కర్నూలు ఆల్ ఇండియా రేడియోలో పనిచేయడానికి వచ్చినప్పుడు మంచి స్నేహితుడయ్యాడు. ‘నేనూ చీకటి’ నవలను అచ్చుకు పంపకముందు కొంత చదివి వినిపిస్తే చాలా మెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ‘నేనూ చీకటి’... ఆంధ్రప్రభలో సీరియలైజ్ అవుతున్నదని ఉత్తరం రాశాను. జవాబు లేదు. రెండు నెలల తర్వాత వాళ్లబ్బాయి సమాధానం రాశాడు- మీకు రిప్లై ఇవ్వడానికి నాన్న లేరు... చనిపోయారు అని. ఎందుకనో ఇది జరిగి చాలారోజులైనా కరక్కాయ కొరికినట్టుగా... ఇంకా గొంతు దిగనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. -కాశీభట్ల వేణుగోపాల్, నవలా రచయిత పులుపు కన్యాశుల్కం... గట్టి పులుపు తగిలితే ఒళ్లు జిల్లుమంటుంది. జలదరిస్తుంది. ఒక్క మధురవాణికి తప్ప అలాంటి పులుపు, జలదరింపు తక్కిన తన అన్ని పాత్రలకూ ఇచ్చాడు గురజాడ కన్యాశుల్కంలో. ఆలోచించి చూడండి అందులో పులుపు తగలని పాత్ర ఉందా? అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు, రామప్ప పంతులు, గిరీశం, వెంకటేశం, కరకట శాస్త్రి, బుచ్చమ్మ... అందరికీ తగిలింది. ఇది యాసిడ్ దాడి లాంటిది కాదు. బుగ్గ మీద చిటికేసి చక్కదిద్దడం. దారికి తేవడం. గురజాడ ఆత్మ మధురవాణిలోనే ఉందంటారు చాలామంది. నండూరి రామమోహనరావుగారు తనకే గనక అధికారం ఉంటే విజయనగరంలో మధురవాణి విగ్రహం పెడతానని అనేవారు. తమిళులు ‘కన్నగి’ పాత్రను అలా చెన్నై మెరీనా బీచ్‌లో ప్రతిష్టించుకున్నారు. మనం ఆ పని చేయలేదు. ఏ విషయం గురించైనా అసలు మనకు పులుపు తగిలితే కదా. - శ్రీరమణ, రచయిత ఉప్పు యమకూపం ఉప్పు చాలా ముఖ్యమైన రుచి. సమతూకం పాటించాల్సిన రుచి. జీవితంలో దీనిని శృంగారంతో పోల్చవచ్చు. అది ఎక్కువైనా కష్టమే. అసలు లేకపోయినా నిస్సారమే. శృంగారంతో ముడిపడ్డ కుటుంబ వ్యవస్థ సజావుగా సాగాలంటే బయట వ్యభిచార వ్యవస్థ నడవక తప్పదు అని చాలామంది వాదిస్తారు. ఆ వ్యభిచార వ్యవస్థ విశ్వరూపాన్ని చూపించే నవల కుప్రిన్ రాసిన ‘యమకూపం’. చాలాఏళ్ల క్రితం చదివినా ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మన బయటి జీవితాల్లో ఉండే దొంతరలన్నింటినీ కుప్రిన్ ఒక వేశ్యావాటికలోని వీధిలో చూపించి మనల్ని ఆలోచింపచేస్తాడు. వ్యభిచారం పోవాలి అని పైకి ఎంత అరచినా సాధ్యం కాదు. మూలాలు చూడాలి. ఈ ప్రపంచంలో ఆయుధ వ్యాపారం తర్వాత రెండో స్థానంలో నిలిచింది స్త్రీల వ్యాపారమేనట. ఎంత విషాదం. సోషల్ రిలవెన్స్ పోతే ఏ పుస్తకమైనా మూలబడుతుంది. యమకూపం అలా మూలపడాలని నేను కోరుకుంటాను. కాని మరో వందేళ్లకూ సాధ్యమయ్యేలా లేదు. - విమల, కవి -
ఆ పుస్తకాలు గుర్తున్నాయా?
పుస్తక ప్రచురణ. ‘ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతుంది’... ఇలా అనుకోవడానికి తిలక్‌కు వేరే కారణాలున్నా మనకి మాత్రం 1950ల నుంచి ఓ ముఫ్పైయేళ్ళ పాటు సంగీతం, సాహిత్యం, సినిమా రంగాల్లో కురిసిన వెన్నెల వాన గుర్తుకొచ్చి బెంగ కలుగుతుంది. ఆ వెల్లువ అన్ని వైపులకీ ప్రవహించడానికి, ఆసరాగా నిలబడి మరింత బలంగా ముందుకు నడవడానికి ముఖ్యపాత్ర పోషించింది పుస్తకాలను ముద్రించిన సంస్థలే. వాటిలో ఒక వెలుగు వెలిగి, చరిత్రలోకి జారిపోయిన రెండు సంస్థల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఒకటి ‘సోవియట్ పుస్తక ప్రచురణ సంస్థ’, రెండు ‘దక్షిణ భాషా పుస్తక సంస్థ’ (సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్టు). సోవియట్ యూనియన్‌లో ముద్రించిన అనేక భారతీయ భాషా పుస్తకాలు ‘ఫారెన్ లాంగ్వేజ్ పబ్లిషింగ్ హౌస్’ ద్వారా ఇండియాకి వచ్చేవి. సోవియెట్ ఈ పుస్తకాలే కాకుండా ‘సోవియట్ లాండ్’ అనే పక్ష పత్రికని ఇంగ్లిషు, బెంగాలీ, హిందీ, తెలుగులో (సోవియట్ భూమి) ప్రచురించి వెలువరించేది. ఇవన్నీ ‘పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్’ ద్వారా రవాణా ఖర్చులు లేకుండా మన దేశానికి వస్తే వాటిని వివిధ ప్రాంతాలకు చేర్చి, అతి తక్కువ రేటుకి అమ్మేవారు. తెలుగులో ‘విశాలాంధ్ర బుక్ హౌస్’ వీటిని అమ్మేది. సోవియట్ పతనంలో ఈ చౌక పుస్తకాల కథ కూడా కంచికి చేరింది. ఇదంతా చాలామందికి యింకా గుర్తున్న జ్ఞాపకమే కాబట్టి దక్షిణ భాషా పుస్తక సంస్థను గురించి మాట్లాడుకుందాం. పదేళ్ళ దాకా పిల్లలకి రంగు రంగుల బొమ్మలతో, చిట్టిపొట్టి కథలతో అందమైన పుస్తకాల ఎర వేసి, ఆ తర్వాత నెమ్మదిగా సోవియట్ రచయితల్ని రక్తంలోకి ఎక్కిస్తూ పోతూ ఉంటే, ఇరవై ఐదేళ్ళు వచ్చేసరికి అందరూ సోవియట్ ప్రచురణల ద్వారా కమ్యూనిస్టులు అయిపోతారని అమెరికా పీడకల కంది. పీచు మిఠాయి రేటుకే పుస్తకాలు అమ్మి, దేశాలకి దేశాల్నే కొనేస్తోందని బెంగపడింది. అయితే సోవియట్‌లా తిన్నగా బరిలోకి దిగే వెసులుబాటు అమెరికాకు లేదు. పెట్టుబడిదారులకి అలవాటైన పెరటి దారులు మాత్రమే ఉంటాయి. తలుపులు తీయడానికి రాక్ ఫెల్లర్లు, ఫోర్డులు, బిల్గేట్లు ఛారిటబుల్ ట్రస్టు తాళాలతో రెడీగా ఉంటారు. ఉపఖండంలో సోవియట్ భావదాడిని ఎదుర్కోడంలో భాగంగా ‘ఫోర్డు ఫౌండేషన్’ సహకారంతో 1950లలో ఏర్పాటు అయినదే ‘సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్టు’ - దక్షిణ భాషా పుస్తక సంస్థ. ఈ సంస్థ బలంగా నిలబడడానికి గట్టి పునాదులే వేశారు. సర్వేలు జరిపి, ప్రజలు ఎలాంటి పుస్తకాలు కావాలనుకున్నారో తె లుసుకున్నారు. అన్ని విషయాలు సవివరంగా సరి చూసుకున్న తర్వాతే కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీంట్లో భారత ప్రభుత్వం కూడా చేతులు కలిపింది. దక్షిణ భారతంలో చాలా పేరున్న ఐదు విశ్వవిద్యాలయాల అధిపతులు ఈ ట్రస్టు సభ్యులు. ఈ సంస్థ తనంత తానుగా పుస్తకాలు వెయ్యలేదు. దక్షిణాదిన ఉన్న అనేక మంది ప్రచురణకర్తల ద్వారా పుస్తకాలు అచ్చు వేయించింది. పుస్తకాలకి ముందు మాటలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యాశాఖా మంత్రులు లాంటి వారు కూడా రాశారు. ఈ సంస్థ రెండువందల పుస్తకంగా వేసిన డా.రాధాకృష్ణన్ రచనల తమిళ అనువాదాన్ని 1960 ఫిబ్రవరి పన్నెండున నెహ్రూగారు ఆవిష్కరించి, పెద్ద ఉపన్యాసం కూడా యిచ్చారు. ఈ యజ్ఞంలో భాగంగా కరుడుగట్టిన కమ్యూనిస్టులను కూడా ముగ్గులో దింపిందీ సంస్థ. వేర్వేరు ప్రచురణ సంస్థలు పుస్తకాలు వేయటం వలన యిది సాధ్యపడింది. తెలుగులో కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు, మద్దిపట్ల సూరి, బైరాగి, నండూరి విఠల్, వేల్చేరు నారాయణరావు లాంటి పేరున్న రచయితలతో పాటు ప్రజలకు పరిచయమున్న అనేకమంది రచయితలు ఈ కార్యక్రమంలో తలో చెయ్యి వేశారు. ఈ సంస్థ తెలుగులో వేసిన పుస్తకాలలో మచ్చుకు కొన్ని - ప్రకృతి పిలుపు, కూలిన వంతెనలు, ఆకలి చేసిన నేరం, భగ్న మందిరం, రాము - రాక్షసులు, కోకొరోకో, ప్రశస్త ఆధునిక జర్మన్ కథానికలు, బెంగాలీ కథలు, ఇదా నాగరికత, వేలుగాడి కొడుకు- యితర విదేశీ కథలు, స్వప్న లోకంలో అణు- అమ్మణి, యింకా చాలా చాలా పుస్తకాలు, కథలు, నవలలే కాకుండా తత్వశాస్త్రం, మతం, విజ్ఞానశాస్త్రం, నాటక కళ, శిల్పశాస్త్రం, పురావస్తు పరిశోధన, దక్షిణాది దేవాలయాల గొప్పతనం యిలా అనేక విషయాల మీద రాయించి, వేయించిందీ సంస్థ. పుస్తకం మీద ఏదో ఒక మూల చిన్నగా సంస్థ లోగో ఉండటం తప్పించి, సోవియట్ పుస్తకాల్లా ఉనికిని చాటే ప్రయత్నాలేవీ ఈ సంస్థ చెయ్యలేదు. అయితేనేం దక్షిణాది భాషా సాహిత్యానికి, కళలకి ఎనలేని ఉపకారం చేసింది. ఒకే కిటికీ నుంచి వస్తున్న గాలి నుంచి మళ్లించి, అనేక కాంతిరేఖల ద్వారాలు తెరిచింది. సోవియట్ పతనం ముందే పసిగట్టి, యిక బెంగలేదనుకొని తన అవతారం చాలించింది. ఇదే నిన్న కురిసిన వెన్నెల వాన. మీకెక్కడైనా ఈ వెన్నెల తడి తగిలితే దాన్ని ఆస్వాదించండి. మరింతమందికి దాన్ని చేర్చండి. - కృష్ణమోహన్‌బాబు, 9848023384 -
లిరిక్స్ ద్వంద్వార్థాలతో వస్తున్నాయి...
ప్రస్తుతం వస్తున్న పాటలు అర్థం పర్థం లేకుండా ఉన్నాయని బాలీవుడ్ ప్రముఖ సంగీత గాయకుడు బప్పీ లహరి అన్నారు. ఈ పాటలు వినడానికి చిరాకుగా ఉందని, ఇది తీవ్రంగా నిరాశపెట్టే అంశమని ఆయన వ్యాఖ్యానించారు. 'హంటర్' చిత్రానికి.. హంటర్ 303 అనే పాటపాడిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నేటి లిరిక్స్లలో చిత్రవిచిత్రమైన పదాలను పొందుపరుస్తున్నారని, ఇది ఏవగింపు కలిగించే అంశమని చెప్పారు. 'ఒక్కసారి పాత పాటల గురించి ఆలోచించండి ఎంత మధురంగా ఉంటాయో. వాటిని జనాలు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. సంగీతానికి నేడు స్వర్ణయుగం ఉన్నప్పటికీ నేటి పాటలకు మాత్రం భావాలతో పనిలేకుండా పోయింది. లిరిక్స్ ద్వంద్వార్థాలతో వస్తున్నాయి.. కానీ, వీటిని నేటి యువతరం ఇష్టపడుతున్నారు' అని ఆయన అన్నారు. 42 సంవత్సరాల నుంచి తాను సినీ ఇండస్ట్రీలో గాయకుడిగా కొనసాగుతున్నానని, తనకు పాత పాటలంటే చాలా ఇష్టమని, ఇప్పటికీ వాటి వన్నే తగ్గలేదని చెప్పారు. -
పాట వెనుక కథ 27th Dec 2014
-
పాట వెనుక కథ 20th Dec 2014
-
వారెవ్వా పుడ్ ఆంధమ్..
-
పాట వెనుక కథ 22nd Nov 2014
-
పాట వెనుక కథ 16th Nov 2014
-
పాట వెనుక కథ 8th Nov 2014
-
పాట వెనుక కథ 1st Nov 2014
-
పాట వెనుక కథ 25th Oct 2014
-
భార్యకు క్షమాపణ చెప్పండి!
సుద్దాల అశోక్‌తేజ - అంతర్వీక్షణం సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఇటీవల గీతం యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నల్లగొండ జిల్లా సుద్దాల అనే గ్రామంలో, 1960 వైశాఖ పున్నమి రోజు పుట్టిన అశోక్‌తేజ అంతరంగాన్ని వీక్షించే ప్రయత్నం ఇది! మీలో నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం? నచ్చని లక్షణం... మా ఆవిడను విసుక్కోవడం. నచ్చే లక్షణం దేవతామూర్తుల తర్వాత స్త్రీమూర్తులను అంతగా గౌరవించడం. ఎదుటి వారిని చూసే దృష్టి కోణం? వీరి నుంచి నేర్చుకోగలిగింది ఏమిటి అని. ఎలాంటి వారిని ఇష్టపడతారు? మానవీయత ఉన్న వారిని ఏడు జన్మల స్నేహితులుగా భావిస్తాను. డాక్టరేట్ అందుకున్న క్షణంలో కలిగిన భావం? సినిమా అవార్డులు ఆ ఏడాది వచ్చిన సినిమాల ఆధారంగా ఇస్తారు. డాక్టరేట్ అనేది మన పనిని ఆమూలాగ్రం మూల్యాంకనం చేసి ఇచ్చేది. కాబట్టి ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందాన్ని పొందాను. గౌను వేస్తున్నప్పుడు అద్భుతమైన, అప్రమేయమైన ఆనందం కలిగింది. మీకు నచ్చిన పుస్తకాలు..! అమ్మ టైలరింగ్ చేస్తున్నప్పుడు నేను చదివి వినిపించిన వాటిలో మాక్సిం గోర్కీ రాసిన ‘అమ్మ’ నవల బాగా నచ్చింది. నాన్న ఒళ్లో కూర్చోబెట్టుకుని కంఠతా వచ్చేలా చదివించిన మహాప్రస్థానం నా రక్తంలో ఇంకి పోయింది. ఏ రంగలో స్థిరపడాలనుకునేవారు? ... ఆరవ తరగతి నుంచి డాక్టర్ సి.నా.రె.లా సినీరచయిత కావాలనుకునేవాడిని. అలాగే అయ్యాను. మీరు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి ఎవరు? ఒకరు కాదు ఇద్దరు. అమ్మ, మా ఆవిడ. మిమ్మల్ని ప్రభావితం చేసిన వారు! మొదట నాన్న. తర్వాత నారాయణరెడ్డి. తొలి పాట రాసినప్పటి అనుభూతి ... తొమ్మిదేళ్లకే రాశాను. అనుభూతి తెలియని వయస్సది. ఎనిమిదవ తరగతిలో పాఠాన్ని పాటగా రాసినప్పుడు వచ్చిన ప్రశంస అనిర్వచనీయం. తొలి సంపాదన! ... దాసరి నారాయణరావు నా పాటలు విని ‘‘నీ పాటలు తీసుకుంటాను’’ అని కవిని ఊరికే పంపకూడదంటూ మూడువేల రూపాయలిచ్చారు. ఆ డబ్బుతో నా కుటుంబాన్నంతటినీ (అక్క- బావతోపాటు) తిరుపతికి తీసుకెళ్లాను. అది నా మనసును నింపిన తొలి సంపాదన. అలాంటి మనసు నిండిన మరో సంఘటన? నా భార్య నిర్మలతో కలిసి ఓ ఫంక్షన్కెళ్తుండగా ఒక ఫోన్. అవతలి వ్యక్తి ‘‘వైస్ చాన్స్లర్గారు మాట్లాడతారు’’ అని చెప్పారు. ఏదో కార్యక్రమం గురించేమో అనుకున్నాను. ఆయన డాక్టరేట్ గురించి చెప్పారు. నన్ను నేను తట్టుకోవడానికి నిర్మల చేతిని గట్టిగా పట్టుకున్నాను. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి? ...ఒకరిద్దరు కాదు. సినిమా రంగంలో ఇది మామూలే. అప్పుడలా చేసి ఉండాల్సింది కాదు అనిపిం చిన పని... నిర్ణయం? ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను పునరాలోచించుకోవాల్సిన అవసరమే రాలేదు. ఎవరికైనా క్షమాపణ చెప్పారా? మా ఆవిడకే. విసుక్కుని నొప్పించాను అనిపిస్తుండేది. అంతే... క్షమాపణ చెప్పేశాను. మీలా ఆలోచించే భర్తలు తక్కువేమో? ఇది భర్తలకు సూచన... ‘భార్యకు క్షమాపణ చెప్పడానికి వెనుకాడవద్దు. మీరు క్షమాపణ చెప్పిన విషయాన్ని ఆవిడ ఎవరికీ చెప్పదు. సత్యభామ కాళ్లు పట్టుకున్న విషయాన్ని కృష్ణుడు తనంతట తాను చెప్పుకున్నాడే తప్ప సత్యభామ చెప్పలేదు’. భాగస్వామికి సమయం కేటాయిస్తున్నారా? సినిమా ప్రయత్నాల సమయంలో ఒకరినొకరు దినాలు, నెలలు కూడా మిస్సయ్యాం. పాటల్లో ఉపయోగించే భావం... కృష్ణశాస్త్రి మెత్తదనాన్ని, శ్రీశ్రీ కత్తిదనాన్ని మేళవించి రాశాను. కవిత్వం, సాహిత్యం తెలియని వారికి కూడా హృదయం లోపల ఒక సున్నితమైన పాయింట్ ఉంటుంది. నా కలం ములుకు ఆ బిందువును తాకాలన్నట్లు రాస్తాను. కుటుంబ జీవితంలో ఆనందపడిన క్షణాలు? నా కూతురికి ఇద్దరు కూతుళ్లు. నా కొడుక్కి ఒక కొడుకు. వారితో ఆడుకుంటుంటే గర్భగుడిలో దైవం సాన్నిహిత్యంలో ఉన్నట్లుంటుంది. ఒక్క రోజు మిగిలి ఉంటే ఏం చేస్తారు? మొదలు పెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముగించాల్సిన పని ఒక్కటీ లేదు. ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? ఎక్కువ మా ఆవిడతోనే. అయితే అన్నీ ప్రమాదానికి దారితీయని చిల్లర అబద్ధాలే. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? మళ్లీ ఇలాగే... ప్రజల మనసులను తాకే రచయితగా... పుట్టించమని కోరుకుంటాను. మీ గురించి మీరు ఒక్కమాటలో... మాటతోనైనా, పాటతోనైనా హృదయాలను కదిలించే వ్యక్తిని. - వి.ఎం.ఆర్ -
పాట వెనుక కథ 5th Oct 2014
-
పాట వెనుక కథ 28th Sept 2014
-
పాట వెనుక కథ 20th Sept 2014
-
పాట వెనుక కథ 13th Sept 2014
-
'సూర్యుడే సెలవనీ..' : పాట పుట్టిందిలా
-
పాట వెనుక కథ - వెన్నెలకంటి
-
కవి స్వేచ్ఛాజీవి
- సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆ కలానికి జనం బాధలు, కష్టాలు, కన్నీళ్లు తెలుసు. ఆ సాహిత్యం.. ప్రజా సమస్యల ప్రతిబింబం. పదంపదంలో ఉద్యమపథం.. మాటమాటలో పోరాట కెరటం. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. తెలుగు పద ప్రయోగంలో కొత్త ఒరవడిని సృష్టించి.. తెలుగు పాటకు జాతీయ కీర్తి తెచ్చిపెట్టిన సినీకవి, సాహితీమూర్తి సుద్దాల అశోక్ తేజ. ఆయన రాసిన పాటల పూదోటలో ఎన్నో కుసుమాలు.. మరెన్నో కాంతి శిఖరాలు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న అశోక్ తేజ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. - విజయవాడ కల్చరల్ సాక్షి : కృష్ణవేణి క్రియేషన్స్ ఆధ్వర్యంలో అభినందన సత్కారం అందుకున్నందుకు అభినందనలు.. అశోక్ తేజ : థ్యాంక్స్.. సాక్షి : మీది సుదీర్ఘ సినీ ప్రస్థానం కదా.. ఇందులో మీరు నేర్చుకున్నదేమిటీ? అశోక్ తేజ : లౌక్యం నేర్చుకున్నా. లౌక్యం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సాక్షి : ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. అవన్నీ స్వేచ్ఛగా రాసినవేనా.. అశోక్ తేజ : కవి ఎప్పుడూ స్వేఛ్చాజీవే. అతడిని శాసించేవారు ఏకాలంలోనూ ఉండరు. సాక్షి : ప్రజాకవిగా జనంకోసం బతికిన సుద్దాల హనుమంతు కుమారుడు మీరు. మీపై మీ తండ్రి ప్రభావం ఏమైనా ఉందా.. అశోక్ తేజ : నా మాట.. పాట.. అంతా మా నాయనగారే. నేను ఈస్థానంలో ఉండటానికి ఆయనే కారణం. అందుకే ఆయన పేరుతో ప్రారంభించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడేళ్లుగా కవులను సత్కరిస్తున్నా. సాక్షి : మీరు రాసిన ఏ పాటకైనా జాతీయ అవార్డు వస్తుందని ఆశపడ్డారా.. అశోక్ తేజ : నాకు బాగా ఇష్టమైన పాటల్లో ‘ఒకటే మరణం ఒకటే జననం..’ అనే పాటకు వస్తుందని ఆశపడ్డా.. సాక్షి : సినీ రంగంలో ప్రతిభకు స్థానం ఉందా.. అశోక్ తేజ : తప్పకుండా ఉంటుంది. సినీ రంగంలో నాకు గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. అరుునా నేను 20ఏళ్లు ఈ రంగంలోనే నిలబడ్డా. కాసింత అదృష్టం కూడా ఉండాలి. సాక్షి : మీ పాటల వెనుక ప్రోత్సాహం ఎవరు? అశోక్ తేజ : జనం ఉన్నారు. జనం కోసం బతికిన కవులున్నారు. నా పాట వెనున ఆవేదన ఉంది. అన్నింటికంటే నా తండ్రి ఉన్నారు. సాక్షి : సినీకవికి కావాల్సిన అర్హతలేమిటీ? అశోక్ తేజ : సాహిత్యం తెలిసి ఉండాలి. కాస్త సంగీత పరిజ్ఞానం కూడా అవసరం. సాక్షి : తెలుగు సినిమా పాటల్లోని ఆంగ్ల పదాల వల్ల భాష చనిపోతోందని భాషావేత్తల ఆవేదన. దీనికి మీ సమాధానమేంటి? అశోక్ తేజ : ఆంగ్ల పదాలు 20 శాతం ఉంటే ఫర్వాలేదు. అంతకుమించి ఉంటే ప్రమాదమే.. సాక్షి : ఒక పాట రాసిన తరువాత.. ఇది ఇంకా బాగా రాసుంటే బాగుండేదని అనిపించిన సంఘటనలేమైనా ఉన్నాయూ.. అశోక్ తేజ : దాదాపు లేవు. ఒక పాట రాసిన తరువాత దాని గురించి నేను ఆలోచించను. సాక్షి : తెలంగాణ రాష్ర్ట సాధనకు కవులంతా ఏకమయ్యూరు. సీమాంధ్రలో ఆ స్ఫూర్తి లేకపోవ డానికి కారణం. అశోక్ తేజ : అది వారివారి ఆలోచనా పరిధిని బట్టి ఉంటుంది. సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సినిమాలకు పాటలు రాశారు. అశోక్ తేజ : 800 సినిమాల్లో 2వేలకు పైగా పాటలు రాశాను. సాక్షి : జానపద కళలను కాపాడుకోవటమెలా.. అశోక్ తేజ : కేవలం వ్యక్తుల వల్లో.. కళాసంస్థల వల్లో అది సాధ్యం కాదు. ప్రభుత్వం కళా పీఠాలు స్థాపించాలి. వాటికి సంపూర్ణ అధికారాలు ఇవ్వాలి. దేశం మెత్తంమీద ఉన్న జానపద సంపదల వివరాలు తెలుసుకోవాలి. వాటిని ప్రదర్శించే వారికి ఉపాధి సౌకర్యాలు కలిపించాలి. సాక్షి : ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగును ఎలా కాపాడుకోవాలి? అశోక్ తేజ : భాషను బతికించుకోవాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. భాషను కాపాడుకోవాలన్న ఆలోచన ప్రజలకు రావాలి. -
'సీతమ్మ వాకిట్లో..' పాట పుట్టిందిలా..
-
తనివి తీరని పాట
-
పాట వెనక కథ 20th July 2014
-
పాట వెనక కథ - విశ్వ
-
పాట వెనుక కథ 29th June 2014
-
జీతమడగని కాపలాదారు...
సమగ్ర సంపుటి రాజ్యాంగంలో ఎలుకలు పడ్డయ్ శాసన సభల్లో పందికొక్కులు సొర్రినయ్ నీతికి చెదలు పట్టింది ధర్మాన్ని చీడ ముట్టింది వాళ్లు వీళ్లు అనే భేదం లేదు దేశాన్ని తెగనమ్మడంలో అంతా సమానమే నవ్వుకుంటనే ఇండ్లు ముంచుతరు ఏడ్చుకుంటనే ఊర్లకు అగ్గిపెడుతరు అంతా హర్ ఏక్ మాల్ నదులకు టెండర్లు పిలుస్తారు నీరు అడుగంటుతే ఇసుకకు బ్యారం పెడతరు.... జూకంటి జగన్నాథం దాదాపు తన పాతికేళ్ల సుదీర్ఘ కవి జీవితంలో ఏనాడూ కంటి మీద రెప్ప వేయలేదు. చేతి నుంచి లాఠీ జారవిడువలేదు. ఏమరుపాటు కలిగించే విజిల్‌ని కూడా. ఆయన ఎవరూ ఇవ్వని కాపలాదారు పోస్టును స్వీకరించారు. ఒక నిజమైన కవి పని అదే. జీతభత్యాలు లేకుండా జనం కోసం ముందుకు నడవడం. తెలంగాణ నుంచి జూకంటి అంత విస్తృతంగా రాసిన కవి లేడు. ఆయనంత విస్తృత వస్తువును స్వీకరించిన కవి కూడా లేడు. ఊరు, వాడ, పట్నం, నగరం, వలస వెళ్లిన ఎడారి ప్రాంతం, డాలర్లకు కొనేసుకున్న స్వర్ణపిశాచినగరం... ఇవన్నీ ఆయన కవితా వస్తువులు. జూకంటి తన కవిత్వం మొత్తంలో రెండు అంశాలను నిశితంగా గమనిస్తూ వచ్చారు. ఒకటి- కొంటున్నది ఎవరు? అమ్ముడుపోతున్నది ఎవరు? ఈ దేశపటం ముందు ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ బోర్డు తగిలించడం వల్ల నలిగి నాశనమైపోతున్నది ఎవరు? జూకంటి కవిత్వంలో పచ్చిపాల వంటి స్వచ్ఛత, ర్యాలాకు మంటల్లో కాల్చిన సీతాఫలం కాయల రుచి ఎలాగూ ఉంటుంది. కాని ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించేది ప్రపంచ పరిణామాల అవగాహన, ఎక్కడో కమ్ముకున్న మేఘానికి ఇక్కడ జరగబోయే విధ్వంసం. దానిని పసిగట్టి, రాసి, పారాహుషార్ పారాహుషార్ అంటూ అరిచి నిద్ర మేల్కొలిపే పనిలో ఉండిపోయిన కవి జూకంటి. చుట్టూ చావువాసన సన్నగా నిశ్శబ్దిస్తున్న శోకం దోషం మనదే రేషం మనదే కొడుకా... అమలవుతున్న ఎజెండా అంతా ఏనుగు మింగిన వెలగపండు.... జూకంటి ఇప్పటికి 12 కవితా సంపుటులు వెలువరించారు. పాతాళ గరిగె (1993) నుంచి చిలుక రహస్యం (2012) వరకు... అన్నీ అలారం మోతలే. కొన్ని టార్చ్లైట్లు. కొన్ని సేదదీర్చే చన్నీటి కుండలు. ఆ కవిత్వమంతా ఇప్పుడు మూడు సంపుటాలుగా వెలువడింది. ఇది తెలుగు కవిత్వానికి మంచి చేర్పు. జూకంటి సృజనను మూల్యాంకనం చేయవలసిన సమయం. ఇంత రాసినందుకు ఆయనకు ఏమి ప్రతిఫలం కావాలి? ఏం లేదు. సమాజం నుంచి కాసింత జాగరూకత. చాలు. జీతం అకౌంట్లో పడిపోయినట్టే. - సాక్షి సాహిత్యం జూకంటి జగన్నాథం కవిత్వం (మూడు సంపుటాలు); నయనం ప్రచురణ; వెల- 300; ప్రతులకు- 9441078095 -
పాట వెనుక కథ 22nd June 2014
-
పాట వెనుక కథ 16th June 2014
-
పాట వెనక కథ
-
కథ: రచయిత
ఐదేళ్ల కింద ఒక సంఘటన జరిగింది. అది నా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. నేను తొలి యవ్వనంలో ఉన్నప్పుడే ‘సాహిత్యం’ నా జీవిత ధ్యేయం అనుకున్నాను. నా రచనల వల్ల గొప్ప కీర్తీ రాలేదు, పెద్ద ధనవంతుడినీ కాలేదు. కాని, నేను పంపిన ప్రతి రచనా అచ్చవుతూ ఉండేది. ఫలితంగా కొంత పారితోషికం అందుతూ ఉండేది. రోజులు దొర్లిపొయ్యేవి. ఆ రోజుల్లోనే నేను పెళ్లి చేసుకున్నాను. నా సంపాదనతో సంసారం సాగుతుందన్న నమ్మకం కలిగాకే చేసుకున్నాను. ఇక అప్పటినుండి ఒక పద్ధతి ప్రకారం రచనలు చేయసాగాను. ఏ పత్రికకు పంపితే త్వరగా అచ్చవుతుంది, ఏ పత్రిక ఎంత పారితోషికమిస్తుంది వంటి విషయాలన్నీ ఆలోచించి రచనలు పంపేవాణ్ని. అదే విధంగా జీతం అందినట్లు నికరంగా కొంత ఆదాయం వస్తూ ఉండేది. ఆ డబ్బుతో నేను, నా భార్య హాయిగా కాలం గడిపేవాళ్లం. పెళ్లయిన తొలి రోజుల్లో ఉండే ఉత్సాహం వేరే విధంగా ఉంటుంది. పెళ్లయిన పాఠకులకు ఆ విషయం తెలిసే ఉంటుంది. మేఘాలు ఆత్మీయంగా అనిపిస్తాయి. గాలి మృదువుగా తాకుతుంది. పెళ్లయిన తొలి రోజుల్లోని వెచ్చదనం, ప్రేమ, మనసును శుభ్రంగా కడిగేస్తాయి. అలాంటి ఆనందమయమైన రోజుల్లో నా సృజనాత్మకతనంతా జోడించి ఓ కథ రాశాను. దాని పేరు ‘అతని భార్య ముద్దుల చెల్లెలు’. అది రాస్తున్నప్పుడే నా ఆత్మవిశ్వాసం పెరిగింది. రాసిన తరువాత నా భార్యను కూచోబెట్టి వినిపించాను. ‘అద్భుతమైన కథ’ అందామె. అందులోని విషాదం భరించలేక కళ్లనీళ్లు పెట్టుకుంది. ‘‘ఈమధ్య కాలంలో ఇంత గొప్ప కథ రాలేదు. ఇది మీకు మంచి పేరు తెస్తుంది’’ అంది. ఆ మరునాడే కథను పత్రికకు పంపాను. నా కథల్లో మంచివాటిని ప్రచురించిన సుప్రసిద్ధ పత్రిక అది. వెంటనే సంపాదకుడి నుండి ఉత్తరం వచ్చింది. ఉత్తరం నిండా ప్రశంసలే! కథ చదవగానే సంపాదకుడికి కళ్లలో నీళ్లు తిరిగాయట. చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ల నాన్న కొడితే ఏడవడమే గానీ, ఆ తరువాత నలభై ఏళ్లలో ఆయన ఎప్పుడూ ఏడవలేదట. సంపాదకుడి ఉత్తరం మా జీవితానికి కొత్త వెలుగుల్ని ప్రసాదించింది. ఆకాశం మరింత అందంగా, మరింత ఎత్తుగా కనిపించసాగింది. ఆహారం మరింత రుచిగా ఉండసాగింది. ఆ కథ ప్రచురణ జరిగింది. పాఠకులు జేజేలు పలికారు. ఇతర పత్రికలవాళ్లు కూడా ఈ కథను గురించి రాశారు. మహోన్నతమైన సాహిత్యంగా అభివర్ణించారు. కథా రచయితగా నా స్థానం సుస్థిరమైంది. అలా ఒకటి రెండు నెలలు గడిచిపోయాయి. మూడో నెలలో ఎప్పుడూ లేని ఎదురు దెబ్బొకటి తగిలింది. నా కథొకటి తిరిగొచ్చింది. తిప్పి పంపింది ఎవరో కాదు, నా కథల్ని ప్రచురించి నాకో స్థానాన్ని ఇచ్చిన సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడే! ఏమైంది ఈసారి? అని ఆలోచిస్తూండగానే నా కథ స్క్రిప్టు మధ్యలోంచి అతడి ఉత్తరం కింద పడింది. అందులో సారాంశం ఇలా ఉంది. ‘‘మీరు పంపిన ఈ సరికొత్త కథ బావుంది. కానీ ఇటీవల ప్రచురించిన మీ కథ ‘అతడి భార్య ముద్దుల చెల్లెలు’ ఉన్న స్థాయిలో ఇది లేదు. మీ గురించి, మీ స్థాయి గురించి మా పాఠకులకు ఒక అవగాహన ఏర్పడింది. దాన్ని మేము తారుమారు చేయదల్చుకోలేదు.’’ నా గొంతు ఆరిపోయింది. రచన ప్రారంభించిన తొలి దశలో కూడా నా రచనలేవీ తిరిగివచ్చేవి కావు. కాని, రచయితగా ఇంత ఎత్తుకు ఎదిగాక తిరిగిరావడం జీర్ణించుకోలేకపోయాను. నేను, నా భార్య నిశ్శబ్దంగా ఉండిపోయాం. తిరిగి వచ్చిన కథని వెంటనే మరో పత్రికకు పంపాను. ఆశ్చర్యమేమంటే అక్కడి నుండి కూడా కథ తిరుగుటపాలో తిరిగొచ్చింది. పైగా ఆ సంపాదకుడి అభ్యర్థనను మోసుకొచ్చింది. ‘‘మీరు ప్రఖ్యాత కథారచయితలు. ‘అతడి భార్య ముద్దుల చెల్లెలు’ కథ అమోఘం! ఆ స్థాయిగల కథ ఏదైనా పంపండి. ఈ కథ తిప్పి పంపడానికి మనస్కరించడం లేదు. కాని తప్పని పరిస్థితి. అర్థం చేసుకుని మా అభ్యర్థనను మన్నించండి.’’ ఈ కథలో లోపం ఏమిటీ? మరోసారి జాగ్రత్తగా చదివి చూద్దాం అనింది నా భార్య. అంతా బాగానే ఉంది అని అనిపించింది. ‘‘మీరు లోగడ రాసిన ఏ కథకూ ఇది తీసిపోదు. అయితే ‘అతడి భార్య ముద్దుల చెల్లెలు’ కథలాగా ఇది విషాదాంతం కాదు. అందువల్ల అంతటి సంచలనం సృష్టించలేదు’’ అని అందామె. ‘‘ప్రతి కథా సంచలనం సృష్టించాలంటే ఎలా? అదొక సంఘటన ఆధారంగా ప్రత్యేక పరిస్థితుల్లో రాసింది’’ అన్నాను. ఒక గొప్ప విజయం సాధించానన్న గర్వంతో ఈ కథని నిర్లక్ష్యంగా రాశానా అనే అనుమానం కలిగింది. అదే విషయం నా భార్యను అడిగాను. ఆమె నా కథలకు మొదటి శ్రోతే కాదు, మంచి విమర్శకురాలు కూడా! కథలో ఎక్కడా ఏమాత్రం లోపం లేదనీ, అలాంటి ఆలోచనలు అనవసరమనీ ధృవీకరించింది. దాంతో ఆ కథను పక్కన పెట్టి మరో కొత్త కథ సాపు ప్రతి సిద్ధం చేశాను. ప్రచురించే అవకాశం ఆ సుప్రసిద్ధ పత్రికకే ఇద్దామని దానికి పంపించాను. గోడకు కొట్టిన బంతిలా తిరిగి రావడమే కాదు, సంపాదకుడి మిత్రవాక్యం కూడా మోసుకొచ్చింది. ‘‘మీ కథ ‘అతడి భార్య ముద్దుల చెల్లెలు’ ప్రచురించిన సంచిక కోసం పాఠకులు ఇంకా ఉత్తరాలు రాస్తున్నారు. పాత సంచిక కావాలని కొందరు, పునర్ముద్రించమని కొందరు అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ స్థాయి లేని ఈ కథ ప్రచురించడం బాగుండదు. మరో గొప్ప కథ రాసి పంపించండి. పాఠకులు ఎదురుచూస్తున్నారు’’ అని! ఎటూ పాలుపోక వరుసగా మరో నాలుగు పత్రికలకి పంపాను. ఒకరి తర్వాత ఒకరు దాదాపు అలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. ఒక గొప్ప విజయం వెనుక ఇంత పరాజయం ఉంటుందని ఊహించలేదు. రచనలు అచ్చు కావడం లేదు. చేతికి డబ్బు అందడం లేదు. ‘అతడి భార్య ముద్దుల చెల్లెలా! నువ్వు నా బతుకును వీధిన పడేశావు కదే!’ ‘ఒక గొప్ప కథ రాయడానికి కొన్ని కొన్ని పరిస్థితులు దోహదం చేస్తాయి. అలాంటి పరిస్థితులు, అలాంటి ఆలోచనలు పునరావృతం కావాలని కోరుకోవడంలో అర్థం ఉందా? ఆ కథ నేను పెళ్లయిన తొలి రోజుల్లో రాశాను. అలాంటి కథ మళ్లీ రాయాలంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలా? చేసుకున్నా తొలి అనుభవం ఎలా వస్తుంది? మలి అనుభవం తొలి అనుభవం వలె ఎలా ఉంటుంది? ఈ సంపాదకులకు బుద్ధి లేదు. పాఠకులకూ బుద్ధి లేదు’ అని గొణుక్కున్నాను. ఒకరోజు మధ్యాహ్నం వీధిలో నడుస్తూ ఉండగా, బార్బెల్ కనిపించాడు. నేను రచన ప్రారంభించిన తొలి దశలో ఆయనకు కవిగా, రచయితగా మంచి పేరుండేది. ఆ రోజుల్లో అప్పుడప్పుడూ ఆయన సలహాలు తీసుకుంటూ ఉండేవాడిని. చాలా కాలం తర్వాత అతను కనిపించేసరికి ప్రాణం లేచొచ్చింది. అతణ్ని చూస్తే బీదతనంతో మగ్గిపోతున్నాడని తెలుస్తూనే ఉంది. కాని అతని ముఖంలో చిరునవ్వు వెలుగుతూనే ఉంది. ‘‘ఏమోయ్! మంచి ఊపులో ఉన్నావ్. ఎక్కడ విన్నా నీ పేరే వినబడుతోంది. కాని ఏమిటిదీ? ఇంత దిగాలుగా ఉన్నావూ?’’ అన్నాడు బార్బెల్. నేను నా కథనంతా వివరంగా చెప్పాను. దానికతడు పెద్దగా నవ్వి, ‘‘నా గది ఇక్కడికి దగ్గరే. ఓసారి వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి’’ అన్నాడు. ‘సరే’ అని అతనితో బయలుదేరాను. మురికివాడలో చాలా చిన్న గది. ఆ గదిలోని మంచం మీద కప్పుకునే దుప్పటి కూడా లేదు. వార్తాపత్రికలు మందంగా అంటించి, దుప్పటిలా చేయబడి ఉంది. మరోవైపు కొన్ని పుస్తకాలు, ఇంకోచోట మేకులు తయారుచేసే యంత్రం ఉన్నాయి. ‘‘నేనొకప్పుడు పెద్ద పేరున్న కవిని’’ అని అన్నాడు... తాడుతో వేలాడదీసిన కాగితం చూపిస్తూ. ‘‘భలేవారు. నాకు తెలియదా ఏం? మీ కవిత ‘నిచ్చెన’ నాకు కంఠతా వచ్చేసింది’’ అన్నాను నేను వినయంగా. ఆ పెద్దాయన కళ్లు ఆనందంతో మెరిశాయి. ‘‘ఇదిగో ఈ కాగితం అదే! నా బతుకును సర్వనాశనం చేసిన ఆ కవితను ఇలా ఉరితీశాను’’ అని నవ్వాడు. అచ్చయిన నిచ్చెన కవిత పేజీ చూరుకు వేలాడుతోంది. ‘‘నేనూ నీలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాను. ఏం చేయాలో తోచక వేరే బతుకుదెరువు చూసుకున్నాను. ప్రస్తుతం మేకులు తయారుచేసి అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్నాను’’ అని చెప్పాడు బార్బెల్. ఎలా బతకవలసినవాడు ఎలా బతుకుతున్నాడు? కళల్ని కళాకారుల్ని ఆదుకునేవారే లేరా? బార్బెల్ నుండి సెలవు తీసుకుని బయలుదేరాను. ఇల్లు చేరేసరికి జ్వరం వచ్చినట్లయ్యింది. నా భార్య గాబరాపడి విషయమేమిటని అడిగింది. గొప్ప కవిత్వం రాసి, దీన స్థితిలో బతుకుతున్న బార్బెల్ విషయం చెప్పాను. ‘‘మనమూ ఇక మేకులు తయారుచేసుకోవాలేమో. నేనైతే ఆ పనిలో మీకు సహాయపడగలను’’ అంది నవ్వుతూ. లోన విషాదం తొలుస్తున్న నవ్వని మా ఇద్దరికీ తెలుసు. వీలైనంత త్వరగా ఏదో ఒక పని ప్రారంభించాలి. నాలుగు డబ్బులు సంపాదించాలి. లేకపోతే పస్తులుండాల్సి వస్తుంది. కాలం గడ్డుగా, గుడ్డిగా కదులుతోంది. మెదడులో ఆలోచనలు పుంఖానుపుంఖాలుగా మొలకెత్తుతున్నాయి. కలంలో బలం ఏమాత్రం తగ్గలేదు. కొత్త కథలు, వ్యాసాలు తయారవుతూనే ఉన్నాయి. అవి బావుంటున్నాయని నా భార్య ప్రోత్సహిస్తూనే ఉంది. కాని అచ్చేసేవాడే లేడు. రాయడం మాని మరో పని వెతుక్కోవడంలో అర్థం లేదనిపించింది. ఒకరోజు ఆ ప్రముఖ పత్రిక కార్యాలయానికి వెళ్లాను. నా మంచి కథలన్నీ ప్రచురించి అతను, అతని పత్రికా లాభపడ్డారు కదా! ఆ మాత్రం ఆదరం చూపరా యేం? సంపాదక మిత్రుడు తను ఉత్తరంలో రాసిన విషయాలే మళ్లీ రికార్డు వేశాడు. ‘‘ఏ కొద్దిమంది రచయితలో చేరుకునే మహోన్నత స్థానానికి చేరుకున్నారు. కీర్తి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తోం’’దన్నాడు. ‘‘ప్రకాశం కాదు నయనా! ఆ మంట నన్ను దహిస్తోంది’’ అని వాస్తవాన్ని కక్కుకున్నాను. బతుకు భారమైపోయిందనీ, రచనలు అచ్చువేసి పారితోషికం ఇప్పించకపోతే రెండు మరణాలు ఖాయమనీ చెప్పాను. సంపాదకుడు మంచి మనిషి. విషయం గ్రహించాడు. సీరియస్‌గా ఆలోచించాడు. పరిష్కారమూ చూపాడు. ‘‘మీరు ఇటీవల రాసిన కొత్త కథలన్నీ ప్రచురించడానికి నాకు అభ్యంతరం లేదు. పారితోషికం కావాలంటే ముందుగా ఇప్పించడానికి కూడా అభ్యంతరం లేదు. అది మీ పేరుతో వేయాలంటేనే ఇబ్బందులున్నాయి. ఏదైనా కలంపేరుతో అచ్చేయమంటే వేసేస్తాను’’ అన్నాడు ధీమాగా. నా కీర్తి కాపాడాలని అతని తాపత్రయం. కాని మరో పేరుతో రచనలు ఇవ్వాలనగానే నా మనసులో ఎందుకో కలుక్కుమంది. అయినా గత్యంతరం లేదు. కీర్తి చాలా గొప్పది. కాని అది ఒక్కోసారి తిండి పెట్టదు. దాహం తీర్చదు. ఉండటానికి నీడనివ్వదు. ఆ కీర్తిని అలాగే భద్రపరిచి, అనామకుడిగా ఏదో ఒక పేరుతో పాఠకులకు పరిచయం కావడానికి సిద్ధపడ్డాను. రచనలన్నీ వరుస క్రమంలో సంపాదక మిత్రుడికి అంద జేశాను. అవి నా పేరుతో కాక, మరో కొత్త పేరుతో అచ్చు కాసాగాయి. ఇతర పత్రికలకు కూడా కొత్త పేరుతోనే రచనలు పంపసాగాను. వాళ్లు కూడా ప్రచురణ ప్రారంభించారు. నాలుగు వైపుల నుండి డబ్బులు రావడం ప్రారంభమైంది. అలా రెండు మూడేళ్లు గడిచాయి. మాకో బాబు పుట్టాడు. కొత్తగా పెళ్లి కావడంలో ఏ ఆనందం ఉందో, కొత్తగా తల్లిదండ్రులు కావడంలో కూడా అలాంటి ఆనందమే ఉందనుకుంటాను. ఆ ఉత్సాహంలో ఒక మంచి కథ రాద్దామని కూర్చున్నాను. ఎంతో భిన్నమైన కథ వచ్చింది. కథనం కూడా కొత్తగా, తాజాగా ఉంది. అద్భుతమైన శిల్ప నైపుణ్యం రాస్తున్నప్పుడే తెలిసిపోయింది. కథ వినిపించడానికి నా భార్యను పిలిచాను. ఆమె చంటివాణ్ని పక్క గదిలో పడుకోబెట్టి, నిండా ఉన్ని దుప్పటి కప్పి, నా ఎదురుగా వచ్చి కూర్చుంది. వెచ్చగా ఉండటానికి కుర్చీలు, నెగడు దగ్గరికి లాక్కున్నాం. భావగర్భితంగా రాసిన ఆ కథను భావయుక్తంగా చదివాను. అంతసేపూ మౌనంగా విన్న నా భార్య, ‘అద్భుతం’ అంది. ‘‘అతని భార్య ముద్దుల చెల్లెలు కథ ఎంత గొప్పగా వచ్చిందో ఇదీ అంతే గొప్పగా ఉంది’’ అని కూడా అంది. కానీ, ఆ కథ మమ్మల్ని ఎంతటి కటిక దారిద్య్రంలోకి నెట్టిందో ఒకసారి కళ్లముందు తిరిగి, ఇద్దరం గంభీరమైపోయాం. ఇదే అచ్చయితే, ఈ మారుపేరుకు కూడా మరణం తప్పదేమో అని భయపడ్డాం. ఇప్పుడు మేమిద్దరమే కాదు, చంటివాడు కూడా ఉన్నాడు. ‘‘మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. కాని జాగ్రత్త! ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. గతంలోని పరిస్థితి పునరావృతమైతే ఏం చేయడం అనేది ముందే ఆలోచించుకుందాం’’ అంది. ఆ రాత్రి నేనిక ఏమీ మాట్లాడలేదు. ఉదయమే లేచి కొత్తగా రాసిన గొప్ప కథని కవర్లో పెట్టాను. బజారుకు వెళ్లి ఇనుప సామానువాడి దగ్గర రేకుడబ్బా ఒకటి కొన్నాను. కవరు డబ్బాలో పెట్టి దాన్ని అక్కడే వెల్డింగ్ చేయించాను. ఇంటికి తిరిగొచ్చి అటక మీది నుంచి ట్రంకు పెట్టె కిందకి దించాను. ‘‘ఏమోయ్! మంచి ఊపులో ఉన్నావ్. ఎక్కడ విన్నా నీ పేరే వినబడుతోంది. కాని ఏమిటిదీ? ఇంత దిగాలుగా ఉన్నావూ?’’ అన్నాడు బార్బెల్. నేను నా కథనంతా వివరంగా చెప్పాను. ‘‘ఏం చేస్తున్నారూ?’’ అంటూ వచ్చింది నా భార్య. ‘‘నిన్న రాసిన కొత్త కథ గొప్పగా ఉందన్నావే? ఆ కథను కవర్లో పెట్టి, కవర్‌ను రేకు డబ్బాలో పెట్టి వెల్డింగ్ చేయించాను. ఇక ఆ రేకు డబ్బా ఈ ట్రంకు పెట్టెలో పెట్టి తాళం వేస్తున్నాను’’ అని చెబుతూ, ‘‘రేపు బజారుకెళ్లినప్పుడు తాళం చెవి నదిలోకి విసిరేస్తాను’’ అంటూ తాళం చెవిని యేం చేయబోతున్నానో కూడా చెప్పాను. ‘‘అయ్యో! అలా ఎందుకూ?’’ ‘‘ఎందుకంటే...’’ దీర్ఘం తీస్తూ ఆమెను దగ్గరికి లాక్కు న్నాను. ఆమె భుజాల మీద చేతులుంచి కళ్లలోకి చూశాను. ‘‘ట్రంకు పెట్టెలోని రేకు డబ్బాలో, రేకు డబ్బాలోని కవర్లో ఒక మహోన్నతమైన సాహిత్యపు గుళిక ఉందని నీకూ, నాకూ, ఆ తర్వాత మన అబ్బాయికీ తప్ప మరెవరికీ తెలియగూడదు. నా మరణానంతరం ఎవరైనా నా రచనల కోసం వస్తే, వారికి ఇది దొరుకుతుంది. నా అసలు పేరుతో ఈ అముద్రిత కథను అచ్చేసుకుంటారు. ఇప్పుడు మారుపేరుతో రాస్తున్న కథలు కూడా నావేనని తెలుసుకుంటారు. అప్పుడొచ్చే కీర్తి మన కుటుంబానికి ఏ విధంగానూ కీడు చేయలేదు. అందుకే ఈ జాగ్రత్త!’’ అని చెప్పాను. నా భార్య కళ్లలో సంతోషం, సంతృప్తి చూశాను. (సంక్షిప్త కథ) - ఇంగ్లిష్ మూలం: ఫ్రాంక్ ఆర్.స్టాక్టన్ తెలుగు అనువాదం: డా॥దేవరాజు మహారాజు -
మువ్వన్నెల చిత్ర సాహిత్యం!
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ // కౌంట్‌డౌన్ 2 సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్: మనిషి ముందుగా బొమ్మలను వేశాడు. అక్షరాలను తర్వాత రూపొందించుకున్నాడు. అక్షరాల సాహిత్యం ప్రాచుర్యంలోకి వచ్చిన అనేక శతాబ్దాల తర్వాత ‘చిత్రసాహిత్యం’ ప్రత్యేక ప్రక్రియగా గుర్తింపు పొందింది. బొమ్మలను రూపొందించడం ఒక సాహితీ కళ. వాటిని అర్థం చేసుకోలేకపోవడం ‘విజువల్ ఇల్లిటరసీ’ (దృశ్య నిరక్షరాస్యత)గా స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో నాల్గో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ చిత్రసాహిత్యానికి ప్రత్యేక గౌరవం ఇస్తోంది. ఇందులో భాగంగా లిటరరీస్ట్రీట్గా ప్రాచుర్యం పొందుతోన్న బంజారాహిల్స్, రోడ్‌నెం.8లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో మూడు వినూత్న ప్రదర్శనలను మూడు రోజులపాటు నిర్వహిస్తోంది. ఆర్తివీర్ మట్టితో చేసిన ఆకృతుల రూపకల్పన, నోబెల్ బహుమతి గ్రహీత దివంగత కామూ డిజిటల్ ఎగ్జిబిషన్, ప్రియాం క ఏలె చిత్రాల ప్రదర్శనలను ఫెస్టివల్ తొలిరో జు శుక్రవారం మధ్యాహ్నం 12-30 గంటలకు పద్మశ్రీ జగదీష్ మిట్టల్ ప్రారంభిస్తారు. ‘అక్షరాల దారుల’ ప్రదర్శన! సుశీథారు-కె.లలితలసంపాదకత్వంలో రూపొందిన అపురూప పుస్తకం, ‘విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా’ను ప్రపంచంలోని అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు సేకరించాయి. క్రీ.పూ 6వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దపు మహిళా సాహిత్యకారుల వరకూ ఆసక్తికర విశేషాలున్న ఈ పుస్తకం ‘దారులేసిన అక్షరం’గా తెలుగులో త్వరలో రానుంది. ఈ పుస్తకానికి వర్ధమాన చిత్రకారిణి ప్రియాంక ఏలె సమకూర్చిన చిత్రాలు ప్రత్యేకమైనవి. బ్రష్‌లు, రంగులు వాడలేదు. రచన-చిత్రకళ సమ ఉజ్జీలని సంకేతమిస్తూ కలం-సిరాతో చిత్రసాహిత్యానికి రూపిచ్చారు. ప్రియాంక తన చిత్రాల గురించి: ‘దృశ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అక్షర సాహిత్యం కంటే చిత్రసాహిత్యం ఏమాత్రం తీసిపోదనే గుర్తింపు ఆధునిక కాలంలో ఏర్పడింది. మహాభారత రచనలోనే ప్రస్తావించిన దమయంతి తన ప్రియుడు నలమహారాజుకు ‘సందేశం’ పంపడంతో ‘దారులేసిన అక్షరం’ మొదలైంది. ఈ సంకలనంలో ఇటీవల కాలం వరకూ అనేక మంది మహిళా రచయితలున్నారు. వీరందరూ వేర్వేరు కాలాలకు, సమాజాలకు సంస్కృతులకు చెందిన వారు. అన్నింటిలో అంతఃసూత్రం ఒక్కటే. ‘వస్తువుగా పరిగణింపబడిన మహిళ, ఎవరూ దొంగిలించలేని జ్ఞానం అనే వస్తువుపై సాధికారత తెచ్చుకుని ‘నో’ అనగలిగిన ధీమతిగా పురోగమిస్తోంది’! ఉత్తరాన్ని తెస్తోన్న పక్షి ఆ నాటి దమయంతినే కాదు, చదువుకున్న ఆధునిక మహిళకూ ప్రతీక! సావకాశంగా సాలోచనగా చూస్తే నా చిత్రాలు మంచి పఠనానుభూతిని కలిగిస్తాయని విశ్వసిస్తున్నాను.’ -
నవయువం
సకలకళామౌళిఒక పక్కన సంగీతం.మరోపక్క సంప్రదాయ నృత్యం. ఇంకోపక్క సినీ గీత రచన, గానం.తండ్రి నుంచి సాహిత్యం, తల్లి కోరిక మేరకు సంగీతనాట్యాల అభ్యాసం.ఎన్నో బహుమతులు అందుకొని-‘శభాష్’ అనిపించుకున్నాడు. బహుముఖ ప్రతిభ చాటుకుంటున్న రాకేందుమౌళితో సంభాషణ... మొదటి అవకాశం... రధన్ అనే మ్యూజిక్ డెరైక్టర్‌కు తెలుగులో స్క్రాచ్ వెర్షన్ పాడాలని, నా ఫ్రెండ్ నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆయన ‘తననా తననా తననా...’ అంటూ ఒకేలా అంటుంటే... నాకు అర్థం కాలేదు. నేను డమ్మీ లిరిక్స్ ఇస్తానని చెప్పి, ఇచ్చాను. అప్పుడు డెరైక్టర్ హను రాఘవపూడి నా లిరిక్స్ చూసి కొన్ని లైన్స్ మార్పు చేసి ఇవ్వమన్నారు. కొన్నిరోజుల్లోనే ఆయనకు పాట పూర్తిచేసి ఇచ్చాను. ఆ పాటే... ‘అందాల రాక్షసి’ చిత్రంలోని ‘ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు...’. ఆ తర్వాత ఇంకో పాట రాసే అవకాశం ఇచ్చారు. పాట రాసే ముందు... ప్రేమను మధ్యస్థంగా తీసుకొని దానికి కుడి, ఎడమ ఎక్స్ట్రిమిటీ వచ్చేలా రాయమన్నారు డెరైక్టర్గారు. అదే ‘మనసు పలికే ఆశ ప్రేమ...’ అనే పల్లవితో ప్రారంభమైన పాట. చరణాల్లో ‘ఆదియు అంతము లేని పయనం ప్రేమ, వేకువై చేరులే చీకటింట్లో ప్రేమ...’ అని రాసి ఇచ్చాను. చిత్రమేమిటంటే నేను రాసిన పాటను పాడే అవకాశం కూడా నాకే ఇచ్చారు ఆయన. ఈ పాటకు ఈ మధ్యనే సౌత్ ఇండియా రేడియో మిర్చి అవార్డుల (2012) ప్రదానోత్సవంలో తెలుగుకు గాను అప్ కమింగ్ లిరిసిస్ట్‌గా, సింగర్‌గా రేడియో మిర్చి అవార్డులు అందుకున్నాను. తెలుగు భాషలో స్టేట్ ఫస్ట్... మా అమ్మ (ప్రమీల) గారి ఊరు గుంటూరు. నాన్న వెన్నెలకంటి(సినీ రచయిత) గారిది నెల్లూరు. నేను గుంటూరులో పుట్టాను. అయితే నాకు మూడేళ్లు వచ్చేవరకు నెల్లూరులో ఉన్నాం. నాన్న ఉద్యోగరీత్యా చెన్నై వెళ్లవలసివచ్చింది. 10వ తరగతిలో తెలుగు లాంగ్వేజ్‌లో స్టేట్‌ఫస్ట్ వచ్చింది. అమ్మకు చిన్నప్పటి నుండి సంగీతం, నాట్యం నేర్చుకోవాలని ఉండేది. కానీ కుదరలేదు. ఆవిడ కోరికను తీర్చడానికి, నాగమణి గారి దగ్గర తొమ్మిది సంవత్సరాలు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఇంకా భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. పాశ్చాత్య నృత్య ప్రదర్శనలు చేశాను. ఎన్నో కచేరీలు కూడా ఇచ్చాను. బహుమతులూ అందుకున్నాను. సపోర్ట్: నాన్నకి సాహిత్యంలో పట్టు ఉండటం, అన్నయ్య శశాంక్ వెన్నెలకంటి కూడా రచయిత కావడంతో దాదాపు మా ఇంట్లో సినిమా వాతావరణం ఉండేది. చిన్నప్పటి నుండి నాకు అన్నయ్య సలహాలు, సూచనలు ఇస్తుండేవాడు. నాన్న ఎన్నో పాటలను రాసినా, ఆయన శైలికి భిన్నంగా నా శైలి ఉండటానికే ప్రయత్నిస్తుంటాను. పాట పూర్తై తర్వాత నాన్నగారికి చూపిస్తాను. నటనపై ఆసక్తి... నాకు నటించడమంటే చాలా ఇష్టం. ఇప్పటికే రెండు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించాను. మరో రెండు షార్టఫిలిమ్స్కు ఒకదానికి కథ, ఇంకోదానికి స్క్రీన్‌ప్లే కూడా అందించాను. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటించే అవకాశం వస్తోంది. వాటి గురించి ఆలోచించాలి. ప్రేరణ ఇచ్చారు... నాకు తెలుగు ఇంత బాగా రావడానికి కారణం మా తల్లిదండ్రులు, అన్నయ్య, నా గురువులు. కమల్‌హాసన్‌గారు కూడా ఒక కారణమనే చెప్పాలి. ఆయన 24 ఫ్రేమ్స్‌లో అనుభవం ఉన్నవారు. మైకేల్ జాక్సన్ కూడా నాకు పెద్ద ఇన్స్పిరేషన్. మా అమ్మ నన్ను ఉద్యోగం చేయమంటే నేను చేయలేదు. చిన్నప్పటి నుంచే సంగీతం, నాట్యం నేర్చుకున్నాను. సాహిత్యంలో కాస్త పరిచయం ఉంది. అందువల్ల నేను ఉద్యోగం చేయలేనని గట్టిగా చెప్పేశాను. అలా చెప్పినందుకు అమ్మ చాలా బాధ పడింది. కాని ఇప్పుడు నాకు వస్తున్న సినిమా అవకాశాలను చూసి సంతోషిస్తోంది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా... నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడు ఆంధ్రనాటక కళాపరిషత్(మద్రాస్)లో ఒక నాటకంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాను. అందులో నటించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది బాలనటులు వచ్చారు. అందరిలోనూ నేను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంపిక కావడం నాకు చాలా సంతోషం కలిగించింది. బెస్ట్చైల్డ్ ఆర్టిస్ట్‌గా దాసరి నారాయణరావుగారి చేతుల మీదుగా స్వర్ణపతకాన్ని అందుకున్నాను. ఒకసారి మా ైెహ స్కూల్లో ఆల్ ఇండియా కేమ్లిన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరిగాయి. అక్కడ నేను వేసిన పెయింటింగ్‌కి బహుమతి అందుకోవడం కూడా మరిచిపోలేని జ్ఞాపకం. ప్రస్తుతం నేను హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటున్నాను. అలాగే కొన్ని సినిమాలకు పాటలు రాస్తున్నాను, పాడుతున్నాను. రచన సహకారం అందిస్తున్నాను, అసిస్టెంట్ డెరైక్టర్‌గా కూడా పనిచేస్తున్నాను. సినిమాకు సంబంధించి 24 ఫ్రేమ్ల్లోనూ రాణించాలనేది నా కల. - నాగేష్ నేను ఉద్యోగం చేయలేనని గట్టిగా చెప్పేశాను. అలా చెప్పినందుకు అమ్మ చాలా బాధ పడింది. కాని ఇప్పుడు నాకు వస్తున్న సినిమా అవకాశాలను చూసి సంతోషిస్తోంది. - రాకేందుమౌళి