
లెజెండరీ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అందులోనూ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ అంటే అభిమానుల ఆనందానికి అవధులుండవు. మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వచ్చిన నాయకన్ (తెలుగులో నాయకుడు) ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! దాదాపు 37 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో వచ్చిన సినిమాయే థగ్ లైఫ్ (Thug Life Movie).
క్షమించండి
బోలెడు ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ రిజల్ట్‌పై మణిరత్నం (Mani Ratnam) స్పందిస్తూ సారీ చెప్పారు. మా నుంచి నాయకన్‌లాంటి సినిమా వస్తుందని ఎదురుచూసినవారికి నేనొక్కటే చెప్పగలను. మమ్మల్ని క్షమించండి. మేము గతాన్ని తిరగరాయాలనుకోలేదు. ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నాం. కానీ మీరు భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఊహించని ఫలితాల్సి అందుకున్నాం. ప్రేక్షకులు.. మేము ఇచ్చినదానికంటే పూర్తి భిన్నమైనదేదో ఎక్స్‌పెక్ట్ చేశారు అని పేర్కొన్నారు. జూన్ 5న విడుదలైన థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.