Amigos Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్ రామ్ అమిగోస్,స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్ ఇటీవలె ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో రాజేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆషిక రంగనాథ్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కల్యాణ్‌రామ్ నటించిన సినిమా కావడంతో రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ బాగున్నా, కథ, ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. ఫలితంగా డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ అమిగోస్ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.నేడు(ఏప్రిల్1)నుంచే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లో మెప్పించలేకపోయిన అమిగోస్ ఓటీటీలో అలరిస్తుందేమో చూడాల్సి ఉంది. -
ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!
ప్రస్తుతం థియేట్రికల్ సినిమాల కంటే ఓటీటీల హవా ఎక్కువగా నడుస్తోంది. ప్రస్తుతం బిజీ లైఫ్‌లో థియేటర్లకు వెళ్లలేని వారు ఓటీటీల్లోనే నచ్చిన సినిమాలు చూసేస్తున్నారు. అయితే ఈ వారం ఓటీటీకి వచ్చేందుకు సినిమాలు అదేస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఓటీటీతో పాటు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్న సినిమాలేవో ఓ లుక్కేద్దాం. ఈ వారంలో రిలీజయ్యే చిత్రాల్లో జేమ్స్ కామెరూన్ సంచలనం అవతార్-2. అయితే ఈ చిత్రం రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులోకి వస్తోంది. టాలీవుడ్ చిత్రాలు అమిగోస్, శ్రీదేవి శోభన్ బాబు, సత్తిగాని రెండెకరాలు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. అలాగే బాలీవుడ్ నుంచి షెహజాదా, గ్యాస్ లైట్ కూడా ఈ వారంలోనే రిలీజ్ అవుతున్నాయి. తెలుగులో తెరకెక్కిన గోదారి అనే డాక్యుమెంటరీ ఈ వారమే విడుదల కానుంది. వీటితో ఈ వారంలో అలరించేందుకు వెబ్ సిరీస్‌లు కూడా క్యూ కట్టాయి. నెట్ ఫ్లిక్స్: మై లిటిల్ పోనీ- టెల్ యువర్ టేల్- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 27 ఎమర్జెన్సీ- ఎన్వైసీ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 29 అన్ సీన్ -(ఇంగ్లీష్ ) – మార్చి 29 ఫ్రమ్ మీ టూ యూ- కిమీ నీ తోడోకే (కొరియన్ సిరీస్) – మార్చి 30 ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబత్ -(హిందీ) – మార్చి 31 కాపీక్యాట్ కిల్లర్- (మాండరిన్ సిరీస్) – మార్చి 31 కిల్ బోక్సూన్ -(కొరియన్ ) – మార్చి 31 మర్డర్ మిస్టరీ 2-(ఇంగ్లీష్ ) – మార్చి 31 అమిగోస్ -(తెలుగు) – ఏప్రిల్ 1 కంపెనీ ఆఫ్ హీరోస్ - (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1 జార్ హెడ్ 3 - ద సీజ్ (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1 షెహజాదా -(హిందీ ) – ఏప్రిల్ 1 స్పిరిట్ అన్ టేమ్డ్- (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1 వార్ సెయిలర్- (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 2 ఆహా: గోదారి- (తెలుగు డాక్యుమెంటరీ) – మార్చి 31 సత్తిగాని రెండెకరాలు- (తెలుగు సినిమా) – ఏప్రిల్ 1 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అవతార్ 2 (రెంట్ విధానంలో) – మార్చి 28 శ్రీదేవి శోభన్ బాబు (తెలుగు) – మార్చి 30 డాగీ కమిలోహా ఎండీ సీజన్ 2 (ఇంగ్లీష్ ) – మార్చి 31 గ్యాస్ లైట్ (హిందీ) – మార్చి 31 ఆల్ దట్ బ్రీత్స్ (హిందీ) – మార్చి 31 జీ5 అగిలన్ -(తమిళం) – మార్చి 31 అయోతి- (తమిళం) – మార్చి 31 యునైటెడ్ కచ్చే-(హిందీ) – మార్చి 31 యాపిల్ టీవీ ప్లస్ టెట్రిస్ (ఇంగ్లీష్ ) – మార్చి 31 బుక్ మై షో మమ్మీస్ (ఇంగ్లీష్) – మార్చి 27 సన్ నెక్స్ట్ భగీరా (తమిళం) – మార్చి 31 ముబీ ప్లీజ్ బేబీ ప్లీజ్ (ఇంగ్లీష్) – మార్చి 31 ఎమ్ఎక్స్ ప్లేయర్ ఇండియన్ సమ్మర్స్ (హిందీ) – మార్చి 27 -
Ashika Ranganath Latest Photos: హాట్ ఫోజులతో కవ్విస్తున్న అమిగోస్ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఫొటోలు
-
ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న అమిగోస్? ఎప్పుడు.. ఎక్కడంటే!
‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 10న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్ర స్పందన అందుకుంది. ‘డోప్ల్ గ్యాంగర్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా చూసి కొందరు బాగుందంటే మరికొందరు అసలు కథ స్ట్రాంగ్‌లో లేదని అభిప్రాయం పడ్డారు. ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీసు బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మూవీ డిజిటిల్ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. సాధారణంగా ఏ చిత్రమైన, ముఖ్యం స్టార్ హీరోల సినిమాలు థియేట్రికల్ రన్ అనంతరం ఓటీటీకి వస్తుంది. కానీ అమిగోస్ మాత్రం విడుదలైన నెల రోజులకే ఓటీటీకి రానుందని సమాచారం. డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చదవండి: నచ్చిన వ్యక్తితోనే నా పెళ్లి.. లావణ్య ఆసక్తికర వ్యాఖ్యలు Telugu film #Amigos is expected to premiere on Netflix India on March 10th. Also in Tam, Kan, Mal. pic.twitter.com/zQ8WPQgkmZ — Streaming Updates (@OTTSandeep) March 3, 2023 -
‘అమిగోస్’ వచ్చేది ఆ ఓటీటీలోకే.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఫిబ్రవరి 10) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. సినిమా విడుదలైన రోజే ఓటీటీ హక్కులు కొనుగోలు చేసిన సంస్థపై క్లారిటీ వచ్చేసింది. (చదవండి: అమిగోస్ మూవీ రివ్యూ) ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ప్రస్తుతానికి నిర్మాతలతో ఉన్న ఒప్పందం మేరకు 8 వారాల తర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలి. కానీ సినిమాకు వచ్చిన స్పందనను బట్టి.. 8 వారాల కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ ప్లే చేశాడు. వాటిలో ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉండగా మరొక రెండు పాత్రలు మరో రెండు భిన్నమైన కోణాల్లో సాగుతాయి. -
‘అమిగోస్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
తారకరత్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించింది. నేడు(శుక్రవారం)ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొన్న కల్యాణ్ రామ్‌కు తారకరత్న హెల్త్‌పై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రస్తుతం తారకరత్న కోలుకుంటున్నాడు. అతనికి మెరుగైన వైద్యం అందుతుంది. అయితే ఇప్పుడు కండీషన్ ఎలా ఉందన్నది డాక్టర్లు మాత్రమే చెప్పగలరు. ఆ విషయాలు హాస్పిటల్ వర్గాలు చెబితేనే బాగుంటుంది. మేం అందరం తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అతనికి మీ అందరి ఆశిస్సులతో తను పూర్తిగా రికవర్ అవుతాడని భావిస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. కాగా గత కొన్నిరోజులుగా తారకరత్న హెల్త్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు తారకరత్న పరిస్థితి ఇప్పడెలా ఉందన్నది అటు కుటుంబసభ్యులు కానీ, ఆసుపత్రి వర్గాలు కానీ వెల్లడించలేదు. -
Amigos Movie Review: ‘అమిగోస్’మూవీ రివ్యూ
టైటిల్: అమిగోస్ నటీనటులు: కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ తదితరులు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ: ఎస్. సౌందర్ రాజన్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: ఫిబ్రవరి 10, 2023 బింబిసార చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు కల్యాణ్ రామ్. గతేడాదిలో విడుదలైన ఈ మూవీ కల్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘అమిగోస్’ అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘అమిగోస్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘అమిగోస్’ కథేంటంటే.. సిద్ధార్థ్(కల్యాణ్ రామ్).. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త. ఆర్జేగా పనిచేసే ఇషిక(ఆషికా రంగనాథ్)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఓ వెబ్సైట్ ద్వారా తనలాంటి పోలికలు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కలుస్తాడు. వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ మంజునాథ్(కల్యాణ్ రామ్) అయితే.. మరోకరు బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్(కల్యాణ్ రామ్). ఈ ముగ్గురు గోవాలో కలుసుకొని బాగా క్లోజ్ అవుతారు. వీరు కలవడం కంటే ముందే బిపిన్ రాయ్ హైదరాబాద్‌లో ఎన్ఐఏ అధికారిని దారుణంగా హత్య చేస్తాడు. ఆ మర్డర్ కేసు నుంచి తప్పించుకోవడానికే సిద్దార్థ్‌కి మైఖేల్‌గా పరిచయం చేసుకుంటాడు. ఆ కేసులో తనకు బదులుగా సిద్దార్థ్‌ని అరెస్ట్ చేయించడమే అతని ప్లాన్. మరి అది వర్కౌట్ అయిందా? ఎన్ఐఏ అధికారులు ఎవరిని అరెస్ట్ చేశారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? బిపిన్ రాయ్ వేసిన అసలు ప్లాన్ ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. బింబిసార లాంటి సూపర్ హిట్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన చిత్రం కావడం.. పైగా కెరీర్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ‘అమిగోస్’పై ముందు నుంచే భారీ అంచనాలు పెరిగాయి. టైటిల్ మాదిరే ఈ కాన్సెప్ట్ కూడా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. కానీ కథనం ఆకట్టుకునేలా సాగలేదు. ఈ చిత్రంలో ఒకే రూపంతో ముగ్గురు మనుషులు ఉంటారని.. వారిలో ఒకరు విలన్ అని, తన అవసరం కోసం మిగతా ఇద్దరిని వాడుకుంటాడని ట్రైలర్లోనే చూపించారు. విలన్ కోసం ఎన్ఏఐ అధికారులు వెతకడం కూడా అందులో చూపించారు. అయితే ఎందుకు వెతుకుతున్నారు? వాళ్లు ఎలా కలిశారనేదే మిగతా కథ. ఆ కథను ఆసక్తికరంగా నడిపించే విషయంలో దర్శకుడు నిరాశపరిచాడు. కథనాన్ని చాలా చప్పగా..రొటీన్‌గా నడిపించాడు. సినిమా మొత్తంలో క్యూరియాసిటీ పెంచే సీన్స్ ఒక్కటంటే ఒక్కటి ఉండదు. పైగా రొటీన్ లవ్‌స్టోరీ ప్రేక్షకులను విసిగిస్తుంది. పస్టాఫ్‌లో పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఎలాంటి ట్విస్టులు, వావ్ మూమెంట్స్ లేకుండా చాలా రొటీన్‌గా ఫస్టాఫ్ సాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ అక్కడ కూడా కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతాయి. దర్శకుడు కొత్త కాన్సెప్ట్నే ఎంచుకున్నాడు కానీ.. అంతే కొత్తగా, ఆసక్తికరంగా తెరపై చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. సిద్దార్ధ్ అనే బిజినెస్ మెన్‌గా.. మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, మైఖేల్ అనే గ్యాంగ్ స్టర్‌గా.. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన కల్యాణ్ రామ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. రెండు, మూడు నిమిషాలు మినహా తెరపై మొత్తం కల్యాణ్ రామే కనిపిస్తాడు. మిగతా రెండు పాత్రలతో పోలిస్తే.. నెగెటివ్ షేడ్స్ ఉన్న మైఖేల్ పాత్రలో కల్యాణ్ నటన చాలా బాగుంటుంది. ఇక హీరోయిన్ రిషిక పాత్ర నిడివి చాలా తక్కువ. అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించిది. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ‘ఎన్నోరాత్రులు వస్తాయి కానీ..’ పాట రీమేక్ బాగా సెట్ అయింది. ఎస్. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Amigos Twitter Review: ‘అమిగోస్’ మూవీ ట్విటర్ రివ్యూ
బింబిసార లాంటి సూపర్ హిట్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల అమిగోస్ ఫస్ట్ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ట్విటర్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.‘అమిగోస్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు అవేంటో చూసేయండి. #Amigos A Subpar Drama/Thriller that had an interesting concept with substandard execution! The movie had a unique concept and a few moments/twists that were executed well. However, the overall narration is sluggish and does not excite for the most part. Rating: 2.25-2.5/5 — Venky Reviews (@venkyreviews) February 10, 2023 ట్విటర్లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. సినిమా బాగుందని కొందరు చెబుతుంటే..అంతగా ఆకట్టుకునే చిత్రం కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘అమిగోస్’ మూవీ కాన్సెప్ట్ బాగుంది. కానీ కథనం నాసిరకంగా ఉంది. కొన్ని ట్విస్టులు అదిరిపోయాయి. కానీ కథనం మాత్రం స్లోగా సాగుతుంది’అంటూ 2.25-2.5 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. #Amigos 1st half: characters building sequences👍🏻, interval 👍🏻 Average 1st half 2nd half: Good Racy screenplay in parts👍🏻,Action scenes,Climax👍🏻 Good 2nd half Overall: Good👍🏻 3/5@NANDAMURIKALYAN Hit streak continues👍🏻🔥#AmigosOnFeb10th #Amigosreview #kalyanRam — tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) February 10, 2023 ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే స్పీడ్‌గా సాగుతుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా అమిగోస్ సినిమా బాగుంది అంటూ 3 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్ Just watched #Amigos and it's a feel-good film with laughter, friendship, and heartwarming moments! The cast is fantastic and their chemistry shines on screen. Highly recommend for a movie night with your own amigos 🎥🍿#AmigosReview #MovieReview #FriendshipGoals #eshwarweb pic.twitter.com/5jhpPvtLPk — Eshwar Web (@EshwarWeb) February 10, 2023 ఇప్పుడే సినిమా చూశాను. కామెడీతో పాటు ఫ్రెండ్షిప్ గొప్పదనాన్ని తెలియజేశాఉ. కొన్ని సీన్స్ హృదయలను హత్తుకుంటాయి. నటీనటుల ఎంపిక బాగుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మీ స్నేహితులతో కలిసి చూసే సినిమా ఇది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Amigosreview First half is a passable love story with not much intrigue.Twists unravel in the second half making the movie a decent one-time watch.But can't vouch for excitement that audience expect from it.Triple roles,drama so unrealistic.#AmigosOnFeb10th #KalyanRam #JrNTR pic.twitter.com/38Vse4brud — KLAPBOARD (@klapboardpost) February 10, 2023 #Amigos 1st half review: ⭐️kalyan ram characterization. ⭐️3 characters builded nicely. 👎🏼songs and bgm could have been better 👎🏼 production values are not good by mythri for the first time because of camera work. Looks like outdated camera. Totally on 2ndhalf.#AmigosOnFeb10th pic.twitter.com/ReJ1ZzE1wy — ReviewMama (@ReviewMamago) February 10, 2023 #AmigosReview Movie was FreshLook To Audience moreover Story Lineup is More content Ultra Mass Eliments added BGM Looks Pleasent Songs Mixed Melody Pure Family Action Drama Sequence Overall Rating :-4/5 ⭐⭐⭐⭐@tarak9999 @NANDAMURIKALYAN @NtrMurali9999 #ManOfMassesNTR — ReNaa (@Piger175) February 10, 2023 #Amigosreview Kalyan Ram 2.0 Malli kottesadu ra Kalyan Ram Super Hit🔥 Back to Back @RajendraReddy_ Gari direction 👌@NANDAMURIKALYAN Acting🔥 — PavantaRRRakⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@PavanTarakroyal) February 10, 2023 Decent first half 👌@NANDAMURIKALYAN Played fantastic in Triple Role 🔥🔥🔥#Amigosreview — Deva (@DevaNtrfan) February 10, 2023 Overall, #Amigos is an entertaining film with an interesting concept of doppelgängers, good performances and impressive technical elements. This is likely to be a second successive HIT for #KalyanRam after #Bimbisara.#AmigosReview — Cinemania (@CinemaniaIndia) February 9, 2023 -
అమిగోస్’లో 2.17 గంటలు నేనే కనిపిస్తా: కల్యాణ్ రామ్
‘బింబిసార’ చిత్రానికి ముందే ‘అమిగోస్’ కథ విన్నాను. రాజేంద్రగారు స్టోరీ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పాను. ఒకే పోలికలతో ఉండే ముగ్గురు వ్యక్తులు ఎలా కలిశారు? వాళ్ల లక్ష్యం ఏంటి? వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుంది’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ పంచుకున్న విశేషాలు. ►‘బింబిసార’ హిట్ తర్వాత నేను కథలు ఎంచుకునే విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. ముందు ఎలా ఉన్నానో తర్వాత కూడా అలానే ఉన్నాను. ఎందుకంటే ‘బింబిసార’, ‘అమిగోస్’, ‘డెవిల్’ సినిమాల కథలను 2020లోనే ఓకే చేశాను. ‘బింబిసార’ హిట్ తర్వాత కొత్తగా ఏ కథనీ ఎంచుకోలేదు. అయితే ఆ సినిమా విజయం నా బాధ్యతని పెంచింది. అంతకంటే ఇంకా పెద్ద విజయాన్ని నా నుంచి ఆశిస్తారు. అందుకే మంచి కాన్సెప్ట్, స్టోరీ ఉన్నవి ఒప్పుకోవాలి. లక్కీగా నాకు అన్నీ అలాంటి మంచి కథలు వస్తున్నాయి. ► ‘అమిగోస్’ చిత్రంలో నేను త్రిపాత్రాభినయం చేశాను. సిద్ధార్థ్ చాలా చురుకుగా ఉంటాడు. మంజునాథ్ది చాలా సైలెంట్ అండ్ సాఫ్ట్ క్యారెక్టర్. మైఖేల్ పాత్ర గ్యాంగ్‌స్టర్‌ని పోలిన విలన్లా ఉంటుంది. విలన్లా నటించడం చాలా కొత్తగా అనిపించింది. ట్రిపుల్ రోల్ చిత్రంలో కనీసం ఇద్దరు కథానాయికలైనా ఉంటారు. కానీ ఇది రెగ్యులర్ సినిమాలకు పూర్తి విభిన్నమైనది కావడంతో ఒక హీరోయిన్ మాత్రమే ఉంటుంది. పైగా ఈ మూవీలో విలన్ ఉండకపోవడం ఓ విశేషం. ► మనిషిని పోలిన మనుషులను ‘డాపుల్ గాంగర్’ అంటారని రాజేంద్రగారు చెప్పారు. ఈ సినిమాకి ‘అమిగోస్’ టైటిల్ అనుకున్నప్పుడు అందరికీ అర్థం అవుతుందా? అన్నాను. అమిగో అనే పదం సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య బాగా వాడుతున్నారని చెప్పడంతో ఫిక్స్ చేశాం. సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టామో అర్థం అవుతుంది. ఈ మధ్య సూపర్ హిట్ అయిన ‘కాంతారా’ టైటిల్ అర్థం నాకు తెలీదు. దాని గురించి వెతికితే ‘వైల్డ్ ఫారెస్ట్’ అని అర్థం అయింది. ► కోవిడ్ సమయంలో నన్ను నేను బాగా తెలుసుకున్నాను. నేను చేసిన కొన్ని సినిమాలు పరాజయం కావడానికి కారణం ఏంటి? నేను చేసిన తప్పులు ఏంటి? అని తెలుసుకున్నాను. ‘అమిగోస్’ సినిమా 2 గంటల 19 నిమిషాలు ఉంటే.. అందులో రెండు గంటల పదిహేడు నిమిషాలు కల్యాణ్ రామ్‌నే చూస్తారు.. సినిమాలో జస్ట్ రెండు నిమిషాలు మాత్రమే కనబడను. ఆ పాత్రకి అంత ప్రాధాన్యం ఉంటుంది. ► ప్రస్తుతం నేను నటిస్తున్న ‘డెవిల్’ మూవీ చిత్రీకరణ మే నెలలో పూర్తవుతుంది. ‘బింబిసార 2’ షూటింగ్‌ని ఈ ఏడాది ఆఖరులో ప్రారంభిస్తాం. ► తారకరత్న ఆరోగ్యం ఎలా ఉందో నేను చెబితే బాగుండదు. వైద్యం అందిస్తున్న ఆస్పత్రి వర్గాలు చెబితేనే బాగుంటుంది. -
ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..!
జనవరిలో సంక్రాంతి సినిమాల సందడి ముగిసిపోయింది. పెద్ద హీరోల చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఫిబ్రవరిలోనూ సినీ ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధమైపోయాయి. ఈ వారంలో కల్యాణ్ రామ్ అమిగోస్ విడుదలవుతోంది. అలాగే ఈ వారంలో థియేటర్లతో పాటు ఓటీటీకి వచ్చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. కల్యాణ్‌రామ్ అమిగోస్ నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'అమిగోస్'. బింబిసార తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 10న రిలీజ్ చేయనున్నారు. కన్నడ మూవీ వేద కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ 125వ చిత్రం వేద. అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్లో ఇది మొదటి వెంచర్‌గా నిర్మితమైంది. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్ కానుంది. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. పాప్‌కార్న్ ఆవికా గోర్, సాయి రోనక్ జంటగా నటించిన చిత్రం పాప్ కార్న్. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించగా.. భోగేంద్రగుప్త నిర్మించారు. మురళీగంధం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఐపీఎల్: ఇట్స్ ప్యూర్ లవ్ విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఐపీఎల్. సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. బీరం శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతోంది. దేశం కోసం భగత్ సింగ్ రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్, జీవా, సుధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం దేశం కోసం భగత్ సింగ్. ఈ సినిమాకు రవీంద్ర గోపాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 10న థియేటరల్లో సందడి చేయనుంది. చెడ్డి గ్యాంగ్ తమాషా సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మించారు. ఈ వారం ఓటీటీ చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ తునివు/తెగింపు- ఫిబ్రవరి 8, 2023 డిస్నీ+హాట్‌స్టార్ రాజయోగం- ఫిబ్రవరి 09, 2023 అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్‌సిరీస్: ఫర్జీ- ఫిబ్రవరి 10, 2023 ఆహా కళ్యాణం కమనీయం- ఫిబ్రవరి 10, 2023 ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు నెట్‌ఫ్లిక్స్ బిల్ రస్సెల్: లెజెండ్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 8 ద ఎక్స్ఛేంజ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 8 యు (వెబ్‌సిరీస్-4) ఫిబ్రవరి 9 డియర్ డేవిడ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 9 యువర్ ప్లేస్ ఆర్ మైన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 10 టెన్ డేస్ ఆఫ్ ఎ గుడ్మాన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 10 డిస్నీ+హాట్‌స్టార్ నాట్ డెడ్ ఎట్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 09 హన్నికాస్ లవ్ షాదీ డ్రామా (రియాల్టీ షో) ఫిబ్రవరి 10 సోనీలివ్ నిజం విత్ స్మిత (టాక్ షో) ఫిబ్రవరి 10 -
యాంకర్ సుమపై సీరియస్ అయిన ఎన్టీఆర్!... నెట్టింట వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరాటాల శివ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టలేదు. ఎన్టీఆర్30 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో వేదికపైనే ఎన్టీఆర్ 30 అప్డేట్స్ ఇవ్వాలంటూ యాంకర్ సుమ ఎన్టీఆర్‌ను డైరెక్టుగా అడిగేయడంతో ఎన్టీఆర్ ఎందుకో గానీ కాస్త సీరియస్ అయినట్లు కనిపించారు. 'అభిమానులు అడగకపోయినా మీరు చెప్పించేసేలాగా ఉన్నారే'.. అంటూ సుమకు కౌంటర్ వేశాడు. అనంతరం ఫ్యాన్స్‌కి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. "నాకు ఒంట్లో బాగోలేకపోయినా .. మీ అందరినీ చూడాలనే ఉద్దేశంతో వచ్చాను. బాడీ పెయిన్స్ వలన ఎక్కువ సేపు నిలబడలేను కూడా .. ప్లీజ్ అర్థం చేసుకోండి. అప్డేట్, అప్డేట్ అని ఇబ్బంది పెట్టకండి. ప్రతి రోజూ, ప్రతి గంటా అప్డేట్స్ ఇవ్వాలంటే చాలా కష్టం. అభిమానుల ఉత్సాహం, ఆరాటంతో డైరెక్టర్లు, నిర్మాతలపై ప్రెజర్ పెరిగిపోతోంది. దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోండి. ఒకవేళ అప్డేట్ ఉంటే ఇంట్లో మా భార్య కంటే ముందే మీకు విషయం చెబుతాం'' అంటూ తారక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
షూటింగ్ సమయంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమిగోస్ డైరెక్టర్
‘‘నవీన్, రవిశంకర్‌గార్లు నిర్మించిన రెండు చిత్రాలు(వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి) ఈ సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్స్ అయ్యాయి. అంత సుడి ఉన్న నిర్మాతలు తీసిన ‘అమిగోస్’ కూడా బ్లాక్ బస్టర్ అయి హ్యాట్రిక్ సాధించాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ జంటగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్ చదివిన రాజేంద్రగారు వారి తల్లిదండ్రులు వద్దంటున్నా ఇండస్ట్రీకి వచ్చారు. ‘అమిగోస్’ మొదలయ్యేలోపు వారి అమ్మగారు కాలం చేస్తే, లాస్ట్ షెడ్యూల్ సమయంలో నాన్నగారు కూడా చనిపోయారు. రాజేంద్రగారి తల్లితండ్రులు భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆయన సాధించిన ఈ మొదటి మెట్టు విజయాన్ని వారు చూశారు. ‘జై లవ కుశ’లో నేను మూడు పాత్రలు చేశా. మూడు విభిన్న పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘అమిగోస్’ లో కల్యాణ్ అన్న మూడు పాత్రల్లో ఎంతో అద్భుతంగా నటించారు’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచన ఉన్న నాకు ‘అమిగోస్’ పర్ఫెక్ట్ మూవీ. 18 ఏళ్ల పాటు నన్ను ఆదరిస్తూ, భరిస్తూ వచ్చిన మీకు (ప్రేక్షకులు, అభిమానులు) చాలా థ్యాంక్స్. ఈ సినిమా చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడరు’’ అన్నారు. ‘‘నన్ను, ‘అమిగోస్’ స్క్రిప్ట్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన కల్యాణ్‌రామ్‌గారికి, నిర్మాతలు రవి, నవీన్ గార్లకు రుణపడి ఉంటాను’’ అన్నారు రాజేంద్ర రెడ్డి. ‘‘అమిగోస్’ని హిట్ చేసి, మాకు హాట్రిక్ (‘వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి’) విజయాలను అందించాలి’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘బింబిసార’ తర్వాత కల్యాణ్‌గారి నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఈ చిత్రంలో చూస్తారు’’ అన్నారు వై.రవిశంకర్. ఈ వేడుకలో డైరెక్టర్ బుచ్చిబాబు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కొరటాల శివగారు, నా కాంబినేషన్లో సినిమా ఈ నెలలో ప్రారంభించి, మార్చిలో షూటింగ్ మొదలుపెడతాం. 2024 ఏప్రిల్ 5న ఆ సినిమాని విడుదల చేస్తాం. – ఎన్టీఆర్ -
కల్యాణ్ రామ్ ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ (ఫోటోలు)
-
'బింబిసార' సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయనున్న కల్యాణ్ రామ్
కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్లో నటించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్రవరి 5న నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ హాజరయ్యాడు. ఈ సినిమా సూపర్‌హిట్ కావడంతో ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయనున్నారు కల్యాణ్ రామ్. 3 letters which will take the tale of 3 doppelgangers to the next level - N T R 🔥#Amigos Pre Release Event with @tarak9999 as the chief guest 💥 On 5th Feb at HYD💥 - https://t.co/T63ceTMvmD#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @shreyasgroup pic.twitter.com/szVI9VT10P — Mythri Movie Makers (@MythriOfficial) February 4, 2023 -
'మనిషిని పోలిన మనుషులు ఎదురుపడితే'.. అమిగోస్ ట్రైలర్ అవుట్
నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'అమిగోస్'. బింబిసార తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే డోపుల్ గ్యాంగర్ అంటే మనిషి పోలిన మనుషులు కాన్సెప్ట్‌తోనే సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో యాక్షన్ సీన్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ట్రైలర్ చూస్తే సినిమాతో సరికొత్త థ్రిల్ పొందడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. -
కల్యాణ్ రామ్ అమిగోస్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
బింబిసార సూపర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం ద్వారా మీరు సరికొత్త థ్రిల్ పొందుతారని పోస్ట్ చేశారు. కాగా..ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. Super confident that you will feel and love the thrills 💥#AmigosTrailer on Feb 3rd.#Amigos in cinemas from Feb 10th.@AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial @MythriOfficial @SaregamaSouth pic.twitter.com/8GIktXDenV — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) February 1, 2023 -
కల్యాణ్ రామ్ అమిగోస్ నుంచి సెకండ్ సింగిల్, బాలయ్య హిట్ సాంగ్‌కు రీమిక్స్
బింబిసార సూపర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, పాటలు సినిమాపై మాంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మా’ పాటలను రిలీజ్ చేశారు మేకర్స్. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్‌కు ఇది రీమిక్స్. గతంలో బాలయ్య నటించిన 'ధర్మక్షేత్రం' సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను దివంగత లెజెండరి సింగర్ బాలు - చిత్ర ఆలపించారు. అదే పాటలను అమిగోస్లో రిమేక్ చేయించాడు కల్యాణ్ రామ్. గిబ్రాన్ సింగీతం అందించిన ఈ పాటను ఎస్పీ చరణ్-సమీరా భరద్వాజ్‌లు ఆలపించారు. కాగా ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. Evergreen Romantic Melody is here❤️#EnnoRatrulosthayi Full Video Song from #Amigos out now 🕺💃 - https://t.co/foMaW1GPNB#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial #SriVeturi #SpbCharan #SameeraBharadwaj @adityamusic pic.twitter.com/ouc4OQHVmI — Mythri Movie Makers (@MythriOfficial) January 31, 2023 -
నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ బ్యూటీ ఆషికా రంగనాథ్ (ఫొటోలు)
-
అలాంటి సినిమాల్లో నటించాలనేది నా కల: ఆషికా రంగనాథ్
‘‘తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగులో నటించాలని కొన్నేళ్లుగా అనుకుంటున్నాను. గతంలో కొన్ని కథలు నచ్చకపోవడం, మరికొన్ని నా డేట్స్ కుదరక చేయలేదు. కానీ ‘అమిగోస్’ కథ వినగానే నచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద ప్రొడక్షన్లో నా తొలి చిత్రం చేయడం నా అదృష్టం. ‘అమిగోస్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని ఆషికా రంగనాథ్ అన్నారు. ‘‘బింబిసార’ వంటి హిట్ చిత్రం తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అమిగోస్’లో నేను రేడియో జాకీ పాత్ర చేశాను. నేటితరం అమ్మాయిలకు నా పాత్ర బాగా నచ్చుతుంది. స్క్రీన్‌పై నా పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. ఇక తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్‌గార్ల డ్యాన్స్ అంటే ఇష్టం. రాజమౌళిగారు తీసిన ‘బాహుబలి’ లాంటి సినిమాలో నటించాలనేది నా కల. ప్రస్తుతం కన్నడ, తమిళంలో కొన్ని సినిమాలు చేస్తున్నాను. తెలుగులో కొన్ని కథలు చర్చల్లో ఉన్నాయి’’ అన్నారు.