Did Samantha Reacts To Shaakuntalam Failure With Bhagavad Gita Sloka, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha :శాకుంతలం డిజాస్టర్‌పై తొలిసారి స్పందించిన సమంత.. పోస్ట్‌ వైరల్‌

Published Tue, Apr 18 2023 3:07 PM | Last Updated on Tue, Apr 18 2023 3:31 PM

Did Samantha Reacts To Shaakuntalam Failure With Bhagavad Gita Sloka - Sakshi

సమంత ప్రధాన పాత్రలో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా శాకుంతలం. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇందులో దుష్యంతుడిగా నటించారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సమంత స్టార్‌ ఇమేజ్‌తో బాక్సాఫీస్‌ వద్ద మంచి ఓపెనింగ్స్‌ వస్తాయనుకుంటే శాకుంతలం విషయంలో ఇది వర్కవుట్‌ కాలేదు.

తొలిరోజు నుంచే నెగిటివ్‌ టాక్‌తో ఈ సినిమాకు దారుణంగా కలెక్షన్స్‌ పడిపోయాయి. ప్రమోషన్స్‌తో బాగా హైప్‌ క్రియేట్‌ చేసినా సినిమా రిజల్ట్‌ మొత్తం తలకిందులయ్యింది. క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు సినిమాలోని వీఎఫ్ఎక్స్‌, శకుంతల, దుష్యంతుల కెమిస్ట్రీ, డబ్బింగ్‌.. ఇలా పలు విషయాల్లో శాకుంతలం విమర్శలను ఎదుర్కొంటుంది. వీకెండ్‌ కలెక్షన్స్‌ కూడా దారుణంగా పడిపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో 'శాకుంతలం' రిజల్ట్‌ చూసి సమంత డిప్రెషన్‌లోకి వెళ్లిందని బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు చేసిన ట్వీట్‌ నెట్టింట దుమారం రేపుతోంది. ఈ క్రమంలో  శాకుంతలం మూవీ రిజల్ట్‌పై సమంత ఇన్‌డైరెక్ట్‌గా స్పందించింది. భ‌గ‌వ‌ద్గీత‌లోని..'కర్మణ్యే వాధికా రాస్తేమా ఫాలేషు కదాచన మా కర్మ ఫల హే తుర్ భూః మా తే సంగోత్స్వ కర్మణి..' అనే శ్లోకాన్ని పోస్ట్‌చేసింది.

అంటే..'కర్మ ఫలితం మన చేతుల్లో ఉండదు. ప్రయత్నం చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. దాని ఫలితం ఏమిటనేది మనం నిర్ణయించలేము. ఫలితాలకు భయపడి ప్రయత్నం చేయడం మానరాదు. ఏదేమైనా ముందుకు సాగిపోవాలి' అని ఈ శ్లోకం అర్థం. ప్రస్తుతం సమంత షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement