ప్రముఖ దర్శక-నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో శుక్రవారం రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం)ఈ పెళ్లి జరిగింది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ విద్య, వ్యాపారవేత్త, శ్రీ శక్తి అధినేతలు డా. రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు, వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో నీలిమ గుణ ఏడడుగులు వేశారు.
ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రుద్రమదేవి సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన నీలిమ శాకుంతలం(సమంత లీడ్ రోల్‌లో నటించారు)సినిమాతో నిర్మాతగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment