![Samantha Cried After Director Gunasekhar Speech At Shakuntalam Event - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/9/samantha_650x400.jpg.webp?itok=azIvs_0V)
శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సమంత కన్నీళ్లు పెట్టుకుంది. డైరెక్టర్ గుణశేఖర్ ఆమె గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు నిజమైన హీరో సమంత అని ప్రశంసించాడు. దీంతో ఎమోషనల్ అయిన సామ్ కంటతడి పెట్టింది. కాగా తనకు మయోసైటిస్ వ్యాధి ఉందని చెప్పిన తర్వాత సామ్ తొలిసారి ఇలా మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నాకు సినిమాపై ఉన్న ప్రేమ, సినిమాకు నామీదున్న ప్రేమ తగ్గలేదని పేర్కొంది.
''గుణశేఖర్ ప్రాణం పెట్టి తీశారు. ఈ కథ విన్నప్పుడు మేం ఊహించుకున్నట్లు రావాలి అనుకున్నాం. సినిమా చూసిన తర్వాత అంతకు మించి ఉంది అనేలా ప్రతిఒక్కరికి అనిపిస్తుంది. ఇండియన్ హిస్టరీ లో కాళిదాసు రాసిన శకుంతల పాత్ర నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. లైఫ్‌లో ఎన్ని ఫేస్ చేసినా సినిమాను ప్రేమిస్తూనే ఉంటాను'' అంటూ సమంత మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
We're with you sam 🤍🥺 be strong@Samanthaprabhu2#SamanthaRuthPrabhupic.twitter.com/sDjC9r9dBR
— Jegan (@JeganSammu) January 9, 2023
Comments
Please login to add a commentAdd a comment