Bimbisara Movie
-
విశ్వంభర డైరక్టర్ బీభత్సమైన ట్విస్ట్..
-
తిరిగొస్తున్న బింబిసారుడు, కాకపోతే కథలో చిన్న ట్వీస్ట్
-
బ్లాక్‌బస్టర్ మూవీకి ప్రీక్వెల్.. కల్యాణ్ రామ్ బర్త్ డేకు క్రేజీ అప్డేట్!
నందమూరి కల్యాణ్ రామ్- వశిష్ట డైరెక్షన్లో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం బింబిసార. గతేడాది థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కల్యాణ్ రామ్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని మేకర్స్ గతంలోనే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ కల్యాణ్ రామ్ బర్త్ డే కావడంతో దీనికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.బింబిసార చిత్రానికి ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీకి అనిల్ పాదూరి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. తాజాగా వర్కింగ్ టైటిల్ ఎన్కేఆర్-22 పేరుతో పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే బింబిసార మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇక కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్న మరోచిత్రం ‘NKR21’ ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ కొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 𝗚𝗲𝘁 𝗿𝗲𝗮𝗱𝘆 𝘁𝗼 𝘄𝗶𝘁𝗻𝗲𝘀𝘀 𝘁𝗵𝗲 𝗩𝗜𝗥𝗧𝗨𝗘 𝗼𝗳 𝗮 𝗟𝗘𝗚𝗘𝗡𝗗 𝘄𝗵𝗼 𝗿𝘂𝗹𝗲𝗱 𝗧𝗿𝗶𝗴𝗮𝗿𝘁𝗵𝗮𝗹𝗮 𝗮𝗴𝗲𝘀 𝗯𝗲𝗳𝗼𝗿𝗲 𝗕𝗜𝗠𝗕𝗜𝗦𝗔𝗥𝗔 👑#NKR22 - A PREQUEL to the blockbuster #Bimbisara ❤️🔥Happy Birthday, @NANDAMURIKALYAN ✨Exciting updates soon!… pic.twitter.com/yXEKzfVqRa— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2024 -
'నా జీవితమంతా సాహసాలే'.. ఆ సినిమా కోసం మరో డేరింగ్ చేస్తోన్న హీరోయిన్!
భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. ఆ తర్వాత బింబిసారతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతేడాది విరూపాక్ష, డెవిల్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా ధనుశ్ సరసన సార్ చిత్రంలోనూ మెరిసింది. వరుసగా అవకాశాలతో సూపర్ హిట్స్ కొడుతోంది. తాజాగా ఈ బింబిసార ఫేమ్ యంగ్ హీరో నిఖిల్ చిత్రంలో నటిస్తోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న స్వయంభు చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా సంయుక్త పోస్ట్ చేసిన ఓ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం. తాజాగా ఈ కేరళ భామ గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. అంతే కాకుండా సుదీర్ఘమైన సందేశం కూడా రాసుకొచ్చింది. ఈ ఏడాదిలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపింది. నా జీవితమంతా ఎల్లప్పుడూ సాహసాలతోనే కొనసాగుతోందని.. తాను ఎప్పటికీ కంఫర్ట్ జోన్లో ఉండేందుకు ఇష్టపడనని వెల్లడించింది. జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతానని తెలిపింది. నా నెక్ట్స్ మూవీ స్వయంభూ కోసమే ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నానని రాసుకొచ్చింది ముద్దుగుమ్మ. సంయుక్త ట్వీట్లో రాస్తూ.. 'ఈ ఏడాదిలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితం అంటే ఏంటో తెలుసుకుంటున్నా. నా జీవితమంతా సాహసాలతోనే నడుస్తోంది. కంఫర్ట్ జోన్లో ఉండిపోవడాన్ని ఇష్టపడను. నా కొత్త సినిమా స్వయంభు కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నా. ఇది నాకు కొత్త మానసిక అనుభూతిని కలిగిలిస్తోంది. ఇది నాకు లభించిన అదృష్టం కూడా. ఇది ఒక ఆధ్యాత్మిక, సుసంపన్నమైన ప్రయాణం. గుర్రంతో సామరస్యంగా ఉంటూ.. గుర్రం మనసును దగ్గర నుంచి పరిశీలించడం.. మేమంతా ఒక టీమ్‌గా కలిసి పని చేయడం చాలా అద్భుతంగా ఉంది. అలాగే నా జీవితంలో ఎదురైన ప్రతి ఓటమిని ఒక మెట్టుగా మలచుకుంటున్నా. అలాంటివేమీ నా జీవితంలో అడ్డంకి కాదు.' అంటూ పోస్ట్ చేసింది. 2024 embarked with a lot of learning about myself and about many things that makes life what it truly is. I have always been game for adventures in life. I never had a comfort zone because I always pushed myself to explore newer experiences 💫 As an actor, I am blessed to be… pic.twitter.com/lcW1nhNnY7 — Samyuktha (@iamsamyuktha_) February 10, 2024 -
'బింబిసార 2' నుంచి ఎందుకు తప్పుకున్నానంటే: వశిష్ట
వరుస పరాజయాలతో సతమతమవుతున్న కల్యాణ్ రామ్‌కు.. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది 'బింబిసార'. టైమ్ ట్రావెల్ అండ్ ఫాంటసీగా ఈ చిత్రాన్ని వశిష్ట తెరకెక్కించాడు. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఈ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద హిట్ కావడంతో మూవీకి సీక్వెల్ ప్లాన్ కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా పార్ట్-2 డైరెక్టర్‌గా వశిష్ట తప్పుకున్నాడు. దీంతో గతంలో పలు రకాలుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మెగాస్టార్‌తో విశ్వంభర చిత్రాన్ని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ఠ ఇదే విషయంపై ఎట్టకేలకు ఇలా క్లారిటీ ఇచ్చారు. 'రామ్ చరణ్‌తో నేను 'బాహుబలి' లాంటి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. గతంలో కూడా నేను ఎక్కడా మాట్లాడలేదు.. కానీ ప్రచారం మాత్రం జరిగింది. నేను మెగాస్టార్ చిరంజీవితో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' లాంటి ఫాంటసీ సినిమా చేయాలనుందని చెబితే.. రామ్ చరణ్‌తో వశిష్టి సినిమా తీస్తున్నాడని వార్తలు వచ్చాయి. నాకు ఫాంటసీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. 'బింబిసార' సీక్వెల్‌ను నేను డైరెక్ట్ చేయడం లేదు. పార్ట్-2 కథ విషయంలో నా ఆలోచన వేరుగా ఉంది. దాని గురించి చర్చిస్తున్న సమయంలో నాకు 'విశ్వంభర' ఆఫర్ వచ్చింది. ఇదే విషయాన్ని కల్యాణ్ రామ్‌తో చెప్పి ఆపై ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే 'బింబిసార 2' నుంచి బయటకు వచ్చాను. ఆపై మెగాస్టార్‌తో సినిమా ఓకే చేసుకున్నాను.' అని వశిష్ఠ తెలిపారు. చిరంజీవితో 'విశ్వంభర' చిత్రాన్ని భారీ బడ్జెత్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా కాన్సెప్ట్ వీడియోను ఆయన విడుదల చేశారు. దానికి భారీగా రెస్పాన్స్ వస్తుంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. -
బింబిసార 2 మూవీకి డైరెక్టర్ ఎవరు..?
-
కథను మలుపుతిప్పే రోల్స్.. పాపే ప్రాణంగా రానున్న సినిమాలు
కథను కీలక మలుపు తిప్పే ‘కీ’ రోల్స్ దాదాపు ప్రతి సినిమాలోనూ ఉంటాయి. ఈ కీ రోల్స్‌కి ఏజ్‌తో సంబంధం ఉండదు. చిన్నారులు కూడా కథలో పెద్ద మార్పుకు కారణం అవుతుంటారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘బింబిసార’ వంటి సినిమాల్లో చిన్ని పాపలు కథకు ప్రాణంగా నిలిచారు. ఇలా ‘పాపే ప్రాణం’ అంటూ సాగే కథలతో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సంరక్షకుడు? ‘పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజి’... వంటి సినిమాల్లో చిన్నారులతో చిరంజీవి చేసిన అల్లరి సన్నివేశాలు, అదే సమయంలో వారి ప్రాణ రక్షకుడుగా చేసిన సాహసాలు ప్రేక్షకులను అలరించాయి. మళ్లీ వెండితెరపై ఓ పాపకు సంరక్షకుడిగా ఉండే పాత్రలో చిరంజీవి నటించనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్‌ను బట్టి ఇది సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో ఓ పాప కీలక పాత్రలో నటించనుందని, ఈ పాప సంరక్షకుడిగా చిరంజీవి చేసే సాహసాలు అబ్బురపరచేలా ఉంటాయని టాక్. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... వశిష్ట దర్శకుడిగా పరిచయం అయిన ‘బింబిసార’ చిత్రంలో ఓ పాప సెంట్రల్ క్యారెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. హార్ట్ ఆఫ్ సైంధవ్ శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. ఇలా ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నా కూడా హీరో ‘సైంధవ్’ మనసులో తొలి స్థానం చిన్నారి సారాదే. సారా అంటే ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’ అన్నమాట. వెంకటేశ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ సైంధవ్ సినిమాకు ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సైంధవ్ హార్ట్ సారా అని చిత్ర యూనిట్ అంటోందంటే కథలో చిన్నారి సారా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని ఊహించవచ్చు. తమిళ నటుడు ఆర్య, హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు చేస్తున్న ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. హాయ్ నాన్న తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెలుగులో రూపొందుతున్న మరో చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ ఎమోషనల్ మూవీలో నాని హీరోగా నటిస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర కథ ఓ పాప పాత్ర చుట్టూ తిరుగుతుందని, ఈ క్రమంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’ డిసెంబరు 21న రిలీజ్ కానుంది. గరుడ సాహసాలు ‘గరుడ’ సినిమా పోస్టర్ చూశారుగా.. సత్యదేవ్ వీపుపై కూర్చున్న ఓ చిన్నారి ఎంత భయంగా చూస్తుందో కదా! పైగా అది అడవి ప్రాంతం. ఆ చిన్నారి భయాన్ని పోగొట్టి, తనను సురక్షితంగా గరుడ ఎలా రక్షించాడనేది వెండితెర పైనే చూడాలంటోంది యూనిట్. సత్యదేవ్ హీరోగా క్రాంతి బాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గరుడ’. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీగా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రం తొలి భాగం ‘గరుడ: చాప్టర్ 1’ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇలా చిన్నారులు కీలకంగా నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. వివరాలు ఇవే
భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా శంకర్ చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని తన తన తదుపరి సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. వరుస పరాజయల తర్వాత కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే.. కొత్త సినిమా ప్రకటన ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే, మెగాస్టార్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ లేదని, ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని ఈ ప్రకటనతో చిరంజీవి తెలిపారని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: ఆ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్‌తో పాటు ఆరుగురు వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్స్) ముందుగా అనుకొన్నట్టుగానే తన పుట్టిన రోజున నేడు (ఆగష్టు 22) కొత్త సినిమా ప్రకటన వచ్చేస్తోంది. దానిలో భాగంగానే కొన్నిగంటల క్రితం యూవీ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి చెయబోయే సినిమా ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా యూవీ క్రియేషన్స్ అధికారికంగా సోషల్‌మీడియాలో ఒక పోస్టర్‌తో గుడ్‌న్యూస్ తెలిపింది. నేడు 10:53 నిమిషాలకు మెగాస్టార్ మూవీకి చెందిన పలు వివరాలను ప్రకటిస్తామని వారు వెల్లడించారు. యూవీ క్రియేషన్స్-చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌తో బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మెగాఫోన్ పట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. (ఇదీ చదవండి: ఫైనల్‌గా వశిష్ఠకే దక్కిన మెగా 157 ప్రాజెక్ట్) The universe conspires for beautiful things to happen ✨ One man inspires us to achieve the universe itself 💫 Stay tuned to @UV_Creations ❤️ Today at 10.53 AM 🔮#HBDMegastarChiranjeevi pic.twitter.com/v7W9LCB8Ij — UV Creations (@UV_Creations) August 21, 2023 -
చిరు కొత్త సినిమా ప్రకటన.. సూపర్ హిట్ డైరెక్టర్‌కు ఛాన్స్
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈ శుక్రవారం (ఆగస్టు 11) రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోవచ్చు. అంతేకాకుండా చిత్ర నిర్మాతలకు భారీగా నష్టాలు రావడం ఖాయం అని తెలుస్తోంది. ముఖ్యంగా మెహర్ రమేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఔట్‌డేటెడ్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనిపై భారీగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. థియేటర్ల వద్దే ఆయనపై పలు వ్యాఖ్యలతో ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి తర్వాత సినిమాకు డైరెక్ట్ చేయాలంటే చాలా ఘట్స్ ఉండాల్సిందే. వాల్తేరు వీరయ్య మినహా వరసు ప్లాపులతో ఉన్న చిరుకు ఖచ్చితంగా భారీ హిట్ అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సమయంలో చిరంజీవి తర్వాత చేయనున్న ఓ సినిమాపై తాజాగా సమాచారం బయటికి వచ్చింది. తన 157వ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ జోనర్లో మెగాస్టార్ చేయనున్నారు. బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది. తాజాగా, ఈ మూవీ షూటింగ్ ప్రారంభం గురించి సమాచారం బయటికి వచ్చింది. ఎప్పుడు ప్రారంభం చిరంజీవి - డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లో ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ షూటింగ్ ఈ ఏడాది నవంబర్‌లో మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం డేట్లను కూడా మెగాస్టార్ కేటాయించారట. ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్లో మైలురాయి చిత్రంగా నిలిచిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' తరహాలోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ రీమేక్ సంగతేంటి..? ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా కంటే ముందు మలయాళ సినిమా 'బ్రో డాడీ' రీమేక్ మూవీని చిరంజీవి మొదలుపెడతారని తెలుస్తోంది. 'సోగ్గాడే చిన్ననాయన, బంగార్రాజు మూవీస్ ఫేమ్ కల్యాణ్ కృష్ణ ఈ మెగా156 చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇప్పుడు భోళా శంకర్ దెబ్బతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం కష్టమేనని సమచారం. ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్స్ వరసగా రీమేక్స్ సినిమాలే చేస్తుండటంతో సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు కూడా కొంతమేరకు అసహనానికి గురౌతున్నారు. దీంతో బ్రో డాడీని పక్కనబెట్టి... సోషియో ఫ్యాంటసీ సినిమాకే చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. గతంలో రజనీ,కమల్ వంటి వారికి కంటిన్వ్యూగా ప్లాప్‌లు వచ్చాయి. తర్వాత వారిద్దరికి జైలర్,విక్రమ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వారి స్టామినా ఎంటో చూపించాయి. ఇలాగే చిరుకు ఒక్క సినిమా పడితే చాలు టాలీవుడ్లో తన సత్తా ఎంటో చెబుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. -
మెగా ఆఫర్ రాగానే నందమూరి హీరోను పక్కన పెట్టిన డైరెక్టర్ వశిష్ట్
-
మెగాస్టార్‌తో బింబిసార డైరెక్టర్ ఫిల్మ్ ఫిక్స్
-
బిమ్బిసార సీక్వెల్ నుండి తప్పుకున్న వశిష్ఠ
-
ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు!
రాజుల కాలంలో అంతఃపురం ఎలా ఉండేది అంటే.. ఇలా ఉంటుందేమో అని సినిమాలు చూపించాయి. మరి.. స్వర్గలోకం ఎలా ఉంటుంది? అంటే.. ఈ లోకాన్ని కూడా ఊహించి, సినిమాల్లో చూపించారు. ఇప్పుడు కొన్ని సినిమాలు కొత్త ప్రపంచాలను చూపించనున్నాయి. ఊహాజనిత కథలతో సాగే ఈ చిత్రాల కోసం భారీ సెట్స్‌తో కొత్త లోకాలను సృష్టిస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. స్వర్గం నేపథ్యంలో... ముప్పై ఏళ్ల క్రితం చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలోని ఈ చిత్రంలో కొన్ని సీన్లు స్వర్గం నేపథ్యంలో ఉంటాయి. తాజాగా చిరంజీవి నటించనున్న ఓ సినిమా మళ్లీ ప్రేక్షకులను స్వర్గలోకంలోకి తీసుకెళ్లనుందని టాక్. గత ఏడాది కల్యాణ్ రామ్‌తో ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘బింబిసార’ తీసిన వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రం రూపొందనుందని టాక్. ‘బింబిసార’ తరహాలోనే ఫ్యాంటసీ జానర్లో ఉండే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఊహాజనిత స్వర్గం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందట. సాహసాల ధీర ‘ధీర’గా ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్లనున్నారట అఖిల్. ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్‌లో ఒకరైన అనిల్‌కుమార్ ఇటీవల అఖిల్‌కు ఓ కథ చెప్పారు. ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాకు ‘ధీర’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందని సమాచారం. నాలుగు పేజీల భైరవకోన ప్రేక్షకులను ‘భైరవకోన’కు తీసుకెళ్తామంటున్నారు సందీప్ కిషన్. ‘టైగర్’ (2015) చిత్రం తర్వాత హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. ‘శ్రీకృష్ణదేవరాయల కాలంలోని గరుడ పురాణానికి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి’, ‘గరుడ పురాణంలో మాయమైపోయిన ఈ నాలుగు పేజీలే భైరవకోన’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌లో వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర, రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. అంజనాద్రి వీరుడు ‘హను–మాన్’ చిత్రం కోసం ‘అంజనాద్రి’ అనే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమంతుని శక్తులు పొందిన ఓ యువకుడు ‘అంజనాద్రి’ రక్షణ కోసం ఎలాంటి పోరాటాలు, సాహసాలు చేశాడు అనే అంశాలతో ‘హను–మాన్’ సినిమా ఉంటుంది. తేజా సజ్జా, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే ‘అధీర’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో కూడా కాస్త ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. కె. నిరంజన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. -
బింబిసార 2 కి చిరంజీవి బ్రేక్!
-
టాలీవుడ్తోనే నా కెరీర్ మలుపు తిరిగింది: సంయుక్త
‘భీమ్లానాయక్’, ‘బింబిసార’ సినిమాలతో తెలుగు తెరపై మెరిసిన నటి సంయుక్త మీనన్. ఇటీవల ధనుష్‌కి జోడీగా ‘సార్’లో నటించింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 17న చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. టాలీవుడ్ అడుగు పెట్టాకే తన దశ తిరిగిందని అన్నారు. అందుకే ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది అమ్మడు. సంయుక్తా మీనన్ మాట్లాడుతూ – 'బింబిసార, విరూపాక్ష సినిమాలకి సంతకం చేశాకే భీమ్లానాయక్లో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం హైదరాబాద్‌కి వచ్చా. అప్పుడు నాకు తెలుగు అంతగా రాదు. కానీ ఓ రోజు సెట్లో నా గురించి ఏదో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. ఈ విషయంపై నిర్మాత నాగవంశీని అడిగితే... భీమ్లానాయక్ తర్వాత ధనుష్ మూవీ సార్లో కథానాయిక మీరేనని చెప్పారు. అదే రోజు దర్శకుడు వెంకీ అట్లూరిని కలిశా. అలా మొదలైన ప్రయాణం ఇక్కడిదాకా వచ్చింది. కల్యాణ్ రామ్ బింబిసార తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఒప్పుకున్నా. ఆ భీమ్లా నాయక్, ధనుష్ ‘సర్’ చిత్రాలు ఒకే రోజులోనే అంగీకరించా.' అని చెప్పుకొచ్చారు మలయాళ భామ. సినిమాల్లోకి ఎంట్రీపై సంయుక్త మాట్లాడుతూ.. 'సినిమాల్లోకి రావాలని ఏనాడూ అనుకోలేదు. అనుకోకుండా 2016లో నా జర్నీ స్టార్ట్ చేశా. చదువుకుంటున్న సమయంలోనే అనుకోకుండా వచ్చిన అవకాశంలో తొలి సినిమా చేశా. ఆ తర్వాత ఒక మంచి సినిమా చేసి ఆ తర్వాత మానేద్దామని మళ్లీ వచ్చా. కానీ ఆ తర్వాత నటనపై మక్కువ పెరిగింది. అయితే టాలీవుడ్లోకి వచ్చాకే నా దశ తిరిగింది. మొదట్లో ఇంగ్లిష్ మాట్లాడేదాన్ని. అందరూ ఇంగ్లిష్ అమ్మాయిలానే చూసేవాళ్లు. ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నందుకు తెలుగమ్మాయి అంటున్నారు. తెలుగు నేర్చుకునేందుకు ట్యూటర్ సాయం తీసుకున్నా.అలా తెలుగు వేగంగా నేర్చుకుంటున్నా.' అని అన్నారు. -
సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే
ప్రతి ఏడాది కొత్త దర్శకులు పరిచయం అవుతుంటారు. ఈ ఏడాది కూడా కొత్త డైరెక్టర్లు వచ్చారు. దాదాపు పదిహేనుకు పైగా కొత్త దర్శకులు వస్తే.. అందులో హిట్ బొమ్మ (సినిమా) ఇచ్చిన దర్శకులు ఎక్కువగానే ఉన్నారు. ఇలా హిట్ డైరెక్షన్‌తో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. డీజే సౌండ్ అదిరింది ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవానికి రెండు రోజుల ముందు వచ్చిన ‘డీజే టిల్లు’ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్ రోల్లో సిద్ధు జొన్నలగడ్డ నటించగా, నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రను నేహా శెట్టి చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోని ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్, ‘పటాస్ పిల్ల’ పాటలు శ్రోతలను ఊర్రూతలూగించాయి. ఈ డీజే హిట్ సౌండ్ ఇచ్చిన కిక్‌తో సీక్వెల్‌గా ‘డీజేటిల్లు స్వై్కర్’ను తీస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పసందైన కళ్యాణం ‘రాజావారు రాణిగారు, అద్భుతం’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా చేసిన విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విశ్వక్ సేన్‌కు ఈ సినిమాతో క్లాస్ ఇమేజ్ తెప్పించారు విద్యాసాగర్. ఇందులో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. ‘రాజావారు రాణిగారు’ చిత్రానికి దర్శకత్వం వహించిన రవికిరణ్ కోల ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే ఇచ్చి షో రన్నర్‌గా వ్యవహరించారు. భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ ‘అర్జున కళ్యాణం’ మే 6న విడుదలై, ప్రేక్షకులకు పసందైన అనుభూతినిచ్చింది. కలెక్షన్ కింగ్ కల్యాణ్‌రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘బింబిసార’. ఈ హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు వశిష్ఠ. రాజుల కాలం, ప్రస్తుత కాలం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టి కలెక్షన్ కింగ్ అనిపించుకుంది. ఇక ‘బింబిసార– 2’ కూడా ఉండొచ్చనే హింట్ ఇచ్చారు వశిష్ఠ. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా కె. హరికృష్ణ నిర్మించిన ‘బింబిసార’ ఈ ఏడాది ఆగస్టు 5న విడుదలైంది. డబుల్ ధమాకా తెలుగు, తమిళ ప్రేక్షకుల మెప్పును ఒకే సినిమాతో పొందిన డబుల్ ధమాకా శ్రీకార్తీక్ దక్కింది. శర్వానంద్ హీరోగా అక్కినేని అమల, ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకుడు. సెప్టెంబరు 9న ఈ సినిమా విడుదలైంది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌కు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మిళితం చేసి ప్రేక్షకులను అలరించారు శ్రీకార్తీక్. మంచి ముత్యం సరోగసీ కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందారు దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ. ‘సదా నీ ప్రేమలో..’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ తర్వాత లక్ష్మణ్ దర్శకత్వంలో వచ్చిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘స్వాతి ముత్యం’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అయితే హీరో బెల్లంకొండ గణేష్‌కు కూడా ఇది తొలి చిత్రమే. వీరిద్దరూ మంచి ముత్యంలాంటి సినిమా ఇచ్చి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్కడ హిట్.. ఇక్కడా హిట్టే... ‘ఓ మై కడవులే’ (2020)తో తమిళ పరిశ్రమకు దర్శకునిగా పరిచయమయ్యారు అశ్వత్ మారిముత్తు. ఇదే సినిమా రీమేక్ ‘ఓరి.. దేవుడా’తోనే తెలుగులోనూ దర్శకునిగా పరిచయం అయ్యారు అశ్వత్. ‘ఓరి.. దేవుడా..’ కూడా ఓ మాదిరి హిట్‌గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. అక్టోబరు 21న విడుదలైన ఈ చిత్రానికి ‘దిల్’ రాజు, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మాతలు. థ్రిల్లింగ్ హిట్ ‘అంబులి’ సినిమాతో తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు దర్శక–ద్వయం హరి శంకర్–హరీష్ నారాయణ్. ఈ ఇద్దరూ తెరకెక్కించిన ‘యశోద’ గత నెల రిలీజై, హిట్ టాక్ తెచ్చుకుంది. సమంత టైటిల్ రోల్లో, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో తెలుగుకు దర్శకులుగా పరిచయం అయ్యారు హరి–హరీష్. సరోగసీ నేపథ్యంలో జరిగే క్రైమ్స్ నేపథ్యంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 11న విడుదలై, థ్రిల్లింగ్ హిట్ ఇచ్చింది. హిట్ హారర్ ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల జాబితాలో ‘మసూద’ ఉంది. సూపర్ నేచురల్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకి సాయికిరణ్ దర్శకుడు. సంగీత, తీరువీర్, కావ్య కళ్యాణ్‌రామ్, ‘శుభలేఖ’ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం నవంబరు 18న విడుదలైంది. ఇంకొందరు... రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో శరత్ మండవ (తెలుగులో శరత్‌కు తొలి చిత్రం) వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా ‘గని’తో కిరణ్ కొర్రపాటి, నితిన్ పొలిటికల్ డ్రామా ‘మాచర్ల నియోజకవర్గం’ తో ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి, శ్రీ విష్ణు ‘అల్లూరి’ తో ప్రదీప్వర్మ, ‘టెన్త్‌క్లాస్ డైరీస్’తో సినిమాటోగ్రాఫర్ అంజి, సుమ కనకాల ‘జయమ్మ పంచాయితీ’ తో విజయ్‌కుమార్ కలివరపు, హర్ష్ కనుమిల్లి ‘సెహరి’తో జ్ఞానశేఖర్ ద్వారక, రాజ్‌తరుణ్ ‘స్టాండప్ రాహుల్’తో శాంటో, వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా..’తో గిరీశాయ (తెలుగులో...), ‘ముఖచిత్రం’ సినిమాతో గంగాధర్ వంటి దర్శకులు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేశారు. -
ఆసక్తిగా కల్యాణ్ రామ్ మూవీ టైటిల్.. సోషల్ మీడియాలో వైరల్
బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి హీరో కల్యాణ్ రామ్. చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న కల్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌కు ఆయన ఇప్పటికే ఒకే చెప్పారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. (చదవండి: బింబిసార సక్సెస్.. ఫ్యాన్స్‌కు డైరెక్టర్ మరో సర్ప్రైజ్..!) రాజేంద్రా రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'అమిగోస్' అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. బింబిసార తర్వాత కల్యాణ్ రామ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో కల్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన తన ట్విటర్లో రాస్తూ..' ఊహించని వాటిని ఆశించండి' అంటూ పోస్ట్ చేశారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. బింబిసార హిట్ తర్వాత మరో వైవిధ్యమైన సినిమాతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. టాలీవుడ్లో భారీ చిత్రాలను నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తుండటం మరో విశేషం. కళ్యాణ్ రామ్ 19వ చిత్రంగా ఇది నిలవనుంది. ఈ సినిమా ద్వారా రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. సోషల్ మీడియా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే టైటిల్ అమిగోస్ టాలీవుడ్ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అమిగోస్ అనే పేరు కాస్త వైరైటీగా అనిపించడంతో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అమిగోస్ పదానికి స్పానిష్‌లో స్నేహితుడు అని అర్థం వస్తుందట. ఇవాళ రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు కల్యాణ్ రామ్‌లు కనిపిస్తున్నారు. ముగ్గురు కూడా మూడు డిఫరెంట్ లుక్స్‌లో ఉన్నారు. ఈ పోస్టర్ ద్వారా కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే ట్విటర్లో ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘మీలాగే కనిపించే వారిని మీరు కలిసినప్పుడు, మీరు చనిపోతారని వారు అంటున్నారు’ అంటూ రాసుకొచ్చారు. సినిమా టైటిల్, కల్యాణ్ రామ్ లుక్స్ చూస్తుంటే మరో వైవిధ్యమైన కథతో నందమూరి హీరో వస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. Hola #Amigos ❤️🔥 Expect the unexpected! See you in cinemas from Feb 10, 2023 🔥#RajendraReddy @AshikaRanganath @GhibranOfficial @MythriOfficial pic.twitter.com/1S2gdnUHeg — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 7, 2022 -
బింబిసార సక్సెస్.. ఫ్యాన్స్‌కు డైరెక్టర్ మరో సర్ప్రైజ్..!
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'బింబిసార'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. టాలీవుడ్ ప్రేక్షకులకు థియేటర్లలో వినోదాన్ని పంచింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. బింబిసారుడు అనే ఓ రాజు జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ డ్రామాగా డైరెక్టర్ వశిష్ఠ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీతోనే దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అభిమానులు ఊహించినట్లుగానే ఈ చిత్రానికి సీక్వెల్ బింబిసార-2 ఉంటుందని వెల్లడించారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. వశిష్ఠ మాట్లాడుతూ.. 'సోషియో ఫాంటసీ సినిమాగా వచ్చిన బింబిసారను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ప్రస్తుతం వారంతా ఈ సినిమా సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. కల్యాణ్ రామ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బింబిసార-2 షూటింగ్ ప్రారంభిస్తాం' అని అన్నారు. కాగా.. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాలో నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు. -
ఓటీటీకి వచ్చేసిన బింబిసార, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార. రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడు కల్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం గత ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. కలెక్షన్స్ పరంగా కూడా పైసా వసూళ్ అనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో అక్టోబర్21 (శుక్రవారం) అర్ధరాత్రి నుంచే బింబిసార స్ట్రీమింగ్ అవుతోంది. కాగా బింబిసారుడు అనే ఓ రాజు జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ డ్రామాగా డైరెక్టర్ వశిష్ఠ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీతోనే ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించగా.. శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించారు. Get ready to fall back into the time of #Bimbisara and his Trigartala, streaming from MIDNIGHT TODAY! #BimbisaraonZEE5 @DirVassishta@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial @zee5telugu @ZEE5Tamil @ZEE5Kannada @zee5keralam pic.twitter.com/q9KrE2yjC2 — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) October 20, 2022 -
అఫీషియల్: 'బింబిసార' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కె. హరికృష్ణ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతోంది. బింబిసార ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా అక్టోబరు 21 నుంచి తెలుగు, కన్నడతో పాటు తమిళం, మలయాళంలో ఒకేసారి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. కాగా ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. Bimbisaaaraa!! Echoing all over south India - Coming to you in 4 languages Enjoy #Bimbisara in Telugu, Kannada, Tamil & Malayalam Meet #BimbisaraOnOctober21#BimbisaraonZEE5@NANDAMURIKALYAN @DirVassishta@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial — ZEE5 Telugu (@ZEE5Telugu) October 15, 2022 -
దీపావళికి ఓటీటీలో ‘బింబిసార’ మూవీ, రిలీజ్ డేట్ ఇదే!
దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం ‘బింబిసార’. రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడు కల్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. ఇక బాక్సాఫీస్ వద్ద బింబిసార మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్‌ని ఖాతాలో వేసుకుంది. థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయిన ఈచిత్రం ఇప్పుడు ఈమూవీ ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీని జీ5 సంస్థ ఓటీటీకి తీసుకువస్తోంది. అక్టోబర్ 21న ఈ మూవీని ఓటీటీలో కానుంది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన కూడా వచ్చేసింది. కాగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడు. డ్యుయెల్ రోల్ చేసిన కల్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. -
ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైన ‘బింబిసార’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం బింబిసార.రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. ఇక బాక్సాఫీస్ వద్ద బింబిసార మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్ ని ఖాతాలో వేసుకుంది. చదవండి: Srihari Wife Shanthi: ‘డబ్బులు ఇవ్వకుండా వారు మోసం చేశారు’ ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడు. డ్యుయెల్ రోల్ చేసిన కల్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇక థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమైంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ ఫ్యాన్సీ ధర సొంతం చేసుకుంది. దీంతో దసరాకు బింబిసార మూవీని జీ5లో అందుబాటులోకి తెచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చదవండి: మహిళా యాంకర్ పట్ల అసభ్య ప్రవర్తన, హీరో అరెస్ట్ దసరా కానుకగా ప్రేక్షకులకు మరింత వినోదం అందించేందుకు అక్టోబర్ 7వ తేదీన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై జీ5 నిర్వహకులు అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. -
ఆ రెండు సినిమాలతో క్రేజ్.. కేరళ భామకు వరుస ఆఫర్లు..!
భీమ్లా నాయక్, బింబిసార చిత్రాలతో క్రేజ్ సంపాందించుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. ఈ భామ కోసం టాలీవుడ్లో వరుస ఆపర్లు క్యూ కడుతున్నాయి. ఈ కేరళ కుట్టి మలయాళం, తమిళం, కన్నడలోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో సక్సెస్ అందుకుంది. సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన బింబిసార బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌లో రానాకు జోడిగా నటించింది ఈ అమ్మడు. (చదవండి: ‘భీమ్లా నాయక్’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్ క్లారిటీ) ‘బింబిసార’ నందమూరి కల్యాణ్‌రామ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. ఈ భామకు హిట్ టాక్ సెంటిమెంట్ కలిసి రావడంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. తెలుగులో మొదట కల్యాణ్ రామ్ బింబిసారలో ఛాన్స్ రాగా.. ఆ సినిమా ఆలస్యం కావడంతో ‘భీమ్లా నాయక్’తో ఎంట్రీ ఇచ్చింది. 2016లో మలయాళం మూవీ ‘పాప్ కార్న్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో అంజనా పాత్రకు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘కలరి’ మూవీతో అభిమానులను పలకరించింది. ఈ సినిమా తర్వాత మలయాళంలో ‘లిల్లీ’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. -
ఆ రెండు సినిమాల ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్.. స్పందించిన జీ5..!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగష్టులో విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని అప్డేట్ల కోసం వెతుకున్నారు. అయితే ‘కార్తికేయ2’ను సైతం దసరా కానుకగా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అక్టోబరు మొదటివారం స్ట్రీమింగ్కు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిన్న చిత్రంగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించింది. రూ.100 కోట్ల క్లబ్‌ను దాటేసింది. (చదవండి: మల్టీప్లెక్స్‌ల్లో 75 రూపాయలకే సినిమా హ్యపీగా చూసేయండి..) ఇక ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం సాధించిన మరో చిత్రం 'బింబిసార'. ఈ చిత్రం కల్యాణ్‌రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కోసం ఓటీటీలో ఎప్పుడోస్తుందా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల విడుదలపై జీ5 స్పందించింది. ‘మీ ఉత్సాహానికి సంతోషంగా ఉంది. దయచేసి వేచి ఉండండి. మరిన్ని వివరాలకు మా సోషల్‌మీడియా ఖాతాలను అనుసరించండి’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న ప్రచారం చూస్తే కల్యాణ్‌రామ్ ‘బింబిసార’ సెప్టెంబర్ 23న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
అదరగొడుతున్న బేతంచెర్ల చిన్నారి.. బింబిసారలో శార్వరిగా
సాక్షి, బేతంచెర్ల (కర్నూలు): చిన్న వయస్సులోనే బుల్లి తెరతోపాటు వెండి తెరపై రాణిస్తూ ప్రతిభ చాటుకుంటోంది బేతంచెర్లకు చెందిన శ్రీదేవి. సీరియల్స్, సినిమాల్లో చక్కన నటన అభినయంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 10 సినిమాలు, 15 టీవీ సీరియల్స్‌లో నటించి మెప్పించింది. బుడిబుడి నడకలు, తడబడుతున్న మాటల వయస్సులో తన ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధులు చేస్తోంది. ఈటీవీలో ప్రారంభమైన యమలీల తరువాత సీరియల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న చిన్నారి బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీహరి గౌడ్, లక్ష్మి దంపతుల కుమార్తె కావడం గమనార్హం. శ్రీదేవి తండ్రి శ్రీహరి గౌడ్ కొంత కాలం క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ చిత్ర పరిశ్రమలో స్థిరపడి కంజుల ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్‌గా పనిచేస్తున్నాడు. పలు సినిమాల్లో ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు వారిలో పెద్ద కుమార్తె శ్రీదేవి. ఈ చిన్నారి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. నటించే అవకాశం ఇలా.. శ్రీహరి గౌడ్ 18 సంవత్సరాలుగా సినీరంగంలో ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. జీ తెలుగు వారు పున్నాగ టీవీ సిరియల్స్ తీస్తున్న నేపథ్యంలో చిన్నారి పాత్ర అవసరం ఉండటంతో తన కూతురు శ్రీదేవిని వారికి పరిచయం చేశాడు. మొదట పున్నాగ సిరియల్స్‌లో కథానాయకుల కుమార్తెగా, కథనాయికల కుమార్తెగా నటించే అవకాశం దక్కింది. కెమెరా ముందు ఎలాంటి బెరుకు, తడబాటు లేకుండా ఆయా సన్నివేశాల్లో చక్కగా నటించడంతో అవకాశాలు వరుసకట్టాయి. ఆ సీరియల్లో నటిస్తుండగానే ప్రేమ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, ముద్దమందారం, కళ్యాణ వైభోగం ఇలా 15 టీవీ సీరియల్స్‌లో నటించే ఆఫర్స్ వచ్చాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శ్రీదేవి బాలనటిగా రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న సరికొత్త ధారావాహిక యమలీల, ఆ తరువాత బాలనటిగా పలు పాత్రలను పోషిస్తోంది. సీరియల్స్‌లోనే కాకుండా సీని రంగంలోనూ నటన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. మొదట ఆర్డీఎక్స్ లవ్ చిత్రంలో బాలనటిగా నటించింది. కథనాయిక పాయల్ రాజ్‌పుత్ చిన్నప్పటి పాత్రలో శ్రీదేవి నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత సూపర్‌మచ్చి సినిమాలో రాజేంద్రప్రసాద్ కుమార్తెగా రాణించింది. అడవి శేషు నటించిన మేజర్, రవితేజ నటించిన రామారావు అన్‌డ్యూటీ చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాలో శార్వరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా చిత్రాల్లో బాలనటిగా రాణిస్తూ సినీరంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోది. మరికొన్నింట్లో అవకాశం శ్రీదేవి నటన, అభినయానికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటివరకు నటించిన సినిమాలు, సీరియల్స్ కాకుండా మరికొన్నింటిలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో శ్రీదేవి నటించనున్నట్లు తండ్రి శ్రీహరి గౌడ్ తెలిపారు. సినిమా రంగంతో పాటు టీవీ ప్రకటనల్లోనూ నటిస్తూ బేతంచెర్ల కీర్తి ప్రతిష్ఠలు చాటుతోంది.