‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి గా?
‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి గా?
Published Wed, Sep 18 2013 12:29 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘రుద్రమదేవి’. మన దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియో ఫోనిక్ త్రీడీ చిత్రంగా‘రుద్రమదేవి’ రూపొందుతోంది. టైటిల్ రోల్‌ని అనుష్క పోషిస్తున్నారు. ఇందులో కీలకపాత్రల్లో చాలా మంది హేమాహేమీలు నటిస్తున్నారు. తాజాగా ఫిలిమ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే... ‘రుద్రమదేవి’లో మహేశ్‌బాబు గెస్ట్‌రోల్ చేయబోతున్నారట.
‘గోన గన్నారెడ్డి’గా ఆయన ఆ సినిమాలో నటించబోతున్నారట. కాకతీయ సామ్రాజ్య చరిత్రలో రుద్రమదేవికి ఎంత విశిష్ట స్థానం ఉందో, అంత ప్రత్యేకస్థానం గోనగన్నారెడ్డికి ఉంది. గోన గన్నారెడ్డి లేని కాకతీయ చరిత్రను ఊహించజాలం. ఒక రాబిన్‌హుడ్‌లాంటి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర అది. ఈ పాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ మహేశ్‌తోనే చేయించాలని గుణశేఖర్ సంకల్పించారు.
ఈ పాత్రపై మహేశ్‌క్కూడా అవగాహన ఉంది. ‘అర్జున్’ షూటింగ్ మధురమీనాక్షి సెట్‌లో జరుగుతున్నప్పుడు గుణశేఖర్ ఈ పాత్ర గురించి మహేశ్‌కి చెబితే ఉద్వేగానికి గురయ్యారట. ‘గోన గన్నారెడ్డి’గా మహేశ్ కోసం గుణశేఖర్ స్పెషల్ కాస్టూమ్స్ డిజైన్ చేయిస్తున్నారట. పూర్తి అధికారిక సమాచారం త్వరలోనే తెలుస్తుంది. ఇటీవలే అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన భారీ సెట్‌లో ‘రుద్రమదేవి’కి సంబంధించి ఒక షెడ్యూలు పూర్తి చేశారు. అక్టోబర్ 1 నుంచి మరో షెడ్యూలు మొదలుకానుంది.
Advertisement
Advertisement