manisharma
-
నా ఆస్తి పోవడానికి కారణం వాళ్లే..
-
‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి సాంగ్ విడుదల.. ఫ్యాన్స్ ఫిదా
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్' (2019) కి సీక్వెల్‌గా 'డబుల్ ఇస్మార్ట్' రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘స్టెప్ మార్’ అంటూ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తుంటే.. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. మణిశర్మ సంగీతం ఈ మూవీకి ప్రధాన బలం కానుంది. పార్ట్-1 కోసం ఆయన అందించిన మ్యూజిక్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు సీక్వెల్లో కూడా ఆయన దుమ్మురేపాడని తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మా సినిమా విడుదల కానుంది. -
శివుడిపై అద్భుతమైన పాట వైరల్.. డాక్టర్ నాగ మాధురి గాత్రానికి ఫిదా!
'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్న విషయం తెలిసిందే. అందుకు తగినట్లుగా డా: నాగ మాధురి ఏరికోరి నేత్ర వైద్యురాలుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. డాక్టర్‌గా సేవలు అందిస్తూనే ఆమెలో మరో టాలెంట్ కూడా దాగి ఉంది. అందరినీ మెచ్చేలా పాటలు పాడగలదు. ఒకపైపు వేలాదిమందికి కంటి చూపు ప్రసాదిస్తూ... సరి చేస్తూనే... సంగీతంలోనూ నిష్ణాతురాలిగా రాణిస్తున్నారు. బహుముఖ ప్రతిభాశాలిగా డాక్టర్ నాగ మాధురి మెప్పిస్తున్నారు. ఉన్నత విద్యా సంపన్న కుటుంబంలో జన్మించిన నాగ మాధురి చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల మక్కువ చూపేవారు. చదువులో చాలా చురుగ్గా ఉంటూనే.. చిత్ర కళ, గానంలో విశేష ప్రతిభ కనబరిచేవారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డాక్టర్ వైజర్సు సుబ్రహ్మణ్యం దగ్గర సంగీతంలో శిష్యరికం చేశారు. కర్నాటిక్ క్లాసిక్ మ్యూజిక్‌లో డిప్లొమా చేయడంతోపాటు అందులో డిష్టింక్షన్ సాధించడం నాగ మాధురి ప్రతిభను చెప్పకనే చెబుతుంది. ఆప్తమాలజీ (కంటి వైద్యం) స్పెషలిస్ట్‌గా ఒంగోలులోని స్మార్ట్ విజన్ హాస్పిటల్‌కి మేనేజింగ్ పార్టనర్ కమ్ ఛీఫ్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తూనే.. సంగీతంలోనూ సాధన చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ శివరాత్రికి కానుకగా ఆ మహా శివుడిపై ప్రేమతో అద్భుతమైన పాటను ఆమె పాడారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో పేరుగాంచిన స్ట్రింగ్ ప్లేయర్ మాండలిన్ ఎస్.ఎమ్. సుభాని సారధ్యంలో "శంభో మహాదేవ... శంకర గిరిజా రమణ" త్యాగరాజ కృతిని ఆలపించి.. 'గాన మాధురి' అనే తన పేరును సార్ధకం చేసుకున్నారు నాగ మాధురి. 15 సంగీత వాయిద్యాలలో నిష్ణాతులు అయిన సుభాని గారు కీరవాణి, థమన్, రెహమాన్, అనిరుద్ వంటి దిగ్గజ దర్శకులకు తన వాద్య సహకారం అందిస్తుంటారు. ఇకపోతే... "శంభో మహాదేవ" ఆడియో అండ్ వీడియో ఆల్బమ్‌ను మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ ఆవిష్కరించి, అభినందించడం విశేషం. "శంభో మహదేవ" ఆల్బమ్ అనే తన కల సాకారం దాల్చడంలో మాండలిన్ సుభాని గారి స్ఫూర్తి, విశ్వనాధ్ అరిగెల సహకారం, మరీ ముఖ్యంగా తన ఫ్యామిలి సపోర్ట్ ఎంతైనా ఉందని డాక్టర్ నాగ మాధురి అన్నారు. మణిశర్మ గారి మంచితనాన్ని, ఆయన అభినందనను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె తెలిపారు. -
డబుల్ ఇస్మార్ట్‌కు మణిశర్మ స్వరాలు
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం రామ్, పూరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చనున్నట్లు చిత్రయూనిట్ శనివారం వెల్లడించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ సినిమాలకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చే ఏడాది మార్చి 8న విడుదల కానుంది. -
మధుర గతమా...
శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శకుంతల–దుష్యంతుడి ప్రేమ నేపథ్యంలో రూపొం దిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘మధుర గతమా.. కాలాన్నే ఆపక ఆగావే సాగక, అంగుళికమా జాలైనా చూపక చేజారావే వంచికా..’ అంటూ సాగే పా టని బుధవారం విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పా టని అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ పా డారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, మధుబాల, గౌతమి తదితరులు నటించారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
దివంగత నటి, దర్శక–నిర్మాత విజయనిర్మల మనవడు శరణ్ కుమార్ (నటుడు నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ తనయుడు) హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకత్వం వహించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ కథానాయికలు. హన్విక క్రియేషన్ బ్యానర్‌పై బీఎన్ రావు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24న విడుదలకానుంది. శరణ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మిస్టర్ కింగ్’ నా మొదటి సినిమా. ప్రేక్షకుల ప్రేమ, సపోర్ట్ కావాలి. మా సినిమాని చూసి ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. అమ్మాయి ఉన్న ప్రతి కుటుంబం, ఆత్మగౌరవం ఉన్న ప్రతి అబ్బాయి చూడాల్సిన మూవీ’’ అన్నారు శశిధర్ చావలి. ‘‘మా చిత్రాన్ని అందరూ థియేటర్లో చూడాలి’’ అన్నారు బీఎన్ రావు. ఈ కార్యక్రమంలో యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్, కెమెరామేన్ తన్వీర్, నటుడు రాజ్ కుమార్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: రవి కిరణ్ చావలి, సంగీతం: మణిశర్మ. -
ఫిబ్రవరి 3న ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ మూవీ రిలీజ్
నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న చిత్రం ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’. ఇందులో ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయెత్రి మకానా, శివరామ్ రెడ్డిలు ప్రధాన పాత్రలో నటించిన చిత్రాన్ని వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో చిత్రయూనిట్ పంచుకన్న విశేషాలు ఇవే. డైరెక్టర్ జైదీప్ విష్ణు మాట్లాడుతూ.. 'నాకు ఎంతో మంచి టీం దొరికింది. వారి వల్లే సినిమాను ఎంతో బాగా తీయగలిగాను. నాలుగు నెలల పాటుగా నాతోనే ఉంది. మ్యాగీ, దీక్షిత్‌లు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వినయ్ లేటుగా వచ్చాడు. ఈ ముగ్గురూ కలిసి సినిమాను బాగా హ్యాండిల్ చేశారు. మా ఊరోడు సినిమా తీస్తున్నాడని, మాకు ఊరు ఊరంతా సాయం చేసింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎంతో సాయం చేసింది. నా ఇద్దరు హీరోలు, హీరోయిన్లకు థాంక్స్. ఈ సినిమాకు మ్యూజిక్ విషయంలో ఇబ్బంది పడ్డాం. మణిశర్మ గారి వద్దకు వెళ్లాక ఆ సమస్య తీరిపోయింది. నాలుగు పాటలు నాలుగు రోజుల్లోనే ఇచ్చారు. లిరిక్స్ ఇచ్చిన వెంటనే పాటలు వచ్చేశాయి. కాసర్ల శ్యామ్ లేకపోతే మాకు మణిశర్మ గారు దొరికేవారు కాదు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. హీరోయిన్ పాత్రను రాసినప్పుడే తెలంగాణ అమ్మాయినే తీసుకోవాలని అనుకున్నాం. తెలంగాణ యాసలో మాట్లాడే అమ్మాయి అయితేనే బాగుంటుందని జయెత్రిని తీసుకున్నాం. మా సినిమా ఫిబ్రవరి 2న యూఎస్‌లో విడుదలవుతోంది. ఫిబ్రవరి 3న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. థియేటర్లో ఈ సినిమాను చూడండి' అని అన్నారు. అనంతరం మెలోడి బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అంతా అయిపోయిన తరువాత నాకు ఒక విషయం అర్థమైంది. దర్శకుడు కనిపించినంత సాఫ్ట్ ఏం కాదు. మేం అంతా కలిసి కొత్తగా ట్రై చేశాం. ఆడియెన్స్ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
సమంత శాకుంతలం.. లిరికల్ సాంగ్ అవుట్
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇదివరకే ఈ చిత్రం నుంచి మల్లికా మల్లికా అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఋషివనములోనా' మరో లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి రెండో సింగిల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రిలీజై అభిమానులను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అవుతున్న శాకుంతలం సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. ఈ సాంగ్ లిరిక్స్ శ్రీమణి అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు. -
అవి ఉన్నంత కాలం ప్రేమ ఎప్పుడు ఓడిపోదు.. 'నిన్నే చూస్తూ' ఆడియో రిలీజ్
శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి) హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'నిన్నే చూస్తూ'. కె.గోవర్ధనరావు దర్శకత్వంలో.. వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఆడియోను ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ పాటలకు రమణ్ రాథోడ్ సంగీతమందించారు. చిత్ర నిర్మాత హేమలత రెడ్డి గారు మాట్లాడుతూ.. 'ఈ సినిమా ఆడియోను మణిశర్మ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో తెరకెక్కించాం. ఈ పాటలు మాకు కచ్చితంగా మంచి పేరు తీసుకొస్తాయి. ఈ నెల చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం.' అని అన్నారు. చిత్ర దర్శకుడు కె.గోవర్ధనరావు మాట్లాడుతూ..'ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. అని చెప్పే ప్రేమకథా చిత్రానికి సీనియర్ యాక్టర్స్ ను సుమన్, సుహాసిని, బాను చందర్, శాయాజి షిండే, కిన్నెర లాంటి వారు పని చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వీరందరినీ డైరెక్షన్ చేసే అవకాశం కల్పించిన నిర్మాత హేమలత రెడ్డి గారికి కృతజ్ఞతలు' అని అన్నారు. -
నేను వచ్చానని చెప్పాలనుకున్నా.. అదరగొడుతున్న 'ఆచార్య' ట్రైలర్
'సైరా నరసింహా రెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'ఆచార్య'. డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ 'సిద్ధ' అనే పవర్ఫుల్ పాత్రలో అలరించనున్న విషయం తెలిసిందే. అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు 'ఆచార్య' తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 12న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రకటించినట్లుగానే మంగళవారం (ఏప్రిల్ 12)న సాయంత్రం 'ఆచార్య' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలానే చిరంజీవి, రామ్ చరణ్ తమదైన నటనతో అదరగొట్టారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ధర్మస్థలి.. అపధర్మస్థలి ఎలా అవుతది ?, పాదఘట్టం వాళ్ల గుండెలపై కాలు వేస్తే.. ఆ కాలు తీసేయాలట.. వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసే డ్యాన్స్, ఫైటింగ్‌లు అభిమానులకు సూపర్ ఐ ఫీస్ట్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు ఇంకాస్తా పెరిగేలా ఉన్నాయి. చిరంజీవి 152వ సినిమాగా వస్తున్న 'ఆచార్య' చిత్రాన్ని సోషల్ మీడియాతోపాటు 152 ప్రత్యేకమైన థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు సోమవారం (ఏప్రిల్ 11) ప్రకటించిన విషయం తెలిసిందే. -
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న 'బలమెవ్వడు' చిత్రం
Balamevvadu Movie Post Production Works Completed: వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నించడానికి వస్తోంది 'బలమెవ్వడు' చిత్రం. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్బీ మార్కండేయులు నిర్మించగా, సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు పృథ్వీరాజ్, సుహాసిని కీలక పాత్రలు పోషిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీంత అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, ఎంఎం. కీరవాణి పాడిన టైటిల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆధరణ లభించింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. 'ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత రీ-రికార్డింగ్ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ సత్తా ఏంటో తెలిసింది. ఆయన కెరీర్లోనే అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన భారీ చిత్రాల మధ్య చేరబోయే మొదటి చిన్న సినిమా బలమెవ్వడు కానుంది. ఈయన బీజీఎం సినిమాను థియేటర్ మెట్లు ఎక్కించేలా చేసింది. నటీనటులు, కథ, సంభాషణలు సినిమాకు ప్రధాన బలాలు. అతి త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం.' అని డైరెక్టర్ సత్య రాచకొండ తెలిపారు. -
ఘనంగా మణిశర్మ కుమారుడి నిశ్చితార్థం ఫోటోలు
-
మణిశర్మ కుమారుడి నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫోటోలు
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు స్వరసాగర్ మహతి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. సంజన కలమంజే అనే యువతితో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ వేడుక అత్యంత సాధారణంగా జరిగింది. అయితే సాగర్ తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవరకు ఈ విషయం ఎక్కవ మందికి తెలియదు. చదవండి: కొత్త ఫ్లాట్ తీసుకున్న చై, అక్కడే ఒంటరిగా.. ఇక సాగర్ మహతి పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా గాయని కావడం విశేషం. ఆమె పలు తమిళ, కన్నడ చిత్రాల్లో పాటలు పాడారు. అంతేగాక సాగర్ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన భీష్మ సినిమాలోని ‘హేయ్ చూసా’ అనే పాటకు గాత్రం అందించారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ అయితే సాగర్- సంజనల పెళ్లి తేదిని ఇంకా ఖరారు చేయనట్లు తెలుస్తోంది. కాగా మణిశర్మ కుమారుడు సాగర్ మహతి కూడా సంగీత దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన ‘ఛలో, భీష్మ, మ్యాస్ట్రో’ వంటి చిత్రాలకు సంగీతం అందించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అలాగే తన తండ్రి పని చేసే చిత్రాలకు సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. -
మణిశర్మ స్వరాలకు కీరవాణి గాత్రం తోడైతే..
ధ్రువన్, నియా త్రిపాఠి, సుహాసిని, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బలమెవ్వడు'. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, టైటిల్ సాంగ్‌ని కీరవాణి ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సంగీత ప్రపంచంలో మణిశర్మ, కీరవాణిలది ప్రత్యేక స్థానం. అలాంటిది ఓ సాంగ్ కోసం ఇద్దరూ కలిశారు. మణిశర్మ స్వరాలకి కీరవాణి గాత్రం అందించారు. ఈ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇక సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్‌కు మంచి ఆధరణ లభిస్తుంది. -
నారప్ప ఫస్ట్ లిరికల్ 'చలాకి చిన్నమ్మీ..' వచ్చేసింది
వెంకటేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా నటించారు. తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘అసురన్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించరు. ఆదివారం జులై11న మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా నారప్ప మూవీ నుంచి ‘చలాకీ చిన్నమ్మి’అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. 'చిలిపి చూపుల చలాకీ చిన్నమ్మీ..ఎలాగే నిన్నిడిచి ఎలాగే ఉండేది'..అంటూ సాగే ఈ పాట ఎంతో ఆకట్టుకుంటుంది. అచ్చమైన పల్లెటూరి టచ్ ఉండేలా అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, ఆదిత్య అయ్యంగార్, నూతన మోహన్ ఈ పాటను పాడారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. నారప్ప టీజర్‌తో ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు వెంకటేశ్. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్ బాబుతో కలిసి కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. Melody Brahma #ManiSharma weaves his magic once again 🎶✨#ChalaakiChinnammi from #Narappa is out now ▶️ https://t.co/u7IrOav16Y#HBDManiSharma@VenkyMama #Priyamani #SrikanthAddala @SureshPromusic @SureshProdns @theVcreations pic.twitter.com/ibwR6zN04i — Suresh Productions (@SureshProdns) July 11, 2021 -
''బలమెవ్వడు" మూవీ కాన్సెప్ట్ టీజర్ విడుదల
కార్పొరేట్ ఆస్పత్రుల ధన దాహానికి, మెడికల్ మాఫియాా మోసాలకు అద్దం పడుతూ రూపొందుతున్న సినిమా "బలమెవ్వడు". ధృవన్ కటకం ఈ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. నియా త్రిపాఠీ నాయికగా నటిస్తోంది. సత్య రాచకొండ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ఆకర్షణ కానుంది. ఆదివారం (జూలై 11) మణిశర్మ బర్త్ డే సందర్భంగా "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ కాన్సెప్ట్ టీజర్ చూస్తే...పూర్వకాలంలో వైద్యాన్ని సేవగా భావించిన పుణ్యభూమి మన దేశం. కానీ క్రమంగా వైద్యం వ్యాపారంగా మారింది. కార్పొరేట్ రూపు దాల్చింది. దీంతో వైద్యం కొనుక్కోలేక సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ నాణ్యమైన వైద్యం సామాన్యుడికి అందనంత దూరమైంది అనే వాస్తవాన్ని కాన్సెప్ట్ టీజర్ లో స్పష్టంగా చూపించారు. సుహసినీ, నాజర్, పృథ్విరాజ్‌లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సత్య రాచకొండ దర్శకుడు పేర్కొన్నారు. -
ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన సింగర్ సునీత, కారణం ఇదే..
టాలీవుడ్లో సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, టెలివిజన్ యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో వందల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. ఇక ఇటీవల రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ గాయని.. తాజాగా అభిమానులకు క్షమాపణ చెప్పింది. దానికి కారణం తన మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం. అసలు విషయంలోకి వెళ్లే... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజాలో‘మణిశర్మ మ్యూజికల్ నైట్’ ఈవెంట్ జరగాల్సి ఉంది. అందులో సునీతతో పాటు గీతామాధురి, రమ్య, అనురాగ్ కులకర్ణి, సాహితి, రేవంత్ శ్రీక్రిష్ణ, సాకేత్ తదితర గాయకులు పాల్గొనాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో కరోనా కేసులో ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ కార్యక్రమం రద్దయింది. ఈ విషయాన్ని సింగర్ సునీత సోషల్ మీడియాలో తెలియజేస్తూ.. ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్పింది. ‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన మణిశర్మ మెగా మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే దీన్ని క్యాన్సిల్ చేశారు. స్టే సేఫ్’ అంటూ శనివారం తన ఫేస్బుక్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టింది సునీత. -
హీటెక్కిస్తున్న‘సీటీమార్’ పెప్సీ ఆంటీ సాంగ్
గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్‌తో పాటు ‘జ్వాలారెడ్డి’పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఆదివారం ఈ సినిమా నుంచి ఐటమ్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. 'నా పేరే పెప్సీ ఆంటీ... నా పెళ్ళికి నేనే యాంటీ...' అంటూ సాగే ఈ పాటను దర్శకుడు సంపత్ నంది రాశారు. కీర్తన, శర్మ ఆలపించారు. క్రాక్ సినిమాలో 'భూం బద్దల్' సాంగ్‌తో ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ తెచ్చుకున్న అప్సర రాణి.. ఈ పాటకు స్టెప్పులేసింది. 'మా అమ్మకు పెళ్ళి కాకముందే కడుపులో పడ్డాను... నెలలు నిండక ముందే భూమ్మీద పడ్డాను.... బారసాల కాకముందే బోర్లా పడ్డాను... టెన్త్ లోకి రాగానే వాల్ జంప్ లే చేశాను.... ఇంటర్ లోకి రాగానే బోయ్ ఫ్రెండ్ నే మార్చాను.... డిగ్రీ లోకి రాగానే దుకాణమే తెరిసేశాను... పిజీ లోకి రాగానే ప్రపంచమే చూశాను' లాంటి మాస్ పదాలకు అప్సర గ్లామర్ షో యాడ్ కావడంతో ఈ మాస్ సాంగ్ యూత్‌లో బలంగా దూసుకెళ్లింది. ఈ పాటకు మణిశర్మ బాణీ ఓ రేంజులోనే కుదిరిందని చెప్పాలి. గత కొంతకాలంగా గోపీచంద్‌కి మంచి హిట్ దక్కడం లేదు. అయితే సీటీమార్ సినిమాతో మళ్ళీ భారీ హిట్ అందుకొని ఫాంలోకి వస్తాడన్న నమ్మకంగా ఉన్నాడట గోపీచంద్. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అయితే సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ‘పెప్సీ ఆంటి’ మాస్ సాంగ్ ‘సిటీమార్’కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి మరి. -
శకుంతలం... ఓ ప్రేమకథ
‘హిరణ్యకశ్యప’ అనే భారీ పౌరాణిక చిత్రంతో నాలుగేళ్లుగా బిజీగా ఉన్నారు దర్శకుడు గుణశేఖర్. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వెళ్దాం అనే సమయానికి కరోనా లాక్డౌన్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చి, వేరే ప్రాజెక్ట్‌ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ‘శకుంతలం’ అనే టైటిల్‌తో ఓ ప్యాన్ ఇండియా ప్రేమకథను రూపొందించనున్నారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ చిత్రం గురించి గుణశేకర్ మాట్లాడుతూ – ‘‘హిరణ్యకశ్యప’ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత భారీ సినిమాను చిత్రీకరించడం కొంచెం కష్టం. అందుకే ఈ సినిమా చిత్రీకరణ మేము అనుకున్నదానికంటే ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకే నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించే లోగా ఓ కథను మీకు చెప్పాలనుకుంటున్నాను. మహాభారతంలోని ఆదిపర్వం నుంచి ఓ ప్రేమకథను సినిమాగా తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. -
అది నిజం : ఆయన లేకపోతే నేను లేను
నేడు ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ తండ్రులతో తమకున్న జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. మరోవైపు వరల్డ్ మ్యూజిక్ డే కావడంతో పలువురు సంగీత దర్శకులు కూడా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కొందరు అభిమానులు చేసిన ట్వీట్లపై స్పందించారు. తన గురువు మణిశర్మపై తన అభిమానాన్ని మరోసారి వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. తమన్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ మణిశర్మపై తనకు ఉన్న ప్రేమను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమంలో మణిశర్మతో కలిసి వేదిక పంచుకున్న తమన్ కొద్దిగా భావోద్వేగానికి లోనయ్యారు. తమన్ మాట్లాడుతూ.. ‘ఆయన ముందు ఉంటే మాటలు రావడం లేదు. దేశంలో ఆయన పనిచేయని మ్యూజిక్ డైరెక్టరే లేరు. అందరు మ్యూజిక్ డైరెక్టర్లకు ఫేవరేట్ కీ బోర్డ్ ప్లేయర్ ఆయన. ఆయన సంగీత దర్శకుడిగా మారి యువ తరాలకు చాలెంజ్స్ ఇచ్చారు. ఎవర్గ్రీన్ మెలోడిలు అందజేశారు. ప్రపంచంలో నా పని మీద నమ్మకం ఉంది మా నాన్న గారికి. వీడు కచ్చితంగా మంచి డ్రమ్మర్ అవుతాడని. మీకు తెలుసు నేను చిన్నతనంలోనే మా నాన్నను కోల్పోయాను. నాన్న లేని లోటు తీర్చింది మణి గారు. తొమ్మిదేళ్లు నేను ఆయనతో వర్క్ చేశాను.. అప్పుడు ఆయన ఇచ్చిన అనుభవమే ఇప్పుడు నా వృత్తి. ఆయన లేకుండా నేను లేను. ఆయన పేరు నిలబెట్టడం నా బాధ్యత. నా హార్డ్ వర్క్‌ను ఆయనకు అంకితం చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. దీనిపై తమన్ స్పందిస్తూ.. ‘ఇది నిజం.. ఆయన లేకుండా నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు’ అని పేర్కొన్నారు. అలాగే ఆ ట్వీట్‌ను రీట్వీట్ కూడా చేశారు. It’s true ♥️🤍 Without him i am not here today ♥️🔈🎹💿 https://t.co/AfILdeJQ2H — thaman S (@MusicThaman) June 21, 2020 -
ఆరోసారి.. ఒకటోసారి!
అదేంటి.. ఎవరైనా ఒకటోసారి.. రెండోసారి.. ఇలా మొదలు పెడతారు. కానీ ఆరోసారి.. ఒకటోసారి అంటున్నారేంటి? అనేగా మీ సందేహం. మరి ఆ డౌట్ తీరాలంటే మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా రూపొందనుంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల చివర్లో మొదలు కానుంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనున్నారు. గతంలో పూరి జగన్నాథ్, మణిశర్మ కలిసి చేసిన ఐదు సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. వీరి కాంబినేషన్లో చివరగా ‘టెంపర్’ సినిమా వచ్చింది. ఆ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు మణిశర్మ. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’తో ఆరోసారి వీళ్లిద్దరూ కలిసి పని చేయనున్నారు. కాగా రామ్, మణిశర్మ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇదే. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య. -
మణిశర్మ ఇంట్లో విషాదం
టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుల్లో ఒకరైన మణిశర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ (92) ఈ రోజు ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. వైయన్ శర్మగా సంగీత ప్రియులకు సుపరిచితుడైన ఆయన వయోలిన్ విద్వాంసులు. ఆయన ప్రోత్సాహంతోనే మణిశర్మ సంగీత దర్శకుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి దాదాపు 175 సినిమాలకు స్వరాలందించారు. వైయన్ శర్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ కూడా ఇటీవల ఛలో సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి విజయం అందుకున్నారు. -
ప్రముఖ సంగీత దర్శకుడు స్టూడియోలో చోరీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకి చెందిన పాటల రికార్డింగ్ స్టూడియోలో చోరీ జరిగింది. ఫిలింనగర్ రోడ్ నంబర్ 10లోని ప్లాట్ నంబర్ సి.45లో ఉన్న స్టూడియోలో దాచిన రూ.4.5 లక్షలు అపహరణకు గురయ్యాయి. జనవరి 27న చెన్నై వెళ్లిన ఆయన ఈ నెల 2న తిరిగి వచ్చారు. అవసరం నిమిత్తం శనివారం బీరువా తెరిచి చూడగా అందులోని నగదు కనిపించలేదు. దీంతో మణిశర్మ వ్యక్తిగత సహాయకుడు వెంకటేశ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన మేనేజర్ జి.సుబ్బానాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. -
ఎన్నారై పాత్రలో కాజల్..!
2017లో వరుస విజయాలతో సత్తా చాటిన కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం తన తొలి చిత్ర కథనాయకుడు కళ్యాణ్ రామ్ సరసన నటిస్తోంది. దాదాపు 10 ఏళ్ల తరువాత మరోసారి కళ్యాణ్ రామ్ సరసన ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ ఎన్నారై అమ్మాయిగా కనిపించనుందట. ఓ బిలియనీర్ కూతురైన కాజల్ ఇండియాకు ఎందుకు వచ్చింది అన్నదే సినిమాలో మెయిన్ పాయింట్ అన్న ప్రచారం జరుగుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలందిస్తున్నారు. -
'జాదూగాడు' ఆడియో లాంచ్