ఎన్నారై పాత్రలో కాజల్..! | kajal role in nandamuri kalyanrams MLA revealed | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 19 2017 11:21 AM | Last Updated on Tue, Dec 19 2017 11:21 AM

kajal role in nandamuri kalyanrams MLA revealed - Sakshi

2017లో వరుస విజయాలతో సత్తా చాటిన కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం తన తొలి చిత్ర కథనాయకుడు కళ్యాణ్ రామ్ సరసన నటిస్తోంది. దాదాపు 10 ఏళ్ల తరువాత మరోసారి కళ్యాణ్ రామ్ సరసన ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ ఎన్నారై అమ్మాయిగా కనిపించనుందట.

ఓ బిలియనీర్ కూతురైన కాజల్ ఇండియాకు ఎందుకు వచ్చింది అన్నదే సినిమాలో మెయిన్ పాయింట్ అన్న ప్రచారం జరుగుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement