కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie). ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. కాగా.. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు.
తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పతికిచ్చు అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ సాంగ్ అజిత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సంక్రాంతికి వాయిదా..
ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
రేస్ గెలిచిన అజిత్..
ఇటీవల దుబాయ్‌లో జరిగిన 24హెచ్ కారు రేసులో అజిత్ టీమ్ మూడోస్థానంలో నిలిచింది. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత అజిత్ తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. దీంతో అజిత్ టీమ్‌పై సినీ తారలు ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన అనంతరం అజిత్ జాతీయజెండా పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.
మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..
అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్‌గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
#PATHIKICHU Out Now 💥
➡️ https://t.co/BDeqesYfGc#AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/9fDtLofv7h— Ajith Kumar (@ThalaFansClub) January 19, 2025
Comments
Please login to add a commentAdd a comment