Gunasekhar
-
రెండు దశాబ్దాల తర్వాత...
మహేశ్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘ఒక్కడు’ (2003) సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు భూమిక. కాగా 20 ఏళ్ల తర్వాత మళ్లీ గుణశేఖర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు భూమిక. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘యుఫోరియా’ చిత్రంలో భూమిక ఓ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ప్రారంభమైంది. ఈ సందర్భంగా సెట్స్ నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘వైవిధ్యమైన, హిట్ సినిమాలకు పెట్టింది పేరైన గుణశేఖర్ ప్రస్తుతం యూత్‌ఫుల్ సోషల్ డ్రామాగా ‘యుఫోరియా’ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దురాగతాలపై ఈ చిత్రం రూపొందుతోంది. భూమిక కోసం గుణశేఖర్ ఓ పవర్ఫుల్ పాత్రను సృష్టించారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె. పోతన్, సంగీతం: కాల భైరవ. -
గుణశేఖర్ 'వరల్డ్ ఆఫ్ యుఫోరియా' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ కిక్కు వేరేలా ఉంటుంది: ‘దిల్’ రాజు
‘‘గుణశేఖర్‌గారి మొదటి చిత్రం ‘లాఠీ’ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆయన ఎన్నో విజయాలు, పరాజయాలు చూశారు. ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చే సక్సెస్, ఆ విజయం ఇచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. కొత్తవాళ్లతో ఆయన తీస్తున్న ‘యుఫోరియా’ మూవీ పెద్ద హిట్ అవ్వాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రల్లో, నటి భూమిక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్రం గ్లింప్స్‌ను నిర్మాతలు ‘దిల్’ రాజు, కేఎల్ దామోదర ప్రసాద్ విడుదల చేశారు.ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి. వాటి స్ఫూర్తితో ‘యుఫోరియా’ కథ అనుకున్నాను. ఈ కథని నా కుమార్తె నీలిమకు చెబితే.. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉందని చెప్పింది. యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాలో తొంభై శాతం కొత్త వాళ్లే కనిపిస్తారు. ఇప్పటి వరకు అరవై శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అని తెలిపారు. ‘‘చక్కగా తెలుగు మాట్లాడే వాళ్లని, థియేటర్ ఆర్టిస్టుల్ని ఈ సినిమాకు తీసుకున్నాం’’ అన్నారు నీలిమ గుణ. ‘‘గుణశేఖర్‌గారి దర్శకత్వంలో ‘యుఫోరియా’ లాంటి మంచి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని విఘ్నేష్, శ్రీనిక రెడ్డి, పృథ్వీ రాజ్, లిఖిత చెప్పారు. -
గుణశేఖర్ 'యుఫోరియా' గ్లింప్స్.. ఈసారి కొత్తగా ప్లాన్ చేశాడుగా!
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ రూటు మార్చాడు. ఈసారి భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా సింపుల్‌గా ఉండేలా యూత్‌కు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. 'వరల్డ్ ఆఫ్ యుఫోరియా' సినిమా తెరకెక్కించాడు. ఇందులో భూమిక ప్రధాన పాత్రలో నటించగా సారా అర్జున్, నాజర్, రోహిత్, పృథ్వీరాజ్, లిఖిత కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.గ్లింప్స్‌లో డ్రగ్స్, అత్యాచారం వంటి సీరియస్ అంశాలను చూపించారు. ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించాడు. చాలా రోజుల తర్వాత హిట్ కోసం ఆరాటపడుతున్న గుణశేఖర్‌కు యుఫోరియా తిరిగి సక్సెస్‌ను ఇచ్చేట్లు కనిపిస్తోంది. నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీన్ కె పోతన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. -
యూత్ ఫుల్ మూవీస్ తో సీనియర్ డైరెక్టర్స్..
-
ఆ జానర్ వదిలేసిన గుణశేఖర్.. అలాంటి కథతో కొత్త మూవీ
గుణశేఖర్ పేరు చెప్పగానే పెద్ద సెట్స్‌తో తీసే భారీ సినిమాలే గుర్తొస్తాయి. ఈయన గత రెండు సినిమాలు ఇలాంటివే. వాటితో ఘోరమైన నష్టాల్ని చవిచూసిన ఈయన ఇప్పుడు రూట్ మార్చాడు. యూత్‌ఫుల్ సోషల్ డ్రామా కథతో కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. దీనికి 'యుఫోరియా' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)'ఒక్కడు' లాంటి మూవీతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు గుణశేఖర్.. ఆ తర్వాత ట్రెండ్‌కి తగ్గ సినిమాలు తీయడంలో పూర్తిగా తడబడ్డాడు. మహేశ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి హీరోలు అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సరిగా వినియోగించుకోలేకపోయాడు. 2015లో 'రుద్రమదేవి' అనే పీరియాడికల్ మూవీతో పాస్ మార్కులు వేయించుకున్నారు. ఇదొచ్చిన ఏడేళ్ల తర్వాత అంటే గతేడాది 'శాకుంతలం'తో వచ్చారు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫలితం అందుకుంది.మధ్యలో రానాతో చేయాల్సిన 'హిరణ్యకశ్యప' వివాదంలో చిక్కుకుంది. ఇలా పలు సమస్యలు ఎదుర్కొన్న గుణశేఖర్.. ఇప్పుడు తనకు అలవాటైన భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా సింపుల్‌గా ఉండే యూత్‌ఫుల్ డ్రామా తీయాలని ఫిక్సయ్యారు. ఇందులో భాగంగానే 'యుఫోరియా' మూవీని ప్రకటించారు. త్వరలో షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఇందులో ఎవరెవరు నటిస్తారనేది మాత్రం ఇంకా చెప్పలేదు. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే ప్రముఖ నటి విడాకులు? అసలు విషయం ఇది) View this post on Instagram A post shared by Guna Handmade Films (@gunahandmadefilms) -
సత్తా చాటిన సమంత 'శాకుంతలం'.. ఏకంగా నాలుగు అవార్డులు!
సమంత, దేవ్ మోహన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రేక్షకులు ఆశించినంత స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. (ఇది చదవండి: NTR ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్: ఆర్జీవీ) అయితే అభిమానులను మెప్పించలేకపోయిన ఈ సినిమాకు అవార్డులు మాత్రం క్యూ కడుతున్నాయి. సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయిన ఈ మూవీకి గతంలో న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్- 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్‌గా,బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్‌గా అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: హీరోల కోసం హీరోయిన్లను వెయిట్ చేయించేవారు: ఆదాశర్మ) తాజాగా ఫ్రాన్స్‌లో కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ అవార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమాకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో సత్తా చాటింది. ఈ విషయాన్ని గుణటీమ్ వర్క్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే దీనిపై నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా.. మరికొందరేమో ఈ సినిమాకు ఎవరు ఇచ్చారు? అంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కాగా థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే శాకుంతలం సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Gunaa Teamworks (@gunaa_teamworks) -
'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్
సమంత ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అందరి అంచనాలు తలకిందలు చేస్తూ భారీ ఫ్లాఫ్గా నిలిచింది. దీంతో నిర్మాతలను ఊహించని విధంగా నష్టాలపాలు చేసింది శాకుంతలం. మరోవైపు ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నట్లు నిర్మాణ సంస్థ గుణ టీమ్ వర్క్స్ తెలిపింది. చదవండి: అనారోగ్యం బారిన పడిన బిగ్‌బాస్ బ్యూటీ అరియానా న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్‌గా,బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్‌గా శాకుంతలం అవార్డులను గెలుచుకున్నట్లు మేకర్స్ ప్రకటించగా, ఫ్లాప్ సినిమాకు కూడా ఇన్ని అవార్డులు ఇస్తారా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కాగా థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే శాకుంతలం సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. Our team is overwhelmed to have been honored with these prestigious Global Awards ✨ Thank you for this incredible recognition 🙏#Shaakuntalam streaming now on @PrimeVideoIN. https://t.co/obv3N5qKUw@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna… pic.twitter.com/2EjTVaOlLO — Gunaa Teamworks (@GunaaTeamworks) May 11, 2023 -
ఓటీటీలోకి సమంత 'శాకుంతలం'.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే..
సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. సుమారు 60కోట్లతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. చదవండి: అందుకే విడాకులు తీసుకున్నా, సమంత సంతోషంగా ఉండాలి: చై విడుదలైన తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో శకుంతలగా సమంత నటించగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించాడు. ఈ సినిమాతోనే అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్‌గా డెబ్యూ ఇచ్చింది. సినిమాకు ముందు భారీ హైప్ క్రియేట్ అయినా కథ, గ్రాఫిక్స్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈనెల 12న శాకుంతలం సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి -
ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది: మధుబాల
మధు అంటే సినీఇండస్ట్రీలో పెద్దగా గుర్తు పట్టరేమో కానీ.. మధుబాల అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఆమె అసలు పేరు మధు అయితే సినిమాల్లోకి వచ్చాక మధుబాలగా మార్చుకుంది. ఆమెకు అంతలా పేరు తీసుకొచ్చిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా' మూవీనే. ఆమె ఒట్టయల్ పట్టాలమ్ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో మధుబాల నటించింది. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ మేనక పాత్రలో నటించింది. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఆశించినా ఫలితాన్ని అందుకోలేకపోయింది. తాజాగా శాకుంతలం సినిమాపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించకపోవడంపై ఆమె తొలిసారి స్పందించారు. (ఇది చదవండి: సిల్క్ స్మిత సూసైడ్... ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైక హీరో అతనే!) మధుబాల మాట్లాడుతూ.. 'కష్టపడి పనిచేసినప్పటికీ శాకుంతలం విజయం సాధించకపోవడం ఎంతగానో బాధపెట్టింది. సినిమా పూర్తయిన తర్వాత ఒక ఏడాది సీజీఐ కోసమే వర్క్ చేశారు. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇవ్వాలనుకున్నారు. షూటింగ్లో నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌పై ఎలాంటి ఒత్తిడి పెంచలేదు. టాలీవుడ్ చిత్రాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ గొప్ప విజయాలు సాధించాయి. వాటి విజయాలకు సరైన కారణం అంటూ ఏదీ లేదు. అవీ ఎలా హిట్ అయ్యాయో అర్ధం కావట్లేదు. మా సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంతగా నిరాశ పరుస్తుందని మేం అనుకోలేదు.' అని అన్నారు. కాగా.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేయాలనుంది: హాలీవుడ్ టాప్ డైరెక్టర్) -
సమంత డిప్రెషన్లోకి వెళ్లిపోయిందా? నెట్టింట పోస్ట్ వైరల్
సమంత ప్రధాన పాత్రలో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇందులో దుష్యంతుడిగా నటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సమంత స్టార్ ఇమేజ్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వస్తాయనుకుంటే శాకుంతలం విషయంలో ఇది వర్కవుట్ కాలేదు. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ఈ సినిమాకు దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయి. ప్రమోషన్స్‌తో బాగా హైప్ క్రియేట్ చేసినా సినిమా రిజల్ట్ మొత్తం తలకిందులయ్యింది. కథ, కథనాలతో పాటు సినిమాలోని వీఎఫ్ఎక్స్, శకుంతల, దుష్యంతుల కెమిస్ట్రీ, డబ్బింగ్.. ఇలా పలు విషయాల్లో శాకుంతలం విమర్శలను ఎదుర్కొంటుంది. వీకెండ్ కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో 'శాకుంతలం' రిజల్ట్ చూసి సమంత డిప్రెషన్లోకి వెళ్లిందని బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది. ఈ క్రమంలో శాకుంతలం మూవీ రిజల్ట్‌పై సమంత ఇన్‌డైరెక్ట్‌గా స్పందించింది. భగవద్గీతలోని..'కర్మణ్యే వాధికా రాస్తేమా ఫాలేషు కదాచన మా కర్మ ఫల హే తుర్ భూః మా తే సంగోత్స్వ కర్మణి..' అనే శ్లోకాన్ని పోస్ట్చేసింది. అంటే..'కర్మ ఫలితం మన చేతుల్లో ఉండదు. ప్రయత్నం చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. దాని ఫలితం ఏమిటనేది మనం నిర్ణయించలేము. ఫలితాలకు భయపడి ప్రయత్నం చేయడం మానరాదు. ఏదేమైనా ముందుకు సాగిపోవాలి' అని ఈ శ్లోకం అర్థం. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అప్పుడే ఓటీటీలో శాకుంతలం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే..
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నీలిమ గుణ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ అలరించగా భరతుడిగా అల్లు అర్హ నటించింది. మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. రిలీజ్‌కు ముందు భారీ బజ్ క్రియేట్ అయినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర ఈ చిత్రం రాణించలేకపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే శాకుంతలం ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే చర్చ నడుస్తుంది. సినీ వర్గాల సమచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. భారీ ధరకే ఓటీటీకి విక్రయించినట్లు తెలుస్తుంది. ‘శాకుంతలం’ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత అంటే మే మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. -
సమంత 'శాకుంతలం' సినిమా స్టిల్స్ చూశారా? (ఫోటోలు)
-
Shaakuntalam Review: ‘శాకుంతలం’ మూవీ రివ్యూ
టైటిల్: శాకుంతలం నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్‌బాబు, అదితి బాలన్, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి, అల్లు అర్హ తదితరులు నిర్మాణ సంస్థ: గుణ టీమ్‌వర్స్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు : నీలిమా గుణ దర్శకత్వం: గుణశేఖర్ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్ ఎడిటర్ : ప్రవీణ్ పూడి విడుదల తేది: ఏప్రిల్ 14, 2023 కథేంటంటే.. విశ్వామిత్రుడు చేస్తున్న తపస్సుని భంగం చేయమని మేనక(మధుబాల)ను భూలోకానికి పంపిస్తాడు ఇంద్రుడు. అనుకున్నట్లే తన అందచందాలతో మేనక.. విశ్వామిత్రుని తప్పస్సుకి భంగం కలిగిస్తుంది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగాను కలుస్తారు. ఫలితంగా మేనక ఓ ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఓ మనిషి వల్ల పుట్టిన బిడ్డకి దేవలోకంలో ప్రవేశం లేకపోవడంతో ఆ చిన్నారిని భూలోకంలోనే వదిలి వెళ్లిపోతుంది మేనక. ఆ చిన్నారిని ఓ పక్షుల గుంపు మాలినీ నది తీరాన ఉన్న కణ్వ మహర్షి(సచిన్ ఖడేకర్) ఆశ్రమానికి తరలిస్తాయి. ఆమెకు శకుంతల(సమంత) అని పేరుపెట్టి కన్న బిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు కణ్వ మహర్షి. ఒకరోజు దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) కణ్వాశ్రమానికి వెళ్తాడు. అక్కడ శకుంతలను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. శకుంతల కూడా దుష్యంత మహారాజుని ప్రేమిస్తుంది. గాంధర్వ వివాహంతో ఇద్దరూ ఒక్కటవుతారు. ఆ తర్వాత వీరిద్దరి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవేంటి? గర్భిణీగా ఉన్న శకుంతలకు దుష్యంత రాజ్యంలో జరిగిన అవమానం ఏంటి? శకుంతల గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రి కాదని దుష్యంతుడు ఎందుకు చెప్పాడు? శకుంతల, దుష్యంతుడు విడిపోవడానికి దుర్వాస మహాముని(మోహన్ బాబు) ఎలా కారణమయ్యాడు? గర్భవతిగా ఉన్న సమయంలో శకుంతల పడిన బాధలేంటి? ఆమెకు పుట్టిన బిడ్డ ఎక్కడ పెరిగాడు? తిరిగి వీరిద్దరు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు గుణశేఖర్. ఇదొక అందమైన ప్రేమ కావ్యమని అందరికి తెలిసిందే. చాలామందికి తెలిసిన కథ. ఇలాంటి కథలకు తెరరూపం ఇవ్వడం అంటే కత్తిమీద సాములాంటిదే. ప్రేక్షకులను మైమరిపించేలా విజువల్ ఎఫెక్స్, గ్రాఫిక్స్ ఉండాలి. కానీ ఈ విషయంలో గుణశేఖర్ టీమ్ దారుణంగా ఫేలయింది. నాసిరకమైన త్రీడీ హంగులతో సీరియల్‌కి ఎక్కువ సినిమాకు తక్కువ అన్నట్లుగా శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇప్పటికీ మహాభారతం చదవకపోయినా.. శకుంతల అంటే ఎవరో తెలియకపోయినా..ఈ సినిమా అర్థమవుతుంది. ఒక్కో విషయాన్ని చాలా నీట్‌గా, అందరికి అర్థమయ్యేలా వివరించారు. అయితే కథను కథలాగే చెప్పడం మైనస్. ఈ రోజుల్లో కథలో వేగం, బలమైన సంఘర్షణలు, ట్విస్టులు లేకపోతే.. ప్రేక్షకులు ఆదరించడం లేదు. వారిని రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేయడానికి బలమైన కథ ఉండాలి. లేదంటే మైమరిపించేలేలా సాంకేతిక హంగులద్దాలి. కానీ ఈ రెండూ శాకుంతలంలో మిస్ అయ్యాయి. కథ ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా అలా.. వెళ్తుంది. కానీ ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. ఆహా..ఓహో..అనిపించేలా ఒక్కటంటే.. ఒక్క సన్నివేశం ఉండదు. ఫస్టాఫ్ మొత్తం విషయానికిస్తే.. పసిపాప శకుంతలను పక్షులు ఎత్తుకెళ్లి కణ్వాశ్రమంలో వదిలేయడం.. కణ్వ మహర్షి పెంచి పెద్ద చేయడం.. అక్కడి పక్షులు, జంతువులతో శకుంతలకు ఉన్న అనుబంధం.. దుష్యంతుడితో ప్రేమాయణం.. ఇలా సాగుతుంది. ఒక చిన్న ట్వీస్ట్‌తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లో సాగుతుంది. దుష్యంతుడి రాజ్యానికి శకుంతల వెళ్లడం.. ఆమెకు అవమానం జరగడం.. రాజ్యంలోని మనుషులు రాళ్లతో కొట్టడం..ఆమె అక్కడి నుంచి పారిపోవడం..ఇలా చాలా సంఘటనలు సెకండాఫ్‌లో జరుగుతాయి. ఫస్టాఫ్‌లో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. శకుంతల, దుష్యంతుడు లవ్‌స్టోరీ అంతగా ఆకట్టుకోదు. అలాగే వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ పండేందుకు బలమైన సీన్స్ కూడా ఉండవు. యుద్ధ సన్నివేశాలు సైతం అంత్యంత పేలవంగా సాగుతాయి. చాలా చోట్ల ఇది గ్రాఫిక్స్ అనే విషయం ఈజీగా తెలిసిపోతాయి. ఇక క్లైమాక్స్‌లో భరతుడిగా అల్లు అర్హ ఎంట్రీ అదిరిపోతుంది. దుష్యంతుడితో ఆమె చేసే వాదనలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే.. శకుంతల పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది సమంత. ప్రేమికురాలిగా, భర్తకు దూరమైన భార్యగా ఇలా డిఫెరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రలో ఆమె చక్కగా నటించింది. కానీ ఆమె డబ్బింగ్ మాత్రం పెద్ద మైనస్. ఇక దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ బాగానే సెట్ అయ్యాడు కానీ.. నటన పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆయన స్థానంలో టాలీవుడ్‌కి పరిచయం ఉన్న నటుడిని తీసుకుంటే బాగుండేమో. ఓ స్టార్ హీరోని పెడితే ఇంకా బాగుండేది. ఎందుకంటే సమంతతో సమానంగా ఆ పాత్రకు స్క్రీన్ స్పేస్ ఉంది. అలాంటి పాత్రకు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని దేవ్ మోహన్ని ఎంచుకొని గుణ శేఖర్ పప్పులో కాలేశాడు. ఇక దుర్వాస మహర్షిగా మోహన్ బాబు బాగా సెట్ అయ్యాడు. ఆయన తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా.. ఆకట్టుకున్నాడు. మేనకగా మధుబాలను చూడడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ.. తన ముద్దు ముద్దు మాటలతో భరతుడి పాత్రకు న్యాయం చేసింది. తెలుగు డైలాగ్స్‌కి చక్కగా చెప్పింది. గౌతమి, అనన్యా నాగళ్ళ, జిష్షుసేన్ గుప్తా, శివ బాలాజీ, కబీర్ సింగ్, సచిన్ ఖడేకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు. గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ పూర్తిగా తేలిపోయింది. త్రీడీ అన్నారు కానీ.. ఆ ఫీలింగ్ పెద్దగా కలగదు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ విషయంలో మన తెలుగు హీరోలు మారాలి!
♦ ‘రుద్రమదేవి’ తర్వాత ‘హిరణ్య కశ్యప’ సినిమా స్క్రిప్్ట, ప్రీ ప్రొడక్షన్‌పై ఐదేళ్లు వర్క్ చేశాను. షూటింగ్ ఆరంభించే టైమ్‌లో కోవిడ్ వచ్చింది. దీంతో అప్పుడు మాతో కలిసి ఉన్న ఓ హాలీవుడ్ సంస్థ మరో వర్క్‌పై ఫోకస్ పెట్టింది. ఈ కారణంగా ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టాం. ♦లాక్డౌన్ టైమ్‌లో కొన్ని పురాణాలు, ఇతిహాసాల కలయికలో ఓ ప్రేమకథ చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాకు నచ్చింది. దాన్ని సోషలైజ్ చేయటమెందుకు.. అలాగే తీస్తే బెటర్ కదా అని ‘శాకుంతలం’ మొదలుపెట్టాను. సాధారణంగా శకుంతల అనగానే శృంగార శకుంతల గుర్తుకొచ్చేలా ఇప్పటివరకూ చూపించారు. కానీ, ఆమెలో అంతర్గతంగా చాలా శక్తి, ఆత్మాభిమానం ఉంటుందని ‘అభిజ్ఞాన శాకుంతలం’లో కాళిదాసు ప్రస్తావించారు. నేను కూడా శకుంతల లోని రెండో కోణంతో కథ అల్లుకుని, ‘శాకుంతలం’ తీశాను. ♦ తన ఆత్మాభిమానం కోసం అప్పట్లో రాజు, రాజ్యాలను శకుంతల లెక్క చేయకుండా పోరాడి నిలబడింది. పెళ్లి కాకుండా తల్లి కావటం అనేది అప్పట్లో పెద్ద నేరం. అలాంటి పరిస్థితులను ఆమె ఎలా ఎదురొడ్డి నిలబడిందనేది ఈ చిత్రకథాంశం. ♦ సమంత చాలా మంచి నటి. అందుకే శకుంతల పాత్రలో రొమాంటిక్ యాంగిల్‌ను సెకండ్రీ చేశా. నటనకు ప్రాధాన్యం ఉండేలా చూపించాను. నేను, అరుణ బిక్షుగారు, సమంతగారు కలిసి మాట్లాడుకుని శకుంతల పాత్రను డిజైన్ చేశాం. సమంత కొత్త హీరోయిన్లా అరుణ బిక్షుగారి వద్ద శిక్షణ తీసుకుని నటించింది. ♦ ‘శాకుంతలం’లో దుర్వాస మహామునిగా మోహన్‌బాబుగారు నటించారు. ఆ పాత్రని ఆయన తప్ప మరొకరు చేయలేరు. ఆయన ఒప్పుకోకుంటే ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఆలోచనలో పడేవాణ్ణి. ♦ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. ఇలా బాలీవుడ్ స్టార్ హీరోలు అతిథి పాత్రలు చేస్తున్నారు. ఆ విషయంలో మన తెలుగు హీరోలు మారాలి. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్‌ది అతిథి పాత్ర అయినా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్రలో చాలా కోణాలుంటాయి. ఆ పాత్రని తెలుగు హీరోలు చేస్తారనే నమ్మకం నాకు కలగలేదు. అడిగి లేదనిపించుకోవటం ఇష్టం లేక వారిని సంప్రదించలేదు. దేవ్ మోహన్ ‘శాకుంతలం’ పూర్తయ్యే వరకు మరో సినిమా చేయనన్నాడు. అతనికి శిక్షణ ఇప్పించి దుష్యంతుడి పాత్ర చేయించుకున్నాను. -
‘శాకుంతలం’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ ఫోన్ చేయలేదు: సమంత
‘‘ఒకప్పుడు నా లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్స్ లేవు. సో.. నేను చాలా సింపుల్‌గా, హ్యాపీగా ఉన్నాను. కానీ నా జీవితంలో నేను కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరైనా తమ జీవితాల్లో స్ట్రగుల్స్‌ను ఫేస్ చేసినప్పుడు వారు స్ట్రాంగ్‌గా మారిపోతుంటారు. నేనూ అంతే. నన్ను నేను ప్రత్యేకం అనుకోవడం లేదు. అయితే నా జీవితంలో నాకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇవి నా జీవితాన్ని నాశనం చేయకూడదని అనుకుని, ఇందుకు తగ్గట్లుగా జీవితంలో ముందుకెళుతున్నాను’’ అని సమంత అన్నారు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’. ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత్ మహారాజుగా దేవ్‌మోహన్ నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సమంత మాట్లాడుతూ–‘‘శాకుంతలం’ పూర్తి కథ విన్నప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను. భారతీయ సాహిత్యంలో ఎంతోమంది ప్రేమించే శకుంతల పాత్రను పోషించడం నాకు పెద్ద బాధ్యతగా అనిపించింది. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్‌సిరీస్‌లో రాజీవంటి క్యారెక్టర్ చేసిన నేను వెంటనే శకుంతల పాత్ర చేయడానికి తొలుత భయపడి నో చెప్పాను. కానీ శకుంతల అంటే కేవలం అందమైన అమ్మాయి మాత్రమే కాదు.. హుందాతనం, ఆత్మగౌరవం కలిగిన యువతి కూడా. ఏ తరం అమ్మాయిలకైనా శకుంతల పాత్ర కనెక్ట్ అవుతుందని మళ్లీ ఆలోచించి ఒప్పుకున్నాను. తొలి సారిగా 3డీలో ‘శాకుంతలం’ ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. ఈ సినిమా కోసం గుణశేఖర్‌గారు మ్యాజికల్ వరల్డ్‌ను క్రియేట్ చేశారు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షూటింగ్స్‌కి రమ్మని ఎవరూ నాకు ఫోన్ చేయలేదు. ఈ విధంగా నాకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించింది’’ అన్నారు. ‘‘కథను నమ్మి ‘శాకుంతలం’ సినిమా తీశాం’’ అన్నారు గుణశేఖర్. ‘‘ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే గుణశేఖర్‌గారి ప్రయత్నంలో నేనూ భాగమవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ‘దిల్’ రాజు. -
నా జీవితం మారిందనుకోవట్లేదు.. అప్పటి వరకే నేను స్టార్‌ని: సమంత
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి శకుంతల, దుష్యంతుల అమర ప్రేమగాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ముంబయిలో నిర్వహించిన ప్రమోషన్లలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు సమంత. సమంత మాట్లాడుతూ.. 'నేను చిన్నప్పటి నుంచీ డిస్నీ జోనర్ సినిమాలను చాలా ఇష్టపడేదాన్ని. నేను ఆనందంగా ఉన్నా, బాధలో ఉన్నా వాటినే చూసేదాన్ని. ఈ సినిమాలో యువరాణిగా నటించడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. శాకుంతలం కథ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఆలోచించాను. కాస్త భయపడ్డా. కానీ, కొన్నేళ్లుగా సవాళ్లు స్వీకరించడం నాకు అలవాటైపోయింది. నా చిన్నతనంలో శకుంతల పాత్ర గురించి చాలా కలలు కనేదాన్ని. అమ్మాయిలు, మహిళలు, ఫ్యామిలీలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పాత్రలో నటిస్తున్నంత సేపు ఓ ప్రేక్షకురాలిగా నేను సినిమాను ఆస్వాదించా. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. నా దృష్టిలో దర్శకుడు గుణశేఖర్ ఫెమినిస్ట్. ఆయన ఫీమేల్ ఓరియంటెడ్ కథలు రాస్తారు. ' అని అన్నారు. అల్లు అర్జున్ గారాల పట్టి గురించి మాట్లాడుతూ.. 'నా దృష్టిలో అల్లు అర్హ స్వతంత్రురాలు. తనకు కావాల్సిన నిర్ణయాలు తానే తీసుకోగలదు. అర్హ కెరీర్ విషయంలో అల్లు అర్జున్ జోక్యం అవసరం లేదు. అర్హ కెరీర్లో ఇది అద్భుతమైన చిత్రం. అర్హ రోల్ చాలా అద్భుతంగా వచ్చింది. అందుకే పిల్లలు, ఫ్యామిలీస్ ఈ కథను ఆస్వాదిస్తారని నమ్ముతున్నా.' అని తెలిపింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాక జీవితం ఎలా మారింది? అని అడగ్గా సమంత సరదాగా స్పందించారు. తాను పాన్ ఇండియా స్టార్‌ననే విషయాన్ని తన పెంపుడు జంతువులకి ఎవరైనా చెబితే బాగుంటుందని అన్నారు. నేనింకా వాటి మలాన్ని ఎత్తిపోస్తున్నానంటూ నవ్వేశారు. నా జీవితం మారిందని నేను అనుకోలేదని.. కేవలం నేను ఆరు గంటల దాకానే స్టార్‌ని.. ఆ తర్వాత నా జీవితం చాలా సాదాసీదాగా ఉంటుందని సమంత అన్నారు. నేను చేస్తున్న పాత్రల విషయంలో చాలా ఆనందంగా ఉన్నానని..యాక్షన్ పాత్రలు కూడా చేస్తున్నట్లు వెల్లడించింది. ఫ్యామిలీమేన్2లో నేను చేసిన పాత్ర అలాంటిదేనని..ఎప్పుడూ అబలగానే కాదు.. సబలగా నటించాలని ఆమె అన్నారు. (ఇది చదవండి: శాకుంతలం నుంచి విడుదలైన 'మల్లికా' వీడియో సాంగ్) -
Shaakuntalam 2nd Trailer: మీ ప్రేమకు కూడా దూరమైతే!
‘లేడి కన్నులు.. నెమలి నడక.. సివంగి నడుము...’ అంటూ నటుడు దేవ్ మోహన్ డైలాగ్‌తో ‘శాకుంతలం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సమంత టైటిల్ రోల్లో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శాకుంతలం’. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ నెల 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ‘మనసెటు పోతే అటు పోరాదని ముని వాక్కు’, ‘పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను.. మీ ప్రేమకు కూడా దూరమైతే’ (సమంత), ‘నీ కష్టానికి కన్నీళ్లు పెట్టగలమే కానీ.. నీ కర్మను పంచుకోలేం’ (గౌతమి) వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, మధుబాల, గౌతమి, అదితీ బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, అడిషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: టబ్బీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: హేమాంబర్ జాస్తి, కొమ్మినేని వెంకటేశ్వరరావు, లైన్ ప్రొడ్యూసర్: యశ్వంత్. -
మోహన్‌బాబు నా ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడు: గుణశేఖర్
స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. సమంత టైటిల్ రోల్లో నటించింది. దుర్వాస మహర్షి పాత్రని సినియర్ హీరో మోహన్‌బాబు పోషించారు. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గుణ శేఖర్.. మోహన్‌బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుర్వాస మహర్షి పాత్రని మోహన్‌బాబు పోషించడం తన ఛాయిస్ కాదని, మహాకవి కాళిదాసు ఛాయిస్ అన్నారు. ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసేది మోహన్‌బాబు మాత్రమేనని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ‘శాకుంతలం కథ అనుకున్నాక.. దుర్వాస మహర్షి పాత్ర కోసం మోహన్‌బాబు తప్ప ఇంకెవరూ గుర్తుకురాలేదు. కానీ గతంలో ‘రుద్రమాదేవి’ కోసం ఓ పాత్ర చేయమని అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఈ సారి మాత్రం నో చెప్పలేని పాత్రతో వచ్చానని చెప్పా. ‘దుర్వాస మహర్షి పాత్ర మీరు మాత్రమే చేయాలి. ఒకవేళ మీరు చేయను అంటే ఇంకెవరు ఆ పాత్ర చేస్తే బాగుంటుందే మీరే చెప్పండి’ అని మోహన్‌బాబుని అడిగాను. ఆయన వెంటనే పెద్దగా నవ్వి ‘కోపిష్టి అని నా దగ్గరకు వచ్చావా? అని అడిగారు. దుర్వాసునిలో కోపం ఒక్కటే గుణం కాదు.. ఆయనో గొప్ప మహర్షి అని నేను బదులిచ్చా. దీంతో వెంటనే మోహన్ బాబు ఆ పాత్రని పోషించడానికి ఒప్పుకున్నారు’అని గుణ శేఖర్ అన్నారు. -
'శాకుంతలం' మూవీలో సమంతను అనుకోలేదు: గుణశేఖర్
సమంత తాజాగా నటించిన చిత్రం 'శాకుంతలం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో దర్శకుడు గుణశేఖర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాను తెరకెక్కించేందుకు మూడేళ్ల సమయం పట్టిందని తెలిపారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఈ చిత్రంలో శకుంతల పాత్రకు సమంతను ఎంపిక చేయలేదని అన్నారు. తన కూమార్తెనే సమంత పేరును సూచించిందని గుణశేఖర్ వెల్లడించారు. కథను ఎంచుకున్న తర్వాత పాత్రలపై చాలా రోజులు కసరత్తులు చేసినట్లు ఆయన తెలిపారు. గుణశేఖర్ మాట్లాడుతూ .. 'ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు సంవత్సర కాలం పట్టింది. షూటింగ్ కోసం ఆరు నెలల సమయం అనుకున్నాం. కానీ 81 రోజులు పట్టింది. ఆ తరువాత ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. అలా ఈ సినిమాను సిద్ధం చేయడానికి నాకు మూడేళ్లు పట్టింది. అలాగే శకుంతలను కాళిదాసు ఎలా వర్ణించారనేది నేను చదివా. ఆ పాత్రకి ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేశా. మొదట నేను సమంతను తీసుకోవాలని అనుకోలేదు. సమంత అయితేనే బాగుంటుందని మా అమ్మాయి చెప్పింది. ఆ సమయంలో మరోసారి 'రంగస్థలం' చూశా. ఓ పాత్రలో సమంత ఎంతగా ఒదిగిపోతుందనేది నాకు అర్థమైంది. అప్పుడు ఆమెను సంప్రదించా.' అని అన్నారు. దేవ్ మోహన్, సమంత నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. -
శాకుంతలం సినిమాలో ధరించిన బంగారు, వజ్రాభరణాలు చూశారా? (ఫొటోలు)
-
'శాకుంతలం' సినిమాలో సమంత ధరించిన నగలు ఎన్ని కోట్లో తెలుసా?
సమంత ప్రధానపాత్రలో నటించిన సినిమా శాకుంతలం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఈసినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. శాకుంతలం కోసం సుమారు 14 కోట్ల రూపాయల విలువ చేసే నిజమైన బంగారు, వజ్రాభరణాలు వినియోగించినట్లు డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు. దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితోనే తన సినిమాల్లో హీరో, హీరోయిన్లకు నిజమైన బంగారం, వజ్రాలతో తయారు చేయించిన ఆభరణాలనే వినియోగించినట్లు గుణశేఖర్ వెల్లడించారు. శాకుంతలం ఏప్రిల్ 14న విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్రంలో శకుంతల, దుష్యుంతుడు ధరించిన బంగారు, వజ్రాభరణాల ఫొటోలను హైదరాబాద్ లోని వసుంధర జ్యుయెలరీస్ లో ఆవిష్కరించారు. ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారథ్యంలో వసుంధర జ్యుయెలరీస్ శాకుంతలం కోసం సుమారు 6 నుంచి 7 నెలలు శ్రమించి ఆభరణాలను తయారుచేసింది. పూర్తిగా చేతితో తయారు చేసిన ఆభరణాలు... తన పాత్రలకు మరింత అందాన్ని, రాజసాన్ని తీసుకొచ్చాయని గుణశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. శకుంతల పాత్ర కోసం 15 కిలోల బంగారంతో సుమారు 14 రకాల ఆభరణాలను తయారు చేసినట్లు తెలిపారు. దుష్యంత మహారాజు పాత్ర కోసం 8 నుంచి 10 కిలోల బంగారంతో ఆభరణాలు తయారు చేశామని, మేనక పాత్రధారి మధుబాల కోసం 6 కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను రూపొందించినట్లు గుణశేఖర్ పేర్కొన్నారు. -
మధుర గతమా...
శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శకుంతల–దుష్యంతుడి ప్రేమ నేపథ్యంలో రూపొం దిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘మధుర గతమా.. కాలాన్నే ఆపక ఆగావే సాగక, అంగుళికమా జాలైనా చూపక చేజారావే వంచికా..’ అంటూ సాగే పా టని బుధవారం విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పా టని అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ పా డారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, మధుబాల, గౌతమి తదితరులు నటించారు. -
వేసవిలో శాకుంతలం
కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్, శకుంతలగా సమంత నటించారు. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, గౌతమి, మధుబాల కీలక పాత్రలుపో షించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ‘శాకుంతలం’ సినిమా రెండుసార్లు వాయిదా పడింది. కాగా ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ని విడుదల చేయనున్నట్లు శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించి, చిత్రంలోని కీలక పా త్రధారులతోపో స్టర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని విజువల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియన్స్‌కు అద్భుతమైన అనుభూతిని ఇచ్చేందుకు హంగేరిలోని సింఫనీ టెక్నీషియన్స్ రీ రికార్డింగ్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌గారి కుమార్తె అల్లు అర్హ చేసిన యువరాజు భరతుడి పా త్ర ఈ సినిమాకి ఓ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అఫీషియల్.. సమంత ‘శాకుంతలం’ వాయిదా
స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్లు, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా శాకుంతలం పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని సినీ ప్రియులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరంటే! ఈ క్రమంలో ఆడియన్స్‌కి నిరాశ ఎదురైంది. కొద్ది రోజులుగా శాకులంత మూవీ వాయిదా అంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా చిత్రం బృందం ప్రకటన ఇచ్చింది. ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాల్సిన శాకుంతలం చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. “ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాను విడుదల చేయలేకపోతున్నామని ప్రేక్షకులకు తెలిపేందుకు చింతిస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌తో వస్తాం. నిరంతరం మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అంటూ ప్రకటన ఇచ్చింది. చదవండి: ఓర్వలేక నా బిజినెస్‌పై కుట్ర చేస్తున్నారు: కిరాక్ ఆర్పీ అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కథానాయకుడిగా నటించగా.. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో అర్హ భరతుడు పాత్రలో కనిపించనుంది. The theatrical release of #Shaakuntalam stands postponed. The new release date will be announced soon 🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/f0cyBfDCyj — Gunaa Teamworks (@GunaaTeamworks) February 7, 2023 -
సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'శాకుంతలం' వాయిదా?
స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 17న విడుదల కాబోతుంది. శకుంతల, దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్,అనన్య నాగల్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అర్హ ఈ చిత్రంతో డెబ్యూ ఇవ్వనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. శాకుంతలం సినిమాను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
Samantha: సమంత మయోసైటిస్ నుంచి ఇంకా కోలుకోలేదా?
‘‘జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక్కటి మాత్రం మారలేదు. సినిమాను నేను ఎంతలా ప్రేమిస్తానో... సినిమా కూడా నన్ను అంతలా ప్రేమిస్తోంది. ‘శాకుంతలం’తో మీ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నాను’’ అని సమంత అన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్లో నటింన చిత్రం ‘శాకుంతలం’. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మింన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ– ‘‘ఓపిక లేకపోయినా గుణశేఖర్గారిపై ఉన్న అభిమానం, గౌరవంతో నా బలం మొత్తాన్ని కూడగట్టుకుని ఇక్కడికి వచ్చాను. కొందరికి సినిమా అనేది జీవితంలో ఓ భాగం. కానీ, గుణశేఖర్‌గారికి సినిమానే జీవితం. ప్రతి సినిమాలానే ‘శాకుంతలం’ని కూడా ఆయన ప్రాణం పెట్టి తీశారు. ఏ కథ విన్నా సినిమా బాగా రావాలని నటీనటులు కోరుకుంటారు. కొన్నిసార్లు ఆ ఊహను దాటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి..‘శాకుంతలం’ చూశాక నాకు అదే భావన కలిగింది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గుణశేఖర్‌గారు ‘శాకుంతలం’ కథ చెప్పినప్పుడు లీడ్ రోల్లో సమంత అయితే సరిపోతారనుకున్నాం. కథ విని, సమంత కూడా ఓకే అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఒరిజినల్ పాన్ ఇండియా సినిమా ఇది’’ అన్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘శాకుంతలం’లో ముగ్గురు హీరోలున్నారు. కథకు హీరో దేవ్ మోహన్ , సినిమాకు హీరో సమంత, తెరవెనక హీరో ‘దిల్’ రాజుగారు. ఇండియాలో వచ్చిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో అతి పెద్ద బడ్జెట్ సినివ్చన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో అతి పెద్ద బడ్జెట్ సినిమా ‘శాకుంతలం’. ఓ హీరోయిన్ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన రాజుగారికి థ్యాంక్స్. (చెమర్చిన కళ్లతో)’’ అన్నారు. గుణశేఖర్ మాటలకు సమంత భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ‘‘మా నాన్న ఎన్నో విజువల్స్ వండర్స్ సృష్టించారు. ‘శాకుంతలం’ ఆయనకు పూర్వ వైభవం తెస్తుంది’’ అన్నారు నీలిమ గుణ. -
గుణశేఖర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సమంత
శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సమంత కన్నీళ్లు పెట్టుకుంది. డైరెక్టర్ గుణశేఖర్ ఆమె గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు నిజమైన హీరో సమంత అని ప్రశంసించాడు. దీంతో ఎమోషనల్ అయిన సామ్ కంటతడి పెట్టింది. కాగా తనకు మయోసైటిస్ వ్యాధి ఉందని చెప్పిన తర్వాత సామ్ తొలిసారి ఇలా మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నాకు సినిమాపై ఉన్న ప్రేమ, సినిమాకు నామీదున్న ప్రేమ తగ్గలేదని పేర్కొంది. ''గుణశేఖర్ ప్రాణం పెట్టి తీశారు. ఈ కథ విన్నప్పుడు మేం ఊహించుకున్నట్లు రావాలి అనుకున్నాం. సినిమా చూసిన తర్వాత అంతకు మించి ఉంది అనేలా ప్రతిఒక్కరికి అనిపిస్తుంది. ఇండియన్ హిస్టరీ లో కాళిదాసు రాసిన శకుంతల పాత్ర నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. లైఫ్‌లో ఎన్ని ఫేస్ చేసినా సినిమాను ప్రేమిస్తూనే ఉంటాను'' అంటూ సమంత మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) We're with you sam 🤍🥺 be strong@Samanthaprabhu2#SamanthaRuthPrabhupic.twitter.com/sDjC9r9dBR — Jegan (@JeganSammu) January 9, 2023 -
సమంత ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చింది. శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆమె సందడి చేసింది. యశోద సినిమా రిలీజ్ టైంలో తాను మయోసైటిస్‌తో బాధపడుతున్న పేర్కొన్న సమంత అప్పటినుంచి ఇంటికే పరిమితమైంది. సుమతో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ మినహా మిగతా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఎక్కడా కనిపించలేదు. తాజాగా అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి ఆమె మీడియా ముందుకు వచ్చింది. వైట్‌శారీలో దేవకన్యలా మెరిసిపోయింది. దీనికి తోడు సమంత చేతిలో జపమాల కూడా కనిపించడం మరో విశేషం. కాగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: 'మాయ ప్రేమను మరిపిస్తుందేమో కానీ అవమానాన్ని కాదు'.. శాకుంతలం ట్రైలర్ అవుట్ -
అదిరిపోయే విజువల్స్‌తో శాకుంతలం ట్రైలర్.. అల్లు అర్హ ఎంట్రీ అదిరింది
సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోనే సమంత శకుంతల పాత్రలో నటించగా, ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ఈ భూమ్మిద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది. శకుంతల ఒక కారణ జన్మురాలు.. నవ నాగరికతకు నాంది పలకబోతోంది' అంటూ ట్రైలర్ ఆరంభం అవుతుంది. విజువల్స్, మణిశర్మ సంగీతం కట్టిపడేస్తుంది. ఇక చివర్లో సింహం మీద అల్లు అర్హ ఎంట్రీ మరో హైలైట్ అని చెప్పొచ్చు. సమంత లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి ట్రైలర్లో కనిపిస్తున్న మ్యాజిక్ సినిమాలోనూ వర్కవుట్ అవుతుందా? అన్నది చూడాల్సి ఉంది. -
ఘనంగా గుణశేఖర్ కుమార్తె వివాహం.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శక-నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో శుక్రవారం రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం)ఈ పెళ్లి జరిగింది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ విద్య, వ్యాపారవేత్త, శ్రీ శక్తి అధినేతలు డా. రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు, వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో నీలిమ గుణ ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రుద్రమదేవి సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన నీలిమ శాకుంతలం(సమంత లీడ్ రోల్లో నటించారు)సినిమాతో నిర్మాతగా మారారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లికూతురిలా ముస్తాబైన గుణశేఖర్ కూతురు.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ పెళ్లి కూతురిలా ముస్తాబైంది. మరికాసేపట్లో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. నేడు(శుక్రవారం)ఫలక్ నుమా ప్యాలెస్‌లో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రవి ప్రఖ్యా అనే బిజిమెన్మ్యాన్ను నీలిమ వివాహం చేసుకోనుంది. ఇటీవలె వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. కాగా నీలిమ గుణ కూడా సినీ రంగంపై ఆసక్తితో నిర్మాతగా మారారు. తన తండ్రి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమ దేవి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమాను నీలిమ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. -
యశోద మూవీపై గుణశేఖర్ ట్వీట్.. సామ్ రిప్లై ఇదే..!
హీరోయిన్ సమంత నటనపై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈనెల 11న విడుదలైన 'యశోద' మూవీలో ఆమె నటన అద్భుతంగా ఉందన్నారు. ఈ మేరకు సామ్‌ను అభినంందిస్తూ ట్వీట్ చేశారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటన ఆసక్తికరంగా సాగిందని కొనియాడారు. యశోద మూవీ ప్రారంభంలో అమాయకపు అమ్మాయిలా చూపించి.. కథలో రాబోయే ట్విస్ట్‌లకు తగినట్లుగా ఆమె తీర్చిదిద్దారు. ఈ సినిమా విజయం సమంత కెరీర్లో మరో కిరీటంగా నిలిచిందంటూ అభినందించారు. (చదవండి: Yashoda Movie Review: ‘యశోద’ మూవీ రివ్యూ) గుణశేఖర్ అభినందించడంతో కథానాయిక సమంత సైతం రిప్లై ఇచ్చింది. సమంత స్పందిస్తూ..' థ్యాంక్యూ గుణశేఖర్ సార్. నేను శాకుంతలం కోసం ఎదురుచూస్తున్నా. నేను ఏదైతే మ్యాజిక్ చూశానో అదే ప్రేక్షకులకు చూపించేందుకు ఇకపై వేచి ఉండలేను' అంటూ రాసుకొచ్చింది. దీంతో సమంత అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మేమంతా శాకుంతలం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. మూవీ అప్డేట్స్ త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. యశోద చిత్రంలో సామ్ నటనను మెచ్చుకుంటూ నెటిజన్లు సైతం పోస్టులు పెడుతున్నారు. కాగా.. ‘శాకుంతలం’ విషయానికి వస్తే కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజుల ప్రణయ గాథ నేపథ్యంలో సినిమా సాగనుంది. ఈ సినిమాలో దేవ్ మోహన్, అల్లు అర్హ కీలకపాత్రల్లో నటించారు. Thankyou @Gunasekhar1 sir 🙏 Can’t wait for #Shaakuntalam especially after what I have seen 🙇♀️ https://t.co/5JxqPNdLWE — Samantha (@Samanthaprabhu2) November 12, 2022 #Yashoda is gripping ,keeps us intrigued. @Samanthaprabhu2 performance stands out with intensity, her efforts in d action sequences tailored to suit her physique & her innocent persona in d beginning sets d stage for the twists that follow. Another feather to your cap #Samantha pic.twitter.com/qFgPWA0RHw — Gunasekhar (@Gunasekhar1) November 12, 2022 -
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి ఇంట్లో శుభకార్యం
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి ఇంట్లో పెళ్లి గంట మోగింది. ఆయన పెద్ద కుమార్తె నీలిమ త్వరలోనే వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నారు. నీలిమ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రవి ప్రక్యా అనే అబ్బాయితో ఏడడుగులు నడవనుంది. ఈ వేడుకలో వారి కుటుబసభ్యులు, ప్రముఖ సినీనటులు హాజరయ్యారు. ఈ విషయాన్ని గుణశేఖర్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. నీలిమ సైతం తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'నా జీవిత ప్రయాణం మొదలైంది' అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో నీలిమ నిర్మాతగా మారారు. గతంలో గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమ దేవి’కి చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన ఆమె.. ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రానికి నిర్మాతగా చేస్తున్నారు. Today marks a special day to us as we celebrate the Lagnapatrika of my elder daughter @neelima_guna with #RaviPrakhya best wishes to this couple 💐 https://t.co/XIRCLkQFJK — Gunasekhar (@Gunasekhar1) October 8, 2022 💛✨ the beginning of forever ✨💛#RaviPrakhya #NeelimaGuna pic.twitter.com/C7IyaoW7Vg — Neelima Guna (@neelima_guna) October 8, 2022 -
సమంత 'శాకుంతలం' నుంచి క్రేజీ అప్డేట్.. రిలీజ్ డేట్ అప్పుడే
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో డిఆర్పి, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పౌరణిక నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శాకుంతలగా సమంతగా నటిస్తుండగా, దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. నవంబర్4న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. -
బర్త్‌డే స్పెషల్ పోస్టర్: ఎదురుచూపుల్లో సమంత!
సమంత కథానాయికగా నటిస్తున్న తొలి పీరియాడికల్ చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దుష్యంతుడు–శాకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గురువారం (ఏప్రిల్ 28) సమంత బర్త్‌డేను పురస్కరించుకుని శాకుంతలం చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్‌ను వదిలింది. ఇందులో శకుంతలగా కనిపించిన సామ్ ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లుగా ఉంది. ఇదిలా ఉంటే శాకుంతలం మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో శకుంతల పాత్ర డైలాగ్స్ గ్రాంథికంలో ఉంటాయి. అందుకని దాదాపు మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్న అనంతరం డబ్బింగ్ పూర్తి చేసిందట సామ్. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. మరోవైపు సమంత నటించిన మరో లేడీ ఓరియంటెడ్ మూవీ యశోద. సామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. మే 5న ఉదయం 11.07 గంటలకు యశోద ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. Wishing the ethereal “Shakuntala” from #Shaakuntalam @Samanthaprabhu2 a very Happy Birthday! #HBDSamantha #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/NZPvGdCVLY — Gunasekhar (@Gunasekhar1) April 28, 2022 Wishing their lead lady @Samanthaprabhu2 a very Happy Birthday, Team #Yashoda to unveil the first glimpse on May 5th, 11:07AM🔥#HappyBirthdaySamantha #YashodaTheMovie @Iamunnimukundan @varusarath5 @dirharishankar @hareeshnarayan @mynnasukumar @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/h99WGkvHHL — BA Raju's Team (@baraju_SuperHit) April 28, 2022 చదవండి: నువ్వు యాక్టరేంటి? నిన్ను తీసుకుంటే సమయం, డబ్బులు వృథా' -
'సమంత.. నీకా అర్హత ఉంది, ఇంకా మరెన్నో చేయాలి'
Gunasekhar Congratulates Samantha For Her Hollywood Debut: నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత దూకుడు పెంచింది. వరుస సినిమాలు చేస్తూ జోరు కొనసాగిస్తుంది. తాజాగా బాలీవుడ్ బడా హీరోయిన్స్‌కు కూడా దక్కని అవకాశాన్ని చేజిక్కుంచుకుంది. తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సైన్ చేసింది. ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సమంత నటిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘డోంటన్ అబ్బే’ ఫేమ్ ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రంలో సామ్ బై-సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే సినిమా, సినిమాకు వైవిధ్యం చూపిస్తూ టాలీవుడ్‌ను దాటి, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు సైన్ చేస్తుండటంతో సామ్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ ట్వీట్ చేస్తూ.. 'మీ డెడికేషన్‌కు ఇది తగిన ఫలితం. ఇంకా మరెన్నో చేయాలి' అంటూ పేర్కొనగా.. 'థ్యాంక్యూ సార్' అంటూ సమంత రిప్లై ఇచ్చింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో శాకుంతలం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. Thankyou sir ☺️🙏 https://t.co/kF1hRoCuCM — Samantha (@Samanthaprabhu2) November 26, 2021 -
ఒకే లొకేషన్లో తండ్రి కూతురు షూటింగ్
-
గుణ చిత్ర శిల్పి
-
Gunasekhar: అందుకే ఆ హీరోలు నన్ను దూరం పెట్టలేదు!
గుణశేఖర్ మొండి మనిషి..తాను నమ్మినదే చేస్తారు.. తీస్తారు. సినిమా అంటే ఆయనకు ప్రేమ.. పిచ్చి అని కూడా అనొచ్చు. అందుకే రిస్క్‌లు తీసుకుంటారు. ప్రస్తుత తరానికి మన కథలు చెప్పడానికి రిస్క్ తీసుకుంటారు. రిస్క్‌లో రిలాక్సేషన్ని చూసుకుంటారు. నేడు గుణశేఖర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విశేషాలు.. ►కరోనా మనుషులకు దూరం పెంచింది. వేడుకలు చేసుకునే వీల్లేకుండా చేసింది. 2020, 2021 కరోనా టైమ్‌ని గురించి కొన్ని మాటలు చెబుతారా? గుణశేఖర్: మనకు ఎదురైన పెద్ద సవాల్ కరోనా. చదువుకుంటున్నప్పుడు స్కూల్ గోడలపై ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని రాసి ఉన్న సూక్తులను ఎక్కువమందిమి పట్టించుకోలేదు. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం మరొకటి లేదని అందరికీ తెలిసేలా కరోనా రూపంలో ఓ పెద్ద కుదుపు వచ్చింది. నీటితో పాటు గాలిని కూడా కొనుక్కొని పీల్చుకునే స్థాయికి పడిపోయాం. పర్యావరణ సమతుల్యత, ప్రకృతిని కాపాడుకోవడం వంటివి మన తరంవారు సరిగ్గా పాటించలేదు. ఇప్పటినుంచైనా భవిష్యత్ తరాలకు మంచి నివాస యోగ్యమైన, చెడు ప్రభావాలు లేని పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తుపెట్టుకోవాలి. ►మీ 23 ఏళ్ల కెరీర్‌ని గమనిస్తే నిదానమే ప్రధానం అన్నట్లుగా సినిమాలు చేశారు. బాలల చిత్రం ‘రామాయణం’తో కలుపుకుని జస్ట్ 12 సినిమాలే చేశారు.. ఈ నిదానం కరెక్టే అంటారా? ‘రుద్రమదేవి’ తర్వాత నా దర్శకత్వంలో మరో సినిమా వచ్చి ఐదేళ్లవుతోంది. నిదానమే ప్రధానం అన్నట్లుగా నేను వెళ్లినట్లు అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో నిదానం పనికి రాదు. ఒకప్పుడు నేను ‘రామాయణం’ వంటి గొప్ప సినిమా తీశానని గత విజయాలను చెప్పుకుంటే కుదరని రోజులు ఇవి. ఇప్పుడు ట్రెండ్‌లో ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. పెద్ద పెద్ద మహానుభావుల గొప్ప సినిమాల చరిత్రే కాలగర్భంలో కనుమరుగైపోతోంది. ‘నిదానమే ప్రధానం’ అని చెప్పిన ఒకప్పటి పెద్దవారే ‘ఆలస్యం అమృతం విషం’ అని కూడా చెప్పారు. అందుకే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ, కాస్త వేగం పెంచాల్సిన సమయం ఇది. ►ఇంత గ్యాప్ రావడానికి కారణం మీరు మైథాలజీ బ్యాక్‌డ్రాప్ ఎన్నుకోవడమే అనుకోవచ్చా? అది ఒక కారణం. ‘రుద్రమదేవి’ తర్వాత ‘హిరణ్య కశ్యప’ వంటి భారీ ప్రాజెక్ట్ మీద మూడేళ్లు పెట్టాను. ఈ కథపై ఏడాది కూర్చున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం కొందరు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు మాతో టైఅప్ అయ్యారు. వారితో ట్రావెల్ అయ్యే ప్రాసెస్‌లో హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ తెలుసుకున్నాను. వారు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్లపై ఎక్కువ టైమ్ పెట్టి ప్రొడక్షన్ టైమ్ తగ్గించుకుంటారు. స్టోరీ బోర్డింగ్, సినిమా ఇలా ఉంటుందని ఊహించుకుని యానిమేట్రిక్స్ తయారీ అంతా పకడ్బందీగా చేశాం. ఇందుకోసం మూడేళ్లు టైమ్ పట్టింది. క్యాస్టింగ్ దగ్గర ఆగింది. ఒకసారి ఈ సినిమా సెట్స్‌పైకి వెళితే పది నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తాను. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా తొందరగా పూర్తి చేయగలను. ఓ ఐదేళ్ల ప్రాజెక్ట్‌కు సంబంధించిన వర్క్‌లో నేను ఆల్రెడీ మూడేళ్లు వర్క్ చేసేశాను. ఈ మూడేళ్ల వర్క్ వల్ల షూటింగ్ రోజులు తగ్గుతాయి. ►కానీ, సినిమా ఆగిందని టాక్! లేదు. ఇన్నేళ్ల శ్రమను ప్రేక్షకులకు చూపించాలనే ఉత్సాహంతో ఉన్నాను. కోవిడ్ కారణంగా కొంతకాలం హోల్డ్‌లో పెట్టాను. ‘శాకుంతలం’ పూర్తయ్యాక నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘హిరణ్య కశ్యపనే’. ►‘రుద్రమదేవి’ని గోన గన్నారెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో తీయమని మిమ్మల్ని కొందరు హీరోలు, నిర్మాతలు అడిగారు. కానీ మీరు రుద్రమదేవినే తీశారు. మరి.. వారితో మీ స్నేహం ఎలా ఉంది? కొందరు హీరోలు, మేకర్స్ గోన గన్నారెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీయాలన్నట్లుగా అన్నారు. రుద్రమదేవి ఓ మహిళ కథ. అందుకే గోన గన్నారెడ్డి పాయింటాఫ్ వ్యూలో ‘రుద్రమదేవి’ కథను చెప్పాలని నేను అనుకోలేదు. ‘రుద్రమ దేవి’ కథలో గోన గన్నారెడ్డి వస్తాడు కానీ... గోన గన్నారెడ్డి కథలో రుద్రమదేవి రారు అన్నది నా వాదన. ఆమె కథనే చూపించాలని మొండిగా కూర్చున్నాను. అలాగే ‘రుద్రమదేవి’ వంటి పవర్ఫుల్ లేడీ సినిమాను సపోర్ట్ చేయాలని అల్లు అర్జున్ వచ్చి గోన గన్నారెడ్డి పాత్రను పోషించి తన సంస్కారాన్ని చాటుకున్నారు. ఇక గోన గన్నారెడ్డి చుట్టూ తీయాలని కోరినవాళ్లు నేను తీయలేదు కదా అని నన్ను తప్పుగా అనుకోలేదు. మా స్నేహబంధం అలానే ఉంది. అయినా స్టార్ హీరోలు చెప్పినట్లు వెళితే ఇంకా గొప్ప విజయం రావచ్చేమో? చాలా సందర్భాల్లో హీరోలు ఇచ్చిన ఓ సెన్సిబుల్ ఐడియాతో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ప్రాజెక్టులు నిలబడిన సందర్భాలున్నాయి. అందువల్ల మనం కూడా వేరేవాళ్లని తప్పుబట్టాల్సిన పని లేదు. ►చిరంజీవికి ‘చూడాలని ఉంది’ వంటి హిట్, ‘మృగరాజు’ వంటి ఫ్లాప్ ఇచ్చారు. మహేశ్‌బాబుకి ‘ఒక్కడు, అర్జున్’ వంటి హిట్స్, ‘సైనికుడు’ వంటి ఫ్లాప్ ఇచ్చారు. ఓ ఫ్లాప్ తర్వాత హీరోలు.. దర్శకులను దూరం పెట్టాలనుకుంటారా? అందరి గురించి చెప్పలేను. నాతో చేసిన హీరోల గురించి చెప్పగలను. ఇక్కడ హిట్, ఫ్లాప్ గురించి కాదు. కొందరు సెన్సిబుల్ హీరోలు డైరెక్టర్ లోపం ఉందనుకున్నప్పుడు దగ్గరికి రానివ్వరు. కానీ ఎఫర్ట్‌లో లోపం లేదు.. ఫలితంలోనే ఎక్కడో తేడా కొట్టిందంటే మాత్రం మళ్లీ ఆ దర్శకుడితో సినిమా చేయడానికి ముందుకొస్తారు. ఉదాహరణకు ‘వరుడు’ మంచి కథ. నన్ను ఆ హీరో (అల్లు అర్జున్) నమ్మారు. కథలో కొన్ని వాణిజ్య అంశాలు జోడించడం వల్ల ప్రేక్షకులకు సరిగ్గా చేరువ కాలేదు. కానీ నా ఎఫర్ట్‌లో లోపం లేదని నమ్మిన అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్ర చేశారు. నా కథ, ఆలోచనలో తప్పు ఉండొచ్చేమో కానీ నా ఎఫర్ట్‌లో కాదు.. ఎఫర్ట్‌లో లోపం లేనప్పుడు ఏ హీరో మనల్ని దూరం పెట్టరు. నా ప్రయత్నలోపం ఉండదని తెలుసు కాబట్టి ఆ హీరోలు నన్ను దూరం పెట్టలేదు. అలాగని మరోసారి మళ్లీ మనం తప్పుడు కథ తీసుకెళ్లకూడదు. ఇప్పుడు నేను ఓ కథ అనుకుని, చిరంజీవిగారికి చెప్పాలని ఫోన్ చేస్తే, రమ్మని ఆహ్వానిస్తారు. గుణ చెప్పిన కథను ఇప్పుడేం వింటాం? అని నా గురించి హీరోలు అనుకునే పరిస్థితి లేదు. ఆ నమ్మకాన్ని నేను కాపాడుకోగలిగా. ►మైథాలజీ (శకుంతల–దుష్యంతుడి ప్రేమకథతో ‘శాకుంతలం’ తీస్తున్నారు) సినిమాలకు ఖర్చు ఎక్కువ, సమయం ఎక్కువ. రిస్క్ కదా? (నవ్వుతూ) నాకు రిస్క్‌లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎందుకంటే నా ప్లానింగ్ అంత బాగుంటుంది. ‘రుద్రమదేవి’ సాధించిన విజయం వల్ల మళ్లీ అలాంటి సినిమాలు ప్లాన్ చేయగలుగుతున్నాను. హాలీవుడ్ సంస్థ మార్వెల్ సృష్టించిన అవెంజర్స్ లాంటి సూపర్ హీరో సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కానీ అష్టదిక్పాలకులకు మించిన అవెంజర్స్ ఎవరున్నారు చెప్పండి. మన భారతదేశంలో పురాణాలు, ఇతిహాసాలు, ఫ్రీడమ్ ఫైటర్స్... ఇలా మన దగ్గరే ఎన్నో కథలు ఉన్నాయి. ఓ హాలీవుడ్ వ్యక్తి మహాత్మా గాంధీ గురించి సినిమా తీశాక అరే.. మనం ఎందుకు తీయలేదని అప్పుడు ఆలోచిస్తాం. మన రామాయణం, మహాభారత గాథలను వేరే వారు వచ్చి తీసే దుస్థితి రాకూడదనుకుంటాను. మనమే ఎందుకు తీయకూడదన్నదే నా అభిమతం. ఇలాంటి సినిమాలకు బడ్జెట్ ఎక్కువ, టైమ్ ఎక్కువ సహజం. కానీ మన కథలు చూపించామనే తృప్తి కచ్చితంగా ఉంటుంది. ►‘శాకుంతలం’ లీడ్ రోల్‌కి ముందు సమంతనే అనుకున్నారా? లేక ఎవరినైనా..? సమంతని నీలిమ సజెస్ట్ చేసింది. ‘రంగస్థలం’లో ఆమె ఒదిగిపోయిన తీరు చూసి, కరెక్ట్‌గా సరిపోతారని నేనూ అనుకున్నాను. కథ విని ఆమె ఎగ్జయిట్æఅయ్యారు. కానీ ఈ పాత్రకు మెంటల్‌గా, ఫిజికల్‌గా సిద్ధపడటానికి కొంచెం టైమ్ కావాలని రెండు నెలలు ఈ పాత్రకు తగ్గ ఎఫర్ట్ పెట్టారామె. ►మీ అమ్మాయి నీలిమ ‘శాకుంతలం’ని నిర్మించడం గురించి... ఓ మూడు కథలు చెబితే, తను ‘శాకుంతలం’ని సెలక్ట్ చేసింది. అంటే.. ఈ తరంవారు కూడా మైథాలజీలను ఇష్టపడుతున్నారనే కదా. ఈ సినిమా ప్రకటించగానే.. ‘దిల్’ రాజుగారు ‘నాకు కథ నచ్చితే ఫైనాన్షియల్‌గా మీపై ఒత్తిడి లేకుండా చూసుకుంటాను’ అన్నారు. ఆయనకు, శిరీష్‌కు కథ చెప్పాను. వారికి నచ్చడంతో ‘డబ్బులు గురించి మరచిపోండి.. మీ అమ్మాయే నిర్మాతగా మీకు నచ్చినట్లు తీయండి’ అన్నారు. మొదటి షెడ్యూల్లోనే 60శాతం చిత్రీకరణ పూర్తి చేశాను. కరోనా సమయంలో నీలిమ యూనిట్ అంతా మెడికల్ కేర్ తీసుకుంటూ షూటింగ్ జరిగేలా చూసుకుంది. షూటింగ్ ఆపితే నష్టమే. సమంత కూడా షెడ్యూల్‌ని ఆపొద్దు.. మీరు అనుకున్న ప్రకారమే పూర్తి చేయండని సపోర్ట్ చేశారు. ►ప్రతాపరుద్రడు మెయిన్ పాత్రలో ఓ సినిమా చేయాలనుకున్నారు.. 100శాతం ఉంటుంది. ‘రుద్రమదేవి’ పోస్ట్ ప్రొడ„ý న్ సమయంలోనే ప్రతాపరుద్రుడు కథని పూర్తి చేశాను. – డి.జి. భవాని -
సెట్స్‌లో జాయిన అయిన దుష్యంతుడు
తెలుగులో తన కొత్త ప్రయణాన్ని మొదలుపెట్టారు మలయాళ నటుడు దేవ్ మోహన్. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శకుంతలగా సమంత, దుష్యుంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు. ‘దిల్ ’రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం ‘శాకుంతలం’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు దేవ్ మోహన్ . ఈ సినిమా 2022లో విడుదల కానుంది. చదవండి: ఓటీటీలో జాతిరత్నాలు: మీరనుకునే డేట్ కాదు! ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్ -
ఈ సినిమా కోసం 4 నెలలుగా కష్టపడుతున్న సమంత
‘‘పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీలో రాజకుమారి పాత్ర చేయాలన్న ఆకాంక్ష ‘శాకుంతలం’ సినిమాతో నెరవేరుతోంది. శకుంతల పాత్ర చేయడాన్ని గొప్ప బహుమతిగా భావిస్తున్నా. ఈ చిత్ర బడ్జెట్ నా స్థాయిని మించినది. దాన్ని నిలుపుకొనేందుకు వంద శాతం కష్టపడతా’’ అన్నారు సమంత. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ‘దిల్’ రాజు సమర్పణలో డీఆర్పీ – గుణా టీమ్‌వర్క్స్‌పై గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోమవారం సినిమా ప్రారంభమైంది. తొలి సీన్‌కి ‘దిల్’ రాజు కెమెరా స్విచాఫ్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఎంత బడ్జెట్ అయినా ఖర్చుపెట్టండి మీ వెనక నేను ఉన్నాను అన్నారు ‘దిల్’ రాజు. శకుంతలను తనలో చూసుకుని ఎంతైనా కష్టపడాలని నాలుగు నెలలుగా క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకుంటున్నారు సమంత. దుష్యంతుడిగా మలయాళ యాక్టర్ దేవ్ మోహన్‌ను నీలిమ సెలక్ట్ చేసింది’’ అన్నారు. ‘‘2022లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు ‘దిల్’ రాజు. ఆయన కుమార్తె హన్షిత పాల్గొన్నారు. చదవండి: అమీర్ ఖాన్ నిర్ణయానికి అభిమానులు హర్టయ్యారు.. ఆసభ్యకరమైన పోస్ట్ షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ -
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే..
గుణశేఖర్ ‘శాకుంతలం’ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి ఇందులో శకుంతల పాత్రకు ఎవర్ని తీసుకుంటారు? అనే చర్చ చాన్నాళ్లు నడిచింది. ఫైనల్లీ శకుంతలగా సమంత చేయనున్నారని గుణ అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించడంతో... ఆ తర్వాత చర్చ అంతా దుష్యంతుడి పాత్ర చుట్టూ తిరిగింది. శనివారం ఈ చర్చకు కూడా ఫుల్స్టాప్ పడింది. ఈ పాత్రకు మలయాళ నటుడు దేవ్ మోహన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇతిహాసంలో దుష్యంత మహారాజు, శకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు గుణశేఖర్. భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేయిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రేమకావ్యం త్వరలో సెట్స్‌కి మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
‘శాకుంతలం’ పై గుణశేఖర్ ఆసక్తికర ట్వీట్
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ అనే సినిమా సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్ పోస్టర్ మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గొప్పతనం తెలియజేస్తూ తాజాగా గుణశేఖర్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో శకుంతలా నాటకం ఎంత గొప్పదో తెలుపుతూ.. తను ఈ సినిమా రూపొందించడానికి కారణం ఏమిటో తెలిపే ప్రయత్నం చేశారు. ''కావ్యేషు నాటకమ్ రమ్యమ్ నాటకేషు శకుంతలా! తత్రాపి చ చతుర్థోంకః తత్ర శ్లోకచతుష్టయం!! కావ్య ప్రక్రియలన్నిటిలో నాటక ప్రక్రియ రమ్యమైనది. నాటకాలన్నింటిలో శకుంతలా నాటకము రమ్యమైనది. ఆ శకుంతలా నాటకములో నాలుగవ అంకము, అందులోనూ నాలుగు శ్లోకాలు అత్యంత రమ్యమైనవి.. అని గుణశేఖర్ తన ట్వీట్ చేశాడు. ఇక శాంకుంతలం సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాలో కథానాయిక ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. గుణశేఖర్ రుద్రమదేవిలో నటించిన అనుష్క ఈ సినిమాలో కూడా నటించనున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. ఈ తర్వాత పూజా హెగ్దే పేరు కూడా వినిపించింది. అయితే తాము పూజాను అనుకోలేదని నిర్మాత నీలిమ గుణ చెప్పారు. అయితే.. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ ని అనుకుంటున్నారని తెలిసింది. #శాకుంతలం #Shaakuntalam #EpicLoveStory #Manisharma @neelima_guna @GunaaTeamworks pic.twitter.com/llLJwVjA17 — Gunasekhar (@Gunasekhar1) October 12, 2020 Before manifesting the spectacle of Narasimha Avatar on the silver screen in ‘Hiranyakashyapa’.. Presenting to you a whimsical ‘Tale of Love’ from the Adi Parva of the Mahabharata..https://t.co/eVK7a9r4Ze — Gunasekhar (@Gunasekhar1) October 9, 2020 -
రానాతో భారీ బడ్జెట్ మూవీ?
రుద్రమదేవి సినిమాతో సక్సెస్‌ను అందుకున్నారు దర్శకులు గుణశేఖర్. అయితే ఈ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా.. ఇంకో సినిమాను తెరకెక్కించలేదు గుణశేఖర్. అప్పట్లో హిరణ్యకశ్యప సినిమాను తెరకెక్కించబోతున్నానని ప్రకటించారు ఈ డైరెక్టర్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్‌పై అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను దాదాపు 180కోట్లతో నిర్మాత సురేశ్‌బాబు నిర్మించబోతున్నట్లు వినికిడి. రానా హిరణ్యకశ్యపుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. -
ఏపీ సీఎంకి రుద్రమదేవి డైరెక్టర్ సూటి ప్రశ్న
హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో 'రుద్రమదేవి' చిత్రానికి ఏ ఒక్క కేటగిరీలోనూ అవార్డు దక్కకపోవడంపై ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ మండిపడ్డారు. ఈ విషయంపై స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'ప్రశ్నించడం తప్పా?...' అంటూ ఆయన చేసిన ట్వీట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలు ప్రశ్నలు సంధించారు. చారిత్రాత్మక చిత్రం ''రుద్రమదేవి''కి వినోదపు పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదు...? మరో చారిత్రాత్మక చిత్రం ''గౌతమిపుత్ర శాతకర్ణి''కి మినహాయింపు ఎందుకిచ్చారని గుణశేఖర్ ప్రశ్నించారు. మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ''రుద్రమదేవి'', మూడు ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఏదో ఒక దానికి ఎంపిక కాలేకపోయిందని, కనీసం జ్యూరీ గుర్తింపునకు కూడా నోచుకోలేకపోయిందని మండిపడ్డారు. ప్రశ్నించడం తప్పా..? Is it Wrong to Question ? pic.twitter.com/SBdbz7y0CO — Gunasekhar (@Gunasekhar1) November 15, 2017 -
వంద కోట్లతో గుణశేఖర్ సాహసం
రుద్రమదేవి సినిమాతో భారీ చారిత్రక చిత్రాన్ని వెండితెర మీద ఆవిష్కరించిన దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే సినిమాను తెరకెక్కించనున్నట్టుగా గుణశేఖర్ ఇటీవల ప్రకటించాడు. ఈ పౌరాణిక గాథను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అంతేకాదు యంగ్ హీరో రానా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. హిరణ్యకశ్యప సినిమాను దర్శకుడు గుణశేఖర్ దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించే ఆలోచనలో ఉన్నాడట. అయితే మార్కెట్ పరంగా గుణశేఖర్‌గాని, రానా గాని ఇంతవరకు వంద కోట్లమార్క్‌ను అందుకోలేదు. అందుకే అంత బడ్జెట్‌తో హిరణ్యకశ్యపను తెరకెక్కించటం సాహసమే అని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ భారీ ప్రయోగంలో గుణ మరోసారి విజయం సాధింస్తాడేమో చూడాలి. -
త్వరలో సెట్స్ మీదకు భక్త ప్రహ్లాద
రుద్రమదేవి సినిమాతో ఘన విజయం సాధించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్... మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. రుద్రమదేవితో భారీ చారిత్రక కథకు తెర రూపం ఇచ్చిన గుణ, ఇప్పుడు ఓ పౌరాణిక కథాంశాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు సినిమాగా రూపొందిన భక్త ప్రహాద కథతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. గతంలో హిరణ్యకశ్యప పేరుతో గుణశేఖర్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయకపోయినా.. ప్రహ్లాదుడి కథతోనే సినిమా చేస్తున్నట్టుగా తెలిపాడు గుణ. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టే ముందు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న గుణశేఖర్ అక్కడే సినిమా చేయబోతున్నట్టుగా వెల్లడించారు. రుద్రమదేవి సినిమా తరువాత ప్రతాపరుద్రుడు అనే చారిత్రక చిత్రాన్ని రూపొందించనున్నట్టుగా ప్రకటించాడు. అయితే ప్రతాపరుద్రుడు కథకు మరింత రిసెర్చ్ చేయాల్సి ఉండటంతో ఆ సినిమాను వాయిదా వేసి హిరణ్యకశ్యపను తెర మీదకు తీసుకువచ్చాడు.రుద్రమదేవి కన్నా భారీగా ఈ సినిమాను రూపొందిచనున్నాడు. -
బాహుబలి ఫ్యాన్స్‌ను హర్ట్ చేశాడు..!
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి యూనిట్‌పై సినీ వర్గాల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ కూడా చేరాడు. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను ప్రశంసిస్తూ స్వహస్తాలతో ఓ లెటర్ రాసిన గుణశేఖర్, రాజమౌళి దర్శకత్వ ప్రతిభను కీర్తిస్తూ తన సోషల్ మీడియా పేజ్‌లో కామెంట్ చేశాడు.అయితే ఈ కామెంటే ఇప్పుడు బాహుబలి ఫ్యాన్స్‌ను హర్ట్ చేసింది. సినిమా అనేది ఎంతటి బలమైన మీడియమో మరోసారి నిరూపించినందుకు శుభాకాంక్షలన్న గుణశేఖర్, ఓ మామూలు కథను కూడా మీ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో గొప్పగా చిత్రీకరించినందుకు హాట్సాఫ్ అంటూ కామెంట్ చేశాడు. కేవలం విజయేంద్ర ప్రసాధ్ అందించిన కథ, ఆయన సృష్టించిన పాత్రల వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని బాహుబలి యూనిట్ చెపుతున్న తరుణంలో గుణశేఖర్ ఆ కథను సింపుల్ స్టోరి అంటూ తేల్చేయటం రాజమౌళి, ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఇప్పటికే గుణశేఖర్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. @ssrajamouli pic.twitter.com/xrl4BJW8rp — Gunasekhar (@Gunasekhar1) 28 April 2017 -
రుద్రమకు అన్యాయమా ?
-
మరి ‘రుద్రమదేవి’ మాటేంటి?
వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి ఏపీ సీయం చంద్రబాబు వినోదపు పన్ను రాయితీ ప్రకటించడాన్ని దర్శకుడు గుణశేఖర్ స్వాగతించారు. అయితే, గతంలో తాను తీసిన ‘రుద్రమ దేవి’ చిత్రానికి తెలంగాణ సీయం కేసీఆర్ వినోదపు పన్ను రాయితీ ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఓ కమిటీ వేసి ఫైలుని మూసేసిన సంగతిని ప్రస్తావించారు. ‘శాతకర్ణి’కి పన్ను రాయితీ ఇచ్చినవేళ, మరోసారి తమ దరఖాస్తుని పరిశీలిం చాలని చంద్రబాబుని కోరారు. ‘‘రుద్రమ దేవి వట్టి తెలంగాణ యోధురాలు కాదు. దక్షిణాది నంతటినీ పాలించిన రాణి. ఆమె పట్టాభి షేకం సందర్భంగా అమరావతి వద్ద వేయించిన ‘మార్కాపురం శాసనా’న్ని ఇటీ వల మీరో సభలో ఉదాహరించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ‘రుద్రమదేవి’కి వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సమానమైన ‘ప్రోత్సాహక నగదు’ అందజేసి మీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని మరోమారు రుజువు చేయండి’’ అని గుణశేఖర్ కోరారు. -
గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప'
రుద్రమదేవి సినిమాతో ఘన విజయం సాధించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్... మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. రుద్రమదేవితో భారీ చారిత్రక కథకు తెర రూపం ఇచ్చిన గుణ, ఇప్పుడు ఓ పౌరాణిక కథాంశాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. హిరణ్యకశ్యప పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో అందరికి తెలిసిన భక్త ప్రహ్లాదుడి కథనే హిరణ్య కశ్యపుడి యాంగిల్లో ప్రెజెంట్ చేయనున్నాడట. అందుకే ఈ సినిమాకు 'ద స్టోరి ఆఫ్ భక్త ప్రహ్లాద' అనే ట్యాగ్ లైన్‌ను యాడ్ చేశాడు. రుద్రమదేవి సినిమా తరువాత ప్రతాపరుద్రుడు అనే చారిత్రక చిత్రాన్ని రూపొందించనున్నట్టుగా ప్రకటించాడు. అయితే ప్రతాపరుద్రుడు కథకు మరింత రిసెర్చ్ చేయాల్సి ఉండటంతో ఆ సినిమాను వాయిదా వేసి హిరణ్యకశ్యపను తెర మీదకు తీసుకువచ్చాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకోగా.. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను స్వయంగా నిర్మించనున్నట్టుగా ప్రకటించాడు గుణశేఖర్. అంతేకాదు ఈ సినిమాలో హిరణ్యకశ్యపుడి పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కనిపించనున్నాడట. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నట్లుగా తెలిపారు. -
తుల్యభాగ టు మలేషియా
స్విమ్మింగ్‌లో సత్తా చాటుతున్న గుణశేఖర్ అంతర్జాతీయ పోటీలకు ఎంపిక త్వరలో మలేషియాలో పోటీలు జి.మామిడాడ (పెదపూడి) : ఇక్కడి కాలువల్లో ఈత నేర్చుకున్న కుర్రాడు అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యాడు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పలు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నాడు. వివరాలివి... జి.మామిడాడలోని బసివిరెడ్డి పేటకు చెందిన కొల్లకోట గుణశేఖర్ తండ్రి సీతారాముడు గతంలో రజక వృతి చేసేవారు. తండ్రి స్థానిక తుల్యభాగ నది కాలువలో దుస్తులు ఉతికే సమయంలో మూడో తరగతి చదువుతున్న గుణశేఖర్ ఈత నేర్చుకోవడంపై ఆసక్తి చూపడంతో కుమారుడికి ఈత నేర్పించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుండగా జిల్లా స్థాయి స్మిమ్మింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. స్థానిక డీఎస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి, డీఎల్ఆర్ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 9వ తరగతి చదువుతుండగా కాకినాడలో జరిగిన స్కూల్‌గేమ్స్ ఫెడరేష¯ŒS(ఎస్జీఎఫ్) అండర్–17 పోటీల్లో నాల్గో స్థానం 2014లో (ఇంటర్ ఫస్ట్ ఇయర్) కాకినాడలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS అండర్–19 పోటీల్లో జిల్లా ప్రథమ స్థానం అదే ఏడాది కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS పోటీల్లో నాల్గో స్థానం సాధించాడు. జాతీయ స్థాయి పోటీలకు స్టాండ్‌బైగా ఎంపికైయ్యాడు – 2015లో (ఇంటర్ సెకండియర్) కాకినాడలో జరిగిన స్కూల్‌గేమ్స్ ఫెడరేష¯ŒS అండర్–19 పోటీల్లో ప్రథమ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. 2016 ఏప్రిల్‌లో రాజమహేంద్రవరంలో జరిగిన స్టూడెంట్ ఒలింపిక్ అసోసియేష¯ŒS అండర్–19 పోటీల్లో ప్రథమ స్థానం సెప్టెంబర్‌లో నెల్లూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర పోటీల్లో ప్రథమ స్థానం సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. గుజరాత్ రాష్ట్రం వడోదర ప్రాంతంలో జరిగిన ఒలింపిక్ అసోసియేష¯ŒS అండర్–19 జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి, అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలో నిర్వహించే పోటీలకు ఎంపికయ్యాడు. ప్రత్యేకంగా కోచ్ లేరు తనకు ఎవరూ కోచ్ లేరని గుణశేఖర్ తెలిపారు. పోటీల్లో పాల్గొనడానికి వెళ్లిన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధతో మెళకువలు తెలుసుకుని, వాటిని పాటించాను. తొలినాళ్లలో నా తండ్రే ఈత నేర్పించారు. ప్రాథమిక మెళకువలు చెప్పారు. రైల్వేలో ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉంది. మలేషియాలో నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తున్నాను. – కె.గుణశేఖర్ -
జాతీయ స్విమ్మింగ్‌లో గుణశేఖర్‌కు స్వర్ణం
జి.మామిడాడ(పెదపూడి) : స్టూడెంట్ ఒలింపిక్ అసోసియేష¯ŒS జాతీయ స్థాయి స్విమ్మింగ్ అండర్–19 పోటీల్లో జి.మామిడాడకు చెందిన కె.గుణశేఖర్ స్వర్ణ పతకం సాధించాడు. ఈ వివరాలు అసోసియేష¯ŒS జిల్లా కార్యదర్శి కె.రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుణశేఖర్ స్థానిక డీఎల్ఆర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతడు ఈ నెల 13, 14, 15 తేదీల్లో గుజరాత్ రాష్ట్రం వడోదర ప్రాంతంలో జరిగిన జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ఈ పతకం సాధించాడని తెలిపారు. సెప్టెంబర్ 9, 10, 11 తేదీల్లో నెల్లూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా బంగారు పతకం సాధించాడన్నారు. గుణశేఖర్‌కు కళాశాల యాజమాన్యం, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
ఆస్కార్ ఎంట్రీ బరిలో రుద్రమదేవి
ఆస్కార్ అవార్డ్ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో పోటీపడేందుకు మన భారతీయ సినిమా ఎంపిక ప్రక్రియ మొదలైంది. మన దేశం తరఫున ఎంట్రీగా ఏ సినిమాను పంపాలనే దానికి పలు భాషా చిత్రాలను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోంది. తెలుగు నుంచి పోటీ పడే అరుదైన అవకాశాన్ని ‘రుద్రమదేవి’ దక్కించుకుంది.‘‘తెలుగువారి చరిత్రకు, రుద్రమదేవి చరిత్రకు ఉన్న గొప్పతనమే ఈ సినిమాను ఈ స్థాయి దాకా తీసుకెళ్లింది’’ అని ఈ సందర్భంగా చిత్రదర్శక-నిర్మాత గుణశేఖర్ పేర్కొన్నారు. భారతీయ భాషల్లో ఎంపిక చేసిన ఇలాంటి కొన్ని చిత్రాలను పరిశీలించి ఫైనల్‌గా మన దేశం తరఫున ఎంట్రీగా ఒక చిత్రాన్ని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ అవార్డు కమిటీకి పంపిస్తుంది. -
అనుమానమే పెనుభూతమై..
ప్రియురాలిని హతమార్చి తానూ ఆత్మహత్య శ్రీకాళహస్తిః ప్రియుురాలిని హతమార్చి తర్వాత తాను రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడో వివాహితుడు. సోవువారం రాత్రి ఈ దుర్ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. శ్రీకాళహస్తి వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు కథనం మేరకు వివరాలిలా .. కేవీబీ పురం వుండలం కళత్తూరుకు చెందిన గుణశేఖర్(38)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల కిందట అదే వుండలం రారుుపేడుకు చెందిన అరుణ(33)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అరుణ వివాహిత అరుునప్పటికీ భర్తతో విభేదా లతో ఒంటరిగా ఉంటోంది. అరుుతే ఇటీవల అరుణ వురో వ్యక్తితో స్నేహంగా ఉన్నట్లు గుణశేఖర్ అనుమానిం చాడు. దీంతో ఆమెను అంతమొందించాలని పథకం రచించాడు. అందులో భాగంగా శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు లాడ్జికి ఆమెను ఆదివారం రాత్రి తీసుకువచ్చాడు. సోవువారం ఆమెను గదిలో ఓ రోప్ సాయుంతో గొంతు బిగించి హతవూర్చాడు. వుృతి చెందిందని నిర్దారించుకున్న గుణశేఖర్ గదికి తాళం వేసుకుని శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడ సోవువారం రాత్రి రైలుకింద పడి వుృతి చెందాడు. గదినుంచి దుర్వాసన రావడంతో లాడ్జీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సవూచారం అందించారు. వుంగళవారం పోలీసులు తాళాలు పగలగొట్టి గదిలోకి వెళ్లడంతో అరుణ వుృతదేహం రోప్‌కు వేలాడుతూ కనిపించింది. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పట్టాలపై రైల్వే పోలీసులు ఓ వ్యక్తి వుృతదేహాన్ని గుర్తిం చిన విషయూన్ని తెలుసుకున్న శ్రీకాళహస్తి పట్టణ పోలీసు సిబ్బంది అక్కడికు వెళ్లి పరిశీలించారు. వుృతుని జేబులో లాడ్జికి చెందిన తాళంచెవి ఉండడాన్ని గుర్తించి కేవీబీపురంలో విచారణ చేపట్టారు. దీంతో హత్యోదంతానికి సం బంధించిన వాస్తవాలు వెలుగుచూశారుు. -
మనసు మార్చుకున్న గుణశేఖర్
చూడాలని ఉంది, ఒక్కడు లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. భారీ చిత్రాలతో అలరించిన ఈ డైరెక్టర్ ఇటీవల రుద్రమదేవి సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. కాకతీయ రాణి రుద్రమదేవి జీవితకథ ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమాతో 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాప్ లీగ్‌లో చేరిపోయాడు. అయితే ఈ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా ఇంతవరకు తన నెక్ట్స్ సినిమాను ప్రకటించలేదు. రుద్రమదేవి సినిమాకు సీక్వెల్‌గా ప్రతాపరుద్రుడు సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు గుణ. కానీ ఈ సినిమాకు తన అనుకున్న నటీనటులు ప్రస్తుతం ఖాళీగా లేకపోవటంతో ఆ ఆలోచనను వాయిదావేశాడు. ప్రస్తుతానికి అంతా కొత్తవారితో ఓ చిన్న సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం కథ రెడీ చేసే పనిలో ఉన్న గుణ, త్వరలోనే ఈ సినిమా వివరాలను వెల్లడించనున్నారు. -
గుణశేఖర్‌కు సహాయకులు కావాలట..!
రుద్రమదేవి సినిమాతో ఆకట్టుకున్న గుణశేఖర్, ఆ సినిమా రిలీజ్ తరువాత కనిపించడం మానేశాడు. ఈ చారిత్రక చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందించిన గుణ, సినిమా రిలీజ్ తరువాత మీడియాకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఆ తరువాత చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి లాంటి విషయాలను కూడా ప్రకటించలేదు. గుణ ప్రకటించకపోయినా.. రుద్రమదేవి సినిమా చివర్లో ప్రకటించినట్టుగా ప్రతాపరుద్రుడు సినిమాను తెరకెక్కిస్తారన్న టాక్ వినిపించింది. ఆ తరువాత రుద్రమదేవి సక్సెస్‌కు కారణమైన గోన గన్నారెడ్డి పాత్రను పూర్తి స్థాయిలో తెరకెక్కిస్తాడన్న మరో వార్త టాలీవుడ్లో హల్చల్ చేసింది. అయితే గుణశేఖర్ మాత్రం ఏ విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పుడు కూడా సినిమాకు సంబందించి ఎలాంటి ప్రకటన చేయని గుణ, అప్రెంటీస్‌లు, అసిస్టెంట్లు కావాలంటూ ప్రకటించాడు. తన తదుపరి చిత్రాల కోసం డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పని చేయడానికి అసిస్టెంట్లు కావాలంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు గుణ. త్వరలోనే గుణ తన కొత్త సినిమాకు సంబంధించిన పని మొదలెట్టే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. gteamworks.contact@gmail.com pic.twitter.com/WlxhnwJvi8 — Gunasekhar (@Gunasekhar1) February 3, 2016 -
వంద కోట్ల క్లబ్లో ‘రుద్రమదేవి’
షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్లో దర్శకుడు గుణశేఖర్ హన్మకొండ : కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవిత చరిత్రను తీసినందుకు గర్వంగా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆనాడు కాకతీయ మహారాణి నడయాడిన నేలపైనుంచి ప్రసంగిస్తున్నందుకు ఉద్విగ్నంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు ఆడిటోరియం చప్పట్లు, ఈలలతో హోరెత్తి పోయింది. రుద్రమాదేవి, తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ గురించి ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.... ఓరుగల్లు అనగానే ఓకే అన్నా.. ఇంటర్నేషన్ షార్ట్ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఆహ్వనం వచ్చిందని నాకు చెప్పగానే ఎక్కడా అని అడిగాను .‘ వరంగల్ ’.. అని చెప్పగానే వెంటనే ఓకే అన్నా. మూడు నెలలుగా ఎప్పుడెప్పుడు వరంగల్ వద్దామా అని ఎదురు చూస్తున్నా? నిర్వాహకులకు నేను ఫోన్ చేసి మరీ కార్యక్రమం కోసం వాకాబు చేశాను. రుద్రమాదేవి నడిచిన ఈ నేలలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ మరెన్నో ఫెస్టివల్స్‌కి నాంది కావాలి. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ తరహాలో ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరగాలి. రికార్డు కలెక్షన్లు ఎంతో వ్యయప్రయాసల కోర్చి నేను రుద్రమదేవి చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాను. మొత్తం రూ.70 కోట్ల వ్యయమైంది. కానీ అంతర్జాతీయంగా తెలుగు, తమిళ్, మళయాలం, హిందీల్లో కలిపి ఈ చిత్రం వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. యూఎస్ఏలో మహేశ్, పవన్ కళ్యాణ్ చిత్రాల తరహాలో వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. రుద్రమదేవి చిత్రం వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరినందుకు నేను గర్వపడటం లేదు. నాకు సన్మానాలు, సత్కారాలన్నా ఇష్టం లేదు. కానీ రుద్రమాదేవి వంటి చిత్రాన్ని నిర్మించాను, దర్శకత్వం వహించాను అని చెప్పుకునేందుకు గర్విస్తా. రుద్రమదేవి కోసం మాట్లాడేందుకు నేను ఇక్కడికొచ్చా. ఎందరో తెలుసుకుంటున్నారు రుద్రమదేవి సినిమా తీస్తున్నాని తెలియగానే కథ గురించి తెలుసుకున్న తమిళ్, మళయాలం, హిందీ వాళ్లు ఆశ్చర్యపోయారు. రుద్రమదేవి కోసం మా వాళ్లకు తెలియాలి అంటూ డబ్బింగ్ హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత గూగుల్‌లో రుద్రమాదేవి, కాకతీయ కింగ్డమ్, ఓరుగల్లు కోసం వెతుకుతున్నవారి సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన జాబితాలో రుద్రమదేవి మూడో స్థానంలో నిలిచింది. కేసీఆర్‌కు అభినందనలు ఏ ప్రాంతం వాడన్నది చూడకుండా రుద్రమదేవి సినిమా తీశానని చెప్పగానే నా భుజం తట్టి వినోదపన్ను రాయితీ ఇచ్చి ప్రోత్సహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చరి త్ర అంటే రేపటి దారిని చూపించే నిన్నటి వెలుగు. ఆనాడు చెరువుల ప్రాముఖ్యతను గుర్తించిన రుద్రమదేవి ఎన్నో చెరువులను తవ్వించారు. ఆ నాటి చరిత్రను గౌరవిస్తూ చెరువుల పునరుద్ధరణ పథకానికి మిషన్ కాకతీయ అని సీఎం కేసీఆర్ గారు పేరు పెట్టారు. ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. స్మార్ట్ఫోన్లు, డిజిటల్ కాలంలో కూడా ఎనిమిది వందల ఏళ్ల కిత్రం కాకతీయులు అవలంభించిన పద్ధతి నేటి ప్రభుత్వాలకు స్ఫూర్తిని ఇచ్చిందంటే.. మాటలు కాదు. పవర్ ఫుల్ మీడియా సినిమా అనేది పవర్ఫుల్ మీడియా. సినిమా రంగంలోకి ప్రవేశించేందుకు షార్ట్‌ఫిల్మ్ మేకింగ్ అనేది మంచి ఫ్లాట్‌ఫాం. ఎంతోమంది షార్ట్ఫిలిమ్ల ద్వారానే ఎదిగి పెద్ద దర్శకులు అయ్యారు. మా కాలంలో దర్శకుడు కావాలంటే నిర్మాత, హీరోలకు కథలు చెప్పి, ఒప్పించి, మెప్పించాల్సి వచ్చేది. ఇప్పుడు డిజిటల్ కెమోరాతో పనితనం చూపించి దర్శక అవకాశం పొందవచ్చు. ఇటీవల కాలంలో ఈ పద్ధతిలో ఎంతోమంది టాలీవుడ్లో దర్శకులయ్యారు. ఇంకా ఎంతో ఉంది రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు అనే ఒక సామెత ఉంది. అదే విధంగా ఓరుగల్లు నగరం కూడా ఒక్క రోజులో నిర్మించబడలేదు. రుద్రమదేవితో పాటు ఎందరో రాజులు ఉన్నారు. వీరందరి చరిత్ర మనం తెలుసుకోవాలి. ఇటలీకి చెందిన మార్క్పోలో చెప్పే వరకు మనకు రుద్రమదేవి గురించి ఎక్కువగా తెలియదు. మన చరిత్రను మనం తెలుసుకోవాలి. అందుకోసం ప్రయత్నాలు జరగాలి. ప్రపంచ వ్యాప్తంగా ఓరుగల్లుకు ప్రాచుర్యం రావాలి. అందుకే నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. తప్పకుండా ‘ప్రతాపరుద్ర - ది లాస్ట్ ఎంపరర్’ సినిమా నిర్మిస్తాను. మళ్లీ మళ్లీ వరంగల్‌కు వస్తాను. -
ఆ సినిమా చూసి సిగ్గుపడ్డా!
దాసరి నారాయణరావు ‘‘కేవీ రెడ్డి, బీయన్ రెడ్డి అవార్డులు ఇవ్వడం కొంత కాలం ఆపేయమని ఓ సందర్భంలో నిర్వాహకులకు సూచించాను. ఎందుకంటే మన దగ్గర డెరైక్టర్లు ఉన్నారు గానీ గొప్ప సినిమాలు తీస్తున్నవాళ్లు అరుదుగానే ఉన్నారు. వారిలో గుణశేఖర్ ఒకరు. అతనికి ఈ అవార్డు ఇవ్వడం ఎంతో సమంజసం’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి పేరు మీద యువకళావాహిని ఇస్తున్న ‘జగదేక దర్శకుడు కేవీ రెడ్డి’ అవార్డును దాసరి నారాయణరావు చేతుల మీదుగా గుణశేఖర్ అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో దాసరి మాట్లాడుతూ- ‘‘గుణశేఖర్ గొప్ప క్రియేటర్. అతను తీసిన ‘సొగసు చూడ తర మా’ సినిమా చూసి సిగ్గుపడ్డా. అంత గొప్పగా తీశాడు. రాజీపడడం తనకు తెలియదు. అతను అనుకున్న దారిలో సక్సెస్ అవుతూ వచ్చాడు. అతని జీవితం ఒక ఎత్తయితే, ‘రుద్రమదేవి’ మరొక ఎత్తు. గుణశేఖర్ ఇంకా గొప్ప సినిమాలు తీయాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ‘‘దర్శకుడు కేవీ రెడ్డిగారి ప్రభావం ఈ తరం దర్శకుల మీద చాలా ఉంది. దర్శకులు నిర్మాతలుగా మారితే వారి అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తీస్తారని దాసరిగారు తన ‘శివరంజని’ చిత్రం ద్వారా నిరూపించారు. అలాంటి ద ర్శకుని చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో దాసరిగారి మీద అవార్డు స్థాపిస్తే కచ్చితంగా దాని కోసం పోటీపడతాను’’ అని చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు రమేశ్‌ప్రసాద్, అశ్వినీదత్, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, హరనాథ్‌రావు, దివాకర్‌బాబు, తోటప్రసాద్, సంగీత దర్శకుడు మణిశర్మ, వ్యాపారవేత్త సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
గుణశేఖర్ చేసింది నిజంగా ఓ సాహసం : దాసరి నారాయణరావు
‘‘హిస్టారికల్ సినిమా చాలా డేంజరస్ జానర్. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ ఎంతో కష్టపడి తీశారు. అది మన చరిత్ర. ఆ తర్వాత నేను కృష్ణంరాజుతో ‘తాండ్ర పాపారాయు డు’ తీశా. అదీ ఆంధ్రుల చరిత్రే. 28 ఏళ్ల గ్యాప్ తర్వాత మన చరిత్రతో తీసిన ‘రుద్రమదేవి’ నిజంగా ఓ సాహసమే. నేనైతే ఇప్పట్లో ఈ సాహసం చేయలేను. కానీ గుణశేఖర్ చేశాడు’’ అని ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు అన్నారు. అనుష్క, అల్లు అర్జున్, రానా ముఖ్యతారలుగా స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మించిన ‘రుద్రమదేవి’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి ఈ చిత్రాన్ని చూసిన దాసరి నారాయణరావు సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి -‘‘అనుష్క లేకపోతే ఈ సినిమా లేదు అన్నంత బాగా చేసింది. సావిత్రి, జయసుధ, జయప్రద లాంటి నటీమణుల సరసన చేరిందని గట్టిగా చెప్పగలను. ఇక గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు. ఇలాంటి సినిమా గురించి చెప్పాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో ఉన్న సీనియర్స్‌కు ఉందని భావిస్తున్నా. ఇది తెలుగువారి కథ కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ చిత్రానికి పన్ను రాయితీ కల్పించాలని కోరుకుంటున్నా. సినిమా బాగుంది... స్టాండ్ అయ్యే సమయానికి రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇది ఎంత వరకు సమంజసం? ఎందుకు పోటీ? ఎవరు బాగు పడటానికి? ఎవరు నాశనం కావడానికి? పెద్ద హీరోలకు పండగలు అవసరం లేదు. వాళ్ల సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఆ రోజే పండగ. ఈ సినిమాకు వేరే సినిమా లేకుండా గ్యాప్ ఇస్తే కచ్చితంగా చరిత్ర సృష్టిస్తుంది’’ అని అన్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘దాసరిగారి సినిమాలు చూస్తూ ఎదిగిన నాకు ఆయనతో ఈ వేదికను పంచుకోవడం ఆనందంగా ఉంది. విమర్శకుల మేధస్సును మెప్పించలేకపోయానేమో గానీ, ప్రేక్షకులు మాత్రం వాళ్ల మనసుల్లో నాకు గొప్ప చోటునిచ్చారు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా చూసి దాసరి గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మర్చిపోలేను. ఇంత మంచి పాత్ర ఇచ్చిన గుణశేఖర్‌గారికి నా కృతజ్ఞతలు’’అని అనుష్క అన్నారు. ఈ సమావేశంలో రాగిణీ గుణ, నీలిమా గుణ, యుక్తాముఖి తదితరులు పాల్గొన్నారు. -
తెర మీదే కాదు.. వెనకా హీరోనే!
రుద్రమదేవి సినిమా మీద, అందులో ప్రధాన పాత్రలు పోషించిన అల్లు అర్జున్, అనుష్కల మీద దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. తెరమీద, తెర వెనక కూడా బన్నీ అసలైన హీరో అనిపించుకున్నాడంటూ మెచ్చుకున్నారు. ఈ విషయాలను ట్విట్టర్ ద్వారా అభిమానులందరికీ జక్కన్న షేర్ చేశారు. ఆయన ఏమన్నారంటే... ''ఎక్కడ చూసినా గోన గన్నారెడ్డే. సినిమా దాదాపు ఆగిపోతోంది అనిపించినప్పుడు బన్నీ ప్రవేశం ఒక్కసారిగా దాన్ని పునరుద్ధరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు వినోదపన్ను మినహాయింపు ఇవ్వడానికి ప్రధాన కారణం బన్నీయేనని తెలిసింది. తెరమీద కూడా అద్భుతంగా చేశాడు. తెరమీద, తెర వెనక కూడా తానే హీరో అనిపించుకున్నాడు. అందుకు గోన గన్నారెడ్డిని గౌరవించి తీరాల్సిందే. ఇక స్వీటీ.. నీ నిబద్ధత, నిజాయితీలు చూస్తే.. సినీ పరిశ్రమకు నువ్వో వరం అనిపిస్తుంది. రుద్రమదేవి పాత్రను వేరే ఎవ్వరూ పోషించలేరు. వీరభద్ర, రుద్రమదేవి మధ్య మరింత స్క్రీన్ టైమ్ ఉంటే మరింత బాగుండేదేమో అనిపించింది. కానీ రానా తన ప్రెజెన్స్ సినిమాలో బాగా చూపించుకున్నాడు. చారిత్రక సినిమాలు తీయాలనుకునే దర్శకులకు అతడు అద్భుతంగా ఉపయోగపడతాడు. శివదేవయ్య మరిన్ని రాజకీయ క్రీడలు ఆడి ఉంటే బాగుండేది. అయితే, ప్రకాష్ రాజ్ తానేంటో చూపించుకోడానికి అది చాలు. గుణశేఖర్, ఆయన బృందం మొత్తానికి అభినందనలు. ఇంత పెద్ద సినిమాను ప్రయత్నించి, రూపొందించి, విడుదల చేసి, బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నందుకు అభినందనలు.'' Gona Gannareddy all the way. When the film was almost stalled, bunny's entry into the cast revived it.Heard that it was again Bunny who was — rajamouli ss (@ssrajamouli) October 10, 2015 Instrumental in gettin the tax exemption.And he excelled on screen.A hero on screen and also off it.Respect Gannareddy.err..Gona Gannareddy — rajamouli ss (@ssrajamouli) October 10, 2015 Sweets, with your screen presence,dedication,commitment,sincerity u are a boon to the film industry.No one else could be rudramadevi..period — rajamouli ss (@ssrajamouli) October 10, 2015 Would Have loved more screen time for veerabhadra and rudramadevi. But Rana made his presence felt even with that. For any film maker who — rajamouli ss (@ssrajamouli) October 10, 2015 Wants to make a period film he is indispensable. Again would have loved more political game from sivadevayya, but guess that is enough for — rajamouli ss (@ssrajamouli) October 10, 2015 Prakashraj garu to excel. Congratulations to Gunasekhar garu and his team for attempting making releasing and garnering a huge success.. — rajamouli ss (@ssrajamouli) October 10, 2015 -
హిస్టరీ. హిజ్ స్టోరీ. హర్ స్టోరీ!
కొత్త సినిమాలు గురూ! హిస్టరీ అంటే చరిత్ర హిస్ స్టోరీ అంటే గుణశేఖర్ చెప్పిన చరిత్ర హర్ స్టోరీ అంటే రుద్రమ్మ చరిత్ర.పాళ్లు అటూఇటూ అయినా... అన్నీ కలగలిసి. అందరినీ అలరించే సినిమా స్టోరీ. రుద్రమదేవిలో ఒక సన్నివేశం ఉంటుంది. అప్పటి వరకూ రాజ్య ప్రజలు యువరాజు రుద్రదేవుణ్ణి చూడలేదు. చక్రవర్తి గణపతిదేవుడికి పుత్రోదయం అయ్యిందనీ పేరు రుద్రదేవుడనీ అతడు యుద్ధవిద్యలలో రణతంత్రాలలో రాటు దేలి రాజ్యపాలనకు సిద్ధంగా ఉన్నాడని వినడమే తప్ప ఎవరూ కళ్లతో చూసిన పాపాన పోలేదు. సందర్భం వస్తుంది. రాజవేడుకలలో భాగంగా మత్త గజాన్ని లోబరుచుకునే వీరుడి కోసం ప్రకటన వెలువడుతుంది. ఎవరూ ముందు రారు. వచ్చినవాడు ఓడి వెనుదిరుగుతాడు. అప్పుడు ప్రజలు అడుగుతారు- రుద్రదేవుణ్ణి ప్రవేశపెట్టండి... మత్తగజం పొగరణచి అతడి శౌర్యాన్ని ప్రదర్శించమనండి... కోరినట్టుగానే రుద్ర దేవుడు ప్రత్యక్షమవుతాడు. అందమైన తలపాగా, గిరిజాల జుట్టు, దారుఢ్యమెన శరీరాన్ని బిగించి కట్టిన వస్త్రాలు... మీసాలొక్కటే లేవు. రుద్రదేవుడు క్షణాల్లో మత్తగజాన్ని ఎదుర్కొంటాడు. కుంభస్థలంపై పిడికిళ్లతో మోది మోకాళ్ల మీద సాగిల పడేలా చేస్తాడు. ప్రజలందరూ హర్షధ్వానాలు చేస్తారు. వయసులో ఉన్న ఆడపిల్లలు, రాచకన్నెలు అతడి ఒక్క చూపు కోసం, కరస్పర్శ కోసం తహతహలాడిపోతుంటారు. అది చూసి చక్రవర్తి గణపతిదేవుడు ఉప్పొంగిపోతూ ‘రుద్రదేవుడికి పెళ్లి వయసు వచ్చింది. ఈ ఆడపిల్లల వరుస చూస్తుంటే ఎందరు యువరాణులు వలచనున్నారో... వారి కోసం ఎన్ని అంతఃపురాలు కట్టించాలో’ అంటాడు. అది విని మంత్రి శివదేవయ్య ప్రశ్నార్థకంగా చక్రవర్తి వైపు చూస్తాడు. చక్రవర్తి ఒక్క క్షణం పాటు సర్దుకొని వాస్తవంలోకి వస్తాడు. ఎందుకంటే రుద్రదేవుడు పురుషుడు కాదు... స్త్రీ కదా. రుద్రమదేవి కదా. థియేటర్లో ఉన్న ప్రేక్షకులు కూడా ఒక క్షణం రుద్రదేవుడు స్త్రీ అన్న సంగతి మర్చిపోతారు. ఒక వీరుడు పోరాడుతున్నట్టే. ఒక సబల, ధీరురాలు చేయదగ్గ పోరాటం అది. రుద్రమదేవిలో ఇలాంటి మలుపులు... కాకతీయ రాజ్యానికే పరిమితమైన విలక్షణ చారిత్రక వాస్తవాలు ఉన్నాయి. కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టడం ఎప్పుడూ సులువు కాదు. గణపతి దేవుడు తన పాలనా కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతడి వారసురాలిగా ప్రకటితమైనప్పటికీ రాచకిరీట ధారణ కోసం చాలా కాలం వేచి చూడవలసిన అగత్యం పట్టిన రుద్రమదేవి కూడా తన హయాంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయితే ఉన్న పరిస్థితుల నుంచి బయట పడటానికి పుట్టింది ఆడశిశువు అయితే మగబిడ్డగా ప్రకటన చేయడం మగబిడ్డగానే పెంచడం చివరకు ఇంకో ఆడపిల్లకు ఇచ్చి పెళ్లి చేసేవరకూ వెళ్లడం ఈ చరిత్రలో ఉన్న విలక్షణత. దర్శకుడు గుణశేఖర్ ఈ ఒక్క అంశం దగ్గరే కథ మొత్తం అల్లుకున్నాడు. ఈ రహస్యాన్ని కాపాడుకోవడం కథ. ఈ రహస్యాన్ని కాపాడుకుంటూ అసంతృప్తితో ఉన్న రక్త సంబంధీకులను, అధికారం కోసం చూస్తున్న సామంతులని, బయటి శత్రువులని ఎదుర్కొంటూ వచ్చి ప్రథమ శత్రువైన దేవగిరి ప్రభువు మహదేవ నాయకుణ్ణి ఓడించడంతో సినిమా ముగుస్తుంది. మలుపుతిప్పే సన్నివేశం... రుద్రదేవుడికి తాను ఆడపిల్లననే సంగతే తెలియదు. తెలియకుండా పెంచుతారు. కాని ఒకసారి స్నేహితులతో దొంగ చాటుగా వ్యాహ్యాళికి వెళతాడు. అక్కడ ఒక స్త్రీ శిల్పం ఉంటుంది. సాటి స్నేహితుడు ఆ స్త్రీ శిల్పంలోని అందచందాలను వర్ణిస్తాడు. వక్షం, నాభి, నడుము, ఊరువులు.... ఒక్కొక్కటీ వర్ణిస్తుంటే రుద్రదేవుడికి చెమటలు పడుతూ ఉంటాయి. ఇలా ఉంటే స్త్రీనా? ఇవన్నీ తనలో ఉన్నాయే.... దడదడలాడే గుండెలతో అంతఃపురానికి పరిగెడుతుంది. అద్దం ముందు నిలబడి ఒక్క పెట్టున పై వస్త్రాన్ని తొలగించి చూసుకుంటుంది. స్త్రీ. తనే స్త్రీ. ఎదుగుతున్న ఆడపిల్ల. ఆందోళనతో నిలదీస్తూ తల్లిని కావలించుకుంటుంది. కాని ఏ ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారో తెలుసుకుని తిరిగి ప్రజల కోసం మగవాడి అవతారంలోకి మారిపోతుంది. ఆ సందర్భంలో అంతవరకూ అబ్బాయిగా ఉన్న రుద్రదేవుడు చక్కటి ఆడపిల్ల వేషధారణలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. అలాగే ‘కౌముది ఉత్సవం’ పేరిట స్త్రీలు జరుపుకునే సరసవేడుకలో రుద్రదేవుడు తన సహజమైన స్త్రీ అంశతో ఉన్మత్తతతో రాచరిక ఆహార్యంలో కనిపించే సన్నివేశం కూడా దర్శకుడి రసాత్మకతకు, పాత్రధారి అయిన అనుష్క సౌందర్యానికి ఒక నిదర్శనం. సినిమాటిక్ స్వేచ్ఛ... చరిత్రలో అనేకం జరుగుతాయి. కొన్నింటిని ప్రజలు మరుగున పడేస్తారు. కొన్ని జరగకపోయినా జరిగినట్టుగా తమ సంతోషం కోసం చెప్పుకుంటారు. సినిమాలో సినిమా కథే ఉంటుంది. ఆ మేరకు దర్శకుడు, రచయితలు అవసరమైన స్వేచ్ఛ తీసుకున్నారు. రుద్రమదేవికి చాళుక్య వీరభద్రుడి(రాణా)కి కొన్ని ప్రేమ సన్నివేశాలు కల్పించారు. నిజ చరిత్రలో రుద్రమదేవికి తోడుగా నిలిచిన ప్రసాదాదిత్య పాత్రను (అజయ్) చివరి వరకూ కొనసాగించినా గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) పాత్రను పూర్తి స్వేచ్ఛతో మలుచుకున్నారు. నిజ చరిత్ర ఏదైనా ఇందులో మాత్రం గోన గన్నారెడ్డి అండర్ కవర్ ఆఫీసర్. పైకి గజదొంగలా తిరుగుతూ రుద్రమదేవికి శత్రువులా కనిపిస్తూ కాకతీయ రాజ్యానికి శత్రువులైన వారందరినీ చంపే రాజ విధేయుడు. సెకండాఫ్ గ్రాఫ్ రుద్రమదేవి పాత్ర ఆది నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రుద్రమదేవి స్త్రీ అయిన కారణాన ఆమెకు రాజ్యాధికారం ఇవ్వాల్సిన పని లేదు అని సామంతులు, ప్రజలు అభిప్రాయ పడుతున్నప్పుడు ఆమె పడిన సంఘర్షణ, ఆ సందర్భంలో మంత్రి పాత్రధారి ప్రకాష్‌రాజ్ వాదన ఆకట్టుకుంటాయి. క్లయిమాక్స్‌లో శత్రువులపై దాడి చేసి తన బలగాలతో ఆమె విజృంభించి పోరాడుతూ ఉన్నప్పుడు గోన గన్నారెడ్డి పాత్రధారి అల్లు అర్జున్ జత పడటం సగటు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.ద్వితీయార్ధం ప్రారంభమైన పదిహేను ఇరవై నిమిషాలకే రుద్రమదేవి పట్టాభిషిక్తురాలై సామంతులను శత్రువులను అణచే ప్రక్రియకు పూనుకుని ఉంటే ఆ క్యారెక్టర్ గ్రాఫ్ మరింత పెరిగి ఉండేదా అనే ఆలోచన వచ్చే అవకాశం ఉంది. ఎవరికెన్ని మార్కులు ఇది దర్శకుడు గుణశేఖర్ కల. తెలుగువారి సామ్రాజ్ఞి రుద్రమదేవి కథను సినిమాగా తీయాలనే ఆలోచన వచ్చినందుకే అతడు అభినందనీయుడు. నిర్మాణ పరంగా, మార్కెట్ పరంగా ఎన్నో ఎక్కుచిక్కులు ఉంటాయని తెలిసి కూడా పట్టుదల వీడకుండా సినిమా తీసినందుకు మరోసారి అభినందనీయుడు. సాంకేతికంగా నిర్మాణపరంగా మరిన్ని వనరులు, మద్దతు దొరికి ఉంటే ఇంకా బాగా తీసి ఉండేవాడని అనిపిస్తుంది. ‘బాహుబలి’లో అనుష్క అందాన్ని చూసే అవకాశం ప్రేక్షకులకు కలగలేదు. కాని ‘రుద్రమదేవి’లో మాత్రం ఒకవైపు మగటిమిని ప్రదర్శిస్తూనే మరోవైపు అత్యంత సున్నితత్వాన్ని, సౌందర్యాన్ని చూపించడంలో అనుష్క రాణించింది. రానా వీరుడుగా తన ముద్ర వేస్తాడు. ఇక గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ అందర్నీ ఆకట్టుకుంటాడు. తెలంగాణ యాస మాట్లాడుతూ అందులో ఒక రకమైన వ్యంగ్యం, హాస్యం కలగలిపి సినిమాకో రిలీఫ్‌లా నిలిచాడు. తక్కిన సంభాషణలు ఎలా ఉన్నా ఈ ఒక్క పాత్ర కోసం రాసిన సంభాషణలు బ్రహ్మాండం. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ ముందు వరుసలో ఉంటుంది. ఇళయరాజా ఆర్.ఆర్తో ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఇది స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్. త్రీడీ ప్రింట్లో చూడటం మంచి అనుభూతి. ముక్తాయింపు ఇది తెలుగువారి చరిత్ర ఆధారంగా తీసిన సినిమా. అందరూ చూడటానికి వీలుగా తీసిన సినిమా. ఇంకొన్ని పదార్థాలు పెడితే బాగుండనిపించవచ్చు. కాని వేసిన విస్తరి సంతృప్తి కలిగించే ప్రయత్నం చేస్తుంది. కర్పూరం సంగతి ఏమోగాని లవంగం గుచ్చిన తాంబూలం గ్యారంటీ. లండన్‌లోని ‘ది ఏంజెల్ స్టూడియో’లో ప్రపంచ ప్రసిద్ధ ఫిల్హార్మోనియా ఆర్కెస్ట్రాతో ‘రుద్రమదేవి’ నేపథ్య సంగీతాన్ని రికార్డ్ చేశారు ఇళయరాజా. హాలీవుడ్ ఫిల్మ్ ‘టైటానిక్’ నేపథ్య సంగీతం కూడా ఈ స్టూడియోలోనే రికార్డయింది. చెన్నైకి చెందిన ఎన్.ఎ.సి. వాళ్ళు ప్రత్యేకంగా డిజైన్ చేసిన అసలైన బంగారు నగల్ని ‘రుద్రమదేవి’ షూటింగ్లో వాడారు. ఆ నగల విలువ దాదాపు రూ. 5,00,00,000 మేకింగ్ ముచ్చట్లు సర్వసాధారణంగా సినిమాను 2డిలో చిత్రీకరించి, 3డిలోకి మారుస్తుంటారు. కానీ, ‘రుద్రమదేవి’ని పూర్తిగా 3డీలోనే తీయడం విశేషం. భారతదేశంలోనే మొట్టమొదటి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్ ఇది. ఈ 3డి చిత్రీకరణ కోసం హాలీవుడ్ స్టీరియోగ్రాఫర్లు, లాస్ ఏంజెల్స్ నుంచి టెక్నీషియన్లు ఇండియాకు వచ్చి పనిచేశారు. గతంలో ‘ట్రాన్స్ఫార్మర్- ఏజ్ ఆఫ్ ఎక్స్టిన్క్షన్’, ‘డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్’, ‘ది ఎమేజింగ్ స్పైడర్‌మ్యాన్’ లాంటి హాలీవుడ్ చిత్రాలకు లీడ్ స్టీరియోగ్రాఫర్‌గా పనిచేసిన మార్కస్ లాంక్సింజర్ ‘రుద్రమదేవి’ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. చారిత్రకంగా పక్కాగా ఉండడం కోసం ఢిల్లీ మ్యూజియమ్‌లోని చారిత్రక ఆధారాలను పరిశీలించి మరీ ఈ సినిమాలోని రుద్రమదేవి, గణపతిదేవుల కిరీటాలను డిజైన్ చేశారు.‘లగాన్’ సినిమాలో కథాకథనానికి అమితాబ్ బచ్చన్ నేపథ్య గళమందిస్తే, ఇప్పుడీ ‘రుద్రమదేవి’కి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ కథలో కీలకమైన బందిపోటు గోన గన్నారెడ్డి పాత్రను హీరో మహేశ్‌బాబు, చిన్న ఎన్టీయార్ లాంటి వాళ్ళు చేస్తారని మొదట్లో ప్రచారమైంది. చివరకు ‘వరుడు’ సినిమా షూటింగ్ టైమ్ నుంచే ‘రుద్రమదేవి’ స్క్రిప్ట్, ఈ పాత్ర గురించి తెలిసిన అల్లు అర్జున్ అన్కండిషనల్గా ఆ పాత్ర చేయడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు. రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడిగా ఈ సినిమాలో రానా 30 సార్లకు పైగా కాస్ట్యూమ్స్ మార్పులున్నాయి. దాదాపుగా ప్రతిరోజూ ఒక కొత్త కాస్ట్యూమ్స్‌లో ఆయన షూట్ చేసేవారట! ‘బాహుబలి’ షూటింగ్లో రానాకు గాయమవడంతో,‘రుద్రమదేవి’ దర్శక - నిర్మాతలు ఏకంగా ఒక షెడ్యూల్ మొత్తం వాయిదా వేశారు. ఈ సినిమాలో బాల నటులు కూడా పలువురు ఉన్నారు. ముఖ్యంగా, పలువురు సినీ ప్రముఖుల వారసులు ఈ బాల పాత్రలు పోషించడం విశేషం హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ 16 ఏళ్ళ చాళుక్య వీరభద్రుడిగా, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సహిదేవ్ 12 ఏళ్ళ గోన గన్నారెడ్డిగా నటించారు. ఇక, 9 ఏళ్ళ బాల రుద్రమదేవిగా హీరో శ్రీకాంత్ కూతురు మేధ తెరపైకి వచ్చింది. ఇంకా 14 ఏళ్ళ వయసు రుద్రమదేవిగా ఉల్క, 9 ఏళ్ళ మహదేవుడిగా యశ్వంత్ చేశారు. ఇంకోసారి చూస్తా... ఈ సినిమా ఓ అద్భుతం. నేను టూడీలో చూద్దామనుకుంటే మావాళ్ల బలవంతం మీద త్రీడీలో చూడాల్సివచ్చింది. మళ్లీ ఇంకోసారి చూస్తా. తెలుగు చరిత్రకు ఆమె మహారాణి. తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇస్తే బాగుంటుందేమో. - ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 80 కోట్లు. భారతదేశంలో ఇప్పటి వరకు తయారైన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ సినిమా ఇదే. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు రెండు వేల స్క్రీన్స్‌లో ‘రుద్రమదేవి’ సినిమా విడుదలైంది. ఈ నెల 16న తమిళంలో విడుదల కానుంది. ఒక్క త్రీడీ కన్వెర్షన్ కోసమే దాదాపు రూ. 12 కోట్లు వెచ్చించారని సమాచారం. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమైన కారణంగా మరో 10 కోట్ల రూపాయల భారం నిర్మాతలపై పడిందని బోగట్టా. షూటింగ్ డేస్: 195 గ్రాఫిక్ వర్క్: మూడేళ్లు - సాక్షి ఫ్యామిలీ -
రుద్రమదేవి’కి వినోదపన్ను మినహాయింపు
సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు... దర్శకుడు గుణశేఖర్‌కు ప్రశంసలు హైదరాబాద్: కాకతీయుల చరిత్ర, రాణీ రుద్రమదేవి జీవిత విశేషాలతో కూడిన అంశంతో నిర్మించిన రుద్రమదేవి చిత్రానికి వినోద పన్ను నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులివ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు తగిన ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చిత్ర నిర్మాత దిల్ రాజు, చిత్ర దర్శకుడు గుణశేఖర్, ఆయన కుటుంబసభ్యులు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. రుద్రమదేవి సినిమాను చూడాల్సిందిగా కేసీఆర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రుద్రమదేవి గొప్పతనాన్ని చిత్రీకరించినందుకు గుణశేఖర్‌ను సీఎం అభినందించారు. ఇలాంటి మరెన్నో చిత్రాలు నిర్మించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర చరిత్ర, ఇక్కడి రాజవంశీయుల గొప్పతనానికి సంబంధించిన కథాంశాన్ని ఎంచుకోవడం పట్ల దర్శక నిర్మాతను అభినందించారు. ఇలాంటి చిత్రాలను ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. -
మహేశ్‌బాబుకి నేనే ఫోన్ చేశా!
రాబిన్‌హుడ్! ఉన్నవాళ్లను దోచుకొని లేనివాళ్లకు పెట్టేవాడే రాబిన్‌హుడ్. అల్లు అర్జున్ అభిమానుల మనసు దోచుకోవడానికి గుణశేఖర్ అభిమానం గెలుచుకున్నాడు. ‘రుద్రమదేవి’లో రాబిన్హుడ్ను పోలిన గోన గన్నారెడ్డి పాత్రను పోషించిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... ►నేనే గుణశేఖర్‌ను గోన గన్నారెడ్డి పాత్ర అడిగా... ►పారితోషికం కూడా అడగకుండా చేశా... ►చిరంజీవిగారి 150వ సినిమా మీద కంటే 151వ సినిమా మీదే నా దృష్టి ఎక్కువగా ఉంది. ►రామ్‌చరణ్‌ను నాతో పోల్చితే అలా పోల్చాలి. ►మా అబ్బాయిని బైక్ మీద తిప్పాలని ఉంటుంది. కాని ఆ కోరిక తీరే వీలు లేదనే బాధ ఉంటుంది. ►ఇవాళ్టి మమ్మీలు సూపర్ మమ్మీలు. పిల్లల్ని వాళ్లు బాగా చూసుకుంటున్నారు... ఇలాంటి విశేషాలెన్నో ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకం... ►మీ కెరీర్‌ని విశ్లేషిస్తే ‘గంగోత్రి’ అప్పుడు ‘హీరోగా పనికొస్తాడా?’ అనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మీ స్టయిల్స్‌ని ఇతరులు ఫాలో అవుతున్నారు... అల్లు అర్జున్: ఇది ఒక్క రోజు ఎఫర్ట్ కాదు. చాలా ఎఫర్ట్ ఉంది. బేసిక్‌గా నేను కొంచెం వెస్ట్రన్ థింకింగ్ పర్సన్‌ని. నా సినిమాల్లో పాటలు, డ్యాన్సుల్లో ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. నాకు పనంటే ప్రేమ. ఎంత గొప్ప పని చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు.. చేసే పని గొప్పగా చెయ్యాలన్నది నా పట్టుదల. సింపుల్ ఎగ్జాంపుల్ రాజమౌళి. ఒక తెలుగు సినిమా డెరైక్టర్ అయ్యుండి ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఎదిగారంటే మామూలు విషయం కాదు. చేసే పనిని వంద శాతానికి మించి చేయడంవల్లే అది సాధించారు. చిరంజీవిగారు కూడా అలా పని చేయడంవల్లే ఈ స్థాయికి చేరుకున్నారు. ‘బాత్రూమ్ క్లీనర్’ అయినా వరల్డ్స్ బెస్ట్ అనిపించుకుంటే అతనంటే నాకు గౌరవం ఉంటుంది. ►చిరంజీవి అభిమానులే మీక్కూడా ఫ్యాన్స్‌గా ఉంటున్నారా లేక మీకంటూ కొత్తవాళ్లని సంపాదించుకోగలిగారా? చిరంజీవిగారి ఫ్యాన్ బేస్ నాకు ఉపయోగపడింది. ఆ తర్వాత మేం ప్రూవ్ చేసుకుంటే కొత్త అభిమానులు ఏర్పడతారు. థియేటర్ దగ్గర సందడి చేసే అభిమానులే కాదు.. సెలైంట్‌గా సినిమా చూసి వెళ్లిపోయే.. అంటే.. ఇంట్లో దాదాపు టీవీకి పరిమితమైన వాళ్లల్లో కూడా నన్ను ఓన్ చేసుకున్నవాళ్లు ఉన్నారు. అలాంటి సెలైంట్ ఫ్యాన్స్ గురించి వెలుగులోకి రాదు. ఎలక్షన్స్‌లా అన్నమాట. ఎన్నికల హడావిడి భారీగా ఉంటుంది. జనాలు సెలైంట్‌గా వచ్చి ఓటేసి వెళ్లిపోతారు (నవ్వుతూ). ►చిరంజీవి 150వ సినిమా ఎలా ఉంటే బాగుంటుందనుకుంటున్నారు? హానెస్ట్‌గా చెప్పాలంటే 150వ సినిమా పై నాకంత క్యూరియాసిటీ లేదు. అదెలా ఉన్నా చూస్తారు. 151వ సినిమా మాత్రం ఎలా ఉండాలని ఆలోచిస్తున్నా. ఆ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌లో చేయాలనుకుంటున్నాం. సో ఎలాంటి కథ చేస్తే చూస్తారు? డ్యాన్సులు చేయాలా? ఫైట్స్ కూడా రెచ్చిపోయి చెయ్యాలా? వంటివన్నీ ఆలోచించి ఆ సినిమా చెయ్యాలి. ►చిరంజీవిగారి అబ్బాయి రామ్‌చరణ్ కన్నా మీరు సక్సెస్ఫుల్ అని ఎవరైనా అంటే మీ రియాక్షన్ ఏంటి? చరణ్‌తో కంపేర్ చేయడం న్యాయం కాదు. నేను హీరో అయిన ఏడేళ్లకు తను హీరో అయ్యాడు. నా ‘పరుగు’ తర్వాత చరణ్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. మా ఇద్దర్నీ పక్క పక్కన చూసినప్పుడు కంపేర్ చేయాలనిపిస్తుందేమో. మా ఇద్దర్నీ నేనెలా పోల్చుతానంటే నా మొదటి సినిమా ‘గంగోత్రి’ని చరణ్ మొదటి సినిమా ‘చిరుత’నూ పోల్చుతాను. నాకన్నా బాగా చేశాడు. నా సెకండ్ మూవీ ‘ఆర్య’కన్నా తన సెకండ్ మూవీ ‘మగధీర’లో ఇంకా బాగా చేశాడు. నా ఏడో సినిమాతో తన ఏడో సినిమాని పోల్చితే తనే బాగా చేశాడు. ►వరుణ్ తేజ్ నుంచి మీకెలాంటి పోటీ ఉంటుంది? ఎవరికీ ఎవరూ పోటీ కాదు. ఎట్ ఎనీ పాయింట్ మనకు మనమే పోటీ. నా సినిమా బాగుంటే నాది చూస్తారు. ఒకవేళ వరుణ్ సినిమా బాగుంటే తనది చూస్తారు. ఇద్దరిదీ బాగా లేకపోతే చూడరు. సో.. ఇక్కడ ఎవరి సక్సెస్ వాళ్లదే. ఆ సక్సెస్ కోసం పోటీ పడాలి. ►ఇతర హీరోలతో ఎలాంటి పోటీ ఉంటుంది? డెఫినెట్‌గా మా మధ్య ప్రొఫెషనల్ రైవలరీ ఎక్కువగా ఉంటుంది. కానీ, పర్సనల్‌గా పోటీ పడం. ►చిన్నవయసులో ఎక్కువ సక్సెస్ చూశాననీ, కెరీర్‌పరంగా, కుటుంబపరంగా సెటిల్ అయ్యానని అనుకుంటున్నారా? నేనలా చిన్నవాడిలా కనిపిస్తున్నాను కానీ, నాకు 32 ఏళ్లు. ఇది యంగ్ ఏజ్ కాదు (నవ్వుతూ). 32ఏళ్లు వచ్చేశాయ్. హీరో అయ్యి, పదేళ్లయ్యింది. ఇంకా రిమార్కబుల్‌గా ఏం చేయలేకపోయామే అనే డిప్రెషన్ ఉంది. ఇంకా ఏదైనా చేయాలనే తపన ఉంది. ►‘సినిమా వాళ్లు’ అని కొంతమంది చిన్నచూపు చూస్తారు. ముందు తరంలో కొంత మంది గౌరవం తెచ్చారు. ఈ తరంలో మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, గోపీచంద్, మీరు.. ఇంకొంత మంది ప్రాపర్‌గా పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో గౌరవం పెరుగుతోంది. ఈ విషయంలో మీకెవరు ఇన్స్పిరేషన్? నాకు హీరోల భార్యల్లో మొదటి ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవిగారి వైఫ్, మా అత్తయ్య సురేఖ. ఆ తర్వాత ఇన్స్పిరేషన్ వెంకటేశ్‌గారి భార్య. రానా ద్వారా వెంకటేశ్‌గారి ఇంటికి వెళతాను కాబట్టి వాళ్లెలా ఉంటారో నాకు తెలుసు. ఆ ఫ్యామిలీస్‌లో ఉన్న మంచి క్వాలిటీస్‌ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. ►చిరంజీవి వైఫ్, వెంకటేశ్ వైఫ్ అప్పటి తరంవాళ్లు. మరి... ఈ తరం లేడీస్ గురించి? జనరలైజ్ చేసి చెప్పలేం. విలువలు ఉన్నవాళ్లు ఉన్నారు. అస్సలు వేల్యూస్ లేకుండా తిరిగేవాళ్లు ఉన్నారు. ఇప్పటి తరం లేడీస్ మోడర్న్‌గా ఉంటున్నారు కాబట్టి అప్పుడప్పుడూ మాత్రమే పిల్లలను చూసుకుంటారేమో అనుకునేవాణ్ణి. నా అభిప్రాయం తప్పు. నేను చూస్తున్న సొసైటీలో యంగ్ మదర్స్, మోడర్న్ మదర్స్ అందరూ సూపర్. పిల్లలను వాళ్లు పెంచే విధానం చూస్తుంటే హ్యాట్సాఫ్ అనాలనిపిస్తోంది. ►ఆడవాళ్లు ఎలా ఉంటే మీకిష్టం? బ్యాలెన్డ్స్‌గా ఉండాలి. గుడికి వెళ్లినప్పుడు అక్కడికి తగ్గట్టు, ఇంట్లో ఫంక్షన్‌కి అందుకు తగ్గట్టుగా, పార్టీలకు వెళ్లినప్పుడు దానికి సూట్ అయ్యేలా ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా వైఫ్ స్నేహ. ►మీరు, మీ భార్య స్నేహ... ముందు పాప పుట్టాలనుకున్నారా? బాబు కావాలనుకున్నారా? నేను బాబే పుట్టాలనుకున్నాను. అదే జరిగినందుకు ఆనందంగా ఉంది. ఆ సంగతలా ఉంచితే ఎవరు పుట్టినా హెల్దీగా పుట్టాలని కోరుకున్నాను. ఎక్కడో మనసులో అబ్బాయి అయితే బాగుంటుందనుకున్నా. ►ఎంతమంది పిల్లలు కావాలనుకుంటున్నారు? ఇద్దరు పిల్లలు కావాలని ఉంది. బాబు ఉన్నాడు కాబట్టి ఈసారి పాప పుట్టాలనుకుంటున్నాను. ►ఓ తండ్రిగా మీ అబ్బాయిని ఏ పార్కుకో, షాపింగ్‌కో తీసుకెళ్లాలని ఉంటుంది. ఓ స్టార్‌గా అది అంత ఈజీ కాదు కదా? అస్సలు ఈజీ కాదు. నాకైతే మా అబ్బాయిని బైక్ మీద తీసుకెళ్లాలని, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లాలని ఉంటుంది. కానీ కుదరదు. ఏ స్టార్ అయినా అలా పబ్లిక్‌లోకి రావడం కష్టమే. మా ఆవిడ అయితే చక్కగా మా అబ్బాయిని తీసుకుని షాపింగ్‌కి వెళుతుంది. నచ్చిన చోటుకి తీసుకెళ్లి ఆడిస్తుంటుంది. కానీ, నాకా అవకాశం లేదు. అందుకు బాధగానే ఉంటుంది. ►ఏజ్ పెరిగిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఉందా? రాజకీయాల్లోకి రావాలని లేదు కానీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ ఉంది. పాలిటిక్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటాను. ►ఓ 20 ఏళ్ల తర్వాత మీరెలా ఉంటారు? సినిమాలు చేస్తూనే ఉంటా. గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నా. ►ఓకే.. ఇప్పుడు ‘రుద్రమదేవి’ విషయానికొద్దాం... సాధారణంగా డెరైక్టర్లు హీరోలను పాత్రలు చేయమని అప్రోచ్ అవుతుంటారు. కాని గోన గన్నారెడ్డి కోసం గుణశేఖర్‌ని మీరే అప్రోచ్ అయ్యారట? నాకు ‘రుద్రమదేవి’ కథ తెలుసు. గుణశేఖర్‌ని కలిసిన సందర్భాల్లో ఈ కథ చెబుతుండేవారు. అది విన్నప్పుడు ఇలాంటి ‘బయో-ఎపిక్’ రాలేదు అనిపించేది. మొత్తం షూటింగ్ అంతా అయిపోయినా గోన గన్నారెడ్డి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని తెలిసి నా అంతట నేనే చేస్తానన్నాను. కానీ నా కోసం పాత్రను కొంత మార్చమన్నాను. గుణశేఖర్ మన్నించారు. మంచి సినిమా తీయాలనే తపనతో ఉన్న ఆయనను సపోర్ట్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నా. ►పారితోషికం కూడా అడగలేదట..? డబ్బులతో ముడిపెట్టుకుంటే కొన్ని చేయలేం. అప్పట్లో ఎన్టీఆర్, ఏయన్నార్ ఒకవైపు హీరోలుగా నటిస్తూనే మరోవైపు ఇలా సపోర్టింగ్ రోల్స్ చేసేవారు. ఎన్టీఆర్‌గారు తన రెండొందల చిత్రం- ‘కోడలు దిద్దిన కాపురం’లో సపోర్టింగ్ రోల్ లాంటిదే చేశారు. ఆయనే చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనిపించింది. ►అసలు గోన గన్నారెడ్డి ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు.. మరి గెటప్ విషయంపై మీరెలా కసరత్తులు చేశారు? నిజమే. రిఫరెన్సెస్ ఏవీ లేవు. పైగా అది నా కోసం రాసిన పాత్ర కాదు. వేరే ఏజ్ గ్రూప్ హీరో కోసం రాసినది. నేనేమో యంగ్. అందుకని నేను చేస్తానన్న తర్వాత నాకు తగ్గట్టు మార్చారు. ఆ కాలంలో ఎలాంటి దుస్తులు వాడేవాళ్లు అని మా అంతట మేం రిసెర్చ్ చేశాం. ఇందులో నాది రాబిన్ హుడ్ తరహా పాత్ర. బేసిక్‌గా దొంగ అంటే నలుపు రంగు దుస్తులు వేసుకుంటారు కాబట్టి నేనూ అవే వాడాను. అలాగే గోన గన్నారెడ్డి కొంత రాయలసీమ, ఎక్కువ తెలంగాణ అని తెలిసింది. అందుకే ఈ పాత్ర తెలంగాణ మాట్లాడితే బాగుంటుందనుకున్నాం. ఓ పదిహేను రోజులు ప్రాక్టీస్ చేశా. ►ఆ రోజుల్లో మగవాళ్లకు కూడా పొడవాటి జుత్తు ఉండేది. మరి.. మీ గోన గన్నారెడ్డి గెటప్ చూస్తుంటే, కురచ జుత్తుతో కనిపిస్తున్నారు? అప్పట్లో అందరికీ పొడవాటి జుత్తు ఉన్నా నా పాత్ర మాత్రం కురచ జుత్తుతోనే ఉంటుంది. దానికి క్లారిఫికేషన్ ఇచ్చాం. పొడవాటి జుత్తు ఉన్నవాళ్లని ‘బుర్ర శుకం’ అనేసి ట్యాగ్ చేసేవాళ్లట ఆ రోజుల్లో. గోన గన్నారెడ్డి లాంటి వాడు ఎదురు తిరిగి జట్టు కత్తిరించుకుని ఉంటాడని ఊహించుకుని ఇలాంటి అంశాలు జోడించాం. ►ఇది హీరో సినిమా కాదు. హీరోయిన్ సినిమా. విలన్లను తుదముట్టించే పాత్ర ఇందులో అనుష్కదే. దీనిపై ఏం ఆలోచించారు? (నవ్వుతూ) బేసిక్‌గా నాకు ఆడవాళ్లంటే చాలా గౌరవం. వాళ్లను గౌరవించే చిత్రం ఇది. స్త్రీ ఎందుకు రాజ్యాలను ఏలకూడదు? ఏలితే తప్పేంటి? అలాంటి వీర వనిత మీద తీస్తున్న సినిమాలో కీలక పాత్ర చేయాలనిపించింది. ఇలాంటి పాత్ర చేయడం అవసరమా... అని నన్ను వెనక్కి లాగడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఈ పాత్రకు నప్పుతాడా? అని అనుకున్నవాళ్లూ, సినిమా వస్తుందో? రాదో అన్నవాళ్లూ ఉన్నారు. కానీ, గుణశేఖర్ ఎన్ని కష్టాలు పడైనా విడుదల చేస్తారనే నమ్మకంతో చేశా. ►అనుష్క గురించి? అనుష్క లేకపోతే ఈ సినిమా లేదు. ఒక అమ్మాయిని నమ్మి 60- 70 కోట్లు ఖర్చుపెట్టడమా? అనే ప్రశ్న ఎవరినైనా వెనక్కి లాగే పాయింటే. కానీ అప్పట్లో శ్యాంప్రసాద్రెడ్డిగారు ‘అమ్మోరు’ తీశారు. ఆ తర్వాత అనుష్కతో ‘అరుంధతి’ తీశారు. తను నిరూపించుకుంది. ‘రుద్రమదేవి’గా తనే యాప్ట్ అని అందరూ అంగీకరిస్తారు. ►‘బాహుబలి’తో పోల్చే చాన్స్ ఉందేమో? కంపేర్ చేయకూడదు. ‘రుద్రమదేవి’, బాహుబలి అంత పెద్ద సినిమా కాదు. అందుకని బాహుబలితో పోల్చకుండా ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. బాహుబలి విజువల్ ప్రెజెంటేషన్ మూవీ. రుద్రమదేవి స్టోరీ ఓరియంటెడ్ మూవీ. ►హిందీ రంగంపై దృష్టి పెట్టడంలేదా? పెట్టాలంటే ఇక్కడి నా పదేళ్ల కెరీర్‌ని వదిలేసి అక్కడికెళ్లాలి. అది సాధ్యం కాదు. తమిళ్ చిత్రం, ద్విభాషా చిత్రాలు చేయాలని ఉంది. ► మల్టీస్టారర్స్ గురించి? కథ కుదిరితే రెడీ. కథ కుదిరినప్పుడు ఒక హిందీ హీరో, ఒక తెలుగు హీరో కలిసి చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. వాళ్ల వాళ్ల భాషల్లో ఆ హీరోలకు క్రేజ్ ఉంటుంది కాబట్టి సినిమా రెండు భాషల వాళ్లకీ రీచ్ అవుతుంది. ►హీరోగా కొనసాగడమేనా? నిర్మాణ రంగంలోకి వస్తారా? నాన్నగారు సినిమాలు నిర్మిస్తున్నారు. ‘100 పర్సంట్ లవ్’ కథ నాకు నచ్చింది. నాన్నగారికీ నచ్చడంతో ఇద్దరం కలిసి నిర్మించాం. అలా నాన్నగారికి కొన్ని ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పెడుతుంటా. ఇకపై సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. మనం బతికేసి వెళ్లిపోతే చాలదు. కొన్ని మంచి ఉదాహరణలు వదిలేసి వెళ్లాలన్నది నా లక్ష్యం. ►మహేశ్‌బాబుకి నేనే ఫోన్ చేశా! ‘శ్రీమంతుడు సినిమా చూసి హీరోల్లో ఎవరైనా మీకు ఫోన్ చేసి అభినందించారా’ అని ఓ ఇంటర్వ్యూలో మహేశ్‌బాబుని అడిగితే ‘రామ్‌చరణ్ తప్ప ఎవరూ చేయలేదు’ అన్నారు. ఈ విషయం గురించి మీరేమంటారు? అని అడిగితే - ‘ప్రభాస్, రానా వంటి హీరోలతో నాకు పరిచయం ఉంది కానీ మహేశ్‌తో పెద్దగా పరిచయం లేదు. ‘శ్రీమంతుడు’ గురించి నేను వేరే వాళ్ల దగ్గర అభినందించాను. నాకు మహేశ్‌తో పరిచయం లేదు కాబట్టి తనతో చెప్పమని అన్నాను. వాళ్లు చెప్పలేదు. రాంచరణ్ తప్ప ఎవరూ చేయలేదనే మాట వినగానే, మహేశ్‌కి ఫోన్ చేసి ‘సారీ.. నేనే ఫోన్ చేసి ఉండాల్సింది. మీతో పెద్దగా పరిచయం లేదు కాబట్టి ఫోన్ చేయలేదు. నాకు సినిమా నచ్చింది. చాలా బాగా చేశారు’ అన్నాను. ఆయన కూడా ‘ఇట్స్ ఓకే’ అంటూ బాగా మాట్లాడారు’’ అని చెప్పారు. ►మన తెలుగులో పరభాషల క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువయ్యారు.. ఆ విషయం గురించి ఏమంటారు? మన తెలుగులో మంచి నటులు ఉన్నారు కానీ, గొప్ప నటులు లేరు. అందుకే ఇతర భాషలవాళ్లను తీసుకోవాల్సి వస్తోంది. ఫిజిక్ వైజ్‌గా తీసుకున్నా కూడా హిందీ నుంచి వస్తున్నవాళ్లకీ, ఇక్కడివాళ్లకీ చాలా తేడా ఉంది. ‘మేం ఉండగా వేరే భాషలవాళ్లు ఎందుకు?’ అని మనవాళ్లు అనుకోవడంలో న్యాయం ఉంది. నా సినిమాల్లో నేనెక్కువగా తెలుగు వాళ్లనే తీసుకోవాలనుకుంటాను. కానీ ఒక్కోసారి పాత్రకు అనుగుణంగా ఇతర భాషలవాళ్లని తీసుకోక తప్పడంలేదు. - డి.జి. భవాని -
శ్రీవారి సేవలో ‘రుద్రమదేవి’
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని బుధవారం ఉదయం ‘రుద్రమదేవి’ చిత్ర బృందం దర్శించుకుంది. చిత్ర దర్శకుడు గుణశేఖర్, హీరోయిన్ అనుష్కలతో పాటు పలువురు యూనిట్ సభ్యులు వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 9 న రుద్రమదేవి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సినిమా మొదటి కాపీని శ్రీవారి పాదాల ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీస్పులు తీసుకున్నట్టు వారు తెలిపారు. హీరోయిన్ అనుష్కను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. -
ఇంకా వండర్స్ చేస్తాను!
►గుణశేఖర్ మొండివాడు... అంతకుమించి కార్యసాధకుడు. ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద కలలు కంటూ ఉంటాడు... ► ఆ కలల్ని నిజం చేసుకోవడం కోసం అహోరాత్రులు శ్రమిస్తాడు... ప్రాణం పెట్టేస్తాడు. సినిమాపై ఉండే ► ఆ వ్యామోహమే అతన్ని ఇంత హైట్స్‌లో కూర్చోబెట్టింది. గుణశేఖర్ కొన్నేళ్ల నాటి కల ‘రుద్రమదేవి’... ► సెల్యులాయిడ్‌పై ఈ నెల 9న ఆవిష్కృతం కానుంది. ఈ సందర్భంగా గుణశేఖరుని వ్యూస్... My రుద్రమదేవి ఇక్కడ ‘మై’ అని ఎందుకంటున్నానంటే, రుద్రమదేవి జీవితం... ఆమె సాహసం... వ్యక్తిత్వం నన్నంతగా ప్రభావితం చేశాయి. రుద్రమదేవి కథ చదివినవాళ్లు కూడా అలాగే ఫీలవుతారు. ఎప్పుడో ఎనిమిదో తరగతిలో ఉపవాచకంగా చదివిన ‘రుద్రమదేవి’ ఆ క్షణం నుంచి నన్ను వెంటాడుతూనే ఉంది. ‘బ్రేవ్ హార్ట్’ అనే హాలీవుడ్ మూవీ చూసినప్పుడు మాత్రం ఇలా గ్రాండియర్‌గా ‘రుద్రమదేవి’ తీస్తే బావుంటుందనిపించింది. ‘ఒక్కడు’ తర్వాత నుంచే ఇందుకు సంబంధించి నా ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్‌గా 25-30 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే అందరూ భయపడ్డారు. గోన గన్నారెడ్డి వ్యూలో తీయమని చాలామంది సలహా ఇచ్చారు. నాకలా చేయడం ఇష్టం లేదు. అప్పటి నుంచీ ‘రుద్రమదేవి’ చేయాలని అనుకుంటున్నా, కాలం కలిసిరాలేదు. చివరకు నేనే రంగంలోకి దిగా. ఈ విషయంలో నా కుటుంబం మొత్తం నాకు అండగా నిలబడ్డారు. అలాగే అనుష్క, బన్నీ, రానా, ప్రకాశ్‌రాజ్, నిత్యామీనన్, ఇళయరాజా... ఇలా ఈ టీమ్ మొత్తం నన్ను నమ్మారు. ఈ కథను నమ్మారు. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ 9న మీ ముందుకు సినిమా తీసుకురాగలుగుతున్నా. ఇండియాలోనే ఫస్ట్ హిస్టారికల్ మూవీ ఇది. రుద్రమదేవి పుట్టుక నుంచి ఈ సినిమా మొదలవుతుంది. ఆమె విక్టరీస్లోని ప్రధాన ఘట్టం వరకూ ఈ సినిమా ఉంటుంది. 2 గంటల 38 నిమిషాల నిడివిలో ఆమె చరిత్ర అంతా చూపడం అసాధ్యం. అందుకే భవిష్యత్తులో ‘ప్రతాపరుద్రుడు’ కథతోనూ సినిమా చేస్తాను. ‘రుద్రమదేవి’ పాత్రకు అనుష్క ఎంపిక అనేది పబ్లిక్ ఛాయిస్. ‘అరుంధతి’తో పోలిక వస్తుందేమోనని నేను తటపటాయిస్తుంటే, అందరూ అనుష్కను మించిన ఆప్షన్ లేదని చెప్పారు. ‘రుద్రమదేవి’ చరిత్ర యథాతథంగా ఎక్కడాలేదు. ఒక టీమ్‌ను పెట్టి ఎంతో పరిశోధన చేసి ఈ స్క్రిప్ట్ రెడీ చేశా. అందరూ ఈ చిత్రాన్ని ‘బాహుబలి’తో కంపేర్ చేస్తున్నారు. అది జానపదం. ఇది చారిత్రకం. నా దగ్గర డబ్బులున్నా యని వేయి స్తంభాల గుడి బదులు, పదివేల స్తంభాల గుడి కట్టలేను కదా. ఏది ఏమైనా ఇదొక మహాయజ్ఞం. రేపు తెరపై చూస్తే మీరే అంగీకరిస్తారు. My Motive నమ్మిన లక్ష్యం కోసం త్రికరణ శుద్ధిగా పని చేసుకుంటూ వెళ్తే విజయం దానంతట అదే వరిస్తుంది. My Dreams ఈ రోజు కలలు రేపు ఉండవు. రేపటి కలలు ఎల్లుండికి ఉండవు. కానీ కొన్ని కలలు మాత్రం పర్మినెంట్‌గా మనతోనే ట్రావెల్ చేస్తుంటాయి. వాటిని నెరవేర్చుకోవడమే నా లక్ష్యం, లక్షణం. ‘రుద్రమదేవి’ లాంటి వండర్స్ ఇంకా చేస్తాను. My Strength ఇమాజినేషన్... ఊహించగలగడం... కలలు కనడం... ఇవే నన్ను దర్శకునిగా ఇన్నేళ్లూ నిలబెట్టాయి. ఇంకా నిలబెడతాయి కూడా. ఇక పర్సనల్‌గా నా స్ట్రెంగ్త్ ఏంటంటే... నా డెడికేషన్. ఏదైనా అనుకుంటే వేరే యావగేషన్స్ లేకుండా అనుకున్నది సాధించగలను. My Family సక్సెస్ వస్తే... నేను మారను. ఫెయిల్యూర్ వస్తే... వాళ్లలో మార్పు ఉండదు. దట్స్ మై ఫ్యామిలీ స్ట్రెంగ్త్. My Favorite Movies 1. గాన్ విత్ ద విండ్ 2. కాగజ్ కే పూల్ 3. షోలే 4. శంకరాభరణం 5. ముత్యాల ముగ్గు 6. శివ. My Top 5 Movies 1. రామాయణం: పిల్లలతో చిన్న డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడమే చాలా కష్టం. అలాంటిది - అంతా చిన్న పిల్లలతో సినిమా చేయడం అసాధ్యాలకే అసాధ్యం. మేం సాధించాం. నా లైఫ్‌లో ఓ మైల్ స్టోన్ అది. 2. ఒక్కడు: ఒక ఆఫ్ బీట్ స్టోరీని కమర్షియల్‌గా మెప్పించడమంటే రిస్కే. ఎంతటి బ్లాక్ బస్టరైనా కొన్ని వర్గాలకే పరిమితమవుతుంది. ఈ సినిమాతో అవన్నీ చెరిపేయగలిగాం. 3. సొగసు చూడతరమా: మన పక్కింట్లో జరిగే కథను కిటికీలోంచి చూస్తున్నంత సహజాతి సహజంగా తీశామీ సినిమా. 4. చూడాలని ఉంది: చిరంజీవితో రెగ్యులర్ ప్యాట్రన్‌లో వెళ్లకుండా తీసిన సినిమా. రైల్వేస్టేషన్లో చిరంజీవి-అంజలా జవేరీపై తీసిన 10 నిమిషాల లవ్‌ట్రాక్ ఒక్కటి చాలు... మేమెంత భిన్నంగా వెళ్లామో చెప్పడానికి. 5. అర్జున్: అక్కా తమ్ముళ్ల కథను ఇంతవరకూ ఈ యాంగిల్లో ఎవరూ ప్రెజెంట్ చేయలేదు. -
అక్టోబర్ 9నే రుద్రమదేవి
తెలుగు సినిమా చరిత్రలో మరొక ప్రతిష్ఠాత్మక ప్రయత్నం జనం ముందుకు రావడానికి అన్ని విధాలా రంగం సిద్ధమైంది. మన తెలుగు జాతి చరిత్రకు అద్దం పట్టే కాకతీయ సామ్రాజ్య విజయగాథ ‘రుద్రమదేవి’ సరిగ్గా మరో 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అలరించనుంది. దర్శక - నిర్మాత గుణశేఖర్ దాదాపు మూడేళ్ళుగా చేస్తున్న ఈ భారీ చిత్రం అక్టోబర్ 9న రిలీజవడం కన్ఫర్మ అయింది. అటు 3డీలో, ఇటు రెగ్యులర్ 2డీలో - రెండు రూపాల్లోనూ ఈ చారిత్రక కథా స్వప్నం దేశవిదేశాల్లో తెరపై కనిపించనుంది. అగ్ర కథానాయిక అనుష్క ప్రాణం పెట్టి, ప్రధాన పాత్ర పోషించగా, గుణశేఖర్ తన సర్వశక్తులూ ఒడ్డి చేసిన వెండితెర యజ్ఞం - ‘రుద్రమదేవి’ గురించే ఇప్పుడందరి డిస్కషన్. నాలుగు భాషల్లో... అదే డేట్లో... ఈ సినిమా రిలీజ్ టైవ్‌ు గురించి ఇటీవల వ్యక్తమవుతున్న అనుమా నాలు, అసత్య ప్రచారాల నేపథ్యంలో అసలు నిజం కనుగొనేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. వివిధ వర్గాలతో మాట్లాడింది. ‘‘సంక్లిష్టమైన 3డీ టెక్నాలజీ సినిమా కావడం, తెరపై అడుగడుగుకీ ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా నిర్మాణంలోనూ, నిర్మాణానంతర కార్యక్రమా ల్లోనూ ఈ భారీ చిత్రం ఆలస్యమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో గతంలో కొన్నిసార్లు రిలీజ్ వాయిదా పడింది. దాంతో, రిలీజ్ డేట్ గురించి కొందరు అనుమానంగా మాట్లాడుతున్నారు. కానీ, సినిమా వర్క్ మొత్తం పూర్తయిపోయింది. ఇప్పటికే సెన్సార్ కూడా అయిపోయింది. అక్టోబర్ 9న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ‘రుద్రమదేవి’ రిలీజ్ అవుతోంది’’ అని చిత్ర యూనిట్ వర్గాలు ‘సాక్షి’కి స్పష్టం చేశాయి. ప్యాచ్ వర్‌కకీ... ఫారిన్ మ్యుజీషియన్ ఆంతరంగిక వర్గాల ప్రకారం - ఈ సినిమాకు వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఇప్పటికే వచ్చేశాయి. వాటన్నిటి 3డీ కన్వర్షన్ శరవేగంతో జరిగిపోతోంది. తెరపై దృశ్యాల్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చే ‘డిజిటల్ ఇంటర్మీడియట్’ (డి.ఐ) వర్కతో ముంబయ్‌లో సినిమాకు మెరుగులు దిద్దుతున్నారు. విశేషం ఏమిటంటే, ఈ సెల్యులాయిడ్ శిల్పాన్ని ఆడియన్సకు కన్నుల పండుగగా మలచడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ గుణశేఖర్ వదిలి పెట్టడం లేదు. ఈ చిత్రం రీరికార్డింగ్‌ను విదేశాల్లో జరిపారు. ఇటీవలే ఈ చిత్రంలో ఒకటి రెండు చోట్ల రీరికార్డింగ్‌లో కొత్తగా ప్యాచ్‌వర్‌క చేస్తే బాగుంటుందని ఆయన, సంగీత దర్శకుడు ఇళయరాజా భావించారు. అంతే, ఖర్చుకు వెనుకాడకుండా హంగేరీ నుంచి డజను మంది మ్యుజీషి యన్‌సను మళ్ళీ ప్రత్యేకంగా ఇండియాకు పిలిపించారు. వాళ్ళతో నాలు గైదు రోజుల పాటు శ్రమించి, ఆ దృశ్యాలకు కొత్త సొబగులు కూర్చారు. సక్సెస్ఫుల్... చారిత్రక ఫార్ములా అల్లు అర్జున్ (గోన గన్నారెడ్డి), రానా (రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడు) లాంటి ఎందరో స్టార్స నటించిన ఈ చిత్రానికి చాలానే ప్రత్యేకతలున్నాయి. దాదాపు రూ. 70 కోట్ల పైగా ఖర్చుతో రూపొందిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం ఇది. మలయాళ, తమిళ, కన్నడ, మరాఠా నేలల దాకా తెలుగువారి అధికారాన్ని విస్తరించి, మన ఖ్యాతిని దక్షిణ భారతదేశమంతటా వ్యాప్తి చేసిన కాకతీయ సామ్రాజ్యపు కథకు తొలిసారిగా వెండితెర రూపం ఇది. ఎన్టీఆర్ ‘సమ్రాట్ అశోక’ (1992) తరువాత 23 ఏళ్ళకు తెలుగులో భారీ తారాగణంతో వస్తున్న చారిత్రక కథా చిత్రం కూడా ఇదే. గతంలో తెలుగులో వచ్చిన ‘పల్నాటి యుద్ధం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరసు’, ‘అల్లూరి సీతారామరాజు’ లాంటి చారిత్రక కథాచిత్రాల్లో నూటికి 95 శాతం హిట్లే. ఆ కోవలోనే ఈ సినిమానూ పకడ్బందీగా తీర్చిదిద్దారు. టాప్ క్లాస్ టెక్నీషియన్ల శ్రమ టెక్నికల్ అంశాల్లో కూడా ఈ సినిమా వెనుక చాలా శ్రమే ఉంది. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డీ ఫిల్మ్. ఈ 3డీ చిత్ర నిర్మాణం కోసం గుణశేఖర్ ఏకంగా విదేశాలకు వెళ్ళి, ప్రత్యేకంగా 3డీ ఫిల్మ్ మేకింగ్ కోర్స కూడా చేసి వచ్చారు. ఇన్నేళ్ళ తన అనుభవాన్ని ఈ సినిమా కోసం వినియోగించారు. చిన్నప్పుడు చదివిన వీరనారి ‘రుద్రమదేవి’ కథను తెరకెక్కించాలన్న గుణశేఖర్ చిరకాల స్వప్నాన్ని నిజం చేయడానికి కృషి చేసిన ఇళయరాజా (మ్యూజిక్), తోట తరణి (ఆర్ట డెరైక్టర్), శ్రీకర్ ప్రసాద్ (ఎడిటింగ్), ‘జోధా అక్బర్’ ఫేవ్‌ు నీతా లుల్లా (కాస్ట్యూవ్‌ు్స) అందరూ జాతీయ అవార్డు విజేతలైన సినీ సాంకేతిక నిపుణులే కావడం మరో విశేషం. చారిత్రక కథతో చేస్తున్న ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధం లాంటి ఎమోషన్లూ చాలా ఉన్నాయి. ఇన్ని విశేషాలున్న ఈ చిత్రం కోసం... లెటజ్ వెయిట్ ఫర్... అక్టోబర్ 9. -
రుద్రమదేవి.. వచ్చేస్తోంది!
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన భారీ పౌరాణిక చిత్రం రుద్రమదేవి విడుదలకు ముహూర్తం దగ్గర పడింది. ఈ విషయాన్ని ఈ సినిమాలో చాళుక్య వీరభద్రుడి పాత్ర పోషించిన రానా దగ్గుబాటి మంగళవారం రాత్రి ట్వీట్ చేశాడు. టైటిల్ రోల్లో అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్, గణపతి దేవుడి పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు తదితరులు నటించిన ఈ భారీ చిత్రం విడుదల ముహూర్తం ఎప్పుడన్నది మాత్రం ఇంతవరకు తెలియలేదు. అయితే, బాహుబలి తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసిన తర్వాత.. దాదాపు అదే సమయంలో షూటింగ్ జరుపుకొన్న రుద్రమదేవి సినిమా ఎలా ఉంటుందన్న విషయంపై కూడా అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా త్వరలోనే విడుదల అవుతుందంటూ రానా చేసిన ట్వీట్.. అందరికీ ఆశలు కల్పిస్తోంది. Coming soon!! pic.twitter.com/PgwMyxVbCE — Rana Daggubati (@RanaDaggubati) September 15, 2015 -
అతడే ఆమె సైన్యం
సినిమా వెనుక స్టోరీ - 12 చార్మినార్ దగ్గర కేఫ్‌లో కూర్చుని చాయ్ తాగుతున్నాడు గుణశేఖర్. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు సినిమా పని మీద ఎప్పుడొచ్చినా గుణశేఖర్ చార్మినార్ దగ్గరకొచ్చి... ఆ కట్టడం, వాతావరణం చూస్తూ ఓ చాయ్ తాగాల్సిందే. అప్పుడుగాని ట్రిప్ సక్సెస్ అయినట్టు కాదు. గుణశేఖర్ అప్పుడు చెన్నైలో అసిస్టెంట్ డెరైక్టర్. రేపు డెరైక్టరయ్యాక ఈ చార్మినార్ దగ్గరే సినిమా తియ్యాలి. గుణశేఖర్ అలా అనుకోవడం అది ఫస్ట్ టైమ్ కాదు. వందోసారో, నూట పదహారో సారో అయ్యుంటుంది. ‘వెస్ట్ సైడ్ స్టోరీ’... పాపులర్ హాలీవుడ్ మ్యూజికల్ ఫిల్మ్. ఈ సినిమా మీద గుణశేఖర్‌కు లవ్ ఎట్ ఫస్ట్ సైట్. తీస్తే అలాంటి సినిమా తీయాలి. రెండు కుర్ర గ్యాంగ్‌లు... వాటి మధ్య కాంపిటీషన్. ఇక్కడ కూడా గుణశేఖర్ మర్చిపోలేదు... చార్మినార్‌ను. ఆ గ్యాంగ్‌ల మధ్య గొడవను మాత్రం స్ఫూర్తిగా తీసుకొని, తెలుగు నేటివిటీ కథతో చార్మినార్ సాక్షిగా, పాతబస్తీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే? గుణశేఖర్ రాయడం మొదలుపెట్టాడు. రాస్తూనే ఉన్నాడు. ఎంతకీ తరగదే?! కొన్నేళ్ళ తరువాత... హైదరాబాద్... రామానాయుడు స్టూడియో. ‘చూడాలని వుంది’ రీ-రికార్డింగ్ జరుగుతోంది. దర్శకుడు గుణశేఖర్ ఫుల్ బిజీ. ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వచ్చారు. ‘‘సారీ సర్! ఈ రోజు మీ కొత్త సినిమా ఓపెనింగ్‌కి రాలేకపోయాను. వర్క్ బిజీ’’ అంటూ గుణశేఖర్ ఎక్స్ప్లనేషన్. ‘‘ఏం పర్లేదు గుణా’’ అన్నారు అశ్వినీదత్. ‘‘కృష్ణగారబ్బాయ్ మహేశ్‌బాబు ఎలా ఉన్నాడు?’’ ఆసక్తిగా అడిగాడు గుణశేఖర్. ‘‘చాలా బావున్నాడు. నిజంగా ‘రాజకుమారుడు’లాగానే ఉన్నాడు’’ అంటూ పొద్దుటి సినిమా ఓపెనింగ్ గురించి హుషారుగా చెప్పారు అశ్వినీదత్. కారులో ఫొటోషూట్ స్టిల్స్ తెప్పించి, గుణశేఖర్‌కి చూపించారాయన. మహేశ్ ఒక్కో ఫొటో చూస్తుంటే గుణశేఖర్ మైండ్‌లో ఏవేవో ఫ్లాషెస్. చార్మినార్ టాప్ మీద వెన్నెల్లో చందమామను చూస్తూ, సిగరెట్ తాగుతూ ఓ కుర్రాడు. ఆ కుర్రాడు అచ్చం మహేశ్‌బాబులా ఉన్నాడు. నెక్ట్స్ వీక్ వైజయంతి మూవీస్ ఆఫీసు కొచ్చాడు మహేశ్. గుణశేఖర్ అక్కడే ఉన్నాడు. ఇద్దరూ సరదా చిట్‌చాట్. చార్మినార్ బ్యాక్‌డ్రాప్‌లో తాను అనుకుంటున్న స్టోరీలైన్ గురించి చెప్పాడు గుణశేఖర్. మహేశ్ థ్రిల్లయిపోయాడు. ‘‘డెఫినెట్‌గా మనం చేద్దాం సర్! మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ’’ అంటూ ఉత్సాహపడిపోయాడు. ‘మృగరాజు’ ఫ్లాప్. గుణశేఖర్‌కి పెద్ద దెబ్బ. ఆ టైమ్‌లో కూడా గుణశేఖర్ మైండ్‌లో చార్మినారే కనబడుతోంది. ఎస్... ఆ కథకు టైమొచ్చింది. మళ్లీ ఆ కథ మీద కూర్చున్నాడు గుణశేఖర్. ఆ రోజు పేపర్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ల నాన్నగారికి స్పోర్ట్స్ అంటే ఇంట్రస్ట్ లేకపోవడం, గోపీచంద్ ఎన్నో కష్టాలుపడి స్పోర్ట్స్ చాంపియన్‌గా ఎదగడం... ఇదంతా గుణశేఖర్‌కి ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఎస్... నా కథలో హీరో కూడా ఇలాంటి వాడే. తండ్రి వద్దంటున్న స్పోర్ట్స్‌లో ఎదగాలనుకుంటాడు. గుణశేఖర్ ఓ నవలలాగా స్క్రిప్టు రాస్తున్నాడు. పేజీలకు పేజీలు... నిర్మాత రామోజీరావు ఆఫీసు... గుణశేఖర్ లైన్ చెబుతుంటే రామోజీ రావు చాలా ఇదైపోయారు. ‘‘చాలా బాగుంది కథ. మనం చేద్దాం. చార్మినార్ని ఇక్కడ ఫిలింసిటీలోనే కన్స్ట్రక్ట్ చేసేద్దాం. ఎన్ని కోట్లు ఖర్చయినా పర్లేదు’’ అని చెప్పేశాడాయన. గుణశేఖర్ ఏళ్లనాటి కల నిజం కాబోతోంది. కానీ అంతలోనే బ్రేక్. రామోజీరావు ప్లేస్‌లో ఎమ్మెస్ రెడ్డి వచ్చారు. ఆయన కూడా యమా ఉత్సాహం. మళ్లీ బ్రేక్. ఏవేవో అవాంతరాలు. పద్మాలయా స్టూడియో... మహేశ్, గుణశేఖర్ ఇద్దరే కూర్చున్నారు. ‘‘నాకు తెలిసి నిర్మాత ఎమ్మెస్ రాజు గారు ఈ ప్రాజెక్ట్‌కి కరెక్ట్’’ మహేశ్‌బాబు ప్రపోజల్. గుణశేఖర్ డబుల్ ఓకే. ఎమ్మెస్ రాజుకి కాల్ వెళ్లింది. ఆయన ‘పద్మాలయా’కొచ్చారు. మహేశ్ డిటెయిల్స్ అన్నీ చెప్పాడు. ‘‘రాజుగారూ! ఈ ప్రాజెక్టు మీకే చేయాలనుకుంటున్నాం. కానీ వన్ కండిషన్. చార్మినార్ సెట్ వెయ్యాలి. ఎందుకంటే రియల్ ‘చార్మినార్’ దగ్గర అన్నాళ్లు షూటింగ్ చేయలేం. ఈ మధ్యే ఎవరో సూసైడ్ చేసుకోవడంతో పైకి కూడా వెళ్లనివ్వడం లేదట’’ చెప్పాడు మహేశ్. ‘‘నేను సెట్ వేయడానికి రెడీ. కానీ నాకు ముందు కథ నచ్చాలి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. గుణశేఖర్ కథ చెప్పాడు. ఎమ్మెస్ రాజు ఫుల్ ఖుష్. పేపర్లో అనౌన్స్మెంట్. మహేశ్‌బాబు - గుణశేఖర్ కాంబినేషన్లో ఎమ్మెస్ రాజు సినిమా. ‘యువకుడు’ సినిమాలో భూమిక అప్పుడే ఫ్రెష్‌గా విరబూసిన రోజా పువ్వులా ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్సే గుణశేఖర్‌కి నచ్చేసింది. మహేశ్ పక్కన భూమిక ఖరార్. శేఖర్.వి.జోసెఫ్ కెమెరామన్. మ్యూజిక్ డెరైక్టర్ మణిశర్మ. పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్. ఆర్ట్ డెరైక్టర్ అశోక్. టీమ్ అంతా ఓకే. ఇక టైటిలే మిగిలింది. ‘అతడే ఆమె సైన్యం’. గుణశేఖర్ ఫస్ట్ నుంచి ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యాడు. కానీ ఎవరో రిజిస్టర్ చేసేశారు. ఎంత బతిమాలినా నో చాన్స్. ఇంకో టైటిల్ వెతుక్కోవాల్సిందే. ‘కబడ్డీ’ అని పెడదామా అని ఓ దశలో అనుకున్నారు. ఆఖరికి ‘ఒక్కడు’ అనుకున్నారు. ఒక్కళ్లు కూడా ‘నో’ అనలేదు. హైదరాబాద్ శివార్లలో గోపన్నపల్లెలో రామానాయుడుగారికి పదెకరాల ఖాళీ ల్యాండ్ ఉంది. అక్కడ చార్మినార్ సెట్ వేయాలి. రియల్‌గా చార్మినార్ హైట్ దాదాపు 176 అడుగులు. అందులో చుట్టూ ఉండే నాలుగు మినార్ల హైట్ సుమారు 78 అడుగులు. ఈ కథకు కావాల్సింది ఆ మినార్లే. అంతవరకూ కనబడితే చాలు. కింద నుంచి పైవరకూ అవసరం లేదు. అందుకే కింద బాగా తగ్గించేసి 120 అడుగుల హైట్‌లో సెట్ వర్క్ స్టార్ట్ చేశారు. చార్మినార్, చుట్టూ ఓల్డ్ సిటీ సెటప్... దీనికి అయిదెకరాల ప్లేస్. త్రీ మంత్స్... 300 మంది వర్కర్స్... ఫినిష్ అయ్యేసరికి కోటి డెబ్భై లక్షల బడ్జెట్ తేలింది. ఇంత సెట్లో రోడ్ల సెటప్ లేదు. రోడ్లు కూడా వేయాలంటే బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది. ఆ రోడ్ల వరకూ కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో చేయాలని డిసైడైపోయారు. ఓ పక్క సెట్ వర్క్ జరుగుతుంటే మరోపక్క ఇండస్ట్రీలో రకరకాల కామెంట్స్. ‘మృగరాజు’ లాంటి ఫ్లాప్ తీసిన డెరైక్టర్, ‘దేవీపుత్రుడు’ లాంటి ఫ్లాప్ తీసిన ప్రొడ్యూసరూ కలిసి మహేశ్‌తో ఏం సినిమా తీస్తారు? పాపం... మహేశ్ పని గోవిందా! ఇవన్నీ వీళ్లకు వినబడుతూనే ఉన్నాయి. కోపం రాలేదు. ఇంకా కసి పెరిగింది. బ్లాక్‌బస్టర్ తీయాలి. వాళ్ల నోళ్లు మూయించాలి. షూటింగ్ స్టార్ట్. చార్మినార్ సెట్లో షెడ్యూల్. సెట్ నిడివి అర కిలోమీటర్. లైటింగ్ చెయ్యాలంటే 15 జనరేటర్లు కావాలి. మామూలు క్రేన్లు చాలవు. స్ట్రాడా క్రేన్ కావాల్సిందే. కష్టమైనా షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది. క్లైమాక్స్‌కి మాత్రం చాలా కష్టపడ్డారు. డిసెంబర్ రాత్రిళ్లు... విపరీతమైన చలి... 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు... 11 రోజుల షూటింగ్... కబడ్డీ కోసమైతే మహేశ్ నిజం ప్లేయర్‌లానే కష్టపడ్డాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కబడ్డీ ఆడింది లేదు. కేవలం ఈ సినిమా కోసం రెండ్రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడు. మహేశ్‌కి బూట్లు వేసుకోవడం అలవాటాయె. ఇక్కడేమో బూట్లు లేకుండా ఆడాలి. మోకాళ్లకు దెబ్బలు... విపరీతమైన కాళ్ల నొప్పులు. అయినా భరించాడు. ఎమ్మెస్ రాజుకు ఇలాంటి భారీ వెంచర్లు కొత్త కాదు. కానీ వాటికన్నా భిన్నమైన ప్రాజెక్ట్ ఇది. ఏ మాత్రం తేడా వచ్చినా అవుట్. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు. ఇక్కడ రాజూ ఆయనే. మొండివాడూ ఆయనే. అలా డబ్బులు పోస్తూనే ఉన్నాడు. గుణశేఖర్‌కి ఎంతవరకూ సపోర్ట్‌గా నిలబడాలో అంత వరకూ నిలబడ్డారాయన. ఆ రోజుల్లోనే ఈ సినిమాకు దాదాపు రూ. 13-14 కోట్లు వెచ్చించారు. ఫస్ట్ కాపీ వచ్చింది. ఎమ్మెస్ రాజు, గుణశేఖర్, పరుచూరి బ్రదర్స్ తదితరులు రష్ చూశారు. పరుచూరి బ్రదర్స్‌కు ఎక్కడో ఏదో కొడుతోంది. స్క్రీన్‌ప్లే ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లో ఉండటం కరెక్ట్ కాదు. స్ట్రెయిట్ నేరేషన్ చేసేయమన్నారు. వాళ్లకు ‘రష్ కింగ్స్’ అని పేరు. రష్ చూసి బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇవ్వగలరు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌తో కూర్చుని 10 నిమిషాల్లో స్ట్రయిట్ నేరేషన్గా మార్చేశాడు గుణశేఖర్. ఇప్పుడందరూ హ్యాపీ. 2003 జనవరి 15. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్... సుదర్శన్ 35 ఎం.ఎం. థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి మార్నింగ్ షో చూస్తున్నారు సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు, గుణశేఖర్, ఎమ్మెస్ రాజు. ఇంటర్వెల్లోనే రిజల్ట్ తేలిపోయింది. గుణశేఖర్ హ్యాండ్లింగ్ అదుర్స్. ఎమ్మెస్ రాజు మేకింగ్ మార్వలెస్. మహేశ్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్. అప్పుడు ఆంధ్రాలో కరువు సీజన్. ఇంకోపక్క వరల్డ్‌కప్ హంగామా. ఇండియా ఫైనల్స్‌కు కూడా వెళ్ళింది. ఇంత టెన్షన్ మూమెంట్లో కూడా ‘ఒక్కడు’ క్రియేటెడ్ రికార్డ్స్. వెరీ ఇంట్రెస్టింగ్... * తమిళంలో విజయ్, కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్ ఈ సినిమా చేశారు. * ఈ సినిమాతో మహేశ్‌ను హిందీలో లాంచ్ చేద్దామని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు చాలా ముచ్చటపడ్డారు. కానీ మహేశ్ ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ల కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో హిందీలో తీయాలనుకున్నారు అట్లూరి పూర్ణచంద్రరావు. కానీ అదీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవలే బోనీకపూర్ తన తనయుడు అర్జున్ కపూర్‌తో ‘తేవర్’గా రీమేక్ చేశారు. - పులగం చిన్నారాయణ -
హిస్టారికల్ స్టోరీలో నటిస్తున్న మహేష్ ?
-
రిలీజ్‌కాని ఆసినిమాకి అప్పుడే సీక్వెల్ ?
-
రుద్రమదేవికి సీక్వెల్... ప్రతాపరుద్రుడు?
*** మన కాకతీయుల కథకు సంపూర్ణ ఆవిష్కరణ ప్రయత్నం *** ‘రుద్రమదేవి’లోనే సీక్వెల్‌కు లీడ్ సీన్స్ *** ‘ప్రతాపరుద్రుడు’గా చేసే హీరో ఎవరు? టైటిల్... ఆల్రెడీ ఓ.కె ‘రుద్రమదేవి’(‘ది వారియర్ క్వీన్’అనేది ట్యాగ్‌లైన్) చిత్రాన్ని నిర్మిస్తున్న గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పైనే ‘ప్రతాపరుద్రుడు’ (‘ది లాస్ట్ ఎంపరర్’ అనేది ట్యాగ్‌లైన్) అనే టైటిల్ ఫిల్మ్‌చాంబర్‌లో ఇటీవలే రిజిస్టర్ అయింది. టైటిల్‌కు ఆమోదం రావడంతోనే చిత్రయూనిట్ ఆ టైటిల్ లోగోను డిజైన్ చేయించి, సిద్ధం చేస్తోంది. ఇవన్నీ ‘రుద్రమదేవి’ సీక్వెల్ వార్తలకు బలం చేకూరుతున్నాయి. మన తెలుగువారి ఘన చరిత్రకూ, సంస్కృతికీ తెలుగు సినిమా మళ్ళీ పెద్ద పీట వేయనుందా? ఎన్టీయార్, ఏయన్నార్ల హయాంలో విరివిగా సాగి, ఆ తరువాత వెనకపట్టు పట్టిన ఈ విశిష్టమైన సెల్యులాయిడ్ కృషి ఇప్పుడు మళ్ళీ తెలుగు తెరపై ఊపందుకుంటోందా? హిస్టారికల్ ఫిల్మ్స్ తీయడానికి ఫిల్మ్‌నగర్‌లో జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తెలుగువారి పౌరుషాన్నీ, ప్రతాపాన్నీ తమిళ, మలయాళ, కన్నడ, మరాఠా సీమల దాకా విస్తరించి, సువిశాల తెలుగు సామ్రాజ్యాన్ని స్థాపించిన కాకతీయుల ఘనచరిత్రకు ఉదాహరణగా తాజాగా ‘రుద్రమదేవి’ సినిమా తయారైంది. దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో చేసిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రయత్నం సరిగ్గా నెల రోజుల్లో సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బాహుబలి’ ఘనవిజయం తరువాత ఈ చారిత్రక కథాచిత్రం పట్ల సినీప్రియులతో పాటు వ్యాపారవర్గాల్లోనూ ఆసక్తి, అంచనా ఇంకా పెరిగాయి. స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ బిజీ! ఈ నేపథ్యంలో గుణశేఖర్ సైతం దాదాపు 300 ఏళ్ళు మన దక్షిణాపథంలో అధిక ప్రాంతాన్ని పరిపాలించిన మన కాకతీయుల చరిత్రను సంపూర్ణంగా ఆవిష్కరించడానికి ‘రుద్రమదేవి’కి సీక్వెల్‌తో సిద్ధమవుతున్నట్లు కృష్ణానగర్ కబురు. రుద్రమదేవి అనంతరం ఆమె మనుమడు (కూతురి కొడుకు) - తిరుగులేని చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు హయాంలో కొనసాగిన కాకతీయ సామ్రాజ్య చరిత్రను ఈ సీక్వెల్లో చెబుతారు. వరంగల్ కోటను స్వాధీనం చేసుకోవడానికి ఏడుసార్లు దండెత్తి వచ్చిన ఢిల్లీ సుల్తానులతో వీరోచిత పోరాటం చేసిన మహాయోధుడు ప్రతాపరుద్రుడు. తమిళసీమలోని మదురై, కేరళ దాకా జయించిన చక్రవర్తి అతను. జీవితంలో బోలెడన్ని ఎమోషన్లు, సెంటిమెంట్, యాక్షన్ పార్ట్ ఉన్న ఈ కాకతీయ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి కథ కోసం ఇప్పటికే గుణశేఖర్ టీమ్ రీసెర్చ్ చేసింది. కథాంశం, టైటిల్ పాత్ర తీరుతెన్నులు, ప్రధాన ఘట్టాలతో ఇప్పటికే బేసిక్ స్క్రిప్ట్ తయారైంది. ఇప్పుడు పూర్తి నిడివి స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆసక్తి చూపుతున్న అగ్ర హీరోలు! అనుష్క టైటిల్ రోల్ చేస్తున్న ‘రుద్రమదేవి’లో కృష్ణంరాజు, ప్రకాశ్‌రాజ్ సహా దాదాపు 40 మంది దాకా పేరున్న, సుపరిచిత ఆర్టిస్టులు పాత్రలు ధరిస్తున్నారు. ఇంత భారీ తారాగణంతో, సుమారు రూ. 70 కోట్ల ఖర్చుతో, హీరోయిన్ ఓరియెంటెడ్ కథగా ‘రుద్రమదేవి’ని గుణశేఖర్ త్రీడీలో అందిస్తున్నారు. రుద్రమదేవే స్వయంగా పట్టాభిషేకం చేసిన ఆమె మనుమడు ‘ప్రతాపరుద్రుడు’ హీరో ఓరియెంటెడ్ కథ. పైగా, యాక్షన్ పార్ట్, యుద్ధం సీన్లు కూడా ఎక్కువగా ఉండే ఎమోషనల్ స్టోరీ. తెరకెక్కించడానికి మరింత భారీ వ్యయమయ్యే ఆ స్క్రిప్ట్‌లో టైటిల్‌రోల్ ఏ హీరో చేస్తారన్నది కూడా ఆసక్తికరమైన విషయమే. ‘రుద్రమదేవి’ కథలోని కొన్ని పాత్రలు, సన్నివేశాలు ‘ప్రతాపరుద్రుడు’ కథలో కూడా కొనసాగుతాయి. కాబట్టి, అనుష్క సహా పలువురు మళ్ళీ సీక్వెల్లో కూడా ఉంటారని ఊహించవచ్చు. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడిగా దగ్గుబాటి రానా నటించేశారు. కాబట్టి, సీక్వెల్లో టైటిల్ రోల్ ఎవరిదన్నది ఇప్పుడు కృష్ణానగర్‌లో హాట్‌టాపిక్. మహేశ్‌బాబు, చిన్న ఎన్టీయార్, రామ్‌చరణ్ లాంటి యువ హీరోలలో ఒకరు ‘ప్రతాపరుద్రుడు’గా చేస్తారని ఒక టాక్. కాగా, కెరీర్లో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిపోయే ఈ పాత్ర కోసం 150వ సినిమా మైలురాయి దగ్గరున్న చిరంజీవి, నూరో సినిమా చేయనున్న బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు మొగ్గినా ఆశ్చర్యపోనక్కర లేదని మరో వాదన. మొత్తానికి, పలువురు హీరోలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి రాబోయే రోజుల్లో మరిన్ని ఊహాగానాలు పెరగడం ఖాయం. ఫస్ట్ పార్ట్‌లోనే... సెకండ్ పార్ట్‌కు లీడ్! ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యకలాపాల్లో ‘రుద్రమదేవి’ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. నాలుగేళ్ళ పాటు ఢిల్లీ గద్దెనెక్కిన రజియా సుల్తానా మొదలు ఆధునిక కాలంలోని ఇందిరా గాంధీ దాకా భారతదేశంలో మరే పాలకురాలూ పాలించనంతగా దాదాపు 40 ఏళ్ళు సామ్రాజ్యాన్ని నడిపిన వీరనారి ‘రుద్రమదేవి’. తండ్రితో అనుబంధం, భర్తతో ప్రేమావేశం, కూతురితో పేగుబంధం, మనుమడితో కర్తవ్యపాశం - ఇలా రకరకాల షేడ్స్ ఉన్న పాత్ర తన కెరీర్లో మరపురానిదని అనుష్క చెప్పారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళాల్లో, హిందీలో కూడా ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ‘రుద్రమదేవి’ సినిమా చివరలో రాబోయే సీక్వెల్‌కు తగ్గట్లు పసివాడైన ప్రతాపరుద్రుడి సీన్లు కూడా ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ సీన్స్ ద్వారా సీక్వెల్ ‘ప్రతాపరుద్రుడు... ది లాస్ట్ ఎంపరర్’కు శ్రీకారం చుట్టినట్లవుతుంది. చిన్నప్పటి ప్రతాపరుద్రుడి పాత్రకు కూడా ప్రముఖ హీరోల వారసుడైన బాల నటుడొకరు కనిపించే సూచనలున్నాయి. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియడానికి కొద్దిరోజులు వేచి చూడాల్సిందే! తెరపై చరిత్ర హిట్టే! మొత్తానికి, చిన్నప్పుడు చదివిన పాఠం స్ఫూర్తితో, 2002 నాటి నుంచి గుణశేఖర్ మనసులో తిరుగుతున్న ‘రుద్రమదేవి’ ఆలోచన ఇన్నాళ్ళకు ఇలా తెరపైకి ఎక్కిన క్రమం ఆసక్తికరమే. పెద్ద ఎన్టీయార్ ‘సమ్రాట్ అశోక’ (1992) తరువాత దాదాపు ఇరవై మూడేళ్ళకు తెలుగులో వస్తున్న భారీ స్టార్‌క్యాస్ట్ హిస్టారికల్ ఫిల్మ్ ఇదే. గతంలో తెలుగు తెరపై వచ్చిన ‘పల్నాటి యుద్ధం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరసు’, ‘అల్లూరి సీతారామరాజు’ లాంటి చారిత్రక కథాచిత్రాల్లో నూటికి 95 శాతం హిట్లే. ఆ కోవలోనే ‘రుద్రమదేవి’ని ఆదరిస్తే, గుణశేఖర్ బృందం మూడేళ్ళపాటు రాత్రింబగళ్ళు చేసిన సృజనాత్మక కృషికి గుర్తింపు దక్కినట్లే! మన తెలుగు జాతి చరిత్ర అయిన ‘రుద్రమదేవి’తో పాటు ‘ప్రతాపరుద్రుడు’ కథ కూడా భావితరాలకు సిల్వర్‌స్క్రీన్ పాఠ్యాంశంగా కలకాలం నిలిచే ఛాన్స్ కచ్చితంగా వచ్చినట్లే!! -
ఈ సినిమాకు ముందు ఆమెను అనుకోలేదు
హైదరాబాద్: రాణీ రుద్రమదేవి అంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. చదువుకొనేటపుడే కాకతీయుల రాణి రుద్రమదేవి శౌర్య, పరాక్రమాల గురించి విన్నప్పుడు చాలా గొప్పగా అనిపించిందని, ఆ కథ అలా తనను వెన్నాడుతూనే ఉందని చెప్పుకొచ్చారు. అందుకే ఎంత కష్టమైనా రుద్రమదేవి కథను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం తొమ్మిదేళ్లు పరిశోధనలు చేశానన్నారు. ఇది కాకతీయుల పరిపాలన, చరిత్రకు సంబంధించిన సినిమా కాబట్టి ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అందుకే పలువురు సినీపెద్దలు, చరిత్రకారులతో చర్చించానన్నారు. వారి సూచనలు, సలహాలు పాటిస్తూ చాలా ప్రతిష్ఠాత్మకంగా రుద్రమదేవి కథను తెరకెక్కిస్తున్నామని గుణశేఖర్ ప్రకటించారు. వాస్తవాలను ప్రతిబింబిస్తూ చాలా సమగ్రంగా, పరిపూర్ణంగా సినిమాను చిత్రీకరించామన్నారు. అలాగే ఈ సినిమా కోసం అసలు ముందు అనుష్క గురించి ఆలోచించలేదని తెలిపారు. స్నేహితులు, ఇండస్ట్రీ పెద్దల సలహాతో అనుష్కను రుద్రమదేవి పాత్ర కోసం ఎంచుకున్నామని తెలిపారు. ఆమె రుద్రమదేవి పాత్రకు న్యాయం చేకూర్చారన్నారు. నిజంగా అనుష్క సహకారం లేకపోతే రుద్రమదేవి ఇంత బాగా తీయలేకపోయేవాడినని అనుష్కపై ప్రశంసలు కురిపించారు. కాగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్టు దర్శకుడు గుణశేఖర్ ప్రకటించారు. దీన్ని ముందు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నామని చెప్పారు. 3డీ సీజీ టెక్నాలజీలో తెరకెక్కించామని అజయ్ విన్సెంట్ కెమెరా పనితనం, ఇళయరాజా రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ పాయింట్లు అవుతాయని అభిప్రాయపడ్డారు. కథను ఇళయరాజా అద్భుతంగా ఎలివేట్ చేశారన్నారు. ఈ సందర్భంగా 'రుద్రమదేవి' ఆండ్రాయిడ్ యాప్ విడుదల చేశారు. రానా, అల్లు అర్జున్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కేథరీన్ త్రెసా తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
తెరపై తెలుగువారి చరిత్ర
దాదాపు మూడేళ్ళుగా దర్శకుడు గుణశేఖర్ చేస్తున్న సినీ యజ్ఞం ఇప్పుడు పతాక ఘట్టానికి చేరుకుంది. దేశంలోనే ‘మొట్టమొదటి చారిత్రక స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం’గా ఆయన రూపొందిస్తున్న ‘రుద్రమదేవి’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ‘‘రానున్న సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీయెత్తున ‘రుద్రమదేవి’ని విడుదల చేస్తున్నాం’’ అని గుణశేఖర్ ప్రకటించారు. శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ‘రుద్రమదేవి’ పాత్రధారిణి అనుష్క, చిత్ర నిర్మాత - గుణశేఖర్ శ్రీమతి అయిన రాగిణీ గుణ కలసి విడుదల తేదీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సహ నిర్మాతలైన గుణశేఖర్ కుమార్తెలు నీలిమ, యుక్తాముఖి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పంచుకొన్న విశేషాలు... వారి మాటల్లోనే... ఇది కల్పన కాదు... చరిత్ర! - దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ కల్పన, జానపదం కాదు. 850 ఏళ్ళ క్రితం తెలుగుగడ్డపై జరి గిన మన తెలుగువాళ్ళ కథ. ఎనిమిదో తరగతిలో నాన్డీటైల్డ్గా చదివిన పాఠం దీనికి స్ఫూర్తి. రచయితలు ముదిగొండ శివప్రసాద్, పరుచూరి బ్రదర్స్, తోట ప్రసాద్ తదితరులతో కలసి తొమ్మిదేళ్ళ పరిశోధన చేసి, కథ తయారుచేశాం. చరిత్రనెక్కడా వక్రీకరించలేదు. రేపు ఈ సినిమా ద్వారా మన దేశంలోని మిగతా భాషలవాళ్ళకీ తెలుగువారి చరిత్రను చూసి, తెలుసుకొనే అవకాశమొచ్చింది. సెట్స్, గ్రాఫిక్స్ కోసం తీసిన సినిమా కాదు! ‘సెట్స్ కోసం, భారీ గ్రాఫిక్స్ కోసం గుణశేఖర్ సినిమాలు తీస్తాడు’ అంటూ అపోహ ఉంది. ‘రుద్రమదేవి’లో భారీ సెట్లు, గ్రాఫిక్సున్నాయి కానీ, వాటి కోసం తీసిన సినిమా కాదిది. హాలీవుడ్లో రకరకాల కోవల (జానర్ల) సినిమాలొస్తు న్నట్లే... తెలుగులో ‘గ్లాడియేటర్’, ‘బ్రేవ్‌హార్ట్’ లాంటివెందుకు చేయకూడదనిపిం చింది. కథను నమ్ముకొని ఈ సాహసం చేశా. కథ కోసమే సెట్లు, గ్రాఫిక్స్ వాడా. జనం నుంచి వచ్చిన పేరు అనుష్క! నటి అనుష్క లేకపోతే ఈ ‘రుద్రమదేవి’ లేదు. గుర్రపుస్వారీలు, కత్తి యుద్ధాలు నేర్చుకొని, ఎంతో శ్రమకోర్చి, ఆమె ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఆ పాత్రలో వేరేవాళ్ళను నేనే కాదు, ప్రేక్షకులు కూడా ఊహించలేరు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించినప్పుడు, టైటిల్ రోల్ ఎవరన్నది నేను చెప్పలేదు. అనుష్క పేరు ప్రకటించక ముందే, జనం నుంచి నాకు వచ్చిన సూచన - అనుష్క పేరే! అల్లు అర్జున్ గంటసేపుంటాడు! రాబిన్‌హుడ్ తరహాలోని బందిపోటు గోన గన్నారెడ్డి పాత్ర కథకు కీలకం. అతనెందుకు బందిపోటయ్యాడు, ఏమిటన్నది తెరపై చూస్తారు. ‘వరుడు’ చేస్తు న్నప్పుడే ‘రుద్రమదేవి’ కథ విని, స్ఫూర్తి పొందిన బన్నీ, ఎప్పుడు తీస్తారంటూ అడుగుతుండే వాడు. బన్నీ పని చేసింది 30 డేసే. ముందు మరో 30 రోజులు సన్నద్ధమయ్యాడు. సినిమాలో గంటసేపుంటాడు. రానా రొమాంటిగ్గా ఉంటాడు. త్రీడీలో... సాహసం! లండన్‌లో భారీ రీరికార్డింగ్!! మొత్తం 3డిలోనే, 3డి కెమేరాలతోనే తీశాం. హాలీవుడ్ నిపుణుల సాయం తీసుకున్నాం. త్రీడీ వల్ల బడ్జెట్ పెరిగింది. త్రీడీలో గ్రాఫిక్స్ సంక్లిష్టం కాబట్టి టైమ్ చాలా అయింది. హాలీవుడ్ ఫిల్మ్స్ చూసి నేను, పిల్లలు త్రీడీలోనే మన చరిత్ర చెప్పాలని ఉత్సాహపడ్డందుకు, సరదా తీరిపోయింది. నా ప్రతి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బేస్ ఉన్నదే. 2003లో ‘ఒక్కడు’కే చార్మినార్ సెట్ కొంత వేసి, మిగతాది గ్రాఫిక్స్ అని తెలియనట్లుగా చూపాం. ఈ సినిమాలో మంచి విజువల్సున్నాయి. అంతా కీబోర్డ్‌లోనే ఇచ్చేస్తున్న ఈ రోజుల్లో ఇళయరాజా గారు లండన్‌లోని ఆర్కెస్ట్రాలో 125 మంది లైవ్ ఆర్కెస్ట్రాతో భారీగా రీరికార్డింగ్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో ఇలా ఎవరూ చేయలేదు. ఇలాంటివెన్నో విశేషాలున్నాయి. స్వయంగా వచ్చి కలుసుకుంటా! - హీరోయిన్ అనుష్క ఈ సినిమా చేస్తుంటే, గుణశేఖర్ గారి పిల్లలిద్దరూ లొకేషన్లోనే ఉండి, ప్రాజెక్ట్‌కు అదనపు సపోర్ట్‌గా నిలిచారు. 13వ శతాబ్దం నాటి రిఫరెన్స్‌లు తక్కువ అయినప్పటికీ, పాత్ర లుక్‌ను డిస్ట్రబ్ చేయ కుండా, నీతా లుల్లా కాస్ట్యూమ్స్, అలంకరణ చేశారు. నిజానికి, ఈ సినిమా షూటింగ్ డేస్ తక్కువే. ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్లకే ఎక్కువ టైమ్ పట్టింది. క్లిష్టమైన త్రీడీ చిత్రీకరణ కోసం గుణ గారు ప్రత్యేకంగా జర్మనీ వెళ్ళి నేర్చుకొని వచ్చారు. ఆయన అనుభవం, నైపుణ్యం వల్లే అతి తక్కువ టైమ్‌లోనే ఎక్కువ షూట్ చేశాం. ఈ సినిమాకు వెన్నె ముక - ఇళయరాజా సంగీతం. రాజా గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. తొలిసారి ఈ చిత్రం కోసం పనిచేస్తున్న ప్పుడే ఆయన గొప్పదనం మరింత తెలిసింది. ఒక హిస్టారికల్ ఫిల్మ్‌కు సంగీతం ఇస్తున్నాననే వెలుగు ఆయన ముఖంలో చూశా. మూడేళ్ళుగా మేమందరం కలసి చేస్తున్న శ్రమ ఇప్పుడు ఫలించ నుంది. మా శ్రమ తాలూకు ఫలితం సెప్టెంబర్ 4న తెరపై ఆకట్టుకో నుంది. ప్రతిష్ఠాత్మకంగా చేసిన ఈ కృషికి తగిన ఫలాలను ప్రేక్షకులు మాకు అందిస్తారని నమ్ముతున్నా. ఎంతో వ్యయప్రయాసలతో మేము చేస్తున్న ఈ ప్రయత్నం కోసం సహనంతో నిరీక్షించి, మాకు మొదటి నుంచీ ప్రోత్సాహం అందిస్తున్నవారందరికీ కృతజ్ఞతలు. వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం కోసం పలు ప్రాంతా లకు స్వయంగా వచ్చి, అందరినీ కలుసుకోనున్నా. పిల్లలకు చూపించాల్సిన మన కథ! - చిత్ర నిర్మాత రాగిణీ గుణ మన చరిత్రను మనమే మర్చిపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మళ్ళీ మన చరిత్రనూ, గొప్పదనాన్నీ గుర్తు చేసే చిత్రం - ‘రుద్రమ దేవి’. ఏడో తరగతి చదువుతున్న మా చిన్నమ్మాయి టెక్స్ట్‌బుక్‌లో కూడా సరిగ్గా ఈ ఏడాది నుంచే ‘రుద్రమదేవి’ లెసన్ కూడా పెట్టారు. అందుకే, పిల్లల్ని తీసుకొని, కుటుంబమంతా కలసి వెళ్ళాల్సిన సినిమా. రిలీజైన ‘రుద్రమదేవి’ యాప్ ఇది ఇలా ఉండగా, ‘రుద్రమదేవి’ వివరాలు, విశేషాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకొనేందుకు వీలుగా ఆండ్రాయిడ్ యాప్‌ను కథానాయిక అనుష్క ఆవిష్కరించారు. త్వరలోనే ఐ.ఓ.ఎస్. ఎడిషన్ యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు గుణశేఖర్ పెద్ద కుమార్తె - చిత్ర సహ నిర్మాతల్లో ఒకరూ అయిన నీలిమా గుణ తెలిపారు. ‘రుద్రమదేవి’ హిందీ వెర్షన్ మాత్రం తెలుగు వెర్షన్ తరువాత రిలీజ్ కానుంది. -
రుద్రమదేవికి సాయం చేస్తున్నమహేష్..?
-
రుద్రమడాడీ
ఫాదర్స్ డే ప్రత్యేకం తండ్రిగా... ఎంతో ప్రేమిస్తాడు! నాన్నగా... ‘నాన్నలు’ అని పిల్చుకుంటాడు! డాడీగా... వాళ్లని డైనమిక్‌గా మలుస్తాడు! ఫాదర్‌గా... బెస్ట్ ఫ్రెండ్‌లా ఉంటాడు! ఇంటి పెద్దగా... బాధ్యతను నేర్పిస్తాడు! అన్నలా... అడిగింది కొనిస్తాడు! డ్ రైవర్గా... స్కూల్లో దించుతాడు! ఇన్ని గుణాలున్న శేఖరుడు ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ! రాత్రి 7.30 గంటలు. హైదరాబాద్‌లో చిరుజల్లులు... అప్పటికే చీకటి, రోడ్ల మీద ట్రాఫిక్. కమ్ముకొస్తున్న వాటిని చీల్చుకుంటూ ‘గుణ మీడియా వర్క్స్’ ఆఫీసుకి చేరాం. దేశంలో తొలి చారిత్రక స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్ ‘రుద్రమదేవి’ దర్శకుడు గుణశేఖర్ పెద్దమ్మాయి నీలిమ (21) హాలులో ఉంది. చుట్టూ ‘రుద్రమదేవి’ మినియేచర్ సెట్స్, ఆర్ట్ వర్క్స్, చరిత్ర పుస్తకాలు. సెవన్త్ గ్రేడ్ చదువుతున్న చిన్నమ్మాయి యుక్తాముఖి (12) స్కూలులో లేటవడంతో ఇంకా రాలేదు. ముందుగా పెద్దమ్మాయితో, తర్వాత చిన్నమ్మాయితో భేటీ... ‘రుద్రమదేవి’కి సహనిర్మాతలైన ఆ పిల్లలిద్దరూ క్రియేటర్ గుణశేఖర్లోని కుటుంబ కోణంపై ఫోకస్ లైట్ వేశారు. చివరలో గుణశేఖర్, ఆయన శ్రీమతి రాగిణి వచ్చి మాతో కలిశారు. నలుగురితో విడివిడిగా మాట్లాడిన ఈ కలివిడి కబుర్లు... వారు మీడియాకిచ్చిన తొలి ‘ఫ్యామిలీ’ గ్రూప్ ఫోటో సాక్షిగా ఇవీ... వెరీ గుడ్ హ్యూమన్‌బీయింగ్! - నీలిమ (గుణశేఖర్ పెద్దమ్మాయి) గుణశేఖర్ గారు అందరికీ పెద్ద డెరైక్టర్ కానీ, మాకు మాత్రం లవబుల్ డాడ్! ఇంట్లో ఎప్పుడూ ఆయన ఒక ఫాదర్ లానే తప్ప, సినిమా మనిషిలా ఉండరు. మా ఇంట్లో సినిమా వాతావరణమూ ఉండదు. మేమెప్పుడూ షూటింగ్‌లకూ, సినిమా ఫంక్షన్లకూ వెళ్ళేదీ లేదు. ‘రుద్రమదేవి’ప్రాజెక్ట్‌కే ఆ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. పక్కా ఫ్యామిలీ మ్యాన్! సెట్స్‌లో నాన్న సీరియస్‌గా ఉంటారు. కానీ, చాలామందికి తెలియనిదేమిటంటే, ఆయనకు మంచి సెన్సాఫ్ హ్యూమరుంది. నాన్న ఎంత ఫ్యామిలీ మ్యానంటే... సినిమాకెళ్ళినా, షికారుకెళ్ళినా అమ్మ, నేను, చెల్లెలు - నలుగురం కలిసి వెళ్ళాల్సిందే. ఆయనొక్కరూ వెళ్ళరు. ఇంట్లో హోమ్ థియేటర్లో కూడా అందరం కలిసి, సినిమాలు చూడాల్సిందే! నాన్న పార్టీలకు వెళ్ళే రకం కాదు. ఆయన ధ్యాసంతా సినిమా మీదే! షూటింగ్ పని ముగించుకొని ఇంటికి వచ్చేశాక, ఉన్న కాసేపూ మాతోనే గడుపుతారు. వర్క్‌లో ఎంత టెన్షన్ ఉన్నా, మాతో గడిపే టైమ్ ఆయనకు రిలీఫ్. వీలున్నప్పుడల్లా మమ్మల్ని స్కూలు దగ్గర దింపడం, తేవడం ఆయనకు బాగా ఇష్టం. పుస్తకాలు, పేపర్లు చదవమంటారు! నాకు పెయింటింగంటే ఇష్టం. నా హాబీని నాన్న ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే, ఈ వయసులో ఉండే పిల్లలందరి లానే నాకూ రకరకాల ఇంట్రెస్ట్‌లు. ఒక దాని నుంచి మరో దాని మీదకు ఫోకస్ మారిపోతుంటుంది. అది నాన్న అర్థం చేసుకొని, ప్రతి రంగంలోని పాజిటివ్‌లు, నెగిటివ్‌లు వివరించి చెబుతుంటారు. ఈ మధ్యే బి.ఏ- మాస్ కమ్యూనికేషన్ చదివిన నాకు మంచి జర్నలిస్ట్‌ను కావాలని కోరిక. చరిత్ర, పాతకాలపు వస్తువులంటే నాకిష్టమని, లండన్‌కు పంపి, అక్కడ హయ్యర్ స్టడీస్ చేయిం చాలని నాన్న అనుకుంటున్నారు. ఇక్కడ ‘రుద్రమదేవి’ కోసం ‘గుణ టీవ్ు వర్క్స’ క్రియేటివ్ హెడ్‌గా డిజిటల్ పబ్లిసిటీతో పాటు కాస్ట్యూమ్స్, మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్ - ఇలా చాలా శాఖల్లో పనిచేశా. ఇదంతా ఇంటర్న్‌షిప్‌లా పనికొచ్చింది. నా చదువునూ, ఈ అనుభవాన్నీ కలిపి, భవిష్యత్తులో సినీ మీడియమ్‌లోకి వస్తానేమో చెప్పలేను. తెలుగు భాషన్నా, చరిత్రన్నా, పుస్తకాలన్నా నాన్నకి ఇష్టం. మా ఇంట్లో పురాణేతిహాసాలు సహా బోలెడన్ని బుక్సున్నాయి. రోజూ బోలెడన్ని పేపర్లు, మ్యాగజైన్స్ ఇంటికి వస్తాయి. మనిషి ఎదగాలంటే పుస్తకాలు చదవాలనీ, తెలుగు బాగా నేర్చుకోవాలనీ చెబుతుంటారు. ఆయన నేర్పిన విలువలు అవి! డెరైక్టర్‌గా నాన్న గొప్పే కానీ, అంతకు మించి వెరీగుడ్ హ్యూమన్‌బీయింగ్! ఆయన నిస్వార్థం, తోటివాళ్ళ బాగోగుల్ని పట్టించుకోవడం నాకు నచ్చుతాయి. ‘తోటివాళ్ళ పట్ల దయగా ఉండాలి. లేనిదాని కోసం ఆరాటం కన్నా ఉన్నదాని పట్ల తృప్తి ముఖ్యం’ - మా ఇద్దరికీ ఆయన నేర్పిన విలువలు అవి. అందుకే, ఇతరులతో పోల్చుకోం. కంఫర్టబుల్‌గా బతకడానికి ఉందని హ్యాపీగా ఉంటాం. ‘రుద్రమదేవి’ కోసం నాన్న 70 కోట్ల డబ్బే కాదు... నాలుగేళ్ళ జీవితం ఇన్వెస్ట్ చేశారు. మా పెదనాన్నైతే ఈ సినిమా ప్రొడక్షన్ చూడడం కోసం వైజాగ్ దగ్గర నుంచి వచ్చి, ఇక్కడే ఉండిపోయారు. ప్రతి సినిమాకుండే కష్టాలే ఈ సినిమాకూ వచ్చాయి. ఇంత పెద్ద సినిమాను పూర్తి చేసి, విజయవంతంగా రిలీజ్ చేయడమే మా ఫస్ట్ సక్సెస్. ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చడమే కాకుండా, డబ్బులు పెట్టినవాళ్ళకు లాభాలూ తెస్తుందనే నమ్మకం మాకుంది. దేవుడి దయ వల్ల మాకు ఉండడానికీ, తినడానికీ ఉంది. ‘రుద్రమదేవి’ లాంటి మరిన్ని మంచి సినిమాలు తీసే సత్తా మా నాన్నకుంది. అంతకన్నా ఇంకేం కావాలి! వాట్ నెక్స్ట్అంటారు! - యుక్తాముఖి (గుణశేఖర్ చిన్నమ్మాయి) అక్కయ్య మా అమ్మకు బాగా దగ్గరైతే, నేను నాన్నకు చాలా క్లోజ్. నాన్నకీ, నాకూ ఫిజికల్‌గానే కాదు... చాలా విషయాల్లో పోలికలున్నాయి. మేమిద్దరం టెక్ శావీ! నాన్నకూ, నాకూ గ్యాడ్జెట్ల పిచ్చి! కొత్త కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏంటో, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడమంటే - మా ఇద్దరికీ చాలా ఇష్టం. ‘మ్యాడ్ సైంటిస్ట్స్’ లాగా ఇద్దరం కలసి వాటి గురించి దాదాపు రిసెర్చ్ చేసినంత పని చేస్తాం. నాకు ‘యాపిల్’ కంపెనీ గ్యాడ్జెట్స్ అంటే పిచ్చి. ‘యాపిల్’ ప్రొడక్ట్స్ ఏవి వచ్చినా, అడగగానే నాన్న కొనిస్తారు. సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ సినిమాలు చూస్తున్నప్పుడు అవి ఎలా తీశారు, వాడిన టెక్నికేంటి, గ్రాఫిక్సెలా చేశారు లాంటి కబుర్లన్నీ నాన్న చెబుతుంటే, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాన్న తీసిన ‘రామాయణం’ నాకు చాలా ఇష్టం. గమ్మత్తేమిటంటే, ఇప్పటి దాకా నాన్న సినిమాలేవీ రిలీజ్‌కు ముందు మేమెప్పుడూ చూడలేదు. నాన్నా చూపించలేదు. ప్రివ్యూలు వేయడం, చూపించడం లాంటివి ఆయన ఎప్పుడూ చేయలేదు. అండర్ ప్రొడక్షన్లో ఉండగా ‘రుద్రమదేవి’ మాత్రం కొంత చూశాం. ఇంట్లో కామ్..! సెట్లో సీరియస్! అసలు చిన్నప్పుడు స్కూల్లో నాన్-డీటైల్డ్ పాఠంగా చదువుకొన్న ‘రుద్రమదేవి’ కథంటే నాన్నకి చాలా ఇష్టం. మాకెప్పుడూ ఆమె జీవితాన్ని కథలు, కథలుగా చెబుతుంటారు. ఆమె కథను దేశమంతటికీ చెప్పాలని ఆయన డ్రీమ్. అందుకోసమే ఇన్నేళ్ళూ కష్టపడ్డారు. ‘రుద్రమదేవి’కి ప్రెజెంటర్‌గా అమ్మ అంతా దగ్గరుండి చూసుకొంది. అలా నాన్న, అమ్మ, అక్క - అంతా సెట్స్‌లోనే ఉంటారు కాబట్టి, నేనూ స్కూలయ్యాక సెట్స్కెళ్ళేదాన్ని. ఇంటి దగ్గర చాలా కామ్‌గా ఉండే, నాన్న గారు సెట్స్‌లో డిఫరెంట్‌గా అనిపిస్తారు. పని మీదే ఫోకస్డ్గా ఉండడం వల్ల, అది జరగనప్పుడు కోపమూ ఎక్కువే చూపిస్తారు. ఆయన పాలసీ అదే! నాన్న సినిమాకు పేరొచ్చి, హిట్టయితే, మేమంతా హ్యాపీ. కంగ్రాచ్యులేట్ చేస్తుంటాం. ఒకవేళ ఎప్పుడైనా చిన్న తేడా వచ్చినా, ఆయన దాని గురించే ఆలోచిస్తూ కూర్చోరు. ‘డోంట్ పుట్ యువర్ ఫోకస్ ఆన్ ది ఫెయిల్యూర్. నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద ఫోకస్ పెట్టాలి. దేవుడు మనకిచ్చిన దాని గురించి సంతోషపడాలి’ అని నాన్న గారు చెబుతుంటారు. ఆయన ఫాలో అయ్యే పాలసీ అదే! ప్రతి డిసెంబర్ 31వ తేదీ రాత్రి మా ఫ్యామిలీ మొత్తం ఇంట్లో డిన్నర్ చేసి, లాంగ్ డ్రైవ్‌కి వెళతాం. న్యూ ఇయర్‌కి సంతోషంగా వెల్కమ్ చెబుతాం. పిల్లల మీద ఎలాంటి రిస్ట్రిక్షన్లూ పెట్టకుండా, తగినంత ఫ్రీడమ్ ఇచ్చి, ఫ్రెండ్ లాగా ఉంటారు కాబట్టే ఐ లవ్ మై డాడ్ సోమచ్! కొన్నిసార్లు వాళ్ళే నా ఫాదర్! - దర్శకుడు గుణశేఖర్ అమ్మానాన్నకు ఎనిమిదిమంది పిల్లల్లో నేను ఏడోవాణ్ణి. నాకు మాత్రం ఇద్దరే పిల్లలు. మా అమ్మాయిలిద్దరి భావాలు, వాడే గ్యాడ్జెట్లు మోడరన్. అదే సమయంలో మన సంస్కృతిని మర్చిపోరు. వాళ్ళ అమ్మతో కలసి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇప్పటికీ మా ఆవిడనీ, నన్నూ ‘అమ్మా, నాన్నా’ అనే పిలుస్తారు. ఎంత ఎదిగినా, మూలాల్ని మర్చిపోని మా పిల్లల్ని చూసి, అందుకే గర్విస్తుంటా. ♦ మా పిల్లలు, మేము అంతా హోమ్ బర్డ్స్. దేశదేశాల టూర్‌కు వెళ్ళినా నాలుగు రోజులు కాగానే, మా చిన్నమ్మాయి ఇంటికి వెళదామంటుంది. మా పెద్దమ్మాయైతే, మాకు దూరంగా ఉండడం ఇష్టం లేక డిగ్రీ చదువుకు లండన్‌కు వెళ్ళలేదు. అంత బలమైన కుటుంబబంధం మాది! ♦ పిల్లలకు మార్కులే జీవితం కాదు. మార్కుల కన్నా వాళ్ళ ఐ.క్యూ. ఎలా ఉందనేది ముఖ్యం. నేను అదే చూస్తా. మా పిల్లలిద్దరూ మంచి విమర్శకులు. అలా మా ఇంట్లోనే ఇద్దరు క్వాలిటీ కంట్రోలర్లున్నారు. (నవ్వు...) ♦ మా ఆవిడ, పిల్లలే నా బలం. నైతికంగా వాళ్ళ అండ లేనిదే ‘రుద్రమదేవి’ ప్రాజెక్ట్‌ను కలలోనైనా ఊహించలేను. మా పెద్దమ్మాయి నీలిమకి అవగాహన చేసుకొనే వయసు, అభిరుచి ఉన్నాయి. అందుకే, ఈ ప్రాజెక్ట్ ఆలోచనల్ని ఎప్పటికప్పుడు తనతో పంచుకొనేవాణ్ణి. ♦ మేమంతా ఏదో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నట్లు ఉండం. అందుకే, ఒక్కోసారి నా పిల్లలే నాకు తండ్రి కూడా అవుతుంటారు. ఈ ‘రుద్రమదేవి’ జర్నీలో నేనెప్పుడైనా కొద్దిగా డల్ అయితే, ‘చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ఫిల్మ్ తీస్తున్నాం’ అని ఉత్సాహపరిచేవారు. ఏ తండ్రికైనా, క్రియేటర్కైనా ఇంట్లో అంతటి సపోర్ట్ ఉంటే, అంతకు మించి ఇంకేం కావాలి! మా ఇద్దరమ్మాయిలతో పాటు నన్ను కూడా అమ్మ లాగా చూసుకొనే రాగిణి నా శ్రీమతి కావడం అదృష్టం! పిల్లల పెంపకంలో నేను 50 శాతమే ఫాదర్‌ని. మిగిలిన 50 శాతం వాళ్ళకు నాన్న మా ఆవిడే! ఆయన నేర్పిన సూత్రం అదే! - శ్రీమతి రాగిణీ గుణ (గుణశేఖర్ భార్య) పిల్లలకు తల్లితండ్రులే రోల్‌మోడల్స్! వాళ్ళు మనల్నీ, మన అలవాట్లు, ప్రవర్తననే చూసి పెరుగుతారు. పిల్లల్ని పెంచడమంటే వాళ్ళకు కావాల్సినవి సమకూర్చడమే కాదు. మంచీ చెడు వివరంగా చెప్పడం, వాళ్ళతో గడపడం! ఆ విషయంలో తండ్రిగా ఆయన (గుణశేఖర్)కు పదికి పది మార్కులు వేస్తా. డిసిప్లిన్ నేర్పుతూనే, పిల్లలతో ఫ్రెండ్‌లా కలిసిపోతారు. ఫలానా డిగ్రీ చదవండి, ఫలానా ఉద్యోగం చేయండి అంటూ పిల్లలపై ఒత్తిడి పెట్టడం ఆయనకు కానీ, నాకు కానీ అస్సలు ఇష్టం ఉండదు. ‘మనసుకు నచ్చింది చదవండి, నచ్చిన పని చేయండి. అది టీచర్ ఉద్యోగం కావచ్చు, ఇంటి నిర్వహణ చూసుకొనే గృహిణి కావచ్చు... ఏది చేసినా దానిలో హండ్రెడ్ పర్సెంట్ పెడితే, మానసిక సంతృప్తి, దానితో పాటు విజయం వస్తాయి’ అని చెబుతుంటాం. పిల్లలకు ఆయన నేర్పిన విజయసూత్రం అదే! - రెంటాల జయదేవ ఫొటోలు: శివ మల్లాల -
రుద్రమదేవి విడుదల వాయిదా
హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రుద్రమదేవి చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని భావించారు. అయితే గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తికానందున ఆలస్యమైంది. దర్శకుడు గుణశేఖర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఫేస్బుక్లో ఈ మేరకు వెల్లడించారు. అత్యుత్తమ గ్రాఫిక్స్ అందించేందుకు వందలాదిమంది టెక్నిషియన్లు పనిచేస్తున్నారని, నిర్ణీత సమయానికి చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యంకాదని తెలిపారు. కాగా ఎప్పుడు విడుదల చేస్తామన్న విషయాన్ని గుణశేఖర్ తెలియజేయలేదు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మరో భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి వచ్చే నెల 10న విడుదల కానుంది. ఇక మహేహ్ బాబు చిత్రం 'శ్రీమంతుడు' ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రుద్రమదేవి చిత్రాన్ని ఆగస్టులో లేదా ఆ తర్వాత విడుదల చేసే అవకాశముందని సమాచారం. రుద్రమదేవిగా అనుష్క నటించగా, ఇతర ముఖ్య పాత్రలను యువ హీరోలు అల్లు అర్జున్, రానా పోషించారు.