Shakuntalam Movie
-
గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!
Samantha Ruth Prabhu Cryptic Post: సమంత పేరు చెప్పగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఆమె నటించిన గత రెండు చిత్రాలు 'యశోద', 'శాకుంతలం'.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలయ్యాయి. దీంతో ఆశలన్నీ ప్రస్తుతం 'ఖుషి' పైనే పెట్టుకుంది. రొమాంటిక్ లవ్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఓ ఫొటో పోస్ట్ చేసిన సామ్ అందరూ అవాక్కయ్యేలా చేసింది. గుర్తుపట్టలేనంతగా సమంత ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది. మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతోంది. గతేడాది 'యశోద' విడుదల సమయంలో ఈ సమస్య గురించి బయటపెట్టిన సామ్.. ఆ తర్వాత పలు సినిమాలతో పాటు 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది. అయితే సామ్.. ఓ సంవత్సరం పాటు బ్రేక్ తీసుకోనుందని ఈ మధ్య న్యూస్ వచ్చింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ వాల్తేరు వీరయ్య బ్యూటీ!) ఆరు నెలలు కష్టంగా తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ పిక్ పోస్ట్ చేయగా.. అది సమంత అని గుర్తుపట్టడానికి కాస్త సమయం పట్టింది. మేకప్ లేకపోవడం లేదా అలసట వల్లో తెలియదు గానీ ఇందులో సమంత చాలా డల్ గా కనిపించింది. 'ఈ ఆరు నెలల చాలా సుధీర్ఘంగా, కష్టంగా గడిచాయి. ఫైనల్ గా దీన్ని ముగించాల్సిన టైమ్ వచ్చింది' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. చికిత్స కోసం అంత ఖర్చు? ఏడాదిపాటు సమంత బ్రేక్ తీసుకోనున్నట్లు తాజాగా వార్తలు వచ్చాయి. అలానే సామ్ చికిత్స కోసం అమెరికా వెళ్లనుందని, ఈ మొత్తం చికిత్స కోసం ఏకంగా రూ. కోటి వరకు ఖర్చు కానుందనే టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సరే ఇదంతా పక్కనబెడితే సమంత లేటెస్ట్ లుక్ మాత్రం అందరినీ అయోమయానికి గురిచేసింది. Our boss lady #SamanthaRuthPrabhu papped at Mumbai airport@Samanthaprabhu2 pic.twitter.com/ZXg7hmLvwa — ARTISTRYBUZZ (@ArtistryBuzz) July 8, 2023 (ఇదీ చదవండి: బుల్లితెర నటి ఇంట్లో చోరీ) -
దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ రాలేదు: పరుచూరి
ఇటీవలి కాలంలో వచ్చిన సమంత శాకుంతలం సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. కనీస వసూళ్లు సాధించడంలోనూ విఫలమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. శాకుంతలం ఓ జ్ఞాపకం.. 'శాకుంతలం నాకొక అద్భుతమైన జ్ఞాపకం. గతంలో నేను తెలుగు ఉపన్యాసకుడిగా పని చేశాను. ఆ సమయంలో నేను శాకుంతలం నాటకం చూశాను. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత గుణశేఖర్ సినిమా తీయడంతో మళ్లీ చూశా. ఆయన తీసిన సినిమాలన్నీ చూస్తే అందులో కొత్తదనం కనిపిస్తుంది. రానాగారితో హిరణ్యకశ్యప చేద్దామనుకున్నాడు, కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అప్పుడు వేరే సోషల్ కథ ఎంచుకోకుండా శాకుంతలం సినిమా తీశాడు. ఆ సీన్ ఒరిజినల్ కథలో లేదు! ప్రేమ, గంధర్వ వివాహం.. ఆ ప్రేమను ఓ శాపం వల్ల మర్చిపోవడం, చివర్లో భార్యాభర్తలు కలవడం.. భారతదేశాన్ని పరిపాలించిన భరతుడు ఎలా పుట్టాడనేదే కథ. శకుంతల గర్భం దాల్చిన తర్వాత మహారాజుని కలవడానికి వెళ్లడం, ఆయన వెళ్లిపోమని కేకలు వేయడం.. బయటకు వచ్చిన ఆమెను గ్రామస్తులు రాళ్లతో కొట్టడం చూపించారు. సానుభూతి కోసం ఈ సీన్ పెట్టారేమో కానీ నాకు తెలిసినంత వరకు అభిజ్ఞాన శాకుంతలంలో ఆమెను రాళ్లతో కొట్టలేదు. చిన్నపిల్లాడికి కూడా తెలిసిపోతుంది శకుంతల- దుష్యంతుల ప్రేమ.. వారికి భరతుడు పుట్టాడనే కథ ఎన్ని సంవత్సరాలైనా సజీవంగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో శకుంతల, దుష్యంతుడు కలుస్తారా? లేదా? ఆసక్తి క్రియేట్ చేశారు. సెకండాఫ్‌లో ఉంగరం చూడగానే దుష్యంతుడికి శకుంతల గుర్తుకు వస్తుంది. దీంతో వాళ్లిద్దరూ కలిసిపోవడం ఖాయమని చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది. గుణశేఖర్ రచన, దర్శకత్వంలో ఎక్కడా తప్పు లేదు. కానీ ఈ ఒక్క సీన్‌తో ఆసక్తి తగ్గిపోవచ్చు. సినిమా కలెక్షన్లపై సెకండాఫ్ ప్రభావం చూపించిందేమోనని నేను భావిస్తున్నాను. సమంత చిన్నమ్మాయే అయినా.. చివర్లో దుష్యంతుడు స్వయంగా వచ్చినా కూడా శకుంతల ఆయన దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడలేదు.. ఇక్కడ మంచి డ్రామా క్రియేట్ చేశారు. సమంత చిన్నమ్మాయే అయినా అద్భుతంగా నటించింది. దుష్యంతుడి పాత్రకు దేవ్ మోహన్ న్యాయం చేశాడు. ప్రజలు మర్చిపోతున్న మహాభారతంలోని ఓ ముఖ్య నాటకాన్ని సొంత డబ్బుతో తెరకెక్కించిన గుణశేఖర్ గట్స్‌కు హ్యాట్సాఫ్' అని చెప్పాడు గోపాలకృష్ణ. చదవండి: ప్రియుడితో టచ్‌లో ఉన్న నటుడి భార్య, అందుకే విడాకులు! -
శ్రీ వారి సేవలో శాకుంతలం మూవీ టీమ్
-
ఆ విషయంలో మన తెలుగు హీరోలు మారాలి!
♦ ‘రుద్రమదేవి’ తర్వాత ‘హిరణ్య కశ్యప’ సినిమా స్క్రిప్్ట, ప్రీ ప్రొడక్షన్‌పై ఐదేళ్లు వర్క్ చేశాను. షూటింగ్ ఆరంభించే టైమ్‌లో కోవిడ్ వచ్చింది. దీంతో అప్పుడు మాతో కలిసి ఉన్న ఓ హాలీవుడ్ సంస్థ మరో వర్క్‌పై ఫోకస్ పెట్టింది. ఈ కారణంగా ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టాం. ♦లాక్డౌన్ టైమ్‌లో కొన్ని పురాణాలు, ఇతిహాసాల కలయికలో ఓ ప్రేమకథ చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాకు నచ్చింది. దాన్ని సోషలైజ్ చేయటమెందుకు.. అలాగే తీస్తే బెటర్ కదా అని ‘శాకుంతలం’ మొదలుపెట్టాను. సాధారణంగా శకుంతల అనగానే శృంగార శకుంతల గుర్తుకొచ్చేలా ఇప్పటివరకూ చూపించారు. కానీ, ఆమెలో అంతర్గతంగా చాలా శక్తి, ఆత్మాభిమానం ఉంటుందని ‘అభిజ్ఞాన శాకుంతలం’లో కాళిదాసు ప్రస్తావించారు. నేను కూడా శకుంతల లోని రెండో కోణంతో కథ అల్లుకుని, ‘శాకుంతలం’ తీశాను. ♦ తన ఆత్మాభిమానం కోసం అప్పట్లో రాజు, రాజ్యాలను శకుంతల లెక్క చేయకుండా పోరాడి నిలబడింది. పెళ్లి కాకుండా తల్లి కావటం అనేది అప్పట్లో పెద్ద నేరం. అలాంటి పరిస్థితులను ఆమె ఎలా ఎదురొడ్డి నిలబడిందనేది ఈ చిత్రకథాంశం. ♦ సమంత చాలా మంచి నటి. అందుకే శకుంతల పాత్రలో రొమాంటిక్ యాంగిల్‌ను సెకండ్రీ చేశా. నటనకు ప్రాధాన్యం ఉండేలా చూపించాను. నేను, అరుణ బిక్షుగారు, సమంతగారు కలిసి మాట్లాడుకుని శకుంతల పాత్రను డిజైన్ చేశాం. సమంత కొత్త హీరోయిన్లా అరుణ బిక్షుగారి వద్ద శిక్షణ తీసుకుని నటించింది. ♦ ‘శాకుంతలం’లో దుర్వాస మహామునిగా మోహన్‌బాబుగారు నటించారు. ఆ పాత్రని ఆయన తప్ప మరొకరు చేయలేరు. ఆయన ఒప్పుకోకుంటే ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఆలోచనలో పడేవాణ్ణి. ♦ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. ఇలా బాలీవుడ్ స్టార్ హీరోలు అతిథి పాత్రలు చేస్తున్నారు. ఆ విషయంలో మన తెలుగు హీరోలు మారాలి. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్‌ది అతిథి పాత్ర అయినా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్రలో చాలా కోణాలుంటాయి. ఆ పాత్రని తెలుగు హీరోలు చేస్తారనే నమ్మకం నాకు కలగలేదు. అడిగి లేదనిపించుకోవటం ఇష్టం లేక వారిని సంప్రదించలేదు. దేవ్ మోహన్ ‘శాకుంతలం’ పూర్తయ్యే వరకు మరో సినిమా చేయనన్నాడు. అతనికి శిక్షణ ఇప్పించి దుష్యంతుడి పాత్ర చేయించుకున్నాను. -
శాకుంతలం మూవీ ప్రెస్ మీట్..
-
శాకుంతలం టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
పాన్ ఇండియా రేంజ్ లో సమంత.. కాంతర తోనే పోటీనా..
-
నా జీవితం మారిందనుకోవట్లేదు.. అప్పటి వరకే నేను స్టార్‌ని: సమంత
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి శకుంతల, దుష్యంతుల అమర ప్రేమగాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ముంబయిలో నిర్వహించిన ప్రమోషన్లలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు సమంత. సమంత మాట్లాడుతూ.. 'నేను చిన్నప్పటి నుంచీ డిస్నీ జోనర్ సినిమాలను చాలా ఇష్టపడేదాన్ని. నేను ఆనందంగా ఉన్నా, బాధలో ఉన్నా వాటినే చూసేదాన్ని. ఈ సినిమాలో యువరాణిగా నటించడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. శాకుంతలం కథ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఆలోచించాను. కాస్త భయపడ్డా. కానీ, కొన్నేళ్లుగా సవాళ్లు స్వీకరించడం నాకు అలవాటైపోయింది. నా చిన్నతనంలో శకుంతల పాత్ర గురించి చాలా కలలు కనేదాన్ని. అమ్మాయిలు, మహిళలు, ఫ్యామిలీలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పాత్రలో నటిస్తున్నంత సేపు ఓ ప్రేక్షకురాలిగా నేను సినిమాను ఆస్వాదించా. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. నా దృష్టిలో దర్శకుడు గుణశేఖర్ ఫెమినిస్ట్. ఆయన ఫీమేల్ ఓరియంటెడ్ కథలు రాస్తారు. ' అని అన్నారు. అల్లు అర్జున్ గారాల పట్టి గురించి మాట్లాడుతూ.. 'నా దృష్టిలో అల్లు అర్హ స్వతంత్రురాలు. తనకు కావాల్సిన నిర్ణయాలు తానే తీసుకోగలదు. అర్హ కెరీర్ విషయంలో అల్లు అర్జున్ జోక్యం అవసరం లేదు. అర్హ కెరీర్లో ఇది అద్భుతమైన చిత్రం. అర్హ రోల్ చాలా అద్భుతంగా వచ్చింది. అందుకే పిల్లలు, ఫ్యామిలీస్ ఈ కథను ఆస్వాదిస్తారని నమ్ముతున్నా.' అని తెలిపింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాక జీవితం ఎలా మారింది? అని అడగ్గా సమంత సరదాగా స్పందించారు. తాను పాన్ ఇండియా స్టార్‌ననే విషయాన్ని తన పెంపుడు జంతువులకి ఎవరైనా చెబితే బాగుంటుందని అన్నారు. నేనింకా వాటి మలాన్ని ఎత్తిపోస్తున్నానంటూ నవ్వేశారు. నా జీవితం మారిందని నేను అనుకోలేదని.. కేవలం నేను ఆరు గంటల దాకానే స్టార్‌ని.. ఆ తర్వాత నా జీవితం చాలా సాదాసీదాగా ఉంటుందని సమంత అన్నారు. నేను చేస్తున్న పాత్రల విషయంలో చాలా ఆనందంగా ఉన్నానని..యాక్షన్ పాత్రలు కూడా చేస్తున్నట్లు వెల్లడించింది. ఫ్యామిలీమేన్2లో నేను చేసిన పాత్ర అలాంటిదేనని..ఎప్పుడూ అబలగానే కాదు.. సబలగా నటించాలని ఆమె అన్నారు. (ఇది చదవండి: శాకుంతలం నుంచి విడుదలైన 'మల్లికా' వీడియో సాంగ్) -
Shaakuntalam 2nd Trailer: మీ ప్రేమకు కూడా దూరమైతే!
‘లేడి కన్నులు.. నెమలి నడక.. సివంగి నడుము...’ అంటూ నటుడు దేవ్ మోహన్ డైలాగ్‌తో ‘శాకుంతలం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సమంత టైటిల్ రోల్లో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శాకుంతలం’. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ నెల 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ‘మనసెటు పోతే అటు పోరాదని ముని వాక్కు’, ‘పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను.. మీ ప్రేమకు కూడా దూరమైతే’ (సమంత), ‘నీ కష్టానికి కన్నీళ్లు పెట్టగలమే కానీ.. నీ కర్మను పంచుకోలేం’ (గౌతమి) వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, మధుబాల, గౌతమి, అదితీ బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, అడిషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: టబ్బీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: హేమాంబర్ జాస్తి, కొమ్మినేని వెంకటేశ్వరరావు, లైన్ ప్రొడ్యూసర్: యశ్వంత్. -
మోహన్‌బాబు నా ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడు: గుణశేఖర్
స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. సమంత టైటిల్ రోల్లో నటించింది. దుర్వాస మహర్షి పాత్రని సినియర్ హీరో మోహన్‌బాబు పోషించారు. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గుణ శేఖర్.. మోహన్‌బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుర్వాస మహర్షి పాత్రని మోహన్‌బాబు పోషించడం తన ఛాయిస్ కాదని, మహాకవి కాళిదాసు ఛాయిస్ అన్నారు. ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసేది మోహన్‌బాబు మాత్రమేనని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ‘శాకుంతలం కథ అనుకున్నాక.. దుర్వాస మహర్షి పాత్ర కోసం మోహన్‌బాబు తప్ప ఇంకెవరూ గుర్తుకురాలేదు. కానీ గతంలో ‘రుద్రమాదేవి’ కోసం ఓ పాత్ర చేయమని అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఈ సారి మాత్రం నో చెప్పలేని పాత్రతో వచ్చానని చెప్పా. ‘దుర్వాస మహర్షి పాత్ర మీరు మాత్రమే చేయాలి. ఒకవేళ మీరు చేయను అంటే ఇంకెవరు ఆ పాత్ర చేస్తే బాగుంటుందే మీరే చెప్పండి’ అని మోహన్‌బాబుని అడిగాను. ఆయన వెంటనే పెద్దగా నవ్వి ‘కోపిష్టి అని నా దగ్గరకు వచ్చావా? అని అడిగారు. దుర్వాసునిలో కోపం ఒక్కటే గుణం కాదు.. ఆయనో గొప్ప మహర్షి అని నేను బదులిచ్చా. దీంతో వెంటనే మోహన్ బాబు ఆ పాత్రని పోషించడానికి ఒప్పుకున్నారు’అని గుణ శేఖర్ అన్నారు. -
మేనకగా సీనియర్ నటి మధుబాల.. ఆకట్టుకుంటున్న లుక్
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రంలో సమంత శకుంతలగా నటించగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కొన్ని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ మేకర్స్ పోస్టర్లు వదిలారు. తాజాగా అప్సర మేనక పాత్రలో సీనియర్ హీరోయిన్ మధుబాల కనిపించనుంది. ఈ మేరకు ఆమె లుక్‌ని రివీల్ చేశారు మేకర్స్. మేనక కూతురే శకుంతల. అంటే ఈ చిత్రంలో మధుబాల సమంతకు తల్లిగా కనిపించనుంది. ఇప్పటికే ఆమె లుక్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. -
పెద్దమ్మ తల్లి గుడిలో సమంత పూజలు.. పిక్స్ వైరల్
యశోద సినిమా తర్వాత రిలీజ్ కాబోతున్న సమంత మూవీ శాకుంతలం. డైరెక్టర్ గుణ శేఖర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైథిలాజికల్ మూవీగా రూపొందించిన ఈ శాకుంతలం సినిమాలో సమంత లీడ్ రోల్ పోషించగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. పాన్ ఇండియా మూవీ గా ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లిని ఆ సినిమా యూనిట్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసింది. హీరోయిన్ సమంతతో పాటు డైరెక్టర్ గుణశేఖర్, నిర్మాత నీలిమ, దేవ్ మోహన్ లు కూడా ఉన్నారు. కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన చిత్రంలో మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, గౌతమి, మధుబాల, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కీలక పాత్రలుపో షించారు. -
‘శాకుంతలం’పై సమంత రివ్యూ
సమంత ప్రధాన పాత్రలో నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని తాజాగా నిర్మాతలు 'దిల్' రాజు, నీలిమా గుణతో కలిసి కలిసి సమంత వీక్షించింది. అనంతరం ఇన్‌స్టా వేదికగా ‘శాకుంతలం’పై రివ్యూ ఇచ్చింది. ‘ఫైనల్లీ... ఈ రోజు 'శాకుంతలం' సినిమా చూశా. చాలా అందంగా ఉంది. ఇదొక దృశ్య కావ్యం. మన పురాణాల్లో గొప్ప కథల్లో ఒక్కటైన శాకుంతలం కథకు గుణశేఖర్‌గారు ప్రాణం పోశారు. బలమైన భావోద్వేగాలతో రూపొందిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకులు ఆ భావోద్వేగాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. చిన్న పిల్లలకు ఈ ప్రపంచం నచ్చుతుంది. ఇటువంటి సినిమా ఇచ్చిన దిల్ రాజు, నీలిమా గుణలకు థాంక్స్'అని సమంత రాసుకొచ్చింది. శాకుంతలం రివ్యూ చదివిన సమంత ఫ్యాన్స్...శాకుంతలంతో సమంత మరో హిట్ అందుకోనుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఈ ఏడాది సరికొత్త ప్రేమకథా చిత్రాలు ఇవే..!
సినిమాల్లో ప్రేమకథలకు ఉన్న క్రేజే వేరు. లవ్ స్టోరీలను సినీ ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడతారు. భాష ఏదైనా ప్రేమకథా చిత్రాలకు ఆదరణ ఉంటుంది. గతేడాదిలో పలు ప్రేమ కథాంశంగా తెరకెక్కిన చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా కూడా నిలిచాయి. అందులో సీతారామం మూవీ ఒకటి. మరీ ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా సరికొత్త ప్రేమకథలను పరిచయం చేసేందుకు టాలీవుడ్లో సిద్ధమవుతున్న చిత్రాలేవో చూసేద్దాం. ప్రేమకావ్యం.. శాకుంతలం కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్, శకుంతలగా సమంత నటించారు. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, గౌతమి, మధుబాల కీలక పాత్రలుపో షించారు. కాగా ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ని విడుదల చేయనున్నట్లు శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. వినరో భాగ్యము విష్ణుకథ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి నటిస్తున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫోన్ నంబర్ ప్రధాన అంశంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. మన ఫోన్ నెంబర్ తర్వాత నెంబర్ వారితో పరిచయం ప్రేమగా మారితే ఎలా ఉంటుందన్నదే ప్రధాన కథాంశం. ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని- కీర్తి సురేశ్ 'దసరా' నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. యాక్షన్ చిత్రంగా తెరకెస్తున్నప్పటికీ ఓ మంచి ప్రేమకథ ఉందని పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. సింగరేణి బొగ్గు గనుల సమీపంలోని వీర్లపల్లి గ్రామ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తిసురేశ్ నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ - సమంత 'ఖుషి' పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన ఖుషి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే పేరుతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. -
ప్రేమకథా చిత్రమ్
‘ప్రేమకథ’లు చూడ్డానికి బాగుంటాయి. గాఢమైన ‘ప్రేమ కథలు’ అయితే మనసులో నిలిచిపోతాయి. దుష్యంతుడు, శకుంతలది అలాంటి ప్రేమకథే. కొన్నేళ్ల పాటు దూరంగా ఉన్నా వీరి ప్రేమ బలమైనది కాబట్టే నిలబడింది. ఈ ప్రేమకథని త్వరలో వెండితెరపై చూడనున్నాం. మరికొన్ని ప్రేమకథలు కూడా రానున్నాయి. ఒక్కో ‘ప్రేమకథా చిత్రమ్’ది ఒక్కో కథ. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. ప్రేమకావ్యాల్లో ‘అభిజ్ఞాన శాకుంతలం’ది ప్రత్యేకమైన స్థానం. కాళిదాసు రచించిన ఈ ప్రేమకథ ఆధారంగా ఆల్రెడీ కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమా తీశారు. ఇందులో దుష్యంతుడిగా దేవ్ మోహన్, శకుంతలగా సమంత నటించారు. దుష్యంత మహారాజు, శకుంతల ప్రేమ చుట్టూ ఈ సినిమా సాగు తుందన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఓ కొత్త ప్రేమకథతో ఖుషీగా రానున్నారు విజయ్ దేవరకొండ–సమంత. ఈ ఇద్దరూ జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఖుషి’. ‘ఒక రొమాంటిక్ ప్రేమకావ్యం నిర్మాణంలో ఉంది’ అని విజయ్, ‘కుటుంబమంతా చూసి మంచి అనుభూతికి గురయ్యే సినిమా’ అని సమంత ‘ఖుషి’ అప్డేట్ అప్పుడు పేర్కొన్నారు. సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి చిన్న బ్రేక్ పడింది. ఏది ఏమైనా ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటోంది యూనిట్. మరోవైపు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో 2018లో వచి్చన లవ్‌స్టోరీ ‘గీత గోవిందం’ సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా విజయ్, పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది లవ్‌స్టోరీ ఫిల్మ్ అని, ‘గీత గోవిందం’కు సీక్వెల్ అనే ప్రచారం తెరపైకి వచ్చ్చింది . ఇదే నిజమైతో విజయ్ వెంట వెంటనే ప్రేమకథా చిత్రాల్లో నటించినట్లు అవుతుంది. ఇక అబ్బాయి, అమ్మాయి స్నేహం ప్రేమగా మారిన ఎన్నో కథలు వెండితెరపైకి వచ్చాయి. ప్రేక్షకుల మనసులను మెప్పించాయి. ఈ కోవలో రానున్న మరో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. అబ్బాయి సంజయ్ పీసపాటి, అమ్మాయి అనుపమా కస్తూరిల ప్రేమకథ ఇది. సంజయ్ పాత్రలో నాగ సౌర్య , అనుపమ పాత్రలో మాళవికా నాయర్ నటించారు. ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్ అంశాల మేళవింపుతో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చి 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకోవైపు ‘మొదటి ప్రేమకు మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటున్నారు ఆనంద్ దేవరకొండ. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ హీరోగా, విరాజ్ అశి్వన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. ఫస్ట్ లవ్ కాన్సెప్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక శ్రీదేవి ఎక్కడుంటే శోభన్‌బాబు అక్కడే ఉంటాడట. ఎందుకంటే ప్రేమంట. సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపొందిన లవ్‌స్టోరీ ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ఇందులో శోభన్‌బాబుగా సంతోష్ శోభన్, శ్రీదేవిగా గౌరి కనిపిస్తారు. ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఇంకోవైపు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో ఫేమ్ సంపాదించుకున్న హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఫోన్ నంబర్ నైబర్‌హుడ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో కాశ్మీర హీరోయిన్గా నటించగా, కిశోర్ డైరెక్టర్ చేశారు. ఈ చిత్రం కూడా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఇవి కాక మరికొన్ని ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. -
వేసవిలో శాకుంతలం
కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్, శకుంతలగా సమంత నటించారు. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, గౌతమి, మధుబాల కీలక పాత్రలుపో షించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ‘శాకుంతలం’ సినిమా రెండుసార్లు వాయిదా పడింది. కాగా ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ని విడుదల చేయనున్నట్లు శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించి, చిత్రంలోని కీలక పా త్రధారులతోపో స్టర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని విజువల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియన్స్‌కు అద్భుతమైన అనుభూతిని ఇచ్చేందుకు హంగేరిలోని సింఫనీ టెక్నీషియన్స్ రీ రికార్డింగ్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌గారి కుమార్తె అల్లు అర్హ చేసిన యువరాజు భరతుడి పా త్ర ఈ సినిమాకి ఓ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
సమంత 'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్
సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత శకుంతలగా నటించగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఇప్పటికే ప్రమోషన్స మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు. తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. 'ఏలేలో ఏలేలో ఏలో యాలా .. ఏటీలోన సాగే నావా' అనే సాంగ్‌ను విడుదల చేశారు.శకుంతల తన భర్తను కలుసుకోవడానికి నావలో బయల్దేరి వెళ్తున్న సందర్భంలో వచ్చే పాట ఇది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. -
సమంత ‘శాకుంతలం’ మూవీ స్టిల్స్
-
సమంత 'శాకుంతలం' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్‌కు రెడీ
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇదివరకే ఈ చిత్రం నుంచి మల్లికా మల్లికా అంటూ సాగే మెలోడీ సాంగ్ విడుదలై ఆకట్టుకోగా ఇప్పుడు “ఋషివనములోనా” అనే సాంగ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 25న ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. శకుంతల, దుష్యంతల ప్రేమని చూపించేలా ఈ సెకండ్ సాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అవుతున్న శాకుంతలం సినిమాకు మనిశర్మ సంగీతం అందిస్తున్నారు. A melody you'd fall in love with!🤍🎶#Rushivanamlona/#RushimooniyonKa/#Ruhivanadalondu/#RishivanamAagum/#Risivanthane from Jan 25th.#Shaakuntalam @Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/7kSuTqK0Bg — Neelima Guna (@neelima_guna) January 23, 2023 -
శాకుంతలం ఫస్ట్ సింగిల్ రిలీజ్, ఆకట్టుకుంటున్న మెలోడి సాంగ్
మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘మల్లికా మల్లికా మాలతీ మాలికా.. చూడవా చూడవా ఏడి నా ఏలిక’ అంటూ సాగే పాటను బుధవారం విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటను రమ్య బెహ్రా పాడారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. -
ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శాకుంతలం టీం, ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఫిబ్రవరి 17న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రిలీజ్ డేట్ దగ్గర పుడుతుండటంతో శాకుంతలం ప్రమోషన్స్ స్టార్ చేసింది మూవీ యూనిట్. చదవండి: Jr NTR-Team India: భారత ఆటగాళ్లతో తారక్ సందడి, ఫొటో వైరల్! ఈ నేపథ్యంలో శాకుంతలం ఫస్ట్ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్ చేశారు. ‘మల్లికా’ అంటూ సాగే ఈ తొలి పాటని ఈ నెల 18వ తేదీన విడుదల చేయబోత్నుట్లు చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ఇందులో సమంత జోడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఆయన దుష్యంత మహారాజు పాత్ర పోషించగా.. అల్లు అర్జున్ ముద్దుల తనయ ఈ సినిమాతో వెండితెర అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అర్హ ప్రిన్స్ భరత పాత్రలో అలరించనుంది. Starting off the musical journey of #Shaakuntalam with the First Single 🤍#Mallika/#Malligaa/#Mallike on Jan 18th 🎶 Music by Melody Brahma #ManiSharma 🎹@Gunasekhar1 @ActorDevMohan @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/or8ntqc170 — Samantha (@Samanthaprabhu2) January 16, 2023 -
గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత
శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సమంత కన్నీళ్లు పెట్టుకుంది. డైరెక్టర్ గుణశేఖర్ ఆమె గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు నిజమైన హీరో సమంత అని ప్రశంసించాడు. దీంతో ఎమోషనల్ అయిన సామ్ కంటతడి పెట్టింది. కాగా తనకు మయోసైటిస్ వ్యాధి ఉందని చెప్పిన తర్వాత సామ్ తొలిసారి ఇలా మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నాకు సినిమాపై ఉన్న ప్రేమ, సినిమాకు నామీదున్న ప్రేమ తగ్గలేదని పేర్కొంది. ''గుణశేఖర్ ప్రాణం పెట్టి తీశారు. ఈ కథ విన్నప్పుడు మేం ఊహించుకున్నట్లు రావాలి అనుకున్నాం. సినిమా చూసిన తర్వాత అంతకు మించి ఉంది అనేలా ప్రతిఒక్కరికి అనిపిస్తుంది. ఇండియన్ హిస్టరీ లో కాళిదాసు రాసిన శకుంతల పాత్ర నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. లైఫ్‌లో ఎన్ని ఫేస్ చేసినా సినిమాను ప్రేమిస్తూనే ఉంటాను'' అంటూ సమంత మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) We're with you sam 🤍🥺 be strong@Samanthaprabhu2#SamanthaRuthPrabhupic.twitter.com/sDjC9r9dBR — Jegan (@JeganSammu) January 9, 2023 -
చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చింది. శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆమె సందడి చేసింది. యశోద సినిమా రిలీజ్ టైంలో తాను మయోసైటిస్‌తో బాధపడుతున్న పేర్కొన్న సమంత అప్పటినుంచి ఇంటికే పరిమితమైంది. సుమతో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ మినహా మిగతా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఎక్కడా కనిపించలేదు. తాజాగా అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి ఆమె మీడియా ముందుకు వచ్చింది. వైట్‌శారీలో దేవకన్యలా మెరిసిపోయింది. దీనికి తోడు సమంత చేతిలో జపమాల కూడా కనిపించడం మరో విశేషం. కాగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: 'మాయ ప్రేమను మరిపిస్తుందేమో కానీ అవమానాన్ని కాదు'.. శాకుంతలం ట్రైలర్ అవుట్ -
అదిరిపోయే విజువల్స్‌తో శాకుంతలం ట్రైలర్.. అల్లు అర్హ ఎంట్రీ అదిరింది
సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోనే సమంత శకుంతల పాత్రలో నటించగా, ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ఈ భూమ్మిద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది. శకుంతల ఒక కారణ జన్మురాలు.. నవ నాగరికతకు నాంది పలకబోతోంది' అంటూ ట్రైలర్ ఆరంభం అవుతుంది. విజువల్స్, మణిశర్మ సంగీతం కట్టిపడేస్తుంది. ఇక చివర్లో సింహం మీద అల్లు అర్హ ఎంట్రీ మరో హైలైట్ అని చెప్పొచ్చు. సమంత లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి ట్రైలర్లో కనిపిస్తున్న మ్యాజిక్ సినిమాలోనూ వర్కవుట్ అవుతుందా? అన్నది చూడాల్సి ఉంది. -
సమంత చిత్రం వాయిదా, 3డీలో రాబోతున్న ‘శాకుంతలం’
సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాని నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఆ మధ్య ప్రకటించింది. అయితే ‘శాకుంతలం’ని 3డీలో అందించాలనే నిర్ణయంతో సినిమా విడుదలని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. చదవండి: అయోధ్యలో ఆది పురుష్ టీజర్, ఫస్ట్ పోస్టర్ ‘‘శకుంతల, దుష్యంత మహారాజు మధ్య ఉన్న అజరామరమైన ప్రణయగాథ ఇది. భారీ స్థాయిలో, అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. అందుకే ఇంతకు ముందు ప్రకటించిన తేదీకి మిమ్మల్ని థియేటర్లలో కలుసుకోలేకపోతున్నాం.. సరికొత్త విడుదల తేదీతో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాం’’ అని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. డా. ఎం. మోహన్ బాబు, ప్రకాష్‌రాజ్, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, మధుబాల, గౌతమి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. We will be announcing the new release date soon! '#𝐒𝐡𝐚𝐚𝐤𝐮𝐧𝐭𝐚𝐥𝐚𝐦 𝐀𝐥𝐬𝐨 𝐈𝐧 𝟑𝐃'.@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #EpicLoveStory #MythologyforMilennials#Shaakuntalam3D pic.twitter.com/5frmUzwMcN — Gunaa Teamworks (@GunaaTeamworks) September 29, 2022 -
సమంత 'శాకుంతలం' నుంచి క్రేజీ అప్డేట్.. రిలీజ్ డేట్ అప్పుడే
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో డిఆర్పి, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పౌరణిక నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శాకుంతలగా సమంతగా నటిస్తుండగా, దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. నవంబర్4న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. -
శాకుంతలం: సమంతకు జోడీగా నటిస్తున్న దేవ్ మోహన్ పోస్టర్ రిలీజ్
సమంత టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ – గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదయ్యాయి. ఇక ఈ సినిమాలో సమంత శాకుంతల దేవీ పాత్రలో సమంత నటిస్తుండగా దుష్యంత్ మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటించారు. తాజాగా ‘శాకుంతలం’ లోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. -
సోషల్ మీడియాకు దూరంగా సమంత.. అసలేమైంది?
సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. మధ్య మధ్యలో బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేసుకునేది. ఇలా ఏదో ఒక రకంగా సోషల్ మీడియాతో టచ్‌లో ఉండే సామ్.. సడెన్‌గా నెట్టింటికి దూరమైపోయింది. ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టి రెండు వారాలు దాటింది. సమంత చివరిగా జూన్ 30న ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాకు దూరమై పోయింది. ట్విటర్లో కూడా ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. ఆ మధ్య సామ్ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందని ఆమె టీమ్ పేర్కొంది. ఆ తర్వాత సమంత నుండి ఒక్క పోస్ట్ కానీ, స్టోరీ కానీ లేదు. తరచు తన ఫోటోలను అప్లోడ్ చేసే సామ్... 15 రోజులు గడిచిన ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఆమె ఫాలోవర్స్‌లో ఆందోళన మొదలైంది. సామ్ ఎందుకు నెట్టింటికి రాలేకపోతుంది? సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉందా? లేదా కావాలనే ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందా అనే చర్చ నెట్టింట మొదలైంది. కొంతమంది ఆమె సోషల్ మీడియా డిటాక్స్‌లో ఉందని అంటుంటే.. మరికొంతమంది వ్యక్తిగత కారణాల వల్లే ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని అంటున్నారు. సమంత ఇంత సైలెంట్‌గా ఉందంటే.. ఏదో పెద్ద బ్రేకింగ్ న్యూస్‌తో రీఎంట్రీ ఇస్తుందని మరికొంత మంది భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సామ్..ఎందుకు సడెన్‌గా సైలెంట్ అయిందో తెలియాలంటే సామ్ స్పందించేవరకు వేచి చూడాల్సిందే. -
బర్త్‌డే స్పెషల్ పోస్టర్: ఎదురుచూపుల్లో సమంత!
సమంత కథానాయికగా నటిస్తున్న తొలి పీరియాడికల్ చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దుష్యంతుడు–శాకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గురువారం (ఏప్రిల్ 28) సమంత బర్త్‌డేను పురస్కరించుకుని శాకుంతలం చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్‌ను వదిలింది. ఇందులో శకుంతలగా కనిపించిన సామ్ ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లుగా ఉంది. ఇదిలా ఉంటే శాకుంతలం మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో శకుంతల పాత్ర డైలాగ్స్ గ్రాంథికంలో ఉంటాయి. అందుకని దాదాపు మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్న అనంతరం డబ్బింగ్ పూర్తి చేసిందట సామ్. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. మరోవైపు సమంత నటించిన మరో లేడీ ఓరియంటెడ్ మూవీ యశోద. సామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. మే 5న ఉదయం 11.07 గంటలకు యశోద ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. Wishing the ethereal “Shakuntala” from #Shaakuntalam @Samanthaprabhu2 a very Happy Birthday! #HBDSamantha #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/NZPvGdCVLY — Gunasekhar (@Gunasekhar1) April 28, 2022 Wishing their lead lady @Samanthaprabhu2 a very Happy Birthday, Team #Yashoda to unveil the first glimpse on May 5th, 11:07AM🔥#HappyBirthdaySamantha #YashodaTheMovie @Iamunnimukundan @varusarath5 @dirharishankar @hareeshnarayan @mynnasukumar @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/h99WGkvHHL — BA Raju's Team (@baraju_SuperHit) April 28, 2022 చదవండి: నువ్వు యాక్టరేంటి? నిన్ను తీసుకుంటే సమయం, డబ్బులు వృథా' -
కీలక అప్డేట్ను షేర్ చేసిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తమిళంలో ఆమె నటించిన “కాతు వాకుల రెండు కాదల్” సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా శాకుంతలం సినిమాకు సంబంధించి మరో అప్డేట్ను షేర్ చేసింది. ఇప్పటికే షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పూర్తి చేశానంటూ సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకుంది. కాగా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను ణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శకుంతలగా సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతోంది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. -
సవాల్‌కి సై అంటున్న టాప్ హీరోయిన్స్
చిట్టిపొట్టి దుస్తులు... రెండు మూడు పాటలు... హీరోని ప్రేమలో పడేయడానికి పడే పాట్లు... కథానాయికల పాత్రలు దాదాపు ఇలానే ఉంటాయి. అందుకే నిండైన దుస్తులు... మెండైన నటన కనబరిచే అవకాశం వస్తే ఎడారిలో ఒయాసిస్సులా భావిస్తారు. అది కూడా పౌరాణిక పాత్రలంటే చెప్పక్కర్లేదు.. పెద్ద సవాల్. ఆ సవాల్‌ని స్వీకరించారు కొందరు నాయికలు. ఏరికోరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అసలు సిసలైన పురాణ స్త్రీల్లా ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయ్యారు. గ్లామర్, లేడీ ఓరియంటెడ్, నెగటివ్ షేడ్స్ (‘సూపర్ డీలక్స్’ సినిమా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్).. ఇలా తన యాక్టింగ్లోని భిన్న కోణాలను ఆవిష్కరించారు సమంత. యాభైకి పైగా సినిమాలు చేశారామె. కానీ కెరీర్లో తొలిసారి మైథాలజీ ఫిల్మ్ ‘శాకుంతలం’ చేశారు. దుష్యంతుడు, శకుంతల ప్రేమకావ్యం ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ నటించారు. ‘‘శకుంతల పాత్రను నేను జీవితాంతం మర్చిపోలేను’’ అని ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా పేర్కొన్నారు సమంత. దీన్నిబట్టి ఈ పౌరాణిక పాత్ర చేయడంపట్ల ఆమె ఎంత సంతృప్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మహా సాధ్వి సీత పాత్రను అంగీకరించి, పెద్ద సాహసమే చేశారు కంగనా రనౌత్, కృతీ సనన్. సీత పాత్ర అంటే కత్తి మీద సామే. ఎందుకంటే ఆ పాత్ర అంటే అంజలీ దేవినే గుర్తొస్తారు. ఆ తర్వాత సీత పాత్రలో నయనతార మెప్పించగలిగారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’లో సీత పాత్ర చేస్తున్నారు కృతీ సనన్. తన కెరీర్లో ఇంతకుముందు ‘కళంక్’ వంటి పీరియాడికల్ ఫిల్మ్ చేసినప్పటికీ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ చేయడం ఇదే తొలిపారి. అందుకే వేషధారణ, హావభావాల పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారట కృతీ సనన్. ఇక బాలీవుడ్లో బయోపిక్స్ అండ్ లేడీ ఓరియంటెడ్ ఫిలింస్‌కు ఓ కేరాఫ్ అడ్రస్‌గా మారారు కంగనా రనౌత్. ఇప్పటికే స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీభాయ్ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ), తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత (తలైవి)గా నటించిన కంగన తాజాగా భారత మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ (ఎమర్జెన్సీ) పాత్ర చేస్తున్నారు. అలాగే పౌరాణిక చిత్రం ‘సీత: ది ఇన్కార్నేషన్’లో సీతగా నటించనున్నారు. ఇంకోవైపు సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకోన్ కూడా పురాణ స్త్రీగా కనిపించనున్నారు. 2018లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘పద్మావత్’ చిత్రంలో రాణీ పద్మావతిగా దీపికా పదుకోన్ అభినయం అద్భుతం. పద్మావతి పాత్రలో దీపిక ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులకు నచ్చింది. ఆ ఉత్సాహంతోనే మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన ద్రౌపది పాత్రలో నటించేందుకు ఇటీవల పచ్చజెండా ఊపారు దీపికా పదుకోన్. ద్రౌపది కోణంలో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రాన్ని రెండు లేదా మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నారు.ఈ నాయికలే కాదు.. రామాయణం, మహాభారతాల ఆధారంగా రూపొందుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో మరికొందరు తారలు పురాణ స్త్రీలుగా కనిపించనున్నారు. -
నాలోని చంటిపిల్ల గంతులేస్తోంది : సమంత
‘శాకుంతలం’ ప్రపంచానికి దూరం అవుతున్నందకు బాధపడుతున్నారు సమంత. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ కనిపిస్తారు. ‘దిల్’రాజు, నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను సమంత పూర్తి చేశారు. ఈ సినిమా గురించి సమంత చెబుతూ – ‘‘గుణశేఖర్‌గారు కథ చెప్పినప్పుడు ‘శాకుంతలం’ ప్రపంచాన్ని ఊహించుకున్నాను. కానీ అంత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడం సాధ్యమేనా? అనిపించింది. అయితే నా అంచనాలను మించిన ప్రపంచాన్ని సృష్టించారాయన. అద్భుతమైన కథలను ఇష్టపడే నాలోని చంటిపిల్ల కలను నిజం చేసిన గాడ్‌ఫాదర్ గుణశేఖర్‌గారు. ఇప్పుడు నాలోని ఆ చంటిపిల్ల సంతోషంతో గంతులేస్తోంది. ఈ యూనిట్‌కి బైబై చెబుతుంటే బాధగా ఉంది’’ అని పేర్కొన్నారు. -
షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అల్లు అర్హ: ఫోటోలు వైరల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాతో వెండితెరపై అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమానే పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్హ భరతుడి పాత్ర పోషిస్తుంది. తాజాగా శాకుంతలంలో అర్హకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ఆమెకు గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది. ఈ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్‌తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శాకుంతలగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ కనిపించనుంది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
భరతుడిని కలిసిన 'పుష్ప'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
Pushpa Meets Bharata In Shakunthalam : అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు అల్లు అర్హ శాకుంతలం షూటింగ్లో పాల్గొంటుంది. అయితే తాజాగా వీరిద్దరి షూటింగ్ లొకేషన్లు ఒకే దగ్గర ఉండటంతో కూతురిని చూసేందుకు బన్నీ మరోసారి శాకుంతలం సెట్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఫోటోను షేర్ చేస్తూ.. 'అర్హ, నేను ఒకే లొకేషన్లో వేరు వేరు చిత్రాల్లో నటిస్తున్నాం. ఇలాంటి రోజు ఓ 15-20 ఏళ్ల తర్వాత ఉంటుందనుకున్నా. కానీ ఇంత త్వరగా వచ్చేసింది.. పుష్ప శాకుంతలంలోని భరతుడిని కలిశాడు. ఇది ఎప్పటికి గుర్తిండిపోతుంది' అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శాకుంతలగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ కనిపించనుంది. Today my daughter Arha and I are shooting for different films at the same location. So, got to visit her set. I was expecting something like this to happen maybe after 15-20 years. But it happened so soon. PUSHPA meets BHARATA in SHAAKUNTHALAM. What a memorable coincidence 💖 pic.twitter.com/4J3mMZmmBj — Allu Arjun (@alluarjun) August 9, 2021 -
శాకుంతలం సెట్‌కి వెళ్లిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
Allu Arjun Visits Shakunthalam Sets: సమంత, గుణశేఖర్ కాంబినేషన్లో ప్రస్తుతం శాకుంతలం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్హ వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్హ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక కూతురు పర్ఫార్మెన్స్ చూసేందుకు అల్లు అర్జున్ స్వయంగా శాకుంతలం సెట్‌కి వచ్చారు. ఈ సందర్భంగా కూతురి నటనను చూసి బన్నీ మురిసిపోయినట్లు సమాచారం. ఆల్లు అర్జున్‌తో పాటు భార్య స్నేహ రెడ్డి, కొడుకు అల్లు అయాన్లు కూడా సెట్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శాకుంతలగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలోనే అల్లు అర్హ కనిపించనున్నట్లు సమాచారం. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ ఫార్ట్ విడుదల కానుంది. -
శాకుంతలం: కీలకపాత్రలో బాలీవుడ్ నటుడు
దుష్యంతుడు–శకుంతల ప్రేమకావ్యంగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శకుంతలగా సమంత, దుష్యంతుడి పాత్రను దేవ్ మోహన్ పోషిస్తున్నారు. ఓ కీలక పాత్రను బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ పోషించనున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు చిత్రనిర్మాతల్లో ఒకరైన గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ. ఈ సినిమా అంగీకరించిన సందర్భంగా తన ఆటోబయోగ్రఫీ బుక్ ‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్’ని నీలిమకు బహమతిగా ఇచ్చి, ‘‘డియర్ నీలిమ. ఈ ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసినందుకు «థ్యాంక్స్. నిన్ను నా సోదరిలా భావిస్తున్నాను. నీకు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కబీర్ బేడి. ‘‘థ్యాంక్యూ సార్. మీతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు నీలిమ. ఈ చిత్రానికి ‘దిల్’ రాజు ఓ నిర్మాత. Thank you so much @iKabirBedi Sir, such a privilege to work with you. Can’t wait to read this. #StoriesIMustTell #KabirBediSir #Shaakuntalam pic.twitter.com/1zxfo2eSSd — Neelima Guna (@neelima_guna) August 5, 2021 -
శాకుంతలంలో అల్లు అర్హ: ఫుల్ ఖుషీలో బన్నీ
Allu Arha In Shakuntalam: ఇండస్ట్రీలో తొలి సినిమా ఎంతో ప్రత్యేకం. కెరీర్‌కు పునాది వేసే మొదటి సినిమాకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు సెలబ్రిటీలు. అంతేకాదు, వెండితెరపై వారి పిల్లల ఎంట్రీ కూడా ఘనంగా ఉండేలా చూసుకుంటారు. అందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అతీతం కాదు. తన గారాలపట్టి అర్హ సినీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేశాడు. అది కూడా బడా హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శాకుంతలం' సినిమా ద్వారా ఆమెను నటిగా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. అయితే తన క్యూట్, స్వీట్, అల్లరి చేష్టలతో అర్హ ఈపాటికే తెలుగు ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది. మరి ఇప్పుడు ఏకంగా నటించే చాన్స్ వచ్చిందంటే జనాలను ఏ రేంజ్లో అలరిస్తుందో చూడాలంటున్నారు అభిమానులు. తన కూతురి సినీ ఎంట్రీ సమంత సినిమా ద్వారా జరుగుతుండంపై హర్షం వ్యక్తం చేశాడు బన్నీ. 'సమంతతో వైవిధ్యమైన జర్నీ కొనసాగించాను. ఆమె సినిమా ద్వారా అల్లు అర్హ నటిగా పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. శాకుంతలం సినిమా టీమ్‌కు ఇవే నా అభినందనలు' అంటూ ట్వీట్ చేశాడు. ఇక అల్లువారి చిట్టితల్లి బిగ్స్క్రీన్పై సందడి చేయబోతుందని తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. సమంత, అర్హను ఒకే స్క్రీన్ మీద చూడబోతున్నామని తెగ ఎగ్జైట్ అవుతున్నారు. I had an altogether different journey with @Samanthaprabhu2 and am happy to watch Arha debut with her movie. My best wishes to the entire Cast & Crew of #Shakuntalam — Allu Arjun (@alluarjun) July 15, 2021 పీరియాడికల్ మూవీ శాకుంతలం విషయానికి వస్తే ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. దుష్యంతుడు- శకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతల పాత్రలో సమంత, గుణశేఖర్ పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం సమంత నాలుగు నెలలపాటు క్లాసికల్ డ్యాన్సులు కూడా నేర్చుకుంది. శాకుంతలం కొడుకు భరత్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ లేదా అల్లు అర్జున్ కొడుకు అయాన్లలో ఎవరో ఒకరు నటించేలా ఒప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారట! ఈ సినిమాను 'దిల్' రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై గుణశేఖర్ కుమార్తె నీలిమ నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
Shakuntalam: సమంత ఫస్ట్‌లుక్‌పై క్రేజీ అప్డేట్
సమంత హీరోయిన్గా నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. లాక్డౌన్ సమయంలోనే సెకండ్ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్స్‌ని తిర్చిదిద్దారు. ప్రస్తుతం అందులోనే షూటింగ్ జరుగుతోంది. ‘దిల్’ రాజు, నీలిమా గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. The second schedule of #Shaakuntalam begins🐎#EpicLoveStory 🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @DilRajuProdctns @GunaaTeamworks pic.twitter.com/YwGYmFzSkt — Gunaa Teamworks (@GunaaTeamworks) June 28, 2021 ఇదిలా ఉంటే.. శాకుంతలం సినిమా మీద సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. సమంత ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిర్మాత నీలిమా గుణ స్పందించారు. ఇప్పుడే రెండో షెడ్యూల్ ప్రారంభించామని, ఫస్ట్‌లుక్ కోసం కొంత సమయం పడుతుందని ట్వీట్ చేశారు. Been getting so many such tweets guys, thank you so much for the love 🤍 but you’ve got to wait a little longer.. we’ve just started our second schedule today, keep the love & support coming ✨🤍 https://t.co/PXJL84NwpN — Neelima Guna (@neelima_guna) June 28, 2021 చదవండి: ఎదుటివారిని ఎంత ప్రేమిస్తున్నారో చెప్పేయండి: అనుష్క -
సమంతకు కొడుకుగా నటించేది ఈ స్టార్ హీరో తనయుడే!
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి పీరియాడికల్ చిత్రం "శాకుంతలం". దుష్యంతుడు- శకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతల పాత్రలో సమంత, గుణశేఖర్ పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం సమంత నాలుగు నెలలపాటు క్లాసికల్ డ్యాన్సులు కూడా నేర్చుకుంది. ఇదిలా వుంటే శాకుంతలంలో సమంత కొడుకు పాత్రలో ఎవరు నటించనున్నారు? అనేదానిపై ఫిల్మీదునియాలో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. శాకుంతలం కొడుకు భరత్ పాత్ర కోసం స్టార్ హీరోల కొడుకులను సంప్రదిస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ లేదా అల్లు అర్జున్ కొడుకు అయాన్లలో ఎవరో ఒకరిని శాకుంతలం సినిమాకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ముందుగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఈ విషయమై సంప్రదించనున్నాడట గుణశేఖర్. ఒకవేళ అభయ్ రామ్ కాదంటే భార్గవ్ రామ్‌తో అయినా ఆ పాత్ర చేయించమని ఎన్టీఆర్‌ను రిక్వెస్ట్ చేస్తాడట. కుదరదంటే అప్పుడు బన్నీ దగ్గరికెళ్లి అతడి కొడుకును భరత్ పాత్ర కోసం ఒప్పించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ చర్చలు ఎంతవరకు వెళ్తాయి? సమంతకు కొడుకుగా ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! ఇదిలా వుంటే శాకుంతలం చిత్రాన్ని 'దిల్' రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై గుణశేఖర్ కుమార్తె నీలిమ నిర్మిస్తోంది.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. చదవండి: నా స్థాయిని మించి శాకుంతలం బడ్జెట్: సమంత ఈ స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? -
కరోనా కలకలం: దిల్ రాజు ఎంత పనిచేశావ్..
హిందీలో లాగానే తెలుగు చిత్రసీమలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల నిర్మాత అల్లు అరవింద్, రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు త్రివ్రికమ్, హీరోయిన్ నివేదా థామస్‌లు కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకులు గుణశేఖర్, వి.ఎన్ .ఆదిత్య పేర్లు చేరాయి. ‘దిల్’ రాజుకు కరోనా లక్షణాలు లేవు. కానీ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. ‘శాకుంతలం’ దర్శకుడు గుణశేఖర్‌కు సైతం కరోనా పాజిటివ్ అని సోమవారం పొద్దు పోయాక తెలిసింది. గతవారం ఓ స్టూడియోలో పవన్‌కల్యాణ్ – హరీశ్ శంకర్ కొత్త చిత్రం ఫోటోషూట్ జరుగుతుంటే, అక్కడకు వెళ్ళి పవన్‌కల్యాణ్‌ను రాజు కలిశారు. ఆ పక్కనే స్వీయ సమర్పణలో షూటింగ్ జరుగుతున్న ‘శాకుంతలం’ సెట్స్‌కు కూడా వెళ్ళి వచ్చారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే పవన్ కల్యాణ్ హోమ్ క్వారంటైన్లోకి వెళ్ళారు. ఆలస్యంగా పాజిటివ్ అయిన గుణశేఖర్ కూడా క్వారంటైన్ బాట పట్టారు. దాంతో, ‘శాకుంతలం’ షూటింగ్ కొన్నాళ్ళు ఆగనుంది. మరోపక్క ఈ నెల 23న రిలీజు కావాల్సిన నాని ‘టక్ జగదీశ్’ సైతం తెలుగు నేలపై కరోనా కలకలంతో వాయిదా పడింది. -
సెట్స్‌లో జాయిన అయిన దుష్యంతుడు
తెలుగులో తన కొత్త ప్రయణాన్ని మొదలుపెట్టారు మలయాళ నటుడు దేవ్ మోహన్. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శకుంతలగా సమంత, దుష్యుంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు. ‘దిల్ ’రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం ‘శాకుంతలం’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు దేవ్ మోహన్ . ఈ సినిమా 2022లో విడుదల కానుంది. చదవండి: ఓటీటీలో జాతిరత్నాలు: మీరనుకునే డేట్ కాదు! ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్ -
ఈ సినిమా కోసం 4 నెలలుగా కష్టపడుతున్న సమంత
‘‘పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీలో రాజకుమారి పాత్ర చేయాలన్న ఆకాంక్ష ‘శాకుంతలం’ సినిమాతో నెరవేరుతోంది. శకుంతల పాత్ర చేయడాన్ని గొప్ప బహుమతిగా భావిస్తున్నా. ఈ చిత్ర బడ్జెట్ నా స్థాయిని మించినది. దాన్ని నిలుపుకొనేందుకు వంద శాతం కష్టపడతా’’ అన్నారు సమంత. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ‘దిల్’ రాజు సమర్పణలో డీఆర్పీ – గుణా టీమ్‌వర్క్స్‌పై గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోమవారం సినిమా ప్రారంభమైంది. తొలి సీన్‌కి ‘దిల్’ రాజు కెమెరా స్విచాఫ్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఎంత బడ్జెట్ అయినా ఖర్చుపెట్టండి మీ వెనక నేను ఉన్నాను అన్నారు ‘దిల్’ రాజు. శకుంతలను తనలో చూసుకుని ఎంతైనా కష్టపడాలని నాలుగు నెలలుగా క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకుంటున్నారు సమంత. దుష్యంతుడిగా మలయాళ యాక్టర్ దేవ్ మోహన్‌ను నీలిమ సెలక్ట్ చేసింది’’ అన్నారు. ‘‘2022లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు ‘దిల్’ రాజు. ఆయన కుమార్తె హన్షిత పాల్గొన్నారు. చదవండి: అమీర్ ఖాన్ నిర్ణయానికి అభిమానులు హర్టయ్యారు.. ఆసభ్యకరమైన పోస్ట్ షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ -
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే..
గుణశేఖర్ ‘శాకుంతలం’ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి ఇందులో శకుంతల పాత్రకు ఎవర్ని తీసుకుంటారు? అనే చర్చ చాన్నాళ్లు నడిచింది. ఫైనల్లీ శకుంతలగా సమంత చేయనున్నారని గుణ అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించడంతో... ఆ తర్వాత చర్చ అంతా దుష్యంతుడి పాత్ర చుట్టూ తిరిగింది. శనివారం ఈ చర్చకు కూడా ఫుల్స్టాప్ పడింది. ఈ పాత్రకు మలయాళ నటుడు దేవ్ మోహన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇతిహాసంలో దుష్యంత మహారాజు, శకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు గుణశేఖర్. భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేయిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రేమకావ్యం త్వరలో సెట్స్‌కి మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
సమంతకు నో చెప్పిన ఈషా.. కారణం ఇదేనా!
తెలుగు బ్యూటీ అయిన ఈషా రెబ్బకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలానే ఉంది. చేసింది కొన్ని సినిమాలే అయినా కావాల్సిన అభిమామాన్ని కూడగట్టుకుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఫాన్స్‌ను ఫిదా చేస్తోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘పిట్టకథలు’ చిత్రంలో ఈషా నటించిన విషయం తెలిసిందే. అయితే బందిపోటు, అమీ తుమీ, ఆ, రాగల 24 గంటల్లో వంటి మంచి సినిమాల్లో నటించినా ఈ భామకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. అంతేగాక పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు వచ్చిన దాఖలూ లేవు. కానీ ప్రస్తుతం ఓ భారీ సినిమా నుంచి వచ్చిన అవకాశాన్ని ఈషా కాదనుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తాజాగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఈషా రెబ్బాను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఇందుకు ఈ చిన్నది నో చెప్పినట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ కారణంగా సినిమా నుంచి తప్పుకున్నట్లు వినికిడి. ఈషాకు తక్కువ పారితోషికం ఆఫర్ చేయడం వల్ల శాకుంతలంలో భాగం కావడం ఇష్టం లేదని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాగా గుణ శేఖర్ శాకుంతలం కథ మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకోనున్నారు. ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను చూపించనున్నాడు గుణశేఖర్. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిచనున్నారు. చదవండి: హైదరాబాద్ రోడ్లపై దర్శనమిచ్చిన అల్లు అర్జున్ ప్రతిరోజూ మొదటి రోజే: సమంత కాజల్ డ్రెస్‌పై కామెంట్ చేసిన సమంత