first single launch
-
రవితేజ మిస్టర్ బచ్చన్.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్ తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ చిత్రంలో హీరోయిన్గా భాగ్యశ్రీ కనిపించనుంది. హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'సితార్' అనే లిరికల్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు.మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ డైరెక్షన్లో మరోసారి రవితేజ నటిస్తున్నారు. దీంతో మిస్టర్ బచ్చన్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన సాంగ్‌కు సాహితీ లిరిక్స్ అందించారు. సాకేత్ కొముండూరి, సమీర భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. కాగా.. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. మరో అప్డేట్ వచ్చేసింది!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.కల్కి విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో బుజ్జిని దేశవ్యాప్తంగా పలు నగరాల్లో తిప్పుతున్నారు. ప్రస్తుతం బుజ్జి రాజస్థాన్‌లోని జైపూర్‌లో సందడి చేయనుంది. ఈనెల 15,16 తేదీల్లో బుజ్జి టూర్‌కి సిద్ధమైంది. అంతే కాకుండా ఈ నెల 15న కల్కి ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఈ సాంగ్‌ను పాడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను ట్విటర్లో పంచుకున్నారు.𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐌𝐨𝐬𝐭 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞𝐝 𝐒𝐢𝐧𝐠𝐞𝐫 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐌𝐨𝐬𝐭 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞𝐝 𝐀𝐜𝐭𝐨𝐫 🎶❤️🔥#Prabhas X @diljitdosanjh#Kalki2898AD First Single Promo Out Tomorrow.@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/XPqk5mozFr— Kalki 2898 AD (@Kalki2898AD) June 14, 2024Hello Jaipur! 🩷Meet our #Bujji at Pathrika Gate on June 15th & Jal Mahal on June 16th.#Kalki2898AD pic.twitter.com/jaFZtXM02k— Kalki 2898 AD (@Kalki2898AD) June 14, 2024 -
కమల్ హాసన్ ఇండియన్-2.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
కమల్‌హాసన్- శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సౌరా అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని సోషళ్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్లో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీస్థాయిలో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి పారా అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.కాగా.. గతంలో శంకర్ డైరెక్షన్లో 1996లో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.An Indian rides forth with courage & valor! 🔥 Here's a promo of the 1st single #PAARAA from INDIAN-2. 🇮🇳 Full song is dropping Tomorrow at 5️⃣ PM. 🤩🥁Rockstar @anirudhofficial musical 🎹Lyrics @poetpaavijay ✍🏻Vocals @anirudhofficial #ShruthikaSamudhrala 🎙️#Indian2 🇮🇳… pic.twitter.com/dz2JeTiqP8— Lyca Productions (@LycaProductions) May 21, 2024 -
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్‌బంప్సే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఒక రోజు ముందుగానే ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేవర నుంచి ఫియర్‌సాంగ్ అనే పేరుతో ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు.తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఫియర్ సాంగ్ అంటూ వస్తున్న ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్ బీజీఎం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో జైలర్లోని హుకుమ్ సాంగ్ కంపోజ్ చేసి అనిరుధ్ తనదైన మార్క్ చూపించారు. దీంతో దేవర సాంగ్ తర్వాత హుకుమ్ సాంగ్ మర్చిపోతారంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కామెంట్స్ చేయడంతో గూస్ బంప్స్ ఖాయంగా కనిపిస్తోంది. It's a warning notice from the Lord of Fear…. #FearSong Promo out now! #Devara pic.twitter.com/RJYOs59mNL— Devara (@DevaraMovie) May 17, 2024 -
Pushpa 2: పుష్ప..పుష్ప.. పుష్ప.. ఫుల్ సాంగ్ వచ్చేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చేసింది. పుష్ప-2 మూవీ నుంచి 'నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే' అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ పుష్ప-2 చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.గతనెల బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేసిన మేకర్స్.. మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పుష్ప-2 ఫస్ట్ సింగిల్‌ను ఏకంగా ఆరుభాషల్లో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ స్పెషల్ పోస్టర్‌ను సైతం మేకర్స్ పంచుకున్నారు. సరికొత్త లుక్‌లో బన్నీ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సూపర్ హిట్‌గా నిలిచిన సంగతె తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2ను తీసుకొస్తున్నారు. ఈ మూవీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. -
పుష్ప-2 ఫస్ట్ సింగిల్.. రిలీజ్ టైమ్ ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా పుష్ప-2 మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ డేట్ అండ్ టైమ్‌ను ప్రకటించారు మేకర్స్.మే 1వ తేదీన ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయన్నట్లు ప్రకటించారు. ఏకంగా ఆరు భాషల్లో ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందన సిండికేట్ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶Sensational song ✅🔥🔥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way 💥💥A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024 -
'ధమ్ మసాలా' వచ్చేసింది.. చూసేయండి'!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కాంబో వస్తోన్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డే కావడంతో సాంగ్ విడుదల చేశారు. గంటూరు కారం మూవీ నుంచి ధమ్ మసాలా అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. Witness the ULTIMATE EXPLOSION of SUPER 🌟 @urstrulyMahesh in MASS SWAG 🔥💥#GunturKaaram First Single ~ #DumMasala Out Now 🔥 - https://t.co/egSALSY4Xt A @MusicThaman Musical 🎹🥁 ✍️ @ramjowrites 🎤 #SanjithHegde #JyotiNooran#Trivikram #thaman @sreeleela14… pic.twitter.com/0nku6bu9P8 — Guntur kaaram (@GunturKaaram) November 7, 2023 -
చంద్రముఖి-2 క్రేజీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం చంద్రముఖి. పి.వాసు దర్శకత్వం ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా చంద్రముఖి–2 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్, వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీమీనన్, సృష్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. (ఇది చదవండి: 'మీరు చేయకపోతే చాలామంది ఉన్నారని చెప్పాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి!) లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'విలసిత.. నవనాట్య దేవతా.. నటనాంకిత.. అభినయవ్రత.. చారుధీర చరిత.. స్వాగతాంజలి.. స్వాగతాంజలి.. జననజనన రూపురాలి స్వాగతాంజలి.. ఓ చంద్రముఖి నీకే మా స్వాగతాంజలి ' అనే లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో అలరిస్తోంది. ఈ పాటలో కంగనా రనౌత్ లుక్ అదిరిపోయింది. కాగా.. ఇప్పటికే కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. (ఇది చదవండి: ' చావును దగ్గరి నుంచి చూశా'.. విశాల్ కామెంట్స్ వైరల్!) -
విజయ్, సమంతల 'ఖుషీ'.. ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న తాజా సినిమా 'ఖుషీ'. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇది వరకే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. (ఇది చదవండి: మైనస్ 15 డిగ్రీల చలి.. బికినీలో స్టార్ హీరోయిన్ హాట్ ట్రీట్.!) తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల మే9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. నా రోజా నువ్వే అంటూ సాగే ప్రోమో మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా... ఈ సినిమాను సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Kushi ❤️ 1st song. Full song out on May 9. pic.twitter.com/lf1QH7vBEH — Vijay Deverakonda (@TheDeverakonda) May 7, 2023 -
లవ్ ఎంటర్టైనర్గా ‘శశివదనే’.. ఆకట్టుకుంటోన్న ప్రోమో
యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. గౌరి నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్, ఎజీ ఫిల్మ్ కంపెనీ పతాకాలపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో ప్రవీణ్ యండమూరి, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ప్రోమోను గమనిస్తే పక్కా లవ్ ఎంటర్టైనర్గా అర్థమవుతోంది. ఈ ప్రోమో చాలా నేచురల్‌గా, కలర్ఫుల్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హరి చరణ్, చిన్మయి శ్రీపాద పాడిన పాట సినిమాలో అలరించనుంది. శ్రవణ వాసుదేవన్ సంగీతం అందించారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం ట్యూన్‌కు తగ్గట్లు అందంగా ఉన్నాయి. శశివదనే పూర్తి టైటిల్ సాంగ్‌ను మేకర్స్ ఫిబ్రవరి 1న రిలీజ్ చేస్తున్నారు. కాగా.. కోనసీమ, అమలాపురం తదితర ప్రాంతాల్లో 50 రోజులకు పైగానే ఈ సినిమాను చిత్రీకరించారు. -
ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శాకుంతలం టీం, ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఫిబ్రవరి 17న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రిలీజ్ డేట్ దగ్గర పుడుతుండటంతో శాకుంతలం ప్రమోషన్స్ స్టార్ చేసింది మూవీ యూనిట్. చదవండి: Jr NTR-Team India: భారత ఆటగాళ్లతో తారక్ సందడి, ఫొటో వైరల్! ఈ నేపథ్యంలో శాకుంతలం ఫస్ట్ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్ చేశారు. ‘మల్లికా’ అంటూ సాగే ఈ తొలి పాటని ఈ నెల 18వ తేదీన విడుదల చేయబోత్నుట్లు చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ఇందులో సమంత జోడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఆయన దుష్యంత మహారాజు పాత్ర పోషించగా.. అల్లు అర్జున్ ముద్దుల తనయ ఈ సినిమాతో వెండితెర అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అర్హ ప్రిన్స్ భరత పాత్రలో అలరించనుంది. Starting off the musical journey of #Shaakuntalam with the First Single 🤍#Mallika/#Malligaa/#Mallike on Jan 18th 🎶 Music by Melody Brahma #ManiSharma 🎹@Gunasekhar1 @ActorDevMohan @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/or8ntqc170 — Samantha (@Samanthaprabhu2) January 16, 2023 -
వీరసింహారెడ్డి లేటెస్ట్ అప్ డేట్.. ఫస్ట్ సింగిల్ ఆరోజే...!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజా క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. (చదవండి: యాక్షన్ మోడ్‌లో బాలయ్య.. ‘వీరసింహారెడ్డి’లో ఇదే కీలక సన్నివేశం) ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పాటను ఈనె 25న ఉదయ 10.29 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. దీంతో బాలయ్య మాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. A MASS ANTHEM for the GOD OF MASSES 🔥#VeeraSimhaReddy first single #JaiBalayya on November 25th at 10.29 AM ❤️🔥#NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/nYGn2dVRTv — Mythri Movie Makers (@MythriOfficial) November 23, 2022 -
కమల్ హాసన్ పాడిన పాట విన్నారా !
Kamal Haasan Vikram Telugu Version First Lyrical Mathuga Mathuga Released: సుమారు నాలుగేళ్ల తర్వాత వెండితెరపై తన నట విశ్వరూపాన్ని చూపేందుకు రెడీ అయ్యాడు కమల్ హాసన్. యూనివర్సల్ హీరో కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విక్రమ్. అలాగే సూర్య అతిథి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ మూవీ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్‌పై నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'విక్రమ్' తెలుగు వెర్షన్ నుంచి మొదటి పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'మత్తుగా మత్తుగా' అంటూ సాగే ఈ పాటను కమల్ హాసన్ ఆలపించడం విశేషం. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ 'రా' ఏజెంట్‌గా అలరించనున్నారని సమాచారం. చదవండి: మెటావర్స్ వెర్షన్లో 'విక్రమ్'.. తొలి మూవీగా రికార్డ్ -
దుల్కర్ సల్మాన్-రష్మిక మందన్నా 'సీతా రామం' నుంచి కొత్త అప్డేట్..
Sita Ramam: First Single Oh Sita Hey Rama Promo Released: హను రాఘవపూడి డైరెక్షన్లో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సీతా రామం'. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనేది ట్యాగ్‌లైన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మృణాళిని ఠాకూర్, సుమంత కీలక పాత్రల్లో అలరించనున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబధించిన అప్డేట్ను ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ 'ఓ సీత.. హే రామ'ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రొమోను ఆదివారం (మే 8) విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా ఎస్పీ చరణ్, రమ్య బెహరా ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్ మెలోడీయస్ సంగీతం బాగుంది. ఈ సాంగ్ ప్రొమో చివర్లో 'వెళ్లి సీత దగ్గర డ్యాన్స్ నేర్చుకోండి' అని దుల్కర్ సల్మాన్ సీతాకోక చిలుకలతో చెప్పడం చాలా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రొమో నెట్టింట వైరల్ అవుతోంది. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అలాగే ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. చదవండి: నేను బ్యాడ్ బాయ్‌లానే కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్ Can’t wait to show you guys the full song! #OhSitaHeyRama (Telugu): https://t.co/Ii8whgyQui #SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @Composer_Vishal #PSVinod @MrSheetalsharma @IananthaSriram @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @kshreyaas @sidsriram pic.twitter.com/1T1kUwTU0V — Hanu Raghavapudi (@hanurpudi) May 8, 2022 -
‘ది వారియర్’ నుంచి బుల్లెట్ సాంగ్ వచ్చేసింది
First Single Released From The Warrior Movie: రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. చదవండి: జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, ఆన్లైన్లో లీకైన సినిమా ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం వరస అప్డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్‌సింగిల్ పేరుతో తొలి సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. బుల్లెట్ అంటూ సాగే ఈ పాట యువతను సాంతం ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించి ఎనర్జీటిక్ మ్యూజిక్, శింబు, హరిప్రియ ఆలపించిన ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకుపోతోందీ. ఈ పాటకు శ్రిమణి లిరిక్స్‌ను అందించాడు. -
యమ గ్రేటే... మన ‘కాలా’ సేటు
రజనీకాంత్... ఈ పేరే ఒక సంచలనం. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడే కాదు, దేశ విదేశాల్లోనూ తలైవాకు తిరుగులేని అభిమానగణం ఉంది. ఈ సూపర్‌స్టార్‌కు మాములు ప్రేక్షకులే కాదు... సెలబ్రెటీలు కూడా అభిమానులే. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రజనీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. కోలీవుడ్ ప్రేక్షకులు ఆయనను తమిళ దైవంగా ఆరాధిస్తారు. అలాంటి సూపర్‌స్టార్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూనే ఉంటారు. రజనీ సినిమాకు సంబంధించి ఏ చిన్నవిషయమైనా వీరికి పండగే. కొద్ది క్షణాల క్రితమే రజనీకాంత్ తాజా చిత్రం ‘కాలా’ మొదటి పాటను విడుదల చేశారు. యమ గ్రేటే.. యమ గ్రేటే...అంటూ సాగే ఈ పాట రజనీ కోసమే పుట్టిందేమో అన్నట్లు ఉంది. ఈ ఒక్క పాటలోనే సినిమా మొత్తం ఎలా ఉంటుందో చూపించేశారు. రజనీ కాలాగా ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నారో ఈ పాటను వింటే తెలుస్తోంది. ధారావి ప్రాంతంలో కాలాకు ఉండే పలుకుబడి ఏంటో అర్థమవుతోంది. ఈ పాటను హరిహరసుదన్, సంతోష్ నారాయణ్ ఆలపించగా...సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ లిరికల్ వీడియో సాంగ్ చూడ్డానికి కూడా బాగుంది. ఇక ఈ పాటతో కాలా విడుదలయ్యే వరకు అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. కాలా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
‘కాలా’ మొదటి పాట విడుదల
-
‘కాలా’ ఫస్ట్ సింగిల్ రేపే
సినిమా విజయాలతో సంబంధం లేని తిరుగులేని స్టార్డమ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సొంతం. రజనీ సినిమా వస్తోందంటే చాలు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. రజనీపై ఉండే అభిమానం... సినిమా సక్సెస్‌పై ఆధారపడదు. సూపర్‌స్టార్‌కు ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వరుసగా సినిమాలు నిరాశపరుస్తున్న అభిమానులు మాత్రం తలైవా సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూనే ఉన్నారు. కబాలి ఫేం పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన రజనీ తాజా చిత్రం ‘కాలా’.. ఈపాటికే సినిమా విడుదలై సంచనాలు సృష్టించాల్సింది. కానీ తమిళ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సినిమా ఆలస్యమైంది. లేటుగా వచ్చినా లేటేస్ట్‌గా వస్తా అనే డైలాగ్ ఎలాగూ రజనీకి ఉంది. కాలా సినిమా శాటిలైట్ హక్కులు భారీ రేటును పలికాయని తెలుస్తోంది. తలైవాకు ఉన్న క్రేజ్‌కు ఎంతైనా పెట్టొచ్చు అంటున్నారు అభిమానులు. ప్రముఖ హీరో, రజనీ అల్లుడైన ధనుష్ ఈ చిత్ర నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారాన్ని ధనుష్ ట్వీటర్ ద్వారా తెలియపరిచారు. మే 9న ఆడియో ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నట్లు, రేపు (మే 1) సాయంత్రం ఏడు గంటలకు ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు నటించారు. ఈ సినిమాకు కబాలి ఫేం సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. A surprise to Superstar fans. #kaala 1st single #semmaweightu will be released tom evening at 7 pm. #rajinism #thalaivar @Music_Santhosh @beemji @vinod_offl @humasqureshi pic.twitter.com/mLDt1oCfm2 — Dhanush (@dhanushkraja) 30 April 2018 Wunderbar films presents, Superstar’s #kaalaa audio will release on #may9th ... get ready to celebrate thalaivars swag with Santosh narayanan’s stylish music. pic.twitter.com/FbrRwFmtng — Dhanush (@dhanushkraja) 28 April 2018 -
‘భరత్ అనే నేను’ హామీ ఇస్తున్నాను..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను ఈ రోజు (ఆదివారం) విడుదల చేశారు. మహేష్ లుక్ కు తగ్గట్టుగా ఈ పాటను కూడా స్టైలిష్‌గా రూపొందించారు. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ హాలీవుడ్ పాటలను గుర్తు చేసేలా క్లాస్ ట్యూన్‌తో ఆకట్టుకున్నాడు. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యమందించిన ఈ పాటను డేవిడ్ సిమాన్ ఆలపించారు. మహేష్ బాబు ముఖ్య మంత్రిగా నటించనున్న భరత్ అనే నేను సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. వరుసగా ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న మహేష్ ఈ సినిమాతో ఎలాగైన బిగ్ హిట్ కొట్టి అభిమానులను ఖుషీ చేయాలని చూస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
రాఖీ పండుగకి నాగ్ గిఫ్ట్ ఇదే..
హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య రాఖీ పర్వదిన్నాన్ని పురస్కరించుకొని అభిమానులకు మంచి గిఫ్ట్ అందించారు. తన రాబొయే చిత్రం `యుద్ధం శరణం` సినిమాలోని ఓ పాటను రాఖీ బహుమతిగా అభిమానులకు నాగచైతన్య అందజేశారు. ఈ సినిమాలోని `ఎన్నో ఎన్నో భావాలే` అనే పాట లిరికల్ వీడియోను నాగచైతన్య ట్విట్టర్లో షేర్ చేశారు ఈ పాటను దర్శకుడు కృష్ణ వైరముత్తుతో కలిసి రేడియో మిర్చిలో విడుదల చేసినట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. రాఖీ ఎందుకు కడతారో తెలుసా.. అంటూ సీనియర్ నటి రేవతి డైలాగ్.... నాగచైతన్యకు రాఖీ కడుతున్న సన్నివేశంతోనే ఈ వీడియో మొదలవుతోంది. అలాగే హీరోయిన్ లావణ్య త్రిపాఠికి, నాగచైతన్యకు మధ్య ఉన్న కొన్ని చక్కని సన్నివేశాలను కూడా ఈ వీడియోలోలో పొందుపరిచారు. కుటుంబ బంధాలను, వారితో గడిపిన సంతోష క్షణాలను ఈ వీడియోలో చూడొచ్చు. కాగా హీరో, నటుడు శ్రీకాంత్ విలన్ పాత్రను పోషిస్తుండగా, నాగచైతన్య తల్లిదండ్రులుగా రావురమేశ్, రేవతిలు నటించారు. వివేక్‌సాగర్ సంగీతం అదించిన సంగతి తెలిసిందే. సంగతి తెలిసిందే.