Jr NTR As Chief Guest For Kalyan Ram Amigos Movie Pre Release Event, Deets Inside - Sakshi
Sakshi News home page

Kalyan Ram : 'బింబిసార' సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయనున్న కల్యాణ్‌ రామ్‌

Published Sat, Feb 4 2023 12:48 PM | Last Updated on Sat, Feb 4 2023 2:53 PM

Jr NTR As Chief Guest For Kalyan Ram Amigos Pre Release Event - Sakshi

కల్యాణ్‌ రామ్‌ నటించిన తాజా చిత్రం అమిగోస్‌. బింబిసార బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత కల్యాణ్‌ రామ్‌ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మాంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ త్రిబుల్‌ రోల్‌లో నటించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఫిబ్రవరి 5న నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బింబిసార ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు కూడా ఎన్టీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌ హాజరయ్యాడు. ఈ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయనున్నారు కల్యాణ్‌ రామ్‌. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement