శకుంతలం... ఓ ప్రేమకథ | Gunasekhar Next Is Mythological Drama is Shakuntalam | Sakshi
Sakshi News home page

శకుంతలం... ఓ ప్రేమకథ

Published Sat, Oct 10 2020 1:31 AM | Last Updated on Sat, Oct 10 2020 1:31 AM

Gunasekhar Next Is Mythological Drama is Shakuntalam - Sakshi

‘హిరణ్యకశ్యప’ అనే భారీ పౌరాణిక చిత్రంతో నాలుగేళ్లుగా బిజీగా ఉన్నారు దర్శకుడు గుణశేఖర్‌. ప్రీ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకుని సెట్స్‌ మీదకు వెళ్దాం అనే సమయానికి కరోనా లాక్‌డౌన్‌ వచ్చింది. దీంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్‌ ఇచ్చి, వేరే ప్రాజెక్ట్‌ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ‘శకుంతలం’ అనే టైటిల్‌తో ఓ ప్యాన్‌ ఇండియా ప్రేమకథను రూపొందించనున్నారు. గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు.

ఈ చిత్రం గురించి గుణశేకర్‌ మాట్లాడుతూ – ‘‘హిరణ్యకశ్యప’ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత భారీ సినిమాను చిత్రీకరించడం కొంచెం కష్టం. అందుకే ఈ సినిమా చిత్రీకరణ మేము అనుకున్నదానికంటే ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకే నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని స్క్రీన్‌ మీద ఆవిష్కరించే లోగా ఓ కథను మీకు చెప్పాలనుకుంటున్నాను. మహాభారతంలోని ఆదిపర్వం నుంచి ఓ ప్రేమకథను సినిమాగా తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement