Kalyan ram
-
సీనియర్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
-
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి (ఫొటోలు)
-
ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి
సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కల్యాణ్ రామ్(Kalyan Ram) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) వద్ద నివాళి అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా రాణించి ఆపై నాయకుడిగా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తమ తాత నందమూరి తారక రామారావు సేవల గురించి వారు మరోసారి గుర్తుచేశారు. ఈ సందర్భంగా రామారావు అభిమానులు నివాళీలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో నేడు మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళి అర్పించనున్నారు.ఆ రోజు నుంచి ఏర్పాట్లన్నీ చూసుకుంటుంన్న తారక్సుమారు ఆరేళ్ల క్రితం రామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తాతయ్య సమాధి వద్దకు చేరుకున్నారు. జయంతి సందర్భంగా పూలతో కళకళలాడాల్సిన సమాధి అలంకరణ లేక బోసి పోవడం చూసి తారక్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు వెంటనే పూలు తెప్పించి సమాధిని ఘనంగా అలంకరించారు. తమ అభిమానుల సాయంతో కొన్ని నిమిషాల్లోనే సమాధి మొత్తం పూలతో కళకళలాడేలా చేశారు. (ఇదీ చదవండి: ఇండియన్–3 సినిమాపై శంకర్ ప్రకటన)ఆ తర్వాత వారిద్దరూ నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా తారక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌కు సంబంధించిన కార్యక్రమం ఏదైనా సరే ఆయన సమాధిని పూలతో అలంకరిస్తూ వస్తున్నారు. గతేడాదిలో కూడా తారక్ దగ్గరుండి తాత సమాధిని పూలతో అలంకరణ చేశారు. అయితే, తండ్రికి నివాళి అర్పించేందుకు వచ్చిన బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అక్కడ ఎక్కువగా తారక్ ఫ్లెక్సీలు కనిపించడంతో వాటిని తొలగించాలని తన అభిమానులతో చెప్పారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలు తొలగించిన చోటే మళ్లీ తారక్ అభిమానులు కొత్త కటౌట్స్ ఏర్పాటు చేశారు. ఆపై వాటికి పాలతో అభిషేకం చేశారు. అయితే, ఈ సారి బసవతారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళి అర్పించనున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).@tarak9999 And @NANDAMURIKALYAN Paid His Tributes To Anna #NTR Gaaru At NTRGhat 🙏#ManOfMassesNTR #NTRVardhanti pic.twitter.com/5YqqK4sqbM— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 18, 2025 -
‘ఎన్కేఆర్ 21’లో విలన్‌గా...
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్కేఆర్ 21’ (వర్కింగ్ టైటిల్). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. విజయశాంతి, శ్రీకాంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు. శుక్రవారం (డిసెంబరు 20) సోహైల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్కేఆర్ 21’లో ఆయన చేస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘సోహైల్ ఖాన్ చేస్తున్న విలన్ పాత్ర, హీరో, ఈ పాత్ర మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కల్యాణ్ రామ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: రామ్ ప్రసాద్. -
‘దేవర’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'నా తమ్ముడు, మా నాన్న' అంటూ తారక్‌పై కల్యాణ్ రామ్ ప్రశంసలు
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'దేవర'. తాజాగా విడుదలైన ఈ సినిమా తారక్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దేవర దూసుకుపోతున్నాడు. సినిమాకు మంచి ఆదరణ రావడంతో తాజాగా చిత్ యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దేవరను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. చిత్ర సమర్పకులుగా ఉన్న కల్యాణ్ రామ్ దేవర గురించి ఇలా చెప్పుకొచ్చారు.దేవర సినిమాను ఆదరిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. నా తమ్ముడు, మా నాన్న (ఎన్టీఆర్) యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. దేవరలో తన రోల్ వన్ మ్యాన్ షో అని చెప్పగలను. ఎంతో కష్టపడి మాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు.' అని కల్యాణ్ రామ్ చెప్పారు.అనంతరం చిత్ర దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ.. 'దేవరతో మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. సినిమా ఫస్ట్ షో పడిన సమయం నుంచి నాకు వరసుగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. దేవర సినిమానే నా ఉత్తమ సినిమా అంటూ వారు అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చిత్ర యూనిట్ కష్టం వల్లే దేవర సినిమాకు ఇలాంటి ప్రశంసలు దక్కుతున్నాయి.' అని ఆయన అన్నారు.నైజాంలో ‘దేవర’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్‌రాజు కూడా ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. సినిమాలో ఆయన నటన మరోస్థాయిలో ఉంటుంది. 'వన్ మ్యాన్ షోతో సినిమాను తారక్ నడిపించారు. ప్రపంచదేశాలు కూడా నేడు తెలుగు హీరోల వైపు చూస్తున్నాయి. మన తెలుగు సినిమాలు కూడా ఇప్పుడు అన్ని దేశాల్లో రన్ అవుతున్నాయి. దీనంతటికి కారణమైన దర్శకులు, హీరోలకు నేను కృతజ్ఞతలు చెబుతుతున్నా.' అని దిల్ రాజు అన్నారు. -
విశ్వంభర డైరక్టర్ బీభత్సమైన ట్విస్ట్..
-
వైజయంతి... ఒక యుద్ధం!
పవర్ఫుల్ పోలీసాఫీసర్ వైజయంతిగా ‘కర్తవ్యం’ (1990)లో విజయశాంతి నటనను అంత సులువుగా మరచిపోలేం. లేడీ అమితాబ్ అనిపించుకున్న ఈ యాక్షన్ స్టార్ మళ్లీ పోలీసాఫీసర్ వైజయంతిగా కనిపించనున్నారు. కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలోనే వైజయంతి పాత్రలో కనిపించనున్నారు విజయశాంతి. సోమవారం (జూన్ 24) విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె లుక్, క్యారెక్టర్ గురించి ఓ వీడియోను విడుదల చేశారు. చీరకట్టులో హుందాగా, ఖాకీ దుస్తుల్లో పవర్‌ఫుల్‌గా విజయశాంతి కనిపించగా, ‘వైజయంతి ఐపీఎస్... తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది... వేసుకుంటే యూనిఫామ్‌కే పౌరుషం వస్తుంది... తానే ఒక యుద్ధం... నేనే తన సైన్యం...’ అంటూ ఆమె పాత్ర గురించి కల్యాణ్ రామ్ తన వాయిస్ ఓవర్‌తో ఆ వీడియోలో వివరించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. -
ఎన్టీఆర్ స్మరణలో కుటుంబ సభ్యులు.. 101 జయంతికి ఘాట్ వద్ద నివాళులు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు
-
జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులున్నాయి: లక్ష్మీపార్వతి
హైదరాబాద్, సాక్షి: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.ఇదీ చదవండి: మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం! -
కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం!
హీరో కల్యాణ్ రామ్ కొత్త సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు రూ.4 కోట్లు విలువైన సెట్ కాలి బూడిద అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ సంఘటన వల్ల నిర్మాతకు కూడా భారీ నష్టం వాటిల్లందని టాక్.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్.. గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. సీబీఐకి సంబంధించిన సీన్స్ తీస్తున్నారు. 9 రోజుల షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, మరో రోజు చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సెట్ మొత్తం కాలిపోయింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త) -
'బింబిసార 2' నుంచి ఎందుకు తప్పుకున్నానంటే: వశిష్ట
వరుస పరాజయాలతో సతమతమవుతున్న కల్యాణ్ రామ్‌కు.. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది 'బింబిసార'. టైమ్ ట్రావెల్ అండ్ ఫాంటసీగా ఈ చిత్రాన్ని వశిష్ట తెరకెక్కించాడు. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఈ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద హిట్ కావడంతో మూవీకి సీక్వెల్ ప్లాన్ కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా పార్ట్-2 డైరెక్టర్‌గా వశిష్ట తప్పుకున్నాడు. దీంతో గతంలో పలు రకాలుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మెగాస్టార్‌తో విశ్వంభర చిత్రాన్ని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ఠ ఇదే విషయంపై ఎట్టకేలకు ఇలా క్లారిటీ ఇచ్చారు. 'రామ్ చరణ్‌తో నేను 'బాహుబలి' లాంటి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. గతంలో కూడా నేను ఎక్కడా మాట్లాడలేదు.. కానీ ప్రచారం మాత్రం జరిగింది. నేను మెగాస్టార్ చిరంజీవితో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' లాంటి ఫాంటసీ సినిమా చేయాలనుందని చెబితే.. రామ్ చరణ్‌తో వశిష్టి సినిమా తీస్తున్నాడని వార్తలు వచ్చాయి. నాకు ఫాంటసీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. 'బింబిసార' సీక్వెల్‌ను నేను డైరెక్ట్ చేయడం లేదు. పార్ట్-2 కథ విషయంలో నా ఆలోచన వేరుగా ఉంది. దాని గురించి చర్చిస్తున్న సమయంలో నాకు 'విశ్వంభర' ఆఫర్ వచ్చింది. ఇదే విషయాన్ని కల్యాణ్ రామ్‌తో చెప్పి ఆపై ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే 'బింబిసార 2' నుంచి బయటకు వచ్చాను. ఆపై మెగాస్టార్‌తో సినిమా ఓకే చేసుకున్నాను.' అని వశిష్ఠ తెలిపారు. చిరంజీవితో 'విశ్వంభర' చిత్రాన్ని భారీ బడ్జెత్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా కాన్సెప్ట్ వీడియోను ఆయన విడుదల చేశారు. దానికి భారీగా రెస్పాన్స్ వస్తుంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. -
రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్‌ఫై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కల్యాణ్ రామ్ డెవిల్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. బ్రిటీష్ కాలంలోని గూఢచారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ట్వీట్ చేశారు. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా కుటుంబంతో కలిసి చూసేయండి. Wishing everyone a happy Sankranti! Can't wait to watch #Devil on Amazon Prime Video on Jan 14. @NANDAMURIKALYAN @iamsamyuktha_ #Devilthemovie - The British Secret Agent. @amazonIN pic.twitter.com/VAfWJQ8Gw5 — ABHISHEK PICTURES (@AbhishekPicture) January 13, 2024 -
తారక్‌పై కోపం కల్యాణ్ రామ్ మీద తీర్చుకున్న చంద్రబాబు, బాలయ్య బ్యాచ్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా భారీ అంచనాల మధ్య శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైంది. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఈ సినిమాకు మంచి ప్రచారమే దక్కింది. సినిమా విడుదలకు ముందు కల్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలతో డెవిల్ నష్టపోయాడని తెలుస్తోంది. మరోవైపు జూ ఎన్టీఆర్ మీద ఉన్న కోపాన్ని టీడీపీ సోషల్ మీడియా విభాగం కల్యాణ్ రామ్ మీద చూపించిందా..? అంటే నిజమే అని నేటి డెవిల్ కలెక్షన్స్ చెబుతున్నాయి. డెవిల్ విడుదలకు ముందు కల్యాణ్ రామ్ ఏం అన్నారు 2024 ఎన్నికల్లో ఎటువైపు ఉంటారని ఒక ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్‌కు ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా ఆయన ఇలా చెప్పారు. 'ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు.. ఫ్యామిలీ అంతా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. అందువల్ల ఫ్యామిలీ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చెబుతాను.' అన్నాడు. వెంటనే కల్యాణ్ రామ్‌కు మరో ప్రశ్న ఎదురైంది. ఫ్యామిలీ అంటే ఎవరు..? మీరు, ఎన్టీఆర్‌నే కదా.. ఇంకెవరు లేరు కదా.. అని మళ్లీ అడిగితే, అవును, మేమిద్దరమే మిగిలాం.. ఇద్దరమే కలిసి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. కానీ తన తాత గారి సొంతమైన టీడీపీ పార్టీ ఉంది కదా.. అటువైపే ఉంటామని ఆయన చెప్పలేదు. దీంతో టీడీపీలో గుబులు ఏర్పడింది. తారక్ మీద టీడీపీ బ్యాచ్‌లో కోపం.. ఎఫెక్ట్ చూపిన డెవిల్ కలెక్షన్స్ చంద్రబాబు, బాలకృష్ణ ఇద్దరూ ఒకవైపు ఉంటే జూ ఎన్టీఆర్ మరోవైపు ఉన్నాడు. వారి మధ్య అనేక విభేదాలతో కూడిన కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నారా లోకేష్‌కు తారక్ ఎక్కడ పోటీ తగులుతాడో అని కావాలనే టీడీపీకి జూ ఎన్టీఆర్‌ను దూరం చేశాడు చంద్రబాబు. ఈ విషయం జగమెరిగిన సత్యం. టీడీపీ కోసం గతంలో ప్రాణాలకు తెగించి ఎన్టీఆర్ పనిచేశాడు. అతనిలోని టాలెంట్‌ను గమనించి చంద్రబాబు జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రచారం చేసిన అన్నీ ప్రాంతాల్లో టీడీపీ ఓడిపోయిందని పచ్చ మీడియాలో ప్రచారం చేపించాడు. దీంతో తారక్ పార్టీకి దూరం అయ్యాడు. కాలక్రమేనా అలాంటి పాపాలే చంద్రబాబును వెంటాడాయి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు కానీ తారక్ రియాక్ట్ కాలేదని, టీడీపీ బ్యాచ్ ఓపెన్‌గానే గగ్గోలు పెట్టింది. అలా తారక్‌తో వైరంతో పాటు దూరం పెరిగింది. చాలా ఏళ్ల నుంచి చంద్రబాబు, బాలయ్యకు తారక్ దూరంగానే ఉన్నాడు. దీంతో తారక్‌పై టీడీపీ నేతలు కోపం పెంచుకున్నారు. ఇదే తన అన్నగారు అయిన కల్యాణ్ రామ్ చిత్రంపై ఎక్కువగా ప్రభావం పడింది. టీడీపీకి చెందిన పలు సోషల్ మీడియా ఖాతాల నుంచి బహిరంగంగానే పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ అభిమానులు ఎవరూ డెవిల్ సినిమా వైపు వెళ్లకండి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. డెవిల్ సినిమాను బహిష్కరిస్తున్నట్లు వారు ఓపెన్‌గానే ప్రచారం చేశారు. సినిమా బాగున్నా కూడా ఇంత తక్కువ మొత్తంలో కలెక్షన్స్ రావడం ఏంటి..? అంటూ ట్రేడ్ అనలిస్ట్‌లే ఆశ్చర్య పోతున్నారు. తారక్, కల్యాణ్ రామ్ ఇద్దరూ టీడీపీ వైపు రాకుంటే వారి సినిమాలకు టికెట్లు కూడా చిరగవు అని భయపెడుతూ పచ్చ మిడీయాలో డిబెట్లు కూడ జరిగిన విషయం తెలిసిందే. కానీ అక్కడ ఉండేది టైగర్ అని టీడీపీ మంద మరిచిపోయినట్లు ఉంది. -
కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
రామ్ చరణ్ పేరు ఎత్తగానే కళ్యాణ్ రామ్ రియాక్షన్ చూడండి
-
దేవర గురించి అప్డేట్ అడిగితే కళ్యాణ్ రామ్ ఏమన్నాడో చూడండి
-
అమెరికాలో జాబ్ చేసుకునే వాడిని సినిమాల్లోకి ఎందుకు వచ్చానంటే..!
-
Devil Movie Review: డెవిల్ మూవీ రివ్యూ
టైటిల్: డెవిల్ నటీనటులు: కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య, ఎస్తర్ నోరోన్హా నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్ కథ-మాటలు: శ్రీకాంత్ విస్సా దర్శకత్వం: అభిషేక్ నామా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్. ఎస్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: డిసెంబర్ 29,2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1945లో సాగుతుంది.స్వాతంత్రం కోసం పని చేస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ చీఫ్ సుభాష్ చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తన అనుచరులకు తెలియజేస్తాడు. తన ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది కోడ్ రూపంలో తెలియజేయాలని తన ముఖ్య అనుచరుడు త్రివర్ణకు లేఖ ద్వారా తెలియజేస్తారు. చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తెలుసుకున్న బ్రిటీష్ ఆర్మీ.. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ(అభిరామి) హత్య జరుగుతుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కల్యాణ్ రామ్)కు అప్పజెప్పుతారు. డెవిల్కి విజయ కజిన్ నైషేద(సంయుక్త మీనన్)పై అనుమానం కలుగుతుంది. ఆమెతో ప్రేమలో పడినట్లు నటించి అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. బోస్‌ను పట్టుకునే ఆపరేషన్‌కు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? బోస్ ముఖ్య అనుచరుడు త్రివర్ణ ఎవరు? బోస్ ఇండియాకు వస్తున్నట్లు బ్రిటీష్ సైన్యానికి ఎలా తెలిసింది? నైషేదను రహస్యంగా కలుస్తున్న వ్యక్తి ఎవరు? ఈ కథలో మాళవిక నాయర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డెవిల్ కథ, కథనం రెండూ పాతవే. హీరో సీక్రెట్ ఏజెంట్‌గా ఉండి ఓ ఆపరేషన్‌లో పాల్గొనడం.. అతను తన ఒరిజినాలిటీ కప్పిపుచ్చి మరోలా నటించడం.. ప్రీక్లైమాక్స్ అసలు విషయం తెలియడం.. ఆ తర్వాత ఓ భారీ ఫైట్.. శుభం కార్డు.. ఈ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. డెవిల్ కథ కూడా అదే. కాకపోతే సుభాష్ చంద్రబోస్ చుట్ట కథను నడిపించడం ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత. కథనం మాత్రం కొత్త సీసాలో పాత సారానే అన్నట్లుగా సాగుతుంది. ఊపిరి బిగపట్టుకొని చూసే సన్నివేశాలను సైతం చాలా సింపుల్‌గా తెరకెక్కించారు. సుభాష్ చంద్రబోస్ పాయింట్‌తో కథను చాలా ఆసక్తికరంగా ప్రారంభించారు. ఆ తర్వాత కథంతా జమీందారు కూతురు హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారనేది సస్పెన్స్‌లో పెట్టి ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే ఈ క్రమంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కహనీ మాత్రం కథను పక్కదోవ పట్టించడమే కాకుండా.. నీరసంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ బాగుటుంది. అలాగే అక్కడ ట్విస్ట్ రివీల్ చేసి ద్వితియార్థంపై ఆసక్తి కలిగించేలా చేశారు. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. అయితే ఈ తరహా ట్విస్టులు గతంలో చాలా సినిమాల్లో చూశాం. ఇక అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక కథపై ఆసక్తి పూర్తిగా సన్నగిల్లుతుంది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఈజీగా అర్థమైపోతుంది. ఇక చివర్లో హీరో చేసే యాక్షన్ సీన్ మరింత బోరింగ్ అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ మరింత పేలవంగా ఉన్నాయి. ఈ సినిమా దర్శకుడు మారడం.. చివరకు అభిషేక్ నామానే ఆ బాధ్యతలు తీసుకొని తెరకెక్కించాడు. అయితే నిర్మాతగా ఆయన సినిమాను రిచ్‌గా తెరకెక్కించగలిగాడే తప్ప.. దర్శకుడిగా మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. ఎవరెలా చేశారంటే.. కల్యాణ్ రామ్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడమే కాదు.. ఆ పాత్రల్లో జీవిస్తాడు కూడా. నెగెటివ్ షేడ్స్ ఉన్న డెవిల్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన విధానం బాగోలేదు కానీ కల్యాణ్ రామ్ ఉన్నంతలో చక్కగా నటించాడు. నైషేదగా సంయుక్త మీనన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఇక మాళవిక నాయర్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. ఆమె నిడివి తక్కువే అయినా..గుర్తిండిపోయే పాత్ర తనది. శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య, ఎస్తర్ నోరోన్హా, సెఫీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి స్పీడ్ బ్రేకర్లుగా అడ్డు తగులుతాయే తప్ప ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ద్వితియార్థంలో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
Devil Twitter X Review: ‘డెవిల్’ ట్విటర్ రివ్యూ
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్‌ఫై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంపై మొదట్లో భారీ అంచనాలేమీ లేవు కానీ.. ప్రచార చిత్రాలు విడుదలైన తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 29) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్లు ఫస్ట్ డే ఫస్ట్‌షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డెవిల్ ఎలా ఉంది? కల్యాణ్ రామ్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ట్విటర్(ఎక్స్)వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. డెవిల్ చిత్రానికి ఎక్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా బాగుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్ వన్‌మ్యాన్ షో అని చెబుతున్నారు. అదే సమయంలో వీఎఫ్ఎక్స్ విషయంలో చిత్ర బృందం మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు. #Devil review : Decent First half with Good interval block👌 Very good second half with good twist and turns 💥💥 Hituuuuuu bommmaaaaaaa👌 3.5/5 — Chennai Tarak (@chennaitarak) December 29, 2023 ఫస్టాఫ్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండాఫ్‌లో వచ్చే మలుపులు, ట్విస్టులు ఆకట్టుకున్నాయంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. #Devil Review: 2.75/5 Average 1st Half ,Decent 2nd Half👍 Slow Screenplay, seems dragged at times BGM is Good👍@NANDAMURIKALYAN acting 👍 Songs are okay, few twists worked. Overall An Average Movie. Can give it a try for its setup and visuals#Devara #Salaar #GunturKaaram pic.twitter.com/mCHfwT4zG8 — GS (@Thanks2Cinema) December 28, 2023 ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ డీసెకంట్, స్లో స్క్రీన్‌ప్లే, కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. బీజీఎం అదిరిపోయింది. కల్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది అంటూ మరో నెటిజన్ 2.75/5 రేటింగ్ ఇచ్చాడు. Slow paced with good interval...Few scenes are boring 🥱....Bad screenplay, director has good stry but unable to potray..May be because of last moment director changes..#Devil — karthik (@karthik170920) December 28, 2023 Good 1st Half 👍 Good story point A Bit slow to takeoff but Gripped well and maintained intriguingly well Perfect blend of Commercial elements and investigative narration Bgm👍 Interval bang is good Vfx could have been much better #Devil — PKC (@PKC997) December 28, 2023 #Devil First Half : “DECODING BEGINS” 👉INTERESTING FIRST HALF WITH GOOD INTERVAL BLOCK 👉@NANDAMURIKALYAN Excellent Performance with Extraordinary Production Values 👉#HarshavardhanRameshwar impresses with his BGM#DevilReview #NandamuriKalyanRam — PaniPuri (@THEPANIPURI) December 29, 2023 ' -
కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఈ హిట్‌తో ఈ ఏడాదికి వీడ్కోలు
∙‘డెవిల్’ సినిమా సీక్వెల్‌కి 50 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ‘డెవిల్’ కి వచ్చే స్పందన బట్టి సీక్వెల్ చేయాలా? వద్దా అనేది ప్రకటిస్తాం. తమ్ముడి (ఎన్టీఆర్) ‘దేవర’ సినిమా 85 శాతం షూటింగ్ పూర్తయింది. మేం చేసే సినిమాల ఔట్పుట్ గొప్పగా ఉండాలనుకుంటాం.. అందుకే జాగ్రత్తలు తీసుకుని చేస్తాం. నేను, తారక్ ‘దేవర’ విషయంలో క్లియర్‌గా ఉన్నాం. మేం సంతృప్తి చెందిన వెంటనే సినిమా గురించి అప్డేట్ ఇస్తాం. అంతేకానీ అప్డేట్ ఇవ్వాలనే ఒత్తిడితో పని చేయలేం కదా? ► ‘‘నటుడిగా ఇరవై ఏళ్ల ప్రయాణంలో (మొదటి చిత్రం ‘తొలి చూపులోనే’ – 2003) చాలా సంతోషంగా ఉన్నాను. ఈ వృత్తిలో చాలా నేర్చుకున్నాను.. వేరే వృత్తిలో అయితే ఇంత నేర్చుకోలేకపోయేవాడినేమో? సినిమాల వల్ల ఎంతోమందితో మాట్లాడటం, పని చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వ్యక్తిగతంగా ఓ మంచి తండ్రిగా, భర్తగా పరిణితి చెందాను’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు.అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డెవిల్’. కల్యాణ్ రామ్ హీరోగా, సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ చెప్పిన విశేషాలు. ► 2021లో ‘బింబిసార’ షూటింగ్ టైమ్‌లో రచయిత శ్రీకాంత్ విస్సా నాకు ‘డెవిల్’ కథ చెప్పారు. 1940 బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ కథలో హీరో క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. నన్ను దృష్టిలో పెట్టుకునే కథ రాశారా? అని అడిగాను. ‘‘నేను ‘డెవిల్’ని కథగానే రాశాను. అభిషేక్ నామాగారు మీకు చెప్పమన్నారు. మీరు కమర్షియల్ హీరో కదా.. ఇలాంటి కథ ఒప్పుకుంటారా?’’ అని శ్రీకాంత్ విస్సా అన్నారు. హీరో క్యారెక్టర్, బ్యాక్‌డ్రాప్ అలాగే ఉంచి, కమర్షియల్ పంథాలో స్క్రిప్ట్‌లో మార్పులు చేయమన్నాను. శ్రీకాంత్ రెండు, మూడు నెలలు సమయం తీసుకుని మార్పులు చేర్పులు చేయడంతో సినిమాప్రారంభించాం. ► ప్రేక్షకులకు కొత్త తరహా చిత్రాలు అందించేందుకు ప్రయత్నిస్తుంటాను. అయితే ఒక్కోసారి వాణిజ్య అంశాలు మిస్ అవుతుంటాను. నా గత చిత్రం ‘అమిగోస్’కి మరికొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనే ఆలోచన నాకు ఆ రోజు రాలేదు. డైరెక్టర్‌తో మాట్లాడి ఆ పని చేసుండాల్సింది.. ఆ తప్పు నాదే. అందువల్ల మిస్‌ఫైర్ అయిందనుకుంటున్నాను. కానీ, ‘డెవిల్’లో వాణిజ్య అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇన్వెస్టిగేటివ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అవడం నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే అనుభూతి చెందుతారు. ‘డెవిల్’ హిట్‌తో 2023కి వీడ్కోలు పలుకుతామనే నమ్మకం ఉంది. ► ‘డెవిల్’లో నా క్యారెక్టర్లో గ్రే షేడ్స్ ఉండవు. ప్రతి విషయాన్ని వివరంగా చూపిస్తున్నాం. ఈ చిత్రాన్ని అభిషేక్ నామాగారు అద్భుతంగా తీశారు. నా అంచనాలకు మించి సౌందర్ రాజన్‌గారు విజువల్స్ ఇచ్చారు. కాస్ట్యూమ్ డిజైనర్ రాజేశ్‌తో 2017 నుంచి వర్క్ చేస్తున్నాను. ‘డెవిల్’లో నా పాత్ర కోసం దాదాపు 90 కాస్ట్యూమ్స్‌ని వాడాం. నా పాత్రకి భారతీయతను ఆపాదించే ప్రయత్నం చేశారాయన. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి నేపథ్య సంగీతం అందించారు. ‘బింబిసార’కి కీరవాణిగారిలా ‘డెవిల్’ విషయంలో హర్షవర్ధన్ న్యాయం చేస్తాడా? అనుకున్నాను. అయితే సినిమా చూసిన తర్వాత సంతోషంగా అనిపించింది. ‘బింబిసార’ హిట్ తర్వాత సంయుక్తా మీనన్‌తో మళ్లీ నటించాను. హీరోకు సమానంగా తన పాత్రకిప్రాధాన్యత ఉంటుంది. మాళవిక పాత్ర కూడా చక్కగా ఉంటుంది. ప్రతి పాత్రకుప్రాధాన్యం ఉంటుంది. నేను ఒకే సమయంలో రెండు పడవల ప్రయాణం (నటుడు–నిర్మాత) చేయాలనుకోను. నటనకు ఎంత కష్టపడాలో.. నిర్మాణంలో అంతకు మించి కష్టపడాలి. ‘ఓం’ సినిమా విషయంలో నాకు ఆ విషయం అర్థమైంది. అప్పటి నుంచి మా బ్యానర్లో చేసే సినిమాలకు సంబంధించిన సినిమాల కథ మాత్రమే నేను వింటాను. మిగిలిన విషయాలన్నీ మా హరిగారు చూసుకుంటారు. -
Devil Movie: కళ్యాణ్ రామ్ 'డెవిల్' రన్‌టైమ్ ఎంతంటే?
సినీ లవర్స్.. ఈ డిసెంబర్ నెలను ఎంతగానో ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో యానిమల్, డంకీ, సలార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సినిమాపై పడింది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు అలాంటి అంచనాలతో ‘డెవిల్’ రానుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. రన్ టైమ్ ఎంతంటే? గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించాడు కళ్యాణ్ రామ్. ఈ ఏడాదిని ‘డెవిల్’తో ఘనంగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు అద్భుత స్పందన లభించింది. బ్రిటీష్ కాలంలో గూఢచారి ఎలా ఉండేవారనే విషయాన్ని అసలు ఎవరూ ఊహించలేరు. అలాంటి కొత్త విషయాన్ని డెవిల్ మూవీలో ఆవిష్కరిస్తుండటం విశేషం. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా డెవిల్ రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. నెక్స్ట్ లెవల్.. ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా అప్పటి బ్రిటీష్ కాలాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించారు. మేకింగ్ పరంగా బడ్జెట్ విషయంలో నిర్మాత అభిషేక్ నామా ఎక్కడా రాజీపడలేదని స్పష్టమవుతోంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, గాంధీ నడికుడికర్ ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన నేపథ్య సంగీతం వీటన్నింటినీ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా ఉంది. డెవిల్ సినిమా ఈ నెల 29న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. చదవండి: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి.. -
ప్రభాస్ 'స్పిరిట్' సినిమా ఛాన్స్ నాకే దక్కింది: మ్యూజిక్ డైరెక్టర్
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. సంయుక్తా మీనన్ హీరోయిన్గా, మరో హీరోయిన్ మాళవికా నాయర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ– ‘‘డెవిల్’ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి ప్రత్యేక వాయిద్యాలను వాడాం. ‘దూరమే..’ పాటను బుడాపెస్ట్‌లో షూట్ చేశాం. అలాగే ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ పాటను ర్యాపర్ రాజకుమారితో పాడించాం. ఈ పాట సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అలాగే నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. అయితే సంగీత దర్శకులు, నటీనటులు ఎంత ఎఫర్ట్ పెట్టినా విజువల్ సపోర్ట్ ఉండాలి. ఈ విషయంలో ఈ చిత్రం కెమెరామేన్ సౌందర్ రాజన్‌గారు ప్రాణం పెట్టి అద్భుతంగా వర్క్ చేశారు. సెకండాఫ్‌లోని ఓ ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్‌లో కల్యాణ్‌రామ్ గారి నట విశ్వరూపాన్ని ఆడియన్స్ చూస్తారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు రావొచ్చని నాకనిపిస్తోంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘భవిష్యత్‌లో డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు గిటారిస్ట్స్ మాత్రమే ఉండేలా ఓ సినిమా, డ్రమ్స్ శివమణిగారి బయోపిక్ తీయాలని ఉంది. ‘యానిమల్’ తర్వాత బాలీవుడ్లో చాలా అవకాశాలు వస్తున్నాయి. అవి చర్చల దశలో ఉన్నాయి. ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా గారు చేయనున్న ‘స్పిరిట్’ సినిమాకు సంగీతం అందించనున్నాను’’ అన్నారు. -
బింబిసార 2 మూవీకి డైరెక్టర్ ఎవరు..?
-
డెవిల్ ట్రైలర్లో సంయుక్త మీనన్ స్పీచ్
-
దేవర టీజర్ విధ్వంసం గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్
-
కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ట్రైలర్
-
రాసుకోండి...‘డెవిల్’ బాగుంటుంది: కల్యాణ్‌రామ్
‘‘మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గ టీమ్ వర్క్ చేసినప్పుడు ప్రేక్షకులు థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని ‘బింబిసార’ సినిమా టైమ్‌లో చెప్పాను. దాన్ని మీరు (ఫ్యాన్స్, ఆడియన్స్) నిజం చేశారు. అదే కోవలో ‘డెవిల్’ మంచి కథా కథనాలతో వస్తోంది. రాసుకోండి.. సినిమా చాలా బావుంటుంది. ఈ చిత్రం సరికొత్త కథతో ఉంటుంది’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. ఆయన హీరోగా, మాళవికా నాయర్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఖర్చుకి వెనకాడకుండా ‘డెవిల్’ని రూపొందించిన అభిషేక్ నామాగారికి థ్యాంక్స్. సినిమా అనేది టీమ్ ఎఫర్ట్. దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే వచ్చే ఆనందమే వేరు. ‘బింబిసార 2’ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో మొదలుపెడతాం. తమ్ముడు ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా గ్లింప్స్‌ని త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘డెవిల్’ కోసం రెండేళ్ల పాటు కల్యాణ్ రామ్‌గారు మరో సినిమా చేయకుండా పని చేశారు. ఇందులో ఆయన యాక్షన్, నటన అదిరిపోతాయి. మా ‘డెవిల్’ హిట్‌తో 2023 ముగుస్తుంది’’ అన్నారు అభిషేక్ నామా. -
'డెవిల్' ట్రైలర్ ఇంట్రెస్టింగ్.. అంతా బాగానే ఉంది కానీ?
కల్యాణ్ రామ్ కొత్త సినిమా 'డెవిల్'. ఇప్పటికే రిలీజై పోవాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబరు 29న పాన్ ఇండియా రేంజులో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అంచనాలు పెంచేస్తున్న ఈ పెంచేస్తున్న ఈ ట్రైలర్ ఎలా ఉందంటే? (ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!) అభిషేక్ నామా నిర్మిస్తూ-దర్శకత్వం వహిస్తున్న 'డెవిల్' సినిమాలో కల్యాణ్ రామ్.. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. అదే విషయాన్ని ట్రైలర్లో చూపించారు. ఓ అమ్మాయి చావుని ఎంక్వైరీ చేసే క్రమంలో ఓ సీక్రెట్ ఏజెంట్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో చూపించబోతున్నారు. ట్రైలర్ బాగుంది, సినిమాపై హీరో కల్యాణ్ రామ్ కాన్ఫిడెంట్‌గానే ఉన్నాడు. కానీ 'సలార్' రిలీజైన వారం రోజులకే ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుంది. ప్రభాస్ సినిమా హిట్ అయితే.. మూవీ లవర్స్ అదే మాయలో ఉంటారు. ఇదే జరిగితే మాత్రం 'డెవిల్'కి ఇది మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: లక్కీ హీరోయిన్ కోసం నిర్మాతగా మారిన 'జైలర్' డైరెక్టర్) -
డెవిల్ కోసం కళ్యాణ్‌రామ్ ఎన్ని కాస్ట్యూమ్స్ మార్చాడో తెలుసా?
కల్యాణ్ రామ్ టైటిల్ రోల్లో రూపొందిన తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్‌పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో రూ΄పొందించిన చిత్రం ఇది. ఈ నెల 29న ఈ పీరియాడికల్ డ్రామాని విడుదల చేయనున్నారు. బ్రిటిష్‌వారు భారతదేశాన్ని పరిపాలించిన కాలానికి సంబంధించిన కథ ఇది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ భారతీయుడు అయినప్పటికీ బ్రిటిష్ గూఢచారి డెవిల్ పాత్రలో కనిపించనున్నారు. భారతీయత ఉట్టిపడటంతో పాటు స్టైలిష్ గూఢచారిగా చూపించేందుకు కాస్ట్యూమ్ డిజైనర్ రాజేశ్‌తో 90 కాస్ట్యూమ్స్ తయారు చేయించారు అభిషేక్ నామా. ఈ దుస్తుల గురించి కాస్ట్యూమ్ డిజైనర్ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘హీరో లుక్ కొత్తగా ఉండేలా ట్రై చేశాం. ధోతి, పైన ఒక వెయిస్ట్ కోటుతో ఆయన కాస్ట్యూమ్స్‌లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇటలీ నుంచి తెప్పించిన మోహైర్ ఊల్‌తో 60 బ్లేజర్స్, దేశీ కాటన్‌తో కుర్తాలు, ధోతీలు తయారు చేశాం. 25 వెయిస్ట్ కోట్స్ కుట్టాం. బ్లేజర్ జేబు పక్కన వేలాడుతూ ఉండేలా ఓ హ్యాంగింగ్ వాచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించాం’’ అన్నారు. -
డెవిల్ డేట్ ఫిక్స్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన పీరియాడికల్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించారు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లుగా గురువారం చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘ఈ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కల్యాణ్ రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్. -
దిస్ ఈజ్ లేడీ రోజ్..
కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ అంటూ సాగే రెండో పాటను సోమవారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచిన ఈ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యం అందించగా, రాజకుమారి పాడారు. ఈ పాటలో కల్యాణ్ రామ్‌తో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ కాలు కదిపారు. ‘‘ప్రేక్షకులకు ఈ పాట ఓ కనువిందులా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్. -
కొత్త సినిమా షురూ
కల్యాణ్ రామ్ హీరోగా కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మురళీ మోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, విజయశాంతి క్లాప్ కొట్టారు. ముప్పా వెంకయ్య చౌదరి స్క్రిప్ట్‌ని దర్శకునికి అందించారు. ‘‘భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూ΄పొందుతున్న చిత్రమిది. కల్యాణ్ రామ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయన కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. త్వరలోనే ఇతర నటీనటులు, పూర్తి వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సి. రామ్ ప్రసాద్. -
‘డెవిల్’ పాట కోసం విదేశీ వాయిద్యాలు..స్పెషలేంటి?
ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు, విలక్షణమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇటీవల ‘మాయే చేసే..’పాటను రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. డెవిల్ చిత్రం 1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో విదేశీ వాయిద్యాలు వాడారట. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను ఈ పాటలో వాడారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లేలా చేయాయని చిత్ర యూనిట్ పేర్కొంది. నవంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. -
జూ. ఎన్టీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది.. ఆయనకున్న బలం ఎవరు?
సైమా అవార్డ్స్- 2023 ఉత్తమ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. RRR సినిమాలో తన అద్భుత నటనకు గాను ఈ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. నామినేషన్ లిస్ట్‌లో రామ్ చరణ్ ఉన్నా అవార్డు మాత్రం కొమురం భీం పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్కే దక్కింది. 2016లో జనతా గ్యారేజ్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆయన మొదటిసారి ఈ అవార్డును అందకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. 'కొమురం భీముడో... కొమురం భీముడో' పాటలో ఆయన అభినయం ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) ఇక, ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సులో ఎన్టీఆర్ ఎంట్రీ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు మెచ్చకోని ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషాల్లో కూడా ఆడియన్స్ ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. బీభత్సం, రౌద్రం, ప్రేమ, కరుణ ఒకే పాత్రలో చూపించి దేశం మొత్తం తనవైపు తిప్పుకున్నాడు. సినిమాల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా జరిగింది 1983 మే 20న జన్మించిన తారక్ ఓ రోజు మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుండగా తన తాత గారు అయిన సీనియర్ ఎన్టీఆర్‌ను చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక మేకప్‌మ్యాన్‌ను పిలిచి తారక్‌కు మేకప్ వేయమని చెప్పారు. మేకప్ పూర్తి అయిన తర్వాత తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో సంబరపడిపోయారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను దున్నేస్తావ్ అని కితాబు ఇచ్చారు. మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్‌కు తెలిపారు. అలా తాత దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత రామాయణం చిత్రంలో తారక్ నటించారు. అప్పటికి ఆయన హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదువుతుండేవారు. సినిమాల వల్ల చదువుని అశ్రద్ధ చేస్తాడేమోనని కొద్దిరోజుల పాటు కుటుంబ సభ్యులు సినిమాల జోలికి వెళ్లనివ్వలేదు. ఎన్టీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది ఎన్టీఆర్‌కు మొదట పెట్టిన పేరు 'తారక్ రామ్'. కానీ తన తాత సూచనతో నందమూరి తారక రామారావుగా మారాడు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తారక్ ఇలా చెప్పారు. 'ఓ రోజు తాత గారి నుంచి నుంచి కబురు వచ్చింది. అప్పట్లో ఆయన అబిడ్స్‌లో ఉండే వారు. ఆయన్ను కలిసేందుకు వెళ్లగానే.. 'లోపలికి రండి' అంటూ తాత నుంచి గంభీరమైన స్వరంతో ఆహ్వానం. నేను ఆయన ముందుకు వెళ్లగానే.. పేరేంటి..? అని ఆయన అడగ్గా.. తారక్ అని చెప్పాను. దీంతో వెంటనే, హరికృష్ణ గారిని పిలిచి 'నందమూరి తారక రామారావు' అని పేరు మార్చమని చెప్పారు. ఆ క్షణం నుంచి నేను తాత చేయి వదల్లేదు. ఆయనా నన్ను వదిలి ఉండేవారు కాదు.' అని ఓ సందర్భంలో తాతతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నాడు. ఎన్టీఆర్‌కు 'అమ్మ' బలమైతే.. 'నాన్న' ప్రాణం హరికృష్ణ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయనకు శాలిని గారితోనే (జూ. ఎన్టీఆర్ అమ్మ) ఎక్కువ అనుబంధం ఉంది. హైదరాబాద్‌లోనే తన బాల్యం అంతా గడిచింది. బాల్యంలో బాగా అల్లరితో పాటు స్నేహితులతో క్రికెట్, సినిమాలు, షికార్లు, గొడవలు ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తుండటంతో ఒకసారి బాగా విసిగిపోయిన వారి తల్లిగారు శాలిని హ్యాంగర్‌తో కొట్టారని ఓ ఇంటర్వ్యూలో తారక్ చెప్పుకొచ్చారు. 'నేనంటే అమ్మకు ఎంతో ప్రాణం.. ఆమెకు సర్వసం నేనే.. అలాగని ఎప్పుడూ గారాబం చేసేది కాదు. జీవితంలో వాస్తవంలో మాత్రమే బతకాలని నాకు అమ్మే నేర్పింది. నేను ఎప్పుడైనా నిరుత్సాహ పడితే నాలో ఆత్మవిశ్వాసం నింపేది ఆమ్మే. నా జీవితంలో ఆమె నా బలం, బలగం.' అని ఎన్టీఆర్ తెలిపారు. ప్రాణంగా భావించే తన నాన్న హరికృష్ణను రోడ్డు ప్రమాదంలో కోల్పోయినప్పుడు ఆయన ఎంతలా కన్నీరు పెట్టుకున్నాడో అందరం చూశాం. హరికృష్ణ చనిపోయేవరకు ఆయన ఒకే దృక్పథంతో బతికారని గతంలో జూ. ఎన్టీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఆయనలా బతకడం చాలా కష్టం అని కూడా తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోవడంతో ... ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, తమ కోసం కుటుంబం వేచి చూస్తుందని తన ప్రతి సినిమా వేడుకకు హాజరయ్యే అభిమానులకు తారక్ విజ్ఞప్తి చేస్తుంటారు. అభిమానులే తన కుటుంబ సభ్యులని, వారే తన బలగం అని ఆయన పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. తారక్ జీవితంలో ఇవన్నీ ఎవర్గ్రీన్ ♦ తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ♦ పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు. ♦ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట. ♦ యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు. ♦ తారక్ బాల్యంలోనే ప్రఖ్యాత కళాకారుల దగ్గర కూచిపూడి నేర్చుకుని పలు వేదికలపై ప్రదర్శనలూ ఇచ్చారు. ♦ 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ♦ ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో నటించగా.. జై లవ కుశలో త్రిపాత్రాభినయం చేశారు. ♦ పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ♦ జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. ♦ నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు. ♦ మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. ♦ 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు. ♦ సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు. ♦ తారక్‌కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట ♦ తన సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ప్రేమ. ♦ తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు. -
మాయే చేసే...
‘బింబిసార’ వంటి హిట్ మూవీ తర్వాత కల్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మాయే చేసే..’ అనే పాటను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సత్య ఆర్వీ సాహిత్యం అందించిన ఈ పాటను, సిధ్ శ్రీరాం పాడారు. అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్ స్పై థ్రిల్లర్ మూవీ ‘డెవిల్’. నటుడిగా కల్యాణ్ రామ్‌లోని ఓ కొత్త కోణాన్ని ఈ చిత్రంలో ప్రేక్షకులు చూస్తారు. సినిమా కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సీఈఓ: వాసు పొతిని,కెమెరా: సౌందర్ రాజన్ ఎస్. -
డెవిల్స్ ఏంజిల్
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. సోమవారం (సెప్టెంబర్ 11) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘డెవిల్’ చిత్రంలో సంయుక్త పోషించిన నైషధ పాత్ర ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను ‘డెవిల్స్ ఏంజిల్’ అంటూ మేకర్స్ విడుదల చేశారు. ‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నవంబర్ 24న విడుదల చేస్తాం’’ అన్నారు అభిషేక్ నామా. -
కళ్యాణ్ రామ్: తన భార్య గురించి మనసులో మాట
-
Nandamuri Suhasini Son Marriage Photos: నందమూరి సుహాసిని కుమారుడి వివాహం (ఫొటోలు)
-
డెవిల్ వస్తున్నాడు
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించారు. నవీన్ మేడారం దర్శకత్వంలో దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమాను నవంబరు 24న విడుదల చేస్తున్నట్లుగా ఆదివారం చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని చేధించే ఓ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్ ఆకట్టుకోబోతున్నారు’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్. -
మెగా ఆఫర్ రాగానే నందమూరి హీరోను పక్కన పెట్టిన డైరెక్టర్ వశిష్ట్
-
బిమ్బిసార సీక్వెల్ నుండి తప్పుకున్న వశిష్ఠ
-
ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్ రామ్ అమిగోస్,స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్ ఇటీవలె ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో రాజేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆషిక రంగనాథ్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కల్యాణ్‌రామ్ నటించిన సినిమా కావడంతో రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ బాగున్నా, కథ, ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. ఫలితంగా డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ అమిగోస్ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.నేడు(ఏప్రిల్1)నుంచే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లో మెప్పించలేకపోయిన అమిగోస్ ఓటీటీలో అలరిస్తుందేమో చూడాల్సి ఉంది. -
పోస్టర్ చూద్దాం.. ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్
పండగ చేద్దాం.. పోస్టర్ చూద్దాం అన్నట్లు ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని పోస్టర్లను చూద్దాం. ♦ వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. ♦ పల్లకి మోస్తున్నారు గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘రామబాణం’. ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ♦ నాగచైతన్య పోలీస్‌గా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘కస్టడీ’. కృతీ శెట్టి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న రిలీజవుతుంది. ♦ కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ♦ ‘మామా మశ్చింద్ర’ చిత్రంలో ట్రిపుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు సుదీర్‌బాబు. దర్శక–నటుడు హర్షవర్థన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో దుర్గ, పరశురామ్, డీజే పాత్రల్లో కనిపిస్తారు సుధీర్‌బాబు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ♦ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కానుంది. ♦ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘అర్జునదారి గాండీవ’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ♦ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’. 2012 యుగాంతం కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మాత. ♦ పోలీసాఫీసర్‌గా కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘మీటర్’. అతుల్యా రవి హీరోయిన్గా నటించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ల సమర్పణలో చెర్రీ (చిరంజీవి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. గీతికా తివారి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. పి. కిరణ్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ ‘రౌడీబాయ్స్’ ఫేమ్ ఆశిష్ హీరోగా రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫీష్ ’. ఈ చిత్రానికి విశాల్ కాశి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి సహనిర్మాతలు. ♦ రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాను రమణ మొగిలి, తిరుపతిరెడ్డి బీరం నిర్మించారు. ‘‘స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
Ashika Ranganath Latest Photos: హాట్ ఫోజులతో కవ్విస్తున్న అమిగోస్ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఫొటోలు
-
ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న అమిగోస్? ఎప్పుడు.. ఎక్కడంటే!
‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 10న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్ర స్పందన అందుకుంది. ‘డోప్ల్ గ్యాంగర్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా చూసి కొందరు బాగుందంటే మరికొందరు అసలు కథ స్ట్రాంగ్‌లో లేదని అభిప్రాయం పడ్డారు. ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీసు బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మూవీ డిజిటిల్ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. సాధారణంగా ఏ చిత్రమైన, ముఖ్యం స్టార్ హీరోల సినిమాలు థియేట్రికల్ రన్ అనంతరం ఓటీటీకి వస్తుంది. కానీ అమిగోస్ మాత్రం విడుదలైన నెల రోజులకే ఓటీటీకి రానుందని సమాచారం. డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చదవండి: నచ్చిన వ్యక్తితోనే నా పెళ్లి.. లావణ్య ఆసక్తికర వ్యాఖ్యలు Telugu film #Amigos is expected to premiere on Netflix India on March 10th. Also in Tam, Kan, Mal. pic.twitter.com/zQ8WPQgkmZ — Streaming Updates (@OTTSandeep) March 3, 2023 -
తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
-
‘అమిగోస్’ వచ్చేది ఆ ఓటీటీలోకే.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఫిబ్రవరి 10) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. సినిమా విడుదలైన రోజే ఓటీటీ హక్కులు కొనుగోలు చేసిన సంస్థపై క్లారిటీ వచ్చేసింది. (చదవండి: అమిగోస్ మూవీ రివ్యూ) ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ప్రస్తుతానికి నిర్మాతలతో ఉన్న ఒప్పందం మేరకు 8 వారాల తర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలి. కానీ సినిమాకు వచ్చిన స్పందనను బట్టి.. 8 వారాల కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ ప్లే చేశాడు. వాటిలో ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉండగా మరొక రెండు పాత్రలు మరో రెండు భిన్నమైన కోణాల్లో సాగుతాయి. -
‘అమిగోస్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Amigos Movie Review: ‘అమిగోస్’మూవీ రివ్యూ
టైటిల్: అమిగోస్ నటీనటులు: కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ తదితరులు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ: ఎస్. సౌందర్ రాజన్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: ఫిబ్రవరి 10, 2023 బింబిసార చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు కల్యాణ్ రామ్. గతేడాదిలో విడుదలైన ఈ మూవీ కల్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘అమిగోస్’ అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘అమిగోస్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘అమిగోస్’ కథేంటంటే.. సిద్ధార్థ్(కల్యాణ్ రామ్).. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త. ఆర్జేగా పనిచేసే ఇషిక(ఆషికా రంగనాథ్)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఓ వెబ్సైట్ ద్వారా తనలాంటి పోలికలు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కలుస్తాడు. వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ మంజునాథ్(కల్యాణ్ రామ్) అయితే.. మరోకరు బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్(కల్యాణ్ రామ్). ఈ ముగ్గురు గోవాలో కలుసుకొని బాగా క్లోజ్ అవుతారు. వీరు కలవడం కంటే ముందే బిపిన్ రాయ్ హైదరాబాద్‌లో ఎన్ఐఏ అధికారిని దారుణంగా హత్య చేస్తాడు. ఆ మర్డర్ కేసు నుంచి తప్పించుకోవడానికే సిద్దార్థ్‌కి మైఖేల్‌గా పరిచయం చేసుకుంటాడు. ఆ కేసులో తనకు బదులుగా సిద్దార్థ్‌ని అరెస్ట్ చేయించడమే అతని ప్లాన్. మరి అది వర్కౌట్ అయిందా? ఎన్ఐఏ అధికారులు ఎవరిని అరెస్ట్ చేశారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? బిపిన్ రాయ్ వేసిన అసలు ప్లాన్ ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. బింబిసార లాంటి సూపర్ హిట్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన చిత్రం కావడం.. పైగా కెరీర్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ‘అమిగోస్’పై ముందు నుంచే భారీ అంచనాలు పెరిగాయి. టైటిల్ మాదిరే ఈ కాన్సెప్ట్ కూడా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. కానీ కథనం ఆకట్టుకునేలా సాగలేదు. ఈ చిత్రంలో ఒకే రూపంతో ముగ్గురు మనుషులు ఉంటారని.. వారిలో ఒకరు విలన్ అని, తన అవసరం కోసం మిగతా ఇద్దరిని వాడుకుంటాడని ట్రైలర్లోనే చూపించారు. విలన్ కోసం ఎన్ఏఐ అధికారులు వెతకడం కూడా అందులో చూపించారు. అయితే ఎందుకు వెతుకుతున్నారు? వాళ్లు ఎలా కలిశారనేదే మిగతా కథ. ఆ కథను ఆసక్తికరంగా నడిపించే విషయంలో దర్శకుడు నిరాశపరిచాడు. కథనాన్ని చాలా చప్పగా..రొటీన్‌గా నడిపించాడు. సినిమా మొత్తంలో క్యూరియాసిటీ పెంచే సీన్స్ ఒక్కటంటే ఒక్కటి ఉండదు. పైగా రొటీన్ లవ్‌స్టోరీ ప్రేక్షకులను విసిగిస్తుంది. పస్టాఫ్‌లో పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఎలాంటి ట్విస్టులు, వావ్ మూమెంట్స్ లేకుండా చాలా రొటీన్‌గా ఫస్టాఫ్ సాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ అక్కడ కూడా కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతాయి. దర్శకుడు కొత్త కాన్సెప్ట్నే ఎంచుకున్నాడు కానీ.. అంతే కొత్తగా, ఆసక్తికరంగా తెరపై చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. సిద్దార్ధ్ అనే బిజినెస్ మెన్‌గా.. మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, మైఖేల్ అనే గ్యాంగ్ స్టర్‌గా.. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన కల్యాణ్ రామ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. రెండు, మూడు నిమిషాలు మినహా తెరపై మొత్తం కల్యాణ్ రామే కనిపిస్తాడు. మిగతా రెండు పాత్రలతో పోలిస్తే.. నెగెటివ్ షేడ్స్ ఉన్న మైఖేల్ పాత్రలో కల్యాణ్ నటన చాలా బాగుంటుంది. ఇక హీరోయిన్ రిషిక పాత్ర నిడివి చాలా తక్కువ. అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించిది. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ‘ఎన్నోరాత్రులు వస్తాయి కానీ..’ పాట రీమేక్ బాగా సెట్ అయింది. ఎస్. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Amigos Twitter Review: ‘అమిగోస్’ మూవీ ట్విటర్ రివ్యూ
బింబిసార లాంటి సూపర్ హిట్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల అమిగోస్ ఫస్ట్ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ట్విటర్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.‘అమిగోస్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు అవేంటో చూసేయండి. #Amigos A Subpar Drama/Thriller that had an interesting concept with substandard execution! The movie had a unique concept and a few moments/twists that were executed well. However, the overall narration is sluggish and does not excite for the most part. Rating: 2.25-2.5/5 — Venky Reviews (@venkyreviews) February 10, 2023 ట్విటర్లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. సినిమా బాగుందని కొందరు చెబుతుంటే..అంతగా ఆకట్టుకునే చిత్రం కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘అమిగోస్’ మూవీ కాన్సెప్ట్ బాగుంది. కానీ కథనం నాసిరకంగా ఉంది. కొన్ని ట్విస్టులు అదిరిపోయాయి. కానీ కథనం మాత్రం స్లోగా సాగుతుంది’అంటూ 2.25-2.5 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. #Amigos 1st half: characters building sequences👍🏻, interval 👍🏻 Average 1st half 2nd half: Good Racy screenplay in parts👍🏻,Action scenes,Climax👍🏻 Good 2nd half Overall: Good👍🏻 3/5@NANDAMURIKALYAN Hit streak continues👍🏻🔥#AmigosOnFeb10th #Amigosreview #kalyanRam — tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) February 10, 2023 ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే స్పీడ్‌గా సాగుతుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా అమిగోస్ సినిమా బాగుంది అంటూ 3 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్ Just watched #Amigos and it's a feel-good film with laughter, friendship, and heartwarming moments! The cast is fantastic and their chemistry shines on screen. Highly recommend for a movie night with your own amigos 🎥🍿#AmigosReview #MovieReview #FriendshipGoals #eshwarweb pic.twitter.com/5jhpPvtLPk — Eshwar Web (@EshwarWeb) February 10, 2023 ఇప్పుడే సినిమా చూశాను. కామెడీతో పాటు ఫ్రెండ్షిప్ గొప్పదనాన్ని తెలియజేశాఉ. కొన్ని సీన్స్ హృదయలను హత్తుకుంటాయి. నటీనటుల ఎంపిక బాగుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మీ స్నేహితులతో కలిసి చూసే సినిమా ఇది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Amigosreview First half is a passable love story with not much intrigue.Twists unravel in the second half making the movie a decent one-time watch.But can't vouch for excitement that audience expect from it.Triple roles,drama so unrealistic.#AmigosOnFeb10th #KalyanRam #JrNTR pic.twitter.com/38Vse4brud — KLAPBOARD (@klapboardpost) February 10, 2023 #Amigos 1st half review: ⭐️kalyan ram characterization. ⭐️3 characters builded nicely. 👎🏼songs and bgm could have been better 👎🏼 production values are not good by mythri for the first time because of camera work. Looks like outdated camera. Totally on 2ndhalf.#AmigosOnFeb10th pic.twitter.com/ReJ1ZzE1wy — ReviewMama (@ReviewMamago) February 10, 2023 #AmigosReview Movie was FreshLook To Audience moreover Story Lineup is More content Ultra Mass Eliments added BGM Looks Pleasent Songs Mixed Melody Pure Family Action Drama Sequence Overall Rating :-4/5 ⭐⭐⭐⭐@tarak9999 @NANDAMURIKALYAN @NtrMurali9999 #ManOfMassesNTR — ReNaa (@Piger175) February 10, 2023 #Amigosreview Kalyan Ram 2.0 Malli kottesadu ra Kalyan Ram Super Hit🔥 Back to Back @RajendraReddy_ Gari direction 👌@NANDAMURIKALYAN Acting🔥 — PavantaRRRakⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@PavanTarakroyal) February 10, 2023 Decent first half 👌@NANDAMURIKALYAN Played fantastic in Triple Role 🔥🔥🔥#Amigosreview — Deva (@DevaNtrfan) February 10, 2023 Overall, #Amigos is an entertaining film with an interesting concept of doppelgängers, good performances and impressive technical elements. This is likely to be a second successive HIT for #KalyanRam after #Bimbisara.#AmigosReview — Cinemania (@CinemaniaIndia) February 9, 2023 -
అమిగోస్’లో 2.17 గంటలు నేనే కనిపిస్తా: కల్యాణ్ రామ్
‘బింబిసార’ చిత్రానికి ముందే ‘అమిగోస్’ కథ విన్నాను. రాజేంద్రగారు స్టోరీ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పాను. ఒకే పోలికలతో ఉండే ముగ్గురు వ్యక్తులు ఎలా కలిశారు? వాళ్ల లక్ష్యం ఏంటి? వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుంది’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ పంచుకున్న విశేషాలు. ►‘బింబిసార’ హిట్ తర్వాత నేను కథలు ఎంచుకునే విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. ముందు ఎలా ఉన్నానో తర్వాత కూడా అలానే ఉన్నాను. ఎందుకంటే ‘బింబిసార’, ‘అమిగోస్’, ‘డెవిల్’ సినిమాల కథలను 2020లోనే ఓకే చేశాను. ‘బింబిసార’ హిట్ తర్వాత కొత్తగా ఏ కథనీ ఎంచుకోలేదు. అయితే ఆ సినిమా విజయం నా బాధ్యతని పెంచింది. అంతకంటే ఇంకా పెద్ద విజయాన్ని నా నుంచి ఆశిస్తారు. అందుకే మంచి కాన్సెప్ట్, స్టోరీ ఉన్నవి ఒప్పుకోవాలి. లక్కీగా నాకు అన్నీ అలాంటి మంచి కథలు వస్తున్నాయి. ► ‘అమిగోస్’ చిత్రంలో నేను త్రిపాత్రాభినయం చేశాను. సిద్ధార్థ్ చాలా చురుకుగా ఉంటాడు. మంజునాథ్ది చాలా సైలెంట్ అండ్ సాఫ్ట్ క్యారెక్టర్. మైఖేల్ పాత్ర గ్యాంగ్‌స్టర్‌ని పోలిన విలన్లా ఉంటుంది. విలన్లా నటించడం చాలా కొత్తగా అనిపించింది. ట్రిపుల్ రోల్ చిత్రంలో కనీసం ఇద్దరు కథానాయికలైనా ఉంటారు. కానీ ఇది రెగ్యులర్ సినిమాలకు పూర్తి విభిన్నమైనది కావడంతో ఒక హీరోయిన్ మాత్రమే ఉంటుంది. పైగా ఈ మూవీలో విలన్ ఉండకపోవడం ఓ విశేషం. ► మనిషిని పోలిన మనుషులను ‘డాపుల్ గాంగర్’ అంటారని రాజేంద్రగారు చెప్పారు. ఈ సినిమాకి ‘అమిగోస్’ టైటిల్ అనుకున్నప్పుడు అందరికీ అర్థం అవుతుందా? అన్నాను. అమిగో అనే పదం సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య బాగా వాడుతున్నారని చెప్పడంతో ఫిక్స్ చేశాం. సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టామో అర్థం అవుతుంది. ఈ మధ్య సూపర్ హిట్ అయిన ‘కాంతారా’ టైటిల్ అర్థం నాకు తెలీదు. దాని గురించి వెతికితే ‘వైల్డ్ ఫారెస్ట్’ అని అర్థం అయింది. ► కోవిడ్ సమయంలో నన్ను నేను బాగా తెలుసుకున్నాను. నేను చేసిన కొన్ని సినిమాలు పరాజయం కావడానికి కారణం ఏంటి? నేను చేసిన తప్పులు ఏంటి? అని తెలుసుకున్నాను. ‘అమిగోస్’ సినిమా 2 గంటల 19 నిమిషాలు ఉంటే.. అందులో రెండు గంటల పదిహేడు నిమిషాలు కల్యాణ్ రామ్‌నే చూస్తారు.. సినిమాలో జస్ట్ రెండు నిమిషాలు మాత్రమే కనబడను. ఆ పాత్రకి అంత ప్రాధాన్యం ఉంటుంది. ► ప్రస్తుతం నేను నటిస్తున్న ‘డెవిల్’ మూవీ చిత్రీకరణ మే నెలలో పూర్తవుతుంది. ‘బింబిసార 2’ షూటింగ్‌ని ఈ ఏడాది ఆఖరులో ప్రారంభిస్తాం. ► తారకరత్న ఆరోగ్యం ఎలా ఉందో నేను చెబితే బాగుండదు. వైద్యం అందిస్తున్న ఆస్పత్రి వర్గాలు చెబితేనే బాగుంటుంది. -
హీరోయిన్ ఆషికకు ప్రపోజ్ చేసిన కల్యాణ్ రామ్!
బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత కల్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం అమిగోస్. ఆషిక రంగనాథ్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. రాజేంద్ర రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలో బుల్లితెరపై ఓ షోకు గెస్టుగా విచ్చేసిన కల్యాణ్ రామ్ ఓ ఫన్నీ టాస్క్‌లో భాగంగా హీరోయిన్ ఆషికకు లవ్ ప్రపోజ్ చేశారు.‘మీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను’ అంటూ రెడ్ రోజ్ ఇచ్చి క్యూట్‌గా ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత సుమ అప్పుడే రావడంతో.. మీరు ఇంకా బాగున్నారు అంటూ ఆమె చేతికి అందమైన రోజా పువ్వును ఇచ్చారు కల్యాణ్ రామ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
షూటింగ్ సమయంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమిగోస్ డైరెక్టర్
‘‘నవీన్, రవిశంకర్‌గార్లు నిర్మించిన రెండు చిత్రాలు(వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి) ఈ సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్స్ అయ్యాయి. అంత సుడి ఉన్న నిర్మాతలు తీసిన ‘అమిగోస్’ కూడా బ్లాక్ బస్టర్ అయి హ్యాట్రిక్ సాధించాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ జంటగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్ చదివిన రాజేంద్రగారు వారి తల్లిదండ్రులు వద్దంటున్నా ఇండస్ట్రీకి వచ్చారు. ‘అమిగోస్’ మొదలయ్యేలోపు వారి అమ్మగారు కాలం చేస్తే, లాస్ట్ షెడ్యూల్ సమయంలో నాన్నగారు కూడా చనిపోయారు. రాజేంద్రగారి తల్లితండ్రులు భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆయన సాధించిన ఈ మొదటి మెట్టు విజయాన్ని వారు చూశారు. ‘జై లవ కుశ’లో నేను మూడు పాత్రలు చేశా. మూడు విభిన్న పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘అమిగోస్’ లో కల్యాణ్ అన్న మూడు పాత్రల్లో ఎంతో అద్భుతంగా నటించారు’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచన ఉన్న నాకు ‘అమిగోస్’ పర్ఫెక్ట్ మూవీ. 18 ఏళ్ల పాటు నన్ను ఆదరిస్తూ, భరిస్తూ వచ్చిన మీకు (ప్రేక్షకులు, అభిమానులు) చాలా థ్యాంక్స్. ఈ సినిమా చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడరు’’ అన్నారు. ‘‘నన్ను, ‘అమిగోస్’ స్క్రిప్ట్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన కల్యాణ్‌రామ్‌గారికి, నిర్మాతలు రవి, నవీన్ గార్లకు రుణపడి ఉంటాను’’ అన్నారు రాజేంద్ర రెడ్డి. ‘‘అమిగోస్’ని హిట్ చేసి, మాకు హాట్రిక్ (‘వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి’) విజయాలను అందించాలి’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘బింబిసార’ తర్వాత కల్యాణ్‌గారి నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఈ చిత్రంలో చూస్తారు’’ అన్నారు వై.రవిశంకర్. ఈ వేడుకలో డైరెక్టర్ బుచ్చిబాబు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కొరటాల శివగారు, నా కాంబినేషన్లో సినిమా ఈ నెలలో ప్రారంభించి, మార్చిలో షూటింగ్ మొదలుపెడతాం. 2024 ఏప్రిల్ 5న ఆ సినిమాని విడుదల చేస్తాం. – ఎన్టీఆర్ -
కల్యాణ్ రామ్ ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ (ఫోటోలు)
-
'బింబిసార' సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయనున్న కల్యాణ్ రామ్
కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్లో నటించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్రవరి 5న నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ హాజరయ్యాడు. ఈ సినిమా సూపర్‌హిట్ కావడంతో ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయనున్నారు కల్యాణ్ రామ్. 3 letters which will take the tale of 3 doppelgangers to the next level - N T R 🔥#Amigos Pre Release Event with @tarak9999 as the chief guest 💥 On 5th Feb at HYD💥 - https://t.co/T63ceTMvmD#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @shreyasgroup pic.twitter.com/szVI9VT10P — Mythri Movie Makers (@MythriOfficial) February 4, 2023 -
కల్యాణ్ రామ్ అమిగోస్ నుంచి సెకండ్ సింగిల్, బాలయ్య హిట్ సాంగ్‌కు రీమిక్స్
బింబిసార సూపర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, పాటలు సినిమాపై మాంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మా’ పాటలను రిలీజ్ చేశారు మేకర్స్. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్‌కు ఇది రీమిక్స్. గతంలో బాలయ్య నటించిన 'ధర్మక్షేత్రం' సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను దివంగత లెజెండరి సింగర్ బాలు - చిత్ర ఆలపించారు. అదే పాటలను అమిగోస్లో రిమేక్ చేయించాడు కల్యాణ్ రామ్. గిబ్రాన్ సింగీతం అందించిన ఈ పాటను ఎస్పీ చరణ్-సమీరా భరద్వాజ్‌లు ఆలపించారు. కాగా ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. Evergreen Romantic Melody is here❤️#EnnoRatrulosthayi Full Video Song from #Amigos out now 🕺💃 - https://t.co/foMaW1GPNB#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial #SriVeturi #SpbCharan #SameeraBharadwaj @adityamusic pic.twitter.com/ouc4OQHVmI — Mythri Movie Makers (@MythriOfficial) January 31, 2023 -
అలాంటి సినిమాల్లో నటించాలనేది నా కల: ఆషికా రంగనాథ్
‘‘తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగులో నటించాలని కొన్నేళ్లుగా అనుకుంటున్నాను. గతంలో కొన్ని కథలు నచ్చకపోవడం, మరికొన్ని నా డేట్స్ కుదరక చేయలేదు. కానీ ‘అమిగోస్’ కథ వినగానే నచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద ప్రొడక్షన్లో నా తొలి చిత్రం చేయడం నా అదృష్టం. ‘అమిగోస్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని ఆషికా రంగనాథ్ అన్నారు. ‘‘బింబిసార’ వంటి హిట్ చిత్రం తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అమిగోస్’లో నేను రేడియో జాకీ పాత్ర చేశాను. నేటితరం అమ్మాయిలకు నా పాత్ర బాగా నచ్చుతుంది. స్క్రీన్‌పై నా పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. ఇక తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్‌గార్ల డ్యాన్స్ అంటే ఇష్టం. రాజమౌళిగారు తీసిన ‘బాహుబలి’ లాంటి సినిమాలో నటించాలనేది నా కల. ప్రస్తుతం కన్నడ, తమిళంలో కొన్ని సినిమాలు చేస్తున్నాను. తెలుగులో కొన్ని కథలు చర్చల్లో ఉన్నాయి’’ అన్నారు. -
క్రిటికల్‌గా తారకరత్న ఆరోగ్యం.. రిలీజ్ వాయిదా వేసుకున్న కల్యాణ్ రామ్
సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హెల్త్ బుటిటెన్ విడుదల చేసిన వైద్యులు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో సినిమా ప్రమోషన్స్ చేయడం సరికాదనుకున్నారు నందమూరి కల్యాణ్ రామ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అమిగోస్ ఫిబ్రవరి10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని రాధే వెన్నల’ పాటని ఈ సినిమాలో రీమేక్ చేశాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఈ పాట ప్రోమోను విడుదల చేయగా, ఫుల్‌సాంగ్‌ను రేపు(ఆదివారం)సాయంత్రం గం.5:09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సాంగ్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు అమిగోస్ మేకర్స్ ప్రకటించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. The song launch of #EnnoRatrulosthayi from #Amigos stands postponed to a later date. Praying & Wishing Sri. Taraka Ratna Garu a speedy recovery. pic.twitter.com/UQAKDQTKNU — Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2023 -
తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్ రామ్..
సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. తాజాగా హీరో కల్యాణ్ రామ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా..“నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ”అంటూ ట్వీట్ చేశారు. నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను . Get well soon and get back to complete health brother. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 28, 2023 -
ఆసక్తిని రేకెత్తిస్తున్న కల్యాణ్ రామ్ 'అమిగోస్' టీజర్
బింబిసార సూపర్ హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన కల్యాణ్ రామ్ మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజాచిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేస్తున్న పోస్టర్ సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్ చేస్తుండగా తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ‘‘హాయ్ దిస్ ఈజ్ మైఖెల్ ఫ్రమ్ కోల్‌కతా’’ అంటూ కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇవ్వడంతో మొదలువతుంది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. -
‘బింబిసార’ బ్లాక్‌బస్టర్.. మరో వైవిధ్యమైన కథతో వస్తున్న కల్యాణ్ రామ్
‘బింబిసార’ వంటి హిట్ సినిమా తర్వాత కల్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘అమిగోస్’. రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. కల్యాణ్ రామ్ కెరీర్లో 19వ సినిమాగా రూపొందుతుంది. ఈ చిత్రానికి ‘అమిగోస్’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రం బృందం. చదవండి: చిక్కుల్లో షారుక్ చిత్రం, డైరెక్టర్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు అంతేకాదు ఈ సినిమాను 2023 ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘దె సే వెన్ యు మీట్ సమ్‌బడీ దట్ లుక్స్ జస్ట్ లైక్ యు, యు డై’ (నీలాగే కనపడే ఇంకో వ్యక్తి నీకు ఎదురుపడితే నువ్వు చస్తావు) అనేది పోస్టర్‌పై క్యాప్షన్‌గా ఉంది. ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. Hola #Amigos ❤️🔥 Expect the unexpected! See you in cinemas from Feb 10, 2023 🔥#RajendraReddy @AshikaRanganath @GhibranOfficial @MythriOfficial pic.twitter.com/1S2gdnUHeg — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 7, 2022 -
బింబిసార సక్సెస్.. ఫ్యాన్స్‌కు డైరెక్టర్ మరో సర్ప్రైజ్..!
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'బింబిసార'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. టాలీవుడ్ ప్రేక్షకులకు థియేటర్లలో వినోదాన్ని పంచింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. బింబిసారుడు అనే ఓ రాజు జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ డ్రామాగా డైరెక్టర్ వశిష్ఠ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీతోనే దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అభిమానులు ఊహించినట్లుగానే ఈ చిత్రానికి సీక్వెల్ బింబిసార-2 ఉంటుందని వెల్లడించారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. వశిష్ఠ మాట్లాడుతూ.. 'సోషియో ఫాంటసీ సినిమాగా వచ్చిన బింబిసారను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ప్రస్తుతం వారంతా ఈ సినిమా సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. కల్యాణ్ రామ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బింబిసార-2 షూటింగ్ ప్రారంభిస్తాం' అని అన్నారు. కాగా.. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాలో నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు. -
ఓటీటీకి వచ్చేసిన బింబిసార, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార. రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడు కల్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం గత ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. కలెక్షన్స్ పరంగా కూడా పైసా వసూళ్ అనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో అక్టోబర్21 (శుక్రవారం) అర్ధరాత్రి నుంచే బింబిసార స్ట్రీమింగ్ అవుతోంది. కాగా బింబిసారుడు అనే ఓ రాజు జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ డ్రామాగా డైరెక్టర్ వశిష్ఠ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీతోనే ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించగా.. శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించారు. Get ready to fall back into the time of #Bimbisara and his Trigartala, streaming from MIDNIGHT TODAY! #BimbisaraonZEE5 @DirVassishta@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial @zee5telugu @ZEE5Tamil @ZEE5Kannada @zee5keralam pic.twitter.com/q9KrE2yjC2 — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) October 20, 2022 -
అఫీషియల్: 'బింబిసార' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కె. హరికృష్ణ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతోంది. బింబిసార ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా అక్టోబరు 21 నుంచి తెలుగు, కన్నడతో పాటు తమిళం, మలయాళంలో ఒకేసారి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. కాగా ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. Bimbisaaaraa!! Echoing all over south India - Coming to you in 4 languages Enjoy #Bimbisara in Telugu, Kannada, Tamil & Malayalam Meet #BimbisaraOnOctober21#BimbisaraonZEE5@NANDAMURIKALYAN @DirVassishta@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial — ZEE5 Telugu (@ZEE5Telugu) October 15, 2022 -
షూటింగ్‌ను పూర్తి చేసుకుంటున్న కల్యాణ్ రామ్ కొత్త సినిమా
కల్యాణ్‌రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ‘‘రీసెంట్గా జరిగిన గోవా షెడ్యూల్‌తో షూటింగ్ దాదాపు పూర్తయింది. ఫైనల్ షెడ్యూల్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. బ్రహ్మాజీ, సప్తగిరి, మాథ్యూ వర్గీస్, రాజీవీ పిళ్లై, రవి ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. -
దీపావళికి ఓటీటీలో ‘బింబిసార’ మూవీ, రిలీజ్ డేట్ ఇదే!
దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం ‘బింబిసార’. రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడు కల్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. ఇక బాక్సాఫీస్ వద్ద బింబిసార మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్‌ని ఖాతాలో వేసుకుంది. థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయిన ఈచిత్రం ఇప్పుడు ఈమూవీ ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీని జీ5 సంస్థ ఓటీటీకి తీసుకువస్తోంది. అక్టోబర్ 21న ఈ మూవీని ఓటీటీలో కానుంది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన కూడా వచ్చేసింది. కాగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడు. డ్యుయెల్ రోల్ చేసిన కల్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. -
ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైన ‘బింబిసార’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం బింబిసార.రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. ఇక బాక్సాఫీస్ వద్ద బింబిసార మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్ ని ఖాతాలో వేసుకుంది. చదవండి: Srihari Wife Shanthi: ‘డబ్బులు ఇవ్వకుండా వారు మోసం చేశారు’ ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడు. డ్యుయెల్ రోల్ చేసిన కల్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇక థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమైంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ ఫ్యాన్సీ ధర సొంతం చేసుకుంది. దీంతో దసరాకు బింబిసార మూవీని జీ5లో అందుబాటులోకి తెచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చదవండి: మహిళా యాంకర్ పట్ల అసభ్య ప్రవర్తన, హీరో అరెస్ట్ దసరా కానుకగా ప్రేక్షకులకు మరింత వినోదం అందించేందుకు అక్టోబర్ 7వ తేదీన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై జీ5 నిర్వహకులు అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. -
‘బింబిసార’ కోసం కల్యాణ్‌రామ్ ఇంత కష్టపడ్డారా... మేకింగ్ వీడియో
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌ని కళకళలాడించిన చిత్రం ‘బింబిసార’. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండు నెలలుగా హిట్ లేక విలవిలలాడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి అందించింది. ఈ చిత్రం విడుదలై పది రోజలు దాటినా ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ది క్రానికల్స్’పేరిట మేకింగ్ వీడియోని విడుదల చేసింది. (చదవండి: గొప్ప మనసు చాటుకున్న ప్రశాంత్ నీల్.. గర్వంగా ఉందంటూ మాజీ మంత్రి ట్వీట్) ఈ చిత్రంలోని ఫైటింగ్ సీన్స్ ఎలా షూట్ చేశారు?సెట్ నిర్మాణానికి మేకర్స్ పడిన కష్టమేంటి? తదితర విశేషాల్ని ఈ వీడియోలో చూడొచ్చు. కల్యాణ్ రామ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించినట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ వశిష్టకు ఇది తొలి సినిమా అయినప్పటికీ.. అద్భుతంగా తెరకెక్కించాడు. కీరవాణి నేపథ్య సంగీతం, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమా స్థాయిని పెంచాయి. . ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. -
కల్యాణ్‌రామ్ 'బింబిసార' సినిమాపై బాలయ్య పొగడ్తలు
నందమూరి కల్యాణ్‌రామ్ తాజాగా నటించిన చిత్రం 'బింబిసార'. చాలాకాలం తర్వాత కల్యాణ్ రామ్ ఈ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి బింబిసార బృందాన్ని అభినందించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ యూనిట్ సభ్యులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. అనంతరం అనంతరం మూవీ టీంని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కల్యాణ్‌రామ్ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణతో పాటు కళ్యాణ్‌రామ్ సోదరి సుహాసిని, భార్య స్వాతి కూడా బింబిసార చిత్రాన్ని చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Some special pictures from the special screening of #Bimbisara for Natasimham #NandamuriBalakrishna garu❤️ The team is all smiles & pumped up with roaring energy 💥🔥@NANDAMURIKALYAN @DirVassishta pic.twitter.com/AbUWQJnpRM — NTR Arts (@NTRArtsOfficial) August 13, 2022 -
బింబిసార ర్యాప్ సాంగ్ విన్నారా?
సరైన హిట్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. ఇటీవలే వచ్చిన బింబిసారతో అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్‌ను రుచి చూశాడు. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ టైం ట్రావెల్ మూవీ ఆగస్టు 5న రిలీజైంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న ఈ సినిమా నుంచి ర్యాప్ సాంగ్ రిలీజైంది. ఇందులో పాటతో పాటు పలు ముఖ్య సన్నివేశాలను సైతం చూపించారు. అంతేకాదు, కల్యాణ్ రామ్ చెప్పిన డైలాగులను సైతం ర్యాప్ సాంగ్‌లో పొందుపరచడం విశేషం. ఆదిత్య అయ్యంగార్, లిప్సిక, పృథ్వీచంద్ర పాడిన ర్యాప్ సాంగ్‌కు కీరవాణి సంగీతం అందించాడు. చదవండి: పదునైన ఆయుధంతో సూసైడ్‌కు యత్నించిన నటుడు డెంగ్యూను లెక్కచేయని కంగనా, నువ్వు నిజంగా ఇన్స్పిరేషన్.. -
నందమూరి హీరోలను కాపాడుతున్న ‘చిట్టితల్లి’
అప్పుడప్పుడు సినిమా పరిశ్రమలో కొన్ని సెంటిమెంట్లు అనేవి భలేగా వర్కౌట్ అవుతాయి. కావాలని ఫాలో అయినవి కాకపోయినా వాటి వల్ల వచ్చే ఫలితాలు మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఇటీవలి కాలంలో నందమూరి హీరోలకు ‘పాప’ ఫ్యాక్టర్ అనేది ఆయా చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడానికి ఉపయోగపడిందనేది వాస్తవం. గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజైన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాలో బాలకృష్ణ కూతురిగా నటించిన పాప చుట్టే దర్శకుడు బోయపాటి శ్రీను సెకండ్ హాఫ్ మొత్తం కూడా నడిపించాడు.అలాగే సీక్వెల్ కి లింక్ కూడా అక్కడే ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొమురం భీమ్ క్యారెక్టర్ పోరాడేది చిన్నపాపైన మల్లి కోసమే.ఈ తాలూకు ఎమోషన్ రామ్ చరణ్ కన్నా ఎక్కువగా కనెక్ట్ అయ్యింది తారక్ క్యారెక్టర్ తోనే.తాజాగా రిలీజైన బింబిసార సినిమాలో చెడ్డవాడైన చక్రవర్తి తన చేతిలో మరణించిన పాప కోసం ప్రాయశ్చిత్తంగా వర్తమానంలో తన ప్రాణాలు కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. ఇది దర్శకుడు వశిష్ట ప్రెజెంట్ చేసిన థీమ్ లో బలమైన పాయింట్ ఇదే. (చదవండి: సీతారామం సక్సెస్.. ఆరోజు ఏడ్చేశా..: దుల్కర్ సల్మాన్) అఖండ, ఆర్ఆర్ఆర్, బింబిసార చిత్రాలలో చైల్డ్ సెంటిమెంట్ ఇంత బ్రహ్మాండంగా వర్కౌట్ అవ్వడం స్పెషల్ అనే చెప్పాలి.ఇంకా అది కూడా కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ఈ మూడు హిట్ కావడం గమనార్హం. నందమూరి ఫ్యాన్స్ ఆనందం అయితే మాములుగా లేదు. ముఖ్యంగా ఎప్పటి నుంచో సక్సెస్ లేక వెయిట్ చేస్తున్న కళ్యాణ్ రామ్ కు ఈ రేంజ్ సక్సెస్ దక్కడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. బింబిసార 2 సినిమా కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఆ చిట్టితల్లిని కంటిన్యూ చేస్తారు. -
‘బింబిసార’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
మళ్లీ పుట్టినట్లు అనిపించింది.. ఆ మాటలు వింటే భయమేసేది
‘‘బింబిసార’ రిలీజ్ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు మళ్లీ పుట్టినట్లు అనిపించింది. ఇంత మంచి కథను నాకు ఇచ్చిన వశిష్ఠ్‌కు ధన్యవాదాలు’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘బింబిసార’. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఎంతో నమ్మకంతో సినిమాను పూర్తి చేశాం. కానీ థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే కొంతమంది మాటలు వింటే భయమేసేది. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నమ్మాను.. ‘బింబిసార’ విషయంలో అదే నిజమైంది. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘మేజర్, విక్రమ్’ సినిమాలు మంచి విజయాన్ని చూశాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘బింబిసార, సీతారామం’ ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇదే ఉత్సాహంతో నేను కూడా ముందుకెళతాను’’ అన్నారు. ‘‘మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వశిష్ఠ్. డిస్ట్రిబ్యూటర్లు శివరాం, ఎల్.వి.ఆర్, హరి, ఎ.ఎం.ఆర్ పాల్గొన్నారు. -
'బింబిసార'లో అమాయకత్వంతో ఆకట్టుకున్న ఈ పాప ఎవరంటే?
త్రిగర్తల సామ్రాజ్యాధినేతగా కల్యాణ్ రామ్ అదరగొడుతున్న చిత్రం 'బింబిసార'. శుక్రవారం(ఆగస్ట్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సినిమా. టైమ్ ట్రావేల్ అనే సరికొత్తగా ప్రయోగం చేసిన కల్యాణ్ రామ్‌కు చాలా గ్యాప్ తర్వాత మంచి విజయం లభించింది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ నటనకు, విజువల్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా 'బింబిసార'లో చిన్నారి పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది బేబి శ్రీదేవి. త్రిగర్తల సామ్రాజ్యంలో ఆయుర్వేద పండితుడి (తనికెళ్ల భరణి) మనవరాలు శాంభవిగా, భూలోకంలో బింబిసారుడి వంశంలో పుట్టిన మొదటి ఆడపిల్లగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బేబి శ్రీదేవి అమాయకత్వం, కల్యాణ్ రామ్‌తో వచ్చే సీన్లు మనసుకు హత్తుకుంటాయి. అయితే ప్రస్తుతం ఈ పాప ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ పాప ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన బేబి శ్రీదేవి తల్లిదండ్రులు శ్రీహరి గౌడ్, శ్రీలక్ష్మి. వీరు హైదరాబాద్‌లో నివాసముండగా, శ్రీహరి గౌడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న బేబి శ్రీదేవి పున్నాగ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, కల్యాణ వైభోగం వంటి 15 సీరియల్లలో నటించి ఆకట్టుకుంది. అలాగే మేజర్, రామా రావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాల్లో సైతం నటించింది. View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) -
'బింబిసార' ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన దిల్‌రాజు
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా కల్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. చదవండి: Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా? అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. 50 రోజుల తర్వాతే బింబిసార ఓటీటీలో విడుదల అవుతుందని స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్ 23న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. .నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. -
Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతుంది.విడుదలైన రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కల్యాణ్ రామ్. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో పలువురు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇక ఆయన భార్య స్వాతి ఎవరు, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్న వివరాలపై సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కల్యాణ్‌రామ్‌కు 2006 ఆగస్టు 10న స్వాతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి చూపుల్లోనే స్వాతిని చూసి ఇష్టపడిన కల్యాణ్ రామ్ ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారట. ఇక ఆమె వృత్తిరీత్యా డాక్టర్. కల్యాణ్ రామ్ భార్య ఫ్యామిలీ విషయానికి వస్తే వారిదీ సంపన్న కుటుంబమే. ఆమె తండ్రికి ఫార్మా రంగంతో పాటు పలు పరిశ్రమలు ఉన్నాయట. ఇక స్వాతి కూడా బిజినెస్ రంగంలోనే ఉన్నారు. ఆమెకు సొంతంగా వీఎఫ్ఎక్స్ సంస్థ ఉంది. బింబిసార సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ శాతం ఈ సంస్థలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇక కల్యాణ్‌రామ్-స్వాతి దంపతులకు అదైత, శౌర్యరామ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: 'బింబిసార' సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. ట్వీట్ వైరల్ -
హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?
చాలా గ్యాప్ తర్వాత, కొత్త ప్రయోగమైన 'బింబిసార' హిట్‌తో సక్సెస్ వైపు దూసుకుపోతున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. కథనే నమ్ముకుని విభిన్నమైన చిత్రాలను నటుడిగా ఎంకరేజ్ చేయడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్న కల్యాణ్ రామ్‌కు, ఓటీటీ వేళ థియేటర్లకు 'బింబిసార' విజయం ఒక ఆశా కిరణం. ఈ సక్సెస్‌పై కల్యాణ్ రామ్ ఆనంద వ్యక్తం చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే 'బింబిసార' విజయంతో కొందరు మాత్రం రచ్చ చేస్తున్నారు. 'మెగాస్టార్' ట్యాగ్ జోడించి #MegastarKalyanRam అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిపై ట్రోలింగ్‌కు సైతం దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్‌కు 'మెగాస్టార్' ట్యాగ్ తగిలించడం అంతా అవసరమా? అనే విషయంపై ఓ చిన్న లుక్ వేద్దామా. 'బాల గోపాలుడు' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన నందమూరి కల్యాణ్ రామ్ 2003లో వచ్చిన 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. ఈ సినిమాతో పాటు అదే సంవత్సరంలో విడుదలైన 'అభిమన్యు' అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం అతనొక్కడే. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కల్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా 2005లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అప్పటి నుంచి హీరోగా విభిన్నమైన కథలను ఎంచుకోవడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్నాడు. ఇలా హీరోగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పేరిట నిర్మాతగా ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలను నిర్మించాడు. కానీ ఏ ఒక్క చిత్రానికి స్టార్ డైరెక్టర్‌తో సినిమాను రూపొందించలేదు. అయితే 2016లో ఇజం సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసినా, అప్పుడు పూరి వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోని తొలి చిత్రం అతనొక్కడేతో సురేందర్ రెడ్డిని పరిచయం చేస్తే, 2009లో జయీభవతో నరేన్ కొండెపాటిని, 2013లో ఓం త్రీడీ చిత్రంతో సునీల్ రెడ్డిని, 2015లో పటాస్ సినిమాతో అనిల్ రావిపూడిని డైరెక్టర్‌గా తెలుగు చిత్రసీమకు ఇంట్రడ్యూస్ చేశాడు కల్యాణ్ రామ్. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రెండో సినిమాగా 2008లో విడుదలైన హరే రామ్‌ను హర్షవర్ధన్‌తో నిర్మించాడు. అప్పటికే ఈ డైరెక్టర్ బాలకృష్ణతో విజయేంద్ర వర్మ తెరకెక్కించి ప్లాప్ మూటగట్టుకున్నాడు. డైరెక్టర్ స్వర్ణ సుబ్బరావు తన పేరును హర్షవర్ధన్‌గా మార్చుకుని ఈ చిత్రం చేయడం విశేషం. తర్వాత తనతో అభిమన్యు తెరకెక్కించిన డైరెక్టర్ మల్లికార్జున్‌కు అవకాశం ఇస్తూ కత్తి సినిమాను నిర్మించాడు. ఇక తాజాగా నిర్మించిన 'బింబిసార' సినిమా డైరెక్టర్ వశిష్ఠ ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు. వశిష్ఠ అసలు పేరు వెంకట్ కాగా పలువురు ముద్దుగా వేణు అని కూడా పిలిచేవారు. 2007లో 'ప్రేమలేఖ రాశా' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. గీత రచయిత కులశేఖర్ డైరెక్టర్‌గా మారిన ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా చేసింది. అయితే పలు కారణాల వల్ల విడుదల కానీ ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. హీరోగా తొలి అపజయాన్ని మూటగట్టుకున్న వెంకట్ నటనకు స్వస్తి పలికి దర్శకత్వం మీద దృష్టి పెట్టాడు. ఫైనల్‌గా సోషియో ఫాంటసీ కథతో 'బింబిసార' సినిమాను తెరకెక్కించి విజయం సాధించాడు. ఇలా ముందు నుంచి చూసుకుంటే కల్యాణ్ రామ్ ఏ రోజు కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ల వెంట పడలేదు. కథను, కొత్త దర్శకులు, ప్లాప్ డైరెక్టర్లు అనే భేదం లేకుండా ప్రతిభను నమ్మి.. నిర్మాతగా అవకాశాలిస్తూ నిజమైన హీరో అనిపించుకున్నాడు కల్యాణ్ రామ్. ఒక కొత్త దర్శకున్ని నమ్మి, నిర్మాతగా రూ. 45 కోట్ల బడ్జెట్ పెట్టడంతోపాటు హీరోగా 'బింబిసార' కోసం కష్టపడిన కల్యాణ్ రామ్ ఫ్యాషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పడంలో, ఈవిల్ టు గుడ్ అని ఓ టైమ్ ట్రావెల్ మూవీని నిర్మించడానికి చేసిన కృషిని ప్రశంసించడంలో ఎలాంటి తప్పులేదు. కానీ ఇదే అదనుగా కొంతమంది కల్యాణ్ రామ్ నిజమైన మెగాస్టార్ అని, చిరును కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం సరైంది కాదు. ఎందుకంటే చిరంజీవి నటన, అభినయం, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పునాది రాళ్లు, ప్రాణం ఖరీదు సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగారు. డ్యాన్స్, ఫైటింగ్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు, డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ అంచెలంచలుగా ఎదిగి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అంతటి స్టార్డమ్ సాధించారు. నేటితరం యువ హీరోలకు, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని వంటి స్టార్స్‌కు చిరునే ఆదర్శం. ఇప్పటికీ ఆయన నటనలో, డ్యాన్స్‌లో ఎలాంటి మార్పు కనపడదు. ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోవచ్చేమో కానీ, నటనలో మాత్రం చిరు ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. పైగా ఏ సినిమా హిట్ అయినా, తన చిత్రం విజయం సాధించినట్లుగా మనస్ఫూర్తిగా అభినందిస్తుంటారు. కొత్త టాలెంట్‌ను, సరికొత్త కథా చిత్రాలను ఎంకరేజ్ చేస్తారు. ఇందుకు, ఇటీవల విడుదలైన విక్రమ్, మేజర్ చిత్రాలను ప్రశంసించడం, నాగ చైతన్య కీ రోల్ ప్లే చేసిన హిందీ చిత్రం 'లాల్ సింగ్ చద్దా'ను తెలుగులో సమర్పించడం, అలాగే బెస్ట్ యాక్టర్‌గా అవార్డు దక్కించుకున్న సూర్యను మెచ్చుకోవడం, మంచి నటుడిగా మారిన తన అభిమాని సత్యదేవ్‌ను పొగిడటమే కాకుండా అవకాశాలు అందించడం, అంతేందుకు ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం సినిమాల తర్వాతి రోజే అంటే ఆగస్టు 6న ఆ చిత్రాలను ప్రశంసలతో ముంచెత్తడం వంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. బింబిసార, సీతారామం చిత్రాలను 'ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటను, మరింత ఉత్సాహాన్నిచ్చాయి' అని కొనియాడుతూ తెలుగు సినిమా కోసం, అభివృద్ధి కోసం, ఇండస్ట్రీకి పెద్ద కొడుకుగా అహర్నిశలు కృషి చేస్తున్న చిరును.. తెలుగు సినీ ఇండస్ట్రీకి నిజమైన మెగాస్టార్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. Hearty Congratulations Team #SitaRamam & Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022 ఇక మెగాస్టార్ ట్యాగ్‌ను కల్యాణ్ రామ్‌కు జోడించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం, చిరుపై కామెంట్స్ చేయడం వంటివి పలువురి అత్యుత్సాహమని తెలుస్తోంది. ఎందుకంటే, సినిమా హిట్టయిన, ఫట్టయిన విభిన్న కథలతో ముందుకొస్తూ హీరోగా, నిర్మాతగా కల్యాణ్ రామ్ కష్టపడుతున్నారనేది వాస్తవమే. అలాంటప్పుడు.. ఒక ఉదాహరణగా తీసుకుంటే, కర్మ, క్షణం, గూఢచారి, మేజర్ వంటి ప్రయోగాత్మక చిత్రాలకు కథ అందిస్తూ, ఒక డిఫరెంట్ జోనర్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేష్‌కు కూడా మెగాస్టార్ ట్యాగ్ ఇవ్వొచ్చా? అనే ప్రశ్న ఎదురవుతుంది. సో.. ఎవరి స్టార్డమ్ వారిదే. ఎవరి కృషికైన గుర్తింపు ఉంటుంది. మెగాస్టార్, సూపర్ స్టార్ వంటి తదితర ట్యాగ్లు హీరోలపై అభిమానాన్ని వ్యక్తపరిచే విధంగా ఉండాలే తప్ప ఇంకొకరిని కించపరిచేలా ఉండకూడదు. Big congratulations to #Bimbisara team . Very interesting & an engaging fantasy film . Impactful presence by @NANDAMURIKALYAN garu . My respect for him for always bringing in new talent into the industry & attempting new kind of films. — Allu Arjun (@alluarjun) August 7, 2022 నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ కలిసి నటించి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత కూడా ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరం. ఈ 'ఆర్ఆర్ఆర్' చిత్రమే కాకుండా 1999లో రిలీజైన 'సుల్తాన్' మూవీలో బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించి తామంతా ఒక్కటే అని నిరూపించారు. హీరోల్లో సక్యత బాగానే ఉన్నా.. కొంతమంది మాత్రం ట్రోలింగ్లతో సమయాన్ని వృథా చేసుకోవడం బాధాకరమైన విషయమేగా మాస్టారు!. కాగా ఓటీటీలని, థియేటర్లకు ఎవరు రావట్లేదనే తదితర అంశాలతో సతమతమవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి బింబిసార, సీతారామం వంటి చిత్రాలు కొత్త ఉత్సాహాన్ని అందించాయి. ఇలాంటి తరుణంలో ట్యాగ్‌లను పక్కనపెట్టి సినీ పరిశ్రమ అంతా ఒకే కుటుంబమని భావిస్తే తెలుగు సినిమా ఖ్యాతి ఖండంతరాలు దాటే అవకాశముంది. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్)