బ్లాక్‌బస్టర్‌ మూవీకి ప్రీక్వెల్‌.. కల్యాణ్‌ రామ్ బర్త్‌ డేకు క్రేజీ అ‍ప్‌డేట్‌! | Nandamuri Kalyan Ram Block Buster Movie Bimbisara Prequel Update | Sakshi
Sakshi News home page

Nandamuri Kalyan Ram: బ్లాక్‌బస్టర్‌ మూవీకి ప్రీక్వెల్‌.. డైరెక్టర్‌గా ఎవరంటే?

Published Fri, Jul 5 2024 2:52 PM | Last Updated on Fri, Jul 5 2024 4:41 PM

Nandamuri Kalyan Ram Block Buster Movie Bimbisara Prequel Update

నందమూరి కల్యాణ్‌ రామ్‌- వశిష్ట డైరెక్షన్‌లో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం బింబిసార. గతేడాది థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా రికార్డ్‌ సృష్టించింది. అయితే ఈ సినిమాకు పార్ట్‌-2 కూడా ఉంటుందని మేకర్స్‌ గతంలోనే హింట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ కల్యాణ్ రామ్‌ బర్త్‌ డే కావడంతో దీనికి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌.

బింబిసార చిత్రానికి ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీకి అనిల్ పాదూరి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. తాజాగా వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌కేఆర్‌-22 పేరుతో పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే బింబిసార మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇక కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్న మరోచిత్రం ‘NKR21’ ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ కొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement