Arabic Kuthu Song From Thalapathy Vijay's Beast: Reaches 100 Million Views In Youtube - Sakshi
Sakshi News home page

Arabic Kuthu Song: సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న అరబిక్‌ కుతు సాంగ్‌

Published Sun, Feb 27 2022 11:24 AM | Last Updated on Sun, Feb 27 2022 11:35 AM

Arabic Kuthu Song From Beast Reaches 100 Million Views In Youtube - Sakshi

Beast Movie Of Vijay And Pooja Hegde Arabic Kuthu Song: తమిళ స్టార్‌ విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్‌'. ఇటీవలె ఈ మూవీ నుంచి విడుదలైన 'అరబిక్‌ కుతు' సాంగ్‌ ఇప్పుడు యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. 48గంటల్లోనే గ్లోబల్‌ టాప్‌ సాంగ్స్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఈ పాట ఇప్పుడు ఏకంగా 100మిలియన్‌ వ్యూస్‌తో టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. రిలీజైన 4రోజుల్లోనే 50మిలియన్‌ వ్యూస్‌, వారం రోజుల్లోనే 70 మిలియన్‌ వ్యూస్‌, తాజాగా 12 రోజుల్లో 100మిలియన్‌ వ్యూస్‌ని దాటింది.

అంతేకాకుండా 3.7మిలియన్స్‌కి పైగా లైక్స్‌ సాధించడం విశేషం. ఎక్కడ చూసిన ఈ అరబిక్‌ కుతు సాంగ్ ట్యూన్ మోరుమ్రోగుతోంది. హలమితి హబిబో అంటూ కామన్‌ పీపుల్‌ నుంచి సెలబ్రిటీల వరకు ఈ ట్యూన్‌ రీల్స్‌తో రచ్చ చేస్తున్నారు. తమిళ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ కంపోజ్ చేసిన ఈ పాటకు హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించారు. దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement