Watch: Kalyanram Amigos Movie Enno Ratrulosthayi Video Song Released, Goes Viral - Sakshi
Sakshi News home page

Kalyan Ram Amigos Songs: అమిగోస్‌ నుంచి సెకండ్‌ సింగిల్‌, బాలయ్య హిట్‌ సాంగ్‌కు రీమిక్స్‌ అవుట్‌

Published Tue, Jan 31 2023 6:45 PM | Last Updated on Tue, Jan 31 2023 7:42 PM

Yenno Ratrulu Vasyayigani Song Release From Kalyanram Amigos Movie - Sakshi

బింబిసార సూపర్‌ హిట్‌ తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌, టీజర్, పాటలు సినిమాపై మాంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి.

తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మా’ పాటలను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. నందమూరి బాలకృష్ణ సూపర్‌ హిట్‌ సాంగ్‌కు ఇది రీమిక్స్‌.  గతంలో బాలయ్య నటించిన 'ధర్మక్షేత్రం' సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను దివంగత లెజెండరి సింగర్‌ బాలు - చిత్ర ఆలపించారు.  అదే పాటలను అమిగోస్‌లో రిమేక్‌ చేయించాడు కల్యాణ్‌ రామ్‌. గిబ్రాన్‌ సింగీతం అందించిన ఈ పాటను ఎస్పీ చరణ్‌-సమీరా భరద్వాజ్‌లు ఆలపించారు. ​కాగా ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement