Vijay Devarakonda and Samantha Khushi First Single Promo Out - Sakshi
Sakshi News home page

Khushi Movie: విజయ్, సమంతల 'ఖుషీ'.. ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

Published Sun, May 7 2023 3:25 PM | Last Updated on Sun, May 7 2023 3:47 PM

Vijay Devarakonda and Samantha Khushi First Single Promo Out - Sakshi

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న తాజా  సినిమా 'ఖుషీ'. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇది వరకే విడుదలైన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్లకి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్.

(ఇది చదవండి: మైనస్ 15 డిగ్రీల చలి.. బికినీలో స్టార్ హీరోయిన్ హాట్ ట్రీట్.!)

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ సింగిల్‌ను ఈ నెల మే9న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. నా రోజా నువ్వే అంటూ సాగే ప్రోమో మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా... ఈ సినిమాను సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement