Nandamuri Kalyan Ram
-
#NTRNeel : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
వెయ్యి మందితో ఫైట్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్కేఆర్ 21’ (వర్కింగ్ టైటిల్) క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి, సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్లో ముప్పై రోజులపాటు క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించారు. ‘‘క్లైమాక్స్ కోసం బ్రహ్మ కడలి అద్భుతమైన సెట్స్‌ని రూపొందించారు. పతాక సన్నివేశాల షూట్లో ప్రముఖ తారాగణంతోపాటు దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులుపాల్గొన్నారు. ఈ క్లైమాక్స్‌కే రూ. 8 కోట్లు ఖర్చు చేశాం. రామకృష్ణ యాక్షన్ కొరియోగ్రఫీని పర్యవేక్షించారు’’ అని యూనిట్ పేర్కొంది. -
తిరిగొస్తున్న బింబిసారుడు, కాకపోతే కథలో చిన్న ట్వీస్ట్
-
బ్లాక్‌బస్టర్ మూవీకి ప్రీక్వెల్.. కల్యాణ్ రామ్ బర్త్ డేకు క్రేజీ అప్డేట్!
నందమూరి కల్యాణ్ రామ్- వశిష్ట డైరెక్షన్లో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం బింబిసార. గతేడాది థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కల్యాణ్ రామ్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని మేకర్స్ గతంలోనే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ కల్యాణ్ రామ్ బర్త్ డే కావడంతో దీనికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.బింబిసార చిత్రానికి ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీకి అనిల్ పాదూరి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. తాజాగా వర్కింగ్ టైటిల్ ఎన్కేఆర్-22 పేరుతో పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే బింబిసార మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇక కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్న మరోచిత్రం ‘NKR21’ ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ కొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 𝗚𝗲𝘁 𝗿𝗲𝗮𝗱𝘆 𝘁𝗼 𝘄𝗶𝘁𝗻𝗲𝘀𝘀 𝘁𝗵𝗲 𝗩𝗜𝗥𝗧𝗨𝗘 𝗼𝗳 𝗮 𝗟𝗘𝗚𝗘𝗡𝗗 𝘄𝗵𝗼 𝗿𝘂𝗹𝗲𝗱 𝗧𝗿𝗶𝗴𝗮𝗿𝘁𝗵𝗮𝗹𝗮 𝗮𝗴𝗲𝘀 𝗯𝗲𝗳𝗼𝗿𝗲 𝗕𝗜𝗠𝗕𝗜𝗦𝗔𝗥𝗔 👑#NKR22 - A PREQUEL to the blockbuster #Bimbisara ❤️🔥Happy Birthday, @NANDAMURIKALYAN ✨Exciting updates soon!… pic.twitter.com/yXEKzfVqRa— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2024 -
నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
34 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పాత్రలో విజయశాంతి
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు చెప్పగానే ఒకప్పుడు ఆమె చేసిన పోలీస్ పాత్రలే గుర్తొస్తాయి. 1990లో 'కర్తవ్యం' సినిమాలో వైజయంతీ ఐపీఎస్ పాత్రలో అదరగొట్టేసింది. దీని తర్వాత పలు సినిమాల్లో ఇదే తరహా రోల్స్ చేసినప్పటికీ అవేవి అంత పేరు తీసుకురాలేకపోయాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వైజయంతీ ఐపీఎస్ రోల్లో విజయశాంతి కనిపించబోతున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?)'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని కల్యాణ్ రామ్ కొత్త మూవీలో చేస్తున్నారు. ఇందులోనూ వైజయంతీ ఐపీఎస్ అనే పాత్ర చేస్తున్నారు. పోలీస్ బ్యాక్ డ్రాప్‌తో తీస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా విజయశాంతి పుట్టినరోజు కానుకగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.విజయశాంతి వయసు పెరిగినట్లు కాస్త కనిపిస్తున్నప్పటికీ.. డైనమిక్ లుక్ మాత్రం బాగుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. మరి విజయశాంతికి రీఎంట్రీలో ఈ పోలీస్ పాత్ర సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
టైటిల్ దాచి కొత్త సినిమా ఆప్డేట్ ఇచ్చిన కల్యాణ్ రామ్
సరిలేరు నీకెవ్వరు తర్వాత సీనియర్ హీరోయిన్ విజయశాంతి మరోసారి తెరపై కనిపించలేదు. ఆ సినిమా తర్వాత పలువురు దర్శకులు తమ సినిమాల్లో నటించమని కోరినా..విజయశాంతి ఒప్పుకోలేదు. అంతేకాదు మళ్లీ తెరపై కనించబోదనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఈ సీనియర్ నటి మరోసారి తెరపై తన నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నేడు ఎన్టీఆర్ జయంతి(మే 28). ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ తన కొత్త సినిమా అప్డేట్ ఇస్తూ ఓ చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. టైటిల్‌తో పాటు కల్యాణ్ రామ్ గెటప్‌ని రివీల్ చేయకుండా ఈ గ్లింప్స్‌ని కట్ చేశారు. అయితే ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అనే క్యాప్షన్ ఇచ్చి ఇదొక మాస్ యాక్షన్ సినిమా అని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విలన్‌గా సోహైల్ ఖాన్ నటించగా.. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కల్యాణ్ రామ్‌కు తల్లిగా నటించబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. -
తాత వర్థంతికి సిసలైన మనవడు ఎన్టీఆర్ నివాళి.. బాలయ్య సీరియస్ (ఫొటోలు)
-
Devil Success Celebrations: కల్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఈ సినిమా నా బిడ్డలాంటిది..ఆ విషయంలో మాత్రమే బాధపడ్డా: డెవిల్ డైరెక్టర్
నందమూరి హీరో కల్యాణ్ రామ్ డెవిల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మించగా.. శ్రీకాంత్ విస్సా కథను అందించారు. అయితే ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ నవీన్ తప్పుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో దర్శక-నిర్మాతగా అభిషేక్ నామా పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ వివాదంపై నవీన్ మేడారం స్పందించారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించినప్పటికీ తనకు క్రెడిట్ దక్కలేదంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. నవీన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'డెవిల్ చిత్రం కోసం దాదాపు మూడేళ్లు శ్రమించా. స్క్రిప్ట్‌తో సహా సినిమాలోని ప్రతి అంశాన్ని నా ఆలోచనకు అనుగుణంగా తెరకెక్కించా. ఈ సినిమాను హైదరాబాద్, వైజాగ్, కారైకుడిలో షూట్ చేశాం. చిన్న చిన్న సన్నివేశాలతో సహా దాదాపు 105 రోజులు కష్టపడ్డాం. నేను అనుకున్న విధంగా ఈ చిత్రం తెరకెక్కించా. నాకు కేవలం ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఈ సినిమా నా బిడ్డలాంటిది. ఎవరు ఎన్ని చెప్పినా డెవిల్ నా సినిమానే.' అని రాసుకొచ్చారు. ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను మౌనంగా ఉన్నా. కానీ నా మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెడుతున్నా. అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే ఈ వివాదం మొదలైంది. ఈ వివాదంలో చిత్రబృందానికి సంబంధించిన ఏ వ్యక్తిపైనా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. దర్శకుడిగా నాకు క్రెడిట్ ఇవ్వలేదనే బాధపడుతున్నా. నా టాలెంట్‌పై నాకు నమ్మకం ఉంది. నా కెరీర్లో మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నా.' అని పోస్ట్ చేశారు. కల్యాణ్‌రామ్ ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారని.. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీ తప్పకుండా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నా. డిసెంబర్ 29న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరుకుంటున్నా. మరో కొత్త చిత్రానికి సంతకం చేశా. ఆసక్తికరమైన స్క్రిప్ట్ కోసం పనిచేస్తున్నా. త్వరలోనే వెల్లడిస్తానని నవీన్ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Naveen Medaram (@naveen_medaram) -
రాములమ్మ రీ ఎంట్రీ.. ఆ హీరో సినిమాతోనే!
రాజకీయాలతో బిజీగా ఉన్న రాములమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల గుడ్ బై చెప్పి పాలిటిక్స్‌లో వెళ్లి విజయశాంతి మళ్లీ పెద్దగా కనిపించలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి ప్రచారం చేశారు. గతంలో బీజేపీలో ఉన్న ఆమె బయట ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అయితే మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు రాములమ్మ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. విజయశాంతి తన ట్వీట్లో రాస్తూ..' నన్ను తమ ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెన్నంటి ఉంటూనే ఉన్న నా అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో మీ కోసం.... నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం నేను మళ్లీ ఒక సినిమా చేస్తున్నాను కావచ్చు.. 5 దశాబ్ధాల ఈ నా సినీ ప్రయాణంలో మీ దీవెనలు ఎప్పటికీ ఉంటాయి. 1979 నుంచి నేటి వరకు ఉన్నట్లు.. మీ విజయశాంతి కళాకారిణిగా ఉన్నంతవరకు ఎప్పటికీ అట్లనే ఉంటాయని విశ్వసిస్తున్నా' అంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా నందమూరి కల్యాణ్ రామ్, దర్శకుడు ప్రదీప్ చిలుకూరికి అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. దీంతో విజయశాంతిని వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. విజయశాంతి చివరిసారిగా 2020లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన చిత్రం సరిలేరు నీకెవ్వరులో కనిపించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు, రష్మికా మందన్న, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. నన్ను తమ ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెన్నంటి ఉంటూనే ఉన్న నా అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో మీ కోసం..... నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం, మల్ల ఒక సినిమా చేస్తున్నాను కావచ్చు... 5 దశాబ్ధాల ఈ నా సినీ గమనంలో మీ దీవెనలు ఎన్నటికీ , 1979 నుండి నేటి వరకు… pic.twitter.com/NriNNvgMgO — VIJAYASHANTHI (@vijayashanthi_m) December 6, 2023 -
రాజకీయ నాయకురాలు మణి మేకల
మణి మేకల పవర్ఫుల్ రాజకీయ నాయకురాలు. ఆమె ప్రసంగాలు ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తాయి. మరి.. ఆ రాజకీయ నాయకురాలికి, బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌కి ఉన్న లింక్ ఏంటి? అనేది ‘డెవిల్’ చిత్రంలో చూడాల్సిందే. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్నారు. పొలిటీషియన్ మణి మేకల పాత్రను మాళవికా నాయర్ పోషిస్తున్నారు. ఆదివారం మాళవిక లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. నవంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘డెవిల్’ రిలీజ్ కానుంది. దేవాన్‡్ష నామా సమర్పణలో స్వీయ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: సౌందర్ రాజన్. -
కల్యాణ్‌రామ్ 'డెవిల్'.. ఆ సీన్ల కోసం భారీ సెట్స్!
అమిగోస్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం డెవిల్. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: బాలీవుడ్లో ఆ సత్తా ఎవరికీ లేదు.. సౌత్‌లో అతనొక్కడే: ఎన్టీఆర్‌పై గదర్ డైరెక్టర్) ఈ మూవీ షూటింగ్ కోసం భారీ సెట్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 1940 కాలం స్టోరీ కావడంతో అందుకు తగినట్లుగానే షూటింగ్ సెట్‌ను రూపొందించారు. ఆ కాలం నాటి పరిస్థితులు కళ్లముందు కనిపించేలా డిజైన్ చేశారు. బ్రిటీష్ కాలంలో సెట్స్ వేయటం తనకెంతో ఛాలెంజింగ్‌గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు. మన దేశం ఉన్నసయమానికి చెందిన తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్ కోసం కావాల్సిన సామాగ్రిని ప్రత్యేకంగా తెప్పించారు. ఈ సెట్స్ చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతమందిస్తున్నారు.ఈ సినిమాను నవంబరు 24న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. 'డెవిల్' మూవీ కోసం వేసిన సెట్స్ .. వాటి విశేషాలు... * 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్ * బ్రిటీష్ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్ సైకిల్స్, 1 వింటేజ్ కారు * బ్రిటీష్ కవర్ డిజైన్ తో ఉన్న 500 పుస్తకాలు * 1940 కాలానికి చెందిన కార్గో షిప్ * 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్ (వైజాగ్ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో) అయితే ఈసెట్స్ వేయడానికి మొత్తం 9 ట్రక్కుల కలపను తెప్పించారు. వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్‌ను ఉపయోగించారు. -
NKR21:కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ!
కొత్త సినిమా కబురు చెప్పారు హీరో కల్యాణ్‌రామ్. ఆయన హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ రూపొందనుంది. జూలై 5న (బుధవారం) కల్యాణ్‌రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. (కల్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్.. డైరెక్టర్ పేరు లేకుండానే! కల్యాణ్ రామ్ కెరీర్లో ఇది 21వ సినిమా. కాబట్టి #NKR21 పేరుతో సినిమాను అనౌన్స్ చేస్తూ పోస్టర్ని విడుదల చేశారు. పోస్టర్లో రక్తంతో తడిసిన కళ్యాణ్ రామ్ చేతిని చూడవచ్చు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నారట. ‘‘కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా ఇది. అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. The FIST of FURY 🔥👊🔥@NANDAMURIKALYAN in an action-packed powerful role ❤️🔥#NKR21 shoot begins soon 🔥#HappyBirthdayNKR @PradeepChalre10 #AshokaMuppa @SunilBalusu1981 @harie512 @AshokaCOfficial pic.twitter.com/qb9S2TwCee — NTR Arts (@NTRArtsOfficial) July 5, 2023 -
కల్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్ రిలీజ్.. కానీ డైరెక్టర్ మిస్సింగ్!
నందమూరి కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. జూన్ 05న నందమూరి కల్యాణ్ రామ్ బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: అటు మాజీభార్య ఇటు ప్రేయసి.. మధ్యలో ఆమిర్‌ఖాన్!) అయితే బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన కల్యాణ్ రామ్‌కు.. అమిగోస్ రూపంలో డిజాస్టర్ ఎదురైంది. దీంతో ప్రస్తుతం కల్యాణ్ రామ్ కాస్తా డిఫరెంట్ స్టోరీతో అభిమానుల ముందుకొస్తున్నారు. నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈసారి మాత్రం మరో వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బింబిసార కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. గ్లింప్స్ చూస్తే స్టోరీ మొత్తం బ్రిటీష్ కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో 'మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు.. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. అదే గూఢచారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం.' అనే డైలాగ్ ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే గ్లింప్స్ వీడియోలో డైరెక్టర్ పేరు ఎక్కడా కూడా కనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. పోస్టర్లో కానీ.. వీడియోలో కానీ డైరెక్టర్ పేరు కనిపించలేదు. అయితే దీనికి కారణాలేంటనే విషయంపై ఫ్యాన్స్ తెగ చర్చిస్తున్నారు. (ఇది చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) -
తారకరత్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించింది. నేడు(శుక్రవారం)ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొన్న కల్యాణ్ రామ్‌కు తారకరత్న హెల్త్‌పై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రస్తుతం తారకరత్న కోలుకుంటున్నాడు. అతనికి మెరుగైన వైద్యం అందుతుంది. అయితే ఇప్పుడు కండీషన్ ఎలా ఉందన్నది డాక్టర్లు మాత్రమే చెప్పగలరు. ఆ విషయాలు హాస్పిటల్ వర్గాలు చెబితేనే బాగుంటుంది. మేం అందరం తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అతనికి మీ అందరి ఆశిస్సులతో తను పూర్తిగా రికవర్ అవుతాడని భావిస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. కాగా గత కొన్నిరోజులుగా తారకరత్న హెల్త్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు తారకరత్న పరిస్థితి ఇప్పడెలా ఉందన్నది అటు కుటుంబసభ్యులు కానీ, ఆసుపత్రి వర్గాలు కానీ వెల్లడించలేదు. -
టాటూ సీక్రెట్ బయపెట్టిన కల్యాణ్ రామ్
బింబిసార సినిమాతో అద్భుత విజయం సాధించాడు నందమూరి కల్యాణ్ రామ్. ఈసారి మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన త్రిపాత్రాభినయం చేసిన అమిగోస్ మూవీ ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లతో బిజీగా ఉన్న కల్యాణ్ రామ్ తాజగా ఓ ఇంటర్వ్యూలో తన టాటూ సీక్రెట్ బయటపెట్టాడు. 'నా భార్య స్వాతి పేరును పచ్చబొట్టు వేసుకున్నాను. 2007లో నేను అనారోగ్యంపాలయ్యాను. నన్ను చూసుకోవడానికి ఎవరో ఒకరిని పెట్టకుండా తనే స్వయంగా నన్ను కంటికిరెప్పలా చూసుకుంది. అమ్మ తన కొడుకును ఎలా చూసుకుంటుందో నన్ను అలా చూసుకుంది. నాకు ఇంజక్షన్ అంటేనే భయం.. కానీ తన కోసం పచ్చబొట్టు వేసుకుని ఆ భయాన్ని అధిగమించాను' అని చెప్పుకొచ్చాడు కల్యాణ్ రామ్. చదవండి: ఆధ్మాత్మిక సేవలో తమన్నా -
హీరోయిన్ ఆషికకు ప్రపోజ్ చేసిన కల్యాణ్ రామ్!
బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత కల్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం అమిగోస్. ఆషిక రంగనాథ్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. రాజేంద్ర రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలో బుల్లితెరపై ఓ షోకు గెస్టుగా విచ్చేసిన కల్యాణ్ రామ్ ఓ ఫన్నీ టాస్క్‌లో భాగంగా హీరోయిన్ ఆషికకు లవ్ ప్రపోజ్ చేశారు.‘మీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను’ అంటూ రెడ్ రోజ్ ఇచ్చి క్యూట్‌గా ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత సుమ అప్పుడే రావడంతో.. మీరు ఇంకా బాగున్నారు అంటూ ఆమె చేతికి అందమైన రోజా పువ్వును ఇచ్చారు కల్యాణ్ రామ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
యాంకర్ సుమపై సీరియస్ అయిన ఎన్టీఆర్!... నెట్టింట వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరాటాల శివ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టలేదు. ఎన్టీఆర్30 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో వేదికపైనే ఎన్టీఆర్ 30 అప్డేట్స్ ఇవ్వాలంటూ యాంకర్ సుమ ఎన్టీఆర్‌ను డైరెక్టుగా అడిగేయడంతో ఎన్టీఆర్ ఎందుకో గానీ కాస్త సీరియస్ అయినట్లు కనిపించారు. 'అభిమానులు అడగకపోయినా మీరు చెప్పించేసేలాగా ఉన్నారే'.. అంటూ సుమకు కౌంటర్ వేశాడు. అనంతరం ఫ్యాన్స్‌కి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. "నాకు ఒంట్లో బాగోలేకపోయినా .. మీ అందరినీ చూడాలనే ఉద్దేశంతో వచ్చాను. బాడీ పెయిన్స్ వలన ఎక్కువ సేపు నిలబడలేను కూడా .. ప్లీజ్ అర్థం చేసుకోండి. అప్డేట్, అప్డేట్ అని ఇబ్బంది పెట్టకండి. ప్రతి రోజూ, ప్రతి గంటా అప్డేట్స్ ఇవ్వాలంటే చాలా కష్టం. అభిమానుల ఉత్సాహం, ఆరాటంతో డైరెక్టర్లు, నిర్మాతలపై ప్రెజర్ పెరిగిపోతోంది. దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోండి. ఒకవేళ అప్డేట్ ఉంటే ఇంట్లో మా భార్య కంటే ముందే మీకు విషయం చెబుతాం'' అంటూ తారక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
'బింబిసార' సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయనున్న కల్యాణ్ రామ్
కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్లో నటించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్రవరి 5న నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ హాజరయ్యాడు. ఈ సినిమా సూపర్‌హిట్ కావడంతో ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయనున్నారు కల్యాణ్ రామ్. 3 letters which will take the tale of 3 doppelgangers to the next level - N T R 🔥#Amigos Pre Release Event with @tarak9999 as the chief guest 💥 On 5th Feb at HYD💥 - https://t.co/T63ceTMvmD#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @shreyasgroup pic.twitter.com/szVI9VT10P — Mythri Movie Makers (@MythriOfficial) February 4, 2023 -
'మనిషిని పోలిన మనుషులు ఎదురుపడితే'.. అమిగోస్ ట్రైలర్ అవుట్
నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'అమిగోస్'. బింబిసార తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే డోపుల్ గ్యాంగర్ అంటే మనిషి పోలిన మనుషులు కాన్సెప్ట్‌తోనే సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో యాక్షన్ సీన్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ట్రైలర్ చూస్తే సినిమాతో సరికొత్త థ్రిల్ పొందడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. -
కల్యాణ్ రామ్ అమిగోస్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
బింబిసార సూపర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం ద్వారా మీరు సరికొత్త థ్రిల్ పొందుతారని పోస్ట్ చేశారు. కాగా..ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. Super confident that you will feel and love the thrills 💥#AmigosTrailer on Feb 3rd.#Amigos in cinemas from Feb 10th.@AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial @MythriOfficial @SaregamaSouth pic.twitter.com/8GIktXDenV — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) February 1, 2023 -
కల్యాణ్ రామ్ అమిగోస్ నుంచి సెకండ్ సింగిల్, బాలయ్య హిట్ సాంగ్‌కు రీమిక్స్
బింబిసార సూపర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, పాటలు సినిమాపై మాంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మా’ పాటలను రిలీజ్ చేశారు మేకర్స్. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్‌కు ఇది రీమిక్స్. గతంలో బాలయ్య నటించిన 'ధర్మక్షేత్రం' సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను దివంగత లెజెండరి సింగర్ బాలు - చిత్ర ఆలపించారు. అదే పాటలను అమిగోస్లో రిమేక్ చేయించాడు కల్యాణ్ రామ్. గిబ్రాన్ సింగీతం అందించిన ఈ పాటను ఎస్పీ చరణ్-సమీరా భరద్వాజ్‌లు ఆలపించారు. కాగా ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. Evergreen Romantic Melody is here❤️#EnnoRatrulosthayi Full Video Song from #Amigos out now 🕺💃 - https://t.co/foMaW1GPNB#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial #SriVeturi #SpbCharan #SameeraBharadwaj @adityamusic pic.twitter.com/ouc4OQHVmI — Mythri Movie Makers (@MythriOfficial) January 31, 2023 -
నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ బ్యూటీ ఆషికా రంగనాథ్ (ఫొటోలు)
-
అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతుంది. ఎక్మో సపోర్ట్‌పైనే ట్రీట్మెంట్ జరుగుతోందని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తారకరత్నను చూసేందుకు జూ ఎన్టీఆర్ ఇవాళ(ఆదివారం)బెంగళూరుకు వెళ్లనున్నారు. కల్యాణ్ రామ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. ఇప్పటికే తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణకు ఫోన్ చేసి ఎన్టీఆర్ ఆరా తీశాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బెంగళూరుకు చేరుకుంటున్నారు.కాగా తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తారకరత్న మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. @tarak9999 @NANDAMURIKALYAN Visit In #TarakaRatna #TarakaratnaHealthUpdate #TarakaRathna #JrNTR #NandamuriBalakrishna pic.twitter.com/IPT3czlQTo — Ram_Yash (@mynameismr6) January 29, 2023 -
క్రిటికల్‌గా తారకరత్న ఆరోగ్యం.. రిలీజ్ వాయిదా వేసుకున్న కల్యాణ్ రామ్
సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హెల్త్ బుటిటెన్ విడుదల చేసిన వైద్యులు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో సినిమా ప్రమోషన్స్ చేయడం సరికాదనుకున్నారు నందమూరి కల్యాణ్ రామ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అమిగోస్ ఫిబ్రవరి10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని రాధే వెన్నల’ పాటని ఈ సినిమాలో రీమేక్ చేశాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఈ పాట ప్రోమోను విడుదల చేయగా, ఫుల్‌సాంగ్‌ను రేపు(ఆదివారం)సాయంత్రం గం.5:09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సాంగ్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు అమిగోస్ మేకర్స్ ప్రకటించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. The song launch of #EnnoRatrulosthayi from #Amigos stands postponed to a later date. Praying & Wishing Sri. Taraka Ratna Garu a speedy recovery. pic.twitter.com/UQAKDQTKNU — Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2023 -
కల్యాణ్‌రామ్ అమిగోస్ మూవీ.. వీడియో సాంగ్ రిలీజ్
బింబిసార సూపర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై మాంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఏక ఏక అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. What is better than friendship? A friendship of 3 Doppelgangers 🧍♂️🧍♂️🧍♂️ #YekaYeka Full video Song from #Amigos out now ❤️ - https://t.co/CZXcgPneal@NANDAMURIKALYAN @AshikaRanganath #RajendraReddy @GhibranOfficial #AnuragKulkarni @ramjowrites @MythriOfficial @saregamasouth pic.twitter.com/bG6Kq0rg1b — Suresh Kondeti (@santoshamsuresh) January 20, 2023 -
కల్యాణ్‌రామ్ 'బింబిసార' సినిమాపై బాలయ్య పొగడ్తలు
నందమూరి కల్యాణ్‌రామ్ తాజాగా నటించిన చిత్రం 'బింబిసార'. చాలాకాలం తర్వాత కల్యాణ్ రామ్ ఈ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి బింబిసార బృందాన్ని అభినందించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ యూనిట్ సభ్యులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. అనంతరం అనంతరం మూవీ టీంని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కల్యాణ్‌రామ్ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణతో పాటు కళ్యాణ్‌రామ్ సోదరి సుహాసిని, భార్య స్వాతి కూడా బింబిసార చిత్రాన్ని చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Some special pictures from the special screening of #Bimbisara for Natasimham #NandamuriBalakrishna garu❤️ The team is all smiles & pumped up with roaring energy 💥🔥@NANDAMURIKALYAN @DirVassishta pic.twitter.com/AbUWQJnpRM — NTR Arts (@NTRArtsOfficial) August 13, 2022 -
బింబిసార ర్యాప్ సాంగ్ విన్నారా?
సరైన హిట్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. ఇటీవలే వచ్చిన బింబిసారతో అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్‌ను రుచి చూశాడు. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ టైం ట్రావెల్ మూవీ ఆగస్టు 5న రిలీజైంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న ఈ సినిమా నుంచి ర్యాప్ సాంగ్ రిలీజైంది. ఇందులో పాటతో పాటు పలు ముఖ్య సన్నివేశాలను సైతం చూపించారు. అంతేకాదు, కల్యాణ్ రామ్ చెప్పిన డైలాగులను సైతం ర్యాప్ సాంగ్‌లో పొందుపరచడం విశేషం. ఆదిత్య అయ్యంగార్, లిప్సిక, పృథ్వీచంద్ర పాడిన ర్యాప్ సాంగ్‌కు కీరవాణి సంగీతం అందించాడు. చదవండి: పదునైన ఆయుధంతో సూసైడ్‌కు యత్నించిన నటుడు డెంగ్యూను లెక్కచేయని కంగనా, నువ్వు నిజంగా ఇన్స్పిరేషన్.. -
'బింబిసార' ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన దిల్‌రాజు
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా కల్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. చదవండి: Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా? అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. 50 రోజుల తర్వాతే బింబిసార ఓటీటీలో విడుదల అవుతుందని స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్ 23న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. .నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. -
Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతుంది.విడుదలైన రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కల్యాణ్ రామ్. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో పలువురు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇక ఆయన భార్య స్వాతి ఎవరు, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్న వివరాలపై సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కల్యాణ్‌రామ్‌కు 2006 ఆగస్టు 10న స్వాతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి చూపుల్లోనే స్వాతిని చూసి ఇష్టపడిన కల్యాణ్ రామ్ ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారట. ఇక ఆమె వృత్తిరీత్యా డాక్టర్. కల్యాణ్ రామ్ భార్య ఫ్యామిలీ విషయానికి వస్తే వారిదీ సంపన్న కుటుంబమే. ఆమె తండ్రికి ఫార్మా రంగంతో పాటు పలు పరిశ్రమలు ఉన్నాయట. ఇక స్వాతి కూడా బిజినెస్ రంగంలోనే ఉన్నారు. ఆమెకు సొంతంగా వీఎఫ్ఎక్స్ సంస్థ ఉంది. బింబిసార సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ శాతం ఈ సంస్థలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇక కల్యాణ్‌రామ్-స్వాతి దంపతులకు అదైత, శౌర్యరామ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: 'బింబిసార' సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. ట్వీట్ వైరల్ -
'బింబిసార' సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. ట్వీట్ వైరల్
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బింబిసార' సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ మూవీ విజయంపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. బింబిసార టీమ్‌కు అభినందనలు. ఇది ఒక ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ ఫాంటసీ చిత్రం. 'కళ్యాణ్‌రామ్ నటన అద్భుతంగా ఉంది. ఎప్పుడూ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తున్నందుకు, కొత్త తరహా సినిమాలను చేస్తున్నందుకు ఆయనంటే నాకు ఎప్పటికీ గౌరవమే.డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రాన్ని చక్కగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన కీరవాణి గారు, కేథరీన్, సంయుక్త మీనన్‌లకు అభినందనలు' అంటూ బన్నీ ట్వీట్ చేశారు. చదవండి: అల్లు అర్జున్ భార్య ఫోటోషూట్‌పై నిహారిక కామెంట్ Big congratulations to #Bimbisara team . Very interesting & an engaging fantasy film . Impactful presence by @NANDAMURIKALYAN garu . My respect for him for always bringing in new talent into the industry & attempting new kind of films. — Allu Arjun (@alluarjun) August 7, 2022 -
Bimbisara: రెండో రోజు అదే జోరు.. ఊహించని కలెక్షన్స్!
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ శుక్రవారం (ఆగస్ట్ 05) విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు రెండూ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నాయి. వీటిలో కలెక్షన్స్ పరంగా బింబిసార ఒకడుగు ముందు ఉంది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించారు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. (చదవండి: హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?) నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టగా.. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగింది. రెండో రోజు ఈ చిత్రం రూ.4.52 కోట్లను రాబట్టింది. ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం రెండు రోజులకి రూ.12.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు రూ.3.63 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బింబిసార’ రెండు రోజుల కలెక్షన్స్.. ► నైజాం - రూ. 3.92 కోట్లు ► సీడెడ్ - రూ. 2.24 కోట్లు ► ఈస్ట్ - రూ. 70 లక్షలు ► వెస్ట్ - రూ.55 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.1.55 కోట్లు ► గుంటూరు- రూ.89 లక్షలు ► కృష్ణా - రూ.59 లక్షలు ► నెల్లూరు - రూ.38 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ. 0.50 లక్షలు ► ఓవర్సీస్ రూ.1.05 కోట్లు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 12.37 కోట్లు(రూ.20 కోట్ల గ్రాస్) -
'బింబిసార' మూవీ రివ్యూ
టైటిల్: బింబిసార నటీనటులు: కల్యాణ్ రామ్, కేథరీన్ థ్రేసా, సంయుక్త మీనన్, ప్రకాశ్ రాజ్, వివాన్ భటేనా, అయ్యప్ప పి శర్మ తదితరులు నిర్మాత : హరికృష్ణ. కె కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: వశిష్ఠ సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు విజువల్ ఎఫెక్ట్స్: అనిల్ పాడురి విడుదల తేది: ఆగస్టు 5, 2022 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'బింబిసార'గా వచ్చాడు కల్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. టైమ్ ట్రావెల్ మూవీగా వచ్చిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5) విడుదలైంది. మరి ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథ: త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్ ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిని నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే 'బింబిసార' సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. విశ్లేషణ: క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో 'బింబిసార'ను తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ఒక్క క్యాప్షన్‌తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు. అంతేకాకుండా తనకు ఎదురు వస్తే, తన మాటను ధిక్కరిస్తే చిన్న పిల్లలను కూడా అంతమొందించే రాక్షస రాజుగా బింబిసార పాత్రలో కల్యాణ్ రామ్‌ను చూపించారు. అహంతో మదమెక్కి అరాచకాలు, ఆకృత్యాలు చేసే చక్రవర్తిగా బింబిసారుడిని చూపించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. తర్వాత ఒక నిజమైన రాజుగా, మంచి మనిషిగా బింబిసారుడు మారే క్రమాన్ని కూడా అంతే బాగా తెరకెక్కించారని చెప్పవచ్చు. త్రిగర్తల సామ్రాజ్యం, అక్కడి భాషా, వేషం అన్ని చక్కగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఒకటి, రెండు సీన్లలో త్రిగర్తల సామ్రాజ్యపు కోట ఆర్టిఫిషియల్‌గా కనిపించిన మిగతా సీన్లలో మాత్రం కళ్లకు విజువల్ ఫీస్ట్. ఫ్యామిలీ డ్రామాతో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కొంచె రొటీన్‌గా అనిపించిన ఆకట్టుకునేలా ఉన్నాయి. అక్కడక్కడ వచ్చిన కామెడీ కూడా బాగానే పండింది. కొన్ని సీన్లు, విజువల్స్ ఇతర సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్స్ చాలా స్టైలిష్‌గా అదిరిపోయాయి. బింబిసారుడిని ఎలివేట్ చేసే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ చిత్రంలోని కల్యాణ్ రామ్ యాక్టింగ్ అతని కెరీర్లోనే ది బెస్ట్. క్రూరమైన రాక్షస చక్రవర్తి బింబిసారుడిగా పూర్తి నెగెటివ్ పాత్రలో కల్యాణ్ రామ్ అదరగొట్టాడు. అహంతో విర్రవీగే రాజుగా, ఎదురు తిరిగిన, సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరినీ నిర్దాక్షణ్యంగా చంపే కర్కోటకపు రాజుగా కల్యాణ్ రామ్ చూపించిన అభినయం అబ్బురపరుస్తుంది. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్లలో స్టైలిష్‌గా, ఒక రాజులోని హుందాతనాన్ని నటనతో చాలా చక్కగా చూపించాడు. తర్వాత మనిషిగా మారిన చక్రవర్తిగా, ఎమోషనల్ సీన్లలో సైతం ఆకట్టుకున్నాడు. బింబిసారుడి తమ్ముడు దేవ దత్త పాత్రలో కూడా చక్కగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తాను ఒక్కడై నడిపించినట్లుగా ఉంటుంది. యువరాణి ఐరాగా కేథరీన్ థ్రేసా, ఎస్సై వైజయంతిగా సంయుక్త మీనన్ నటన పాత్రకు తగినట్లుగా పర్వాలేదు. కానీ వారి రోల్స్‌కు అంతా ప్రాముఖ్యత లేదు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర కామెడీతో అలరించారు. వివాన్ భటేనా, ప్రకాశ్ రాజు, రాజీవ్ కనకాల, అయ్యప్ప పి శర్మ తదితరులు పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. అలాగే కథకు అనుగుణంగా వచ్చిన ఒక్కో పాట కూడా అలరిస్తుంది. ఈ ఒక్కో సాంగ్‌ను చిరంతన్ భట్, వరి కుప్పల యాదగిరి, ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్ చేసిన కల్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా కచ్చితంగా చూడాల్సిందే. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
Bimbisara Movie: ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. (చదవండి: ‘సీతారామం’ ట్విటర్ రివ్యూ) ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బింబిసార’ కథేంటి? త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్ రామ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నార.అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #BimbisaraOnAug5th #BIMBISARA #BimbisaraReview 1-Excellent movie 👍 2-this movie will bring back telugu audience to teatres 3-1st half is bit slow, but 2nd half is rampage 🔥 4-Kalyan ram as bimbisara is super 5- overall rating is 🌟 🌟 🌟 1/2 ( 3.5/5) — VINOD KUMAR E 2691 Batch,PES University (@VinodPes) August 5, 2022 తెలుగు ప్రేక్షకులను తిరిగి థియేటర్స్‌కి రప్పించే చిత్రమిదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉందని, సెకండాఫ్ అదిరిపోయిందని చెబుతున్నారు. బింబిసారగా కల్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా బాగుందని చెబుతున్నారు. వన్ మ్యాన్ షోగా సినిమాను తన భుజానా వేసుకొని నడిపించాడట. ఎంఎం కీరవాణి మ్యూజిక్, విజువల్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. Showtime: Kalyan Ram in #Bimbisara. A Vasishta directorial and MM keeravani musical. — Day Dreamer!!! (@bunnywrites) August 5, 2022 Bimbisara first half..👌🔥🔥This is going to be Kalyan ram's career biggest movie..Time travel content..🪐New World..🙏What a story..#Bimbisara @tarak9999 @NANDAMURIKALYAN #BimbisaraReview — SAIKUMAR MANNURU (@im_saichowdary) August 4, 2022 #Bimbisara Movie theater response#BimbisaraOnAug5th Movie good reviews every where 👍👍👍👍 video link 👇👇👇 3/5 👍https://t.co/AaHUH2YDQm — Masthan-Tweets (@sm4582579) August 5, 2022 Good First Half 👌 Interval 🔥🔥@NANDAMURIKALYAN 👌👌 Bgm Excellent 🤙🤙#Bimbisara . https://t.co/TWJFMJKn7J pic.twitter.com/pt3uc0Vhdm — #DADA 🙏 #NTR 💗 (@Dada_NTR) August 5, 2022 మరోవైపు బింబిసార టీమ్‌కు సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ తమన్, సాయి తేజ్, సత్యదేవ్ తదితరులు ట్వీట్స్ చేశారు. Wishing this whole team of #Bimbisara @NANDAMURIKALYAN anna #Hari gaaru @NTRArtsOfficial #Vasista and Team of #SitaRamam brother @hanurpudi @dulQuer @mrunal0801 @VyjayanthiFilms Dear @SwapnaDuttCh All the Very Best at the #BoxOffice TOMORROW 🏆🥁🥁🥁🥁🥁🥁 pic.twitter.com/xrD6IQTkMz — thaman S (@MusicThaman) August 4, 2022 \ #Bimbisara Looks Promising to bits. All the best @NANDAMURIKALYAN anna.@DirVassishta I know how much you have waited for this day. Wish your hardwork paysoff ra All the best to the entire team@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani garu @ChirantannBhatt @NTRArtsOfficial pic.twitter.com/UIepiaLrX5 — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 4, 2022 Promising right from it's Teaser and a Grandeur of this scale from @DirVassishta is so impressive. Your hardwork and transformation for this @NANDAMURIKALYAN anna 🤗👏 All the best Team #Bimbisara@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial pic.twitter.com/YOfhhUJUqt — Satya Dev (@ActorSatyaDev) August 4, 2022 Wishing @NANDAMURIKALYAN garu and the entire team of #Bimbisara the best for tomorrow. May cinema win and the industry rise! @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial — Hanu Raghavapudi (@hanurpudi) August 4, 2022 -
తండ్రి హరికృష్ణ చనిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పిన కల్యాణ్ రామ్
-
నీతో ఉంటే చాలు.. హత్తుకునేలా 'బింబిసార' గీతం
Neetho Unte Chalu Song Out From Bimbisara: 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే క్యాప్షన్ ద్వారా ఈ మూవీ ఒక టైమ్ ట్రావెల్ చిత్రమని చెప్పకనే చెబుతున్నారు. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. ఇటీవల గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'నీతో ఉంటే చాలు' అంటూ సాగే ఈ గీతం మనసుకు హత్తుకునేలా ఉంది. స్వీయ సంగీత దర్శకత్వంలో ఎంఎం కీరవాణి రాసిన ఈ పాటను మోహన్ భోగరాజు, శాండిల్య ఆలపించారు. కాగా ఈ మూవీలో సంయుక్త మీనన్, కేథరీన్ థ్రేసా హీరోయిన్లుగా నటించారు. చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్ నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన This melody #NeethoUnteChalu from #Bimbisara hits you different once you own it ❤️🔥 Tune into the Lyrical Video now 🔗 https://t.co/FxEIIAdgsp#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @saregamasouth pic.twitter.com/3X0fPdgZAX — NTR Arts (@NTRArtsOfficial) August 1, 2022 చదవండి: బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. సల్లూ భాయ్‌కి లైసెన్స్డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ? -
శ్రీవారి దర్శనం చేసుకున్న కల్యాణ్ రామ్ (ఫొటోలు)
-
ఆ సినిమా దెబ్బకొట్టింది, చాలా నష్టపోయా: కల్యాణ్ రామ్
పటాస్, 118 వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు హీరో నందమూరి కల్యాణ్ రామ్. గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడీ హీరో. ప్రస్తుతం అతడు నటించిన బింబిసార మూవీ ఆగస్టు 5న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ తనను బాగా దెబ్బ తీసిన సినిమా పేరును వెల్లడించాడు. 'అతనొక్కడే, పటాస్, 118 సినిమాలతో సక్సెస్ రుచి చూశాను. కానీ ఓం సినిమా ఫలితం చూసి బాగా ఫీలయ్యాను. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ మా లెక్కలు తప్పాయి. ఓం నన్ను ఆర్థికంగా దెబ్బ తీసింది. కానీ పటాస్ వచ్చి అది మొత్తం రికవరీ చేసింది. బింబిసార సినిమాను తమ్ముడు తారక్ చూశాడు. బాలకృష్ణ కర్నూలు షూటింగ్లో బిజీగా ఉన్నందువల్ల ఇంకా ఈ సినిమా చూడలేదు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: సౌత్ హిట్స్‌తో బాలీవుడ్ బేజార్.. స్పందించిన బాలీవుడ్ నిర్మాత గ్యారేజీలో అనిల్ కాపురం.. హీరోయిన్‌తో సునీల్ దత్ లవ్‌స్టోరీ.. -
‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఈసారి ఎవ్వరినీ డిసప్పాయింట్ చేయను: కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. శుక్రవారం బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఒక మంచి జానపద సినిమాను మీ ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నమే ఈ బింబిసార. ఈసారి మాత్రం ఎవరినీ డిసప్పాయింట్ చేయను. 200% మీరందరూ సంతృప్తి చెందుతారు, గర్వంగా ఫీలవుతారు. తెలుగు సినిమాకు మూలకారకుడైన తాతగారు నందమూరి తారకరామారావుగారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నా. ఈ సినిమాకు మాటలు రాసిన వాసుదేవ్.. మా పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వచ్చాడు. ఆ సమయంలో ఈ సినిమా డైలాగ్ రైటర్ అయ్యాడు. సినిమాకు ప్రాణం పోసిన వ్యక్తి కీరవాణి. బింబిసార కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చాడు. చదవండి: వెంట పరిగెత్తి మరీ కొట్టాను, సినిమాలో కూడా లేకుండా చేశా -
బింబిసార ట్రైలర్ రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
సరైన హిట్టు కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నాడు కల్యాణ్ రామ్. దీంతో ఆయన ఈసారి రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో అన్న సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశాడు జూనియర్ ఎన్టీఆర్. 'హద్దులను చెరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులు, ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి.. శరణు కోరితే ప్రాణభిక్ష, ఎదిరిస్తే మరణం..' అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. 'నాడైనా, నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడి కత్తిని దాటాలి' అని చెప్పే డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది. ఇక కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో లెవల్లో ఉంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది నందమూరి తారకరామారావు నూరవ జయంతి సంవత్సరం కాబట్టి బింబిసారను ఆయనకు అంకితం ఇస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాడు కల్యాణ్ రామ్. Another peek in to the grand world of #Bimbisara. A big screen experience awaits you on August 5th. https://t.co/p1rBGLeMxu#BimbisaraOnAugust5th @NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @ChirantannBhatt @NTRArtsOfficial — Jr NTR (@tarak9999) July 27, 2022 చదవండి: పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. తొలిసారి స్పందించిన ఆలియా అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్ -
బింబిసార.. అందమైన చందమామ కథ
‘‘ఎన్నో చందమామ కథలు విన్నాం.. చదివాం.. వెండితెరపై చూశాం. తాతగారు (దివంగత ప్రముఖ నటులు ఎన్టీఆర్) చేసిన ‘పాతాళ భైరవి’, ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరుని కథ’, బాబాయ్ (బాలకృష్ణ) చేసిన ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’.., చిరంజీవిగారు చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, మా జనరేషన్లో తమ్ముడు (ఎన్టీఆర్) చేసిన ‘యమదొంగ’, రామ్‌చరణ్ చేసిన ‘మగదీర’, ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాలు గమనిస్తే.. అందమైన సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథలను ప్రేక్షకులు బాగా ఆదరించిన విషయం అర్థమవుతుంది. అలాంటి అందమైన గొప్ప చందమామ కథను ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అదే మా ‘బింబిసార’. ఈ ఏడాది మా తాతగారు ఎన్టీఆర్ నూరవ జయంతి సంవత్సరం కాబట్టి ఆయనకు మా ‘బింబిసార’ను అంకితం ఇస్తున్నాను’’ అని నటుడు–నిర్మాత కల్యాణ్ రామ్ అన్నారు. కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. జూలై 5న కల్యాణ్‌రామ్ బర్త్ డే సందర్భంగా సోమవారం ‘బింబిసార’ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ‘‘కొత్త దర్శకుడు చెప్పిన కథని నమ్మి, సపోర్ట్ చేసిన నిర్మాత హరికి, ప్రోత్సహించిన నా బింబిసారుడు కల్యాణ్‌రామ్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు వశిష్ఠ్. -
ట్రైలర్: బింబిసారతో అదరగొట్టిన కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బింబిసార. కేథరిన్, సంయుక్త మీనన్, వారీనా హుసేన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ. కె నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ఉపశీర్షిక. వశిష్ట్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సోమవారం బింబిసార ట్రైలర్ విడుదల చేశారు. రాక్షసులెరుగని రావణ రూపం.. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం.. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుని విశ్వరూపం.. అంటూ కథానాయకుడి పాత్రను పరిచయం చేశారు. 'బింబిసారుడంటేనే మరణ శాసనం. ఇక్కడ రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే..', 'పట్టుమని వంద మంది కూడా లేరు, ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు', 'ఎవడ్రా నిన్ను పంపింది అని పైనున్న ఆ యముడు అడిగితే చెప్పు, కింద ఒకడున్నాడు.. వాడి పేరు బింబి, త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడని చెప్పు..' అంటూ కల్యాణ్ రామ్ డైలాగ్స్‌తో గర్జించాడు. మొత్తానికి పవర్ఫుల్ యాక్షన్‌తో కల్యాణ్ రామ్ అదరగొట్టాడు. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. చదవండి: పిల్లల్ని కనడం గురించి సద్గురును అడిగిన ఉపాసన, ఆయన సమాధానమేంటంటే? పైరసీ భూతం 'తమిళ్ రాకర్స్'పై వెబ్ సిరీస్.. -
టైమ్ ట్రావెల్ చేయనున్న 'బింబిసార'.. రిలీజ్ డేట్ ఫిక్స్
Kalyan Ram Bimbisara Movie Theatrical Release Date Announced: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న 18వ చిత్రం 'బింబిసార'. కేథరిన్, సంయుక్త మీనన్, వారీనా హుసేన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు విశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ. కె నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ట్యాగ్‌లైన్. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఈ సంవత్సరం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా శనివారం సినిమా అధికారిక రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడదల చేశారు. The date is locked for BIMBISARA to ascend the throne 🔥#Bimbisara grand release on 5th August 💥#HappyUgadi ❤️#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt @anilpaduri @NTRArtsOfficial pic.twitter.com/cFhr62CmCe — NTR Arts (@NTRArtsOfficial) April 2, 2022 సామాజిక మాధ్యమాల ద్వారా రిలీజైన ఈ పోస్టర్లో కల్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాలో అత్యున్నత సాంకేతికతను ఉపయోగించాం. ఇందులో కల్యాణ్ రామ్ రెండు విభిన్న పాత్రల్లో కనువిందు చేయనున్నారు. అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. క్రీస్తూ పూర్వ ఐదో శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు కథతో ఈ మూవీ తెరకెక్కనుంది. టైమ్ ట్రావెల్ మూవీగా వస్తున్న 'బింబిసార'లో బింబిసారుడిగా, నేటితరం యువకుడిగా రామ్ నటిస్తున్నట్లు సమాచారం. -
‘బింబిసార’గా కల్యాణ్ రామ్.. ఇది మరో ప్రయోగం
Nandamuri Kalyan Ram: హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకన్నాడు నందమూరి కల్యాణ్ రామ్. ఇప్పటివరకు రొమాంటిక్, మాస్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ నందమూరి హీరో.. ఇప్పుడు ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. తన తాత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా శుక్రవారం తన కొత్తసినిమా టైటిల్‌ని ప్రకటించాడు. మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజైన బింబిసారుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ‘బింబిసార’ మోషన్ పోస్టర్ని చిత్రబృందం షేర్ చేసింది. కత్తిని పట్టుకుని కల్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో, గెటప్ లో కన్పించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మృతదేహాల సమూహంపై కూర్చుని ఉన్న కల్యాణ్ రామ్ లుక్ అందరికి ఆకట్టుకుంటుంది. వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ క్రింద హరికృష్ణ కె ‘బింబిసారా’నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. -
కల్యాణ్‌రామ్19వ చిత్రం మార్చిలో షురూ
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించనున్న 19వ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై 14వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు భరత్ కమ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. హీరో కల్యాణ్ రామ్, నిర్మాత నవీన్ యర్నేని, సీఈఓ చెర్రీ కలసి రాజేంద్రకు స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘మార్చి రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యర్నేని అనిల్, సీఈఓ: చెర్రీ. -
రావణుడితో అఫ్ఘన్ భామ ఐటమ్ సాంగ్!
నూతన దర్శకుడితో చేయాలన్నా, వినూత్న కాన్సెప్టులు ఎంచుకోవాలన్నా గట్స్ ఉండాలి. ఆ గట్స్ హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు పుష్కలంగా ఉన్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే చాలు సినిమాలు చేసుకుంటూ పోతాడు. తాజాగా ఆయన ఓ భారీ బడ్జెట్ ఫాంటసీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మల్లిడి వేణు అనే వ్యక్తిని దర్శకుడిగా వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. (చదవండి: హీరోయిన్గా... సావిత్రి ఆఖరి చిత్రం) ఈ సినిమాను ఎన్టీఆర్ బ్యానర్‌పై అతడే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఎలాగో నిర్మాత తనే కాబట్టి ఎక్కడా తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇక ఇందులో కల్యాణ్ రావణుడిగా కనిపించనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రావణుడితో స్టెప్పులేసేందుకు తాజాగా అఫ్ఘన్ బ్యూటీని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. 'లవ్ యాత్రి', 'దబాంగ్ 3' సినిమాల్లో తళుక్కున మెరిసిన వారినా హుస్సేన్‌తో ఓ ఐటమ్ సాంగ్ చేయిస్తున్నట్లు సమాచారం. ఇదే కనక నిజమైతే వారినా ఈ చిత్రం ద్వారా దక్షిణాదిన కాలు మోపడం ఖాయం. 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా పరిచయమైన కల్యాణ్ రామ్ 'అతనొక్కడే'తో హిట్ అందుకున్నాడు. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా మంచి హిట్టు మాత్రం దొరకలేదు. కానీ అనిల్ రావిపూడి 'పటాస్'తో మాత్రం సూపర్ డూపర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది ఆయన నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఎంత మంచి వాడవురా?' సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశ పర్చింది. (చదవండి: ఉప్పెన: జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్!) -
జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
ఇమేజ్ కోసం తాపత్రయపడకుండా కథ నచ్చితే చాలు.. సినిమాలు చేసుకుంటూ పోయే హీరో నందమూరి కల్యాణ్ రామ్. నేడు ఆయన 42 వ ఏట అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య కల్యాణ్ రామ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివారం ఎమోషనల్ పోస్ట్ చేశారు. "కొన్ని సంవత్సరాలుగా నువ్వు నాకు కేవలం అన్నయ్యగానే కాకుండా నా స్నేహితుడిగా, తత్వవేత్తగా, దిశా నిర్దేశం చేసే మార్గదర్శిగా ఉంటున్నావు. హ్యాపీ బర్త్‌డే కల్యాణ్ అన్నా.. నువ్వు నిజంగా గొప్పవాడివి" అంటూ ట్వీట్ చేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం అతనికి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. (హీరోయిన్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధింపులు!) 1978 జూలై 5న కల్యాణ్ రామ్ జన్మించారు. నందమూరి నట వారసత్వం పుణికి పుచ్చుకున్న అతడు 1989లో "బాల గోపాలుడు" చిత్రంతో బాలనటుడిగా వెండితెరపై ప్రవేశం చేశారు. అనంతరం "తొలి చూపులోనే" చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'లక్ష్మీ కళ్యాణం', 'పటాస్' వంటి హిట్ సినిమాలు అతనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అనంతరం తాత పేరు మీద ఎన్టీఆర్ ప్రొడక్షన్స్ కంపెనీని స్థాపించి విజయం సాధించారు. అతడు చివరిసారిగా 'ఎంత మంచివాడవురా' చిత్రంలో నటించాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు స్పందన లభించింది. ప్రస్తుతం అతను "రావణ్" సినిమాలో నటిస్తున్నాడు. (నా కల నిజమవుతోంది-ఎన్టీఆర్) More than just being a brother, you've been my friend,philosopher and guide over the years. Happy Birthday Kalyan Anna @nandamurikalyan .You truly are the best! — Jr NTR (@tarak9999) July 5, 2020 -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళి
సాక్షి, హైదరాబాద్ : నేడు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు 97వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న బాలకృష్ణ.. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలకృష్ణతో పాటుగా ఆయన సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, సుహాసిని.. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు. (చదవండి : ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లకూడదని నిర్ణయం..) మరోవైపు ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్‌లు కూడా ట్విటర్ వేదికగా ఆయనను గుర్తుచేసుకుని.. నివాళులర్పించారు. ‘మీరు లేని లోటు తీరనిది. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ‘మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత’ అని కల్యాణ్‌రామ్ పోస్ట్ చేశారు. కాగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
అక్కడకు వెళ్లకూడదని నిర్ణయం..
హైదరాబాద్ : టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి(మే 28) సందర్భంగా ప్రతి ఏడాది కుటుంబ సభ్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు గురువారం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. పెద్ద ఎత్తున జనాలు అక్కడికి చేరుకుంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉండి ఆ మహానుభావుడికి నివాళులర్పించనున్నట్టు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు తెలిపారు. -
అన్నయ్యను గుర్తుచేసుకున్న కళ్యాణ్‌రామ్
టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ ట్విటర్ వేదికగా తన అన్నయ్య దివంగత జానకిరామ్‌ను గుర్తుచేసుకున్నాడు. బుధవారం జానకిరామ్ జయంతి. ఈ సందర్భంగా కళ్యాణ్‌రామ్ జానకిరామ్‌కు నివాళులర్పించారు. తన అన్నయ్య జయంతి సందర్భంగా ట్విటర్ వేదికగా కళ్యాణ్‌రామ్ స్పందిస్తూ.. ‘మీరు ఎల్లప్పుడూ మా హృదయాలలో, మా ప్రార్థనలలో జీవించే ఉంటారు. హ్యాపీ బర్త్‌డే అన్నయ్య. వి మిస్ యూ’అంటూ ట్వీట్ చేశాడు. సొంతంగా ఎన్టీఆర్ బ్యానర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన జానకిరామ్ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అయితే సక్సెస్ ఫుల్ నిర్మాతగా మరిన్ని విజయాలను అందుకోవాల్సిన జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఐదేళ్ల కిందట నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాము వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ దుర్మరణం చెందారు. 2014 డిసెంబరు 6 న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పడంతో జానకిరామ్ మృతిచెందారు. ట్రాక్టర్‌ను తప్పించబోయి జానకిరామ్ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. పెద్దకుమారుడి మాదిరిగానే నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఇక 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లగొండ జిల్లా మోతే వద్ద ఆయన ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ వరుస ప్రమాద కారణాలతోనే ‘అతి వేగం ప్రమాదకరం.. యాక్సిడెంట్ వల్ల మేము ఇప్పటికే మేము ఎంతో కోల్పోయాము. ఆ పరిస్థితి మరేవరికి రావద్దు’ అంటూ నందమూరి వారసుల చిత్రాల ప్రారంభానికి ముందు వాయిస్ ఓవర్ వస్తుంటుంది. చదవండి: లవ్ యూ అమ్మ: రామ్ చరణ్ విలన్‌గా అనసూయ..! -
పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
సాక్షి, హైదరాబాద్: కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ‘క్లీన్ యూ’ సర్టిఫికేట్ లభించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. సకుటుంబసపరివార సమేతంగా చూడదగ్గ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మరింత ప్రమోషన్ కల్పించేందుకు బుధవారం (8వతేదీన) హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతి బరిలో ఉన్న సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో ప్రమోషన్లో దూసుకుపోతూ ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గెస్ట్‌గా ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండటంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద బాగా కలిసివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు రాజ్ తోట ఫోటోగ్రఫిని అందిస్తుస్తున్నారు. కళ్యాణ్ రామ్, మెహరీన్‌తోపాటు, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. -
కళ్యాణ్‌రామ్ ‘జాతరో జాతర’ సాంగ్ రిలీజ్
-
దీపావళి సందడి.. షేక్ చేస్తున్న తెలుగు హీరోల లుక్స్
దీపావళి సందడిని పురస్కరించుకొని మన తెలుగు హీరోలు వారి అభిమానులకు పండుగ గిఫ్ట్ ఇచ్చారు. మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు', బాలకృష్ణ ' రూలర్', వెంకీ- నాగచైతన్యల ' వెంకీమామ' , కళ్యాణ్‌రామ్ ' ఎంత మంచి వాడవురా' చిత్రాలకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. బులెట్ బైక్‌పై మహేశ్ అదుర్స్ సంక్రాంతి కానుకగా వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబంధించి మహేశ్ ఫస్ట్‌లుక్ అదిరిపోయింది. రౌడీల పని పట్టేందుకా అన్నట్లు బులెట్ బైకును నడుపుతున్నమహేశ్ సీరియస్ లుక్ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. ఇందులో మహేశ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో 13 ఏళ్ల తర్వాత లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండగా ప్రకాశ్‌రాజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మండన కథానాయికగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12న థియోటర్లలోకి రాబోతుంది. 'రూలర్'గా గర్జిస్తానంటున్న బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీపావళి పండుగ సందర్భంగా చిత్ర టైటిల్, బాలకృష్ణ కొత్త లుక్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. తాజా చిత్రానికి 'రూలర్' అనే పేరును ఖరారు చేశారు. ఇందులో బాలకృష్ణ 'ధర్మ' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన బాలకృష్ణ ఫస్ట్‌లుక్ ఆకట్టుకోగా, తాజాగా రిలీజైన పోస్టర్ అభిమానుల్ని అలరిస్తోంది. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రకాశ్‌రాజ్ ,భూమిక కీలక పాత్రలు పోషించారు. రూలర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదరగొడుతున్న మామా అల్లుడి లుక్ విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య మొదటిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం 'వెంకీమామ' . కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నాలు కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా వెంకీ, చైతూలకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా రిలీజ్ చేసిన లుక్‌లో వెంకీ సాధారణ దుస్తుల్లో సాల్ట్ అండ్ పెపర్ లుక్‌తో, నాగచైతన్య ఆర్మీ అధికారిగా కనిపించారు. దసరాను పురస్కరించుకొని రిలీజ్ చేసిన టీజర్‌కు విశేష స్పందన రాగా, తాజాగా రిలీజ్ చేసిన లుక్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్ర విడుదలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. సంక్రాతికి కలుద్దామంటున్న' ఎంత మంచి వాడవురా' శతమానం భవతి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సతీష్ వేగేశ్న నందమూరి కళ్యాణ్‌రామ్‌తో 'ఎంత మంచి వాడవురా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా సంక్రాంతికి కలుద్దాం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మెహరీన్ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటులు శరత్‌బాబు, సుహాసిని, నరేష్, విజయ్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శతమానం భవతి చిత్రంతో మంచి హిట్ అందుకున్న సతీశ్ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాడా లేదా అనేది చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. -
సంక్రాంతికి మంచివాడు
‘‘118’ వంటి హిట్ చిత్రం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తోన్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ‘శత మానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు. మెహరీన్ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఫిల్మ్స్ పతాకంపై ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఉమేష్ గుప్త, శివలెంక కష్ణ ప్రసాద్ మాట్లాడుతూ–‘‘మా సినిమా చాలా బాగా వస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 26 నుంచి మొదలు పెట్టిన షూటింగ్ ఈ నెల 25 వరకు ఉంటుంది. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. తొర్రేడులో రూ.35 లక్షలతో భారీ జాతర సెట్ వేసి, కల్యాణ్‌రామ్, నటాషా దోషిలపై ఒక పాట చిత్రీకరించాం. పెండ్యాలలోని ఇసుక ర్యాంపుల మధ్య తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుంది. వంగలపూడి సమీపంలో గోదావరిలో 16 బోట్లతో తెరకెక్కించిన క్లైమాక్స్ అల్టిమేట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘రాజమండ్రి పరిసరాల్లోని అందాలను మా సినిమాలో మరోసారి చూపించబోతున్నాం. అక్టోబర్ 9 నుంచి 22 వరకూ హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత నాలుగవ షెడ్యూల్లో కేరళ, కర్ణాటకల్లో కొన్ని ప్రధాన సన్నివేశాలను తెరకెక్కిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది’’ అని వేగేశ్న సతీష్ అన్నారు. వి.కె.నరేశ్, సుహాసిని, శరత్‌బాబు, తనికెళ్ల భరణి, పవిత్రాలోకేశ్, రాజీవ్ కనకాల, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: గోపీ సుందర్. -
‘ఎదురీత’ టైటిల్‌కు కచ్చితంగా న్యాయం చేస్తాం
'సై', 'దూకుడు', 'శ్రీమంతుడు', 'బిందాస్', 'మగధీర', 'ఏక్ నిరంజన్' సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించిన శ్రవణ్ రాఘవేంద్ర కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'ఎదురీత'. శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. బాలమురుగన్ దర్శకుడు. లియోనా లిషోయ్ కథానాయిక. అరల్ కొరెల్లి సంగీత దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను గురువారం హీరో నందమూరి కల్యాణ్ రామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రవణ్ రాఘవేంద్ర మాట్లాడుతూ ‘మేం అడగ్గానే మా టీజర్ విడుదల చేసిన కల్యాణ్ రామ్ గారికి స్పెషల్ థాంక్స్. సినిమా విషయానికి వస్తే... టైటిల్ గురించి మా టీమ్ మధ్య డిస్కషన్స్ జరిగాయి. 'ఎదురీత' కన్ఫర్మ్ చేశాం. ఒకరోజు మా నాన్నగారు సినిమా గురించి అడుగుతూ 'టైటిల్ ఏంటి?' అని అడిగారు. 'ఎదురీత' అని చెప్పాను. అప్పుడు ఆయన 'ఎదురీత' సినిమా గురించి తెలుసా? ఆ టైటిల్ పవర్ తెలుసా? అని ప్రశ్నించారు. నందమూరి తారకరామారావు 1977లో నటించిన 'ఎదురీత' గురించి చెప్పారు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారికి, ప్రేక్షకులకు చెబుతున్నా... 'ఎదురీత' టైటిల్ కు కచ్చితంగా న్యాయం చేస్తాం. ఇక, సినిమా కథ విషయానికి వస్తే... ఎంతగానో ప్రేమించే కొడుకును తండ్రి మర్చిపోతాడు. తరవాత ఏం జరిగిందనేదాన్ని దర్శకుడు చాలా ఎమోషనల్ గా చూపించారు’అంటూ రాఘవేంద్ర పేర్కొన్నారు. సంపత్ రాజ్, జియా శర్మ, శాన్వీ మేఘన, నోయెల్ సేన్, 30 ఇయర్స్ పృథ్వీ, 'రంగస్థలం' మహేష్, కాశి విశ్వనాథ్, రవిప్రకాష్, భద్రమ్, 'మాస్టర్' చరణ్ రామ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. -
బాబాయ్ స్పీచ్.. అబ్బాయ్ పాట్లు!
బాలయ్య వేదిక ఎక్కితే.. వచ్చే ప్రవాహం ఎటు పోతుందో.. ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. ఎటు నుంచి మొదలుపెట్టి ఎటు వైపుకు తీసుకువెళ్తాడో బాలయ్యకే తెలియదు. ఇప్పటికే బుల్ బుల్, సంభ్రమాశ్చర్యాలతో నెటిజన్లు బాలయ్యను ఓ ఆట ఆడేసుకోగా.. తాజాగా బాలయ్య మరోసారి దొరికిపోయాడు. నిన్న (ఫిబ్రవరి 26) జగిన 118 ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య కనీసం సినిమా పేరును కూడా సరిగ్గా పలకలేకపోయారు. ఒకటి కాదు రెండు కాదు.. మూడుసార్లు సినిమా పేరును తప్పుగా పలికాడు. 118గా ఉన్న సినిమా పేరును బాలయ్య 189గా చెబుతూ ఉంటే.. వేదికపై ఉన్నవారు ఆశ్యర్యపోయారు. అప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు దగ్గరికి వచ్చి.. చెప్పినా సరిచేసుకోలేకపోయాడు. మళ్లీ చివర్లో.. 189 అంటూనే ముగించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కెవీ గుహన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీని ఈస్ట్‌కోస్ట్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటించారు. మార్చి 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
బాబాయ్ స్పీచ్.. అబ్బాయ్ పాట్లు!
-
ఒకే వేదికపై ఎన్టీఆర్-బాలయ్య
‘యన్‌టిఆర్-కథానాయకుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై కనిపించిన ఎన్టీఆర్-బాలయ్య మళ్లీ ఇంతవరకు ఒకేచోట కలిసి కనబడలేదు. ఏదో మొక్కుబడిగా ఆ ఈవెంట్‌కు వచ్చాడని, అందుకే బయోపిక్‌పై ఎన్టీఆర్ కనీసం స్పందిచలేదని అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఆ వేడుకలో ఇద్దరు ఒకేచోట కనబడేసరికి నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే మళ్లీ వీరిద్దరు ఒకేచోట కనపడి అభిమానులను ఆశ్చర్యపర్చనున్నారు. నందమూరి కళ్యాణ్‌రామ్.. 118తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ఈవెంట్‌ను ఈరోజు(ఫిబ్రవరి 25)న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బాలయ్య, ఎన్టీఆర్‌లు హాజరుకానున్నారు. మరీ ఈ వేడుకలోనైనా.. ‘యన్‌టిఆర్’ పై యంగ్‌టైగర్ స్పందిస్తాడా లేదో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. షాలినీ పాండే, నివేధా థామస్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌పై నిర్మించగా.. కెవి గుహన్ దర్శకత్వం వహించాడు. -
తెలియని విషయం వెంటాడుతోంది
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటించారు. సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని మంగళవారం విడుదల చేశారు. టీజర్లో కల్యాణ్ రామ్ చాలా స్టైలిష్ లుక్‌తో కనిపించారు. ఏదో తెలియని విషయం ఆయన్ని వెంటాడుతున్నట్లు, ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు ఆయన పాత్రను కె.వి.గుహన్ మలిచినట్లుగా టీజర్ చెబుతోంది. మహేశ్ కోనేరు మాట్లాడుతూ –‘‘స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ‘118’ టైటిల్ లోగో, ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కల్యాణ్ రామ్‌గారు ఇప్పటివరకు చేయనటువంటి జోనర్లో రూపొందింది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, కెమెరా, దర్శకత్వం: కె.వి.గుహన్. -
ఆసక్తికరమైన టైటిల్‌తో కళ్యాణ్ రామ్!
‘పటాస్’ చిత్రంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు నందమూరి కళ్యాణ్‌రామ్. అయితే అప్పటినుంచీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక మళ్లీ వెనుకబడ్డాడు. అయినా సరే ఎలాగైనా విజయం సాధించాలని.. కొత్తగా ట్రై చేసి తమన్నాతో కలిసి ‘నా నువ్వే’ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కానీ అదికూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కళ్యాణ్‌రామ్ సిద్దమవుతున్నాడు. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రం టైటిల్‌ను సోమవారం రివీల్చేశారు. ‘118’ గా రాబోతోన్న ఈ చిత్రంలో నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నారు. Here we go.. #118 is the title of our next with @NANDAMURIKALYAN and KV Guhan.. A slick and suspenseful action thriller your way. #NKR16 pic.twitter.com/kS0vuMglvj — East Coast Prdctns (@EastCoastPrdns) December 3, 2018 -
మా అక్కను గెలిపించండి : ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్ : కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తమ సోదరి సుహాసినిని భారీ మెజారిటీతో గెలిపించాలని నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సేవకు సిద్దపడుతున్న తమ సోదరి సుహాసిని భారీ విజయం సాధించాలని ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. తాత, తండ్రికి నివాళులు.. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సుహాసిని తాత, దివంగత సీఎం ఎన్టీఆర్, తండ్రి నందమూరి హరికృష్ణలకు నివాళులర్పించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి సమాధి వద్దే నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. బాబాయ్ నందమూరి బాలకృష్ల, ఇతర కుటుంబసభ్యులతో కలిసి తొలుత ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లిన ఆమె.. అనంతరం మహాప్రస్థానంలోని తన తండ్రి సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు స్పూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. తనకు తెలుగు మహిళలు మద్దతు ఇవ్వాలని కోరారు. శనివారం ఉదయం 11.21నిమిషాలకు నామినేషన్ వేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. నందమూరి ఆడపడుచు సుహాసిని గెలుపు కోసం యువత, అభిమానులు, కార్యకర్తలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. తమ ఆశయాలను సుహాసిని ముందుకు తీసుకెళ్తారని, తెలంగాణలో ప్రజాకూటమిదే విజయమని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహాకూటమి తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. బహిరంగ సభల్లో, రోడ్‌షోలలో పాల్గొంటానన్నారు. ఈ నెల 26 నుంచి ప్రచారం ప్రారంభిస్తానన్నారు. Wishing my sister Suhasini garu all the very best, as she takes her first step into public service pic.twitter.com/Hl2TJ4rMsd — Jr NTR (@tarak9999) November 17, 2018 -
‘ఎన్టీఆర్’లో హరికృష్ణ లుక్ ఇదే
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఆయన కుమారుడు హరికృష్ణగా కళ్యాణ్‌రామ్ ఉన్న ఫొటోను దసరా సందర్భంగా బయటకు వదిలారు. బాలకృష్ణ ఠీవిగా కూర్చుని వుండగా కళ్యాణ్‌రామ్ ఆయన పక్కన వంగి ఉన్నట్టుగా బ్లాక్ అండ్ వైట్ ఫొటో అభిమానులకు కనువిందు చేస్తోంది. ‘విజయం మీది.. విజయరథ సారధ్యం నాది.. నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ’ అంటూ డైలాగ్ కూడా పెట్టారు. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా(కథానాయకుడు, మహానాయకుడు)గా రానుంది. విద్యాబాలన్, దగ్గుబాటి రానా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడు జనవరి 9, మహానాయకుడు జనవరి 24న విడుదల కానున్నాయి. -
ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు
-
నిదరే లేదే
ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన కల్యాణ్ రామ్ మూడో సినిమా కూడా రెడీ చేసే పనిలో పడ్డారు. దాని కోసం నిద్ర లేకుండా నైట్ అంతా పని చేస్తున్నారు. కెమెరామేన్ కె.వి.గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ఓ థ్రిల్లర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో షాలినీ పాండే, నివేథా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మొత్తం నైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో నివేథా తన పార్ట్ కంప్లీట్ చేశారట. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ నైట్ షెడ్యూల్ సాగనుందని సమాచారం. -
ఎన్టీఆర్ జయంతి కుటుంబసభ్యులు నివాళులు
-
ఎనిమిదేళ్ల తర్వాత..!
సాక్షి, సినిమా : సినీ ఇండస్ట్రీలో హిట్పెయిర్కు భలే క్రేజ్ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుందని అందుకే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారని అంటారు. ఒక వేళ సినిమా ఆడకపోతే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరలేదని విమర్శిస్తారు. హీరో రామ్, హీరోయిన్ కాజల్ తీసిన గణేశ్ సినిమా విజయం సాధించకపోయేసరికి వీరిరువురు కలిసి మరో సినిమా తీయలేదు. ఫ్లాప్ కాంబినేషన్ కావటంతో దర్శక నిర్మాతలు ఈ కాంబినేషన్‌ను రిపీట్ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఎనిమిదేళ్ల తర్వాత రామ్, కాజల్‌లు కలిసి నటించనున్నారు. గరుడవేగతో విజయం సాధించిన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వీరు హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభకానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్ర పూర్తి వివరాలను యూనిట్ సభ్యులు త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రవీణ్ సత్తార్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. చాలా గ్యాప్ తర్వాత తొలి అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్‌రామ్‌తో ఎమ్మెల్యేలో నటించిన కాజల్.. ఇప్పటికే సినిమా లుక్స్ అందరినీ ఆకట్టుకోగా, ఇప్పుడు మరో సినిమాలో ఎనిమిదేళ్ల తర్వాత రామ్ సరసన నటించనుంది. మరి ఈ సినిమాతోనైనా హిట్ జోడిగా పేరు తెచ్చుకుంటుందో చూడాలి. -
ఎంఎల్ఏ న్యూ వర్కింగ్ స్టిల్స్
-
లవ్.. లవ్.. లవ్...
ఇజం అంతగా సక్సెస్ కాకపోవటంతో కాస్త గ్యాప్ తీసుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వరుసపెట్టి ప్రాజెక్టులు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉపేంద్ర డైరెక్షన్లో కాజల్ హీరోయిన్గా చేస్తున్న ఎమ్మెల్యే కాగా, మరోకటి ‘180’ చిత్రం ఫేమ్ జయేంద్ర పంచపకేశన్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం. ఇక జయేంద్ర చిత్ర టీజర్‌ను ఫస్ట్ గ్లింప్స్ పేరిట నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ‘నా నువ్వే’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేశారు. రేడియో జాకీ మీరా పాత్రలో తమన్నాను.. ఆమె కోసం పరితపించే వరుణ్ అనే యువకుడి పాత్రలో కళ్యాణ్ రామ్‌ను చూపించారు. పుస్తకాల మధ్యలో కళ్యాణ్ రామ్‌ను కట్టేసి ఉన్న సీన్లు విచిత్రంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో వినిపించిన ప్రేమిక ట్యూన్ ఆకట్టుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి వర్క్ చేశారు. మొత్తానికి ఓ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థమౌతోంది. సమ్మర్లో నా నువ్వే విడుదల కానుంది. -
షూటింగ్లో గాయపడ్డ నందమూరి హీరో
టాలీవుడ్ హీరో, నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ షూటింగ్ లో గాయపడ్డారనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ జయేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మిస్తుండగా తమన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ వికారాబాద్‌లో జరుగుతోంది. అక్కడ రెండు రోజుల క్రితం కొన్ని యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నపుడు కల్యాణ్ రామ్ గాయపడ్డారట. ఈ విషయాన్ని మహేష్ కోనేరు తన ట్విట్టర్లో తెలిపారు. ' యాక్షన్ సీన్స్ జరుగుతున్నప్పుడు కల్యాణ్ గాయపడ్డారు. కానీ షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఆయన ఈరోజు (శుక్రవారం) సెట్స్‌కు వచ్చారు. ప్రొఫెషన్ పైన ఆయనకున్న డెడికేషన్ కి హాట్సాఫ్' అని ట్వీట్ చేశారు. కల్యాణ్ రామ్ మరోవైపు ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పొలిటికల్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ మూవీ విడుదలకి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. Yesterday in Vikarabad, hero @nandamurikalyan sustained injuries & bruised his arm during the shoot of an intense scene for our #NKR15 . He completed the scene without complaint,and is back on set today with pain medication. Hats off for your professionalism sir 🙏🏻 — Mahesh S Koneru (@smkoneru) December 8, 2017 -
తప్పు.. తప్పు.. మార్పుల్లేవ్
తప్పు.. తప్పు.. ‘జై లవకుశ’ విడుదల ఆలస్యమవుతోందని వచ్చిన వార్తలన్నీ తప్పే అంటోంది నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థ. ముందుగా ప్రకటించిన ప్లానులో మార్పుల్లేవ్ అని ప్రకటించింది. ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవకుశ’. ప్రస్తుతం పూణెలో చిత్రీకరణ జరుగుతోందట. అయితే... చిత్రీకరణ నెమ్మదిగా జరుగుతున్న కారణంగా సినిమా విడుదలను వాయిదా వేయాలనుకుంటున్నారని కొన్ని వార్తలొచ్చాయి. వీటిని నిర్మాణ సంస్థ ఖండించింది. ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 21నే సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు పాత్రల్లో ఒకటైన ‘జై’ లుక్, టీజర్ కొన్నాళ్ల క్రితమే విడుదల చేశారు. రీసెంట్గా రెండో క్యారెక్టర్ లవకుమార్ లుక్ విడుదల చేశారు. త్వరలో లవకుమార్ టీజర్ విడుదల చేయాలనుకుంటున్నారు. రాశీ ఖన్నా, నివేథా థామస్, నందిత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. -
కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభం
-
‘ఎంఎల్ఏ’ ఫస్ట్ లుక్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఎంఎల్ఏ(మంచి లక్షణాలున్న అబ్బాయ్) సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. మంగళవారం ఫస్ట్‌లుక్ ఫొటోను తన ట్విటర్లో పేజీలో కళ్యాణ్ రామ్ పోస్ట్ చేశారు. రేపు(జూలై 5) ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. స్టైలిష్ లుక్‌తో ఫ్యాన్స్‌కు నచ్చేలా ఇందులో కనిపించారు. ఈ సినిమాతో ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. బ్లూ ప్లానెట్ పతాకంపై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కామెడీ ఎంటర్టైన్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కు జోడిగా కాజల్ నటిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇజం’ సినిమాలో ఇంతకుముందు కళ్యాణ్ రామ్ నటించారు. -
వెయిట్ గురూ!
ఎన్టీఆర్ హీరోగా నటించనున్న 27వ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, ఎన్టీఆర్ ఇంకా సెట్లో అడుగుపెట్టలేదు. కారణం ఏంటో తెలుసుకోవా లని చాలామందికి ఉంది. ఈ నెల 15 నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొంటారనే సమాధానం వినిపించింది తప్ప.. లేటుగా సెట్లోకి ఎందుకు ఎంట్రీ ఇస్తున్నారనే విషయం మాత్రం బయటకు రాలేదు. అసలు మేటర్ ఏంటంటే... ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సుమారు 15 కిలోల బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారట. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. మూడు పాత్రల మధ్య వ్యత్యాసం చూపిస్తూ, స్లిమ్ అండ్ స్టైలిష్ గా కనిపించాలనుకుంటున్నారట! దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) అడగడంతో ఇప్పటికే ఎన్టీఆర్ 10 కిలోలు తగ్గినట్టు సమాచారం. వెయిట్ తగ్గిన తర్వాత ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే గురూ! ఈ నెల 15న హైదరాబాద్‌లో మొదలు కానున్న కొత్త షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్. మరో ఇద్దర్ని ఎంపిక చేయాలి. -
స్క్రిప్ట్ రెడీ.. సెట్స్‌కి వెళ్లడమే ఆలస్యం!
ఓ పక్క తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా నిర్మించబోయే సినిమా పనులతో బిజీగా ఉన్న నందమూరి కళ్యాణ్‌రామ్.. మరోపక్క తాను హీరోగా నటించనున్న సినిమా కోసం కథలు వింటున్నారు. ‘ఇజం’ తర్వాత పలు కథలు విన్నారాయన. వాటిలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన కథకి కల్యాణ్‌రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. స్క్రిప్ట్ కూడా లాక్ చేశారట. ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసే జానర్లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఈ నెల 10న ఎన్టీఆర్ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతాయట. 15న ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన తర్వాత పవన్ సాధినేనితో చేయనున్న సినిమా గురించి కల్యాణ్‌రామ్ ప్రకటిస్తారని భోగట్టా. -
అన్న నిర్మాత...తమ్ముడు హీరో
తమ్ముడు చిన్న ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా నిర్మించాలనే ఆలోచన అన్నయ్య నందమూరి కల్యాణ్‌రామ్‌కి ఎప్పట్నుంచో ఉంది. అన్నదమ్ముల సినిమా అంటే అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ బోలెడు అంచనాలు ఏర్పడతాయి. ఈ విషయం చిన్న ఎన్టీఆర్–కల్యాణ్‌రామ్‌లకు బాగా తెలుసు. అందుకే, అంచనాలను చేరుకునే కథ కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశారు. ఇప్పుడీ అన్నదమ్ములు ఇద్దరికీ నచ్చిన కథ సిద్ధమైంది. ‘జనతా గ్యారేజ్’ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కల్యాణ్‌రామ్ తమ్ముడితో తీయబోయే సినిమా వార్తను ప్రకటించారు. ‘పవర్’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాల ఫేమ్ కె.ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ‘మా సొంత నిర్మాణ సంస్థ యన్.టి.ఆర్. ఆర్ట్స్‌లో తమ్ముడు తారక్ హీరోగా చిత్రం నిర్మిస్తుండడం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్‌లో నటుడికి, స్టార్‌కి న్యాయం చేసే కథను బాబీ చెప్పారు. రానున్న సంక్రాంతి తర్వాత పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించి, నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుపుతాం. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని కల్యాణ్‌రామ్ తెలిపారు.కాగా, ఈ చిత్రంలో చిన్న ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తారని కృష్ణానగర్ ఖబర్. అయితే, ప్రచారంలో ఉన్నట్టు ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తారా, లేదా అన్నది కల్యాణ్‌రామ్ చెప్పలేదు. హీరోయిన్ సహా ఇతర వివరాలకు లెటజ్ వెయిట్ అండ్ సీ. -
‘ఇజం’ వెనుక ట్రెండీ నిజాలివి..!
నందమూరి నటవారసులలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మాస్ ఇమేజ్ ఉన్న హీరో కల్యాణ్ రామ్. దశాబ్దానికిపైగా సినిమాల్లో నటిస్తూ అడపాదపడా విజయాలు అందుకున్న కల్యాణ్‌రామ్.. ఇప్పటివరకు భారీ సూపర్‌హిట్‌ను మాత్రం అందుకోలేకపోయారు. ఈసారి మాత్రం ఆయన తన తాజాచిత్రం ’ఇజం’ ద్వారా సూపర్‌హిట్‌ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యాక్షన్ చిత్రం కోసం కల్యాణ్‌రామ్ ఎంతో కష్టపడ్డారు. సరికొత్త స్టైలిష్ లుక్‌తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా గురించి టెండ్రీ కబుర్లు ఇవి.. కల్యాణ్ రామ్ మేకోవర్! గత సినిమాలకు భిన్నంగా సరికొత్త రూపుతో ‘ఇజం’ సినిమాలో కల్యాణ్ రామ్ కనిపించారు. కొన్ని నెలలపాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరీ కసరత్తులు చేసి, కండలు పెంచి.. సరికొత్త మేకోవర్‌తో కనిపించారు. కండల తిరిగిన దేహంతో, సరికొత్త స్టైలిష్ లుక్‌తో కల్యాణ్‌రామ్ ’ఇజం’ ట్రైలర్లో అభిమానులను ఆకట్టుకున్నాడు. ట్రైలర్లో ఆయన కొత్త లుక్, ఎనర్జీ దుమ్మురేపింది. పూరి మ్యాజిక్! టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. మహేశ్ బాబుతో పోకిరి, బిజినెస్ మ్యాన్, జూనియర్ ఎన్టీఆర్‌తో టెంపర్, రవితేజతో ఇడియట్ వంటి భారీ కమర్షియల్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఘనత పూరిది. కమర్షియల్ సినిమాలు తీయడంతో పూరిని మించినోడు లేడంటే అతియోశక్తి కాదేమో. అలాంటి మ్యాజిక్‌ను ‘ఇజం’ సినిమాలోనూ పూరి రిపీట్ చేసి ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఆదితి ఆర్య 2015లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ ఎంపికైన అందాల భామ ఆదితి ఆర్యకు ఇది తొలి సినిమా. 2015 మిస్ వరల్డ్ అందాల పోటీలోనూ తను పాల్గొన్నది. కల్యాణ్ రామ్ సరసన టాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ భామ అందచందాల పరంగా ట్రైలర్లో ఆకట్టుకుంది. రంగస్థలం ప్రవేశం ఉండటంతో అభినయంలోనూ మంచి మార్కులు కొట్టేసినట్టు చెప్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ’ఇజం’ ట్రైలర్‌ను బట్టి ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉనట్టు తెలుస్తోంది. కారు, బైక్ వంటి ఛేజింగ్ సీన్లతోపాటు పలు యాక్షన్ సీన్లు, మార్షల్ ఆర్ట్స్ పోరాట సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. యాక్షన్ సినిమాలు తీయడంలో పూరి దిట్ట కావడంతో ‘ఇజం’లో ఆ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా యాక్షన్ సీన్లతోపాటు ఈ సినిమాలో సామాజిక సందేశం కూడా ఉందని ఇటీవల కల్యాణ్ రామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సోషల్ ఎలిమెంట్స్ ఉన్న కంప్లీట్ యాక్షన్ సినిమా అయిన ‘ఇజం’ ఈ శుక్రవారం ప్రేక్షకులను పలుకరించబోతున్నది. -
నేను ఆ ఇజమ్ను నమ్ముతా!
‘‘వ్యవస్థపై ఓ జర్నలిస్టు చేసిన పోరాటమే ఈ చిత్రకథ. ఎవ్వరికీ హితబోధ చేయట్లేదు. ఓ వ్యక్తి ఫిలాసఫీ, ఐడియాలజీలను చూపిస్తున్నామంతే. సినిమా చూసిన తర్వాత హీరో చేసినట్టు చేస్తే బాగుంటుందనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. మనకు చాలా ‘ఇజం’లున్నాయి. కానీ, మా ‘ఇజం’కు పేరు పెట్టలేదు. చూసిన ప్రేక్షకులే పెట్టాలి’’ అన్నారు నందమూరి కల్యాణ్‌రామ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించి, నిర్మించిన ‘ఇజం’ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ చెప్పిన విశేషాలు.. ‘పటాస్’ తర్వాత పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలనుకున్నా. అప్పుడాయన దగ్గర కథ లేదు. మళ్లీ కలవగా ‘ఇజం’ కథ చెప్పారు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించాను. వికీలీక్స్ అసాంజే తరహా సన్నివేశాలు సినిమాలో ఉంటాయి. బ్లాక్ మనీ, రాజకీయ నాయకులపై సెటైర్స్ ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను హ్యూమనిజమ్ను నమ్ముతాను. నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ ఇంత స్టైలిష్‌గా కనిపించలేదు. ‘ఇది కల్యాణ్‌రామ్ మొదటి సినిమానా?’ అనుకునేంతలా... యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, అన్నీ కొత్తగా ఉంటాయి. పూరి కూడా చాలా కొత్తగా తీశారు. ఫస్ట్ డే 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో సీన్ చేయాల్సి వచ్చింది. నేను కంగారుపడి.. షూటింగ్ వాయిదా వేద్దామంటే, ‘ఆర్ యూ కాన్ఫిడెంట్? ఆర్ నాట్?’ అని పూరి అడిగారు. ‘యస్..’ అన్నా. ‘అదే స్క్రీన్‌పై చూపించండి’ అన్నారు. ఇప్పటివరకూ నేను చేసిన సీన్స్‌లో బెస్ట్ సీన్ అది. కోర్టు సీన్ కూడా బాగుంటుంది. ఈ సినిమాకి మందు పూరి హిట్స్‌లో ఉన్నారా? ఫ్లాప్స్‌లో ఉన్నారా? అని ఆలోచించలేదు. ఇండస్ట్రీలో హీరో, దర్శకుడు.. ఎవ్వరికీ గ్యారెంటీ లేదు. ప్రతి సినిమా హిట్టవు తుందనే నమ్మకంతోనే చేస్తాం. ప్రేక్షకులు ఇచ్చే తీర్పును బట్టి తప్పులను సరి చేసుకోవడమే మా పని. బహుశా.. హీరోలందరిలో చివరగా సిక్స్‌ప్యాక్ చేసింది నేనే అనుకుంట (నవ్వుతూ..) అందుకని, నేను సిక్స్‌ప్యాక్ గురించి మాట్లాడితే బాగోదు. కథ చెప్పినప్పుడు... ‘హీరో మెంటల్‌గా స్ట్రాంగ్. ఫిజికల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉంటేనే క్యారెక్టర్ బాగుంటుంది. మీరు సన్నబడాలి’ అన్నారు పూరి. 86 కేజీలు ఉండేవాణ్ణి. బరువు తగ్గి 74 కేజీలకు వచ్చా. నాకు ఫిష్ ఇష్టం ఉండదు. కానీ, మూడు నెలలు సిక్స్‌ప్యాక్ కోసం అదే తిన్నాను. సిక్స్‌ప్యాక్ చేస్తున్నట్టు ముందు ఇంట్లోవాళ్లకు చెప్పలేదు. ఆ తర్వాత నాలో వస్తున్న మార్పు చూసి, ‘ఏంట్రా.. బుగ్గలు లోపలకి వెళ్తున్నాయి. నీరసంగా ఉంటున్నావ్’ అనేవారు. వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చలేదు. అందుకే, ఎన్టీఆర్ హీరోగా వంశీ దర్శకత్వంలో చేయాలనుకున్న సినిమా పక్కన పెట్టేశాం. సాయిధరమ్ తేజ్‌తో మల్టీస్టారర్ డిస్కషన్స్‌లో ఉంది. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. శ్రీమతిపై ప్రేమతో... నా శ్రీమతి పేరు స్వాతి. మా వివాహమై పదేళ్లయింది. ముఖ్యమైన సందర్భాలప్పుడు ఏదో బహుమతి ఇస్తూనే ఉంటా. నేనే ప్రపంచంగా బతుకుతున్న తనపై నా ప్రేమను వ్యక్తం చేయడానికి చేతిపై ఈ టాటూ వేయించుకున్నాను. ఈ టాటూ చూసిన ప్రతిసారి స్వాతి నా కళ్ల ముందు ఉన్నట్టుంటుంది. -
జర్నలిస్ట్ ఏం చేశాడు?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఇజం’. ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ -‘‘వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న చిత్రమిది. ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ, సోషల్ హ్యాకింగ్ గ్రూప్ ‘అనానిమస్’ వ్యవస్థల నేపథ్యంలో పూరి చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ఓ జర్నలిస్టుకి, ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ వ్యవస్థలకు సంబంధం ఏంటి? అతనేం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్ సిక్స్‌ప్యాక్ చేశారు. ఆయన లుక్, యాక్టింగ్ స్టైలిష్‌గా ఉంటాయి’’ అని పూరి అన్నారు.