Nandamuri Kalyan Ram's Amigos OTT Release Date and Platform - Sakshi
Sakshi News home page

Amigos OTT Release Date: ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న అమిగోస్‌? ఎప్పుడు.. ఎక్కడంటే!

Published Sat, Mar 4 2023 11:29 AM | Last Updated on Sat, Mar 4 2023 12:07 PM

OTT: Is Kalyanram Amigos Movie to Stream On Netflix From March 10th - Sakshi

‘బింబిసార’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత నందమూరి కల్యాణ్‌ రామ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ అమిగోస్‌. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 10న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్ర స్పందన అందుకుంది.  ‘డోప్ల్ గ్యాంగర్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌ వచ్చిన ఈ సినిమా చూసి కొందరు బాగుందంటే మరికొందరు అసలు కథ స్ట్రాంగ్‌లో లేదని అభిప్రాయం పడ్డారు. ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీసు బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మూవీ డిజిటిల్‌ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌..

సాధారణంగా ఏ చిత్రమైన, ముఖ్యం స్టార్‌ హీరోల సినిమాలు థియేట్రికల్‌ రన్‌ అనంతరం ఓటీటీకి వస్తుంది. కానీ అమిగోస్‌ మాత్రం విడుదలైన నెల రోజులకే ఓటీటీకి రానుందని సమాచారం. డిజిటల్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తోందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ సరసన ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

చదవండి: నచ్చిన వ్యక్తితోనే నా పెళ్లి.. లావణ్య ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement