Director Gunasekhar
-
సమంత 'శాకుంతలం' రిలీజ్ డేట్ ఫిక్స్.. రొమాంటిక్ పోస్టర్ విడుదల
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన సినిమా శాకుంతలం. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మూవీ టీం. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా శాకుంతలంను 3D వెర్షన్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సమంత, దేవ్ మోహన్ రొమాంటిక్ పిక్‌తో ఉన్న స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత శకుంతలగా నటించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్హ ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా డెబ్యూ ఇవ్వనుంది. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Gunaa Teamworks (@gunaa_teamworks) -
డైరెక్టర్ గుణశేఖర్ కూతురు నీలిమ రిసెప్షన్ వేడుక ( ఫొటోలు)
-
ఘనంగా గుణశేఖర్ కుమార్తె వివాహం.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శక-నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో శుక్రవారం రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం)ఈ పెళ్లి జరిగింది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ విద్య, వ్యాపారవేత్త, శ్రీ శక్తి అధినేతలు డా. రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు, వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో నీలిమ గుణ ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రుద్రమదేవి సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన నీలిమ శాకుంతలం(సమంత లీడ్ రోల్లో నటించారు)సినిమాతో నిర్మాతగా మారారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లికూతురిలా ముస్తాబైన గుణశేఖర్ కూతురు.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ పెళ్లి కూతురిలా ముస్తాబైంది. మరికాసేపట్లో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. నేడు(శుక్రవారం)ఫలక్ నుమా ప్యాలెస్‌లో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రవి ప్రఖ్యా అనే బిజిమెన్మ్యాన్ను నీలిమ వివాహం చేసుకోనుంది. ఇటీవలె వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. కాగా నీలిమ గుణ కూడా సినీ రంగంపై ఆసక్తితో నిర్మాతగా మారారు. తన తండ్రి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమ దేవి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమాను నీలిమ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. -
యశోద మూవీపై గుణశేఖర్ ట్వీట్.. సామ్ రిప్లై ఇదే..!
హీరోయిన్ సమంత నటనపై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈనెల 11న విడుదలైన 'యశోద' మూవీలో ఆమె నటన అద్భుతంగా ఉందన్నారు. ఈ మేరకు సామ్‌ను అభినంందిస్తూ ట్వీట్ చేశారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటన ఆసక్తికరంగా సాగిందని కొనియాడారు. యశోద మూవీ ప్రారంభంలో అమాయకపు అమ్మాయిలా చూపించి.. కథలో రాబోయే ట్విస్ట్‌లకు తగినట్లుగా ఆమె తీర్చిదిద్దారు. ఈ సినిమా విజయం సమంత కెరీర్లో మరో కిరీటంగా నిలిచిందంటూ అభినందించారు. (చదవండి: Yashoda Movie Review: ‘యశోద’ మూవీ రివ్యూ) గుణశేఖర్ అభినందించడంతో కథానాయిక సమంత సైతం రిప్లై ఇచ్చింది. సమంత స్పందిస్తూ..' థ్యాంక్యూ గుణశేఖర్ సార్. నేను శాకుంతలం కోసం ఎదురుచూస్తున్నా. నేను ఏదైతే మ్యాజిక్ చూశానో అదే ప్రేక్షకులకు చూపించేందుకు ఇకపై వేచి ఉండలేను' అంటూ రాసుకొచ్చింది. దీంతో సమంత అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మేమంతా శాకుంతలం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. మూవీ అప్డేట్స్ త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. యశోద చిత్రంలో సామ్ నటనను మెచ్చుకుంటూ నెటిజన్లు సైతం పోస్టులు పెడుతున్నారు. కాగా.. ‘శాకుంతలం’ విషయానికి వస్తే కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజుల ప్రణయ గాథ నేపథ్యంలో సినిమా సాగనుంది. ఈ సినిమాలో దేవ్ మోహన్, అల్లు అర్హ కీలకపాత్రల్లో నటించారు. Thankyou @Gunasekhar1 sir 🙏 Can’t wait for #Shaakuntalam especially after what I have seen 🙇♀️ https://t.co/5JxqPNdLWE — Samantha (@Samanthaprabhu2) November 12, 2022 #Yashoda is gripping ,keeps us intrigued. @Samanthaprabhu2 performance stands out with intensity, her efforts in d action sequences tailored to suit her physique & her innocent persona in d beginning sets d stage for the twists that follow. Another feather to your cap #Samantha pic.twitter.com/qFgPWA0RHw — Gunasekhar (@Gunasekhar1) November 12, 2022 -
శకుంతల ఫిక్స్
‘శాకుంతలం’ అనే దృశ్యకావ్యాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు దర్శకుడు గుణశేఖర్. శకుంతల, దుష్యంతుల ప్రేమకథను సిల్వర్ స్క్రీన్ మీద చూపించనున్నారాయన. ‘శాకుంతలం’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రేమకావ్యంలో హీరోయిన్గా సమంత కనిపించనున్నారు. ఈ విషయాన్ని కొత్త సంవత్సరం సందర్భంగా చిత్రబృందం శుక్రవారం ప్రకటించింది. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలమా గుణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. -
శకుంతలం... ఓ ప్రేమకథ
‘హిరణ్యకశ్యప’ అనే భారీ పౌరాణిక చిత్రంతో నాలుగేళ్లుగా బిజీగా ఉన్నారు దర్శకుడు గుణశేఖర్. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వెళ్దాం అనే సమయానికి కరోనా లాక్డౌన్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చి, వేరే ప్రాజెక్ట్‌ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ‘శకుంతలం’ అనే టైటిల్‌తో ఓ ప్యాన్ ఇండియా ప్రేమకథను రూపొందించనున్నారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ చిత్రం గురించి గుణశేకర్ మాట్లాడుతూ – ‘‘హిరణ్యకశ్యప’ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత భారీ సినిమాను చిత్రీకరించడం కొంచెం కష్టం. అందుకే ఈ సినిమా చిత్రీకరణ మేము అనుకున్నదానికంటే ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకే నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించే లోగా ఓ కథను మీకు చెప్పాలనుకుంటున్నాను. మహాభారతంలోని ఆదిపర్వం నుంచి ఓ ప్రేమకథను సినిమాగా తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. -
అప్పుడే అందరి దృష్టి ఇర్ఫాన్‌పై పడింది
‘‘ఒక గొప్ప కళాకారుడు కన్ను మూసినప్పుడు ప్రపంచంలో గొప్ప సినిమా చేయాలనుకునే అందరికీ అది లాసే. ఇర్ఫాన్ ఖాన్ లాంటి నటుడు ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లిపోవడం షాకింగ్ గా ఉంది. మరెన్నో గొప్ప సినిమాలు, గొప్ప పెర్ఫార్మన్స్‌లు చూసే అవకాశాన్ని మనందరం కోల్పోయాం’’ అన్నారు దర్శకుడు గుణశేఖర్. ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన ఇర్ఫాన్ ఖాన్ యాక్ట్ చేసిన ఒకే ఒక్క తెలుగు సినిమా ‘సైనికుడు’. మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ‘పప్పు యాదవ్’ అనే విలన్ పాత్రలో నటించారాయన. ఇర్ఫాన్‌ని తెలుగు సినిమాలో నటింపజేసిన దర్శకుడు గుణశేఖర్‌తో ‘సాక్షి’ జరిపిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ► ఇర్ఫాన్ ఇక లేరనే వార్త వినగానే మీకు గుర్తొచ్చిన విషయాలు? గుణశేఖర్: క్వారంటైన్ సమయంలో పాత క్లాసిక్స్ దగ్గర నుంచి మంచి మంచి సినిమాలన్నీ మళ్లీ చూస్తూ, ఇర్ఫాన్ ఖాన్ కెరీర్ ప్రారంభంలో చేసిన ‘దృష్టి’ కూడా చూశాను. అప్పుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. క్యాన్సర్ తో పోరాడి మళ్లీ మనందర్నీ తెరపై అలరిస్తారనుకున్నాను. ఇంతలో ఈ వార్త వినాల్సి వచ్చింది. నమ్మబుద్ధి కాలేదు. నమ్మాలనిపించలేదు. ‘సైనికుడు’ సినిమాలో మహేష్‌తో ఇర్ఫాన్ ► ఇర్ఫాన్ ఖాన్ని ‘సైనికుడు’ సినిమాలో నటింపజేయాలని ఎందుకు అనిపించింది? ఇర్ఫాన్ గొప్ప నటుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘దృష్టి’లో గజల్ సింగర్ గా చిన్న పాత్ర చేశారు. అందులో శేఖర్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రధారులు. ఇర్ఫాన్ ది చిన్న పాత్ర. కేవలం ఆ పాత్రతోనే దేశవ్యాప్తంగా తన మీద దృష్టి పడేలా చేసుకున్నారు. తర్వాత ‘సలాం బొంబాయి’ చేశారు. అది మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. బొంబాయిలో ఉన్న వీధి పిల్లలతో ఆ సినిమా చేశారు. అటు ఇటుగా అదే సమయంలో నేను చిన్నపిల్లలతో తీసిన ‘రామాయణం’ విడుదలయింది. ఆయన ఎక్కువ శాతం ఆఫ్ బీట్ సినిమాలు చేస్తుండేవారు. కమర్షియల్ సినిమాలు కూడా చేయాలని 2001 నుంచి ఆసక్తి చూపించారు. అదే సమయంలో సౌత్ నుంచి చాలా మంది ఆయన్ను ఇక్కడి సినిమాల్లో యాక్ట్ చేయించాలని ప్రయత్నించారు. మా సినిమాకు బావుంటారని మహేష్, నేను అనుకోవడంతో ఆయన్ను సంప్రదించాం. ఇర్ఫాన్ నన్ను కేవలం ‘ఒక్కడు’ సినిమా దర్శకుడిగా కాకుండా చిన్న పిల్లలతో ‘రామాయణం’ సినిమా చేసిన దర్శకుడిగా కూడా గుర్తు పెట్టుకున్నారు. అలా ఆయన మా సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ► ఆయనతో పని చేసిన రోజుల గురించి? ఆఫ్ బీట్ సినిమాలు చేసేవాళ్లు ఎక్కువ శాతం నేషనల్ స్కూల్ ఆఫ్ ఢిల్లీ నుంచి వస్తారు. వాళ్లందరిలో సాధారణంగా కనిపించేది ఏంటంటే.. పాత్రను ఎక్కువగా స్టడీ చేయడం. అయితే ఇర్ఫాన్ ఆఫ్ బీట్ సినిమాలకు ఎంత ఎఫర్ట్ పెట్టేవారో కమర్షియల్ సినిమాలకూ అంతే శ్రమించేవారు. అది నన్ను ఆశ్చర్యపరిచింది. ‘సైనికుడు’లో ‘పప్పు యాదవ్’ పాత్ర చేశారు. భాష రాని నటులు ఉంటే షూటింగ్ సమయంలో చిన్నఇబ్బంది ఉంటుంది. డైలాగ్స్ సరిగ్గా చెప్పలేని సందర్భాలు ఉంటాయి. ఆ డైలాగ్ కాకుండా వేరే లైన్స్ పలుకుతుంటారు. కానీ ఇర్ఫాన్ గారు ‘మమ’ అనిపించేద్దాం అనుకునే ఆర్టిస్ట్ కాదు. తెలుగు నేర్చుకుని, ప్రతి డైలాగ్ అర్థం ఏంటి? ఎలా పలకాలి? అని తెలుసుకుని, నటించారు. ‘సైనికుడు’లో ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాస్ గారు, ఇర్ఫాన్ కాంబినేషన్ లో ఒక సన్నివేశం ఉంది. ఆ సీన్లో ఇర్ఫాన్ తన డైలాగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా చెప్పడంతో కోటా గారు అభినందించారు. ► సినిమా గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలేమైనా గుర్తు చేసుకుంటారా? ఆరోగ్య విషయంలో ఇర్ఫాన్ చాలా జాగ్రత్తగా ఉండేవారు. ‘ఏ.యం.సి’ కుక్ వేర్ లో నూనె వాడకుండా వంట చేయొచ్చు. మా ఆవిడ (రాగిణి గుణ) ఆ పాత్రలను వాడుతుండేవారు. ఆ విధానం ఆయనకు బాగా నచ్చింది. ఆ పాత్రల గురించి మా ఆవిడ దగ్గర తెలుసుకొని హైదరాబాద్ నుంచి సామాగ్రి కొనుక్కొని తీసుకుని వెళ్లారు. అదో మంచి జ్ఞాపకం. ఆయన చనిపోయిన వార్త విని మా ఆవిడ కూడా షాక్ అయ్యారు. ► చాలామంది సెలబ్రిటీలు ఇర్ఫాన్ చనిపోవడం పర్సనల్ లాస్లా ఉంది అంటున్నారు.. అది నిజమే. ఎన్నో గొప్ప సినిమాలు చేశారాయన. ఇంకా ఎన్నో సినిమాలు మనకు అందిస్తారు, గొప్ప కథలు చెబుతారు, అద్భుతమైన ఆర్ట్‌ని ప్రపంచానికి చూపిస్తారని ఊహించాం. ఇక అది జరగదనే విషయం ఎవరికీ నమ్మబుద్ధి కావడం లేదు. అందుకే పర్సనల్ లాస్ లా ఫీల్ అవుతున్నారు. ► ‘సైనికుడు’ చేస్తున్నప్పుడే ఆయనకు హాలీవుడ్ సినిమా ఆఫర్ కూడా వచ్చిందట కదా? అవును. అప్పుడే ఆయనకు తొలి హాలీవుడ్ సినిమా ‘మైటీ హార్ట్’ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్, మా డేట్స్ ఒకటే. దాంతో ఇర్ఫాన్ చాలా ప్రొఫెషనల్‌గా ‘ఒక హాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చింది. మన డేట్స్ ని మార్చడానికి వీలవుతుందా?’ అని అడిగారు. మహేష్ గారు, అశ్వనీ దత్ గారు, నేను మాట్లాడుకుని మొత్తం డేట్స్ అన్నీ మార్చేశాం. నెల రోజులు తర్వాత చేయాల్సిన షూటింగ్ ని ముందుకు మార్చి, 30 రోజుల పనిని 18 నుంచి 20 రోజుల్లో పూర్తి చేసి ఆయన్ను పంపించాం. ఆయన చాలా సంతోష పడ్డారు. హాలీవుడ్ ఆఫర్ అనేది ఆయనకు కొత్త ఇన్నింగ్స్. ఇర్ఫాన్ పొటెన్షియాల్టీకి తగ్గ కాన్వాస్ దొరికిందనుకున్నాను. ఆ తర్వాత ఆయనలా ఎవరికీ దొరకలేదు. హాలీవుడ్ హిట్ సినిమాలన్నిట్లో ఇర్ఫాన్ ఉండటం చాలా సాధారణం అయిపోయింది. మనందరం గర్వపడే స్థాయికి వెళ్లారాయన. -
అల్లు అర్జున్ను అవమానపరిచారు
-
‘కేశవ’ చూడాలని ఉంది!
– దర్శకుడు గుణశేఖర్ ‘‘సన్ని సంగీతం బాగుంటుంది. తను ఎంత మంచి సంగీత దర్శకుడో ఎం.ఎం. కీరవాణిగారు చెప్పారు. ట్రైలర్ చూస్తుంటే ‘కేశవ’ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని కుతూహలంగా ఉంది. అభిషేక్ నామా మంచి పంపిణీదారుడే కాదు. గొప్ప ప్రేక్షకుడు కూడా. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నిర్మాతగా నిలిచిపోతాడు’’ అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. నిఖిల్, రీతూవర్మ, ఇషా కొప్పీకర్ ముఖ్య పాత్రల్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో దేవాన్ష నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ‘కేశవ’. సన్ని ఎం.ఆర్ స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన సినిమా చేస్తున్నప్పుడు మనకు సపోర్ట్ చాలా అవసరం. ఆ సపోర్ట్ నాకు ప్రేక్షకులతో పాటు చందు, సుధీర్, చైతు అందించారు. అభిషేక్‌గారు నాకు పెద్దన్నలాంటివారు. ఆయన వంద సినిమాలు నిర్మించి, ఎంతో ఎత్తుకు చేరుకోవాలి’’ అన్నారు. ‘‘సుధీర్‌వర్మ నా ఫేవరెట్ దర్శకుల్లో ఒకరు. ఇలాంటి దర్శకులు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు హీరో శర్వానంద్. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘స్టోరీ వినగానే నిఖిల్, అభిషేక్‌గారు ‘కేశవ’ చేయడానికి అంగీకరించారు. మన కాంబినేషన్లో మరో చిత్రం ఎప్పుడు చేద్దాం? అని అభిషేక్‌గారు అంటున్నారు’’ అని సుధీర్ వర్మ చెప్పారు. నిర్మాత సి.కళ్యాణ్, దర్శకులు నందినీ రెడ్డి, చందూ మొండేటి, నటులు అడివి శేషు, ‘వెన్నెల’ కిశోర్ పాల్గొన్నారు. -
అందుకే ఈ సాహసం చేశా! : దర్శకుడు గుణశేఖర్
‘‘ఇది మన సినిమా అని తెలుగు వారందరూ గర్వపడేలా ఉంటుంది. నాకిలాంటి అవకాశమిచ్చిన గుణశేఖర్‌గారికి థ్యాంక్స్’’ అని అల్లు అర్జున్ అన్నారు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ముఖ్య పాత్రల్లో శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మించిన చిత్రం ‘రుద్రమదేవి’. ఈ నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ- ‘‘కమర్షియల్... ఆర్ట్.. ఏదైనా కావచ్చు.. ఏ సినిమా అయినా నాకిష్టమే. కరెక్ట్‌గా చెప్పాలంటే ‘మంచి సినిమాలు’ ఇష్టం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత మంచి సినిమా అందించడానికి తపించిన దర్శకుడు గుణశేఖర్‌కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు చే యడం అనుష్కకే సాధ్యం. ‘అరుంధతి’ సినిమా తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు చేయగలనని నిరూపించుకున్నారు. ఈ చిత్రం కోసం అనుష్క చాలా కష్టపడ్డారు. ఆమెలా ఎవరూ కష్టపడలేరు. ఇలాంటి జోనర్ మూవీస్ వస్తేనే ఇండస్ట్రీకి బాగుంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రాన్ని ఎంత పేషనేట్‌గా స్టార్ట్ చేశామో, అంతే ఉత్సాహంతో పూర్తి చేశాం. ఇది మా రెండున్నరేళ్ల కష్టం’’ అని అనుష్క అన్నారు. రుద్రమదేవి కథే నాకు గుప్తనిధి - గుణశేఖర్ గుణశేఖర్ మాట్లాడుతూ- ‘‘కాకతీయుల చరిత్రను ఏ మాత్రం వక్రీకరించకుండా తీశాం. ప్రముఖ చరిత్రకారులను కలిసి, పరిశోధన చేశాం. అన్ని పుస్తకాల్లో చరిత్ర ఒకేలా లేదు. ఒక్కో పుస్తకంలో ఒక్కోలా ఉంది. అందుకే శిలా శాసనాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇంత అద్భుతమైన చరిత్రను రెండు గంటల 37 నిమిషాల్లో చెప్పడం సాహసంగా అనిపించింది. 800 ఏళ్ల క్రితం ఓ 40 ఏళ్ల పాటు ఓ స్త్రీ రాజ్యాన్ని ఎలా పాలించింది? దాని వెనకాల ఆమె చేసిన కృషి, త్యాగాలను చూసి స్ఫూర్తి పొందాను. రుద్రమ కథ అనే గుప్తనిధి నాకు దొరికింది. అందుకే ఈ సాహసానికి పూనుకున్నాను’’ అని అన్నారు. రానా మాట్లాడుతూ- ‘‘చరిత్రను అద్భుతంగా చెప్పాలంటే సినిమా ప్రధాన సాధనం. నాకు చరిత్ర నేపథ్యంలో వచ్చే సినిమాలంటే చాలా ఇష్టం. 2005లో నేను విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్న సమయంలోనే గుణశేఖర్‌గారు నాకీ కథ చెప్పారు. ఈ సినిమాలో ఓ నటుడిగా నేనూ భాగం అయినందుకు సంతోషంగా ఉంది. రాణీ రుద్రమదేవి అంటే అనుష్క అనే విధంగా ముందు తరాలకు గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు. -
ఇది తెలుగుజాతి కథ
మనసుకు నచ్చిన పని చేయాలంటే, మనీ లెక్కలేసుకుంటే కుదరదు. సినిమా అంటే ప్రాణం పెట్టే దర్శకుడు గుణశేఖర్ మొదటి నుంచీ నమ్మేదీ, ఆచరించేదీ అదే. పిల్లలతో ‘రామాయణం’ దగ్గర నుంచి మహేశ్ ‘ఒక్కడు’, ‘అర్జున్’ దాకా ఆయన తీసిన సినిమాలన్నీ అలాంటివే. నచ్చిన సబ్జెక్ట్‌ను నలుగురికీ నచ్చేలా చెప్పడానికి పదేపదే సాహసించే ఈ సృజనశీలి దాదాపు మూడేళ్ళుగా చేస్తున్న ప్రతిష్ఠాత్మక వెండితెర ప్రయత్నం - ‘రుద్రమదేవి’. చిన్నప్పుడు స్కూల్లో నాన్డీటైల్డ్గా చదివిన కాకతీయ సామ్రాజ్యపు వీరనారి రుద్రమదేవి కథనూ, తెలుగువారి గొప్పతనాన్నీ ప్రపంచమంతటికీ తెలియజెప్పేందుకు ఆయనే నిర్మాతగా కూడా మారారు. రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుడిగా రానా - ఇలా కీలకమైన చారిత్రక పాత్రలన్నీ ఈ సినిమాతో మన కళ్ళ ముందుకు రానున్నాయి. పైగా ‘‘చారిత్రక కథాంశంతో వస్తున్న తొలి స్టీరియో స్కోపిక్ 3డీ ఫిల్మ్’’ ఇదే. ఇళయరాజా (సంగీతం), తోట తరణి (కళ), నీతా లుల్లా (‘జోథా అక్బర్’ ఫేమ్ కాస్ట్యూమ్ డిజైనర్) లాంటి ప్రసిద్ధ టెక్నీషియన్ల పనితనంతో ఈ సినిమా అన్ని హంగులూ పూర్తి చేసుకొంది. విజువల్ ఎఫెక్ట్స్‌లో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ‘‘ప్రస్తుతం అవన్నీ కూడా పూర్తి కావచ్చాయి. నాలుగైదు రోజుల్లో ఒక స్పష్టత రాగానే, రిలీజ్ ప్రణాళిక ప్రకటిస్తాం’’ అని గుణశేఖర్ ‘సాక్షి’కి చెప్పారు. ఒకపక్క 3డీ వెర్షన్‌తో పాటు, 3డీ కళ్ళద్దాలతో అవసరం లేకుండానే 3డీ ఎఫెక్ట్‌లో సినిమా చూసేలా మరో వెర్షన్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. అందుకోసం కొత్త టెక్నాలజీతో ప్రతి ఫ్రేమ్నూ విదేశీ నిపుణుల సాయంతో సిద్ధం చేస్తున్నారు. పరిశ్రమలోని ప్రముఖులందరూ నటించగా, తెలుగులో చాలాకాలం తరువాత వస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం ఇదే. గుణశేఖర్ సాహసానికీ, సినిమాపై ప్రేమకూ తాజా నిదర్శనమైన ఈ ‘రుద్రమదేవి’ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీలోనూ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అధికారికంగా మరిన్ని వివరాలకు ఇంకొద్ది రోజులు ఆగాలి.