Kalyan Ram Latest Movie Amigos Trailer Release Date Confirmed, Deets Insdie - Sakshi
Sakshi News home page

ఈ సినిమాతో సరికొత్త థ్రిల్ ఖాయం: కల్యాణ్ రామ్‌

Published Wed, Feb 1 2023 7:18 PM | Last Updated on Wed, Feb 1 2023 8:14 PM

Kalyan Ram Latest Movie Amigos Trailer Release On 3rd February - Sakshi

బింబిసార సూపర్‌ హిట్‌ తర్వాత నందమూరి కల్యాణ్‌ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. 

ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం ద్వారా మీరు సరికొత్త థ్రిల్ పొందుతారని పోస్ట్ చేశారు. కాగా..ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement