Nandamuri Kalyan Ram Bimbisara Rap Song Out, Viral - Sakshi
Sakshi News home page

Nandamuri Kalyan Ram: బింబిసార ర్యాప్‌ సాంగ్‌ విన్నారా?

Published Tue, Aug 9 2022 6:03 PM

Nandamuri Kalyan Ram Bimbisara Rap Song Out - Sakshi

సరైన హిట్‌ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాడు నందమూరి కల్యాణ్‌ రామ్‌. ఇటీవలే వచ్చిన బింబిసారతో అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్‌ను రుచి చూశాడు. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ టైం ట్రావెల్‌ మూవీ ఆగస్టు 5న రిలీజైంది.

కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ మార్క్‌ అందుకున్న ఈ సినిమా నుంచి ర్యాప్‌ సాంగ్‌ రిలీజైంది. ఇందులో పాటతో పాటు పలు ముఖ్య సన్నివేశాలను సైతం చూపించారు. అంతేకాదు, కల్యాణ్‌ రామ్‌ చెప్పిన డైలాగులను సైతం ర్యాప్‌ సాంగ్‌లో పొందుపరచడం విశేషం. ఆదిత్య అయ్యంగార్‌, లిప్సిక, పృథ్వీచంద్ర పాడిన ర్యాప్‌ సాంగ్‌కు కీరవాణి సంగీతం అందించాడు.

చదవండి: పదునైన ఆయుధంతో సూసైడ్‌కు యత్నించిన నటుడు
డెంగ్యూను లెక్కచేయని కంగనా, నువ్వు నిజంగా ఇన్‌స్పిరేషన్‌..

Advertisement
 
Advertisement
 
Advertisement