Samantha 'Shakuntalam' Movie First Single Release on Jan 18 - Sakshi
Sakshi News home page

Samantha- Shakuntalam Movie: ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసిన శాకుంతలం టీం, ఫస్ట్‌ సింగిల్‌కు డేట్‌ ఫిక్స్‌

Published Tue, Jan 17 2023 10:24 AM | Last Updated on Tue, Jan 17 2023 10:50 AM

Samantha Shakuntalam Movie First Single Release on Jan 18th 2023 - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ శాకుంతలం. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఫిబ్రవరి 17న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పుడుతుండటంతో శాకుంతలం ప్రమోషన్స్‌ స్టార్‌ చేసింది మూవీ యూనిట్‌.  

చదవండి: Jr NTR-Team India: భారత ఆటగాళ్లతో తారక్‌ సందడి, ఫొటో వైరల్‌!

ఈ నేపథ్యంలో శాకుంతలం ఫస్ట్‌ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్‌ చేశారు.  ‘మల్లికా’ అంటూ సాగే ఈ తొలి పాటని ఈ నెల 18వ తేదీన విడుదల చేయబోత్నుట్లు చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ఇందులో సమంత జోడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఆయన దుష్యంత మహారాజు పాత్ర పోషించగా.. అల్లు అర్జున్‌ ముద్దుల తనయ ఈ సినిమాతో వెండితెర అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అర్హ ప్రిన్స్‌ భరత పాత్రలో అలరించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement