అజిత్ యాక్షన్ మూవీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది! | Kollywood Star Ajith Kumar Latest Movie Vidaamuyarchi | Sakshi
Sakshi News home page

Vidaamuyarchi Movie: అజిత్ యాక్షన్ మూవీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!

Dec 27 2024 7:50 PM | Updated on Dec 27 2024 8:21 PM

Kollywood Star Ajith Kumar Latest Movie Vidaamuyarchi

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, త్రిష జంటగా నటిస్తోన్న చిత్రం విడాముయార్చి.  ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లిరికల్‌ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. సవాదికా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ప్రస్తుతానికి కేవలం తమిళ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కాగా..  ఈ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, ఆరవ్, నిఖిల్ నాయర్, దాశరథి, గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement