Hiranyakashyapa Movie
-
శకుంతలం... ఓ ప్రేమకథ
‘హిరణ్యకశ్యప’ అనే భారీ పౌరాణిక చిత్రంతో నాలుగేళ్లుగా బిజీగా ఉన్నారు దర్శకుడు గుణశేఖర్. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వెళ్దాం అనే సమయానికి కరోనా లాక్డౌన్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చి, వేరే ప్రాజెక్ట్‌ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ‘శకుంతలం’ అనే టైటిల్‌తో ఓ ప్యాన్ ఇండియా ప్రేమకథను రూపొందించనున్నారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ చిత్రం గురించి గుణశేకర్ మాట్లాడుతూ – ‘‘హిరణ్యకశ్యప’ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత భారీ సినిమాను చిత్రీకరించడం కొంచెం కష్టం. అందుకే ఈ సినిమా చిత్రీకరణ మేము అనుకున్నదానికంటే ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకే నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించే లోగా ఓ కథను మీకు చెప్పాలనుకుంటున్నాను. మహాభారతంలోని ఆదిపర్వం నుంచి ఓ ప్రేమకథను సినిమాగా తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. -
‘హిరణ్యకశ్యప’ లేటెస్ట్ అప్డేట్
కమర్షియల్, పౌరాణిక, చారిత్రక నేపథ్యం గల చిత్రాలను తెరకెక్కిస్తూ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు గుణశేఖర్. భారీ సెట్లు, భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ డైరెక్టర్ ప్రస్తుతం ‘హిరణ్యకశ్యప’ టైటిల్‌తో పౌరాణిక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని గుణశేఖర్ స్వయంగా ప్రకటించారు. తాజాగా ‘హిర్యణ్యకశ్యప’ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని కూడా తెలిపింది. (ఆగస్టులోనే రానా పెళ్లి) సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘హిరణ్యకశ్యప’ చిత్రంలో రానా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అనుష్క ‘రుద్రమదేవి’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ఆ తర్వాత ‘బాహుబలి’ని మించిన రేంజ్లో ఓ చిత్రం చేయబోతున్నట్లు తెలిపారు. అనంతరం ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం అటకెక్కిందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే తాజాగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయని ప్రకటించడంతో ఈ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న అసత్య వార్తలకు చిత్ర బృందం పుల్‌స్టాప్ పెట్టింది. ఇక ఇది భక్త ప్రహ్లాద కథే అయినప్పటికీ ఈ సినిమాను హిరణ్యకశ్యపుడి కోణంలో గుణశేఖర్ తెరకెక్కించబోతున్నారు. -
అఫీషియల్ : రానా ‘హిరణ్యకశ్యప’
రానా దగ్గుబాటి మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దాదాపు 60 ఏళ్ల తరువాత భక్త ప్రహ్లాద, హిరణ్యకశ్యపుల కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వార్తలు చాలా కాలంగా వినబడుతున్నా.. చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. తాజాగాచిత్ర దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారాన్ని తన ట్విటర్పేజ్లో పోస్ట్ చేశారు. గత మూడేళ్లుగా హిరణ్యకశ్యప సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా తెలిపారు. ఈ సినిమాలో రానా టైటిల్ రోల్లో నటించనున్నారని తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. Exciting journey with @RanaDaggubati for హిరణ్యకశ్యప #Hiranyakashyapa #OmNamoNarayanaya pic.twitter.com/7GujaMz0nu — Gunasekhar (@Gunasekhar1) 1 June 2019